51-0930A క్రీస్తును గూర్చి మీరేమనుకొనుచున్నారు

51-0930Aక్రీస్తును గూర్చి మీరేమనుకొనుచున్నారు?
న్యూయార్క్, అమెరికా

1.క్రీస్తును గూర్చి మీరేమనుకొనుచున్నారు, మరియు ఆయన ఎవని కుమారుడు? ఇది చాలా కాలము నుండి అడగబడుచున్న ఒక పాతకాలపు ప్రశ్న. సంవత్సరముల వెంబడి సంవత్సరములు, ఇదే ప్రశ్న తలెత్తుచున్నది. క్రీస్తును గూర్చి మీరేమనుకొనుచున్నారు, ఆయన ఎవని కుమారుడు? ఆయన ఎవరు, ఆయన ఏమైయున్నాడు అనే దానిని గూర్చి కాలములన్నిటి గుండా జనులు ఆశ్చర్యపోయియున్నారు. ఆ వాదన తిరిగి వచ్చినది మరియు మొదలగునవి, “ఆయన దేవుని కుమారుడేనా? ఆయన ఏ విధముగా అవ్వగలడు? ఏ విధముగా కన్యక జన్మ … ?”
2.మరియు మీకు తెలుసా? ఒక సర్వే చేయబడిన తరువాత, ప్రభుత్వపు లెక్కల ప్రకారము, ఆ సర్వే చేయబడిన తరువాత, డెబ్బై శాతము మంది ప్రొటెస్టెంటు ప్రసంగీకులు యేసు యొక్క కన్యక జన్మను తిరస్కరించియున్నారు. మీరు దానిని ఆలోచించగలరా? ఆశ్చర్యము లేదు, మనము గత సంవత్సరము కోటి ముప్పై లక్షల మంది క్రీస్తు దేవుడే కాదనే వారిని చూశాము. చూశారా? ఎందుకనగా క్రైస్తవ మతము యొక్క ప్రాథమికమైన భాగము యేసు క్రీస్తు యొక్క కన్యక జన్మపైనే ఆధారపడియున్నది. ఒకవేళ ఆయన కన్యక జన్మ జన్మించకపోతే, ఆయన దేవుని యొక్క కుమారుడు కాదు. మరియు ఒకవేళ ఆయన కన్యక జన్మ జన్మించినట్లైతే ఆయన దేవుని కుమారుడు అయ్యుండవలసియున్నది; ఎందుకనగా వేరెవ్వరూ ఆయనను ఇక్కడకు తీసుకొని రాలేరు, ఎందుకనగా అక్కడున్న సృష్టికర్త దేవుడు మాత్రమే.
3.మరియు ఇప్పుడు, కొద్ది క్షణములు,లేఖనములలోనికి మనము చూచెదము.
4. కొంత కాలము క్రితము, ఒక వ్యక్తితో నేను మాటలాడుచున్నాను, అతడు నాతో పాటు వేటాడే వేటభాగస్వామి. అతడిని నేను ఎరుగుదును కానీ కొద్ది గంటలు, కొలరాడోకి వెళ్ళు మార్గములో అతడిని నేను కలుసుకొన్నాను. దుప్పులను (Elks) వేటాడుటకు నేను ఆ పర్వతములపైకి, కొంచెము విశ్రాంతి పొందుకొనుటకు, తిరిగి నేనుగా అవుటకు నేను అక్కడికి తిరిగి వెళ్ళుచున్నాను. అతడు నన్ను పైకి లాగుకొనియున్నాడు, మరియు మేము ఒక గుర్రము పైకి ఎక్కియున్నాము. అతడు అడిగాడు, “నీవు స్వారీ చేయగలవా?”
5.నేను చెప్పాను, “మంచిది, కొంచెము సేపు నేను చేయగలను.”
6.మరియు అతడు చెప్పాడు, “మంచిది, ఆ గుర్రపు జీను పైకి ఎగురు.” మరియు అతడు. ఒక జత గుర్రములను కలిగియున్నాడు, మరియు ఆ విధముగా మేము స్వారీ చేయుచూ వెళ్ళాము. అతడు అడిగాడు, “నీ వ్రుత్తి ఏమిటి”
7.నేను చెప్పాను, “నేను ఇండియానాలోని ఒక రాష్ట గేమ్ వార్డెన్ని.”
8.అతడు చెప్పాడు, “మంచిది, ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో ఒక గేమ్ వార్డెన్ స్వాగతించబడడు.”
9.నేను చెప్పాను, “మంచిది, నేను ఇండియానా నుండి వచ్చాను. ఇక్కడ ఉన్న మీ చట్టములు మరియు నిబంధనలతో నాకు పని లేదు” నేను చెప్పాను, “అది ఒక ప్రక్క మాత్రమే, కనుక నేను కానుకలు తీసుకొనవలసిన అవసరము లేదు.” నేను చెప్పాను, “నా సంఘము… నేను ఒక సేవకుడను.”
10.అతడు నన్ను చుట్టు చూసి, “దాని కొరకు నీవు చాలా తెలివిగలవాడిగా అనిపించుచున్నావు,” అని అన్నాడు.
11.మరియు నేను చెప్పాను, “మంచిది, నేను. ఆ అభినందనను మార్పిడి చేయట్లేదు, నా సహోదరుడా, కానీ నేను అనుకొనుచున్నాను ఒకవేళ నేను దానిని నమ్మకపోతే, నేను తెలివిగలవాడిగా అనిపించను.”
12.కనుక, అతడు చెప్పాడు, “మంచిది, నేను కొంచెము నీతో మాట్లాడాలని కోరుచున్నాను”, అని అన్నాడు.
13. మరియు నేను చెప్పాను, “ఇప్పుడు, నేను వాదించను” ఎందుకనగా లేఖనములు వాదించు కొనుటకొరకు కాదు, అవి జీవించవలసియున్నది. అది-అది, మీరు నా కొరకు ఒక ఉపదేశముకై జీవించండి. అదే శ్రేష్టమైన సంగతి. ఒకరు ప్రసంగించినది వినుట కన్నా ఒకరు ఆ ప్రసంగం కొరకు జీవించినది చూచుటకు నేను ఇష్టపడుచున్నాను. మీరు కాదా? ఒక బోద కొరకు జీవించుము. “జనులందరి ద్వారా చదవబడుటకు, మీరు వ్రాయబడిన పత్రికలై యున్నారు.”
14.అతడు చెప్పాడు, “మంచిది, ఆ కన్యక జన్మను గూర్చి నీవేమనుకొనుచున్నావు అని?” చెప్పాడు, “అది నిజమని నీవు నమ్ముచున్నావా?”
15.నేను చెప్పాను, “అది సత్యమని నాకు తెలుసు.”
16.మరియు అతడు చెప్పాడు, “ఓహ్, నీవు పొరబడియున్నావు?” అటువంటి సంగతి జరుగదు.
17.నేను చెప్పాను, “కానీ జరిగినది.”
18.అతడు చెప్పాడు, “మంచిది, నేను ఒక విషయం నిన్ను అడగాలనుకొనుచున్నాను.” అతడు చెప్పాడు, “ఇప్పుడు, ప్రారంభములోనే నేను చెప్పాలని దానిని కోరుచున్నాను, నేను దానిని నమ్మను.
మరియు నేను నిజముగా తలంచుచున్నాను, హృదయపు లోతులలో, నీవు దానిని నమ్మట లేదు.“
19.నేను చెప్పాను, “కానీ నా హృదయములో ఒక వేళ నేను నా హృదయమును ఎరిగియుంటే, నేను దానిని నమ్మెదను.”
