51-0719 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను

51-0719మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?
టోలీడో, ఒహాయో, అమెరికా

1. సహోదరుడా బాక్స్టర్, ధన్యవాదముల [జనులు చప్పట్లు కొట్టుచున్నారు.]సహోదరుడా ధన్యవాదములు.అటువంటి ఆహ్వనము కొరకు చాలా ధన్యవాదములు, దాని కొరకు నేను చాలా నిజమైన మంచి అనుభూతిని పొందియున్నాను. సహోదరుడు అప్షాను చూచుటను బట్టి నేను చాలా ఆశ్చర్యపోవుచున్నాను.
నేను సహోదరుడు బాక్స్టర్ కన్నా కొంచెము పొట్టివాడను [స్పష్టతలేని మాటలు]. ఈ రాత్రి ఇక్కడ ఉండుట నిజానికి గొప్ప భాగ్యమైయున్నది.
ఈ మధ్యాహ్నకాలమున నేను మరికొన్ని మంచి సంగతులను వినియున్నాను. నా భార్య, బహుశా ఈ కూడికకు రావచ్చును. మరియు ఆమె ఇక్కడ ఉండునని నేను ఆశించుచున్నాను. మేము మిమ్ములను ఎంతగానో జ్ఞాపకము చేసుకొందుము. ధన్యవాదములు. ధన్యవాదములు.
ఒకవేళ బ్రెన్ హామ్కుటుంబమునకు ఏదైనా ఘనత రావలెనన్నచో అది ఆమెకే చెందవలసియున్నది. దానిని పొందుటకు ఆమె అర్హురాలు. ముపై సంవత్సరముల వయస్సు కలిగియున్నది మరియు తల నెరసినది. ఆమె కష్టమును చూచినది. అక్కడ నేను కలిగిన నా ఫోన్… కొన్ని సమయములలో మేము దానిని కలిగియున్నప్పుడు, సుమారుగా రాత్రి, పగలు గంటకు అరవై-నాలుగు ఫోన్ కాల్స్ వచ్చుట నేను చూచాను. మరియు ద్వారము దగ్గరనున్న జనులు మరియు అటువంటివారు. ఆమె ఒక భయంకరమైన సమయమును కలిగి ఉండెను. కాని దేవుడు మమ్ములను ఆశీర్వదించెను, మరియు ఆయనకు సేవ చేయుటను బట్టి మేము ఆనందించుచున్నాము.
2.ఈ రాత్రి ఇక్కడ కాంగ్రెస్ మెన్ ను చూచుట వాస్తవముగా ఒక అశ్చర్యమైయున్నది. నేను అతని యొక్క స్వస్థతను ఎన్నడూ మరువను. అతడు నన్ను కలసినప్పుడు, ప్రభువు యొక్క దూత నన్ను సూచించిన వ్యక్తి ఇతడేనని, నేను అనుభూతి చెందితిని. మరియు “నీవు గొప్ప వ్యక్తులు, దేశాధికారులు, భూరాజులు గురించి ప్రార్ధించెదవు,” అని చెప్పెను. అలాంటి ప్రజల కొరకు నేను ప్రార్థించుదునని ఏనాడైనా ఎలాగు నమ్మగలుగుదును. నాకు మొదట ఎదురైన ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఇంగ్లాండ్ రాజైన జార్జ్ ఒక కేబుల్ ద్వారా పంపిన సమాచారం (cablegram) పంపించి అతని కొరకు, అతనికున్న మల్టిపుల్ స్కెలిరోసిస్ వ్యాధి కొరకు ప్రార్థించమని కోరెను. దేవుడు అతనిని స్వస్థపరచెను.
ఆ రాత్రి సమయమున నేను ఎన్నడూ కాంగ్రెస్ మెన్ అప్షాను ఎరిగియుండినప్పుడు, అతడు నిలబడినప్పుడు… అతడు అధ్యక్షుడి కొరకు పోటిచేయుచుండెను, అది 1919 అని నేను అనుకొనుచున్నాను. అతడు వచ్చియున్న జార్జియా రాష్ట్రమునకు, అతడు ఏదో అయివున్నాడని నేను అనుకొనుచున్నాను, సెనేటర్ లేదా అక్కడ ఏదో, అతడు కాంగ్రెస్ కు పనిచేసి మరియు కాంగ్రెస్లోనే రిటైర్ అయిన, అంతర్జాతీయముగా అందరికీ తెలిసిన వ్యక్తి.
3.మరియు ఒక రాత్రి నేను గుడిలోనికి నడిచివెళ్ళితిని. మరియు ఇక్కడ నేను ఎరుగునట్లుగా, నాకు ఎవ్వరూ తెలియదు. అక్కడ అంతా చక్రాల కుర్చీలు వరుస పెట్టి ఉన్నవి. ఎందుకు, ఈ రాత్రి ఇక్కడ ఉండినట్లుగా.
ఈ రోజు వ్యాపారవేత్తలుగా కూర్చొని ఉన్న ఒకరు తెలుసుకోవాలనుకొనుచున్నారు. ఎందుకు, గతరాత్రి ఆ చక్రాల కుర్చీలో ఉన్న ఆ స్త్రీ స్వస్థత పొందుకొన్నది, ఎందుకు చక్రాల కుర్చీలో ఉన్న వేరొకరిని నేను స్వస్థపరచలేదు?
“ఎన్నడు నేను ఆమెను స్వస్థపరచలేదు, మరియు నేను ఎవ్వరిని స్వస్థపరచను. యేసుక్రీస్తు ఆమె యొక్క విశ్వాసము యొక్క యోగ్యతల ద్వారా ఆమెను స్వస్థపరచెను. మరియు అది జరుగుట నేను చూచాను మరియు దాని గూర్చి నేను ఆమెకు చెప్పాను, అది అంతే.” నేను చెప్పాను, “ఆయన నాకు చూపించినట్లయితే, నేను వారందరికీ చెప్పియుండెడివాడను. కాని ఆయన నాకు ఏమి చేయమని చెప్పెనో దానిని మాత్రమే చేసెదను.”
4. మరియు నా జీవితంలో నేను ఎన్నడూ ఈ యోధుడైన శ్రీ అప్షా గురించి వినలేదు. నేను నిరాక్ష్యరాసుడనని నా మాటలను బట్టి మీరు ఎరుగుదురు. నేను పది మంది పిల్లలు ఉన్న పెద్ద కుటుంబములో పెరిగాను. నాకు కనీసము పాఠశాల విద్య కూడా లేదు. పాఠశాలలో నేను కలిగియున్నది ఏడవ తరగతి మాత్రమే. నేను తొమ్మిది మంది పిల్లల భాగోగులు చూచుటకు పనిలోనికి వెళ్ళవలసి వచ్చేది. నా తండ్రి మంచి ఆరోగ్యవంతుడు కాదు, యవ్వనములోనే చనిపోయెను, మరియు నేను పనిలోనికి వెళ్ళవలసి వచ్చినది. నేను సరైన చదువు కలిగియుండినట్లయితే, నాకు శ్రీ అప్షా గూర్చి తెలిసియుండేడిది.
మంచిది, ఒక రాత్రి నేను భవనములోనికి నడుస్తుండగా, మరియు నేను ఒక దర్శనమును చూచాను. మరియు చక్రాల కుర్చిలన్నియూ అక్కడ ఉంచబడినవి. నేను చూచియుండగా, మరియు యవ్వనములో ఉన్న ఒక యవ్వనస్తుడు క్రింద పడియుండుటను నేను చూచాను; గడ్డివాము లేదా మరిదేనిమీద నుండో పడియున్నాడు, తనకుతాను గాయపరచుకొన్నాడు. నాకు తెలుసు అని నేను చెప్పగలిగినదంతయూ అదే. నేను అతడిని ఉన్నత స్థలమందు చూచాను, వింతగా కనపడుచున్న కాలర్ను ధరించియున్నాడు, అదే వ్యక్తిగా కనపడియున్నాడు. ఎవరో అతని కొరకు చప్పట్లుకొట్టుచున్నారు. నాకు తెలిసినది అదే.
ఎవరో చెప్పారు… సహోదరుడు బాక్స్టర్, “నీవు చూచినది ఎవరో నీకు తెలుసా?” అని అడిగాడు.
“లేదు” అని నేను చెప్పాను.
అది… కాంగ్రెస్ మెన్ అప్షా గూర్చి నీవు ఎన్నడైనా విన్నావా?“ అని అడిగెను.
“లేదయ్యా,” అని నేను చెప్పాను.
“అతడు నీ ముందు కూర్చొనియున్నాడు, అది అతడే,” అని చెప్పెను.
మరియు తరువాత నేను చూచాను, మరియు “అతడే ఆ వ్యక్తి, అక్కడ కూర్చొనియున్నది అతడే,” అని చెప్పాను.
5. నేను ముందుకు వెళ్ళి మరియు ఏమి జరుగునా అని చూచుట ప్రారంభించాను. ఒక బక్కగా ఉన్న వైద్యుడు, గొప్పవైన, పెద్ద తాబేలు డొప్పలాంటి కళ్ళద్దాలు ధరించియున్న ఒక వైద్యుడు అక్కడే నిలబడి యుండటం నేను చూచాను. అతడి తలముందు కలిగియున్న అద్దం వంటి ఒక పరికరముతో వారు ఆయన నోటిలోనికి చూచుచున్నట్లుగా ఉన్నది. అతడు తన తలను అలా ఆడిస్తూ మరియు చెప్పడం నేను చూచాను.
నేను క్రిందకు చూచాను, అక్కడ ఒక చిన్న నల్లజాతి బాలిక చనిపోవుచూ పడియున్నది. అతడు ఆమె యొక్క టాన్సిల్స్ తీసివేశాడు. అది ఆమె యొక్క నడుము నుండి లేదా ఆమె గొంతు క్రింద నుండి పక్షవాతము వచ్చినట్లుగా చేసినది. ఆమెకు పక్షవాతము వచ్చినది. నేను ఆ చిన్న బాలికవైపు చూచాను మరియు నేను చెప్పాను, “నేను ఒక వైద్యుడను చూచాను. అతడు శస్త్రచికిత్స చేసెను, ఒక బాలిక నుండి టాన్సిల్స్ను తీసివేసియున్నాడు. ఆమె పక్షవాతముతో ఉన్న నల్లజాతి బాలిక.”
నేను ఇటువైపునకు తిరిగి చూచాను, మరియు ఎవరో ఏడ్వడం నేను వినియున్నాను. నేను చూచియుండగా, కుడివైపున కూర్చొనియున్న ఒక పెద్ద వయస్సు , కలిగిన నల్లజాతి స్త్రీ అక్కడ ఏడ్చుచుండెను, “మంచి ప్రభువా, ఆమె నా బిడ్డ” అని ఆమె చెప్పినది.
అక్కడ పడియుండగా, నేను చూచాను; మరియు “అవును, ఆ బిడ్డయే. అది వచ్చి దాదాపు రెండు సంవత్సరములైనది, అలా కాదా అమ్మా?” అని నేను చెప్పాను.
“అది సరియే,” అని ఆమె చెప్పినది.
“అది రెండు సంవత్సరముల క్రితము అని దానిని చూచుటను బట్టి నేను ఊహించుచున్నాను,” అని నేను చెప్పాను.
“జరిగినదంతయూ అదే” అని ఆమె చెప్పినది.
నేను ఈ వైపునకు వెనుకకు తిరిగి మరియు వేరొకరిని వరుసలోనికి పిలిచాను. మరియు నేను చూడవలసి వచ్చినది; ఒక మార్గము ఇలా వెళ్ళడము – లేదా ఒక వీధిగుండా వెళ్ళడం నేను చూచాను. నేను ఆ చిన్న నల్లజాతి బాలిక, ఆమె చేతితో ఒక బొమ్మ పట్టుకొని వీధి గుండా వెళ్ళడం చూచాను. అది అదే. చెప్పెను, “అది సరే, అమ్మా. అది ముగించబడినది. నీ యొక్క బిడ్డ స్వస్థపరచబడినది,” అది అదే, చూడండి.
6.ప్రభువు యొక్క ఆత్మ ప్రేక్షకులలోనికి వచ్చి మరియు నా యొక్క బలమును పీల్చివేసినది. మరియు వెంటనే నేను క్రిందకు వెళ్ళటం ప్రారంభించినప్పుడు, నా సహోదరుడు నన్ను పట్టుకొనుటకు నా యొద్దకు పరుగెత్తెను. మరియు నేను చూచాను; నేను కాంగ్రెస్ మెన్ అప్షాను చూచితిని. అతడు మొదట పడి మరియు తనకు తాను గాయపరచుకొన్నప్పుడు, అతడొక కుర్రవానిగా ఉన్నదగ్గర నుండి అతడు కూడికలలో ఉన్నాడు; అప్పుడు అతడు దేవుని చేత స్వస్థపరచగోరెను. శ్రీ. రాబర్ట్ చెప్పినది అతడు వినియున్నాడు; అతడు శ్రీ. ఫ్రీమన్స్ కూడికలకు వెళ్ళియున్నాడు, శ్రీ. ఓగిలేవీ మరియు చాలా మంది అతని కొరకు ప్రార్థించిరి.
స్నేహితులారా, కొంతసేపటి తరువాత ఆ యొక్క వరుసల మద్య చెప్పుటకు నాకొక విషయము కలదు. నీవు ఎంత విశ్వాసము కలిగి ఉన్ననూ, అది ముందు నిర్ణయించబడిన దేవుని యొక్క చిత్తమును ఎన్నడూ మార్చనేరదు. ఏమి జరుగునో అని చూచుటకు దర్శనము చేత అది రావలసియున్నది.
మరియు అది ప్రారంభించబడినప్పుడు, అతడొక గోధుమ రంగు సూటులో వీధిలో వెళ్ళుచూ, తన యొక్క టోపీని జనులవైపు ఊపడం నేను చూచాను. “ప్రభువు యొక్క నామములో కాంగ్రెస్ మెన్ అప్షా స్వస్థపరచబడును,” అని నేను చెప్పాను.
