50-0227 తన ప్రజలలో వున్న దేవుడు

50-0227తన ప్రజలలో వున్న దేవుడు
లిటిల్ రాక్, అర్కాన్సాస్, అమెరికా

1.నేను ఉపకారము పొందినచో. ఆ వ్యక్తి ద్వారా దేవుడు నాకు ఉపకారము దయచేసాడు అని నేను అనుభూతి చెందెదను. నేను మీ నమ్మకమును పొందుకొనినయెడల, నేను ఖచ్చితముగా చెప్పగలను. ఈ కూటము జరుగుచున్నప్పుడు ఏదో కార్యము జరుగును, అప్పుడు దేవుడు మనతో ఉన్నాడని మీరు అర్ధము చేసుకుంటారు.
ఇప్పుడు, “సహోదరుడు బ్రెన్ హామ్,దైవీక స్వస్థపరచువాడు,” అని అనేక మంది గొప్ప ప్రకటనలు చేస్తున్నారు, మరియు వార్తా పత్రికలలోను మరియు మేగజైన్స్ లోను మరియు అటువంటి వాటిలో మీరు చూడగలరు. మంచిది, అటువంటి విషయము ఏదీలేదు. ఏ వ్యక్తి దైవీక స్వస్థపరచువాడు కాదు. ఒకే ఒక స్వస్థపరచువాడు ఉన్నాడు, అతడు క్రీస్తు, మనుష్యకుమారుడు. దేవుడు, ఆయనే స్వస్థపరచువాడు.
మనుష్యులు కేవలం స్వస్థతకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు క్రీస్తుకు ప్రాతి నిధ్యం వహిస్తారు; వారు స్వస్థతకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించే ప్రతీ వ్యక్తి స్వస్థతకు ప్రాతినిధ్యం వహించాలి, ఏలయనగా ఆయనలో ఉండుటచే మనము స్వస్థపడియున్నాము.
2.మరియు అప్పుడు వారిలో అనేకులు, అవును, ఒక వరము అనే ఆలోచన యొక్క లోతును కొలవలేరు. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, “ఆయన పరలోకమునకు ఆరోహణమై మరియు మనకు ఈవులను అనుగ్రహించెను.” మరియు మనము చేయు ప్రతికార్యము అది పూర్తిగా లేఖనానుసారంగా వుండవలెను. ఒకవేళ అది లేఖనముపై ఆధారపడి లేనట్లయితే, అది సరైనది కాదు. కానీ ఏదైన లేఖనముపై ఆధారపడి వున్నట్లయితే నీవు దానిని వినవచ్చును. మరియు అది దేవుని ద్వారా అయివుంటే, దేవుడే దానిగూర్చి సాక్ష్యమిచ్చును. అది దేవుని ద్వారా కానియెడల దేవుడు దానిగూర్చి సాక్ష్యమివ్వడు. కేవలం మనుష్యులు మాత్రమే సాక్ష్యమిస్తారు మరియు దేవుడు కాదు. కాని అది దేవుడై వుంటే, దేవుడు తనకొరకు తానే స్వయముగా సాక్ష్యమిచ్చును.
రాత్రికి జనులు కూడుకొనక మునుపే, ఇక్కడ వేదికపై నుండి మీకు కేవలం కొంచెం ఇచ్చుటకై ప్రతీ మధ్యాహ్నము మనము కూటములను కలిగియున్నాము. జనులు తెలుసుకొనునట్లు కొన్ని విషయములను వివరించుటకు, సాధారణంగా మొదటి రాత్రి మాత్రమే తీసుకొనవలెను అని నేను తలంచాను, మరియు నాకు సహాయము చేయవలెనని నేను కోరుచున్నాను. ఈ కూటము నిమిత్తము మనము, మనలో ప్రతీ ఒక్కరూ తీర్పు దినమున సమాధానము చెప్పవలెనని నేను గ్రహించియున్నాను. దీనిగూర్చి నేను సమాధానము చెప్పవలెను. నేను ఏమి చెప్పియున్నానో దానిని గూర్చి నేను సమాధానము చెప్పవలెను. నేను ఏమి చేస్తున్నానో దానికి నేను సమాధానము చెప్పవలెను.
3.మరియు అప్పుడు, నేను మీ యొద్దకు క్రీస్తుని తీసుకొనివస్తే, ఆయన మీకు సమీపముగా ఉండును. నీవు దానిని క్రిందికి త్రోసివేసినను, లేక నీవు దానిని అంగీకరించినను దానియెడల నీవు తీసుకొన్న వైఖరిని బట్టి నీవే సమాధానము చెప్పవలెను. నీవు… ఈ కూటమును గూర్చి నీ వైఖరిపై దేవుడు నిన్ను సమాధానము చెప్పమనును, కావున ఇది బహు పవిత్రమైనది అని నీవు గ్రహించవలెను.
ఈ కూటమునకు సహోదరుడు లిండ్సే మరియు సహోదరుడు మూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారే నిర్వాహకులైయున్నారు.హోలినెస్ అను రెండు సంఘ శాఖలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాకై నేను, నేను ఏ సంఘ శాఖకు చెందినవాడను కాను. నేను ఒకప్పుడు బాప్టిస్ట్ను. మరియు వారి కోరిక మేరకు, ఇక నేను ఏ మాత్రము కాను, ఎందుకనగా నేను దైవీక స్వస్థతను, మరియు స్వస్థతా వరములను, మరియు పరిశుద్దాత్మ బాప్తిస్మమును ఉపదేశిస్తాను. మరియు అది సత్యము అని నేను ఎరుగుదును.
కనుక అక్కడ నుండి వారు నన్ను బయటకు పంపివేసినప్పుడు, హోలినెస్ వారు నన్ను అంగీకరించియున్నారు, మరియు ఆ పరము వారి సంఘమునకు వచ్చునట్లు వారు నలభై సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ నుండి ప్రార్ధిస్తున్నారు అని చెప్పారు, కావున నేను… నేను దేనికి సంబంధించినవాడనో అక్కడే దేవుడు నన్ను పెట్టాడు.
4.ఏ సంఘ శాఖకు వ్యతిరేకముగా నాయొద్ద ఏదియు లేదు, ఏలయనగా దేవుడు ఏ వ్యక్తిని పట్టించుకొనడు అనేది నేను చూడగలను. ఆయన మెథడిస్ట్ను, బాప్టిస్ట్ను, కాథలిక్ను, పెంతుకోస్తును, మరియు అందరిని స్వస్థపరచును. దేవుడు నీ సంఘ అనుబంధమును గౌరవించడు; ఆయన నీ విశ్వాసమును ఆశించును, ఆయన యందు నీ విశ్వాసమును గౌరవించును. ఆయన కనీసము… మరియు నీవు స్వస్థపడుటకు కనీసము క్రైస్తవుడివై వుండనవసరం లేదు. అయితే ఆ స్వస్థతలో నిలచియుండుటకు, నీవు క్రైస్తవునిగా మారవలెను. “మరి యొక్కువ కీడు నీకు కలుగకుండునట్లు, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు.” కాబట్టి నీవు…
విచక్షణా జ్ఞానం కలిగిన పరిశుద్ధులు, భక్తిపరులుగా నివసించేటి స్త్రీ మరియు పురుషులును ఆ ప్రార్ధన వరుస గుండా వచ్చి, మరియు స్వస్థత పొందుటలో విఫలం అవుటను అనేక మారులు నేను చూస్తుంటాను, అదే ప్రార్ధనా వరుస గుండా వీధులలో వుండు వ్యభిచారులు వచ్చి స్వస్థపరచబడుదురు. అది నీ విశ్వాసముపై ఆధారపడి వుండును.
బోధకుడు ఇక్కడ వున్న దినములలో, పరిశుద్ధులయిన యాజకులు, వారు పరిశుద్ధంగా ఉండవలెను. పరిశుద్ధముగా లేకుండా వారు యాజకులుగా ఉండలేరు. వారు వాక్యములో ఒక పండితుడై యుండాలి. ఏ వ్యక్తి కూడా వారి వైపు వేలెత్తి చూపే సాహసం చేయలేరు, ఎందుకనగా వారు పరిశుద్ధులు, నీతిమంతులు. కొన్ని సమయాలలో అన్యులు మరియు అవిశ్వాసులు, యేసును చూచినవారు మరియు ఆయన క్రియలు చూచి, దానిని నమ్మారు, ఆయన వారిని స్వస్థపరిచాడు; యాజకులు మరియు అటువంటి వారు స్వస్థపడలేకున్నారు, మరియు వారు ఆశీర్వాదం పొందుటలో విఫలమవుతారు.
5. అనేకులు ఆయనను అర్థం చేసుకున్నారు. సామాన్య ప్రజలు సంతోషముగా ఆయనను విన్నారు. మరియు ఈ రోజు వలె అది ఆ విధంగానే ఒక గొప్ప కార్యమై ఉన్నది. కాని నేను ప్రజలను గమనించాను; దాదాపు అన్ని సంఘ శాఖల వారు కూడికలకు హాజరయ్యారు. ఆర్టోడాక్స్ వారు, యూదులు, గ్రీకులు, కాథలిక్లు, మరియు అన్ని రకముల వారిని మేము కలిగియున్నాము. అయితే దేవుడు ఎన్నడు ఏ రకమైన సంఘ శాఖను గౌరవించడు; ఆయన వ్యక్తిగత విశ్వాసమును మాత్రమే గౌరవిస్తాడు. “నీవునమ్మినట్లయితే, నేను చేయగలను,” అని ఆయన చెప్పాడు.
మరియు అప్పుడు ఆయన చెప్పెను, “మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు.” కాబట్టి అందువలన, నీవు స్వస్థతను పొందుకొనుటకు, స్వస్థత పొందిన పిదప నీవు క్రైస్తవునిగా మారవలెను. మరియు నేను నమ్ముచున్నాను, నేను మాట్లాడితే దీనిని చెప్పెదను, రెండు ప్రాయశ్చిత్తములు గూర్చి నీవు స్వస్థపడినప్పుడు, నీ పాపములు క్షమించబడును. దీనిమీద అనేక ఎక్కువ ఆమేన్లు నాకు వినబడలేదు, కాని ఇది సత్యము. “మీ పాపములనుఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి.”