20. మరియు అతడు చెప్పాడు, “మంచిది, కన్యక జన్మ అసాధ్యమని నేను నీకు (వైద్యపరంగా)శాస్త్రీయముగా రుజువు చేయగలను”.
21.నేను చెప్పాను, “విజ్ఞాన శాస్త్రముతో నేను చేయునది ఏమియూ లేదు”, నేను చెప్పాను, “మనము. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన యున్నాడని నమ్మవలెను, ఆయన యున్నాడని రుజువు చేయుట కాదు, కానీ ఆయన యున్నాడని నమ్మవలెను”
22.కనుక అతడు చెప్పాడు, “మంచిది, చూడుము, విజ్ఞాన శాస్త్రము ద్వారా రుజువుచేయబడనిదేదైనా వాస్తవము కాదు”.
23. నేను చెప్పాను, “ఓహ్, మై, అక్కడ ఖచ్చితముగా నేను నీతో అంగీకరించను. నేను చెప్పాను, ”వాస్తవమైన సంగతులు ఏమైనా ఉన్నవంటే, అవి విజ్ఞానశాస్త్రమునకు ఏమి తెలియని సంగతులు“
24.అతడు చెప్పాడు, “ఓహ్, వైు. మనము నిజముగా దూరమగుచున్నాము, అవునా?”
25.నేను చెప్పాను, “అవునయ్యా”.
26.అతడు చెప్పాడు, “మంచిది, ఇక్కడ చూడు.”
27.నేను చెప్పాను, “నేను ఒక సంగతి అడగగోరుచున్నాను: నీవు నీ భార్యను ప్రేమించెదవా?”
28.అతడు “అవునయ్యా.” అని చెప్పాడు,
29.నేను చెప్పాను, “నాకు చూపించు. శాస్త్రీయముగా, ప్రేమంటే ఏమిటో, ఆ భాగమును బయటకు లాగి, నేను అనుభూతి చెంది మరియు అది ఏమిటో నేను చూచెదను. ఇతర స్త్రీల నుండి ప్రత్యేకపరచి, నీవు నీ భార్యను ప్రేమించేటట్లు చేయుచున్న నీలోని ఆ ప్రేమ యొక్క భాగము ఏమిటి? అక్కడే నీవున్నావు. చూశారా? నేను చెప్పాను, ”నీవు వ్యక్తిత్వమును నమ్మెదవా?“
30.అతడు చెప్పాడు, “అవును.”
31.నేను చెప్పాను, “శాస్త్రీయముగా ఒక మనుష్యునిలోని ఏ వ్యక్తిత్వమున్నదో నాకు చూపించుము. అది చేయలేవు.” నేను చెప్పాను, “వ్యక్తిత్వము, మరియు ప్రేమ, మరియు ఆ సంగతులు, దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ దూతలు, ఆ సంగతులన్నియూ వాస్తవములు, మరియు అటువంటి సంగతులు శాస్త్రీయముగా రుజువు చేయబడలేవు. దేవుడు మానవుడిని చేసినప్పుడు, ఆయన మొదటిగా అతడిని తన స్వరూపములో చేసియున్నాడు, ఆత్మరూపముగా, అప్పుడు ఆయన మానవుల్ని అయిదు ఇంద్రియములలో పెట్టియున్నాడు, అతడిని ప్రకటించుట కొరకు కాదు, కానీ ఈ భూసంబంధమైన గృహమును తాకుట కొరకు, మానవునిలో శాస్త్రీయభాగము, చూచుట, రుచి చూచుట, అనుభూతి చెందుట (స్పర్శ), వాసన చూచుట, మరియు వినుట అనునవి. ఈ భూసంబంధమైన గృహమును తాకుట కొరకు, అంతరంగ పురుషుడు, అనగా ఆత్మ దేవుని సంధించును. దానిని గూర్చి విజ్ఞానశాస్త్రమునకు ఏమియు తెలియదు”. మరియు వారు అన్నీ ఏర్పరచియున్నారు, మరియు మొదటి సంవత్సరము, వారు దానిని తిరిగి మార్పు చేయవలసిన వారైయున్నారు, క్రిందకు తీసుకొని వచ్చెదరు. కానీ దేవుని వాక్యము ఏర్పరచబడి మరియు నిత్యమూ ఉండునట్లుగా స్థిరపరచబడును, ఎన్నడూ మార్పు చెందదు, అది ఎప్పటికీ దేవుని యొక్క వాక్యము.
32.ఇప్పుడు, అతడు చెప్పాడు, “ఎందుకు, చూడుము, ఆ కన్యక జన్మ,” చెప్పెను, “అది సత్యమని నీవు నిజముగా నమ్ముచున్నావా?”
33.నేను చెప్పాను, “అవునయ్యా. నేను దానిని నమ్ముచున్నాను.”
34.అతడు చెప్పాడు, “ప్రసంగీకుడా,అది అన్ని విజ్ఞానశాస్త్ర నియమములకు పూర్తి వ్యతిరేకము, ఆ కన్యక జన్మ.” అతడు చెప్పాడు, “ఆ విధముగా ఉండదు,” “మొక్కజొన్న, మొక్కజొన్నను ఫలదీకరణము చెందవలసియున్నది”; చెట్లు ఫలదీకరణము చెందాలి; ప్రతీది; పుప్పొడి ఒక దాని నుండి వేరొక దానికి వెళ్ళవలసియున్నది, పురుషుడి నుండి స్త్రీకి, అవి చెట్లలోను మరియు ప్రతీది. ఒకవేళ మీరు చేయకపోతే, అది ఫలించదు.“
35.నేను చెప్పాను, “కానీ, మీరు మర్చిపోయారు, అయ్యా, ఆయన దేవుడు, సృష్టికర్త.”
36.ఆయన చెప్పెను, “మంచిది, అయ్యా అది ఆ విధముగా ఉండదు.”
37.మరియు నేను చెప్పాను, “మంచిది, నేను మీ క్షమాపణ అడుగుచున్నాను, అది ఇప్పటికే రుజువు చేయబడినది.”ఆహారము యొక్క రుజువు దాని తినుటైయున్నది.“మరియు నేను చెప్పాను, ”అది ఆ విధముగానే.“
38.ఆయన చెప్పాడు, “మంచిది, ఇప్పుడు, ఇక్కడ చూడుము”, అతడు చెప్పాడు, “అది కొంచెం తప్పుగా అనిపించుచున్నదని నీవు నమ్ముట లేదా యోసేపే నిజముగా తండ్రి వలె మరియు అది కేవలము.”
39.నేను చెప్పాను,“లేదయ్యా! నేను నమ్ముచున్నాను ఆయన దేవుని కుమారుడని, మరియు నేను కలిగియున్నదాని కన్నా యోసేపు దానితో చేయగలిగినది మరెక్కువ ఏమీలేదు”. అది నిజము. నేను చెప్పాను, “నేను నమ్ముచున్నాను ఆయన దేవుని కుమారుడని,” మరియు అతడు… అది దేవుని యొక్క కుమారుడు.
40.మరియు అతడు చెప్పాడు, “మంచిది, ఇక్కడ చూడుము,” అతడు చెప్పాడు, “నేను నీకు చెబుతాను,” చెప్పెను, “అది, నేను నమ్ముచున్నాను అది కొంచెము తప్పుగా ఉన్నది.”
