53-0217 కేవలము నమ్ముము

53-0217కేవలము నమ్ముము
తల్లాహస్సీ, ఫ్లోరిడా, అమెరికా

1. సహోదరుడు బాక్స్టర్, వందనములు.స్నేహితులారా, శుభసాయంత్రము. మన ప్రభువు మరియు రక్షకుడైన, యేసుక్రీస్తును, మీతో పాటు ఆరాధించుటకు ఈ రాత్రి ఇక్కడ ఉండుటకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనము ఆయనను ఎలా ప్రేమించెదము — ఆయన మనకు ఏమైయున్నాడు. “కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు… దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్దపరచెనో అవి మానవుని యొక్క హృదయములో ప్రవేశించెను,” అని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఆయన ఖచ్చితముగా ఆశ్చర్యకరుడు మరియు..
“వందనములు.”(సహో.బ్రెన్ హామ్ ప్రక్కన మాట్లాడుచున్నాడు), ఒక లోహపు బాకాను కలిగియుండుట చాలా వింతైయున్నది, అవును కదా? మంచిది, నా యొక్క స్వరమును అక్కడ కొంచెము దూరముగా పంపుటకు ఇది నాకు సహాయము చేయునదేదో అయియున్నది. నేను ఒక చిన్నవాడిని మరియు ఏలాగైనా నేను ఒక మంచి స్వరమును కలిగిలేను, కనుక అది (నా స్వరము) బయటకు వెళ్ళుటకు వారు కొంచెము ఒక అడుగు ముందుకు వేయవలసి వచ్చినదని నేను ఊహించుచున్నాను.
ఎవరో సహోదరుడు.. జాక్సన్ మనతో ఉన్నాడని కొద్ది క్షణముల క్రితము నా కుమారుడు నాతో చెప్పుచున్నాడు. అవును, సహోదరుడు జాక్సన్, దేవుడు నిన్ను దీవించును. ఈ రాత్రి అతడిని ఇక్కడ చూచుటను బట్టి నేను సంతోషిస్తున్నాను. సహోదరుడు జాక్సన్ ను ప్రభువు దీవించును.
2.మార్గములో వచ్చుచుండగా, బిల్లీ వచ్చి నన్ను ఎక్కించుకొనినప్పుడు (కారులో), అతడు చెప్పాడు, “డాడీ,” చెప్పాడు, “ఈ రాత్రి సహోదరుడు జాక్సన్ అక్కడ ఉన్నాడు.” మరియు గత దినమున నేను అతడి కొరకు చూస్తూ ఉన్నాను. మరియు సహోదరుడు జాక్సన్ మరియు నేను మొదటిసారి కలుసుకొన్నప్పటి దానిని గూర్చి నేను ఆలోచించుచున్నాను. అది అక్కడ, అది అతడి సంఘములో ఒక ఉజ్జివ కూడికలో అని నేను నమ్ముతున్నాను, అది మేము ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు అని నేను తలంచుచున్నాను, (అది మిస్సోరిలోని, కెన్నెట్ యేనా?)థాక్స్టన్, థాక్స్టన్,మిస్సోరి.మంచిది, సహోదరుడు జాక్సన్, అప్పటి నుండి ఆ జలాశయము పైనుండి చాలా నీరు పొర్లినది, అవును కదా? కానీ దేవుడు సహోదరుడు జాక్సన్ ను ఒక అసాధారణమైన రీతిలో ఉపయోగించుకొనుచున్నాడు.
కెవలము నమ్ముము సంఘమునకు ఇవ్వబడిన గొప్ప వరములలో ఒకటి: అతడు ఒక ఆశ్చర్యకరమైన విజయముతో రోగుల కొరకు ప్రార్ధన చేయును. మరియు అది మాత్రమే కాదు, కానీ అతడు చేతులుంచుటవలన ఈ దినము యొక్క ఆత్మయొక్క బాప్తిస్మమిచ్చు అతీతమైన పద్ధతులను కలిగియున్నాడు.