6.“మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు.” యేసు చెప్పెను, “నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, నీ మంచమెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అది అంతయు ఒకటే. మరియు నేను యాకోబు 5:14ని నమ్ముతాను, ”మీలో ఎవడైనను రోగియైయున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, అతడు పాపము చేసినవాడైతే పాపక్షమాపణ పొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయడి.“
ప్రతీ క్రైస్తవ సేవకుడి యొక్క విధి అదియే. ప్రతీ సువార్త సేవకుడు తన సమా జము కొరకు ప్రార్థన చేయు హక్కు కలిగియున్నాడు. దైవిక స్వస్థత అనునది ఏ ఒక వ్యక్తికో లేక ఏ ఒక గుంపుకో చెందినది కాదు. అది ప్రజలందరికి సంబంధించినది. దేశము గుండా వివిధ స్వస్థతా కూటములు కలిగియుండేందుకు ఆ స్వస్థతావరము ఇవ్వబడలేదు. అది వారికి సరియైనదిగా వుండవచ్చు, కాని దాని ఉద్దేశ్యము అదికాదు. ప్రతీ సంఘములో, అన్ని సమయములలో ప్రతిచోట, స్వస్థతా కూడికలు తప్పక కలిగి వుండవలెను.
7. ఈ కూటములపై అనేకమంది తప్పుడు అభిప్రాయము కలిగియున్నారు. అక్కడ సువార్తికుడు ఉన్నందుకు లేక అతడు వెళ్ళిపోయిన తరువాత ఎవరో ఒకరు రోగుల కొరకు ప్రార్థించుచున్నారు. వారితోనే స్వస్థతా ప్రభావము వెళ్ళిపోయినది అని వారు అనుకొందురు. దేవుడు భూమిని ఆవరించియున్నాడు. మీ పాస్టర్, ఇవి… మీ పాస్టరు, వలె …?.. “మీ పాస్టరు విషయమేమి,దానిని అతడు చేయలేకున్నాడు?”
మంచిది, స్నేహితులారా, అది తప్పుడు అభిప్రాయము. ఒక సువార్తికుడో, లేక ఏదైన వరము కలిగిన వ్యక్తి లేక మరేదైనా వారి ప్రార్థనలకు ఏ విధముగా సమాధానము ఇవ్వబడునో, మీ పాష్టరు దైవభక్తి కలిగిన వ్యక్తి అయితే అదే విధముగా అతని ప్రార్థనలకు సమాధానము ఇవ్వబడుతుంది. అతడు దేవుని యొక్క సేవకుడు మరియు ఆ విధము గానే అతనిని నీవు గౌరవించవలెను మరియు అతనిని నమ్మవలెను. మరియు దేవుడు అతని ప్రార్థనకు సమాధానము ఇచ్చును. “మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయుడి.” కొలత గలిగిన పరిశుద్ధాత్మను పొందుకొన్నవారు స్వస్థతా వరమును కలిగియున్నారు, ప్రతీ వ్యక్తి మాత్రమే కాదు, కొలతలో, చెట్టులో ఉన్న ప్రతీ ఆపిల్ పండు, వసంతములో అది ఆ వృక్షములోనే వుంటుంది అంతకు మించి కాదు. అది చిన్నపాటి కొమ్మగా భూమిలో పాతిపెట్టబడినప్పుడు, వృక్షములో ఉన్న ప్రతీ పూత, అంతయూ అప్పుడే అక్కడే ఆ చెట్టులోనే ఉండును.
8.ఆ పూత గాలిలో నుండి రాదు. ఆ పూత భూమిలో నుండి రాదు. ఆ పూత మునుపే (అప్పటికే) ఆ వృక్షములో వుండివున్నది. ఆ ఆపిల్ పండు దానిలో వున్నది. నేలలో ఆ చెట్టు నాటబడినది, మరియు అది చేయవలసిన ఒకే ఒక్క పని త్రాగుటై వున్నది. ఆ విధంగా త్రాగుతూ ఉన్నప్పుడు, మరియు దాని భాగము కంటే ఎక్కువ త్రాగవలెను, మరియు అది విస్తరించి బయటకు నెట్టుకుని వచ్చును. ఆ విధముగానే మనము తరిగిపోని జీవజలముల ఊట ద్వారా క్రీస్తుయేసు నందు నాటబడియున్నాము, మరియు మనము త్రాగుటను ప్రారంభించాము; మరియు ఎంత ఎక్కువగా త్రాగుదుమో, అంతగా మనము బయటకు నెట్టుకుని వచ్చెదము. అది నిజము. అది ఈ సంగతులను తెచ్చును.
మరియు దేవుడు ఏ వరము కొరకు నిన్ను పిలచియున్నాడో, మంచిది, కేవలము…. నీవు త్రాగకుండుటయే, దాని యొక్క సమస్య అయి ఉన్నది?అది నిజము. నీవు దానిని త్రాగవు. ఆయన… ఆయన తరిగిపోని జీవజలపు బుగ్గ అని నీవు నమ్మవా? “భూదిగంతములనివాసులారా, నా వద్దకు రండి మరియు త్రాగండి?
నీవు ఎంతగా వచ్చినను నీవు త్రాగనంత వరకు దయ్యము నిన్ను లెక్క చేయదు. చూశారా? నీవు వచ్చి మరియు త్రాగుము. అందుకోసమే ఈ కూటము ఇప్పుడు జరుగుతున్నది, నీవు త్రాగుట కొరకు.
9.స్వేచ్చగా ప్రతీచోటకి ప్రవహించుటకు ఇక్కడ ఒక బుగ్గ తెరవబడినది. నీవు ఇక త్రాగలేనంత ఎక్కువగా త్రాగుము. ఆ వృక్షము, ఒకవేళ దానికి కేటాయించినంతగా నీరు త్రాగినట్లయితే, ఎందుకు అది ఎల్లప్పుడు, ఇంకా నీటి కరువు కలిగియుంటుంది; అదే క్రైస్తవులతో వున్న విషయము. వారు చాలినంతగా త్రాగరు. నీవు విస్తరించి మరియు వేరొకరు నిన్ను చూచునట్లుగా నీవు త్రాగగోరుదువ. చూశారా? బయటకు నెట్టుకొని రమ్ము. ఒక సాక్ష్యము పొందుకొనుము. దానిని దేవునికి సమర్పించుము. దానిని విశ్వసించుము. దానిపై అడుగును వేయుము. దేవుని యొక్క వాగ్దానమును పొందుకొనుము. దానిని దేవునికి సమర్పించుము. దానిని విశ్వసించుము. “నీమార్గమును యెహోవాకు అప్పగింపుము.” నీవు కోరినదిఏదైన ఆయన నెరవేర్చును.
కాని నీవు దానిని పట్టుకొని వున్నంత కాలము. ఆయన దానిని చేయలేడు, “ఇప్పుడు, ఇది పనిచేయునేమో చూస్తాను, ఏదైన ఉత్తమముగా చేయగలనేమో చూచెదను అని చెప్చెదవు.” నీవు దానిని ఆయనకు సమర్పించుము; మిగిలిన దానిని గూర్చి మరచిపొమ్ము. వెళ్ళి ఇంకను నీవు చూడని ఈ కార్యములను గూర్చి సాక్ష్యమిమ్ము. నీవు దానిని విశ్వసించుము. అది నీవు చూచినది కాదు; అది నీవు విశ్వసించినది. అది నీవు అనుభూతి చెందినది కాదు. ఆయన ఎన్నడునూ, “నీవు దానిని అనుభూతి చెందావా?” అని అడగలేదు. “నీవుదానిని నమ్ముచున్నావా?” అని అడిగాడు.
ఆ విధముగానే విశ్వాసము ద్వారానే నీవు రక్షించబడియున్నావు. ఆ విధముగానే విశ్వాసము ద్వారానే నీవు స్వస్థపడ్డావు. రుచి చూచుట ద్వారానో, అనుభూతి చెందుట ద్వారానో, వాసన ద్వారానో, లేక వినుట ద్వారానో కాక, విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. నీవు కేవలము దానిని నమ్ముము. అది నీవు కలిగియున్నట్లుగా నీవు ప్రవర్తించుము. ఆమెన్.
10. నేను దానిపై ప్రారంభించితిని, బహుశా మనము పైన మరియు క్రింద ఎక్కడో ప్రార్ధన వరుసను కలిగియుందము, వారు కలిగియుందురు కదా? కాని మనము ఈ కూటములో చేయవలసినది అదే.
ఇప్పుడు కూటము ఏ విధంగా కొనసాగుతుందో గమనించండి. మనకు తెలిసినంతలో ఉత్తమముగా దీనిని నిర్వహించెదము. వారు… నా ఎక్కువ సమయమును ప్రార్థనలో గడిపెదను. నేను అలాగే చేయవలెను. నేను మునుపు ఇక్కడకు వచ్చినప్పుడు, కేపిటోల్ క్రింద, పెంతుకోస్తు సంఘము నందు, సహోదరుడు బ్రౌన్ తో కూటములను నేను కలిగియున్నప్పుడు, మేము తెల్లవారు వరకు ప్రార్ధించాము.
ఒక రాత్రి, ఆ సంఘములో ఏదో కార్యము జరిగియున్నది, అది నేను ఎన్నడూ చూడని ఒక విషాదకరమైన దృశ్యము, నేను దానిని గూర్చి దేశమంతటా సాక్ష్యమిచ్చాను. నేను దానిని గూర్చి తరువాత చెప్పెదను, బహుశా ఆ వ్యక్తి ఇక్కడ వుండవచ్చును. అది ఒక స్త్రీ తన వెనుక నేలమీద, క్రింది అంతస్తులో ఉన్నది. నేను ఆ రాత్రిని ఎన్నడునూ మరువను. నేను ఆశ్చర్యపోయాను, ఒకవేళ ఆ స్త్రీ ఈ భవనములో ఉంటే, నీ చేతిని పెకెత్తగలవా? ఆమె ఇక్కడ ఎక్కడైనా ఉండునని నేను ఆశ్చర్యపడ్డాను. కూటమునకు ఆమె వచ్చునేమో అని నేను ఆశించాను.
11.అయితే ఆ స్త్రీ తన వెనుక భాగముతో ప్రాకుచున్నది. ఆమె చేతిని ఇప్పటికి నేను చూడలేదు. ఆ మానసిక సంస్థలలో యవ్వన స్త్రీలు మలపాత్రను ఉపయోగించి ముఖము కడుగుకొనుటయు మరియు అన్నిటిని చేయుటయు నేను చూచాను, కాని అటువంటి విషాదకరమైనది ఏదీ నేను ఎన్నడునూ చూడలేదు.