కనుక పడిపోయిన తరువాత, అరవై-ఆరు సంవత్సరములు కుంటివాడిగా చాలా సంవత్సరములు మంచము మీద పడియుండి, మరియు చక్రాల కుర్చీలో అంతటా తిరుగుచుండెను… వీధిలో పుస్తకములు అమ్ముట చేత ప్రజలను కాలేజీ ద్వారా పంపెను, అది ఇప్పుడు మన యొక్క ప్రభుత్వములో ఉన్నది; మరియు ఒక యోధునిగా, ఒక గొప్ప మనిషిగా, ఒక అధికారిగా మరియు మన యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రములకు కాంగ్రెస్ మెన్ గా ఆయన తన యొక్క సమయమును వెచ్చించెను. అక్కడ, ఆ మనిషి, అరవై-ఆరు సంవత్సరములలో మొట్టమొదటిసారిగా, అతని యొక్క చేతి కర్రలను (ఊత కర్రలు) ప్రక్కకు విసిరివేసి, పరిపూర్ణుడయ్యెను. పరిశుద్ధాత్మ ఏమి చెప్పెనో దానికి అతడు లోబడెను.
అక్కడ, అతడి ప్రక్కన ఒక స్త్రీ కూర్చొని ఉండెను, కొన్ని సంవత్సరముల నుండి కీళ్ళవ్యాధి కలిగియుండి, అరచుచుండెను, మరియు చెప్పెను, “నా సంగతి ఏమిటి.” నేనెట్లు చెప్పగలను? నేను ఆమెకు ఏమి చెప్పగలను? తండ్రి నాకు ముందుగా చూపించవలెను.
7.మరియు శ్రీ. అప్షా ఇంతకు ముందే చాలినంతగా దానిని వినియున్నాడు. అది నేను కాదు అని అతడు ఎరిగియున్నట్లుగా, అతడు కూటములకు రాకమునుపే అతడు చెప్పెను. దానినే దేవుడు అక్కడ నుండి చెప్పియున్నాడు, అతడు ఇతరులను చూచియుండెను గనుక, అతడు నమ్ముటకు విశ్వాసమును కలిగియుండెను, మరియు ఈ రాత్రి ఇక్కడ నిజమైన ఈ సాక్ష్యమును వినుటకు శ్రీ. అప్షా మరియు అతడి యొక్క భార్య ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవుడు…. [సహోదరుడు అష్షా ఆటంకపరచుచున్నారు.]
మరియు అతడు చెప్పెను, “ప్రభువునకు స్తోత్రము.” ఆమేన్. అది… మరియు ఇక్కడ అతడు ఎనబై-నాలుగు సంవత్సరముల వయస్సు కలిగియుండి, ఎటువంటి ఒక పిల్లవాడి కన్ననూ సజీవముగా ఉన్నాడు.
8.ఇప్పుడు, జనులైన మీకెవ్వరికైననూ నేను… స్వస్థతను పట్టించుకొనుటలో నేను చాలా సార్లు మీకు చెప్పియున్నాను, తండ్రి ఏది చేయాలో నాకు చూపించనంత వరకూ నేను దేనిని చేయను.
ఎవరో చెప్పెను, “సహోదరుడా బ్రెన్ హామ్ , నీవు జనులందరినీ పైకి పిలచి మరియు వారిలో ప్రతీ ఒక్కరికీ నీవు ఎందుకు ప్రార్థించకూడదు.” “అది సరే, నేను దానిని చేయగలను. అదంతయును సరే.” నేను కూటములను జరిగించు విధానము ఖచ్చితముగా అది కాదు. జనులకు పరిచర్య చేయుటకు ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క ఆత్మ ద్వారా నాకివ్వబడిన దానిని బట్టి నేను కూడికలను నడిపించెదను. ఇప్పుడు, వారికి పరిచర్య చేయుటకు మనకు తెలిసిన మంచిదానిని మనము చేయుదము.
మరియు ఇప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళుటకు ముందు, నేను, ఇప్పుడే చెప్పినదానిని రూడిపరచుటకు నేను కొన్ని లేఖనములను చదువగోరుచున్నాను. పరిశుద్ద యోహను 5 నుండి ఇప్పుడు నేను చదువగోరుచున్నాను, మరియు దానిని గుర్తుపెట్టుకొనవలెనని అనుకొన్నవారు గుర్తుపెట్టుకొనుడి. మరియు నేను… నేను ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను.
ఇప్పుడు, నా మాటలు ఒక మనుష్యుని యొక్క మాటలై యున్నవి, అవి విఫలమగును. అయితే దేవుని యొక్క మాట అనునది విఫలము కాని దేవుని యొక్క వాక్యమై యున్నది. దేవుని యొక్క వాక్యము సత్యము మరియు నిశ్చయముగా సత్యమని ఎంత మంది విశ్వసించగలరు? ధన్యవాదములు. అప్పుడు అది… అది తప్పుగా అర్థము చేసుకొనబడవచ్చును. నేను యేసును గూర్చి చదివెదను. ఇది ఆయన పరిచర్య యొక్క తొలినాల్లలో, ఆయన తనకు తానుగా జనుల ముందు వ్యక్తపరచుకొనుచున్నాడు.
“అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను; మరియు యేసు యెరూషలేమునకు వెళ్ళెను.
మరియు ఇప్పుడు, యెరూషలేము యొద్ద గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు గలదు, అది హెబ్రీ బాషలో బెతెస్థ అని పిలవబడును, దానికి అయిదు మంటపములు కలవు.
ఇక్కడ, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు గలవారు, బలహీనులైన గొప్ప జనసముహాములు నీళ్ళ కదిలింపుకై వేచియుండి అక్కడ పడియుండిరి. ఒక నిశ్చయమైన సమయములో, ఆ కోనేటిలోనికి, ఒక దేవదూత దిగివచ్చి ఆ నీటిని కదల్చును; ఆ నీళ్ళు కదల్చబడిన తరువాత ఎవరైతే మొదటగా అందులోనికి దిగెదరో, అతడు ఎటువంటి వ్యాధిని కలిగియున్నను అది బాగుచేయబడును, ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును,
అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాది గల ఒక ప్రత్యేకమైన మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి – స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా,
ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు, నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
యేసు – నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పెను.
వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుగెత్తుకొనిపోయెను. [టేపులో ఖాళీ స్థలమున్నది.] ఆ దినము విశ్రాంతి దినము.“
ఇప్పుడు, ఆ అధ్యాయమంతా మీరు చదవాలని నేను కోరుచున్నాను. కాని నేను పంతొమ్మిది మరియు ఇరవై వచనములను చదివెదను. మరియు అతడు ప్రశ్నించబడినప్పుడు…
ఇప్పుడు, ఒక్క క్షణములో నేను వచనము దగ్గరకు వచ్చెదను, మీరు ఆ దృశ్యమును చూడాలని నేను కోరుచున్నాను. మరియు ఇప్పుడు, దయచేసి మీ అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతను ఈ వరుసల మీద ఉంచుము, కాబట్టి ఏ విధమైన… ఉండకూడని ఏ విధమైన మూఢభక్తిని మరియు తలంపులను అది తుడిచివేయును.
9.యేసు కన్యక గర్భమున జన్మించిన దేవుని కుమారుడు. మనము దానిని నమ్ముచున్నాము. మనము క్రైస్తవులమైతే… ఆయన కన్యక గర్భమున జన్మించెనని మనము నమ్మవలెను. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ చిన్న బాలిక అయిన మరియను కమ్ముకొని దేవుని యొక్క కుమారునిగా అభివృద్ధి పొందుటకు, ఆ రక్త కణమును ఆమె యొక్క గర్భములో సృజించెను అని నేను నమ్మెదను. మరియు దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరచుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా ఆయన చెప్పెను, “క్రియలను చేయునది నేను కాదు, నాలో నివసించు నా తండ్రి వాటిని చేయుచున్నాడు.”
మరియు ఇప్పుడు, అతని పరిచర్య యొక్క ప్రారంభములో గొర్రెల సంత అయివున్న కొలను ప్రక్కగా ఆయన వచ్చెను. దానిలోనికి వెళ్లుటకు మనకు సమయము ఉండదు, ఎందుకనగా గొర్రెల సంత అనగా ఏమిటని చదువుచున్న మీకు తెలియును, అక్కడ బెతెస్థ యొద్ద కొలను యున్నది, అది అయిదు మంటపాలను కలిగియున్నది, అక్కడకు అనేక చోట్ల నుండి గొర్రెలు వచ్చియున్నవి. మరియు ఆ కొలను… ఆ కొలనుకు.
10.అక్కడ ఎదురుచూచుచున్న ఈ ప్రజలు మూఢభక్తి గలవారు అని కొందరు ప్రజలు తలంచిరి. అక్కడ ఒక దూత దిగివచ్చి మరియు నీళ్ళను కదిలించుచూ, ఆ నీళ్ళను కోయుచున్నది; అది చాలా భయంకరమగు నీరు. మరియు అందులోనికి మొదట విశ్వాసముతో దిగినవాడు ఎట్టి వ్యాధిగలవాడైననూ అతడు బాగుపడును.
ఇప్పుడు, ఆ దృశ్యమును గమనించుదము. మరియు ఈ గవిని చుట్టూ చాలా మంది జనులు ఉన్నారు.
ఈ జనుల గురించి ఇప్పుడు, నీవు ఏమి ఆలోచించుచున్నావు? ఇప్పుడు, అక్కడ కూడి యున్న జనులు రెండు వేల మంది అని మనకు చెప్పబడినది. మరియు జనాంగము అనగా బహువచనము, గొప్ప జనాంగము. ఇప్పుడు, అక్కడ బహుశా, పదివేల మంది జనులని చెప్పుకొందాము, బహుశా అక్కడ ఎక్కువ ఉండవచ్చును. కనీసము, అయిదు నుండి పదివేల మంది జనులని మనము చెప్పెదము.
11.ఇప్పుడు, వారు ఏ రకమైన గుంపువారు అనేది చూద్దాం: కుంటి, అవిటి, గ్రుడ్డి, ఎండిపోయిన వారు. వికారముగల కనికరములేని ఎంతోమంది జనులు ఈ యొక్క నీరు కదిలించబడుట కొరకు ఎదురుచూచుచున్నారు. వారు సంపూర్ణ స్వస్థత పొందుకొనుటకు కావలసిన విశ్వాసము ఉన్నదా అని చూచుటకై, ఆ నీటిలోనికి వెళ్ళుటకై, వారు కొట్టుకొని యున్నారని, మరియు ఒకని కంటే మరొకడు ముందుగా వెళ్ళవలెనని, ఒకనికొకడు కత్తులతో కోసుకున్నారు, అని చరిత్రకారులు మనకు చెప్పుచున్నారు.
ఇప్పుడు, యేసు ఆ కొలనును దాటుచూ వెళ్ళెను. యేసు ఆయన యొక్క రోజులలో ఎటువంటి విభిన్నమైన వ్యక్తిలా తనకు తాను దుస్తులు ధరించలేదు. తనకు తాను గుర్తించబడుటకు ఎన్నడునూ ఒక విభిన్నమైన వస్త్రమును ధరించలేదు.
దేవుని యొక్క రాజ్యము అనగా మనము ఎటువంటి దుస్తులు ధరించామన్నది కాదు; అది, నీ హృదయములో ఏమి ఉన్నది అనునదియే. మీ యొక్క కాలరులను త్రిప్పిపెట్టనవసరము లేదు; లేదా మీరు డాక్టరు, లేదా రెవరెండ్ అని పిలిపించుకొనుటకు కాదు. అది నీ హృదయములో నీవు ఏమైయున్నావు అనునదియే.
యేసు ఒక సామాన్య సాధారణముగా కనపడెడి యూదుడు. మరియు అతడు జనుల గుండా సాగిపోయేను. వారంతా కలిసిపోయివున్నారు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని వారు కనీసము ఎరుగకుండిరి. అతడు కేవలము అక్కడే నడిచి వెళ్ళుచుండెను. అతడు ఏ విధమైన, విభిన్నమైన వస్త్రమును ధరించలేదు, అతని యొక్క వస్త్రధారణ, ముఖాలంకరణను బట్టి అతనిని గురించి వింతగా ఏమిలేదు.
12.మరియు ఆయన లోపలికి వచ్చెను, ముప్పై-ఎనిమిది సంవత్సరముల నుండి రోగముతో బాధపడుచూ అక్కడ పడియున్న ఒక వ్యక్తిని అతడు ఎరిగియుండెను. ఇప్పుడు, చూడుము. అక్కడ కుంటి, అవిటి, ఎండిపోయిన వారున్నారు; మరియు ఇక్కడ రోగముతో, ఒక జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తి పడియుండెను. బహుశా అతడు క్షయరోగము కలిగి ఉండవచ్చును, అతడు ఎక్కువ రక్త ప్రసరణ కలిగి ఉండవచ్చును. అతడు రక్తలేమి, గుండెపోటు కలిగిన వాడు కావచ్చును. అయితే అతడు ముప్పై-ఎనిమిది సంవత్సరముల నుండి ఒక రోగము కలిగి ఉండెను. అతడు పరుపు మీద లేదా మంచము మీద లేదా ఒక కుర్చీలో లేడు. అతడు చెప్పెను, “నేను నీటి యొద్దకు వచ్చుచున్నప్పటికి, నాకంటే శ్రేష్ఠమైన వారు ఎవరో నన్ను దాటుకొని దానిలోనికి పోవుచున్నారు.”
మరియు తరువాత, ఆ దూత మొదటి వ్యక్తి స్వస్థపడిన వెంటనే, దూత యొక్క శక్తి అంతా కూడా నీటిలో నుండి ఆ వ్యక్తి లోనికి వెళ్ళుచున్నది మరియు విడిచిపోయెను. మరియు వారు కేవలము మరుసటి దినము వరకు కూడా ఎదురుచూడలేదు. మరుసటీ కాలము వరకు ఎదురు చూచిరి. బహుశా ఒక నెల కావచ్చును. కాని వారు ఎదురు చూచారు.
ఒక రాత్రి నుండి మరొక రాత్రికి మనము ఎదురుచూచుట లేదు. మనము మొదటి రాత్రి ప్రార్థించబడి, స్వస్థపరచబడ లేకపోతే, దానికి ఏమియూ లేదు. అది కాలములు ఏ విధముగా మారినవి అన్నది చూపిస్తున్నది. మనము జీవించుచున్న ఈ కాలములో ఎటువంటి మనోదౌర్భల్యము గలవారు ఉన్నారు. ఇది ఈ విధముగానే ఉండును, అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మరియు మనము ఇక్కడ ఉన్నాము.
13.ఇప్పుడు, దీనిని గమనించండి. చాలా కాలము నుండి ఈ వ్యక్తి అక్కడ పడియున్నాడని యేసు ఎరిగియుండెను. తండ్రి అతడికి చూపించినది తప్ప అతడు ఏమి ఎరిగియుండలేదు. మరియు అతడు వెళ్ళి, ఈ వ్యక్తిని స్వస్థపరచెను. మరియు అటువంటి కుంటివారు, బాధింపబడినవారు, మరియు మానవత్వము ఉన్న జనాంగము మధ్య నుండి నడిచివెళ్ళిపోయెను; మరియు వారి నుండి దూరముగా నడిచి వెళ్ళెను.
