50-0300 వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండానే ఇవ్వబడును

50-0300 వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండానే ఇవ్వబడును
కార్ల్స్బాడ్, న్యూ-మెక్సికో, అమెరికా

1.ప్రేక్షకులకు సాయంకాల శుభములు. ఈ రాత్రి ఇక్కడ ఉండుట నాకు గొప్ప ఆధిక్యతగా ఉన్నది. నేను ఎల్లప్పుడును న్యూ-మెక్సికోకు వచ్చుటకు ఇష్టపడుచున్నాను. విదేశాలకు వెళ్ళు ముందుగా ఇక్కడకు వచ్చుటకు దేవుడు నాకు అనుమతి ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మేము ఇక్కడ అయిదు రాత్రులు ఉండి మీ కొరకు మేము చేయగలిగినదంతా చేయుటకు గానూ ప్రభువైన యేసు నామములో మీకు పరిచర్య చేయ వచ్చితిమి.
నేను దీనిని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళగోరుచున్నాను. కారణమేమిటంటే దేశమంతా ప్రయాణించి అతి విస్తారముగా మాట్లాడుటవలన నా గొంతు కొద్దిగా బొంగురు పోయినది. బహుశ ఒక వారము మేము బాగా వేడిగానున్న ప్రాంతములోను, మరియొక వారము బాగా చల్లగా ఉన్న ప్రాంతంలోనూ మరియు నిరంతరముగా పగలు మరియు రాత్రి మాట్లాడుట వలననూ భంగురు పోయినది.
ఇక్కడ ఉన్న దేవుని యొక్క ప్రజలకు ఇది ఒక గొప్ప సమయముగా ఉoడునని నేను నమ్ముచున్నాను. మేము ఇక్కడ ఉండగా నాకు తెలిసినంత మట్టుకు ఎలాగు ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప కూటమును దయచేయునో అదంతా చేసెదను. ఆయన ఆత్మ వచ్చి బాధలలో ఉన్న వారిని వ్యాధిగ్రస్తులందరిని స్వస్థపరచును గాక…? మరియు ఇక్కడ కూటములు జరుగుచుండగా, ఎవరైతే ఇంకనూ ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా దేవుని యొక్క నిబంధనలోనికి రాలేదో వారు ఈ గొప్ప దీవేనలను పొందుకొని రక్షించబడుదురు గాక.
2.కూటము ముగించబడినతరువాత ఇక్కడ ఆ పాత కాలపు ఉజ్జీవము ఈ దేశమంతటిని తుడిచిపెట్టునని నేను నమ్ముచున్నాను. ఫలితముగా ప్రతి వ్యక్తి కొత్త అగ్నిని కలిగియుండును. మనము ఒక భయంకరమైన దినములలో జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను, అయినను ఒక ఆశ్చర్యమైన…. యేసు రాకడకు ముందు.
వారు నా యొద్దకు వచ్చు ముందుగా కొద్ది నిమిషములు, నా చిన్న కుమారునితో మాట్లాడినప్పుడు, నా కుమారుడు చెప్పెను, “నాన్న, యేసు వచ్చునప్పుడు అది ఎలాగు ఉండును?”
నేను చెప్పాను, “మనకు తెలియదు.” మనము ఎప్పుడు, ఏది చేసినప్పటికిని అది మహిమకరముగా ఉండునని నాకు తెలుసు. వారిలో ఒకాయన ఇలాగు చెప్పెను, “దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్దపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, లేక మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనము చేయగలిగినది ఒకే కార్యము, ఆయనను ప్రేమించుటయు మరియు నమ్ముటయు మరియు క్రమక్రమముగా ఆయన తనంతట తానే మనకు బయలుపరచుకుంటాడు. నీవు దానిని నమ్ముచున్నావా?
3.మరియు ఇప్పుడు చాలామంది ప్రజలు వార్తా పత్రికలోనూ మరియు మొదలైన వాటిలోనూ, నేను గమనించాను నన్ను ఒక దైవిక స్వస్థపరచువానిగా, ఇక్కడ పిలుచుచున్నాడు. ఎందుకు, క్రైస్తవ స్నేహితులారా, అది తప్పని మీకు తెలుసు. నేను దైవిక స్వస్థపరచువాడను కాదు. నేను మీ యొక్క సహోదరుడను. ఇప్పుడు ఒకే ఒక్క స్వస్థపరచువాడున్నాడు, మరియు అది దేవుడై యున్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే స్వస్థపరచువాడు.
ఒక స్వస్థపరచు వరము నిన్ను దైవిక స్వస్థపరచువానిగా చేయజాలదు. అంతేకాకుండా బోధించు వరము నన్ను దైవిక సంబంధమైన రక్షకుడిగా చేయజాలదు. అది ఒక వరము. ఇప్పుడు, వరము తన కొరకు తానే మాట్లాడును, దేవుడు ఏదైనా చేసినట్లయితే దాని గూర్చి నీవు సిగ్గుపడనవసరం లేదు. లేదా ఎక్కడో దానికి మార్గము ఉండునని నమ్ము, ఎందుకంటే దేవుడు ఆయన వరమును గూర్చి ఆయనే స్వయంగా రుజువు చేయును. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అని నేను నమ్ముచున్నాను. హెబ్రీ 11:2లో చెప్పెను, దేవుడు ఆయన వరములు గూర్చి ప్రత్యక్ష సాక్షిగా నిలుచును. ఒక మనిషి ఏదైన పలుకవచ్చు, ఒక వ్యక్తి ఒక మనిషి ఏదైనా చెప్పుట ఒక విషయం అయితే, దేవుడు మరేదైనా చెప్పినట్లయితే అది ఏదో ప్రత్యేకముగా ఉంటుంది. మరియు నేను దేని గూర్చి అయినా సాక్ష్యం పలికినట్లయితే, దేవుడు దానిని, వెనుక ఉండి నిరూపించనట్లయితే, అప్పుడు ఏదో తప్పుచేసినట్లే. ఇక నీవు నేను అంతే. నీను మీకు ఏదో తప్పు చెప్పినట్లే, కాని నేను మీకు ఏదైనా చెప్పినట్లయితే మరియు దేవుడు దానిని ఆ విధముగా ఉండునని రుజువు పరచినచో అప్పుడు మీరు ఆ విధంగా నమ్మవచ్చు. కారణము ఆ క్రియలే ఆ విధముగా చెప్పును. అది దేవుడని మీరు నమ్ముడి.
4.ఇప్పుడు, ఈ క్రియల మార్గము ఎవరో స్వస్థపరుట కాదు, ఈ భూమి మీద జీవించెడి ఏ మానవుడూ ఒక దైవిక స్వస్థపరచువాడుగా లేడు. ఎవరైనా స్వస్థపరచు స్థానము యొక్క ఘనతను తీసుకొనగోరినయెడల, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాని ఆయన స్వస్థపరచేది నేను కానని చెప్పెను. ఆయన చెప్పెను, “ఈ క్రియలు చేసేది నేను కాను, తండ్రి నా యందు నివసించుచూ ఆయనే, తన క్రియలు చేయుచున్నాడు.” ఆయన స్వస్థపరిచే స్థానము యొక్క ఘనతను తీసుకోకుండా, స్తుతులన్నియూ తండ్రికి చెల్లించెను. అయితే మర్త్యులమైన మనము ఇంకా ఎంత ఎక్కువగా చెల్లించవలసియున్నది. కేవలము దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు, ఇది నాకు ఎంత అసాధరణముగా ఉన్నదో మీకు కూడా అంతే.
నా నమ్ముకము ఏమనగా, పిలుపులు మరియు కృపావరములు మారుమనస్సు లేకుండానే ఇవ్వబడును. అవి దేవుని యొక్క వరములు, అనగా అవి ఈ భూమి మీద దేవుని యొక్క ముందస్తు జ్ఞానము వలన జన్మించెను. అవి నేను ఏవో కోరినవి కావు; అవి నాకు నేనుగా ఏవో పనిచేయడము కాదు లేక మీకు మీరుగా పనిచేయడము కాదు. అది ఏమిటనగా ఆయన ముందస్తు జ్ఞానములో ఆయన ఏమి చేసెనో అది అయి ఉన్నది.