41.నేను చెప్పాను, “నన్ను నీకు ఒకటి చెప్పనివ్వు ఆయన, నిజానికి, ఒక భూసంబంధమైన తల్లిని కలిగియున్నాడని నీవు నమ్ముచున్నావా?”
42.అతడు చెప్పాడు, “అవును, మరియు అతడి యొక్క తల్లి అని నేను నమ్ముచున్నాను, కానీ, యోసేపు అతడి యొక్క తండ్రి,”
43.నేను చెప్పాను, “మరి నీవు చెప్పియున్నావు, ఇక్కడ ఈ భూమిపై ఒక సాటియైన భూసంబంధమైన సహాయము లేకుండా (ఒకరినొకరు కూడుకొనకుండా) ఒక బిడ్డను తీసుకొని వచ్చుట, అది ఒక స్త్రీకి అసాధ్యము.”
44.చెప్పెను, “అవునయ్యా అది ఖచ్చితముగా నిజము.”
45.నేను చెప్పాను, “అయితే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగబోవుచున్నాను. ఒకవేళ నీవు అడిగితే. నీవు దీనికి సమాధానమివ్వు, అప్పుడు నేను నీతో అంగీకరిస్తాను. ఒకవేళ నీవు నాకు చెప్పినట్లయితే….” అతడు నాకు చెప్పియున్నాడు ఒక తలకప్ప నుండి మొదటి మానవుడు వచ్చియున్నాడని, మీకు తెలుసా, లేక ఒక నక్షత్రములోని చిన్న భాగము లేక అటువంటిది. నేను చెప్పాను, “నేను నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను. ఒకవేళ నీవు నాకు చెప్పినట్లు ఈ భూమిపై ఒక పురుష సంభోగము అనే వాస్తవమైన కలయిక లేకుండా ఒక బిడ్డ జన్మించలేడు అని, నేను నిన్ను ఇది అడుగగోరుచున్నాను: ”మొదటి మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అతడి యొక్క తండ్రి మరియు అతడి యొక్క తల్లి ఎవరు? అతడు ఒక తలకప్ప, కోతి, అతడు ఏదైనా అయి ఉ౦డవచ్చు అతడు ఒక తండ్రి మరియు ఒక తల్లిని ఎక్కడో కలిగియుండవలసినదే, నీ యొక్క బోధను బట్టి.“అది నిజము.”అతడి యొక్క తండ్రి మరియు తల్లి ఎవరు?”
46.అతడు ఇప్పటివరకూ ఎన్నడూ నాకు సమాధానము ఇవ్వలేదు. లేదయ్యా అతడు ఇవ్వలేడు. లేదయ్యా అతడు అయి ఉండవచ్చు, అతడు ఏదైనా అయి ఉండవచ్చు, ఒకవేళ అతడు ఒక కీటకమైతే, తలకప్ప, జెల్లీ చేప, అతడు ఏదైనా, వారి యొక్క మాటను బట్టి, అతడు ఎక్కడో ఒక తండ్రిని, మరియు ఒక తల్లిని కలిగియుండవలసినదే.
47.ఆయన ఒక కన్యక ద్వారా జన్మించిన దేవుని యొక్క కుమారుడని నేను చెబుతాను, యెహోవా ద్వారా సృష్టించబడినవాడు. దేవుడు ఒక ఆత్మ అని నేను నమ్ముతాను: మరియు ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వారు ఆత్మలోను మరియు సత్యములోను ఆయనను ఆరాధింపవలెను. దాని యొక్క సత్యమును వినుము మరియు అప్పుడు ఆయనను ఆత్మలో ఆరాధించుము. ఇప్పుడు, మరియు నేను నమ్మునది ఇదియే! ఆ కన్యక మరియు, ఒక చిన్న బాలిక, పదహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు, యోసేపు, అను వ్యక్తితో పోవుచున్నది. మరియు నేను నమ్ముచున్నాను, దేవుడు, సృష్టికర్త పరిశుద్దాత్మ ద్వారా ఆ బాలికను కమ్ముకొనెను, ఆయన శరీరము, మరియు ఆమె గర్భము ధరించి మరియు ఒక బిడ్డను కనెను: యేసుక్రీస్తు మనకు తెలుసు ఆ బిడ్డ, రక్తకణము పురుష సంభోగము నుండి రావలసినదే. దానితో చేయుటకు స్త్రీకి ఏమియూ లేదు. ఆమె కేవలము ఒక పొదుగు యంత్రము (లేక పెట్టె) మాత్రమే.
48.చూడుము, నీవు తీసుకో… ఒకవేళ ఒక కోడి. ఒక కోడి ఒక గ్రుడు పెట్టగలదు, మరియు ఒకవేళ ఆ కోడి గనుక ఆ మగ పక్షితో జత లేకపోతే, అది ఎన్నడూ పొదగదు. అది ఫలవంతము కాదు. ఒక ముసలి తల్లి పక్షి ఒక గూడును తయారు చేయగలదు, మరియు గూడునిండా గుడ్లను పెట్టగలదు, మరియు అది వాటిని కొంచెము కప్పియంచగలదు, మరియు పట్టియుంచగలదు, మరియు లాగియుంచగలదు, మరియు అక్కడ కూర్చొని, తననుతాను మాడ్చుకొని (ఆకలితో), అది ఆ గూడు నుండి దూరమవ్వలేక అది మరింత బలహీనమవుతుంది. అది నిజము. గుడ్లను కప్పియుంచుతూ, మరియు వాటిని వెచ్చగా ఉంచుతూ, కానీ ఒక వేళ అది మగపక్షితో జత లేకపోతే, ఆ గుడ్లు ఆ విధముగానే గూడులోనే ఉండి మరియు కుళ్ళిపోతాయి; అవి ఎన్నడూ పొదగవు. అది నిజము.
49.ఈ మొత్తము పాత, చల్లని, మార్పులేని సంఘములను చూసి నేను అదే తలంచెదను: కుళ్ళిపోయిన గుడ్లతో నిండిపోయిన ఒక గూడు. మీరు దానిని హత్తుకొనవచ్చును, చుట్టూ లాగవచ్చును: వారు పరిశుద్ధాత్మతో సంబంధము కలిగియుండ కుండా మరియు తిరిగి జన్మించకపోతే, మీరు కుళ్ళిపోయిన గుడ్లతో నింపబడిన ఒక గూడును కలిగియున్నారు. వారు నమ్మరు, లేక ఏమీ కాదు, బహుశా కేవలము దానిని బయట పారవేసి మరియు ఆ గూడును తిరిగి ప్రారంభించెదరు. అది నిజము. తిరిగి జన్మించిన జనులను కలిగియుండి, మరియు వారేమి మాట్లాడుచున్నారో తెలుసుకొనండి. ఒకవేళ అతడు ఒక డీకను, ప్రసంగీకుడు, లేక అతడేమైనా గానీ ఫరవాలేదు. ఆమెన్.
50.భయపడవద్దు. ఇప్పుడు, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు. ఇది-ఇది. నేను ఉద్రేకముతో లేను. నేను కేవలము ప్రభువును ప్రేమిస్తున్నానంతే. మరి మీరు? (సంఘము “ఆమెన్” చెప్పుచున్నది) ఖచ్చితముగా, మీరు చేయుడి. అది సరియే. ఇప్పుడు, అది నిజము.