3.ఇప్పుడు, మొదటిసారి నేను పెంతుకోస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు, వారు పరిశుద్ధాత్మను గూర్చి వెదుకుచూ మరియు ఎదురు చూచుటను గూర్చి మాట్లాడుకొనుటను నేను విన్నాను. నేను దానిని అర్ధము చేసుకొనలేకపోయాను. పరిశుద్ధాత్మ ఇక్కడ రెండువేల సంవత్సరముల నుండీ ఉండియున్నప్పుడు వేచి యుండుట ఎందుకు? నేను “వేచియుండుట” అను పదమును చూసాను. దానర్ధము “ప్రార్ధించుట” కాదు. “ఎదురుచూచుట” అనగా “వేచియుండుట.” మంచిది, పెంతకొస్తు దినము పూర్తిగా వచ్చునంత వరకూ వారు ఎదురు చూడవలసియున్నదని నేను చూచాను, కానీ దాని తరువాత, ఎటువంటి వేచిచూచుట లేదు. పేతురు ఈ మాట పలికిన తరువాత, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడెను (దిగెను). పౌలు వారి పైన తన చేతులు వుంచాడు మరియు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
మంచిది, అది కొంచెము వ్యత్యాసముగా ఉన్నట్లుగా నాకు అనిపించినది. ఫిలిప్పు వెళ్ళి, మరియు ఆ సమరయులకు బోధించినప్పుడు, వారందరూ వాక్యమును స్వీకరించి మరియు బాప్తిస్మము పొందిరి, కానీ వారెవరిపైనా పరిశుద్ధాత్మ దిగి రాలేదు. పౌలు… అనగా నా భావము పేతురు దిగి వచ్చి, అతడు మరియు యోహాను, మరియు అతడు ప్రార్ధించి మరియు వారిపై చేతులుంచారు; పరిశుద్ధాత్మ వారి పైకి వచ్చెను.
మంచిది, నేను అనుకొన్నాను, అపోస్తులులకు సంబంధించినది అదే అని ఆ విధముగా నేను నమ్మియున్నాను. లేఖనము దానిని ఆ విధముగానే చెప్పుచున్నది.
మరియు ఇప్పుడు, మన సహోదరుడు జాక్సన్ కొరకు అదే సంగతిని దేవుడు చేసియున్నాడు. దానిని నేను ఎన్నడూ చూడలేదు… దానిని గూర్చి ఎక్కువగా నేను వినియున్నాను. సహోదరుడు జాక్సన్ అక్కడ డల్లాస్ వద్ద ఉన్నప్పుడు, అతడు అక్కడ ఉన్నాడు అని నా కుమారుడు నాకు చెప్పియున్నాడు. మరియు ఎక్కడో ఆ బలిపీఠము వద్ద నుండి ఎక్కడో, ప్రజలు అతని వద్దకు వరుస కట్టుటను చూచారు, మరియు వారిపై చేతులుంచుచూ వెళ్ళాడు, మరియు అతడు వారిపై చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నారు. లేఖనము అదే చెప్పుచున్నది. కేవలము దానినే నేను నమ్ముచున్నాను. అది ఆ విధముగానే చేయబడవలసియున్నదని లేఖనము చెప్పుచున్నది.
కనుక ప్రభువు యొక్క రాకడకు కొంచెము ముందు దేవుడు దానిని మన సంఘమునకు ఇచ్చియున్నాడు, దానిని బట్టి నేను చాలా సంతోషించుచున్నాను. అది నిజముగా ఆశ్చర్యముగా లేదా? ఓ, మై. మనము ఈ భూమిపైన మిక్కిలి సంతోషభరితమైన జనులుగా ఉండవలసియున్నది.
4. మన కవచమును ఉపయోగించండి. మనము ఒక కవచమును కలిగియున్నాము. దేవుడు మనతో పనిచేస్తూ మరియు మనకు ఆ కవచమును ఇచ్చును. మరియు ఆ సర్వాంగకవచము సహజాతీతమైయున్నది, చూశారా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, సహనము అవన్నీ సహజాతీతమైన దానిలో ఉన్నవి. మరియు ఒకవేళ మీ విశ్వాసమును దేవుని యొక్క ఆత్మకు మీరు విడిచిపెట్టినట్లయితే, అది మీ కొరకైన దేవుని యొక్క విమోచనా ఆశీర్వాదమునకు మీ శరీరమును పూర్తిగా లోబడుటకు తీసుకొని వచ్చును.