5.ఆకారములో నేను చిన్నవాడుగానూ లేక నీలిరంగు కన్నులతో జన్మించు విషయంలో నేను సహాయము చేయలేను, కాని ఇది దేవుడు నన్ను ఈ విధంగా ఇక్కడకు తీసుకుని వచ్చెను. నేను ఒక వేళ మరోలా… నన్ను చెప్పనివ్వండి; నేను ఆకారములో ఒక పెద్ద మనిషిలా ఉండగోరుచున్నాను. కాని దేవుడు నన్ను పెద్దమనిషిగా ఉండాలని భావించలేదు. నేను ఏ విధంగా ఉండాలో వాస్తవంగా ఆయనకు సరిగా తెలుసు. వాస్తవముగా ఆయనకు తెలుసు కావున ఆలాగు ఉందును. దేవుడు నన్ను ఏ విధముగా చేసెనో అలాగు ఉండుట యందు తృప్తిపడుచున్నాను. ఈ భూమి మీద నేను జీవించుచుండగా ఈ శరీరముతో నాకు తెలిసినంత వరకు ఎంత శ్రేష్టముగా ఆయనను మహిమపరచాలో అలాగు చేసెదను. ఒకవేళ ఆయన నన్ను ఆకారములో పెద్దవానిగా చేసిన యెడల నేను అలాగు ఉందును. మరియు ఏదైనా చేయుటకు ఆయన మనలను పంపినప్పుడు, మంచిది, మన హృదయమంతటితో చేస్తూ ఆయన ఏదైతే మన కొరకు చేసెనో దానితో ఆయనను మహిమపరచవలసియున్నది.
వరము తనంతట తాను ఏదీ చేయజాలదు. విశ్వాసము ద్వారా తప్ప దేవుని నుండి ఏ వ్యక్తియు దేనినైనా పొందుటకు వేరొక మార్గము లేదు. దేవుడు దానిని తన మార్గముగా చేసెను; అది ప్రారంభము నుండియూ ప్రజలు దేవునిని విశ్వాసము ద్వారా నమ్ముట అయి యున్నది. అది ఆదాము మరియు హావ్వలకు దేవుని వాక్యమును నమ్ముట కొరకు ఇవ్వబడినది. ఎప్పుడైతే హవ్వ దేవుని వాక్యము పై అవిశ్వాసము చూపినదో అది మరణమును, దుఃఖమును మరియు వ్యాధిని తీసుకుని వచ్చి దేవునిపై అవిశ్వాసమును కలిగించినది.
6.యేసు చెప్పెను, “నీవు నమ్మినయెడల, నేను చేతును.” ఇప్పుడు దేవుని నమ్మే క్రమములో ప్రజలు ఏదో కొంత కంటికి కనబడే దానిపైపు చూస్తూ దేవునికి బదులుగా ఉండు ఒక దానిని చూస్తున్నారు. నేను నమ్ముచున్నాను దేవుడెన్నడైనా చేసే అత్యంత కఠినమైన కార్యాలలో ఒక కార్యము ఏదనగా ఒక మానవుడు మరొక మానవుడును నమ్ముటయే. మనము ఒకరిని మరొకరు నమ్మజాలము. మరియు మనము దేవుని యొక్క ప్రతినిధులమని మనకు తెలుసు. తారువాత ఆయన పైకి ఆరోహనమైనప్పుడు ఆయన కృపావరములను మనుష్యులకిచ్చెను. ఒక మనుష్యుడు స్వస్థపరచు ఒక గొప్ప వరమును పొందుకున్నాడు. ప్రజలు అతని నీడలో పడుకోబెట్టినప్పుడు వారు స్వస్థపరచబడ్డారు. మనుష్యుడు కాదు, కాని ఆ మనుష్యునిలో ఉన్న దేవుని యందు వారి విశ్వాసము. మీరు గ్రహించారా?
ఇప్పుడు, స్వస్థత కొరకు దేవుడు ఎప్పుడైతే మొదటిగా ఒక ప్రతిమను చేసెనో, అదీ అరణ్యములో ఒక స్థంభము మీద వ్రేలాడుచున్న ఇత్తడి సర్పమైయున్నది. అది నిజమేనా? అరణ్యములో ఇప్పుడు ఆ స్థంభములో గానీ, ఇత్తడిలో గానీ ప్రభావము (శక్తి) లేదు. అయితే అది దేవుని యొక్క నియమము మరలా ఆయన అది ఎలాగు పనిచేసెనని కేవలము ఎవరికినీ తెలియదు. అది కేవలము విశ్వాసము ద్వారా చూచుట అయి ఉన్నది. అది ఏదో ఒక దానిని సూచిస్తుంది; అది యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి మన పాపములను, వ్యాధిని మోయునని ముందస్తు ఛాయాను సూచిస్తుంది.
7.ఆ సర్పము యొక్క దినములైన తరువాత, దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపి బెతెస్థ అను కోనేటి నీరును కదల్చమనెను, మరియు ఎవరైతే విశ్వాసము కలిగి ఆ నీటిలో మొదటిగా అడుగు పెడతారో వారు ఏ వ్యాధి కలిగియున్నపటికి స్వస్థపరచబడెదరు. [టేపులో ఖాళీ ఉన్నది.] నీటిలోనికి….
ఇప్పుడు, ఇత్తడి సర్పము సస్థపరచలేదు. అది దేవుడు ఇత్తడి సర్పము ద్వారా చేసిన కార్యమునందు వారు విశ్వాసముంచుట అయి ఉన్నది. అది నిజమేనా? నీరు స్వస్థపరచలేదు. అది దేవుని యొక్క దూత నీటిని కదుల్చుట ద్వారా వచ్చిన స్వస్థత. చూడండి, నీరు “నేను స్వస్థపరచే నీరునని” చెప్పజాలదు. లేదు, అది స్వస్థపరచేది దూత అయి ఉన్నది. ఆ దూత వెళ్ళిపోగానే ఆ నీరు, నీరు మాత్రమే.
8.ఒక మనుష్యుడు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునేంత వరకు కేవలము మనుష్యుడుగానే నివసించును. మరియు సమర్పించుకున్న దైవత్వము ఆ మనుష్యుని యందు నివసించును. అదియే పరిశుద్ధాత్మ, మనుష్యుడు కాడు, కాని దేవుడు మనుష్యునిలో ఉండి పనిచేయును కావున యేసు, తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయన కన్యక ద్వారా ఒక మనుష్యునిగా జన్మించెను. ఆయన తల్లి మరియ; ఆయన తండ్రి యెహోవా దేవుడు. అది మీరు నమ్ముచున్నారా? మరియు దేవుడు ఆ శరీరములో నివసించెను. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరచుచుండెను. యేసు చెప్పెను, “ఈ కార్యములు చేయునది నేను కాదు, తండ్రియే నాలో ఉండి చేయుచున్నాడు అనేను. ఆయనే ఆ పని చేసెను,” అది దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడుట, మృతులను లేపుట, జలములను నిశ్చలముగా చేయుట, మరియు మొదలైన కార్యములు.
తారువాత ఆయన పైకి ఆరోహనమైనప్పుడు ఆయన కృపావరములను మనుష్యులకిచ్చెను. ఒక మనుష్యుడు స్వస్థపరచు ఒక గొప్ప వరమును పొందుకున్నాడు. ప్రజలు అతని నీడలో పడుకోబెట్టినప్పుడు వారు స్వస్థపరచబడ్డారు. మనుష్యుడు కాదు, కాని ఆ మనుష్యునిలో ఉన్న దేవుని యందు వారి విశ్వాసము. మీరు గ్రహించారా?
9.ఇంకొకరు, వారు అతని శరీరము నుండి చేతి రుమాలు మరియు బట్టలు తీసికొని మరియు రోగల మీద ఉంచినప్పుడు ప్రజలలో నుండి దురాత్మలు వెళ్ళిపోయెను. అది పరిశుద్ధ పౌలు అని కారణము కాదు, ఆయన మీవలే మరియు నావలె రక్తమాంసములో జీవించిన మనుష్యుడు మరియు ఆయన మృతి నొందెను, మనవలె ఆయన కూడా క్రీస్తు రక్తము ద్వారా విమోచన పొందవలసియున్నది.
అది స్వస్థపరచినది మనిషి కాదు; అది ప్రజల యొక్క విశ్వాసము ద్వారా ఆ మనుష్యునిలో ఉన్న దేవుని ఆత్మ స్వస్థపరచుచున్నది. అది నిజమేనా? మంచిది, అదే పరిశుద్ధాత్మ ఈ రోజు మనలో కూడా ఉన్నది. యేసు చెప్పెను, “నేను మీతోను, మీలోను యుగాంతము వరకు యుందును.”
10. ఒకవేళ నేను ఒక చిత్రకారుని ఆత్మ కలిగియున్నట్లు ఒప్పుకున్నట్లయితే, మీరు నా నుండి ఒక చిత్రకారుని యొక్క పనితనాన్ని కోరుకుంటారు. సముద్రం యొక్క ఘోషను, ఇంటిలో వస్తువులను, సూర్యాస్తమయము మొదలగు వాటిని దృశ్యరూపములో పట్టుకొనగలనని, చూపించగలనని మీరు కోరుకుంటారు.
జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఒకానొక గొప్ప చిత్రకారుని యొక్క ఆత్మ, నా మీదకు వచ్చినయెడల — ఏలియా ఆత్మ ఎలీషా మీదకు వచ్చినట్లుగా… ఒకవేళ ఏలియా ఆత్మ ఎలీషా మీదకు వచ్చినప్పుడు… ఏలియా ఏమి చేసెనో అతడు అదే చేసెను. మరియు బాప్తీస్మమిచ్చు యోహాను ఏలియా ఆత్మలో వచ్చినప్పుడు అతడు అరణ్యవాసిగా నుండెను మరియు మిగతా ఇద్దరివలే ఉండెను. కాని ఎపుడైతే…. ఇప్పుడు అతడు వచ్చెను…? ఏలియా చేసినట్లు చేసెను, అతడు అరణ్యములోనికి పరిగెత్తెను; మరియు యోహాను ఇలా అడిగెను, ఈయనే మెస్సయ్యానా లేక వేరొకని కొరకు ఎదురు చూడవలెనా. అతడు అదే ఆత్మలో వచ్చెను.
11.నేను ఒకవేళ జాన్ డిల్లింగర్ ఆత్మలో వచ్చిన యెడల, జాన్ డిల్లింగర్ వలే ప్రవర్తించునట్లుగా, మరియు నా వద్ద తుపాకులు ఉండునట్లు మీరు ఆశిస్తారు. మరియు ఒకవేళ నేను మీకు క్రైస్తవుడనని చెప్పి ఇక్కడకు అలాగు వచ్చిన యెడల మరియు క్రీస్తు ఆత్మ నా మీద ఉన్నది, మీరు నన్ను యేసువలే ప్రవర్తించునట్లు చేయునట్లుగా కోరుకుంటారు, కారణము ఆయన ఆత్మ నా మీద ఉండినందున. ఇది నిజమేనా? అప్పుడు ఆయన ఏమి చేసెను, “అయితే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు, వాటికంటే మరి గొప్ప కార్యములు చేతురు.” అది లేఖనమేనా?
ఇప్పుడు, క్రీస్తు ఆత్మ సంఘములో ఉన్నది. అది ఎన్నడునూ సంఘమును విడిచిపోలేదు. అది సంఘములోనే ఉన్నది. జ్ఞానము వలన దినములు చెడ్డవగుచున్నది. అది ఏదేను తోట నుండి పొందిన మనుష్యుని జ్ఞానము. ఎప్పుడైతే అతను జీవ వృక్షమును విడచి, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును తినుటకు వెళ్ళెనో, ఆ జ్ఞానము నిరంతరముగా పెరుగుచున్నది. మరియు జ్ఞానము అధికమగుట వలన వారు బైబిల్ నుండి దూరముగా వెళ్ళి, హేతువాదములోనికి వెళ్ళిరి. బైబిల్ లోపము లేనిది అని యేసు చెప్పెను. వారు వచ్చినప్పుడు… [టేపు మీద ఖాళీ ఉన్నది.] …… మరియు ఇపుడు, శక్తి వచ్చినది, లోకము చాలా సంశయవాది అయినది.
12.యేసు రెండవ రాకడ సమయమునకు ముందు ఘడియలో జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, దీనిపై క్రీస్తు యొక్క ఆత్మ ఇంకనూ సంఘములోనూ, ప్రజలలోనూ ఉండి మాట్లాడుచుండెను. ఎలాగు కృపావరము వచ్చి ఎలాగు పనిచేయునో నేను మీకు వివరింతును.
నేను ఒక దీన స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఒక కేథలిక్ గా జన్మించాను. నేను కెంటకీలో జన్మించాను.
వరములు మరియు పిలుపులు నేను చెప్పినట్లుగా, మారుమనస్సు లేకుండానే ఇవ్వబడును అని నేను నమ్ముచున్నాను. అది ఏదనగా నీవు ఈ కృపావరములతోనే ఈ లోకములో జన్మించియున్నావు. సరిగ్గా నీవు ఒక వాయిద్యకారునిగా జన్మిస్తే ఎలాగు ఉంటావో అలాగున, నీవు నీ పిల్లవానికి అన్ని రకముల పాఠములను నేర్పించవచ్చు. కాని వానిలో వాయిద్యమును వాయించు జ్ఞానము లేనియెడల అది నీకు ఏ మాత్రము మంచి చేయదు. అది సరియేనా? కాని మారుమనస్సు లేకుండా దేవుని యొక్క పిలుపులు మరియు వరములు కలిగి, ఆత్మ సంబంధమైన రాజ్యములో అదే విధముగా జన్మించియున్నాము. దాని ద్వారా యేసుక్రీస్తు దేవుని యొక్క ముందస్తు నిర్ణయమని మీరు తెలిసికొనుట అయి ఉన్నది. ఏదేను తోట నుండి ఆయనే ఒకనిగా ఉండుటను చూచుచున్నాము. మీరు దానిని నమ్ముచున్నారా?
13. బాప్తిస్మమిచ్చు యోహాను, యెషయా 712 సంవత్సరాలు ముందుగానే జన్మించునని, అతడు అరణ్యములో కేక వేయు ఒక స్వరమని, ముందుగానే చెప్పెను. అది నిజమేనా?
యిర్మియా, దేవుడు యిర్మియాకు, “నీవు తల్లి గర్భములో నుండి బయలుపడక మునుపే నేను మిమ్మును ఎరిగితిని. మరియు నిన్ను ప్రతిష్టించితినని మరియు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించియున్నానని చెప్పెను.” తన తల్లి గర్భము నుండి అతను ఎన్నడు బయలుపడక మునుపే, మోషే మరియు ఇతరులు దేవుని చేత ముందుగా నియమింపబడిరి. ప్రతి ఒక్కరు కాదు, కాని ప్రజలకు పరిచారకులుగా ఉండుటకై నానావిధములైన వరములు మరియు పిలుపులు అనేవి దేవుని యొక్క ముందస్తు నిర్ణయమైయున్నవి. ప్రజలు వచ్చి మరియు దానిని చూచునట్లుగా, అది మాత్రమే మార్గమని అర్థము చేసుకొనునట్లు నేను ఆశించుచున్నాను.
14. నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు మొదటి సంగతి. దానిని నా పుస్తకములో కలిగి యుంటిని, అది త్వరలోనే బయటకు వచ్చును. నేను మొదటిగా జన్మించినపుడు ఆ ఉదయమున ఒక చిన్న గదిలో ఏమి జరిగినదో నా తల్లి యొక్క సొంత మాటలు ఇవి నేను ఎన్నడూ నా సొంత సామర్థ్యము ద్వారా రాలేదు. నీవు కూడా ఎన్నడూ నీ సొంత సామర్థ్యము ద్వారా రాలేదు. నేను వచ్చుచున్నప్పుడు నాకు ఎన్నడు తెలియదు. నేను ఎప్పుడు పోవుదునో నాకు తెలియదు. మనలో ఎవరికిని తెలియదు. ఈ రాత్రి ముగియక మునుపే మనలో కొంత మంది ఈ లోకమును విడచి వెళ్ళవచ్చు. నాకు అది తెలియదు.
అయితే నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు; ఒక బావి నుండి నీళ్ళు మోసుకొని వెళ్ళుచుండగా, ఒక పొదలో సుడిగాలి వలే ఒక పొద నుండి ఒక స్వరము. నాతో ఈలాగు మాట్లాడెను, “పొగ త్రాగవద్దు, లేక మత్తు పానీయము త్రాగవద్దు, నీ శరీరము ఏ విధముగానైనను అపవిత్ర పరచుకొనవద్దు. నీవు పెద్దవాడవైనప్పుడు, నీవు చేయవలసిన ఒక పని ఉన్నది.”
నేను చెప్పాను, “అది పవిత్రమైనది.”
15. నా జీవితకాల ప్రయాణమంతటిలోను, అది ప్రతి సమయములోనూ వచ్చెను. నేను ఆ స్వరమును వినకలిగేవానిని. అది ఏదో నీవు ఒక ఊహించునది కాదు, లేక నీవు కనే కల కాదు, కాని సహోదరుడా, అది మీరు నా స్వరమును వినుట ఎంత నిజమైనదో అంత నిజమైనది.
మరియు తరువాత నేను పెద్దవాడనైన కొలది ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చెను…?.. ఆయన నిలువబడి ఉండుటను నేను చూచేవాడిని. అది ఒక దర్శనమునకు వెళ్ళుచుండెను. మరియు నేను జరుగబోయే సంగతులను చూచేవాడిని. మరియు అది ఒక నాటక రూపములో కనపరచబడేది. అది సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడేది కాదు.