మరియు ఆ సమయము నుండి ఎప్పుడు తలంచుతాను… అవును, నేను… నా పరిచర్య యొక్క వయసు కొద్ది నెలలు మాత్రమే. మరియు అప్పటి నుండి ఈ లిటిల్ రాక్ చుట్టూ వుండు ప్రజలు, కూటములకు స్పందిస్తారు అని ఎల్లప్పుడు నేను తలంచుతాను, అందుకే అప్పటి నుండి ఈ లిటిల్ రాక్ కు ఎల్లప్పుడు తిరిగి రావాలనుకుంటాను.
ఇప్పుడు, ఆ వరమునకు గొప్ప కార్యములు జరిగియున్నవి. మరియు వాటిని కొద్ది క్షణములలో మీకు వివరించెదను. అది మునుపటి కంటే గొప్పగా వున్నది. మరియు దానిని గూర్చి దేవుడు ప్రతీచోట సాక్ష్యమిచ్చుచున్నాడు.
12.ఇప్పుడు, పొందుకొనుటకు మధ్యాహ్నకాల సమయుమున కూటమునకు మేము వచ్చియున్నాము. ప్రతీవ్యక్తి పొందగలిగినట్లుగా నేను చేయాలి, ఒకవేళ మీరు ఆ పనిలో లేనియెడల మీరు చేయలేరు, మంచిది, మీరు మధ్యాహ్న కూడికలకు వచ్చి మరియు పురుషుల కొరకైన మధ్యాహ్న కూడికలకు మీరు హాజరుకండి, శ్రీ. లిండ్సే మరియు నిర్వాహకులు; స్వస్థతను చేరుకోవటం ఎలా అని వారు మాట్లాడతారు. మరియు అది మీకు మంచిది, అది మీరు చెయ్యవలెను, మరియు కూటమునకు సిద్ధపడవలెను.
మరియు అప్పుడు, మరొక కార్యము మీరు జ్ఞాపకముంచుకొనవలెనని, నేను కోరుచున్నాను, అది మనము కలిగియున్నాము, మనం త్వరత్వరగా ప్రార్ధన చేయు, ప్రార్థన వరుసలు అని పిలిచే ప్రార్థనా వరుసలను కలిగియుండేవారము. ఆ పాత ఫాస్ట్ లైన్స్ అని పిలిచే ఆ ప్రార్ధన వరుసలను ఎంతమంది జ్ఞాపకముంచుకున్నారు? ఓ, మై. నేను… మీకు దూరప్రాంతము నుండి ఇక్కడకు వచ్చే క్రొత్త వ్యక్తిని కాదు. కావున మనం కలిగియుండే ఆ ఫాస్ట్ లైన్స్ ఎన్నడునూ సరైనది అని రుజువు చేయలేకపోయినవి. మరియు నేను ఎప్పుడైతే… ఎప్పుడైతే దేవుడు వరమునకు ఇతర భాగమును జతపరిచాడో, ఇక ఫాస్ట్ లైన్స్ అనే ప్రార్ధన వరుసలు నేను కలిగియుండను అని నేను ఆయనకు వాగ్దానం చేసియున్నాను. మరియు ఒక నిజమైన స్వస్థత ప్రార్ధనా వరుస తప్ప మరి ఏదియూ మేము కలిగిలేము.
13.మరియు అనేక మారులు మనము ప్రజలకు చూపింప ప్రయత్నించెదము, మనము చేసెదము, అది విడువక మునుపే, ఒకవేళ ఆయన చేయును అని నేను నమ్మిన విదానములో ప్రభువు మనలను దీవించినట్లయితే, నేను మీ దేవునిచే రక్షింపబడిన కాపరులనందరిని ఈ కూడికలలో ఒకదానికి తీసుకురావాలని కోరుచున్నాను, కనుక మీ పాస్టరు దేవుని యొక్క సేవకుడని, మరియు మీరు దానిని నమ్మినట్లయితే, రోగుల మీద చేతులు వేయు అదే అధికారమును అతడు కలిగియున్నాడు అని జనులైన మీరు చూచెదరు.
ఇప్పుడు, ఇక్కడ ఆ విధముగానే మేము చేస్తాము. మనము క్రిందకు వద్దాం… నా సోదరుడు, భౌతికమైన సోదరుడు, అతడు ఇప్పుడు నౌకాదళములో నుండి వచ్చెను, నాలుగు సంవత్సరములు రెండవ ప్రపంచ యుద్ధములో గడిపి మిగిలిన జీవితమంతయూ పరిపూర్ణముగా పూర్తి వికలాంగుడిగా ఎన్నడును కదలలేక ఆ కుర్చీలో కూర్చొనే విధముగా న్యూయార్క్ లోని లాంగ్-ఐలాండ్ ఆసుపత్రిలో వుండగా మేము వెళ్ళాము, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నౌకాదళములోని ఒక ఉత్తమ వైద్యుడు, “నీ జీవితం ముగించబడినది, నీవు అట్లాగే అక్కడ పడివుండవలెను. నీవు ఎన్నడునూ అక్కడ నుండి లేవలేవు” అని చెప్పెను.
14.అతడి గుండెలోని మూడు కవాటాలు (వాల్స్) (కీళ్ళవాపు) జ్వరముతో మూసుకొని పోయినవి అతడు నిర్ధాంతపోయాడు: కోసాబ్లాంకా అను పట్టణమునకు వెళ్ళినప్పుడు మూడులో రెండవ భాగం కాన్వాయ్ (రక్షణకోసం వెంట వెళ్ళే వాహనాలు) దెబ్బతిన్నాయి. మరియు అతడు అరవలేని స్థితిలో, అక్కడ పడివుండి అతడు అరవగలిగినంత గట్టిగా కేకలు వేయుచున్నాడు, మరియు నా కోసము మరియు అమ్మ కోసము కేకలు వేయుచున్నాడు. మరియు అతడిని తీసుకొని వెళ్ళుటకు — అతడిని ఇంటికి పంపుటకు అమ్మ సంతకము పెట్టవలెను. మరియు ఇంటికి వెళ్ళు మార్గములో అతడు చనిపోతే అమ్మదే బాధ్యత.
మరియు అతడు ఇంటికి వచ్చినప్పుడు, “నా సోదరుడు నన్ను దాటుకొని వెళ్ళుటను నేను చూడగోరుచున్నాను,” అని అతడు చెప్పెను. అతడు ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యముతో ఇక్కడ ఉన్నాడు. అతడు ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళుటకు బదులు, అతడు బయటకు వెళ్ళి పనిచేసేవాడు. తరువాత ప్రభువు దాని కొరకు అతడిని సంధించి మరియు అతడిని తిరిగి వెనుకకు పంపాడు. కనుక ఇప్పుడు అతడు నాకు ఇక్కడ సేవలో సహాయపడుచున్నాడు.
15.ఇచ్చట ఈ విధంగా దానిని చేయుటకు మనము ప్రయత్నించెదము. మేము చేసెడివారము, వారి సమాజమునకు వాటిని ఇచ్చుటకై, మేము సేవకులకు కార్డులు (ప్రార్ధన కార్డులు) పంపుటకు ప్రయత్నించాము. మంచిది, అది కాపరుల మధ్య వాదనలకు కారణమయింది. ఒకని సమాజం…. మొదటి సేవకుడు తన సమాజము ప్రారంభించాడు, అది కూటమును ముగించేది, మేము అక్కడ ఉన్నప్పుడు, ఎందుకనగా మేము వేదికపై వారిని విడిచి పెట్టేముందు ప్రతీ వ్యక్తి స్వస్థతను పొందుకున్నాడు అని ఖచ్చితముగా మేము తెలుసుకునే వరకు మేము సమయమును తీసుకొనెదము. వారితో ఏ తప్పిదమున్నప్పటికీ పరవాలేదు, ఆ వ్యక్తి స్వస్థపడువరకు మేము వేదికపై వేచివుండేవారము. వారు ఎంత దయనీయముగా వుండినను అవిటితనము, వంకరపోవడము, చెవిటి, మూగ, గ్రుడ్డి, లేక వారు ఎవరైనప్పటికిని, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరచు వరకు మేము అక్కడనే వేచి వుండేవారము. మరియు అది పనిచేయకపోవడం మేము చూచాము.
16.మేము త్వరత్వరగా ప్రార్థన చేయు ప్రార్ధనా వరుసను కలిగియున్నాము. అది అక్కడ సరియైనది కాదు. మరియు ఇది మనము ఎన్నడూ కలిగిలేనంత ఉత్తమమైనది అని కనుగొన్నాము, ఎందుకనగా పరిశుద్దాత్మ ద్వారా అది నాకు బయలుపరచబడినది.
మేము సమాజము వద్దకు వెళ్ళాము. నేను నా సహోదరుడిని పంపేవాడను, మరియు అతడు ప్రతీదినము ఏభై ప్రార్థనా కార్డులు కలిగియుండేవాడు. మరియు ఆ ప్రార్థనా కార్డులు అతడు ఇచ్చేవాడు. మరియు ఆ ప్రార్థనా కార్డులు అతడు ఇచ్చేవాడు. మరియు ఒకటో నెంబరు, రెండో నెంబరు, మూడో నెంబరు అని వారిని (సంఖ్యను) కనుగొనేవారు, ఒకవేళ అది పదిహేను లేక ఇరవై దాటితే, మంచిది, తరువాత వారికి ఇకపై ప్రార్థనా కార్డులతో పని ఉండేది కాదు. మరియు వారు ఆ ప్రార్థనా కార్డుల కొరకు పరుగులు తీసేవారు, మరియు వారికి ప్రార్థనా కార్డు రానియెడల, అతడితో దాదాపు క్రూరముగా ప్రవర్తించేవారు, ముఖ్యంగా పెద్ద కూటాలలో ఎక్కడైతే అనేక, అనేక వేలకొలది హాజరవుతారో అక్కడ ఇలా జరిగేది.