51.అప్పుడు, పరిశుద్దాత్మ దేవుడు, సృష్టికర్త, ఆ చిన్న కన్యకయైన మరియను కమ్ముకొనెను, మరియు సజీవుడైన దేవుని యొక్క కుమారుడిని ఉత్పత్తిచేసిన ఒక రక్తకణమును ఆమె గర్భములో సృష్టించెను. మనుష్యుడు దానితో చేయగలిగినది ఏమీలేదు. అది అక్కడ ఉన్నది. మరియు అక్కడ నుండి ఆమె ఈ శిశువును తీసుకొని వచ్చినది. మరియు ఆయన తన తండ్రి యొక్క రక్తమైయున్నాడు, సృష్టించబడినది, లైంగిక కోరికను బట్టి కాదు, కానీ సృష్టించబడినది. దేవుడు, యెహోవా, దానిని సృష్టించెను. మనము లైంగిక కోరికను బట్టి జన్మించియున్నాము. మరియు ఆయన దేవునికి మరియు పాపికి మధ్యలో నిలబడుటకు, ఆ కల్వరి సిలువపై ఆ ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తమును, ఉచితముగా చిందించెను, పాపికి ఒక మార్గమును సిద్ధము చేసెను, ఒక పరిశుదుడు, ఆయన రక్తము ద్వారా, దానిని అర్పించుట ద్వారా, హల్లెలూయా !
52.అది ఆ రక్తము, ఈ మధ్యాహ్నము, అది రోగులను స్వస్థపరచును, మరియు పాపిని కడిగివేయును, మరియు అతడిని నూతన సృష్టిగా మార్చివేయును. కేవలము దాని ద్వారా, ఆ రక్తము, ఒంటరిగా, ఆ కారణముచేతనే మనము ఎక్కడ ఉన్నామో ఎరిగి మనము విశ్వాసముపై నిలబడగలము, ఎందుకనగా మనము దానిని నమ్మియన్నాము. దాని యొక్క గుణ లక్షణములు మనలను పాప జీవితము నుండి కడిగివేసి (శుభ్రపరచి), మరియు మనలను క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా చేయును. దెయ్యములు అరుస్తూ మరియు దొర్లుతూ, మరియు బయటకు వచ్చివేయును; కుంటివారు నడిచెదరు; గ్రుడ్డివారు చూచెదరు; చెవిటివారు వినెదరు; పాపములో పడియున్న పాపులు సమాజములో మర్యాద కలిగిన స్త్రీ పురుషులుగా చేయబడుదురు. ఆమెన్. మీరు అక్కడే ఉన్నారు. అతడు ఎవరి కుమారుడు, అతడు దేవుని యొక్క కుమారుడు. ఆమెన్. నా హృదయమంతటితో నేను దానిని నమ్ముచున్నాను.
53.దేవుడు ఆత్మయైయున్నాడు, ఒక వ్యక్తి కాదు. ఒకవేళ ఆయన ఒక వ్యక్తి అయితే, క్రీస్తు లైంగిక కోరికతో జన్మించినవాడగును. ఆయన ఒకవ్యక్తి కాదు. ఆయన ఆత్మయై యున్నాడు, మరియు ఆయన కన్యకయైన మరియను కమ్ముకొనెను, మరియు ఒక సృష్టించే శక్తితో కుమారుడిని తీసుకొని వచ్చినది, ఆయనే యెహోవా దేవుడు. ఆమెన్ అప్పుడు ఆ రక్తము కల్తీ లేనిది, మరియు అది నా స్థానములో సమాధానమిచ్చుచున్నది, ఈ మధ్యాహ్నము, అది నీ స్థానములో సమాధానమిచ్చును.
54.కొన్ని సంవత్సరాల క్రితము, మయో సహోదరులు నా ముఖములోనికి చూచినప్పుడు, “రెవరెండ్ బ్రన్హాం, నీవు జీవించలేవు,” అని చెప్పారు, నేను యేసుక్రీస్తు యొక్క రక్తమును అంగీకరించాను. నా జీవితములో ఎన్నడూ లేని దానికన్నా ఈ రోజు, నేను బాగున్నాను, ఎందుకనగా అది యేసుక్రీస్తు యొక్క కల్తీ లేని రక్తము.
55.ఎప్పుడైతే మంచి వైద్యులు, కాంగ్రెస్ వాడైన ఉప్షాకు వైద్యము చేశారో, చక్రాల కుర్చీల కేసులు మరియు అవన్నీ ప్రతీది విఫలమైనప్పుడు, మరియు అతడి యవ్వన ఎముకలు,ఆ విధముగా కనిపించినవి, కలిపివచ్చి, మరియు అతడు యవ్వనునిగా నున్నప్పుడు అంతయూ సరిగానే ఉండి యుండవచ్చు. కానీ,అతడు వృద్ధుడగునంత వరకూ జీవించుటకు దేవుడతడికి అనుమతినిచ్చెను,మరియు అతడి పాతగిలిన (విరుగుటకు సిద్ధముగా ఉన్న) ఎముకలు మరియుఅవన్నీ అప్పుడు ఆ కల్తీ లేని యేసుక్రీస్తు యొక్క రక్తము కల్వరి యొద్ద అతడిస్వస్థతకై సమాధానము చెప్పినది. అతడు ఈ రోజు ఇక్కడ, ఒకక్రొత్త వ్యక్తి వలె ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము! దేవుని యొక్క కుమారుడు!ఆయన అదే అని నేను నమ్ముచున్నాను.
56.ఓహ్, ఏ విధముగా మనము సాగెదము.కాలములు మాత్రమే చెబుతాయి ఆయన ఎవరు అని, అవి మాత్రమే వివరించగలవు ఆయన ఏమైయున్నాడు, మరియు ఆయన ఎవరు అని.
57.కొద్ది క్షణముల కొరకు కొద్ది మందిని ప్రశ్నించుటకు పిలుద్దాము.
58.ఆయన శత్రువులలో కొద్ది మందిని అడుగుదాము, ఒకవేళ ఎవరికైనా తెలుసునేమో, ఆయన యొక్క శత్రువులలో కొద్ది మందిని చూద్దాము, వారేమి సాక్ష్యము ఇస్తారో చూద్దాం.
59.మొదటిగా, ఆయన యొక్క స్నేహితులలో కొందరిని అడుగుదాం. వెనుకకు వెళ్ళి మరియు మొదటి వ్యక్తిని అడుగుదాం, ఒకవేళ ఈ మధ్యాహ్నము మనము వేదిక పైకి పిలువగోరినయెడల, చెబుదాం, “ఆదాము, ఒక్క క్షణం ఇక్కడకు రా. నేను నిన్ను ఏదో అడుగగోరుచున్నాను. అతడు ఎవరి కుమారుడు? లోకమంతా కన్యక జన్మ మరియు అటువంటి వాటిని గూర్చి ఎక్కువగా వాదించుచున్న ఈ బిడ్డ ఎవరు, అతడు ఎవరు?”
60.“ఆయన స్త్రీ సంతానము, అతడే సర్పము యొక్క తలను చిదుకకొట్టవాడు,” అని ఆదాము చెబుతాడు. అతడు బైబిలులో చేసినట్లుగా, అతడు సమాధానమిస్తాడు అని నేను నమ్ముచున్నాను.
61.“ఆదాము, ఆయననుగూర్చి నీవేమనుకొనుచున్నావు?”
62. గొప్ప ప్రవక్తయైన మోషేను ఒకవేళ నేను అడిగినట్లయితే, “మోషే, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు, యేసుక్రీస్తు?”