నేను ఒక సంఘానికి చెందినవాడను కాదు. నేను పరిశుద్దమైన నీతిగల జీవితమును జీవించితిని, కాని సంఘము కాదు. చివరకు నేను ఒక బాప్టిస్టు సంఘము యొక్క ఫలానా విశ్వాసమునకు చెందినవాడనైతిని. అది ఆ పరిచర్యలో ఉన్నది.
16.కొంతకాలము తరువాత, నేను సంపూర్ణ సువార్త ప్రజలను కలుసుకుంటిని. మరియు నేను దానికంటే ముందుగా నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకుంటిని. మరియు తరువాత అది ఇంకా ఎక్కువగా వచ్చుటను కనబడినది. దాని తరువాత నది మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఒక్కసారి బహుశా పదివేలమంది జనుల మధ్యలో బాప్తీస్మమిచ్చుచుండగా, నేను నిలిచియుండు స్థలములో ఒక గొప్ప ఉదయ నక్షత్రము వలే ఆయన ప్రత్యక్షమాయెను. వేల కొలది దానిని చూచిరి. ఆయన మరలా ఆకాశములోనికి తిరిగి వెళ్ళిపోయెను.
ఒకసారి నేను బోధిస్తున్నాను, మరియు నేను బోధించుచుండగా, ఆ గదిలోనికి భౌతికముగా అది వచ్చెను. ఆయన పలుమార్లు అలాగు చేసెను. కొన్ని వారముల క్రితము టెక్సాస్, హూస్టన్ నందు ఇక్కడకు ఆయన దిగి వచ్చునప్పుడు ఒక ఛాయచిత్రములను తీయువాడు, ఆ సమయములో ఉండి తీసిన చిత్రములో అది పట్టబడినది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న ఉత్తమమైన వారిచే అన్ని రకముల పరీక్షలు చేయబడి, శాస్త్రీయముగా ఆ అతీతమైన జీవి దేవుడని రుజువు చేయబడెను.
17.ఏమి జరిగినదో ఇక్కడ చెప్పెదను, నేను ఆయనను కలుసుకున్న సమయమప్పుడు నేను కూర్చుని ధ్యానించుచుండగా, ఆయన ఒక మనుష్యుని వలే నాకు కనబడెను, ఆయన వచ్చెను… నేలమీద అంతటా ఆ వెలుగు వ్యాపించుటను నేను చూచితిని. ఆయన నడుచుకుంటూ నా వద్దకు వచ్చెను. 200పౌండ్ల బరువు కలిగిన ఒక మనుష్యునివలె ఆయన కనబడెను. మరియు ఈ వెలుగు సరిగ్గా నా మీద ఉండెను. మరియు ఆయన తన చేతులను ముడుచుకుని ఉండెను. నీవు మర్త్యులైన వారి ముఖములో చూడలేనిది ఆయన ముఖములో కనబడుచుండెను. ఆయన చూచుటకు నిశ్చలముగానూ మరియు యద్దార్థముగానూ, మిక్కిలి ప్రేమగాను ఉండెను. ఎప్పుడైతే ఆయన మాట్లాడెనో, ఆయన స్వరము నా జీవిత ప్రయాణమంతయు నాతో మాట్లాడిన ఆ స్వరమేనని నేను కనుగొంటిని, కాని నేను ఎన్నడును ఆయన ముఖము చూడలేదు. ఆయన నల్లటి ఛాయ గల మనిషిగా ఉండెను. యూదులైన ప్రజలు స్పానిష్ ల వలే ఎక్కువగా ఉండెను. ఆయన తన చేతులు ముడుచుకుని ఉండెను. మరియు చూచుటకు 200 పౌండ్లు బరువు మరియు ఎత్తు కలిగి ఉండెను. ఆయన భుజముల వరకు తల వెంట్రుకలు కలిగి, మృదువైన ముఖము కలిగియుండెను.
మరియు ఇంకా ఆయన నడుస్తున్నప్పుడు, అక్కడ ఒక అధికారమును కలిగినవాడై మరియు ఆయన ఏదైనా చేయగలుగునట్లుగా కనబడెను. మరియు నేను అక్కడ కూర్చొనియున్నాను. నేను ఎంతో భయపడితిని, ఎలాగనగా నేను నా చేతి వ్రేళ్ళను కొరకుచుంటిని. అలాంటి దానితో ముఖాముఖిగా నిలబడి యుండుటను. కేవలము ఊహించుకొనండి, నేను నా చేతి వేళ్ళను కొరుకుచుంటిని, తరువాత నేను వెళ్లితిని…
18.ఆయన చెప్పెను, “భయపడకుము.” ఎప్పుడైతే ఆ స్వరం పలికినదో అదే వ్యక్తి అని నాకు తెలుసు. ఆయన నా వైపు చూచెను. ఆయన కన్నులు నా మీద దయచూపునట్లుగా ఉండెను. ఈ దూత సానుభూతిగా చూచుట కాదు గానీ, “భయపడవద్దని చెప్పెను.” మరియు ఈలాగు చెప్పెను, “నీవు ఒక అసాధారణమగు జన్మ జన్మించితివి అని నీతో చెప్పుటను దేవుని యొక్క సన్నిధి నుండి నేను పంపబడితిని మరియు నీ యొక్క అసాధారణమైన జీవితం ఏమి సూచిస్తుందంటే, నీవు దైవిక స్వస్థత అను వరమును లోకములో నున్న ప్రజలకు తీసుకుని వెళ్ళుదునని చెప్పెను.
నేను చెప్పాను, “అయ్యా, నేను విద్య లేనివాడను నేను వెళ్లలేను.”
ఆయన చెప్పెను, “ఒకవేళ నీవు వారిని నిన్ను నమ్మునట్లుగా చేసినయెడల మరియు నీవు ప్రార్ధించునప్పుడు యధార్థముగా ఉండినయెడల, నీవు ఒకవేళ వారిని నిన్ను నమ్మునట్లుగా చేసినయెడల, నీ ప్రార్థన ఎదుట ఏదియూ నిలువజాలదు.”
మరియు నేను చెప్పాను, “అయ్యా, వారు నన్ను నమ్మరని నేను సవాలు చేస్తున్నాను.”
ఆయన చెప్పెను, “ప్రవక్త మోషేకు సూచనలు ఇచ్చినట్లుగా, నీకు రెండు సూచనలు ఇవ్వబడును. దాని ఫలితము ప్రజలు ఇది నిజమని నిన్ను నమ్మునట్లుగా చేయును. ఆయన చెప్పెను, ”వాటిలో ఒకటేదనగా, ఒక వ్యక్తి యొక్క కుడి చేయిని నీ ఎడమ చేతితో పట్టుకున్నప్పుడు, వారి వ్యాధులను కనుగొందువు.“ ఆయన చెప్పెను, ”తరువాత ఒకవేళ నీవు నీష్కపటముగా యుండినయెడల ఇవి జరుగును. నీవు వారి యొక్క హృదయ రహస్యాలు బయలుపరచగలవు మరియు వారు ఏమీ తప్పిదములు చేసితీరో, వాటిని బయలుపరచగలవు. దాని ద్వారా విశ్వాసము ఉంచుటకే ప్రజలలో అది విశ్వాసము కట్టును. దేవుడు ఈ సూచనలు నీకిచ్చి పంపించెనని రుజువు చేయబడి నిన్ను విశ్వసింతురు.“
19.నేను చెప్పాను, “అయ్యా, నేను – నేను విద్య లేనివాడను, మరియు నేను – నేను వెళ్ళలేను.”
ఆయన చెప్పెను, “నేను నీతో ఉందును.” ఆ వెలుగు పైకి కొనిపోబడడము ప్రారంభమాయెను; ఆ దూత ఆ వెలుగుతో వెళ్ళిపోయెను.
నేను ప్రారంభించాను, అనేక రోగులను స్వస్థపరచెను. ఒక రాత్రి నేను నా చిన్న సంఘములో కూర్చొనియుండగా, నా పియానో వాయిద్య కారుడు వాయించుచుండగా, ఇంతకు ముందెన్నడూ నేను వినలేదు, ఆ చిన్న పాట “కేవలము నమ్ముము” అలా నేను నా సంఘములో నడస్తుండగా ఏదో నన్ను తాకినది. [టేపులో ఖాళీ.] నా మాటలు… [టేపు మీద ఖాళీ ఉన్నది.]