మరియు దేనికొరకైనా యేసు మరణించి, ఈ రాత్రి, మీ యొక్క ఒప్పుకోలులపై మధ్యవర్తిత్వము వహించుచూ, తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొనియున్నాడు. ఆయన చేసియున్నాడని, మీరు దేనినైతే ఒప్పుకొనెదరో, మరియు దానిని నమ్మండి, అది మీ వ్యక్తిగత స్వాస్థ్యము. ప్రతీ విశ్వాసి, తిరిగి-జన్మించిన ప్రతీ వ్యక్తి, ఏ విమోచనా ఆశీర్వాదమునకైనా అర్హుడైయున్నాడు.
నీవు రక్షించబడినప్పుడు, మీ యొక్క జీవిత ప్రయాణమంతటిలో చివరి వరకు నిన్ను ఉంచుటకు యేసు కేవలము తీసుకొని మరియు నీకు ఒక చెక్కు పుస్తకమును ఇచ్చును, మరియు ప్రతీ చెక్కుపైనా, క్రింద ఆయన పేరు సంతకము పెట్టబడెను. మనకేది అవసరమైననూ, “నా నామమున తండ్రిని అడిగితే, అది అనుగ్రహించబడును.” కేవలము ఒక చెక్కుపై సంతకము పెట్టి మరియు దానిని అక్కడికి పంపించండి. ఈ రాత్రి అలాంటి ఒకదానిపై సంతకము పెట్టుటకు నీవు భయపడుతున్నావా? లేదు. దానిని నింపి, దానిని పంపించండి. అది గుర్తించబడినది. అవును, అయ్యా. అది గుర్తించబడినది. ఆయన ఖచ్చితముగా దానిని నెరవేర్చును.
5. ఇప్పుడు, నేను కొంచెము ఆలస్యమయ్యాను, కనుక నా కూడికలు… నేను వాటిని ఎక్కువ సేపు ఉంచను, మీరు గమనించినట్లయితే, ఎందుకనగా అది దర్శనము క్రింది ఉన్నది. మరియు దర్శనము నన్ను చాలా బలహీనపరచును; అది ఎవరికైనా అలాగే చేయును. మరియు ఇక్కడ ఇప్పుడు నేను కొంచెము చదివి, మరియు తరువాత మనము నేరుగా కూడికలోనికి వెళ్ళిపోదాము.
లేఖనము చదువుట కొరకు పరిశుద్ధ లూకా సువార్తలోని 2వ అధ్యాయము, 25వ వచనముతో ప్రారంభించి, మనము ఇలా చదివెదము:
యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను.
అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను.
ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను; అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొనివచ్చినప్పుడు,
అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని, దేవుని స్తుతించుచు ఇట్లనెను,
నాధా, యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు:
నీ రక్షణ నేను కన్నులార చూచితిని.
6.ఒక్క క్షణము మన తలలు మనము వంచెదము.
ప్రభువైన యేసూ, బహుశా మేము, ఈ రాత్రి, నిన్ను నమ్ము ప్రజలుగా ఇక్కడకు మేము కలిసివచ్చియున్నాము. ఆయన మహిమకరమైన రాజ్యములోనికి మమ్మును స్వీకరించులాగున, ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము, ఆ గొప్ప యుగమునకు అంతము లేదు. మరియు బహుశా, ఇప్పుడు ఈ రాత్రి మేము, ఆ పాత సుమియోను వలె, మా విశ్వాసపు చేతులలో రక్షకుడిని ఎత్తి పట్టుకొనెదము. ఈ ఆశీర్వాదములన్నీ మీరు మాకు వాగ్దానము చేసియున్నారు మరియు విశ్వాసము ద్వారా వాటిని పొందుకొనెదమని మేము నమ్ముచున్నాము.