17.అయితే మరి పరిశుద్దాత్మ నాతో మాట్లాడెను, మరియు నన్ను ఈ విధముగా చేయమన్నది. మేము యాభై ప్రార్థనా కార్డులు మాత్రమే ఇస్తాము, మరియు ఆ వరుస (సంఖ్య) ఎక్కడ నుండి ప్రారంభమవునో ఏ ఒక్కరికీ తెలియదు. నేను లోనికి వచ్చి మరియు ఒక చిన్న పిల్లవాడినో లేక ఆ వరుసలో అనేకులనో లేక అటువంటిది ఏదో, అనేకులను విభజించి మరియు ఫలానా సంఖ్య వద్ద ప్రారంభిస్తాను. మరియు అది ఆ వ్యక్తికి కూడా తెలియదు; నాకు కూడా తెలియదు; ఎవరికీ తెలియదు. మరియు అది ఎవరో… అది స్థానిక ప్రజలలో…
సాధారణముగా మేము స్థానిక ప్రజలకు మాత్రమే ఇచ్చేవారము. దూర ప్రాంతముల నుండి వచ్చే ప్రజలకు అవకాశము ఉండదు. బహుశా వారు కూటమునకు వచ్చుటకు వారి ఆవుని లేక వారు తయారుచేసుకొన్న వస్తువులు అమ్మివేసి ఉండవచ్చు, స్థానిక ప్రజలకు మాత్రమే తప్ప, వారికి ఏ మంచి జరుగదు. కావున దీనిని అందరికి మేము న్యాయము చేయవలెను. వాటిని ఎవరు పొందుతారో వారికి కార్డులను ఇచ్చివేయండి, అదంతయూ, సరే.
18.ఒక వ్యక్తి ఒకటో నెంబరు కలిగియుండవచ్చు మరియు వరుసలో మొదటివాడు అతడే అని తలంచును; అది నలభై వద్ద ప్రారంభము అవ్వవచ్చు. మేము వేదిక పైకి వచ్చువరకు అది మాకు తెలియదు, మరియు దేవుడే దానిని నిర్ణయించును గాక, వారిలో అనేకులను మేము ఎంపిక చేసెదము, ప్రభువు ఏ వ్యక్తిని అయితే పిలవమని నియమించునో, ఆ రాత్రి వారే ఆ వరుసలోనికి వస్తారు.
మరుసటి రాత్రి, మరుసటి సాయంకాలము వారు ఎక్కువ కార్డులను ఇచ్చెదరు. ఆ విధముగా చేయుచూ, ఆ విధానంలో ప్రతీ ఒక్కరు లోనికి వచ్చునట్లు, దానిని సమానముగా వుంచెదము. “మంచిది,ఈ వ్యక్తిలోనికి వచ్చాడు, ఈ రోజు వారికి కార్డు రానియెడల, రేపటికి వారు చనిపోయెదరు,” అని వారు చెప్పెదరు. మంచిది, ప్రభువు ఎక్కడ నుండి పిలచునో, అది ప్రతీ వ్యక్తికి ఒక అవకాశమును ఇచ్చును.
మరియు ఇప్పుడు, వరమునకు నూతనమైన కార్యము జతపరచబడినప్పటి నుండి, అది ప్రేక్షకులలో వారిని గూర్చి మాట్లాడుచూ, మరియు ప్రజలు ఎక్కడ వుండిననూ వారిని పిలచుచున్నది.
19.ఇప్పుడు, ఇక్కడలేఖనము యొక్క ఒక భాగమును చదువగోరుచున్నాను. కావున ప్రతీరోజు మధ్యాహ్నము వచ్చి మీ ప్రార్ధన కార్డులను పొందుకొనండి. ప్రార్థనా పూర్వకంగా వుండండి. ఇప్పుడు ఎంతమంది కూటము కొరకు ప్రార్థన చేయుదురు? మీ చేతులు చూడనియ్యుడి. ఇప్పుడు, స్నేహితులారా, ఇది మీ కూటము, మరియు మేము ఇక్కడ వుండి మీ అందరికి చేయగలిగిన సహాయమును చేయుటకై మేము ప్రయత్నించుచున్నాము. మరియు ఈ అభిషేకముతో నేను చేయగలిగినది ఏమి లేదు అని నేను గ్రహించాను. అది దానంతట అదే వచ్చును. ఒకవేళ అది రానియెడల, నేను వేదికపై నుండి వెళ్ళిపోవుదును. నేను ఇక్కడ ఏ మాత్రము ఉండను, ఎందుకనగా నేను చేయు ప్రకటనలు మరియు ఆ హక్కులు నిర్వహించడానికి అక్కడ ఒక సహజాతీతమైనది ఉండవలయును. ఒక మనిషి దానిని చేయలేడు.
మరియు మీలో అనేకులు, నేను ఇక్కడ ఉన్నప్పుడు, ఇతర కూటములలో, ప్రజల యొక్క చేతులను పట్టుకొనుట ద్వారా వ్యాధులను చెప్పేవాడను. మీలో ఎంతమందికి అది గుర్తుంది? మరియు నేను భక్తి గౌరవములతో నడుచుకొనినయెడల, ఆయన మోషేకి ఇచ్చినట్లు ఆయన నాకు మరొక సూచన ఇచ్చెదనని అది జరుగబోవుచున్నదని నన్ను కలిసిన ఆ దూత నాతో చెప్పినదని, నేను చెప్పినది మీలో ఎంతమందికి గుర్తున్నది, హృదయ రహస్యాలను చెప్పుట ద్వారా నిజమైన సూచనగా అది ప్రజలకు రుజువు చేస్తున్నది.
20.అది నెరవేరబోవుచున్నదని నేను చెప్పినది ఎంతమందికి గుర్తున్నది? చూశారా? కూటములో అది సత్యము. మంచిది ఇప్పుడు, అది నెరవేరినది. అది నెరవేరినప్పటి నుండి ఇది అయిదవ కూడిక, అది ఒక్కసారిగా వచ్చినది. మరియు తరువాత, మూడవ కూడికలో అది ప్రత్యక్షపరచబడుచున్నప్పుడు, వేదికపైకి వచ్చు వేలాదిమంది ఆ గొప్ప దేవుని యొక్క దూతను చూశారు. గత రాత్రి ఆయన ప్రక్కన నిలువబడి మరియు నాతో ఫోటో తీసుకొనుటకు, ఆయన నాకు అనుమతినిచ్చాడు. మానవ చరిత్రలో అటువంటిది జరుగుట అదే మొట్టమొదటిసారి.
ఆయన దానిని చేసెను అని తెలుసుకొనుటను బట్టి ఈ రాత్రి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మరియు ఆయన కొరకు నేను పనిచేయబోతున్నాను. మరియు నేను చేయగలిగినదంతా చేస్తాను. నేను ఇక్కడ ఉన్నప్పుడే, ఆయనకు మరియు ఆయన ప్రజలకును సేవ చేసెదను.
ఇప్పుడు, లేఖనము చదివే మునుపు, మీ వైఖరి… ఇతరులకు చెప్పునట్లు మీరు నాకు సహాయము చేయండి. ఈ రాత్రి తరువాత నేను మాట్లాడను, కానీ ఆ వరము పట్ల మీ వైఖరియే మీ స్వస్థతను నిర్ణయిస్తుంది.
21.ఇప్పుడు, దేవుడు ప్రజలైన మనతో వున్నాడని శాస్త్రీయంగా ఋజువు చేయబడింది. దానిని రుజువు చేసేందుకు ఆయన చిత్రం (ఫోటో) ఇక్కడ ఉన్నది. ఎంతమంది ఆ చిత్రమును చూచారు? ఈ రాత్రి మీకు దానిని చూపించారని నేను ఊహిస్తున్నాను. మీరు ఒక్కటి కలిగియుండవచ్చును. వారు ఇక్కడే వున్నారు అని తలంచుచున్నాను.
ఇప్పుడు, అది…. అది ఈ విధముగా చెప్పబడేది. “శాస్త్రీయంగాదేవుడు ఋజువు చేయబడడు” అని వారు చెప్పేవారు. ఆ పాత సంశయవాది (అందరూ ఒప్పుకొనిన దానిని సందేహించే వ్యక్తి లేక ప్రశ్నించే వ్యక్తి) చెప్పాడు, ఇక ఇప్పుడు దానితో వెళ్ళలేడు, ఎందుకనగా సహజాతీతమైనది ఉన్నది అని శాస్త్రీయంగా రుజువు చేయబడినది. మరియు ఆ సహజాతీతమైనది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు: ఆయన ఆత్మయే.
మరియు ఇప్పుడు, ఆ సంగతులు ఒకవేళ ఎవరైనా ఎందుకు ఆ కార్యములు చెప్పబడినవి అని ఆశ్చర్యపడవచ్చును, యేసుక్రీస్తు ఆత్మ మన మధ్యలో వున్నది. అది నిజము. మీకు గుర్తుందా, ఆయన నతానియేలుతో చెప్పెను. ఫిలిప్పు అతనిని ప్రార్ధనా వరుసలోనికి తీసికొని వచ్చినప్పుడు, “ఇదిగో నీవు ఇశ్రాయేలీయుడవు, నీయందు ఏ కపటమును లేదని, ఆయన చెప్పెను. ”బోధకుడా, నన్ను నీవు ఏలాగు ఎరుగుదవు?“అని అడిగెను.
“ఫిలిప్పునిన్ను పిలువక మునుపే, నీవు అంజూరపు చెట్టు క్రిందఉన్నప్పుడే” అని ఆయన చెప్పెను.
“నీవు దేవునికుమారుడవు, ఇశ్రాయేలు రాజువు” అని అతడు చెప్పెను. అతని యొక్క హృదయ రహస్యమును ఆయన చెప్పెను. అది నిజమేనా?
సమరయలోని బావి వద్ద స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఆమెతో ఆయన సంభాషిస్తున్నాడు. “వెళ్ళి నీ పెనిమిటినితీసికొని రా,” అని చెప్పెను.
“నాకుపెనిమిటి లేడు” అని ఆమె చెప్పెను.
“నీవు చెప్పినది, సరియే, నీకు అయిదుగురువుండిరి. మరియు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు” అని ఆయన చెప్పెను.
“అయ్యా,నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను,” అని ఆమె అన్నది.
22. వెంటనే ఆయన శిష్యులు వచ్చారు, మరియు ఆమె ఊరిలోనికి వెళ్ళినది, “మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా?” అని చెప్పెను.
ఇప్పుడు, నేను జాన్ డిల్లింగర్ అని నేను మీకు చెప్పినయెడల, లేక జాన్ డిల్లింగర్ ఆత్మ నాపై ఉన్నయెడల, నేను తుపాకీలు కలిగియుండుటను, జాన్ డిల్లింగర్ వలె ప్రవర్తించుటను మీరు చూచెదరు.
ఒకవేళ నేను ఒక చిత్రకారుడనని మీకు చెప్పినయెడల, ఒక గొప్ప చిత్రకారుని యొక్క ఆత్మ నాపై వుండినయెడల మీరు నా నుండి ఒక చిత్రకారుని చిత్రాలను గీయమని ఆశించెదరు. అది నిజమేనా?