20. నేను ఒక ప్రాదమిక పాఠశాల విద్యను కలిగియుండుట కాదు. పదిహేను సంవత్సరముల నుండి బోధించుచు పోషించబడుటకై పట్టణములో స్థానిక గేమ్ వార్డెన్ గా పనిచేయుచు ఉండినప్పుడు, మీకు తెలియును. మరియు…? నేనెప్పుడు నా జీవితంలో ఎన్నడునూ నా కొరకు కానుకలను తీసుకొనలేదు, నేను ఎన్నడు అలా చేయలేదు. నేను దానిని నమ్మను, అయితే నేను – నేను జీవించుటకు పని చేసితిని, మరియు..?.. ఒకవేళ కాదు – ఒకవేళ నాకు ఇవ్వబడిన ధనమును తీసుకున్నయెడల, ఆ కానుక పట్టుబడిన కారణమును బట్టి, అయినను ఇంకను దేవుడని ఆ కానుకను నేను కలిగి ఉండాలా లేదా అని అడుగుదును.
ఇప్పుడు, ఇక్కడ కొంత కాలం క్రితం ఎవరో కోరినారు; నేను ఒక చేవర్లే మోటారు వాహనము కలిగియున్నాను. నా ఫోన్ మ్రోగెను. ఎవరో నాకు ఒక కాడిలాక్ కారును కొనవలెనని కోరినారు. నేను బయట దానిని వెతికెను. అర్కాన్సాస్ నుండి వచ్చెను….?… పురుషుల బయట ప్రేక్షకులుగా ఉన్నారు. ఆ పేద ప్రజలు వారి వెనుక గోనే సంచులు తగిలంచుకొని, దూదిని తీయువారు, మరియు ప్రార్థన వరుసలోనికి ఒక చిన్నదానితో వచ్చుచుండగా…? బహుశా కొద్దిగా కార్న్ రొట్టెను తినియుండవచ్చును…?.. రాత్రి సమయంలో, నేను ఆ రహదారి గుండా వచ్చు చుండగా….?.. మీరు అది గ్రహించారా..?.. స్నేహితులారా, నేను దాని కొరకు రాలేదు. నేను మీకు సహాయము చేయుటకు వచ్చితిని. నేను ఇక్కడ ఉన్నది అందుకొరకే, మీకు సహాయము చేయుటకు.
21. “నీవు దేవుని యందు విశ్వాసముంచవలసియున్నది కదా?” అని చెప్పుటకు బదులుగా, “మీరు నాయందు విశ్వాసముంచుచున్నారా?” అని ఇది చెప్పుటలో నాకు వింతగా కనబడుచున్నది. ఒకవేళ ప్రజలు నన్ను నమ్మినట్లు చేయగలిగినయెడల, అని ఆయన నాతో చెప్పెను. నీవు అది తప్పక నమ్మాలి. నీవు దేవునిని తప్పక నమ్మాలి మరియు క్రీస్తును నమ్మాలి మరియు పరిశుద్ధాత్మను నమ్మాలి. వాటన్నిటిని నమ్మిన తర్వాత దేవుడు నన్ను నమ్మవలెననని కోరుచున్నాడు. కాని తరువాత నీవు చేయుటకు కొంత యున్నది. ఇప్పుడు, నీవు ఒక మనిషిని నమ్మవచ్చు, అయినను వరము నీ కొరకు పని చేయదు. కారణము ఈ దినమున ప్రజలు దేవునిని నమ్ముచున్నారు. అది ఇప్పటికి యేసే. అది నిజము కాదా? ఆయన చెప్పెను, “మీరు దేవుని యందు విశ్వాసముంచిన ప్రకారము, నా యందునూ విశ్వాసముంచుడి.” అది ఆయన చెప్పలేదా?
“దేవుని యందు విశ్వాసముంచులాగున నా యందునూ విశ్వాసముంచుడి.” ఆయన సహాయము చేయుటకు అదొక్కటే మార్గము, కారణము వారు నమ్ముచున్నారు. ఇప్పుడు వారిలో ఒకనివలే నన్ను మీరు నమ్మవలెనని కోరుచున్నాను. కాని మీకు, “ఆ దినము” సమీపించినదని మీరు నమ్మవలెనని నేను కోరుచున్నాను. అప్పుడు నేను చేయగలిగినంత సహాయము మీకు చేసెదను.
22.ఇప్పుడు, నా ప్రజల కొరకు ఒక మాట. దయచేసి, నీవు ఎలాంటి పాపము చేసిన పరవాలేదు, ఇక్కడ వేదిక వద్ద అది తెలియపరచబడును. మొదటి వరము… అదే వరము యొక్క మొదటి ప్రత్యక్షత అయి యున్నది. అది చాలా మంది జనులకు రెండు లేక మూడు సంవత్సరముల నుండి తెలుసు; అది ఇంకను పనిచేస్తూనే ఉన్నది. అది నేను వ్యాధులను కనుగొనుచున్నాను…?.. ఒక వైద్యునివలే, నీకు అది సంభవించినప్పటికినీ, అది అదే కార్యమై ఉంటుంది. కాని అది నిన్ను స్వస్థపరచలేదు. అది నీ విశ్వాసమును వృద్ధిచేస్తూ ఒక అతీతమైన వ్యక్తి ఇక్కడ నిలబడి ఉన్నాడని తెలియజేస్తుంది.
తర్వాత దాదాపు మూడు సంవత్సరముల పిదప, కెనడాలో ఐదునెలల క్రింత మరియొక వరము క్రిందికి వచ్చి ప్రత్యక్షపరచబడినది. మీరు చేసిన కార్యములను మీరు ఒప్పుకొనిన పాపమును, మొదలగువాటిని హృదయ రహస్యాలను ఇప్పుడు నేను చెప్పగలుచున్నాను. చూడండి, అది ఎంతో సంపూర్ణమైనది, ఎందుకనగా అది దేవునిది.
ఇప్పుడు, అది నిన్ను స్వస్థపరచలేదు. కాని అది ఏమి చేసినదంటే, యేసును గురించి మనము మాట్లాడుకొన్న దానికంటే మరియు పాస్టరు గారు బోధించిన దాని కంటెను ఇందులో మాత్రమే ఆయనను మరింత ఎక్కువగా నీవు విశ్వసించినట్లు చెప్పుచున్నది. మరియు ఆయన యందు విశ్వాసముంచుటకు…? మనము ఎలాగు వివేచించగలము…? క్రిందకు వచ్చి మరియు నీ కొరకు చనిపోయెను.
23. ఆయన మన యతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను; మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను; మన సమాధానార్థమైన శిక్ష ఆయనపై పడెను; ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడితిమి. అది ఆయనే. నేను ఒక మార్గము మాత్రమే. నేను మీలో ఒకరివలే మానవుడను. నా ముందు కూర్చొనియున్న ఈ సహోదరులోని కొందరి వలే దేవుని రాజ్యములో నేను సగము మట్టుకు కాదు. బహుశా వారు ప్రేమించబడినట్లు, నేను ప్రేమించబడలేదు, కారణము కాలమునకు బయట జన్మించాను. నాకు మత సంబంధమైన వెనుకటి గాధ ఏమీ లేదు. మరియు నేను దీనికంటే ముందు చాలా సార్లు దేవుని నుండి పారిపోయాను…?
ఒక్కసారిగా ఆయన శరీరము యొక్క కార్యములను నేను చూసినప్పుడు, సరిగ్గా దేవుని వలన జరిగినదే. ఈ నా జీవితము కొరకై నేను మాత్రమే సంతోషించుచున్నాను. నా జీవితములో నేను ఆయన కొరకు చేయవలెనని ప్రణాళిక వేసుకున్న కార్యములు చేసెదను. దాని ద్వారా జనులకు సహాయపడుటకై ఆయన వరము ద్వారా తన ప్రజలను ఆశీర్వదించబడునట్లు నా భావము, మీరు చూశారా?
24. ఇప్పుడు, ఎప్పుడైతే ప్రజలు ఈ వరుసలోనికి వచ్చి, వారి యొక్క వ్యాధులను మరియు వారి ఆలోచనలను తెలుసుకొనుటను బట్టి ఎవరో ఒకరు ఆశ్చర్యపడవచ్చు… అవి నాకు తెలియదు. ఇప్పుడు నీవు ఇక్కడకు రావచ్చు, కొద్ది క్షణాల తరువాత, కాని అది నాకు తెలియదు. ప్రభువు యొక్క దూత నా వద్దకు వచ్చినప్పుడు, అది దేవుని యొక్క వరమైయున్నది. బహుశా వెనుకాల నిలబడియున్న అదే దూత, అదే కార్యము చేయుచుండవచ్చు; నాకు తెలియదు. కాని యేసు వచ్చినప్పుడు… ఇప్పుడాయన ఇక్కడున్నాడని నీవు తెలిసికొనవలెను, ఇప్పుడు మనము ముంగించు ముందుగా ప్రార్థనా వరుసను ప్రారంభించుచుండగా…
యేసు, ఎప్పుడైతే ఆయన మొదటిగా భూమి మీద ప్రజల వద్దకు మొదటిగా ప్రత్యక్షపరబడినపుడు, నతానియేలు లేక ఫిలిప్పు అను పేరు గల ఒక వ్యక్తి ఉండెను. ఆయన నతానియేలు అను పేరుగల వ్యక్తిని కనుగొనెను. అతను ప్రార్థించుచుండెను. మరియు ఫిలిప్పు నతానియేలుతో చెప్పెను, “మేము ఎవరిని కనుగొంటిమో నీవు వచ్చి చూడుము. మోషే చేప్పిన నజరేయుడైన యేసు,” అని చెప్పెను.