మీరు ఊహించగలరా? అది… యేసు కనికరము గలవాడని నీవు నమ్మెదవా? ఆయన సంపూర్ణమైన ప్రేమను కలిగియున్నాడని నీవు నమ్ముదువా? ఖచ్చితముగా, నేను దానిని నమ్మెదను. కాని దాని వెంబడి వెళ్ళు ఈ సంగతులు, బైబిల్ చదివెడి తొంబది శాతము పాఠకుల పైనుండి వెళ్ళిపోవును. వారు దానిలోని ఉన్న సత్యమును చూచుటకు విఫలము చెందుదురు.
ఖచ్చితముగా, అతడు పూర్తిగా ప్రేమను కలిగియుండెను. మరియు అతడు పూర్తిగా ప్రేమను కలిగియున్నట్లుగా కనబడుచుండెను, ఆయన కలిగియున్నాడని మనము ఎరిగియున్నాము. మరియు ఎండిపోయి, వంకర్లు తిరిగి లాగివేయబడిన, గ్రుడ్డి, ఏడ్చుచున్న, జీవనోపాది లేని, కేవలము బిచ్చమెత్తుకొనుచున్న మరియు అక్కడ పడియున్న జనులను చూచుచుండెను. ప్రేమగల దేవుని కుమారుడు అక్కడకు నడిచి వెళ్ళి ఇలా చెప్పునట్లుగా కనిపించుచున్నది, ఇప్పుడు, గ్రుడ్డివాడా, నీ చూపును పొందుకొనుము, చాలా కాలము నుండి అక్కడ పడియున్న కుంటివాడా, లెమ్ము. మరియు ఊచ చెయ్యిగలిగిన వాడా, నీవు ఎందులకు పైకి లేవకూడదు.“
14.దానికి బదులుగా కేవలము జబ్బుగా ఉండి మరియు ముప్పై-ఎనిమిది సంవత్సరములు ఒక రోగముతో ఒక సాధారణ జీవితము జీవించిన వాని యొద్దకు వెళ్ళుచుండెను. అది వింతగా ఉన్నది, కాదా? మీరు దానిని అర్థము చేసుకొనుట చాలా కష్టము. ఇప్పుడు, మీరు ఆ వాక్యమును గుర్తించుకోవాలని కోరుచున్నాను. తరువాత ఒకవేళ లేఖనములు దానిని వ్యక్తపరచకపోతే, “దానిని అర్థము చేసుకోలేరు.”
యూదులు ఆయనను ప్రశ్నించిరి. ఇప్పుడు, ఆయన పందొమ్మిదవ వచనములో ఏమి చెప్పుచున్నాడన్న దానిని విందుము.
కాబట్టి, యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును.
తండ్రి కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు, వీటికంటే మరి గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
ఇప్పుడు, గమనించండి. అక్కడనున్న అవిటివారిని యేసు ఎందులకు స్వస్థపరచలేదు? బాధింపబడిన వారిని ఆయన ఎందులకు స్వస్థపరచలేదు? ఎందులకు అతడు కేవలము ఒక కడుపు నొప్పిగల వానిని లేదా అటువంటిది కలిగియున్న వానిని స్వస్థపరచి మరియు మిగిలిన వారిని అక్కడ వదిలివేసెను? ఎందుకనగా ఆయన సొంత మాటలు ఇలా చెప్పెను, “తండ్రి చూపనిదే తనకు తానుగా ఏదియూ చేయనేరడు.” అది సరియేనా? మంచిది, అతడు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు.
15.ఈ రోజు ఎవరో నన్ను ప్రశ్న అడిగిరి, “మంచిది, మీరు అన్ని విషయములు చూచినట్లయితే…” అని అడిగిరి.
నేను చెప్పాను, “నేను అన్ని విషయములను చూడవలెను.”
అతడు చెప్పెను, “మంచిది, నీవు ఒక చక్రాల కుర్చీలో బంధింపబడి అక్కడ కూర్చొనియున్న ఒక స్త్రీ ఉన్నది. నీవు ఆమెను లేపుము అని చెప్పావు. మరియు ఇక్కడ నీ ముందు ఒక పెద్ద గుంపు జనులు కూర్చొనియున్నారు. నీవు ఎందులకు వారిని లెమ్ము, అని చెప్పకూడదు?”
“దేవుడు నాకు చూపించకపోతే, నేను ఎలా చెప్పగలను?”
చెప్పెను, “మంచిది నేను అక్కడ వెనుక ఒక బందువైన స్త్రీని కలిగియున్నాను. ఆమెకు గుండెజబ్బు ఉన్నది. మరియు నీవు అక్కడ కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరచావు…”
నేను చెప్పాను, “సహోదరుడా, గుండె జబ్బుతో ఉన్న వానిని, ఎవరిని నేను స్వస్థపరచలేదు. యేసుక్రీస్తు అతని యొక్క ప్రార్థన ద్వారా అతడిని స్వస్థపరచెను. మరియు అది జరుగుట మాత్రమే నేను చూచియున్నాను.”
ఇప్పుడు, ఆయన కుంటి వారిని స్వస్థపరచును. కాని ఈ రోజులలో జనులు… యేసు చెప్పెను. “ఒక బలహీనమైన మరియు వ్యభిచారతరము వారు సూచనలు అడుగుచున్నారు. అది సరియేనా? ”మీరు అద్భుతములు, సూచనలు చూడనట్లయితే మీరు నమ్మరు,“అని యేసు చెప్పెను.
ఇప్పుడు, కుంటివారు స్వస్థపడియున్నారు. కాని దాని యొక్క విషయమేమనగా, నేను మిమ్ములను అవిటివారు, తొంబై శాతము అవిటివారైన ప్రజల యొద్దకు తీసుకు వెళ్ళదలిచాను, మంచిది, జీవము కొరకు నీవు అక్కడ కూర్చొనియున్నావు,“ అని వైద్యుడు చెప్పెను. దానికి వారు ఏమియూ చేయలేరు. వారిలో ఏదో వారికి భయము కలుగజేయుచున్నది మరియు అది సత్యమైయున్నదని చెప్పుచున్నది. మరియు మిమ్ములను మీరు బయట పెట్టుకొనుటకు భయపడుతున్నారు.
సరి, నీవు ఒక గుండె వ్యాధి గలవానికంటే నిరీక్షణ లేనివానివి కావు. నేను నిలబడి అవిటి వారిని చూచినప్పుడు వారిలో ఏ లోపమున్నది, మరి ఇతర సంగతులను చూచుదును. ఇది సత్యము. నేను దానిని లేదా అటువంటి రకమైన దానిని చూచుచున్నాను.
16.నేను ఎన్నడూ మాట్లాడి ఇలా చెప్పలేదు, “ఈ మనుష్యుడు, ఈ బాలుడు ఇక్కడ పడి మరియు చనిపోయెను, మరియు తనకు తాను గాయపర్చుకొని మరియు అలాంటివి ఎన్నో మరియు తన వెన్నెముక మరియు అంతా చితికెను.” అది అతడికి తెలియును. అవిటి… వాటిని జనులు ఇక్కడ చూచియున్నారు. మరియు వారు కుంటి వారు మరియు కీళ్ళవ్యాధి కలవారు మరియు గుండె వ్యాధులు అలాంటివి, అని వారు ఎరిగియున్నారు. వారు దానిని చూచియున్నారు. అయితే ఏమి జరిగినది…
దేవుని యొక్క శక్తి ఏమనగా, ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఆరోగ్యముగా కనబడుచున్నప్పుడు, మరియు అతడి యందు ఏ తప్పిదమున్నదని నీవు చెప్పినప్పుడు, స్వాభావికమైన కన్నులకైతే అతడు సరిగానే కనపడును. సామాన్యమైన కన్ను అతడు అవిటివాడు అని చూడగలదు. చూడండి, బహుశా అతడి కాలు వంకరపోయి వుండవచ్చును, లేదా అతడి… చూడండి, గ్రుడ్డివాడైన వ్యక్తి కర్రతో అక్కడ కూర్చొనియున్నాడు లేదా అతడు నడుచుచున్నాడు మరియు ఎవరో అతడిని నడిపించుచున్నారు, లేదా… అతడు గ్రుడ్డివాడని మీకు తెలియును, అయితే విషయమేమిటనగా, జనులు ఆరోగ్యవంతముగా కనబడెదరు.
17.ఓ, క్రైస్తవులారా, ఇప్పుడు, నీలో ఉన్న అంతరంగ పురుషుని గిచ్చి మరియు వాస్తవమునకై లేపుము. యేసుక్రీస్తు తనకు తానుగా నీకు ప్రత్యక్షపరచుకొనుట కొరకు ఇక్కడ ఉన్నాడని ఎరిగి, మరియు ఇప్పుడు ఆయన యొక్క ప్రస్తుత స్వభావము, వెనుక ఉన్నవారి యెడల ఎలా ఉన్నదో నీ యెడల కూడా అలానే యున్నది. కాని నీ యొక్క విశ్వాసము ఏ విధముగా రుజువుపరచబడును అన్నదానిని బట్టి ఆయన పని చేయును, లేదా నీ విశ్వాసము తండ్రి యొద్దకు వెళ్ళును. మరియు ఆయన నీ కొరకు ఇప్పటికే చేసియున్నదానిని అంగీకరించుము.
ఇప్పుడు, అవిటి జనులైన మీకు. ఇక్కడ మీలో ఉన్న ఎవరూ కూడా కాంగ్రెస్ మెన్ అప్షా కన్నా బలహీనులు కారు. అతడు అరవై-ఆరు సంవత్సరములు అవిటివాడు, చక్రాల కూర్చిలో బంధింపబడినాడు, మంచము మీదనే యున్నాడు, సహాయము చేయబడి మరియు కర్రలతో వెళ్ళియున్నాడు. జీవితమంతటిలో నేను ఎన్నడూ అతడిని చూడలేదు లేదా ఎన్నడూ వినలేదు మరియు అది సత్యమని దేవుడు ఎరిగియున్నాడు. మరియు ఈ రాత్రి మీ ముందు అతడు సంపూర్ణమైన పరిపూర్ణతతో (స్వస్థతతో) ఇక్కడ నిలబడియున్నాడు, చూచారా.
18.ఒక ఆత్మీయమైన భార్య చేత, కాంగ్రెస్ మెన్ అతనిలో ఉపదేశించబడెను. మరియు చెప్పెను, “నీవు నమ్ముము?” మరియు అతడు, తనకుతానుగా ఆత్మీయమైన వ్యక్తిగా ఉండి నమ్మెను. మరియు అతడు ఆత్మ యొక్క కదలికను చూచినప్పుడు, అతడు తనలో తాను, “ఒకవేళ దేవుడే నా యొక్క ప్రార్థనకు మాత్రమే, సమాధానము దయచేసినట్లయితే మరియు సహోదరులు నన్ను చుదనిమ్ము, అప్పుడు నేను నమ్మెదను,” అని అతడు చెప్పెను.
ఎంతమంది మనుష్యులు త్రోయుటకు మరియు దాటిపోవుటకు ప్రయత్నించినను, మరియు చేతి కర్రలు తీసివేసిననూ లెక్క లేదు, అది మాత్రమే… ఎందుకనగా, నేను అక్కడికి క్రిందకు నడిచి వెళ్ళగలను మరియు చక్రాల కుర్చీలో నుండి ఎవరినైన బయటకు తీయుటకు ప్రయత్నించగలను, “నిలబడుము, పట్టుకో, పట్టుకో, ఇది చేయుము,” అని చెప్పెను. అది కేవలము విశ్వాసము యొక్క క్రియ. అది సరే. ఒకవేళ అది నీకు సహాయపడగలిగినచో, ముందుకు సాగుము. ఎవరో ఒకరిని దానిని చేయనిమ్ము.
19.అయితే నా వంతుగా, నేను నిన్ను ఒక చక్రాల కుర్చీలో నుండి లేవమన్నప్పుడు, నేను నీకు ఏమి చెప్పానో దానిని చేయుము. నీవు సడిచెదవు, దాని అంతటి వరకూ అదే. ఎందుకనగా పరలోకపు తండ్రి, నీవు స్వస్థపరచబడినావని నాకు చూపించినంత వరకూ నేను నీకు చెప్పజాలను. మరియు నీకు ఏమి చెప్పబడినదో దానినే చేయుము. నీవు బలిపీఠము యొద్ద వినినప్పుడు, అది నీవు ఏమి చేయవలెనో చెప్పును, నీవు వెళ్ళి అది చేయుము, మరియు నీవు స్వస్థపరచబడెదవు, ఏలయనగా అది నేను కాదు.
మరియు వాస్తవముగా లక్షలలో ఎన్నడు ఒక్కసారి కూడా విఫలము కాలేదు. నీతో కూడా ఇది విఫలము కాదు. అయితే ఇది నేను కాదు; ఇది చేసినది ఆయనే, చూడండి. నేను కాదు, ఇది ఆయనే. నేను కేవలము మాట్లాడుదును, ఏలయనగా నాకు నేనుగా మాట్లాడలెను. ఆయన నా ద్వారా మాట్లాడుచున్నాడు. మరియు అది ఎక్కువగా ఎక్కడ…
20.మీ యొక్క ప్రార్థనా కార్డులకు దీనితో చేయుటకు ఏమి లేదు, మీరు కేవలము వరుసలో నిలబడుటకు అవి ఇవ్వబడెను. ఇప్పుడు, దేవుడు దర్శనములను చూపించును. మరియు వాటిలో కొన్ని నాకు కావలెను, ఒకవేళ వారికిష్టమున్నచో, నా సమయమున మాట్లాడెదరు. నేను… బహుశా నేను గడియారమును చూడగలను. నేను ఖచ్చితముగా చెప్పుట లేదు… ఐదు తరువాత? ధన్యవాదములు. నేను చేయగలిగినచో… ఎందుకు, నేను ఎక్కువ సమయము తీసుకోవాలని ఆశించుటలేదు. నేను మీకు ఒక చిన్న కధను తెచ్చుటకు ఇష్టపడుచున్నాను, ప్రతీరాత్రి, ఒక చిన్న సాక్షము. ఇప్పుడు ఈ రాత్రి కొంచెము చల్లగా ఉన్నది, దాని కొరకు మేము కృతజ్ఞులము.