నేను ఒక నైపుణ్యతగల మెకానిక్ ను అని చెప్పినయెడల, మరియు ఆ మెకానిక్ ఆత్మ నాపై ఉండినయెడల, మీ కార్డులో ఏ తప్పిదము వున్నదో కనుగొనుటను నా వద్ద నుండి ఆశించెదరు.
నేను దేవుని ఆత్మ ద్వారా జన్మించితినని మరియు యేసుక్రీస్తు ఆత్మ నాపై వున్నదని మీతో చెప్పినయెడల, ఆయన ఏమి చేయునో, ఆయన ఏ విధముగా ప్రవర్తించునో మీరు నా వద్ద నుండి అదే ఆశించెదరు. అది ఆయన ఆత్మ ఒక మానవుని ద్వారా పనిచేయును. మీరు దానిని నమ్ముచున్నారా? ఒక సమయములో ఆయన ఆత్మ ఇత్తడి సర్పముపై పనిచేసినది. మీరు దానిని నమ్ముచున్నారా?
మరియు బేతెస్థ కోనేరు యొద్ద, నీళ్ళు కదిలించబడినప్పుడు, నమ్మి ఎవరు మొదట దిగునో, వారు వారియొక్క స్వస్థతను పొందెడివారు. అది నిజమేనా? ఆ నీరు ఈలాగు అనినచో, “నేను ఎంత గొప్ప నీటినో చూడుము?” లేదు, నీటిపై ఉన్న ఆ దూతే ఆ స్వస్థతను చేసినది, నీరు కాదు, ఆ దూతే ఎప్పుడైతే ఆ దూత వెళ్ళిపోవునో, అవి కేవలం నీళ్ళే. మనుష్యులు కేవలం మనుష్యులైయున్నారు, కానీ అది దేవుని యొక్క కార్యాలయము (గాడ్స్ ఏజెన్సీ).
23.దేవుడు సంఘాల మీద పడడు. దేవుడు యాంత్రిక పరికరాల మీదకు రాడు. దేవుడు, పరిశుద్దాత్మ జనుల పైకి వచ్చును. మనుష్యుడు దేవుని యొక్క ప్రతినిధి, మరియు దేవుడు ఎన్నడూ చేయదగిన కఠినమైన సంగతి ఏదనగా ఒక మర్త్యుడిని మరొక మర్త్యుడు నమ్ములాగున చేయుటయే. మీరు దీనిని నమ్ముచున్నారా?
వారు మోషేను నమ్మలేదు, మరియు వారి యొక్క విడుదల కొరకు దేవునియొద్ద నుండి అతడు పంపబడ్డాడని ఆ ప్రజలకు రుజువు చేయుటకై దేవుడు అతడికి రెండు సూచనలు ఇచ్చాడు. మీరు దానిని నమ్ముచున్నారా? సరియే, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉండలేదా?
ఏ దూత అయితే మండుచున్న పొదలో అతనితో మాట్లాడినదో, అతడే ఆ నిబంధన దూత అని మీరు నమ్ముచున్నారా? అది నిజమేనా? అయితే సరే. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడున్నాడు. మరియు అప్పుడు చేసిన అదే కార్యములు ఆయన ఈ రోజు కూడా చేయును. ఆయన అద్భుతమైన దేవుడు. మరియు సూచనలతోను మరియు అద్భుతములతోను ఎల్లప్పుడు ఆయన అద్భుతరీతిగానే పని చేయును. మరియు ఈ అంత్యదినములలో వాటిని ఆయన వాగ్దానము చేసాడు. మరియు మనము అంత్యదినములలో జీవించుచున్నాము. ఆయన ప్రజలను సమకూర్చుటకై ఇప్పుడు వాటిని ఆశించే హక్కు మనము కలిగియున్నాము. అది నిజము.
24.అప్పుడు యేసు వచ్చినప్పుడు, ఆయన స్వస్థపరచువాడు అని ఏ శరీరధారి (మర్త్యుడు) చెప్పడు. ఆయన స్వస్థపరచువాడు అని యేసుక్రీస్తు ఎన్నడూ చెప్పలేదు, ఆయన చెప్పాడా? “ఆ క్రియలు చేయుచున్నదినేను కాదు; అవి నా యందు నివసించుచున్న నా తండ్రియే. ఆయనే ఆ క్రియలు చేయుచున్నాడు.” అది నిజమేనా?
అప్పుడు దేవుడు, క్రీస్తునందు సూచనలతోను మరియు మహత్కార్యములతోను తనతో లోకమును సమాధానపరచుకొనుచున్నాడు. ఆయన యందు సూచనలు వున్నవి, — మెస్సీయా యొక్క సూచనలు — మెస్సీయా యొక్క, మరియు అదే ఆయన మెస్సీయాత్వమును రుజువు చేసినది. మరియు దీనిని గూర్చి ఈ రాత్రి మీతో నేను మాట్లాడినయెడల, వరము ద్వారా దేవుడు ఫలానా కార్యము చేసాడు అని నేను చెప్పినయెడల ఆ వరమును గూర్చి నేను మాట్లాడను; దానిని గూర్చి స్వయంగా అదే మాట్లాడును. మరియు నేను క్రీస్తును గూర్చి మీతో మాట్లాడినయెడల, అది పరిశుద్ధ గ్రంధము ప్రకారం వున్నట్లయితే, నేను ఏమి చెప్పెదనో అది మీరు నమ్మెదరు. మరియు క్రీస్తు తిరిగి నా గూర్చి మాట్లాడినయెడల, అప్పుడు మీరు క్రీస్తుని నమ్మండి.
25.నేను మీకు ఏదైనా చెప్పినయెడల, మరియు ఆ విధముగా అని క్రీస్తు చెప్పనియెడల, అప్పుడు మీరు దానిని నమ్మవద్దు. అయితే ఆయన చేసినది ఒకటి నేను మీకు చెప్పినప్పుడు మరియు అది ఆయనే చేసాడు అని దాని పక్షమున ఆయన సాక్ష్యమిచ్చినచో, అప్పుడు మీరు ఆయనను నమ్మండి. అది తగినంత న్యాయముగా ఉన్నదా? అది…
ఇప్పుడు, ఆ వరము ఏ ఒక్కరినీ స్వస్థపరచదు. వరము స్వస్థపరచుటకు కాదు. ఏ సువార్త సేవకుడు రక్షించుటకు పంపబడలేదు. అతడు ఏ ఒక్కరినీ రక్షించలేడు. అతడు ఒక ఆధికారముతో బోధించి ప్రజలను దేవుని వాక్యపు జ్ఞానము వద్దకు తీసుకు రాగలడు, మరియు వారి ఒప్పుకోలుకు వారిని తీసుకురాగలడు, మరియు దేవుడు రక్షణ ఇచ్చును. అది నిజమేనా? ఇదియు అదే కార్యము అయి యున్నది. ఆతడు ఒక సూచనను పొందుకొన్నాడు. అతడు ఒక అధికారముతో బోధించి మానవ హృదయమును నేరస్థాపనకు తీసికొనివచ్చును, మరియు వారు బలిపీఠము వద్దకు వచ్చెదరు, మరియు విశ్వాసముతో, వారు యేసుక్రీస్తుని అంగీకరించి మరియు అప్పుడు ఫలితాలను పొందుకుంటారు. అది నిజమేనా? వారు ఎప్పుడైతే దేవునికి ఒప్పందము చేస్తారో, ఆయనకు సమర్పించుకొని మరియు ఆయనను విశ్వసిస్తారో, మరియు అప్పుడు అది ఫలితాలను తీసికొనివచ్చును….
ఇప్పుడు, స్వస్థత అదేవిధమై ఉన్నది. సేవకులు సంవత్సరముల తరబడి బోధించుచూ వచ్చారు, కానీ దేవుడు ఒక వ్యత్యాసమైన కార్యము చేయు దినము ఇదియే.
26.ఇప్పుడు, వరము అన్ని వ్యాధులను బయలుపరచును ఇప్పుడు, ఇదియే పొందుకొనుట. ఆ వరము అన్ని వ్యాధులను ప్రకటించును, పాపములను గద్దించును. ప్రజల హృదయ రహస్యములను బయలుపరచును. మరియు గుర్తుంచుకొనండి, ప్రార్ధనా వరుసలోనికి వచ్చు ఏ వ్యక్తి అయినా గుర్తుంచుకొండి, మీరు ఒకవేళ ఒప్పుకొనబడని పాపము వచ్చినచో, ఈ వేదిక మీద నుండి అది చెప్పబడును. అది ఎంత అసభ్యకరమైనదయినా మరియు ఎంత చెడ్డదైనా, వేదికమీద నుండి అది చెప్పబడుతుంది.
ఇప్పుడు, అది చెప్పుటకు ఒక గొప్ప ప్రకటన మరియు గుర్తుంచుకొనండి. నేను కొన్నివేల మంది ఎదుట నిలుచున్నాను, కానీ అది ఎన్నడును ఒక్కసారి కూడా తప్పిపోలేదు. అది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండును, కొన్ని రాత్రుల క్రితం ఇక్కడ కూడా అది చెప్పబడినది. అవును నేను, నేను అభిషేకము క్రిందికి వెళ్ళినప్పుడు, నేను ఏమి మాట్లాడుచున్నానో నాకు తెలియదు.
బూమౌంట్ వద్ద వేదిక పైకి ఒక యువతి వస్తుందని వారు నాకు చెప్పారు అని నేను నమ్ముతాను, మరియు ఇలా చెప్పబడినది, ఆ వ్యక్తి అక్కడ నిలుచుండుట నేను చూచినప్పుడు, వారు చిన్నవారు అవ్వడం ప్రారంభమైనట్లు అది కనిపించింది. వారు ఒక ఖచ్చితమైన చిన్న వయస్సుకు వెళారు, మరియు నేను ఏది జరుగుట చూచుచున్నానో అది చెప్పుటను నేను ప్రారంభించాను. మరియు అది జరుగుట మొదలైనది. మరియు అది ఎల్లప్పుడు పరిపూర్ణముగా వున్నది.