అతను చెప్పెను, “నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా?”
“ఓ,నీవు వచ్చి చూడుము,” అని చెప్పెను.
25. మరియు ఎప్పుడైతే వారు ఆ స్థలము వద్దకు వచ్చినప్పుడు… ఇంకొక మాటలో, ఒక సత్యము అనేది వస్తే ఎక్కడో గొప్ప సాంప్రదాయకమైన సంఘములో నుండి రావలసియున్నదని అర్థం. కాని చాలాసార్లు దైవజనులు సరిగ్గా ఒక వింతైన మార్గములో వచ్చుట కనుగొందుము..?.. కాని నేను…?.. వారి ఆలోచనలు తెలిసి, మరియు ఆయన పసిబాలురువంటి నేర్చుకొనువారికి ఆయన వాటిని బయలుపరచెను. మీరు దానిని నమ్ముచున్నారా? దేవుడు దానిని చేయును…
మరియు ఎప్పుడైతే అతడు యేసు ఎక్కడ ఉండెను అక్కడకు వచ్చాడు, యేసు అతనిని చూసి, “ఇదిగో ఇతడు నిజముగా ఒక ఇశ్రాయేలీయుడై యున్నాడు, ఇతనియందు ఏ దోషము లేదనెను.” మరొక మాటలో సామాన్యతలో ఆయన చెప్పెను, “నీవు ఒక క్రైస్తవుడవు, ఒక సమర్పణ గలవాడవని,” చెప్పెను.
ప్రార్థనా వరుస వద్ద నతానియేలు ఆయనతో ఇలాగు చెప్పెను;
అతడు చెప్పెను, “రబ్బీ, నీవు నన్ను ఎప్పటి నుండి ఎరిగితివి?” నతానియేలు, నీవు ఇక్కడకు రాకమునుపు, ఆ చెట్టు క్రింద ఉండి ప్రార్థించునప్పుడు,“ అని ఆయన చెప్పెను.
మరియు ఆ చిన్న యూదుడు పరుగెత్తుకొని, ఆయన వద్దకు వచ్చి చెప్పెను, “నీవు ఇశ్రాయేలు రాజువైన దేవుని కుమారుడవు.” అది నిజమేనా? [టేపులో ఖాళీ ఉన్నది.]….. అతని వరకు తెలుసుకొనుట, అతడు ఒక క్రైస్తవుడని తెలుసుకొనుట, అతని వరకు తెలుసుకొనుట. అది ఏమి తెలియజేస్తుందంటే, అది యేసుకు, దేవునికి మరియు నతానియేలుకు తప్ప వేరొకరికి తెలియదు; వేరొకరు లేరని అతనికి తెలుసు…?.. అది తెలుసు.
26. ఇప్పుడు, ఇది… యేసుక్రీస్తు మీద నున్న అదే ఆత్మ, ఈ రాత్రి అదే కార్యము చేయుటకు మనము హక్కు కలిగియున్నాము. అది నిజమేనా? అలాగు జరుగునా? బావి వద్ద ఆ స్త్రీ, ఆయన ఆమెతో మాట్లాడుటను మీరు ఊహించగలరా? నతానియేలు వలే, ఆమె ఆయనతో సంభాషించినది. మరియు చివరకు ఆయన చెప్పెను, “నీవు వెళ్ళి, నీ భర్తను తీసికొని రమ్ము.”
ఆమె చెప్పింది, “నాకు ఎవరు లేరు.”
ఆయన చెప్పెను, “నీవు సరిగా చెప్పితివి, ఎప్పుడైతే నీకు ఎవరూ లేరని చెప్పితివో, నీవు ఐదుగురు కలిగి ఉన్నావని, మరియు ఇప్పుడున్న వాడు నీ భర్తకాడు.”
ఆమె చెప్పింది, “నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను.” ఆమె చెప్పింది, “మెస్సయ్యా వచ్చి మాకు అన్ని సంగతులు చేప్పునని.”
ఆయన చెప్పెను, “ఆయనను నేనే.”
ఇప్పుడు, యేసుక్రీస్తు, దేవుని ఆత్మ ఆయన పై యుండెను, మరియు ఒకవేళ నీవు… నేను క్రైస్తవుడనని చెప్పినట్లయితే, ఆయన చేసిన విధముగానే నేనును చేయునట్లు ఆయన ఆత్మ నా మీద ఉన్నదని చెప్పినట్లయితే, అది అదే కార్యమును ఉత్పత్తి చేయునా?
27.ఇప్పుడు, నిన్ను గూర్చి ఏ ఆత్మకైతే తెలుసునో నిలువబడి, కుంటితనము లేకుండా, లేదా గ్రుడ్డితనము లేకుండా, స్వస్థపరచబడకుండా ఎవరు వెళ్లరు. మరియు ఎప్పుడైతే అది ఒక….. ప్రత్యేకముగా ఇక్కడ జనుల మధ్య ఉండునో అపుడు మీరు… మంచిది, నాకు ఖచ్చితముగా తెలియదు, కాని నేను ఆయనను స్పర్శించగలిగిన యెడల, ఆయన తనంతట తాను తిరిగి మాట్లాడును, దానిని మనకై మనము చూచునట్లు అనుమతించును, మరియు దేవుడు దానిని దయచేయును గాక……
నేనొక బోధకుడను కాను లేదా ఒక గొప్ప అంతర్జాతీయ బోధకుడను కాను. అయితే నా హృదయమంతటితో – నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తును మీకు పరిచయము చేయుటకు ప్రయత్నము చేయచున్నాను.
28.చదువుటకు నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనములో మొదటిగా దేవుడు తన ప్రవక్త అయిన మోషేను పంపినట్లుగా కనుగొంటిమి:
ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
ఆయన సన్నిధిని గూర్చి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని… నేను చెప్పినది యావత్తు చేసినయెడల; నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై యుందును.
ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లును…
మోషే ఏమీ చేయలేదు. అది దేవుని యొక్క దూత అయి ఉన్నది. అది నిజమేనా? ఇశ్రాయేలీయులను నడిపించినది చూచుటకు ఎలాగు ఉండెను. రాత్రి వేళలో ఒక అగ్నిస్తంభముగాను, పగలు ఒక మేఘముగాను ఉండెను, ఆయన ఇప్పటికీ నడిపిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. అది నిబంధన దూత అని మనకు తెలుసు. అది నిజమేనా? అది ఒక లోగాస్ లేడా క్రీస్తుగా ఉన్నది. అప్పటి వలే ఈ రోజు కూడా జనులను నడిపించుటలో ఆయన అదే విధముగా ఉన్నాడు.
29.ఇప్పుడు మన తలలు వంచి యుండగా మన హృదయమంతటితో ఆయనను నమ్ముదుము. మా పరలోకపు తండ్రి, మేము నిజముగా మా హృదయంతటితో మిమ్ములను ప్రేమించుచున్నాము. మీరు మమ్ములను విమోచించినందుకు మీకు మేము ఎంతో కృతజ్ఞలము. ఒకానొక సమయములో దేవునిని కలిగిలేనప్పుడు, కృప లేకుండా మేము అన్యజనులుగా ఉన్నాము. అయితే నీ కుమారుడు యేసు భూమి మీదకు వచ్చి కన్యక గర్భములో జన్మించి మరియు మచ్చలేని జీవితమును జీవించి, మా కొరకు ఒక అర్పణగా కలువరి వద్ద అర్పించబడెను. ఆయన మన అపరాధముల కొరకు గాయపరచబడి, మరియు ఆయన గాయముల వలన మనము స్వస్థపడియున్నాము. ఓ, రక్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఈ రాత్రి రక్తము చేత మరియు ఆయన యొక్క నిత్యమైన ఆత్మ చేత వాక్యము ద్వారా కడుగబడి, మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా అగుటకు తీసికొని రాబడితిమి.