మరియు ప్రియ క్రైస్తవ స్నేహితులారా నాకు తెలిసినంత వరకూ, బహుశా నేను నా యొక్క చివరి అమెరికన్ కూడికలను కలిగియుందును. ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళుచున్నాను మరియు ఆఫ్రికా మరియు ప్రపంచములోని ఇతర భాగములలో నా విదేశీ యాత్ర యొక్క ముగింపు పిలుపును నేను అనుభవించుచున్నాను. నేను ఎప్పుడు తిరిగి వచ్చెదనని నాకు తెలియదు. మరియు ఏమి చేయమని ఆయన నాకు చూపించునో అవన్నీ, కేవలము దేవుని యొక్క చిత్తము ద్వారా మాత్రమే జరుగును. మరియు నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరియు నాకు తెలుసు ఒక రోజు తప్పకుండా క్రీస్తు యొక్క తీర్పు సింహసనము ఎదుట నేను నిలబడీ ఈ జీవితములో మనము ఏ సంగతులు చేసామో అనుదానికి లెక్క అప్పజెప్పవలసియున్నది.
ఇప్పుడు, బహుశా, ఒక దాని కొరకు ఇక్కడ కొంత మంది జనులు కూడికలలో ఉన్నారు. మరియు దీనిని ఎరిగియున్నారు. మరియు ఇప్పటి నుండి, నేను వేదిక యొద్దకు వచ్చినప్పుడు, కేవలము ఒక సాక్ష్యము ఇవ్వ ప్రయత్నించి మరియు తరువాత సెలవు తీసుకొందును.
21.మరియు ఆ రోజునకు సంబంధించి ప్రార్ధనా కార్డులను ఇచ్చెదను. అది ప్రార్ధనా కార్డులతో చేయునది ఏమియు లేదు, కేవలము అది మిమ్ములను వరుసలో పెట్టుటకు సంఖ్య మాత్రమే. వారు ప్రయత్నించి… నేను నా కుమారుని అడిగాను…
మొదటగా, మనము ప్రార్థనా కార్డులను సేవకుని యొద్దకు పంపుదము. ముందుగా, నేను ఏమియూ కలిగిలేను. నేను చెప్పుదును. “ప్రార్ధించబడాలని కోరిన మీరెవరైనా పైకి రండి.” ఓ, ముందు వరుసలలో ఎవరు ఉండాలనే, దాని కొరకు వారు గొడవపడుదురు, ఎందుకనగా నేను చాలా మంది యొద్దకు వెళ్ళుదును మరియు ఎవరో లోనికి రానైయున్నారు.
మనము ఎదో ఒకటి చేయవలెను, మనము ప్రార్థనా కార్డులను ఇచ్చెదము. అప్పుడు మేము ఆలోచించాము. “మంచిది, మొదటవచ్చినవారికి మొదట ఇవ్వబడును.” మరియు మొదటిరోజు అక్కడ, మనము ఇవ్వగలిగినన్ని ప్రార్థనా కార్డులను మనము ఇచ్చెదము, ఒకవేళ ఎవరైనా ఆలస్యముగా వచ్చిన యెడల, వారికి లేనట్లే. మరియు కేవలము ఎవరైతే మొదట వంద లేక రెండు వందలలో పొందుకొన్నారో, వారు మాత్రమే ప్రార్థించబడుదురు. ఒకవేళ ఒక మనుష్యుడు అత్యవసర పరిస్థితిలో వచ్చిన యెడల, అతడు వేరొకని కన్నా ముందుకు రాలేదు, ఎందుకనగా అతడి వలన వారు వదిలివేయబడెదరు.
22. అప్పుడు మేము అలోచించాము, “కనుక, వాటిని మనము సేవకులకు ఇచ్చెదము.” మంచిది, అప్పుడు… మరియు చెప్పుదురు, ప్రతీ సేవకునికి రెండు వందలు పంపండి, మరియు తరువాత సేవకునికి రెండు వందలు, మరియు సహాయము చేయు సేవకులందరికి పంపండి. మరియు అది వారి సంఘముల యొక్క సభ్యులను కోల్పోవునట్లుగా కూడా చేసినది. ఒకవేళ ఒక సభ్యునికి ఒక కార్డు ఇచ్చినట్లయితే మరియు ఈ ఇతర వ్యక్తికి అది ఇవ్వనట్లయితే మరియు ఆ మొదటి సేవకుడు తన గుంపును లోనికి రానిచ్చి మరియు తన గుంపుతో పరిచర్య చేయించినచో, మిగతాదంతయునూ పూర్తిచేయబడెను – పరిచర్య ముగించబడినది. అదే సమస్యను కలిగించును.
మరియు దానిని విజయవంతముగా చేయ కలిగినట్లుగా, మనము కనుగొన్న ఒకే ఒక మార్గము, ప్రతీరోజు కొన్ని కార్డులను తీసుకొని, అక్కడికి వెళ్ళుట. మరియు నువ్వు అక్కడ కొన్ని డజన్ల సార్లు ఉండుట, లేదా నువ్వు అక్కడ ఉండుట అనునది లెక్క కాదు. మరియు మేము వారిని తీసుకొని వారికొక యాబై కార్డులు ఇచ్చి, మొదట సంఖ్య నుండి ప్రారంభించుదుము.
23.మరియు ఒకవేళ పది లేదా పదిహేను మీరు పొందుకొననట్లయితే, వారు చెప్పెదరు. “నాకక్కరలేదు. నేను ఎలాగు పిలువబడను.” చూచారా? ఎందుకనగా ఒక్కరాత్రిలో నేను చేయగలిగిన దంతా అదే. బహుశా కొద్దిసార్లు అది ఒకటి లేదా రెండు, కాదు. మరియు ప్రజలు దానిని అపార్థము చేసుకొనెదరు, “మేము ప్రార్థింపబడుట లేదు,” అని ఎక్కువగా లేఖలు వచ్చుచున్నవి.
మా యజమానుడు ఒక పట్టణములోనికి వెళ్ళి, ఒక మనుష్యుని స్వస్థపరచెను, మరియు పట్టణము నుండి వెళ్ళిపోయెను. అది నిజమేనా? మరియు ఒక వేళ ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న యెడల… నా భావము మీరు చూచారా?
ఇప్పుడు, దీనిని మనము చూద్దాం, మరియు ప్రభువు ఒక రాత్రి దీనిని నాకు బయలుపరిచెను. మరియు చెప్పెను, “క్రిందకు వెళ్ళి ఒక గుంపు కార్డులను ఇవ్వము, మరియు అప్పుడు నీవు చేసినప్పుడు ఎక్కడ నుండి నీవు చేసితివో ఎవనికి తెలియనివ్వకుము. మరియు వేదిక నొద్దకు నడచుకుంటూ వెళ్ళుము. మరియు ఆయన నా మనస్సులో ఏదైతే పెట్టునో, అక్కడ నుండే నేను ప్రారంభించెదను. మరియు లోపలికి రావడం కొరకు ప్రతీ ఒక్కరికి అది ఒక స్వచ్ఛమైన అవకాశమును ఇచ్చును.
మరియు ఆ ప్రార్థనా కార్డులు, వేదిక మీద ఉన్న వారికన్నా ఎక్కువగా ప్రేక్షకులలో ఉన్నవారే స్వస్థపడుచున్నారు. అది నిజమని మీకు తెలుసా. కనుక ప్రార్థనా కార్డుతో చేయుటకు ఏమియూ లేదు. ప్రార్థనా కార్డులు ఎంత మంది కలిగిలేరు అని ప్రతీ రాత్రి నేను అడిగెదను. మరియు వారి గూర్చి దేవుడు నాకు ఏమి చూపించునని నేను ఆ జనులవైపుకు చూచుటకు ప్రయత్నించుదును, మరియు వారు స్వస్థపడెదరు.
24.ఇప్పుడు, అది ప్రార్ధన, మీ యొక్క ప్రార్థన, మీ ప్రార్థన. ఇప్పుడు, గుర్తించుకొనండి, మీరు గనుక స్వస్థపరచబడగోరినట్లయితే, ఎవరో దైవిక స్వస్థత వరము కలిగిన వారు నిన్ను స్వస్థపరిచారని అనుకొనవద్దు. ఒకవేళ మీరు గనుక దైవిక స్వస్థత ద్వారా స్వస్థపరచబడగోరినట్లయితే, నీకు నీవు మాత్రమే స్వస్థత యొక్క వరమును పొందుకొనవలసియున్నది. ఈ వ్యక్తి మీద లేదా వేరే ఏ మనుష్యుని మీద కాదు, ఇది క్రీస్తులో నీ యొక్క విశ్వాసము. ఇది క్రీస్తులో నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసము, ఎంతమంది దానిని అర్థము చేసుకొన్నారు? అదే సత్యము.
నేను ఏమియూ చేయలేను. నేను మీ కొరకు ప్రార్ధించగలను. లేదా నీ కొరకు నీ పొరుగువారు ప్రార్థన చేయగలడు, కాని దానిని స్వస్థపరచునది మాత్రము నీ యొక్క విశ్వాసమే. క్రీస్తు నీ కొరకు ఏమి చేసెనో, దానిని నీకు నీవుగా వ్యక్తిగతముగా అంగీకరించుము. దానిని నీవు పట్టుకొనుము మరియు అది సత్యము.
ఇప్పుడు, ఇది చేయు ఒకే ఒక్క సంగతి ఏదనగా, కొన్నిసార్లు అది ఒక మనుష్యుని జీవితమును సరిచేయును.
25.నాకు తెలియదు, వారు చెప్పారు…. (ఓ, అభిషేకము వచ్చినప్పుడు కూటము ముగిసిన తరువాత ఒక స్వప్నము వలే అది కనిపించును) వారు ఒక మనిషిని గురించి నాకు చెప్పిరి. గతరాత్రి ఇక్కడకు వేదిక మీదకు అతడు వచ్చియున్నాడు, మరియు దేవుని యొక్క ఆత్మ అతని యొద్దకు వెళ్ళి మరియు అతడు ఒక రకమైన విమర్శకుడు అని, అతనికి చెప్పినది, మరియు అతడు నన్ను విమర్శించుచున్నాడు. మరియు ఆ మేనేజరు మరియు వారు నాకు చెప్పారు, అది ఆ మనుష్యుడు దీనముగా తన చేయి చాచి మరియు క్షమాపణ చెప్పి మరియు అది సత్యము అని చెప్పెను. అది నిజమేనా? అప్పుడు అతడు దేవునితో సరిచేసుకొని, తన స్థానమునకు వెళ్ళెను. ఒక చెవిటి స్త్రీ స్వస్థపడెను అని చెప్పెను, మరియు అటువంటివి; “మరియు చక్రాల కుర్చీలో ఉన్న ఒక స్త్రీ, వేరు వేరు సంగతులు. మరియు వారు నాకు చెప్పారు. వారు అలా దాని గూర్చి చెప్పుచూ పోవుచుండగా, అది వెనుకకు తీసుకొని రాబడినదని అనిపించినది. నేను దానిని గూర్చి ఆలోచించెదను.
గతరాత్రి బయటకు వెళ్ళుచుండగా, ఎవరో నన్ను పిలవడం నాకు వినిపించినది. అది ఎక్కడో నేను చెప్పలేను. మరియు దానితో నాకు నేను చేయుటకు ఏమి లేదు.
26. ఇప్పుడు, తరువాత కొద్ది నిముషములు, ఇప్పుడు ఎలా జరిగినదో చూడుము. నేను హుస్టన్లో ఉన్నప్పుడు ఆ పోటో తీయబడినప్పుడు, డాక్టర్ ఎఫ్. ఎస్. బోస్వర్డ్, ప్రపంచములోనున్న మంచి వృద్ధులలో ఒకడు, నేను కాంగ్రెస్ మెన్ ఉప్షాను, అతడిని కలుసుకొనుట కొరకు ఉత్సాహపడ్డాను.
మిస్టర్ బోస్వర్డ్. అతడు నాతో పాటు ఆఫ్రికాకు వెళ్ళుచున్నాడు. అతడు తన పరిచర్యను మరియు తన యొక్క భాగమును ఎంతో ఆనందముతో ముగించుటను మేము చూడగోరుచున్నాము. మరియు అతడు మాతో పాటు ఆఫ్రికా వెళ్ళుచున్నాడు. నేను అతడిని దైవకమైన క్రైస్తవ ప్రేమతో ప్రేమించుచున్నాను.
మరియు అతడు నా గదిలోనికి వచ్చి చెప్పెను, “సహోదరుడా బ్రెన్ హామ్ , ఇటు చూడుము.” కేవలము ఈ ఫోటో తీయడానికి ఒక రాత్రి ముందే. మరియు అతడు శ్రీమతి. ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క చిత్రమును నాకు ఇచ్చెను, ఒక గొప్ప గొప్ప ఇంగ్లాండుకు చెందిన చనిపోయిన ఫోరెన్స్ నైటింగేలకు ముని మనవరాలు, ఆమె ఆఫ్రికాకు వెళ్ళినది. మరియు మరణకరమైన ఎదుగుదలతో ఆమె చనిపోవుచున్నది. కడుపులో వ్యాధితో చనిపోవుచున్నది. మరియు వారు ఆమె ఫోటోను పట్టుకొనిరి.
27.మరియు జార్జి కార్టర్, ఇండియానాలోని మిల్-టౌన్ బాప్టిస్ట్ చర్చిలో నా యొక్క పియానో వాయించు సహోదరుడు, నేను చూచినంత వరకు అతడే చాలా సన్నని మనిషి అని నేను తలంచితిని. ఆమె క్షయ వ్యాధితో ముప్పై లేదా మరికొన్ని పౌండ్లు తూగినది. మరియు ఆమె దానితో తొమ్మిది సంవత్సరాల మరియు ఎనిమిది నెలలు ఉన్నది, మరియు ఆ ఘడియరు నుండి ఒక గంటకు, ఆమెకు ప్రార్ధించుట కొరకై ఆమె ఎక్కడ ఉన్నదో అనేది పరిశుద్ధాత్మ నాకు చూపించినది. ఆమె పియానో మళ్ళి వాయించుచున్నది. మరియు ఆ రాత్రి ఆమె నా పియానో విద్యురాలు. ఆరు, ఏడు సంవత్సరాల క్రితము, ఆమె ఇతరుల వలె ఆరోగ్యముగా ఉన్నది.