27.ఈ బాలికను గూర్చి కొన్ని రాత్రుల క్రితం, ఇక్కడ చెప్పబడినది, పధ్నాలుగు లేక పదిహేనేళ్ళ వయస్సులో వివాహము కాకయే ఒక బిడ్డకు జన్మనిచ్చినది అని వారు నాతో చెప్పారు. మరియు ఇంకా, ఆమె ఒక మత సంబంధమైన ప్రజలచే మభ్యపెట్టబడింది, అని నేను నమ్ముచున్నాను. అది కానీ ఒక పురుషుని వివాహము చేసికొనుట, మరియు ఆమె ప్రేమలో లేకున్ననూ, మరియు చాలా సమస్యను తీసికొని వచ్చినది మరియు అటువంటివి… ఆమె చేసిన అనేక కార్యములను మరియు వాటి గురించి, ఆమె వేదికపైకి ఒక ప్రత్యేకమైన స్థలములో రాకమునుపు… ఆమె ప్రార్ధిస్తున్నది, నిలుచుని ప్రార్ధిస్తున్నది, ఆ విధముగా, దేవా నీవు నన్ను స్వస్థపరచగలవా అని ఆమె అడుగుతూవుంది మరియు… అక్కడ ఎవరైనా వున్నారా? అది నిజమేనా? అది… అది ఓ, అక్కడ, అవును, అది మంచిది, ఇక్కడ ప్రజలు… మరియు అది మాత్రమే కాదు, కానీ కేవలము…. వేరే కూడికలలో వున్న ప్రజలైన మీరు, అది — అది ఖచ్చితముగా, ప్రతీసారీ, జరగలేదా..? ఒకవేళ అది జరిగినట్లయితే, అది నిజమైతే, మీ చేతులు పైకి ఎత్తండి. అది చెప్పబడినప్పుడు, మీ అందరికి తెలుసు…. అది నిజము. ఇప్పుడు, అది యితర ప్రజలకై సాక్ష్యమిచ్చుటకై…
28.దానితో నేను చేయగలిగినది ఏమీ లేదు. నేను ఏమి చెప్పబోవుచున్నానో అది కూడా నాకు తెలియదు. మరియు ఈ రాత్రి ప్రార్ధనా వరుసలో వుండు ఈ ప్రజలలో ఒక్కరు కూడా నాకు తెలియదని దేవునికి తెలుసు. ఒక్కరు కూడా నాకు తెలియదు, కానీ అది తప్పిపోవుటను నేను ఎన్నడూ చూడలేదు, కానీ వారు ఎంత దయనీయమైన రోగులైనా, బాధలో వున్నా మరియు ఏదైనప్పటికీ, సంబంధము లేకుండా, దేవుడు ప్రతీ ఒక్కరినీ స్వస్థపరచెను; ఆయనే వారిని స్వస్థపరిచాడు.
మరియు అది మాత్రమే కాదు, ప్రేక్షకులలో నుండియు, ప్రజలలోని వివిధ కార్యములను, బయట బాల్కనీలలోను మరియు అటువంటి కార్యములను అది పిలుచును. అది నిజము. అదియే సత్యము. ఇప్పుడు నేను చెప్పెడి హక్కులు అవియే. అది నీ స్వస్థత కొరకు ఏ ఒక్క కార్యమును చేయదు. వ్యక్తి వేదిక పైకి వచ్చినప్పుడు మాత్రమే … పరిశుద్దాత్మ వచ్చినప్పుడే, ఈ రాత్రి మరియు ప్రతీ రాత్రి ప్రజలు వచ్చుటను మీరు గమనించండి. వారు వేదిక పైకి వచ్చుటను మీరు చూచెదరు. మరియు వారు ఎనిమిది లేక పది అడుగులు దూరంలో వున్నప్పుడే వారి ముఖములలో మార్పును మీరు చూచెదరు. ఆ రోగులను గమనించండి.
29.వారిలో అనేకులు తికమక పడిపోయి, సొమ్మసిల్లునట్లుగా కూడా అవుతారు. వారు చాలా అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయి, వారి ముఖమును రుద్దుకొనవలసివచ్చునంతగా నేను చూచాను. ఆ విధముగా మరియు ఏడ్వటం ప్రారంభించేవారు. ఆచరణాత్మకంగా ప్రతివారు, నిజమైన వింత అనుభూతి… ఇతర కూడికలలో అది సత్యము అని ఎంతమందికి తెలుసు?
ఇప్పుడు, అక్కడ దేవుని యొక్క దూత సన్నిధి ఉన్నది అని వారు గ్రహించారు. అప్పుడు వారికి దానిని చెప్పుటకు ప్రయత్నించినప్పుడు, ఆ తీయబడిన చిత్రమును మీరు ఇక్కడ చూడగలరు, శాస్త్రీయముగా అది సత్యము అని రుజువు చేయబడినది. ఇప్పుడు, వారు అక్కడ నిలుచున్నప్పుడు, సహజాతీతమైన వాని సన్నిధిలో వున్నారు అని వారు ఎరుగుదురు. లేదు, అది నేను కాదు. నేను కేవలం ఎవరికన్నా ఎక్కువవాడను కాను – మీ అందరిలో అల్పుడనై వున్నాను, కాని ఆయన దాని గుండా పని చేయుటకు అది ఒక మార్గం అయి వున్నది. దానిని ఎవరో ఒకరు బహిరంగముగా చెప్పవలెను. మరియు ఆయన కేవలం… అది కేవలం ఎలాగు జరుగవలసియున్నదో అది అలాగే జరిగింది. నేను జన్మించినప్పుడే ఆయన నన్ను పిలిచాడు. వరములు ఏదో అలా మీ చేతికి అందించబడినవి అని నేను నమ్మను.
30. “వరములు మరియు పిలుపులు అనునవి పశ్చాత్తాపము లేకుండానే వచ్చును” అని బైబిల్ చెప్పుచున్నది. నీవు ఆ కార్యములతో పుట్టియున్నావు. మీరు ముందు నిర్ణయమును నమ్మదురా? ప్రతీ ఒక్కరు కొరకు? కానీ కార్యములు దేవుని యొక్క ముందు నిర్ణయము అయి వున్నవి. యేసుక్రీస్తు మనుష్యకుమారుడుగా ఉండవలెనని ముందుగానే ఏదెను తోటయందే నిర్ణయించబడినది. మీరు దానిని నమ్ముచున్నారా? “నీ సంతానము సర్పము యొక్క తలను చితకకొట్టును.”
మోషే దేవునిచే నియమించబడ్డాడు, ముందు నిర్ణయం. అతడు జన్మించినప్పుడే, అతడు సరైన బిడ్డగా కనుగొనబడ్డాడు. అది నిజమేనా?సత్యము. మరియు గమనించండి, అతడు జన్మించుటకు ఏడువందల-పండ్రెండు సంవత్సరముల మునుపే, బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి అతడు అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని నేను నమ్ముతాను. అది నిజమేనా?
యిర్మియా, అది జరిగింది అని నేను నమ్ముతాను, “నీవు ఇంకనూ జన్మింపక మునుపే, లేక గర్భములో నీవు రూపింపబడక మునుపే, నేను నిన్ను ఎరిగితిని, మరియు నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, నీవు జన్మించకమునుపే,” అని దేవుడు చెప్పెను. అది నిజమేనా?
31.వరములు మరియు పిలుపులు అనునవి పశ్చాత్తాపము లేక మునుపే వచ్చును. మరియను ఆ దూత దర్శించి ఆమెతో చెప్పినది, జెకర్యా మరియు మిగిలిన వారు. ఆ కార్యములు సత్యము.
ఇప్పుడు, తరువాత అయిదు లేక ఆరు నిమిషాలలో ప్రార్థనా వరుసను ప్రారంభింపబోవుచున్నాను, కేవలం ఒక క్షణం, ఒక కార్యమును మీకు తేటపరిచేందుకు, ఉదాహరణకు, కొంతమంది ప్రజలు చెప్తారు, “పరిశుద్దాత్మ వచ్చిన తరువాత, అతడు సంఘమును నడుపుతాడు. కూడిక ముగించిన తరువాత, అతడు సంఘమును నడుపుతాడు. కూడిక ముగించిన తరువాత దూతలు దర్శించుట అనే అటువంటి కార్యములు ఏమీ లేవు.” కనుక పరిశుద్ధ గుంపు ప్రజలతో నేను మాట్లాడుతున్నాను అని నేను ఎరిగియున్నాను.
కొద్ది నెలల క్రితం ఇక్కడే నాతో ఎవరో చెప్పారు, “సహోదరుడా బ్రెన్ హామ్ ,ఒక మనిషిగా నిన్ను నేను మెచ్చుకుంటాను, కానీ ఒక దూత నీ యొద్దకు వస్తుంది అనే నీ బోధను గుర్చి అది ఒక పొరపాటైయున్నది” అని చెప్పాడు. “మనకుఇప్పుడు దూతలు అవసరం లేదు” అని చెప్పాడు. “ పరిశుద్దాత్మఇక్కడ వున్నది” అని చెప్పాడు. “పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత దూతలు వెళ్ళిపోయాయి” అని చెప్పాడు.
అది తప్పు, ఫిలిప్పు పరిశుద్దాత్మను కలిగి ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతారు? మీ చేతులు చూడనివ్వండి. మంచిది, సమరయలో ఉజ్జీవమును కలిగి వున్నప్పుడు అది ఎవరు, అతడిని తాకి మరియు గాజా ఎడారికి వెళ్ళు అని చెప్పినది ఎవరు? ప్రభువు యొక్క దూత. అది నిజమేనా?
32. పేతురుకి పరిశుద్దాత్మ ఉంది అని మీలో ఎంతమంది నమ్ముతారు? పెంతెకోస్తు దినమున ఒక ఉపన్యాసమును బోధించాడు. మంచిది, అతడు చెరసాలలో వున్నప్పుడు, పరిశుద్ధాత్మ కాదు, కానీ ప్రభువు యొక్క దూత లోపలికి ప్రవేశించి మరియు అతడిని ముట్టి మరియు అతడిని బయటకు నడిపించినది… అది నిజమేనా? ప్రభువు యొక్క దూత.
పరిశుద్దాత్మ వున్నది అని మీలో ఎంతమంది నమ్ముతారు? అతడు ఓడలో వున్నప్పుడు, నక్షత్రములు, చంద్రుడు, లేక ఏదియు, లేక వెలుగు లేకుండా పధ్నాలుగు పగళ్ళు మరియు రాత్రులు వెళుతూ ఉండెను. అతడు వసారాలోనికి వెళ్ళి ప్రార్ధించి మరియు తిరిగి వచ్చి, “ధైర్యముగా ఉండుము, నేను ఎవరి దాసుడనో, ఆ దేవుని యొక్క దూత, నన్ను దర్శించినది” అని చెప్పెను. అది నిజమేనా – నిజమేనా? అతడు పరిశుద్ధాత్మ కలిగియున్నాడు అని మీరు నమ్ముతారా?