ఓ తండ్రి, దేవుని కుమారుడు మరియు కుమార్తెగా మేము ఆలోచిస్తే, ఈ రోజు కూడా వక్రబుద్ధి గలవారు మోషే అహరోనులు ఎదిరించినట్లుగా ఎదిరిస్తారు. ఓ, దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటకు పరిశుద్ధాత్మ శక్తిచేత మా జీవితములు రక్షించబడుటకు నడిపించబడి, పాపము నుండి పవిత్రపరచి, మరియు దేవునితో సంబంధమును మాకు దయచేయుము. మరియు మేము ఏమైయున్నామో అది ప్రత్యక్షపరచబడినప్పటికి, అయినను ఓ, మేము ఆయనవలే ఒక శరీరము కలిగియందుమని మాకు తెలియును, ఆయనను మహిమకరమైన, విమోచకుడైన, దివ్యమైన దేవుని కుమారుడిగా చూచుదుము. ప్రభువులకు ప్రభువు, రాజుల రాజుకు మేము కిరీటము ధరింపజేసెదము. ఓ, అది మా మీద ఊ౦దుము… [టేపు మీద ఖాళీ.]…….
30.దేవా, ఆయన యొక్క శక్తివంతమైన రెక్కలను ఈ భవనమంతయూ ఈ రాత్రులన్నియు చాచి మరియు ఆయన మహిమకరమైన మరియు కృపగల మంచు బిందువుల చేత కడిగి, స్వస్థతాశక్తి యేసుక్రీస్తు ద్వారా మా యొక్క మర్త్య శరీరములపై ఇక్కడ ప్రవహింపచేసి, కూటములు ముంగించులోపల ఏ ఒక్క రోగి మా మధ్య ఉండకుండునట్లు చేయును. గాక, ప్రభువా. దీనిని దయచేయుము. మేము నిన్ను ప్రేమించుచున్నాము. జనులు మా స్వరములను తెలుసుకొన్న దానికంటెను ఎక్కువగా నీవు మా హృదయములు ఎరిగినవాడవు. నీవు అన్ని కార్యములను గ్రహించువాడవని మరియు మేము నిన్ను ప్రేమించుచున్నామో లేదో యెరిగినవాడవు… ప్రభువా, ఇప్పుడు మాకు ఈ రాత్రి సహాయము చేయండి. ఈ భవనములో అనేకములైన పనుల కొరకు ఉపయోగించబడినది, తండ్రి, మేము ప్రార్థించుచున్నాము ఈ భవనమును మరియు మమ్ములను నీ సేవ కొరకు ప్రతిష్ఠించుచున్నాము. దాని ద్వారా ప్రతి అపవిత్రమైన ఆత్మను వెనుకకు వెళ్లగొట్టుము. ఈ కప్పు క్రిందకు వచ్చుచున్న స్త్రీలు మరియు పురుషులు ఒప్పుదల క్రిందకు వచ్చుదురు గాక.
దేవదూతలు ప్రతి స్థంభము వద్దనే ప్రతి కూర్చుండు స్థలమును ఈ ప్రదేశమంతట నిలుచుని మరియు వారి స్థానమును తీసుకొందురు గాక. ఓ దేవా, నీ యొక్క దైవసన్నిధిలో నున్న ప్రతి వ్యక్తి ఈ దేశములో ఎన్నడూ లేనటువంటి కూటమును ఇక్కడ కలిగియుండును గాక. ప్రతి సేవకుడు కూడా పురికొల్పబడును గాక, సంఘములో ప్రతి ఒక్కరు, క్రైస్తవుడు, పాపులు ఒప్పుదల క్రిందకు వచ్చెదరు గాక. మరియు అక్కడ జనుల మీద కృప ప్రవహించును గాక, వారు క్రీస్తు యొక్క జ్ఞానము వద్దకు వచ్చి అన్ని కాలాల్లోనూ ఉన్న ఆ గొప్ప క్రీస్తు యేసు స్వస్థపరచును గాక. తండ్రి, నీకు ఇవన్నియును సమర్పించుచున్నాను. నేను నిన్ను పిలుచుచుండగా, నీ దూతను పంపుము. ప్రభువా, నీ సేవకుడను అభిషేకించుము. నేను సాక్ష్యమిచ్చిన ఈ సంగతులను, ప్రభువా, నీవు తిరిగి ఈ రాత్రి మరియు ప్రతి రాత్రి గొప్ప సూచనలతోను, అద్భుతములతోను నిరూపించుదువు గాక. నీ జనులు నిన్ను నమ్మునట్లుగా ఇవన్నియు యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
31. నా సహోదరుడా, ఇప్పుడు ఈ కూటమును ఒక చిన్న ప్రార్థనా వరుసగా మార్చగోరుచున్నాను. అతడు…?.. మీ ప్రార్థన కార్డులను ఇక్కడకు తీసుకుని వచ్చును? [టేపు మీద ఖాళీ ఉన్నది]
మొదటి రాత్రి, ఒకలాంటి ప్రయాణము వలె ఉన్నది. ఇది ఎలాగో మీకు తెలుసా… మనకు సంబంధించిన వారందరు ఇక్కడ లేరు, మరియు ప్రతి ఒక్కరు….ఖచ్చితముగా.
ప్రతి వ్యక్తి ఎంత వినయముగా ఉండగలరో అంత వినయముగా ఉండాలని నేను కోరుచున్నాను. మరియు మీ పూర్ణహృదయముతో విని, మరియు ఆయన మీద విశ్వాసమును కలిగియుండుడి. మీరంతా……. దయచేయుము.
ఇప్పుడు, దేవుడు వేదిక వద్ద స్వస్థపరచినట్లయితే, నన్ను ముందుకు సాగనిచ్చును….. మరియు ఆయన చేయును…. ఆయన అక్కడే స్వస్థపరచును. సరిగ్గా అదే కార్యమును తీసుకొని – అది… మరియు ఆయన చేయగలడని మీరు నమ్మినట్లయితే…… మీరు దానిని నమ్ముటలేదా? అది మీ విశ్వాసము; అది అంతయూ అదే (చూచారా!) నమ్ముటకు విశ్వాసముంచండి.
32.ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తలలు వంచుదము. మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ కరుణ మరియు దయ కొరకు నీకు మా కృతజ్ఞతలు. మరియు ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ ప్రతి హృదయము గురించి తెలియునో, ఆయన వద్దకు నీ ప్రజలు ఇంక ఎక్కువ దగ్గరగా వచ్చుదురు గాక, విమోచింపబడిన వారందరును ఆయనకు తెలియును. నీవు నిజముగా ఆ సంగతుల గురించి అతనిని జనులతో మాట్లాడుటకు అనుమతిచ్చినట్లయితే, అప్పుడు వారి విశ్వాసము మీ వైపుకు ముడివేయబడి దానిని నమ్ముదురు. ప్రియమైన తండ్రి, దీనిని దయచేయుము, ఇవన్నియు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు, పియానో మీద సాగుచుండగా, “కేవలము నమ్ముము,” అనే పాటను నెమ్మదిగా వాయించుచుండగా, మీరు అందరూ మొదటిగా….. ఇప్పుడు ఈ విధముగా చేయగలరా, సహోదరిచాలా నెమ్మదిగా…
మరియు ఇప్పుడు, ప్రతి ఒక్కరూ మీ తలలు వంచమని నేను కోరుచున్నాను. కొద్ది సమయము మీ తలలు వంచి వినయముగా ఉండవలెనని కోరుచున్నాను, ఎందుకనగా నీవు ఎంతగా నమ్మడానికి ప్రయత్నిస్తున్నావనేది కాదు. అక్కడ కొంచెం నిరీక్షణ అనేది ఉన్నది…మరియు ఇప్పుడు మీరందరూ అలా ఉండగలరని నాకు తెలుసు… కొద్దిసేపు దేవుని ఆత్మలో కలవరపడకుండా వినయముగా ఉండుడి…మరియు వారందరూ విశ్వాసులు కారు… ఎక్కువగా ఆశలు ఉండుట అది ఏమీ. చేయుననగా కొంత కష్టతరముగా ఉండును. నేనెవరిని నమ్మునట్లుగా చేయలేను; దేవుడు చేయగలినయెడల మాత్రమే నేను చేయగలను… నీయంతట నీవు నమ్మినట్లుయితే దేవుడు నిన్ను అంగీకరించును. అది నిజము.
33. ఇప్పుడు, గుర్తుంచుకొనండి, జనులందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, ఎవరినైనను నేను స్వస్థపరచు యోగ్యత నాకు లేదు. ఇప్పుడైతే దానికొరకు మన హృదయములో ముందుకు చూచినట్లయితే అప్పుడు అది జరుగును. అది ఒక స్థలము వద్దకు వచ్చును. ఎక్కడైతే [టేపులో ఖాళీ… మాటలు తేటగా లేవు.]