కాని ఈ స్త్రీ ఇంచుమించు ఆరు అడుగుల పొడవు ఉన్నది, జార్జియా మాత్రము ఒక చిన్న స్త్రీ, ఈ స్త్రీ మాత్రము ఆరు అడుగుల పొడవు మరియు ముప్పై అయిదు లేదా నలబై పౌండ్ల బరువు ఉన్నది. మరియు వారు ఆమెను నిలబెట్టి, పట్టుకొనియున్నారు, మరియు ఆమె శరీరపు చర్మము ఆమె చుట్టూ ఒక చిన్న చింపిరి గుడ్డ వలె ఉన్నది. నేను కఠిన హృదయము కలిగినటువంటివాడను, అయిననూ అది నన్ను కన్నీళ్ల పర్యాంతము చేసినది. మరియు నేను…
ఆమె నన్ను వేడుకొనుచున్నది, “సహోదరుడా బ్రెన్ హామ్ , చివరి పిలుపు, దయచేసి వెంటనే ఆఫ్రికాకు రమ్ము, ”నేను నమ్ముచున్నాను. కేవలము నేను నిన్ను చూచినయెడల, దేవుడు నన్ను స్వస్థపరచును,“ అని చెప్పినది. ఇప్పుడు, ఆమె అప్పటి మొదటి సంఘమునకు చెందినది కాదు. అప్పుడు… కాని ఆమె విశ్వాసము కలిగియున్నది.
విశ్వాసమంతయూ మొదటి సంఘములోనే ఉండి యుండదు, లేదా పెంతెకొస్తు సంఘములోనే ఉండి యుండదు, లేదా హోలినెస్ చర్చిలో అది ఉండి ఉండదు. అది వ్యక్తిగతముగా ఉండును. రోమన్ కేథలిక్కులు వేదికనొద్దకు వచ్చి అత్యద్భుతముగా స్వస్థపరచబడుట నేను చూసాను. మరియు విభిన్నమైన జనులు…
28.విన్నీపేగ్, కెనడాలో బుద్దుని ఆరాధికుడైన ఒక చిన్న గ్రుడ్డి బాలుడు వేదికనొద్ద మారుమనస్సు పొందడం నేను చూసాను. నేను చెప్పాను, “నీవు గుడ్డివాడవైయుండియూ, నీవు నమ్ముదువా?”
అతడు, “ఒకవేళ యేసుక్రీస్తు ఈ రాత్రి నన్ను స్వస్థపరచినట్లయితే, నేను యేసుక్రీస్తుని తప్ప మరే ఇతర దేవుడిని ఆరాధించను,” అని చెప్పెను. మరియు అతడి కళ్ళు తెరవబడెను. అక్కడే మీరున్నారు; బుద్దుడు…
ఆఫ్రికాలోని హిందువులు మరియు భారతీయులు చూడాలని నేను ఆశీస్తున్నాను, మరియు హోట్టేన్-టాట్ (Hottentots అనే దేశము యొక్క అనాధి కాపులు) యేసుక్రీస్తు యొక్క కృపయొద్దకు తీసుకొనిరాబడెను.
వినండి. నేను ప్రార్థించితిని మరియు నేను చెప్పాను, “దేవా, నీవు నన్ను నడిపించకపోతే నేను అక్కడికి వెళ్ళలేను. కనుక ప్రభువా, అక్కడనున్న ఆ స్త్రీని నీవు స్వస్థపరచినట్లయితే అది ఒక పచ్చని కాంతి అగుచున్నదని,” నేను నిన్ను అడుగుచున్నాను.
మరియు సహోదరుడు బోస్వర్డ్ నాతో పాటుగా మోకరించియున్నాడు, “ఆఫ్రికాకు వెళ్ళెదము,” అని చెప్పెను. సహోదరుడు బాక్స్టర్ కు కనీసము దీని గురించి తెలియదు.
మరియు సహోదరుడు బోస్వర్డ్ మరియు నేను, చేతులను కలిపియున్నాము, మరియు నా భార్య మరియు ఆ చిన్న బాలిక కూడా. మరియు మేము మోకరించి మరియు దేవుడు ఆ స్త్రీని స్వస్థపరచులాగున ప్రార్థించాము. నేను ప్రభువునకు దానిని సమర్పించితిని, మరియు దానిని వెళ్ళనిచ్చుచున్నాను. దానిని గూర్చి ఎప్పుడూ నాకు ఏమియూ తెలియదు, వెళ్ళనిమ్ము.
29.మరియు సహోదరుడు బాక్స్టర్ మరియు నేను, మేమందరము లండన్లో దిగినప్పుడు, సహోదరుడు. బాక్స్టర్, నేను లోపలకు వెళ్ళుచున్నాము. అతడు వినుచున్నాడు… అతడు అక్కడ కూర్చొని ఇప్పుడు నన్ను వినుచున్నాడు. మేము లోపలకు వెళ్ళుచున్నప్పుడు, నేను చెప్పాను, “మంచిది, కొంత సమయము ఇక్కడే ప్రశాంతముగా ఉండును.”
కనుక వారు నాకు సమాచారము ఇచ్చినప్పుడు నేను బయలుదేరాను. మరియు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అది బంకింగ్హోమ్ ప్యాలెస్ కు రమ్మని, అది రాజు యొక్క పిలుపా లేక అంత హఠాత్తుగా ఏమిటి అని నేను ఆశ్చర్యపడుచున్నాను.
కాని అది ఏమిటి, సమాచారము వెళ్ళవలెను… [టేపులో ఖాళీ స్థలము ఉన్నది.] ఆఫ్రికా నుండి ఒక స్త్రీ నాకు ముందుగా ఎగిరి వెళ్ళినది, మరియు ఆమెను విమానము నుండి కూడా తీసుకొనివచ్చుట కష్టముగా ఉండెను. కుమారి ఫ్లోరెన్స్ నైటింగేల్. నేను అక్కడ ఉంటానని ఆమెకు ఎలాగు తెలిసినదో అనేది ఇప్పటికి నాకు తెలియదు. ఈ సేవకునితో నేను చెప్పాను, “ఆమెను ఎక్కడికైనా తీసుకొనివెళ్ళండి మరియు నేను ఒకటి లేదా కొన్ని దినములలో నేను మిమ్ములను చూస్తాను,” అని నేను చెప్పాను. మేము ప్యాలస్ కు వెళ్ళాలని ఆశిస్తున్నాము.
కనుక అతడు, “ఒకవేళ అంతవరకూ ఆమె బ్రదుకునా,” అని చెప్పెను. ”సహోదరుడా బ్రెన్ హామ్ ,ఆమె చనిపోవుచున్నది.“
30.కనుక ఆమెను వారు అక్కడకు తీసుకొని వచ్చిరి మరియు ఆ రోజు సహోదరుడు బాక్స్టర్ మరియు నేను మరియు సహో, లిండ్సే మరియు సహోదరుడు మూర్, మేనేజర్లు… ఆ స్థలమునకు వెళ్ళియున్నాము. సేవకుడు వచ్చి మమ్మును తీసుకువెళ్ళెను మరియు ఆ స్త్రీకి ప్రార్థించుటకు మేము ఆ స్థలమునకు వెళ్ళియున్నాము. స్నేహితులారా, నేను ఆ గదిలోనికి నడవగానే, నేనెలాంటి అనుభూతి చెందానో నేను చెప్పలేను. అక్కడ ఒక అస్థిపంజరం ఊపిరి తీసుకొంటున్నది.
ఇప్పుడు, నేను మిశ్రిత జనాంగము మధ్య ఉన్నాను. ఇప్పుడు, మీరు మీ డాక్టర్ చెప్పినది వినండి. మరియు నేను మీ సహోదరుడను. ఇప్పుడు, నన్ను సరైన రీతిలో అర్థము చేసుకొనండి. వారు ఆమె ముసుగును తీసినప్పుడు, సహోదరుడు బాక్స్టర్ తన తల త్రిప్పుకొనెను.
మరియు ఆమె కోరుచున్నది… ఆమె నాతో మాట్లాడలేకపోవుచున్నది, మరియు ఆమె ఏమి చెప్పుచున్నదో తెలుసుకొనుట కొరకు నేను నర్సు యొద్దకు వెళ్ళవలసి వచ్చెను. మరియు ఆమె చెంపల నుండి కన్నీళ్లు కారుటకు కావలసినంత తేమ ఎక్కడ ఉన్నదో నాకు తెలియలేదు. ఆమె చనిపోవుటకు ఇష్టపడుచున్నది. ఆమెను చనిపోనిమ్మని దేవున్ని అడగమని అమె నన్ను కోరుచున్నది.
31.మంచిది, ఆమె చేతిని నేను పట్టుకొన్నాను, అది చల్లగా… కేవలము ఎముకలు. ఇక్కడున్న ఆమె తల ఒక పుర్రె వంటిది. అది కలిపి ఎలా ఉండెనో, ప్రతీ చోట కూడా మీరు చూడవచ్చును. ఆమె కళ్ళు లోనికి పోయినవి మరియు ఆమె చాతి మీద, ఒక స్త్రీ వలే లేదు, ఆమె యొక్క చాతి ఎముకలలోనికి దిగిపోయినది. మరియు ఆమె ముసుగును ఇక్కడ వరకు తీసినప్పుడు, ఆమె ఎముకలు… ఆమె కాలి ఎముకలు కలుసుకొను భాగమున, కేవలము కొంచెము పెద్దదిగా ఉన్నది.
గ్లూకోజు లేదా మరేదైనా ద్రవము ఎక్కించుటకు వారు నరములను కనుగొనలేకపోయిరి. కొన్ని నెలల నుండి ఆమె ఏమి తినలేదు, మరేమియు మింగలేదు. వారు ఆమెలోనికి నీరును పంపించవలయును. మరియు అలాంటిది. మరియు ఆమెకు ఆహారమందించుటకు వారు నరములను కనుగొనలేకపోయిరి. మరియు ఆమె నడుము ఎముకలతో ఉన్నది మరియు దాని చుట్టూ చర్మము అలా అత్తుకొని ఉన్నది. అటువంటి దృశ్యము, నీ జీవితములో ఎన్నడూ నీవు చూసి ఉండవు.
నేను మోకరిల్లాను మరియు, “పరలోకపు తండ్రీ, కృప చూపుము,” అని నేను అడిగాను. నేను ఆమెకు చెప్పాను. నేను చెప్పాను, “నేను అభిషేకము క్రింద లేను; కేవలము నేను ఇక్కడకు వచ్చాను. అయితే, నేను ప్రార్థించెదను, కాని నీవు చనిపోవుట కొరకు కాదు.” మరియు నేను ప్రార్థించుట ప్రారంభించాను. ఆమె చెప్పినది, “నీవు [స్పష్టతలేని మాటలు.]”
నేను క్రిందకు ఆమె దగ్గరకు వెళ్ళాను, మరియు ఆ నర్సు చెప్పెను, “ఆమె, సహోదరుడా బ్రెన్ హామ్ , నేను గనుక నీ యొద్దకు వచ్చినచో దేవుడు ప్రార్థనకు జవాబిచ్చును అని నేను ఎల్లప్పుడు నమ్మియున్నాను.” ఒకవేళ నేను వేషధారిని అయినట్లయితే, దేవుడు అటువంటి విశ్వాసమును అలాగే ఘనపరచును. అది సత్యము.
32. మరియు ఆమెకు ప్రార్థించుట కొరకు నేను వెళ్ళినప్పుడు, నేను ప్రార్థించుట ప్రారంభించగానే… ఇక్కడున్న సహోదరుడు బాక్స్టర్ ఒక సాక్షి. నేను ప్రార్థించుట ప్రారంభించగానే, ఒక చిన్న పావురపు పిల్ల కిటికీ గుండా ఎగిరి వచ్చి, “కూ-కూ-కూ-కూ” అని కూయనారంభించినది. మరియు ఓ అంతా…
నేను ప్రారంభించాను. నేను చెప్పాను, “పరలోకమందున్న మా తండ్రీ…”
చిన్న పావురపు పిల్ల, “కూ-కూ” అని కూయడం ప్రారంభించినది.
నేను చెప్పాను, “నీ నామము పరిశుద్ధపరచబడును గాక.”
అతను చెప్పెను, “కూ-కూ,” మరియు నేను వెనుకకు తిరిగి అలా వెళ్ళిపోయాడు.
మరియు నేను నా ప్రార్థన ముగించిన వెంటనే, “ఆమేన్,” అని చెప్పాను, మరియు ఆమె స్వస్థత కొరకు అడిగాను. ఆ చిన్న పావురపు పిల్ల ఎగిరిపోయినది.
సేవకులు గుర్తించారు. మరియు ఆమెను ఓదార్చమని స్త్రీతో నేను చెప్పుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మాట్లాడి మరియు, “ఆమె బాగవును,” అని చెప్పెను. మరియు ఈ రోజు, ఆమె నూట ముప్పై-అయిదు పౌండ్ల బరువు కలిగి, మంచి ఆరోగ్యముతో ఉన్నది. ఆఫ్రికాలో పచ్చని కాంతి మండుచున్నది.
33.అక్కడ నుండి మేము హెల్సింకీ అను ప్రాంతమునకు వెళ్ళాము. (మరియు నేను తొందరపడవలెను, కనుక దీనిని దాటి వేయుదును). విడిచి పెట్టుటకు ముందు, నేను.. ఒక రాత్రి, పరిశుద్ధాత్మ ఫ్లోరిడాలోని మియామిలో నాకు కనపడెను. ఒక చిన్న బాలుడు యాక్సిండెంట్ కి గురై చనిపోయెను, ఒక రాతి వలే కనపడుచున్న ప్రదేశములో పడియుండటం నేను చూశాను. మరియు ఓ, అతని యొక్క పరిస్థితి నేను వర్ణించినట్లయిన… మరియు ఇక్కడనున్న చాలామంది జనులకు అది తెలియును, మరియు నేను దాని గూర్చి మాట్లాడాను.