ప్రత్యక్షతను ప్రకటించువాడైన యోహాను పరిశుద్ధాత్మను కలిగియున్నాడు అని మీలో ఎంతమంది నమ్ముతారు? ప్రకటన గ్రంధమంతయు అతడికి ఒక దూత ద్వారా ప్రత్యక్షపరచబడినది. “ఆయన ఒక దూతను పంపి సాక్ష్యమిచ్చాడు.” మరియు యోహాను ఆ దూతకు నమస్కారం చేయుటకు ప్రయత్నించాడు. అది నిజమేనా?
“వద్దు సుమీ;నేను నీతోను మరి ప్రవక్తలైన సహోదరులతోను సహదాసుడను.” దేవునికే నమస్కారము(ఆరాధన) చేయమని అతడు చెప్పెను. అది నిజమేనా?
33.పరిశుద్ధాత్మయుగము వచ్చినది, మరియు కొనసాగింది, మరియు కొనసాగుతూ ఉంది. సంఘము దూతల యొక్క పరిపాలనలో కొనసాగుతూ ఉంది. నిజంగా. కానీ వారు దేవునిచే నియమించబడిన ఆత్మలు, దేవునిచే పంపబడి విషయములు (వర్తమానములు) బయటకు మోసుకొనిపోవుదురు. కాలములన్నిటి గుండా, మనుష్యులను దూతలు దర్శించినవి, ప్రతీ ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగియున్నాడు. బ్రిగ్హమ్ యంగ్ మరియు అటువంటి వారి వలె దూతలను ఆరాధించరాదు. (అది తప్పు.) కానీ దేవుని యొక్క దూత దేవుని యొక్క సత్యముకై ఒక సాక్షిగా ఉండును. అది సత్యము. మరియు అది దేవునిని బయలుపరచును. ఏదో రకమైన కల్పితాలను మరియు ఎవరూ అర్థం చేసుకొనని దానిని కలిగిలేదు. అది యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడును, మరియు యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యమిచ్చును, మరియు ప్రజలకు యేసుక్రీస్తుని ఉత్పత్తి చేయును. ఆమేన్.
నేను ఆ ఆమేన్ ను ఇష్టపడతాను. దాని అర్థం, “అలాగు జరుగును గాక.” మరియు నేను దానిని ఇష్టపడతాను.
34. అంతా సరియే. ఇప్పుడు అంత్యదినములు ఇక్కడ ఉన్నవి అని సంఘమునకు సాక్ష్యమిచ్చుటకు యేసుక్రీస్తు యొద్ద నుండి పంపబడిన దేవుని యొక్క దూత ఇతడే. అతడు ఎవరినీ స్వస్థపరచడు, మరియు ఆ వ్యక్తి వేదికపై వుండుటను మీరు చూచినప్పుడు, అది మీ విశ్వాసమును ఒక స్థానమునకు పెంచుటకు సహాయపడుతుంది… ఇప్పుడు, మీరందరూ ఇక్కడ ఉన్నారు, బహుశా అది… కూడిక ముగించే మునుపు, ఇక్కడ ఎంతమంది ప్రార్థన కొరకు ఉన్నారో, మీ చేతులను చూడనివ్వండి. సరియే, మొత్తం యాభై మంది అని నేను ఎరుగుదును. ప్రార్థనా కార్డులను ఇక్కడ వున్న వారందరూ పైకి ఎత్తి, వారి కార్డులను చూపించుటను నేను చూస్తున్నాను.
గమనించండి, ఇక్కడ వేదికపై దేవుడు ఏదో సంగతి చేయుచున్నప్పుడు, బయట అక్కడనున్న నీ వైపు అది ఆయన వైఖరి అయియున్నది, మీరు దానిని నమ్ముచున్నారా? మరియు ఇక్కడ వేదికపై అది జరుగుచున్నప్పుడు, గుర్తుంచుకొనండి, మీ హృదయమందు సందేహించకుండా, మీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే, నీవు ఎవరివో చెబుతాడు, నేను నీకు భరోసా ఇస్తున్నాను – దేవుడు అక్కడే నిన్ను బయటకు లాగును (లేపును), నీవు ఎవరివో చెబుతాడు, నీ మంచం మీద నుండి, స్ట్రేచర్ మీద నుండి, లేక నీవు ఎక్కడ ఉండినను ఈ భవనములోనే నిన్ను లేపును. (అది నిజము.)
ఇక్కడ, ఒక రాత్రి, ఒక చిన్న అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది, దాని తర్వాత ఒక సేవకుడు వచ్చుట చూచితిని. ఒక సేవకుడు ప్రసంగించుచుండగా, ఒక వ్యక్తి రావడం నేను చూచాను, అతడిని ఏదో చేయమని దేవుడు చెప్పెను. అతడు అది చేయుటలో విఫలమయ్యాడు. దాని తర్వాత సమస్య ప్రారంభమైంది. అతడి సమస్యలు అతడిని గూర్చి చెప్పినవి, అతడు ఎముక కట్టు వేసుకొని పడియున్నాడు. అతడి ప్రక్కవైపు చూచుట జరిగెను, ఒక వ్యక్తి వంకరలు తిరిగిపోయి యుండుట నేను చూచాను, అతడు పైకి ఎక్కుటను నేను చూచుచున్నాను…. అతడు త్రాళ్ళు, తలుగులు తగిలించేవాడు, అతడు ఒక త్రాడును కురచ చేయుటకు రెండు ముడులు వేసి దానిని కట్టుటను నేను చూచాను. మరియు అటువంటి కార్యములను మరియు నేను ఏమి చూస్తున్నానో దానిని చెప్పుట ప్రారంభించాను. మరియు అప్పుడు, మొదటి కార్యము మీకు తెలియునా, అది అక్కడ ఉన్నది, మరియు అతడు స్వస్థపడ్డాడు.
35. ఒక చిన్న స్త్రీ ఈ విధంగా చేతులు చొప్పికూర్చుంది. ఒక పక్షవాతపు బిడ్డను ఒక తల్లి దుప్పటిలో మోయుటను నేను చూచాను. కొంత సమయము తరువాత ఆ బిడ్డ, ఒక బల్లపై నుండి క్రిందపడుట నేను చూచాను. అది నేను చెప్పబోవుచుండగా… ఆమె ఎన్నడూ నడవలేదు; ఆమె అక్కడ చక్రాల కుర్చీలో కూర్చొని వుంది; ఆ అమ్మాయి అక్కడ నిలబడుట నేను చూచాను. మరియు తర్వాత నేను చూచాను, మరియు ఆ అమ్మాయి వీధిలో ప్రతీ ఒక్కరికీ చేతులు ఊపుతూ ప్రభువును స్తుతిస్తూ వెళ్ళటను నేను చూచాను.
నేను దీనిని చెప్పుచున్నాను, నేను ఏదయితే చూస్తున్నానో ఖచ్చితంగా దానినే చెప్పుచున్నాను. “నీ కాళ్ళపై నిలబడు; యేసుక్రీస్తునిన్ను స్వస్థపరచును.” అక్కడ ఆఅమ్మాయి నిలుచున్నది. ఆమె పైకి లేచినది మరియు భవనము గుండా ఆమె వెళ్ళిపోయింది. అది ఎన్నడు తప్పిపోదు. అది జరగాల్సిందే. ఓ, హల్లెలూయా.
నేను దానిని గూర్చి ఆలోచించినప్పుడు, స్నేహితులారా, అది నేనే అని తలంచవద్దు…
[టేపులోఖాళీ వుంది – సంపా.]
36. [ఈ టేపులో తక్కిన భాగం క్రింద భాగము, బహుశా, ఈ ఉపన్యాసమునకు సంబంధించి కాదు — సంపా]…?….
ఆయన ఒక మానవుని వలె ఏడుస్తున్నాడు. అది సత్యము. మై, అపేక్షించునట్లుగా అతని యందు ఏ సురూపము లేదు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. ఆయన అక్కడ నిలుచుండుట చూడుము, ఆయన కొంచెం బలహీనంగా చిన్న శరీరంలో అక్కడ నిలబడి, ఆయన బుగ్గల మీద నుండి కన్నీళ్ళు క్రిందికి కారుచున్నవి. కానీ అకస్మాత్తుగా దేవుడు ఆయన పైకి వచ్చాడు. ఆయన (యేసు) యొక్క చిన్న శరీరమును ఆయన (దేవుడు) నిటారుగా నిలబెట్టెను. అక్కడ ఒక వ్యక్తి, చనిపోయి, కుళ్ళిన శరీరముతో నాలుగు రోజులుగా సమాధిలో పడియుండెను: ఆ శరీరము లోపల మరియు బయట చర్మపు పరుగులు ప్రాకుచున్నవి. ఆయన అక్కడ నిలబడి “లాజరూ బయటికి రమ్మ” అని బిగ్గరగా కేక వేసెను. ఏమిటది? దేవుడు కన్నీళ్ళ గుండా వారిని చూస్తున్నాడు, మర్త్యమైన పెదవుల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. అది సత్యము. “లాజరూ,బయటకు రమ్ము.” లాజరుచనిపోయాడు; అతని ఆత్మ నాలుగు దినములు నిత్యత్వములోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినదో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. కనుక దానిని గూర్చి మనకు వాదన వద్దు. అయితే ఆ వ్యక్తి నాలుగు దినములుగా ఆ సమాధిలో కుళ్ళుపట్టి పడియున్నాడు, మరియు అతని ఆత్మ నాలుగు దినముల ప్రయాణములో ఉన్నది. కుళ్ళుకి దాని సృష్టికర్త ఎవరో తెలుసు. అతడి ప్రాణము, ఆత్మ గుండా …?.. మరియు ఆ వ్యక్తి చనిపోయి నాలుగు దినములు అయినది, ఇప్పుడు అతడు జీవించుచున్నాడు. హల్లెలూయ. తన కుమారునిలో ఉన్న దేవుడు, స్వయంగా తానే లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు. ఆయన తన కుమారునిలో ఉన్నాడు అని మీరు నమ్మదురా? అది సత్యము. దేవుడు ఆయనలో నివసించాడు. ఆయన చనిపోయినప్పుడు… మనలను విమోచించి తిరిగి తండ్రి యొద్దకు తీసికొనిపోవుటకు, క్రీస్తు ఒక మానవునిగా మరణించి, అందుకే ఆయన మానవుడయ్యాడు. ఖచ్చితంగా అది నిజము.