63.అతడేమి చెబుతాడో మీకు తెలుసా? “ప్రభువగు మీ దేవుడు నా వంటి ఒక్కరిని మీలో నుండి లేపుతాడు అని నేను పలికిన ఆ ఒక్కడు అతడే; మరియు ఒకవేళ ఆ ప్రజలు అతడిని నమ్మకపోతే, వారు కొట్టివేయబడుదురు; అతడిని గూర్చి నేను ఆలోచించుచున్నది అదే,” అని మోషే చెప్పును. అది సరియే.
64. మనము అడుగుదాము. మనము వెళ్ళి యెహెజ్కేలును అడుగుదాం. అతడొక గొప్ప ప్రవక్త, “యెహెజ్కేలు, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
65. అతడు చెప్పాడు, “నేను ఆయనను చూశాను, మరియు ఆయన చక్రములో చక్రమువలె, గాలిలో పైకెగురుతూ కనిపించాడు.”
66. “ప్రవక్తయైన యెహెజ్కేలు, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
67. “హెబ్రి పిల్లలారా, ఆయనను గూర్చి మీరేమనుకొనుచున్నారు?”
68. వారు చెప్పెదరు, “ఒకరోజు, బబులోనులో, మేము అక్కడ బానిసత్వములో ఉన్నాము, మరియు మొదటి సంగతి మీకు తెలుసా, అక్కడ ఒక ఆజ్ఞ బయటకు వెళ్ళినది, అది, ఎవరైతే ఒక ప్రతిమ ముందు మోకరించరో, వారు అగ్నిగుండములో వేయబడుదురు. మరియు మేము దానియేలుతో పాటు మా హృదయములో తీర్మానించుకొన్నాము, అది మమ్మలను మేము కలుషితము చేసుకొనకూడదు అని. కనుక ఆ సమయము వచ్చినప్పుడు, బూరలు మ్రోగబడ్డాయి, మరియు సంగీతము ప్రారంభించబడినది, దేవున్ని సేవించుట కొరకు, మా వెనుకను ఆ ప్రతిమ వైపు త్రిప్పియున్నాము. ఒకరోజు అది ఉన్న దాని కన్ననూ ఏడురెట్ల అధికముగా ఆ అగ్నిగుండమును వేడిచేసిరి. వారు మమ్మలను ఆ వెనుకకు తిరిగి లాగుకొనే బల్లపై నడిపించారు.” కేవలము కొద్ది నిముషములు, దానిని మనము చూద్దాం.
69.మై, ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు గూర్చి మరియు ఆయన రక్తము మరియు ఆయన శక్తిని గూర్చి మాట్లాడెదవో, అప్పుడు అక్కడే ఆ దెయ్యము నీపై ఆ వేడిని పెంచివేయును. నీవు దానిని పొందుకొనబోతున్నావని నీవు ఆలోచించుట లేదా.
ఆ పరలోక గృహమునకు నేను కొనిపోబడవలయుననిన
ఒక సుఖవంతమైన పూల పాన్పుపై,
ఆ బహుమానమును పొందుకొనుటకు ఇతరులు పోరాడినప్పుడు,
మరియు రక్తసంద్రములలో పయనించియున్నారా?
లేదు, ఒకవేళ నేను ఏలవలయుననిన నేనునూ పోరాడవలసినదే.
నా ధైర్యమును అభివృద్ధిపరచుము, ప్రభువా,
70.అది అదే. నీ వాక్యముతో నన్ను బలపరచుము.
71. ఆ ఉదయకాలమున, అక్కడ వారిని నేను చూడగలుగుచున్నాను, రాజైన నెబుకద్నెజరు చెప్పుచున్నాడు, “మనము ఇక్కడ కలిగియున్న ఆ పరిశుద్ధ-బండరాళ్ళు, ప్రకాశమానమును మనము ఇక్కడ కత్తిరించి వేయుదుము. వారిలో నుండి దానిని కాల్చివేయుదుము.” ఒక అగ్ని, అగ్నిని కాల్చడం అసలు మీరు ఊహించగలరా? మంచిది, ఒక వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు కాల్చివేయలేరు. అది దానికదే అగ్ని అయియున్నది. అంతా సరియే. వారు ఆ గుండమును వేడి చేయడం నేను చూస్తున్నాను, ఆకాశము నల్లగా నున్నది, అది ఉన్న దాని కన్నా ఏడు రెట్ల అధికము చేసిరి, మరియు రాజైన నెబుకద్నెజరు తన కొరకు ఒక కుర్చీ తెప్పించుకొని మరియు ఏమి జరగనైయున్నదో అని గమనించుటకు చూచుచున్నాడు.
72. వారు బంధించబడిన కీలకమైన ఘడియవచ్చినది, వారి చేతులు వారి వెనుకకు ఉన్నాయి, ఆ అగ్నిగుండములో త్రోసి వేయబడుటకు ఆ స్థలమునకు మరణపు కవాతు చేస్తున్నారు.
73.సహోదరుడా, వినుము, “నీవు ప్రార్ధించియున్నావనే ఖచ్చితత్వమును నీవు కలిగియున్నావా?” అని షద్రకు మేషెకును అడగడం నేను వినగలుగుచున్నాను.
74.“అవును! నేను బాగానే ఉన్నాను.”
75.వారు చెప్పారు, “బాలులారా, రాజీపడుటకు సిద్ధముగా ఉన్నారా?”
76. అతడు చెప్పాడు, “ఆ అగ్నిగుండములో నుండి మమ్మలను విడుదల చేయుటకు మా దేవుడు సమర్ధుడు, కానీ ఏదీ ఏమైనప్పటికిని, మేము మీ ప్రతిమ ముందు వంగము.”
77.దేవా అటువంటి వారిని కొంతమందిని మాకు న్యూయార్కులో దయ చేయి, న్యూయార్కులో మాత్రమే కాదు, కానీ ప్రతీ చోటా, ఎవరైతే దేవున్ని ఆయన వాక్యము పైన తీసుకొని మరియు అక్కడ నిలబడతారో అటువంటి వారిని దయచేయుము. ఏది వచ్చినా, ఏది పోయినా, క్రీస్తుతో నిలబడేవారిని. అది సరియే. ఆయన ఆలస్యం చేయవచ్చు ఆయన ఇదైయుండవచ్చు, లేక అది లేక మరొకటి. కానీ చింతించవద్దు, ఆయన సరైన సమయానికి అక్కడ ఉంటాడు.
78.అప్పుడు వారు పైకి వెళ్ళడం నేను చూడగలుగుచున్నాను. మరియు వారు బలహీనమైమరియు మూర్చిల్లిచున్నారు. వారి వెనుక బల్లెములు పట్టుకొన్నవారు, వారిని ముందుకు త్రోయుచున్నారు. వారు దాదాపుగా…
79.కొద్ది క్షణములు మనమొక చిన్న నాటకమును చూద్దాము, చూడుము, వెనుక అక్కడ, ఆ ప్రజలవైపు, వెనుక నిలువబడిన వారు చెప్పుచున్నారు, “ఆ పరిశుద్ధ బండరాళ్ళకు అదే జరుగును. దేవుని సేవకులమని తమకు తాము పిలుచుకొని మరియు ఆ కనబడని వారికి, ఆ ప్రజలకు అదే జరుగును.” ఆ ప్రతిమ వలె, వారు సేవ చేయుచున్న “అదే వారిని గూర్చి జాగ్రత్త వహించును,” అని చెప్పుచున్నారు.