మరియు నేను అడిగాను… మరియు గుడారములోనికి వెళ్ళి, మరియు నేను చెప్పాను. “ఎక్కడో ఒక చిన్న బాలుడు చనిపోయి లేచుటకు సిద్ధముగా ఉన్నాడు. అది ఒక రాతినేలలా కనపడు ప్రదేశము. అతడు గోదుమ రంగు జుట్టు కలిగియున్నాడు, జుట్టు కత్తిరించబడెను. అతడు చిన్న చిన్న బట్టలు, నడుము క్రింద వరకు లాగులు వేసుకొనెను. అతడి కాళ్లు సాక్సులో నుండి బయటకు వచ్చి, అతడు యాక్సిడెంట్ లో పూర్తిగా నలుగగొట్టబడెను. మరియు అతడు చనిపోబోవుచుండెను. మరియు ప్రభువు అతడిని వెనుకకు తీసుకొని రానైయుండెను. నేను చెప్పాను, ”యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.“ ”మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథములలో వ్రాసుకొనండి. ఈ మధ్య కాలములో ఒక రోజు, స్వస్థత యొక్క స్వరము (పత్రిక)లో అది కనిపించును, అని నేను చెప్పాను. ఎప్పుడు, అది నాకు తెలియదు, (ఎందుకనగా ఆ దర్శనము రెండు గంటలు ఉన్నది.) ఇది ఒకానొక సమయమున జరుగును.“
34.ఆయన చూపించిన కొన్ని డజన్ల మరియు వందల సంగతులలో ఇది ఒకటి. ఇప్పుడు అందులో ఒక్కటైననూ జరగలేదు అని చెప్పిన ఏ వ్యక్తినయినా లెక్కలోనికి తీసుకొనండి.
అప్పుడు, రెండు మూడు రాత్రుల తరువాత, వారు నన్ను గుడారము వెనుకకు తీసుకొని వెళ్ళి, చెప్పారు. “ఇక్కడ ఒక చిన్న బాలుడు పడియున్నాడు. వచ్చి అతడిని చూడండి.” దాదాపుగా అయిదు సంవత్సరములు వయస్సు కలిగి, బొగ్గు రంగులో ఉన్న జుట్టు కలిగిన అతడు మునిగి చనిపోయాడు; మంచిది… నేను చెప్పాను, “అది అతడు కాదు.” ఓదార్పు కొరకు నేను ప్రార్థించి వెళ్ళిపోయాను.
మరియు కెనడా ద్వారా, పశ్చిమ దేశానికి వచ్చాను. మరియు నా యొక్క ప్రతీ కూడికలలోను దానిని చెప్పాను. నేను చెప్పాను, “మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాసుకోండి. ఇంకా జరుగలేని ఒక దర్శనము ఉన్నది. పాతిపెట్టు వ్యవస్థకు పోవు త్రోవను వెళ్ళుచున్న చిన్న బాలుడొకడు ఉన్నాడు. దేవుడు అతనిని స్వస్థపరచును. నేను అక్కడ ఉందును. అది ఒక రాతినేల దేశము, చాలా చెట్లు ఉన్నవి, మరియు ఎనిమిది లేదా పది సంవత్సరాల వయస్సు గల బాలుడు, ఒక చిన్న చదరపు ముఖము, గోధుమ రంగు కళ్ళు కలిగియున్నాడు.” నేను చెప్పాను, “అతడికి అమ్మాయి వలే కనపడుచున్న కత్తిరించబడిన జుట్టు ఉన్నది. అతడు నాసి రకమైన బట్టలు ధరించి యున్నాడు.”
35. అది నేను చెప్పడం ఎంత మందికి గుర్తున్నది? ఇక్కడ దానిని గుర్తుపెట్టుకున్నవారు ఎవరయిన ఉన్నారా? ఒక మనుష్యుడు ఇక్కడ తన చేతిని ఎత్తియున్నాడు. అవును, అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. అక్కడ అది జరుగక మునుపే, (చూచారా?) అది జరిగియున్నది. అవును, వెనుక అక్కడ, నేను నీ చేతిని చూస్తున్నాను.
మంచిది సరే, సంవత్సరమున్నర లేదా రెండు సంవత్సరముల ముందే అది జరిగినది. ఒక రోజు మేము హెల్సింకీకి వెళ్ళినప్పుడు, అప్పుడు మేము క్యూపియోకి వెళ్ళాము. అది ఉపవాస సమయము — నేను ఉపవాసముతో ప్రార్థించుచుంటిని.
వారు పాడిరి, రష్యన్లు మరియు అందరు, కొందరు అక్కడున్నారు, మరియు ఐరోపా వారు కూడా ఉన్నారు. మరియు “గొల్గోతా అనే ఒక మధురమైన పాట పాడిరి. మరియు వారి పాటలన్నీ సాధారణమైనవి, చాలా విచారకరమైనవి. ఆ శిఖరము క్రింద, అడుగున ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు. త్రాగి ఉన్నాడు, అతడు క్రిందకి వచ్చినప్పుడు మేము అతడిని క్రీస్తు యొద్దకు నడిపించాము.
ఏదో అద్భుతకరమైనది ఒకటి జరుగనైయున్నది అని సహోదరులకు నేను చెప్పాను. ప్రభువు యొక్క దూత దగ్గరగా ఉన్నాడని నేను అనుభూతి చెందుచున్నాను, మరియు అది కూడికల యొక్క సమయము కూడా కాదు“. మనము ఆశ్చర్యకరమైన కూడికలను కలిగియున్నాము. వేలాది… వారు అర మైలు లేదా ఐదు లేదా ఆరు పట్టణపు బ్లాకులు వరకూ నిలబడి యున్నారు. సాయంకాలము మూడు గంటల నుండి వారు నీలబడుచూ, ఇరవై-అయిదు వేలు లేదా ఇంకా ఎక్కువగా కూర్చొనదగిన, మెసుహలిలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించుచున్నారు. కనుక, ఎదురుచూస్తున్నారు.
36.మరియు నీవు అటువైపు దాటి వెళ్ళుచున్నప్పుడు… నీవు వారిని దాటివెళ్ళినప్పుడు, కేవలము గౌరవముతో వారి యొక్క చెంపలపై నుండి కన్నీరు కారుచున్నది, వారు అలానే నిలువబడియున్నారు. ప్రేమతో… ఓ, మై.
ఇక్కడ మనకు సుళువుగా ఉన్నది. మనము కలిగియున్నాము… మనము ఆలోచించినట్లుగా, మనము మంచిగా పోషించబడుచున్నాము. మరియు ఏ అవసరత కలిగిలేము. సహోదరుడా, వారు మనకు క్రైస్తవ్యము నేర్పవచ్చును. వారు కలిగియున్నదానంతట కొరకు వారు ప్రార్థన చేసి మరియు దేవున్ని పట్టుకొని ఉండవలెను. ఈ దేశములో మన జీవితము సరిచేసుకొనని యెడల, ఒక రోజు మనము ఒక మాంద్యమును (అర్థికముగా) కలిగియుండెదము.
నేను ఒక అమెరికన్ ను, ఇక్కడ జన్మించాను, తరము తరువాత తరము. జర్మనీ మరియు ఫ్రాన్స్ లో సమాధులలో పెట్టబడియున్న అనేక మంది మృత బ్రెన్ హామ్ ల సమాధుల మీదుగా నేను పయనించాను. యుద్దములలో వారు చనిపోయెను. మరియు ఒకవేళ ఈ రాత్రే నాకు పిలుపు వచ్చినట్లయితే, నేను నా దేశము కొరకు ఉచితముగా చనిపోవుదును, కాని ఆమె కొంత సరిచేసుకొనవలసిన అవసరత యున్నది. ఖచ్చితముగా సరియే.
మనము ఉజ్జీవము కొరకు మాట్లాడుచున్నాము, ఇప్పటికింకా మనము. ఉజ్జీవమును కలిగిలేము. మనము చాలా విస్తరింపబడిన కూడికలను కలిగియున్నాము, కాని ఉజ్జీవమనగా వారు కన్నీరు కార్చుచూ, మరియు ప్రార్థన చేయుటకు వెళ్ళుచూ, మరియు దేవునితో సరిచేయబడవలయును. మరియు పాతకాలపు వానివలే, వెనుక అరణ్యములో, నీలాకాశములో, పాపమును చంపు మతమును ప్రసంగించుట, ప్రజలను దేవునితో సరిచేయబడినట్లు చేయుచున్నది, అదే మనకు కావలసిన ఉజ్జీవము, సంఘములో చేరుట కాదు. ఆమేన్. ఎందుకు చెప్పానో నాకు తెలియదు, కాని నేను ఇప్పటికే దానిని చెప్పియున్నాను.
37. గమనించండి. మంచిది. మరియు ప్రేమగల ఆ ప్రజలు మేము క్రిందకి వచ్చినప్పుడు, నేను సహోదరునితో చెప్పుచున్నాను. “ఏదో ఒకటి జరుగనైయున్నది”. మేము కొండదిగి వచ్చియున్నాము. మరియు క్రింద ఒక కారు వేగముగా వెళ్ళుచున్నది.
ఫిన్లాండ్లో కార్లు ఎక్కువగా ఉండవు. వాడేసిన ఫోర్డ్ కారు నాలుగువేల డాలర్లకే అమ్మబడును. ఇంధనము ఒక డాలరు మరియు సగం గ్యాలను ఇంధనము, అక్కడ చాలా తక్కువ కార్లు ఉన్నవి. మీరు మితముగా ఒక కారు చూస్తారు.
మరియు ఒక పాత కారు శిధిలాలు, అమెరికా – తయారీ ముప్పై-అయిదు మోడల్ ఫోర్టు పచ్చరంగు, కొంతమంది స్కూలు పిల్లల మీదుగా వెళ్ళిపోయినది. ఇద్దరు చిన్న బాలురు ఇటువైపు నుండి నడుస్తున్నారు. వారు వెనుకకు పరుగెత్తుటకు ప్రయత్నించిరి. మరియు ఒకరు ఇటువైపుకు మరియు ఇంకొకరు ఇంకొక వైపుకు, మరియు ఆ బంపరు. (కారు యొక్క ముందటి భాగము) ఒకనికి దవడ మీద తగిలెను. మరియు అతడు ఇటువైపు ప్రారంభించెను.
అప్పుడు డ్రైవరు తన కారును కుడివైపునకు త్రిప్పెను, అతడికి దవడకు తగిలి, మరియు అతడిని అటువైపు క్రిందకి పడవేసెను. దొర్లుకుంటూ, దొర్లుకుంటూ వెళ్ళి పొదకు తగిలి, మరియు చెట్టునకు గ్రుద్దుకొని మరియు అతడి మెదడును తీవ్రముగా కంపించునట్లు చేసెను. మరియు మరియొక చిన్నవాడు, అతడి ఎదుటే అతడిని గ్రుద్దినది, బంపరుతో గ్రుద్దినది, దొర్లుకుంటూ వెళ్ళెను, అతని మీదుగా కారు వెళ్ళినది.
మరియు ఆ కారు గంటకు అరవై మైళ్ళ వేగముతో వెళ్ళుచున్నది. వెనుక నుండి అతడిని దొర్లించెను, మరియు అతడు ఆ విధముగా వెళ్ళినప్పుడు గాలిలోనికి అతడు ఎగరవేయబడెను. మరియు అతడు ఒక మూట వలె నేల మీదపడెను. అలా గుద్దబడిన ఒక కుక్క లేదు మరేదో దాని గూర్చి ఆలోచించండి.
38.ఆ ప్రదేశమునకు మేము వెళ్ళు పదిహేను నిముషములముందు, కొద్ది నిముషములు నిశ్శబ్దముగా ఉండెను. ఆ చిన్న బాలుడు అక్కడ చచ్చి పడివుండెను. సహోదరుడు మరియు వారు వెళ్ళి అతడిని చూచారు. మరియు నేను ఆ బిడ్డను చూడలేకపోయాను. అది కేవలము…
సహోదరుడు లిండ్సే తిరిగి వచ్చెను. సహోదరుడు గోర్డన్ లిండ్సే మీలో చాలా మందికి తెలియును. సహోదరుడు బాక్స్టర్ నేను అనుకొనుట లేదు… లేదు, అతడు ఆ ప్రదేశములో లేడు. సహోదరుడు బాక్స్టర్, ఎప్పుడు మాతో రాలేదు. అతడు నడుచుచుండెను, అతడు మరియు నా సహోదరుడు. మరియు నేను అక్కడకు వెళ్ళినప్పుడు, నేను…
సహోదరుడు లిండ్సే ఏడుస్తూ వెనుకకు వచ్చెను. సహోదరుడు మూర్ ఏడుస్తూ తిరిగి వచ్చెను, సహోదరి ఐజాక్సన్, తర్జుమా చేయు వ్యక్తి…
మంచిది, ఏమి ఆలోచించాలో నాకు తెలియదు. మరియు చివరగా, నేను ఆ బాలుని వైపు చూచాను. మరియు నేను ఏడ్చుట ప్రారంభించాను. నేను ఇక్కడ ఒక కుమారుని కలిగియున్నాను. మరియు నేను “అమెరికాలో ఉన్న నా బాలుని కొరకు,” నేను ఆలోచించాను. ఇప్పుడు, నేను అంత ఉద్రేకపడనట్లయితే, నేను దానిని త్వరగానే గుర్తించియుండెడివాడను. కాని నేను తిరిగిపోయాను. అది అతడి యొక్క చిన్న ముఖమును కప్పివేసినది. మరియు నేను…
39.ఎవరో నా యొక్క భుజము పైన వారి యొక్క చేతిని వేసినట్లు అనిపించినది లేక అటువంటిది. నేను తిరిగి చూడగా, మరియు అక్కడ ఎవరునూ లేరు. నేను అనుకొన్నాను, “ఆగండి, ఈ వింతయైన అనుభూతి ఏమిటి?” కొద్ది క్షణములు నేను ఎదురుచూచాను. నేను చెప్పాను, “ఆ బాలున్ని నన్నొక్కసారి తిరిగి చూడనిమ్ము.” మరియు అతడిపై నుండి దానిని వారు వెనుకకు లాగిరి, మరియు అక్కడ అతడు పడియున్నాడు. మరియు నేను చెప్పాను, “ఒకవేళ ఎప్పుడైనా ఆ బాలుడు సంఘములో ఉండెనా అని సేవకులను అడగండి.”
“లేదు.”
“వారికి అతడు తెలియునా?”
“లేదు.”
నేను చెప్పాను, “ ఆ బాలున్నీ నేను ఎక్కడో చూచాను.” అతడి వైపు నేను మరియొకసారి చూచాను. అతడి చిన్న పాదము ఆ సాక్సులో ఉండటం నేను చూసాను. నేను చుట్టూ చూసాను. ఆ రాత్రి మోటైన దేశమును నేను చూసాను. నేను చెప్పాను, “అతడు ఇక్కడే ఉన్నాడు.”
నేను చెప్పాను, “సహోదరుడా మూర్, నీ బైబిల్ లో చూడుము.”
“ఏమనుచున్నావు నీవు?” అని అన్నాడు.