అవిశ్వాసమే పాపమని గుర్తెరిగి, నీకు వ్యతిరేకముగా చేసిన మా తప్పిదములను, మా పాపములను, అతిక్రమములను మన్నించండి. ప్రభువా, మా యొక్క అవిశ్వాసమును బట్టి, మమ్ములను మన్నించండి. మేము ఇక్కడ సమకూర్చబడియుండగా, ఈ రాత్రి మాకు సహాయము చేయండి — వేర్వేరు సంఘాలు, వేర్వేరు ప్రజలు, వేర్వేరు జాతీయతలు, కానీ ఒకే దేవుడు అందరిలోనూ పనిచేయుచున్నాడు. మరియు నీ ఆశీర్వాదములను పొందుకొనుటకు ఇప్పుడు మాకు సహాయము చేయండి. మరియు పరిశుద్ధాత్మ వచ్చి దేవుని యొక్క కార్యములను తీసుకొని మరియు అది నేరుగా ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళును, యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమెన్.
7. కేవలము ఒక్క క్షణము. మొదటి సంగతి, ఒకవేళ ఏ సేవకుడైనా ప్రసంగించుటకు వేదిక యొద్దకు వచ్చినప్పుడు, మొదటిగా అతడు తన సమాజమును అనుభూతి చెందవలసియున్నది. మీరు మీ ఆత్మీయమైన భారమును పొందుకొనవలసియున్నది. అప్పుడు అది మీకు చాలా సహాయము చేయును; విశ్వాసము ఎక్కడ ఉండునో దానిని మీరు అనుభూతి చెందగలరు. మీరు ఎక్కడ విశ్వాసము కలిగియున్నారను దాని గూర్చి సహోదరుడు జాక్సన్ బాగుగా ఎరిగియున్నాడని నేను తలంచుచున్నాను.
ఇప్పుడు, లేఖనము చదువుటలో, సుమియోను అను పేరుగల ఒక వృద్ధుడను మనము కనుగొనియున్నాము. మనము, అతడి యొక్క పొడవాటి, తెల్ల గడ్డము మరియు జుట్టుతో బహుశా, ఒక వృద్ధ పరిశుద్ధుడని అతడిని పిలిచెదము, ఎక్కడో ఎనభైలకు (సంవత్సరములకు) దగ్గరలో ఉన్నాడు. మరియు అతడు ఒక చాలా దైవభక్తి గలవాడు, మత సంబంధమైన వ్యక్తి. మరియు ప్రభువు యొక్క క్రీస్తును చూచేంత వరకూ అతడు చనిపోబోవుట లేదని పరిశుద్ధాత్మ అతడికి బయలుపరచెను. మరియు అతడు ప్రభువును చూచేంత వరకూ అతడు చనిపోబోవడం లేదు అని చుట్టూ తిరుగుతూ ప్రజలకు చెప్పడములో అతడు భయపడలేదు.
8. ఇప్పుడు, అది ప్రజలకు ఎంత పిచ్చితనముగా కనపడునో మీరు ఊహించగలిగారా? ఎందుకు, కొంత మంది ఇలా చెప్పుటను నేను వినగలుగుచున్నాను, “ఆ ముసలివాడు ఒక రకమైన, మీకు తెలుసు, అతడు ఒక రకముగా వయస్సయిపోయి మరియు తన మతి-స్థిమితమును కోల్పోయాడు, మరియు అటువంటి స్థితిలో అతడు ఉన్నాడు. ఎందుకు, చూడుము, దావీదు కూడా ఆయన కొరకు ఎదురుచూచెను, మరియు తరువాత అందరూ, ఎందుకు, సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు. మరియు ఇక్కడ, ఈ ముసలివాడు దాదాపుగా ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళుటకు సిద్దముగా ఉండి, క్రీస్తును చూచేంత వరకూ అతడు చనిపోబోవడము లేదు, అని చెప్పుచున్నాడు. మరియు ఇక్కడ మనమందరము రోమను సామ్రాజ్యము క్రింద ఉన్నాము, రోమన్లు యొక్క ప్రభుత్వముల క్రిందకు, మరియు, ఎందుకు, మనము చేయలేము… మంచిది, క్రీస్తు ఇప్పుడు రాబోవుట లేదు.”