80. మరియు వారు నడుచుచుండగా, వారు ఒక రకమైన మరణపు బలహీనతకు లోనవ్వడము నేను చూడగలుగుచున్నాను, కానీ దేవుడు సమర్ధుడు అని వారు ఎరిగియున్నారు, కానీ ఏమైనప్పటికీ, వారు వంగబోవడం లేదు. అప్పుడు, కేవలము రెండు అడుగులే మిగిలియున్నప్పుడు, వారు నడవడం చూడండి, మరియు వారు అందులోనికి వెళ్ళిపోయారు. మరియు వారిని నెట్టుచున్నవారు, ఆ వ్యక్తులు మూర్చిల్లిడం ప్రారంభించారు. అది ఒక విశ్వాసికి ఒక చీకటి చిత్రముగా కనిపించుచున్నది, కనిపించుట లేదా?
81.మన యొక్క కెమెరాను కొద్ది నిముషములు త్రిప్పుదాం. మహిమలోనికి చూద్దాం. ప్రతీసారి ఇక్కడ క్రింద ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు, అక్కడ పైన కూడా ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రతీసారీ, ఆయన తన యొక్క యాజక వస్త్రములు ధరించి కూర్చొని ఉండడం నేను చూడగలుగు చున్నాను. మై, ఆయన కుడివైపునకు వచ్చుచున్న మొదటి సంగతి మీకు తెలుసా, ఒక గొప్ప దూత రావడం నేను చూస్తున్నాను, అతడి పేరు గాబ్రియేలు మీకు తెలుసా, పరలోకమంతా దూతలతో నిండియున్నది. నీవు దానిని నమ్ముచున్నావా? గాబ్రియేలు అక్కడకు పరుగెత్తికొని వచ్చి మరియు తన ఖడ్గమును తీసి చెప్పుచున్నాడు, “యజమానుడా, నీవు నన్ను సృష్టించిన దినము నుండి నేను నిన్ను సేవిస్తున్నాను. నా చేతులలో నేను మెరపులను కలిగియున్నాను. అదిగో అక్కడ బబులోనులో ఏమి జరుగుచున్నదో చూడుము. వారు ముగ్గురు విశ్వాసులను కాల్చటకు సిద్ధపడియున్నారు. ఈ ఉదయకాలము నన్ను అక్కడికి వెళ్ళనిమ్మ దాని యొక్క రొట్టెకు ఎటువైపున వెన్న పూయబడినదో నేను ఆ బబులోనుకు చూపించెదను.” నిజముగా అతడు దానిని చేసి యుండెడివాడని నేను నమ్ముచున్నాను, మీరు నమ్మట లేదా?“ నన్ను అక్కడికి వెళ్ళనిమ్ము ఈ ఉదయకాలమున, నేను బబులోనును తుడిచి పెట్టెదను,” అని అతడు చెప్పడం నేను వినగలుగుచున్నాను.
82.“అవును, గాబ్రియేలు, నీవొక నీతిమంతుడైన దూతవు. నేను నిన్ను సృష్టించిన దినము నుండి నీవు నాకు విధేయత చూపించావు, కానీ నేను నిన్ను పంపించలేను,” అని ఆయన చెప్పడం నేను వినగలుగుచున్నాను. అప్పుడు అతడు తన ఖడ్గమును ఒరలో పెట్టుకొని, తన వైపునకు (స్థానములో) నిదానముగా నిలబడుట నేను చూచాను.
83.పైన, ఇటువైపు నుండి, వేరొక దూత వచ్చినది. అతడు మాచిపత్రి, అతడు నీటిపై నియంత్రణను కలిగియున్నవాడు, “యజమానుడా, నీవు బబులోనులో చూసియున్నావా? ఎందుకు, నాశనము చేయుటకు నీవు నాకు అధికారమిచ్చియున్నావు. నేను మహాగాధ జలములను విప్పియున్నాను, మరియు ఆకాశము నుండి వర్షమును కురిపించియున్నాను. భూమిని తుడిచిపెట్టియున్నాను. ఈ ఉదయకాలమున నన్ను అక్కడకు వెళ్ళనివ్వు నేను ఈ భూమిపై నుండి బబులోనును తుడిచి పెట్టేస్తాను,” అని చెప్పుచున్నాడు. నేను నమ్ముచున్నాను దానిని అతడు చేసియుండెడివాడని.
84. “మాచిపత్రి, నీవొక మంచి దూతవు. జల ప్రళయములో ఆ నాశనములో నేను నీకు ఏమి చెప్పియున్నానో దానినే చేసియున్నావు. నీవు భూమిని తుడిచిపెట్టి మరియు నోవహును రక్షించియున్నావు, కానీ నేను నిన్ను వెళ్ళనివ్వలేను,” అని ఆయన చెప్పడము నేను వినగలుగుచున్నాను.
85.చెప్పెను, “నీవు వారిని పట్టించుకొనుచున్నావా?”
86. చెప్పెను, “రాత్రంతయూ నేను వారిని గమనించాను.” ఓహ్, మై “ఆయన కళ్ళ పిచ్చుకపై ఉన్నవి. ఆయన నన్ను గమనిస్తున్నాడని నాకు తెలుసు.” నీవు ఏమి చేయుచున్నావో, ఏమి ఆలోచించుచున్నావో ఆయనకు తెలుసు. “రాత్రంతయూ నేను వారిని గమనించాను,” అని ఆయన చెప్పడం నేను వినగలుగుచున్నాను. ఓహ్, మై, ఒకవేళ ఆయన ముగ్గురు కొరకే శ్రద్ధను కలిగియున్నట్లయితే, ఒక్క రాత్రిలో, ఇబ్బందులలో ఉండి, ఇక్కడ కూర్చొని ఉన్న వేల సంగతి ఏమిటి? ఖచ్చితముగా ఆయన వహించును.
87.“నేను మీ అందరినీ పంపగలను, కానీ నేను చేయలేను, ఎందుకనగా నాకు నేనుగా వెళ్ళచున్నాను. అది ఒక మనుష్యుడు చేయు కార్యము, కనుకనే నేను క్రిందకు వెళ్ళుచున్నాను,” అని ఆయన చెప్పడం నేను వినగలుగుచున్నాను. ఆయన కుర్చీలో నుండి లేవడం నేను చూడగలుగుచున్నాను. ఆయన యాజక వస్త్రములు ఆయన చుట్టూ పడిపోయినవి. ఆయన చుట్టూ చూడడం నేను చూడగలుగుచున్నాను, వెనుక ఇక్కడ ఉత్తరాన, ఒక పెద్ద ఉరుము ఉన్నది. “తూర్పు గాలి, పశ్చిమ గాలి, ఉత్తరము మరియు దక్షిణము, ఇటు రండి,” అని ఆయన పిలవడం నేను వినగలుగుచున్నాను.
88.పరలోకములో ఉన్న ప్రతీదీ ఆయనకు లోబడును. మానవునికి తెలిసిన దానికన్ననూ ఆయన ఎక్కువ చేయును; (కార్యములు) మానవుడు దానిని కనుగొనుటకు ప్రయత్నించును. పరలోకములు ఆయనకు లోబడును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను నెరవేర్చుట శ్రేష్టము.