నేను చెప్పాను, “గుర్తు కొరకు పెట్టిన ఆ కాగితమును చూడుము, నీవు మరియు సహోదరుడా లిండ్సే, యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అమెరికాలో చూసిన బాలుడు అతడే. కొద్ది క్షణములలో ఆ బాలుడు జీవించును.” నీవు ఎక్కడ నిలబడియున్నావో నీవు ఎరిగియున్నప్పుడు, నీవు ఎటువంటి అనుభూతిని పొందెదవో నీవు ఎన్నడునూ ఎరుగవు. అది సరియే.
40.చెప్పాడు, ““ఆ బాలుడు ఇతడేనా?””సహోదరుడు మూర్ తన బైబిల్ లో గుర్తుకొరకు పెట్టిన ఆ కాగితమును చూచెను… నేను వందలమందిని అక్కడవ్రాసుకొనమని చెప్పాను. అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్ హామ్ , ఆ వివరము ఖచ్చితముగా అదే.”
నేను చెప్పాను, “ఆ బాలుడు అతడే.” సరే. మేము సమకూడి, మోకరించాము. మరియు నేను చెప్పాను, “ఓ, నిత్యుడగు దేవా, నా యొక్క స్వదేశమగు ఆమెరికాలో, ఒక రాత్రి నీవు నన్ను దర్శించితివి మరియు ఈ చిన్న బాలున్ని, ఈ యొక్క రాతి దేశమును నాకు చూపించితివి. మరియు ఇక్కడ అతడు చనిపోయి పడియుండెను, ఈ చేదు వార్తను వినుటకు వచ్చుచున్న అతడి తండ్రి మరియు తల్లి కొరకు ఎదురుచూచుచున్నాము. నేను చెప్పాను, ”నీవు, నన్ను నా యొక్క తల్లి గర్భము నుండి వేరుచేసి, మరియు ఈ యొక్క దర్శనములు చూచుట కొరకు నన్ను పంపియున్నావు. ఇప్పుడు, సర్వశక్తిగల దేవా, పలుకుము; మరియు మరణము, అతడిని పట్టుకొనుము, ఆ దర్శనమును చూపించిన యేసుక్రీస్తు నామములో అతని యొక్క ప్రాణము కొరకు పిలుచుచున్నాను.“
మరియు ఆ చిన్న బాలుడు అరిచెను, తన కాళ్ళ మీద గంతులు వేసెను, మరియు ఈ రాత్రి ఈ భవనములో కూర్చొనియున్న ఎవరికన్ననూ సాధారణముగా మరియు బాగుగా ఉండెను. ఆ స్పర్శ ఎర్రటి అగ్ని వలె వచ్చియున్నది.
41.ఆ రాత్రి నన్ను ఆ కూడికకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించినప్పుడు, ఎందుకు… ఆ వీధియంతయూ అక్కడ నిండుకొని యున్నప్పుడు అధికారులు, పోలీస్ వారు, సైనిక అధికారులు వచ్చి మరియు ఆ వీధిలో ఆ గంపుల గుండా నన్ను తీసుకొనివచ్చెను. లోపలికి వచ్చుట, నేను ఎప్పటికి మర్చిపోలేను.
నేను తొందరపడవలసి యున్నది. మరొక్క విషయము. రేపు రాత్రికి నేను ఆ మరొక బాలుని గూర్చి ముగించెదను.
నేను గదికి వెళ్ళుచున్నాను, ఇద్దరు ఫిన్నిష్ సైనికులు (ఫిన్లాండ్ దేశానికి చెందినవారు) నా వెనుక మరియు ఇద్దరు నా ముందు త్రోసుకొని వెళ్ళుచున్నారు. నేను గదిలోనికి వెళ్ళిపోయాను మరియు వారు… ఆ ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. ఓ, మై. మరియు ఆ వీధులలో క్రిందా, పైనా, వారు చుట్టు ప్రక్కలంతా గుడారములు వేసిరి. మరియు మేయర్ అని మేము పిలిచే పట్టణ ప్రముఖులను నేను కలిగియున్నాను, అక్కడ వారి పుస్తకములలో వ్రాసిరి, తన స్వంత పేరుతో సంతకము చేసెను, చనిపోయిన వానిని లేపిన, సర్వశక్తిగల దేవుని శక్తికి సాక్షిగా నిలిచెను.
42. ఇప్పుడు, అది జరుగుటను నేను మూడు సార్లు చూచాను. బహుశా దీనిని నేను తరువాత కలిగియుందును, ఇక్కడ ఫినిక్స్ లో శ్రీమతి. హాత్తి వాల్డ్-డ్రాఫ్ మరియు రాల్ఫ్ ఫెర్రీ ఇంటి యొద్ద ఉన్నప్పుడు, ఇప్పుడు… చనిపోయినాడని ప్రకటించిరని నా ఉద్దేశ్యము, బయట పెట్టబడెను… ఈ బాలుడు, నేను ప్రారంభించినప్పుడు…
నేను ఒక చిన్న గదిలోనికి వెళ్ళుచున్నాను, మరియు ఒక తలుపు వేయు శబ్దమును నేను వినియున్నాను. మరియు స్త్రీలు విశ్రాంతి తీసుకొను గది అక్కడ ఉన్నది, దానివలె అది ఉన్నది. మరియు నేను బయటకు అడుగు పెట్టినప్పుడు, నా జీవితములో నేను ఎన్నడూ చూడనటువంటి భీతికరమగు దృశ్యమును నేను చూచాను. అది ఒక చిన్న బాలిక.
స్వస్థత యొక్క స్వరము అనే పత్రికను ఎంతమంది తీసుకొన్నారు? బహుశా మీరు ఆమె చిత్రమును చూసియుండవచ్చును మరియు నేను ఏమి మాట్లాడుచున్నానో తెలుసుకొని ఉండవచ్చును. ఒక పెద్ద స్టీలు పరికరము ఆమె చుట్టూ ఇలా ఉన్నది, మరియు ఒక కాలు ఇంకొక దాని కన్నా పొట్టిగా ఉన్నది. మరియు ఆ కాలు ఆమె యొక్క నియంత్రణలో లేదు. మరియు ఈ బంధనము క్రింద ఆమె ఒక పెద్ద బూటును నిర్మించుకొనియున్నది. మరియు ఆ బంధనము చాలా గట్టిది లేనట్లయితే, కనుక అది మోకాలును వంచును. అది చాలా ధృడమైనది. అది ఆమె చుట్టూ గుండా వచ్చి మరియు ఆమెను చుట్టివేసినది. మరియు ఆ బూటు యొక్క వేళ్ళు దగ్గర ఒక కొక్కి ఉన్నది. ఒక త్రాడు వచ్చి ఆమె భుజములపై నుండి వెళ్ళినది, మరియు ఆ తాడు వెనుక కొక్కికి తగిలించబడినది.
మరియు ఆమె నడుచుటకు ఆమెకు రెండు ఊత కర్రలు ఉన్నవి, మరియు ఆమె కర్రను ముందుకు పెట్టి, ఆమె యొక్క భుజమును ఊపి మరియు ఆమె కాలు బయట పెట్టును, మరియు అది సరిగా ఎదుగకపోవుట వలన, దానితో ఏ ఉపయోగము లేదు. దాని యొక్క బరువు ఇక్కడకు విసిరివేయును. (మీరు చూడండి?) సహాయము. మరియు ఆమె పట్టుకొని మరియు నడచుచున్నది. మరియు అది ఆమె నడచుటకు సహయపడును. మరియు ఆమె ఆ బూటును క్రింద పెట్టి ఆమె ఒక అడుగు వేయగలదు.
43.మరియు ఆ దీనురాలైన చిన్నది అక్కడ నిలుచునియున్నది… మరియు స్త్రీలు, మీరు ఏ విధముగా దుస్తులు ధరించెదరో మీకు తెలియును… ఆమె యొక్క ఆ మోకాళ్ళ క్రిందకు వ్రేళాడుచున్న మరియు చిరిగిపోయిన ఆ చిన్న దుస్తులతో ఆ చిన్నది అక్కడ నిలబడియున్నది. మరియు ఆ తరువాత ఆమె ఒక యుద్ధము వలన (అనాధ అయినది) అని తెలుసుకొన్నాను. రష్యాలో, ఆమె యొక్క తల్లిదండ్రులు యుద్ధములో మరణించారు.
మరియు ఆమె అక్కడకు వచ్చినది, మరియు ఆమె… చింపిరి జుట్టుతో యున్నది. మరియు నేను అక్కడ కూర్చొనుటను, ఆమె చూసినప్పుడు, మరియు ఆమె ఈ విధముగా నిటారుగా ఉన్నది, మరియు ఆమె యొక్క చిన్న తలను వంచినది. ఓ, మై, నా హృదయమును ఏదో మెల్లగా త్రోసినది. నేను ఆ చిన్న దానిని చూసాను. నేను… ఓ, నేను నా అనుభూతిని పంచాలనుకుంటున్నాను. మరియు ఆ సైనికుడు “మమ్, మమ్” అనుచూ, నన్ను ముందుకు త్రోయుచుండెను.
లేదు… మరియు ఆమె కోరుచున్నది నాకు తెలియును… ఆమె నాతో మాట్లాడాలని కోరుచున్నది, వీధిలో గాని లేదా ఏదయినా, ఆమెను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే వారు చెప్పిరి.
మరియు ఆ చిన్న పిల్లలను నేను ప్రేమించెదను. నేను వారినందరిని సంఘములో కలిగియుందును. మరియు వారందరూ ఆడిటోరియంలో మధ్యాహ్న కూటము కొరకు ఉన్నప్పుడు… వారు నాకు కొన్ని చిన్న పాతవైన ఫిన్నిష్ డబ్బులను ఇచ్చారు, మరియు వారు చాక్లెట్లను కొనుక్కొనేందుకై, వారికి దానిని ఇచ్చుటకు నేను అక్కడకు వెళ్ళవలెను. మరియు వారి యొక్క చిన్న బట్టలను లాగుచూ మరియు, “కిటోస్” అని చెప్పెదరు. ““కిటోస్” “అనగా వందనములు. మరియు వారు “కిటోస్” అని అరిచెదరు. మరియు ఆ భవనము వెనుక నన్ను వెంబడించుచున్న చాలా మంది చిన్న పిల్లలను నేను కలిగియుందును. నేను ఆ చిన్న బిడ్డలను ప్రేమించెదను.
44.మరియు ఆమె నా వైపు అలానే చూస్తూ ఉన్నది, మరియు ఆమె చిన్న పెదవులు భయముతో వణకుచున్నవి, మరియు ఆమె అలా నిలబడిపోయినది. నేను ఆమె యొద్దకు వెళ్ళి, ఇక్కడకు రా అన్నాను. ఆమె రావాలని కోరుచున్నది అని నాకు తెలుసు. నేను ఎక్కడ ఉన్నానో ఆమె అక్కడకు వచ్చినది. మరియు ఆమె కలిగియున్న దానితో మరియు ఆమె యొక్క చేతి కర్రతో వచ్చియున్నది, మరియు దానితో ఆమె నడిచెను. ఆమె ఏమి చేయనైయున్నదా అని నేను చూడగోరాను. మరియు ఆమె నా కోటును పట్టుకొని మరియు ఆ కోటు మీద ముద్దు పెట్టుకొనెను, దానిని క్రిందకు వదిలి, నావైపు అలా పైకి చూచినది, తన ఊత కర్రలు అటు ఇటూ ఊపుచూ, తన యొక్క చిన్న బట్టను లాగుచూ, “కిట్టొస్” అని చెప్పెను. మరియు అలా ఆమె యొక్క కన్నీళ్లు తన యొక్క చిన్న బుగ్గల పై నుండి కారుచూ క్రిందపడుచున్నవి. ఓ, నేను… నా హృదయము పగిలిపోవునట్లుగా నాకు అనిపించినది. నేను క్రిందకు ఆమె వైపు చూచాను; ఆమె స్వస్థపరచబడుట నేను చూచాను. అటువంటి విశ్వాసమునకు దేవుడు బహుమానమిచ్చునని నాకు తెలియును. నేను చెప్పాను, “హానీ, నీవు స్వస్థపరచబడ్డావు.”
మరియు నేను చెప్పినది ఆమెకు అర్ధము కాలేదు. వారు నన్ను ఆలాగు త్రోసుకొంటూ వెళ్ళారు.
ఆ రాత్రి మేము ఒక గొప్ప కూడికను కలిగియున్నాము. మరియు ఆ జనులు, అక్కడే ఏదో బయలు పరచబడటం వారు చూచినప్పుడు, వారు తమ ఊత కర్రలను విసిరివేసి మరియు నడుచుటకు ప్రారంభించారు.
45.మరియు ఆ రాత్రి, వారు తటాలున చేతిని పట్టుకొనియున్నారు. దానిని బహుశా మీరు దినపత్రికలో చూసియుండ వచ్చును. ఎత్తయిన ఆ ఊత కర్రలు మరియు వాటి నుండి స్వస్థత పొందిన జనుల యొక్క చేతి కర్రలు చూపించిరి. వారే కేవలము… నాకు ప్రక్కగా వాటిని పైకి ఎత్తిరి. డాక్టర్ మునియన్ మరియు వారు, ఆ యొక్క చిత్రమును తీసినప్పుడు. మరియు నా యొక్క సహోదరునితో నేను చెప్పాను… అతడు చెప్పాడు, “నీవే దానిని తీసివేయవలసియున్నది.” అతడు నన్ను లాగివేయుచుండెను.
మరియు నేను చెప్పాను, “కేవలము ఇంకొన్ని.” మరియు దేవుని యొక్క జ్ఞానయుక్తమైన దైవఘటనను చూడండి, ఆ తరువాత కారు పిలువబడెను, ఏదో గలగలమని శబ్దము నాకు వినబడినది మరియు అది ఆమె. ఆ తరువాత , వేదిక మీదికి వచ్చుచున్నది. మరియు ఆమె అక్కడికి వచ్చినప్పుడు. నేను చెప్పాను, “సహోదరి ఐజాక్సన్,” తర్జుమాదారిణి, కేవలము నా స్వరమును అనువదించుము.
ఆమె “చాలా మంచిది” అని చెప్పినది.
మరియు నేను చెప్పాను, “ప్రియా, బయట ఆ యొక్క హాలులో నన్ను కలుసుకొన్న చిన్న బాలీకవు నీవే కదా,” అని అనువాదకురాలు చెప్పినప్పుడు, ఆమె తన చిన్న తలను ఊపుచుండెను.