9. కానీ సుమియోను నమ్ముటకు కొన్ని ఆధారములు కలిగియున్నాడు, ఎందుకనగా అతడు క్రీస్తును చూచేంతవరకూ అతడు చనిపోవుట లేదు అని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడెను. ఇప్పుడు, పరిశుద్ధాత్మ దానిని మీకు బయలుపరచినప్పుడు, నమ్ముటకు అది ఒక మంచి విధానమైయున్నది. దానిని నమ్మండి.
ఈ గ్రంధములో చాలా సంగతులు ఉన్నవి, చాలా వరకు ఉన్నవి – వాటి గూర్చి నాకేమియూ తెలియదు, కానీ ఇంకనూ దాని యొక్క ప్రతీ మాటలను నేను నమ్మెదను. నేను దానిని వివరించలేను, కానీ నేను దానిని నమ్మెదను.
మరియు ఇప్పుడు గృహము యొద్ద, నాకుగా నేను ఆదికాండముపై వరుస కూడికలను కలిగియున్నాను, ఆదికాండము గుండా తీసుకొని. ఎందుకు, మై! ఆదికాండములోని ప్రేరేపణను మీరు చూడగలిగినట్లయితే. మీరు ఆదికాండములోని మొదటి అధ్యాయమును తీసుకొని మరియు ప్రకటనలోని చివరి అధ్యాయముతో దానిని అల్లివేద్దాం, బైబిలు గుండా. దానియొక్క ప్రతీ మాట ప్రేరేపించబడినదే; దానియొక్క ప్రతీ మాట సత్యమే. పరిశుద్ధాత్మ ఆ కాలము గుండా చూచియున్నది, అది దేవుని యొక్క వాక్యమంతా ప్రేరేపించబడినదే.
10.మరియు కాలములో, ఆ పాత చక్రములు నెమ్మదిగా తిరుగును, కానీ అది ఖచ్చితముగా తిరుగును. అది ఏలాగు ఉండబోవుచున్నదని దేవుడు చెప్పియున్నాడో, అది ఖచ్చితముగా ఆ విధముగానే ఉండవలసియున్నది. అది ఎంత కృత్రిమమైన దానిగా కనిపించినప్పటికి, అయితే అది ఆ విధముగానే ఉండబోవుచున్నది.
గత రాత్రి మనము మాట్లాడుకున్నాము: ఒకప్పుడు వారు విద్యుత్తును కలిగిలేరు, కానీ అటువంటి ఒక సంగతి ఉన్నదని ఒక వ్యక్తి నమ్మియున్నాడు; మరియు అది ఏమిటో కనుగొనేంత వరకూ అతడు అలసటలేని గంటలు శ్రమపడియున్నాడు. మరియు అదే సంగతి దూరదర్శిని ద్వారా, ఆటోమోబైల్ ద్వారా, మరియు అటువంటివి. మన యొక్క ఉపయోగము కొరకు దేవుడు ఆ సంగతులన్నిటినీ ఇక్కడ పెట్టియున్నాడు.
ఇప్పుడు, ఒకవేళ సహజాతీతమైన దానితో సంబంధము కలిగియున్న మనము ఒక మానవుడిని తీసుకొన్నట్లయితే, ఎక్కడైతే… ఇంద్రియములలో(తో) ఉన్న మానవుడు తన ఇంద్రియముల యొక్క పరిధిలోనే ఉండిపోతాడు. అయితే ఆత్మలో ఉన్న మానవుడు అపరిమితమైనవాడు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము కేవలము కొంత ఎత్తు మాత్రమే ఎదిగి, మరియు అది తిరిగి విరిగిపోవును. కానీ జీవవృక్షము నిత్యము ఎదుగుతూనే ఉండును. మరియు మనము అతడి ప్రాణముతో కలిగియున్న దానికన్ననూ ఆ విజ్ఞాన శాస్త్రము ఏ విధముగా మానవుడిని అతడి యొక్క అయిదు ఇంద్రియముల ద్వారా దూరముగా తీసుకొనిపోయెనో చూడండి. మంచిది, మనము ఇంకనూ తాకబడని వనరులను కలిగియున్నాము, సమస్తమూ సాధ్యమే. విభాగించబడిన అణువులను గూర్చి మాట్లాడుము, మరియు ఆ అలలు, దాని గుండా…

1,245 total views, 2 views today