89.“తూర్పు గాలి, పశ్చిమ గాలి, ఉత్తరము మరియు దక్షిణము, ఇటు రండి. అక్కడ ఉన్న ఆ ఉరుము క్రింద దాగియుండుడి. ఈ ఉదయకాలమున, నేను ఒక ప్రయాణము చేయబోవుచున్నాను.” అవి అక్కడకు వెళ్ళి ఆ పెద్ద ఉరుము క్రింద చుట్టుకొనిపోవడం, వాటితో క్రిందకు వచ్చి, సింహాసనము ప్రక్కగా వెళ్ళడం, నేను చూడగలుగుచున్నాను. ఆయన ఒక రథము వలె అక్కడకు చేరుకున్న ఆ పెద్ద ఉరుము పైకి, తన యొక్క సింహాసనము నుండి అడుగుపెట్టెను, మరియు ఒక మేఘము వలె అక్కడ ఉన్న ఆ నాలుగు గాలులను పట్టుకొని, ఒక రధము వలె స్వారీ చేయబోవుచున్నాడు, ఆకాశములలో నుండి వచ్చుచున్న మెరుపులను పట్టుకొనుచున్నాడు, దానిని పగులగొట్టుచున్నాడు. హల్లెలూయా!
90. మరొక్క అడుగు, మరియు హెబ్రీ పిల్లలు అగ్ని గుండములో ఉంటారు. మరియు ఆయన జీవనదిని దాటుకుంటూ వెళుతున్నాడు, జీవనదిలో నుండి ఒక పొడవాటి ఆకును తీసుకున్నాడు. వారు తమ ఆఖరి అడుగును వేసినప్పుడు, ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్ని గుండములో గాలి పంకాతో, గాలులను వీస్తున్నాడు.
91.“హెబ్రీ బాలులారా, ఆయనను గూర్చి మీరేమనుకొనుచున్నారు?”
92. అతడు చెప్పాడు, “ఆయన అక్కడ నిలబడియున్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు వలె కనిపించాడు, నాకు” ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. “దేవుని యొక్క కుమారుడు వలె ఒక్కరు.”
93.ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?
94.నేను చెప్పాను, “యెషయా, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?” (మరొకప్రవక్త)“ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? నీవొక ముఖ్య ప్రవక్తవు.”
95. అతడు చెప్పాడు, “ఆయన ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఇవ్వబడెను: రాజ్యభారము ఆయన భుజములపై ఉండును; ”ఓహ్!“ మరియు ఆయన రాజ్యమునకు అంతము లేదు.”
96. ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? ఆయన ఎవరి కుమారుడు? నేను నమ్ముచున్నాను ఆయన దేవుని యొక్క కుమారుడని. నీవు నమ్ముట లేదా?
97. నేను చెప్పాను, “దానియేలు, ఒక దినమున నీవు అక్కడ నిలబడ్డావు. దేవుని యొక్క కుమారుని గూర్చి నీవేమనుకొన్నావు? యేసుక్రీస్తును గూర్చి నీవేమనుకొన్నావు? ఆయనే క్రీస్తా? ఆయనను గూర్చి నీవేమనుకొన్నావు?”
98. అతడు చెబుతాడు, “ఒక రోజు, సహోదరుడు బ్రన్హం, నేను కాలములను చూస్తూ ఉన్నాను,” హల్లెలూయా! “ఒక దర్శనములో దేవుడు నా ఎదుట తీసుకొని వెళ్ళచున్నప్పుడు నేను ఆ కాలములను చూస్తూ ఉన్నాను. కాలములు దాటుకొని వెళ్ళడం నేను గమనిస్తున్నాను. అందరు రాజులు రావడము, మరియు గొప్ప రాజ్యములు, మరియు అటువంటివి రావడము నేను చూశాను. మరియు అప్పుడు నేను చూడగానే, చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి తీయబడిన ఒక చిన్నరాయి ఉండెను, మరియు బబులోనులోకి దొర్లెను; కుమ్మరించబడెను; మరియు అది ఒక గొప్ప పర్వతమాయెను, భూమినంతటిని అది నింపెను.” అతడు చెప్పాడు, “ఆయన యేసుక్రీస్తు, సజీవుడైన దేవుని కుమారుడు,” దానియేలు, హల్లెలూయా!
99. బాప్తిస్మమిచ్చు యోహానును అడుగుదాం. ఆ యేసు చెప్పెను, “ఆయన ప్రవక్తలందరిలో గొప్పవాడు. యోహాను, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? అతడు అక్కడ నిలబడియున్నప్పుడు, యోహానును చూడండి. యేసు చెప్పెను, ”స్త్రీలు కనినవారందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు.“ ”ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? నీవు అక్కడే ఉన్నావు. నీవు ఆయన రెండవ సహోదరుడవు (దగ్గరి బంధువు). నీవు ఆయనను గూర్చి ఏమనుకొనుచున్నావు?
100.అతడు చెప్పినది ఇదే: “నేను ఆయనను ఎరుగను: కానీ ఆయన, అది, ఎవరి మీదనైతే ఆత్మదిగి వచ్చి మరియు నిలిచియుండుట నీవు చూచెదవో, అతడే పరిశుద్ధాత్మలోను మరియు అగ్నిలోను బాప్తిస్మమిచ్చువాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది,” అని అరణ్యములో నాకు చెప్పబడినది.
101.యోహాను, “ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
102.మరొక సాక్షిని మనము పిలిచెదము. ఆయన యొక్క తల్లి కన్నా మరియొక మంచి సాక్షి ఎవరూ జీవించియుండరని నేను నమ్ముచున్నాను. అది సరియే. “మరియ, ఆయనను ఇక్కడకు తీసుకొని వచ్చినది నీవే,” కన్యకయైన మరియను అడుగుదాం, “ఆయన ఎవరి కుమారుడు? మరియా, నీకు తెలిసియుండాలి. నీవు ఆయన తల్లివి,”
103.ఆమె చెప్పినది, “నేను ఏ పురుషుడినిఎరుగను.” హల్లెలూయా! “కానీ పరిశుద్ధాత్మ నన్ను కమ్మకొన్నది, మరియు చెప్పినది, ఆ పరిశుద్ధమైనది దేవుని కుమారుడని పిలువబడును.” దేవుని యొక్క కుమారుడని నేను నమ్ముచున్నాను. నీవు నమ్మటలేదా? అవునయ్యా ఆయన ఎవరి కుమారుడు?
104.ఆయన ప్రక్కలో పొడిచి, ఆయన రక్తము పొర్లికొని వచ్చుట చూచిన ఆ రోమను సైనికుడిని అడుగుదాం. “ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
105.అతడు చెప్పాడు, “ఖచ్చితముగా ఆయన దేవుని కుమారుడు.”
106.ఆయన శత్రువైన, యూదాను గూర్చి ఆలోచిద్దాం. ఆయన యొక్క శత్రువు ఏమి చెప్పాడో చూద్దాం. “యూదా, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
107.“ఓహ్,” అతడు చెప్పాడు, “నేను నిరపరాధియైన రక్తమును మోసగించాను. నాకు నేను ఉరి వేసుకొనునట్లుగా, నాకు ఒక తాడును ఇవ్వండి; మరియు ఇదిగో, కయపా, నీ డబ్బు. నేను నిరపరాధ రక్తమును మోసగించాను.”
108.ఆ దినమునకు గొప్ప వ్యక్తి, గొప్ప న్యాయవాది, గొప్ప తీర్పును ప్రకటించువాడగు, పిలాతును చూద్దాం. “పిలాతు? ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? నరకములో నుండి పైకివచ్చి ఇక్కడ లేవుము,” అని అతడిని అడుగుదాము.