నేను విడుదల చేయుటకు వచ్చితిని. నీవు ఏమి ఆ సంగతులు చెప్పవలసిన అవసరం లేదు…గ్రహింపు కలిగిన తరువాత ముందుకు సాగుడి మరియు నీవెక్కడ…ఇప్పుడు…ఇప్పుడు నిజముగా కేవలము నమ్ముము మర్త్యమైనది, అమర్త్యతగా అగును. మరియు ప్రభువా, ఈ మనిషి నిన్ను కనుగొనును గాక. నీకు ప్రార్థనా కార్డు ఉన్నదా…? యేసు అందరి యెడలను…అది గొప్ప ముసుగు…దేవుడు స్వస్థపరచునని వాగ్దానము చేసెను. నమ్మువారికి సమస్తమూ సాధ్యమే.
సాయంకాల శుభములు సహోదరీ…ఇంతకు మునుపు నీవు చాలా ఆరోగ్యముగానూ మరియు చాలా బలముగానూ ఉండేదానివి. అయితే నీలో ఏదో కీడు ఉన్నది. నీవు నమ్ముచున్నావా? ఇక్కడ ఇప్పుడు ఆయన సన్నిధిలో ఒక నిజమైన క్రొత్త అనుభూతి నీవు కలిగియున్నావు. అయితే ఏ ఒక్కరూ ఎన్నడునూ సమీపముగా రాలేరు. అది పరిశుద్ధాత్మ అభిషేకమైయున్నది. కాని వారు ఏమి అనుభూతి చెందుదురుఅది సరిగ్గా దేవుని దూత యొక్క సన్నిధి అయి ఉన్నది. ఈ రాత్రి ఆ దృశ్యమును చూచుటలేదా? అది ఏమిటంటే – ఇప్పుడు నీవు ఆ మార్గమును అనుభూతి చెందునట్లుగా అది చేయుచున్నది. నీవు నీ చేయిని ఆ విధముగా ఉంచినట్లయితే, అది సరిగ్గా ఒక స్పర్శ అయి ఉన్నది. ట్యుబర్ క్యూలోసిస్… నీ వయస్సు ఎంత? నీవు రక్షింపబడితివా? తండ్రికి సాధ్యము…నీ కొరకు…అయితే ఇప్పుడు నీకు ఎన్నడూ లేనటువంటి విధమైన ఎక్కువ విశ్వాసము నీవు కలిగియున్నావు. అది నిజము. దేవుడు చెప్పకుండా ఈ సంగతులు నాకు ఎన్నడూ తెలియవు. దేవుని దూత నిన్ను బాగుచేయుటకు ఇక్కడ ఉన్నాడు. ఆయన చేయగలిగిన యెడల, నేను దేవుని అడుగుదును. మనుష్యుడను కాబట్టి ఈ విషయమును నాకు చాలా వింతగా ఉన్నది. అయ్యా, అది నిజము కాదా? మరియు ఇప్పుడు నీవు గుర్తించగలిగినట్లయితే, చూడగలిగినయెడల, నీవు చేయగలవు….అన్ని సంగతులు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినయంతో ప్రార్థించుచున్నారా!
34.మా పరలోకపు తండ్రి, నీవు అతనిని బాగు చేయుదవని, మా సహోదరులు విశ్వాసములోనికి నిన్ను నమ్ముటకు ఇక్కడకు వచ్చియున్నారు. మరియు… చాలా కష్టపడి ప్రయత్నించారు, కాని ఈ రాత్రి ఆయన ప్రతి దానిని క్రిందనుంచుటకు అనుమతిచ్చెను. మరుసటి దినము నిన్ను నమ్ముటకు వారు సామాన్యమైన పిల్లలు వంటి విశ్వాసము కలిగి, వారు ముందుకు సాగుటకు నీవు ఎలాగు యేసుక్రీస్తు మహిమ కొరకు స్వస్థతను ఇచ్చి యున్నావో ప్రతి ఒక్కరికి ప్రత్యక్షపరచుము. ఇప్పుడు ఆయన కొరకు విశ్వాసముంచులాగున నాకు సహాయము చేయుము. ఇందునుబట్టి మేము కలిసి, చీకటి ఆత్మను వెళ్ళగొట్టుదుము. ఆమేన్,
దేయ్యమా, నీవు ట్యుబర్ క్యులోసిస్ అని పిలువబడుచున్నావు. నీవు ఈ వ్యక్తిని చాలా కాలము నుండి బంధించితివి, కాని నీ శక్తులన్నియు ఈ రాత్రి విరగగొట్టబడియున్నవి. నీవు యేసుక్రీస్తును ఎదుర్కొంటున్నావు. ఈ వ్యక్తిని విడిచిపెట్టమని మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాము. అతని నుండి బయటకు రమ్ము.
దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. శ్రోతలారా, మీ తలలు పైకెత్తుము. ఈ మనుష్యుడు స్వస్థపరబడెను….. స్నేహితుడా, దేవుడు నిన్ను దీవించును గాక. జనులలోనికి వెళ్ళుము.
35.దేవుని యొక్క ఆత్మ కోరిన సంగతులను, మీరు అవి పొందునట్లుగా చేయును. [టేపు మీద ఖాళీ ఉన్నది.]
ఆ సన్నిధి ద్వారా ఇది చేయబడెను. దెయ్యములు వెళ్ళిపోయెను. నీవు భాగానే ఉందువు.
ఇప్పుడు, ప్రతి ఒక్కరూ వినయముతో ఉండుడి. నేను ఇక్కడ ఉండవలసి ఉన్నది. [ఎవరో మాట్లాడుచున్నారు.] ఒక చిన్న బాలిక ఉన్నది. మన రక్షకుడు ఇక్కడ ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధ చేతులను ఆ స్త్రీ మీద ఉంచి, ఇప్పుడు నీవు ఆస్తమాను కలిగియున్నావు. మరియు గుండె నొప్పి కూడా ఉన్నది. ఏదో తప్పిదము నీవు గుండేలో ఉన్నది. చాలా మాధర్యమైన చిన్న అమ్మాయి. నీవు అంతటితో యేసును ప్రేమించుచున్నావా… చాలా మంచిది. ప్రార్థన చేయకుండానే అది ఇప్పుడు నిన్ను విడిచి వెళ్లిపోవును. నీవు స్వస్థపరచబడితివి. నీవు… దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.
36.మరొక రోగిని మీరు తీసుకొని రాగలరా… ఆ చిన్న అమ్మాయి కలిగి… గుండె సమస్య… ఇప్పుడు మీరందరూ అలా చేయగలరా?
మరియు ప్రియమైన సహోదరి, నీకు స్త్రీ వ్యాధి ఉన్నది. నీకు ఉబ్బస వ్యాధి మరియు కీళ్ళవాతము, కుంటితనము ఉన్నాయి. మరియు కీళ్లవాతము వెళ్ళిపోయినది. మీరు తలలు వంచుదురా…
ఓ దేవా, జీవమునకు కర్త మరియు ప్రతి మంచి ఈవులను ఇచ్చువాడా, ఎవరైతే ఆత్మతో బాధపడుచున్నారో, ఆ సహోదరి మీద నీ దీవెనలను ఉంచండి. మరియు దయను చూపండి. అందును బట్టి ఆమె ఈ జనుల ముందు నడుచులాగున దీవించండి. అయితే, ఓ, ప్రభువా, నీవు… నీవు దానిని స్వస్థపరచగలవు. నీకు ప్రతి ఒక్కరి హృదయ రహస్యము తెలియును. నీకు అన్ని సంగతులూ తెలుసు. మరియు నీవు మా యొక్క సహోదరి మీద దయ చూపుమని, స్వస్థపరచుమని నేను ప్రార్థించుచున్నాను. మరియు ప్రభువా, ఆమెను బాగుచేసి, ఆమెను బంధించిన ఆ దెయ్యము మీద నేను విశ్వాసము యొక్క అధికారమును కలిగి ఉండుటకు సహాయము చేయుము.
ఓ దెయ్యమా, దేవుని కుమారుడైన యేసు నామమున, మా యొక్క ఇద్దరి విశ్వాసముతో నీతో సవాలు చేయుచున్నాను. దెయ్యమా, నీవు ఆ స్త్రీలో నుండి బయటకు రమ్మని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. నిలువబడుడి…
యేసూ, దేవుని కుమారుడా, అయితే అది నీ సేవకుని విశ్వాసము యొక్క జీవితము మీద నుంచుము. మరియు నేను నీ కృప కొరకు వేడుకొందును..నీవు చేసిన దానిని బట్టి యుంచుము. నీవు స్వస్థపడుదువు గాక…

1,379 total views, 5 views today