37.ఓ, మనము దానిపై ఆనుకొనుటకు ఇప్పుడు కేవలం కొద్దిపాటి సమయమున్నట్లయితే, కానీ మన సమయము ముగియుచున్నది. తన కుమారునిలో ఉన్న దేవుడు, తన విశ్వంలో ఉన్న దేవుడు, తన వాక్యములో ఉన్న దేవుడు. తన కుమారునిలో ఉన్న దేవుడు, తన వాక్యములో ఉన్న దేవుడు. తన కుమారునిలో ఉన్న దేవుడు, ఇప్పుడు కొద్ది క్షణములు తన ప్రజలలో ఉన్న దేవుడు. స్నేహితులారా, గమనించండి..? .. తన ప్రజలలో ఉన్న దేవుడు. తన ప్రజలలో ఉండు దేవుడని మీరు దానిని నమ్మదురా? ఆయన నిజంగా వున్నాడు, ఓ, మై. గమనించండి, అక్కడ నూట-ఇరవై మంది ఉన్నారు, ఆ పిరికి ప్రజలు, కొద్దికాలము యెరూషలేములో ఉండి దేవుడిని తన దేవుని వాక్యములో పొందుకొనుటకు వారు ధైర్యము చేసిరి. మరియు ఆకస్మాత్తుగా, వారు పైన (మేడగదిలో) వుండగా దేవుడు తన ప్రజలయందు నివసించుటకు దిగి వచ్చెను. మరియు ఆయన దానిని చేసినప్పుడు, వారు కిటికీల గుండా, తలుపులు, మరియు ప్రతీదాని గుండా వీధులలోనికి వెళ్ళిరి; వారు ఇక ఏ మాత్రము భయపడలేదు. మన దేవుడు దిగివచ్చాడు. ఆ మూడవ వ్యక్తి ఈ రాత్రి మరలా తన ప్రజల శరీరంలో నివసించుటకు వచ్చాడు. హల్లెలూయా. స్వయంగా దేవుడే, పరిశుద్దాత్మగా ఉన్న దేవుడు, తన ప్రజలలో నివసించుచున్నాడు.
38.ఇక్కడ కొన్ని రాత్రుల క్రితం, దూరంగా నిలబడినప్పుడు, ఒక సేవకుడు నాతో సవాలు చేసి అతడు చెప్పాడు, “దైవిక స్వస్థత…” “సహోదరుడుబ్రెన్ హామ్ఒక నకిలీవాడు (మోసగాడు) అని చెప్పాడు. అతని వద్ద ఏమీ లేదు. అతడు ఒక మత మోసగాడు. అతని వద్ద ఏమీ లేదు. దైవిక స్వస్థత ఒక మోసము (నకిలీ) మరియు సహో, బ్రె’న్హాం వారందరిలో ముఖ్యడు: ఒక మోసగాడు.” నేను ఎన్నడూ ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను వేదిక మీదకు నడిచి వెళ్ళి; “లేదు, నేను మోసగాడిని కాదు,” అని నేను చెప్పాను. దేవుడు, ఆయనే నాకున్న సాక్ష్యం, మరియు ఆ సమయంలో ఒక సుడులు తిరుగు అగ్ని ఆకాశంలో నుండి వచ్చుచున్నది. హల్లెలూయ. దేవుడు క్రిందికి దిగివచ్చి పరిశుద్దాత్మను నాపై నిలబెట్టి ఆ యాంత్రిక కళ్ళకు (కెమెరాకు) ఆ చిత్రాన్ని (ఫోటో) తీయునట్లుగా అనుమతించాడు. తన ప్రజలలో వున్న దేవుడు. హల్లెలూయ. దేవుని యొక్క ప్రజలలో దేవుడు ఉంటాడు అని మనము నమ్మినయెడల, ఆ ప్రజలు సురక్షితంగా ఉంటారు. అవునయ్యా. ఆయనే కవుల యొక్క హృదయాలను కదిలించువాడు. ఓ, అది మన ఊహకు అందని కార్యము. దేవుని నమ్మినది, మరియు విశ్వసించినది మనుష్యులు.
39.ఒకసారి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు..?.. అతడు ఒక రోజు వ్రాస్తున్నాడు, మరియు అతడు ఒక పాట వ్రాయుటకు ప్రయత్నిస్తున్నాడు; మరియు అతనికి ఏమి చేయాలో తోచట్లేదు. ఒక్కసారిగా, ఎడిల్ పెరోనెట్ అనే మరొక వ్యక్తిలో నుండి పాట వచ్చినది. ఆకస్మాత్తుగా, దేవుని యొక్క ఆత్మ అతనిపైకి (పాట వ్రాయుటకు ప్రయత్నించు వ్యక్తి పైకి) వచ్చింది. అతడు తన కలమును లాగి మరియు అతడు వ్రాసాడు:
యేసు నామములోని శక్తిని అందరూ పొగడాలి!
దూతలు బోర్లపడి (సాష్టాంగపడి);
రాజరిక కిరీటము తెచ్చును గాక,
అందరికీ ప్రభువని ఆయనకు కిరీటం పెట్టును గాక.
ఫెనీ క్రాస్బై అనే ఒక అంధురాలు, ఎన్నడు పగటి వెలుగును చూడని వ్యక్తి, ఒక రోజు తన గదిలో కూర్చున్నప్పుడు దేవుడు తన గ్రుడ్డి కవిపైకి వచ్చాడు. మరియు ఆయన అది చేసినప్పుడు ఆమె వ్రాసెను,
నన్ను దాటి వెళ్ళకు, ఓ గొప్ప రక్షకుడా,
నా దీన మొర్రను ఆలకించుము;
ఇతరులు కూడా నిన్ను పిలుచుచున్నప్పటికీ,
నన్ను దాటి వెళ్ళకుము.
నా సమాధానమునకంతటికీ నీవే ఊపిరివి,
నా ప్రాణం కంటే ఎక్కువ,
నీ ప్రక్కన ఈ భూమిపై నేనెంతటివాడను?
నీవు తప్ప ఆకాశమందు ఎవరున్నారు?
అది సత్యము. మరొకరు వ్రాసారు,
జీవించుచూ, ఆయన నన్ను ప్రేమించాడు;
చనిపోవుచు, ఆయన నన్ను రక్షించాడు;
పాతిపెట్టబడి, నా పాపములను బహు దూరముగా మోసుకొని పోయాడు;
తిరిగి లేచి, ఆయన ఉచితంగా యుగయుగములకు నీతిమంతునిగా తీర్చాడు:
ఏదో రోజు ఆయన వస్తున్నాడు, — ఓ, మహిమకరమైన దినము.
40.ఇది ఏమిటి? తన ప్రజలలో ఉన్న దేవుడు, తన వాక్యంలో వున్న దేవుడు, తన సేవకులలో ఉన్న దేవుడు, తన ప్రవక్తలలో ఉన్న దేవుడు, తన స్వస్థతలో ఉన్న దేవుడు. ఓ, ఈ రాత్రి ఈ భవనములో దేవుడు ఉన్నాడా? అది ఇప్పుడు ఇక్కడ మీరు నమ్ముచున్నారా? అది సత్యము. దేవుడు తన సృష్టిలో ఉన్నాడా? నీవు దానిని నమ్ముచున్నావు. అది సత్యమేనా? దేవుడు తన వాక్యములో ఉన్నాడా? మీరు దానిని నమ్ముచున్నారా? దేవుడు తన కుమారుడిలో ఉన్నాడా? మీరు దానిని నమ్ముచున్నారా? ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని నేను రుజువు చేయగలను. అది దేవుడే అని నేను నమ్ముచున్నాను. ఈ భవనములో ఇప్పుడు పరిశుద్దాత్మ ప్రవహించుచున్నది, అది అదే రీతిగా ఉన్నది. మరియు ఇక్కడ ఉన్న ప్రతీ వ్యక్తిని స్వస్థపరచును. దేవుడు తన ప్రజలలో ఉన్నాడు. నేను నమ్ముతాను, ఆయన రాత్రివేళ పిలచినప్పుడు, నేను … ఆయన పిలచినప్పుడు నేను దానిని పొందుకుంటాను. హల్లెలూయ. నేను పిచ్చివాడిని అని మీరు ఆలోచిస్తారు అని నాకు తెలుసు. బహుశా మీరు కూడా అదే అనుకోవచ్చు, కానీ నేను అలా ఆలోచించను. నేను నా … కోల్పోను ..? లోకపు మనస్సు బదులు నాకు క్రీస్తు యొక్క మనస్సు ఉన్నది. ఆయన నా ప్రాణం కంటే ఎక్కువ. మీరు దానిని ఇష్టం వచ్చినట్లు పిలుచుకోండి. మీరు ఈ రాత్రి పరిశుద్దాత్మను పిలవండి..?…. ఒకవేళ మీకు కావాలని అనుకుంటే. అయితే ఒక రోజు నేను ఒక పాపిని; ఇప్పుడు నేను ఒక క్రైస్తవుడిని. ఒక రోజు నేను గ్రుడ్డివాడిని; ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒక రోజు నేను..? … అన్ని రకముల…?.. ఒక రోజు నేను తిరుగులాడుచుండగా ఎవరో చెప్పారు, “శ్రీ. బ్రెన్ హామ్ ,ఈ భారం నీపై విడిచిపెట్టినందుకు నన్ను క్షమించు, కానీ నీవు ముగించబడ్డావు.” రెండు సంవత్సరాలకు మునుపు వారు నాతో చెప్పారు, “నీవు ముగించబడ్డావు.” మరియు ఈ రాత్రి నేను మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు ఇంకనూ తన ప్రజలలోనే ఉన్నాడు. హల్లెలూయ..?… దానిని నమ్ము..?. నేను ఎలా మీకు రుజువు చేయగలను? అది సత్యమేనా? ఆమేన్ అని చెప్పండి.
మా తండ్రివైన దేవా, ఇప్పుడు మేము ప్రార్ధిస్తున్నాము, ఈ రాత్రి ఈ ప్రజలపై స్వయంగా నిన్ను నీవే కుమ్మరించుకొనుము. మరియు వారిలో ప్రతీ ఒక్కరూ స్వస్థత పొందుదురు గాక. నా ప్రార్థన ఆలకించుము, ప్రభువా, వారు అనారోగ్యంతో ఉన్నారు. ఓ దేవా, నీ దీన దాసుడి మీదకి – నీ ఆత్మను రానిమ్ము. మరియు పాపము ప్రకటింపబడును గాక; మరియు ఇక్కడ ఈ రాత్రి ఈ ప్రజలు అన్ని రకముల వ్యాధుల నుండి స్వస్థత పొందుదురు గాక. యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమెన్.

1,346 total views, 3 views today