109.నీవు చెబుతావు, “అతడు నరకములో ఉన్నాడా?”
110.ఖచ్చితముగా అతడు. అతడు ఇంకనూ ఉన్నాడు.
111.“నీవెందుకు దానిని చెబుతావు?” అని చెబుతావు.
112. నేను అతడికి తీర్పు తీర్చడము లేదు, కానీ అతడి యొక్క ఫలముల వలన అతడు తెలుసుకోనబడును. అది సరి.
113.“పిలాతూ, అక్కడ కూర్చొని, ఆయనను గూర్చి నీవు ఏమనుకొను చున్నావు?”
114. అతడు చెప్పాడు, “ఓహ్, ఒకరోజు నేను అక్కడ కూర్చొన్నాను: ‘ఆయనలో ఏ తప్పిదమును నేనుకనుగొనలేదు.”
115. చూద్దాం. ఒక్క క్షణం దృశ్యమును మార్చివేద్దాం. అతడు కేవలం అక్కడ నిలబడియుండడం నేను చూస్తున్నాను, చూస్తూ, చుట్టూ చూస్తూ, అతడి యొక్క కోపపు కళ్ళు ఆయనను చూస్తూ, ఆయనలో ఏదో తప్పిదమును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. అప్పుడు అతడు కైసరు వద్ద నుండి మొప్పు, లేక అటువంటి దానిని పొందెదనని అతడు తలంచాడు.
116.ఒక గుర్రము రావడం నేను విన్నాను. దానిని వినండి. అది రాగలిగినంత వేగముగా, అది రోడ్డుపై వస్తున్నది. అది ఏమిటి? అది ఆలయమును కాయు దానిలో ఒకటి. అతడు దానిపై నుండి దుమికాడు, దానిని విప్పాడు, పిలాతు ముందుకు పరుగెత్తాడు, తనకు తాను సాష్టాంగపడ్డాడు, మరియు ఒక పత్రమును అందించాడు. చూద్దాం. పిలాతు, ఆ పత్రమును తెరిచాడు, దానిని చదవడం ప్రారంభించాడు. అతడి ముఖము పాలిపోయినది, అతడి కళ్ళు నిగ్రహించుకొన్నాయి, అతడి మోకాళ్ళు కలిపి కొట్టుకొనుచున్నవి. సంగతి ఏమిటి? అతడి భుజముపై నుండి చూస్తూ మరియు అదేమిటో చూద్దాం.
117.అది అతడి భార్య నుండి, “నా ప్రియమైన భర్త,” ఒక అన్యురాలు, ఆమె, “నా ప్రియమైన భర్త, ఆ నీతిమంతుని యందు ఏ దోషమునూ లేదు: ఎందుకనగా నేటి దినమున అతడిని గూర్చి కలలో మిక్కిలి బాధపడితిని.” అతడి ముఖము పాలిపోయినది, అతడి ఎముకలు పట్టుతప్పాయి, అతడి మోకాళ్ళు ఒకదానితో ఒకటి కొట్టుకొనుచున్నవి, ఆ గొప్ప తీర్పును ప్రకటించువాడు. “పిలాతు, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?”
118.“నా చేతులు కడుగుకొనుచున్నాను.”
119.“లేదు, నీవు ఎన్నడూ చేయలేవు. ఆయన ఇంకనూ నీ చేతులలోనే ఉన్నాడు.”
120.ఈ మధ్యాహ్నము, ఆయన ప్రతీ వ్యక్తి యొక్క చేతులలో ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క వర్తమానము విన్న ప్రతీ ఒక్కరి చేతిలో అది సరియే.
121. ఓహ్, మై ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? ఆయన ఎవరి కుమారుడు? ఎందుకు, జన్మలో, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన యొక్క జన్మలో నీవు దానిని నమ్ముచున్నావా? ఆయన జన్మలో, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జ్ఞానములో ఇటువంటి వ్యక్తివలె ఏ మనుష్యుడు మాట్లాడలేదు. నీవు దానిని నమ్ముచున్నావా? త్యాగములో, ఆయన పరిపూర్ణుడు; మరణములో, ఆయన ఒక విమోచకుడు. ఆయన లేచినప్పుడు ఆయన దేవుడని రుజువు చేసుకొనెను. హల్లెలూయా! అది నిజము. నేనే ఉన్నవాడను అని ఆయన చెప్పాడు. ఆయన ఇక్కడ భూమిపైనున్నప్పుడు, ఆయన నేనే దేవుడనని చెప్పాడు. ఆయన దేవుని వలె కనిపించాడు, ఆయన దేవుని వలె వ్యవహరించాడు. ఆయన దేవుని వలె ప్రసంగించాడు. ఆయన దేవుని వలె లేచాడు. ఆయన దేవుడైయున్నాడు. హల్లెలూయూ! ఇమ్మానుయేలు శరీరములో తెర తొలగించుకున్నాడు, ప్రజల మధ్యన నడుస్తున్నాడు. ఆయన దేవుడైయున్నాడు, ఇమ్మానుయేలు. ఆయన తండ్రిని నెరవేర్చియున్నాడు. కాలముల గుండా గొప్పవారిని మరియు కవుల యొక్క హృదయములను ఆయన రంజింపజేశాడు. మరియు అల్పమైన వారిగా ఎంచబడిన ప్రతీ ఒక్కరూ కూడా, ఆయనే దేవుని యొక్క కుమారుడని ఆయన యందు నమ్మిక యుంచియున్నారు.
122.ఒకసారి, “ఈ చిన్న గుంపు ప్రజల మధ్య నీవు ఏ విధముగా నిలబడుచున్నావు.” అని స్టోన్ వాల్ జాక్సన్ అడగబడ్డాడు. మరియు “వ్యతిరేకత అంత ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ విధముగా ఎలా నీవు నిలబడగలుగుచున్నావు?” అతడు తన బూటును నేలను తన్నియున్నాడు. అతడు చెప్పాడు, “నేను దాని కొరకు యేసుక్రీస్తుకు వందనములు తెలియజేయునంత వరకూ, ఒక్క గ్లాసు నీళ్ళు కూడా నా పెదవుల పైకి వెళ్ళవు. అందుకే.”
123.వ్యాలీ ఫోర్డ్ ముందు జార్జి వాషింగ్టన్ మోకాళ్ళపై.
124.విభిన్నమైన (వేరే) వారు కూడా మీకు తెలుసు.
125. కవిని అడుగుదాం. “ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు?” ఆయన కవుల యొక్క హృదయములను రంజింపజేసెను. ఈ రోజు, అడుగుదాం, “ఎడ్డీ న్యూటన్, ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావు? న్యూటన్, ఏమనుకొనుచున్నావు?” ఒక రోజు అతడు ఒక గదిలో ఉన్నాడు; ప్రేరేపణ అతడిని తాకినది. “ఆయనను గూర్చి నీవేమనుకొనుచున్నావో చూద్దాం.”
126.అతడు ఒక కలమును తీసుకొన్నాడు. అతడు వ్రాసాడు: అద్భుతమైన కృప! ఎంత మధురమైన స్వరము, నా వంటి ఒకపాపిని రక్షించెను! ఒకప్పుడు నేను నశించాను, కానీ ఇప్పుడు నేను కనుగొనబడ్డాను, గ్రుడ్డివాడిని.

1,233 total views, 1 views today