నేను చెప్పాను, “ప్రియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు, నీవు అక్కడికి వెళ్ళి కూర్చొనుము, మరియు నీ యొక్క ఊత కర్ర పరికరములను తీసి వేయుము. మరియు నీ యెక్క ఆ పరికరములు ఊడదీసియున్నప్పుడు, నీ యొక్క చిన్న చేతిని అలా క్రిందకి వదిలివేయుము మరియు నీవు స్వస్థపరచబడెదవు.” “నేను నిన్నుదర్శనములో చూచాను; నీవు స్వస్థపరచబడ్డావు,” అని నేనుచెప్పాను. ఆమె అక్కడకు నడిచినది. ఆ కావలి కాయువారు ఆమె నుండి ఆ పరికరములను తొలగించుచుండిరి. మరియు వారి వలె…
46.నేను అక్కడ నిలువబడి యున్న వేరొక స్త్రీకి ప్రార్థించుట ప్రారంభించగానే, పైకి వచ్చినది. వెంటనే నేను ఒక కేక విన్నాను. మరియు నేను చూడగానే, ఆమె వేదిక పైకి వచ్చి, ఆమె తలపై నుండి ఆ కర్రలను లేపుచూ, ఆమె పరుగెత్తగలిగినంత బాగా పరుగెత్తుచున్నది. కాంగ్రెస్ మెన్ అప్షా వలె సంపూర్ణముగా బాగుపరచబడెను.
అది ఏమిటి? యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన శక్తి అనంతమైనది. అది మీ యొక్క విశ్వాసమునకు పరిమితమైనది. దానిని నీవు నమ్ముచున్నావా? అది వేవేల కొలది ఉన్న జనుల మధ్య స్థిరపరచబడినది.
మరియు అదే విధముగా, నా పుస్తకములో ఉన్న దానిని నేను నమ్ముచున్నాను. ఆమె యొక్క చిరునామా మరియు చనిపోయి లేపబడిన ఆ చిన్న బాలునిది, మేము కలిగియున్నామని నమ్ముచున్నాను. మరియొక దానిని రేపు రాత్రి మీకు తీసుకొని వచ్చెదను.
47. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవనికి దేవుని యొక్క బాహువు బయలుపరచబడెను? ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసు, దైవికమైన సన్నిధిలో ప్రతీ ఒక్కరినీ ఆశీర్వదించును. నేను మిమ్ములను స్వస్థపరచలేను. ఆయన మీ కొరకు ఏమి చేసియున్నాడో, దేవుడు నాకు చూపించగలడు. ఒకవేళ ఆయనలో మీ విశ్వాసమును మీరు ఒప్పుకొనిన యెడల, మరియు దీనిని చేయుటకు ఆయన నన్ను పంపియున్నాడని నమ్మినట్లయితే, [టేపులో ఖాళీ స్థలమున్నది.] మీరు ప్రభువు యొక్క మహిమను చూచెదరు. మన తలలు వంచెదము… [టేపులో ఖాళీ స్థలమున్నది.] మనము ప్రార్థించులాగున.
పరలోకపు తండ్రీ, నీ కొరకు సాక్ష్యమిచ్చుటను మేము ప్రేమించుచున్నాము. అది ఇంకనూ నా హృదయములో మండుచున్నది. ఆ దీన చిన్న ఫిన్నిష్ అనాధ, తల్లిలేని మరియు తండ్రిలేని ఆ చిన్నది, వారిద్దరూ చంపబడిరి. దీనురాలైన చిన్నది, ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశమునకు మోయబడుచున్నది.
ఇక్కడ మరియు ఇంటి దగ్గర చూచియున్న దృశ్యములను గూర్చి ఈ రాత్రి నేను ఆలోచించుచున్నాను. ఆ చెత్తకుండీ దగ్గరకు వెళ్ళి మరియు ముక్కలు చేయబడిన ఆ రొట్టెలు మరియు మాంసపు ముక్కలు తీసుకొనుట. మరియు ఆ చిన్న పేద ఫిన్నివారు, వీధులలో నడుచుచూ, కొంతమంది చిన్న మురికి చేతులతో, తమ చిన్న కళ్ల వెంబడి కన్నీళ్లు కార్చుచుండెను. ఆ చిన్న రొట్టె ముక్కను పొందుటయందు వారికెంతో ఆనందమున్నది. ఓ దేవా, మేము అయోగ్యులము.
48.ఒక మహిమకరమైన రోజు, మేము ఆ సరిహద్దును దాటుదము. అప్పుడు మేము నీ బల్ల యొద్ద కూర్చొనెదము. ఒకరివైపు ఒకరు చూచుకొనుచూ, ఆ గొప్ప యుద్దములను బట్టి మా యొక్క చెక్కిళ్ళపై నుండి కన్నీరు కారును. మరియు యుద్దములో పోరాడిన చాలా మంది వృద్ద సైనికులను మేము చూచుచున్నాము. మేము ఒకరికొకరము కరచాలనము చేయుచూ, మరియు కొద్దిగా ఏడ్చుదుము. అప్పుడు రాజు వచ్చి మా కళ్ళనుండి వచ్చుచున్న ప్రతీ బాష్ప బిందువునూ తుడిచివేయును. “ఇప్పుడు, ఇక ఏడ్వవద్దు. యుద్దము ముగించబడినది; మీరు గృహమునందు యున్నారు. ప్రభువు యొక్క ఆనందములోనికి ప్రవేశించుడి,” అని చెప్పును. ప్రభువా, అటువంటి దినము కొరకు నేను పనిచేయుచున్నాను. అటువంటి దినము కొరకు మేము కష్టపడుచున్నాము. ప్రభువా, జనులు మా సమాచారమును నమ్మిననూ, నమ్మకపోయిననూ మేము దానిని బోధించెదము, మరియు నీవు దానిని రుజువుచేయుచున్నావు.
మరియు మీ యొక్క ఆశీర్వాదములను తెలియపరచుటకు నీవు ఇక్కడ ఉన్నావని మాకు తెలియును. దేవా, ప్రభువైన యేసు, ఈ రాత్రి ఈ జనులను దీవించుము, చాలా మంది వృద్ద తల్లులు మరియు తండ్రులు, ఇక్కడ కూర్చొని యున్నారు… [టేపులో ఖాళీ స్థలమున్నది.] వెళ్ళుటకు సిద్ధముగా యున్నారు. వైద్యులు వారిని తిరస్కరించింది. చాలా మంది ఇక్కడ చక్రాల కుర్చీలలో ఉన్నారు. ఏదో ఒకటి జరిగితేనే తప్ప వారు ఇక ఎన్నడునూ నడవలేము అని అనుకోనుచున్నారు. చాలా మంది వృద్ద సహోదరులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. బహుశా అది హృదయ సంబంధిత వ్యాధి కావచ్చును (గుండె జబ్బు), లేక సహోదరీ, ఒకవేళ ఏదైనా జరగనట్లయితే; కొద్ది వారములలో వారు చనిపోవుదురు. వారిని ఆ కాన్సరు తినివేయును. ఓ, యేసు, కృప చూపుము. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన పద్దతిలో మాతో నుండుము.
49.దర్శనములను చూపించుటకు నేను నీ యొక్క దూతల కొరకు సాక్ష్యమిచ్చెదను. ఓ తండ్రి, ఈ యొక్క ప్రేక్షకులతో, నా యొక్క స్వరమును వినుట కాదు, కాని నేను వారితో మాట్లాడుట లేదు, నేను నీతో మాట్లాడుచున్నాను. ఈ రాత్రి నీవు దర్శనములు చూపించెదవని, దేవా, నీకు ప్రార్థించుచున్నాను. సాధ్యమైతే అది కనపడులాగున చేయుము. ఇక్కడ, దేవుని యొక్క దూత తన యొక్క గొప్ప రెక్కలను ఇక్కడ ఈ భవనము పైన చాపును గాక మరియు ప్రభువా, ఇక్కడనున్న ప్రతీ ఆకలిగొనిన హృదయముపై కృప యొక్క మంచు బిందువులు వారి యొద్ద నుండి జారును గాక. మరియు ఈ రాత్రి స్వస్థపరచబడుటకు వారు విశ్వాసమును కలిగియుండెదరు గాక. మరియు ప్రభువు యొద్ద నుండి వారి స్వస్థతను అంగీకరించెదరు గాక. ప్రభువా, నీకు అవసరమైన ఈ అర్హతలను ఎవరైనా పొందినట్లయితే, అది నీ సేవకునికి చూపించుము. మరియు బహుశా అతడు ఇప్పుడు నీ సేవకుడిని మ్రింగివేయుము, ప్రభువా, మరియు మరుగుచేయుము.
మీకు తెలియును, ఇక్కడ సహోదరుడు అప్షా కూర్చొనియున్నాడు. అతడు అరవై-ఆరు సంవత్సరములు ఎదురుచూచెను. కాని తన జీవితపు చివరి దినములలో, నీవు అతడిని ఆశీర్వదించితివి. అతడి హృదయ కాంక్షను నీవు అతనికిచ్చితివి. సరిగా నడచు వారికి నీ యొక్క మంచి కార్యములను నీవు దాచిపెట్టవు.
50.మరియు ఇక్కడ కూర్చొని కాన్సరుతో చనిపోవుచున్న వారు ఇప్పుడు బాగుపడిరి. గత రాత్రి కుర్చీలో అవిటిదైయున్న ఒక స్త్రీ, ఆమె ఇక్కడ మంచిగా నడుచుచున్నది. ఓ, క్రీస్తూ, స్త్రీ, పురుషులు గుర్తించుదురు గాక, వారి యొక్క మూఢభక్తిని కట్టబెట్టి మరియు ఇప్పుడు ఎక్కడ నుండైతే మాకు సహయము వచ్చుచున్నదో, ఆ కల్వరి వైపు చూచెదరు గాక. మేమెవరికి ప్రాతినిధ్యము వహిస్తున్నామో దానిని వారు చూచెదరు గాక. దేవుని యొక్క గొర్రెపిల్ల, మా అపరాధముల నిమిత్తము గాయపర్చబడెను, మరియు ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినది. ఆయన యొక్క శక్తితోను మరియు ఆయన యొక్క మహిమలోను వారు ఆయనను చూచెదరు గాక. ఈ రాత్రి ఆయన యొక్క పునరుత్థాన శక్తిలో వారు ఆయనను చూచెదరు గాక. మరియు పూర్వమున ఆ శిష్యులు, ఎమ్మాయి మార్గము నుండి తిరిగివచ్చినప్పుడు, ఆ విధముగా ఈ రాత్రి ఈ ప్రేక్షకులు ఇక్కడ నుండి వెళ్ళుచున్నప్పుడు, ఎమ్మాయి నుండి తిరిగి వెళ్లుచూ పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శక్తిని చూచినవారుగా ఉండెదరు గాక, “మన హృదయములు మండలేదా?” అని చెప్పిరి. ఏలయనగా ఆయన అక్కడ ఉన్నాడు… [టేపులో ఖాళీ స్థలమున్నది.] వారిని స్వస్థపరచండి. ప్రభువా, దానిని అనుగ్రహించండి.
ఇప్పుడు, నన్ను మీకు అప్పగించుకొనుచున్నాను… [టేపులో ఖాళీ స్థలమున్నది.]… నీ ఆశీర్వాదముల యొక్క మహిమకరమైన కుమ్మరింపును, నీ కుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
51.ఇప్పుడు, గుర్తుంచుకొనండి, నేను ఈ ప్రకటన చేయుటవలన: కూడికలో ఉన్న విమర్శలకు నేను భాధ్యత వహించను. దయచేసి నేను ఇంకొకసారి దానిని చెప్పవచ్చునా? కూడికలో ఉన్న విమర్శలకు నేను బాధ్యత వహించను. ఒకవేళ కేవలము విమర్శకులుగా ఉన్నవారెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, లేదా కేవలము ఆతురతతో వచ్చిన వారెవరైనా, కూడికలో ఈ భాగము జరుగుచున్నప్పుడు నేను ఉండను. రేపు తిరిగి వచ్చి ప్రసంగమును వినుడి. కాని దీని కొరకు వేచియుండవద్దు. ఏలయనగా ఇది మీకు నిశ్చయము చేయుచున్నాను. దయ్యపు శాస్త్రము ఆత్మ మరియు శక్తి, వదిలిపెట్టబడినప్పుడు, అది వీలైతే వెళ్ళుటకై ఒక స్థలమును కనుగొనును. మరియు అవిశ్వాసము, ఖచ్చితముగా అది ఒక స్థానమును తీసుకొనును. (లేక ఒకవేళ నిజముగా నీవు ఒక విశ్వాసివైతే, మరియు కేవలము నీ అల్పవిశ్వాసము వలన ఏదైనా జరిగితే, దాని గూర్చి మనము శ్రద్ధ కలిగియుందుము.) కాని నీవొక అవిశ్వాసివైతే, లేదా దానితో చేయుటకు నా యొద్ద ఏమియూ లేదు, ఎందుకనగా అది నిన్ను వదిలివేయునట్లుగా నేను ఏమియూ చేయలేను.
మరియు ఇప్పుడు, నిన్ను పడిపోవునట్లుగా చేయు సామర్థ్యము కలిగినవానియందు, ఆయన మరింత విస్తారముగా, మనము ఆలోచించు దానికన్నా ఎక్కువ చేయును. మరియు ఇప్పుడు, ఆయన యొక్క కృప ఇక్కడ యుండి, మన యొక్క కూడికను అభిషేకించును గాక. మరియు మీ యొక్క విశ్వాసము స్థిరపరచబడును గాక. మరియు ఒక ఒంటరి అయిన యాత్రికునిగా, మనుష్యుల చేత తృణీకరించబడి, విచారమునకు గురి అయిన చింతాక్రాంతుడైన మనిషిగా, దేయ్యముగా నింద మోపబడి, మనస్సులను చదివేవాడిగా, ఒక ఆత్మసంబంధమైన వానిగా, క్రిందకు నడుచుకుంటూ వస్తున్నవాడు తప్పుగా అర్థము చేసుకొనబడుటను చూచునట్లు ఊహించండి. కాని ఆయన దేవుని యొక్క సొంత కుమారుడు.
మరియు ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ నాతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ మీతో ఉన్నాడు మరియు ఆయన సమస్తమును ఎరిగియున్నాడు. నేను ఏమియూ ఎరుగను. కాని ఆయన సమస్తమునూ ఎరుగునట్లుగా చేయును. ఆయన చేయలేడా?
52.కొంత మంది దీన అవిటివారు వచ్చుచున్నారు. సరే, కేవలము ఒక్క నిమిషము ఇక్కడకు రండి. నీవు ఉండగలిగినంత వినయముగా ఉండు. నేను నిలబడియున్న స్థానమును క్రైస్తవులు గుర్తించినట్లయితే నేను ఆశ్చర్యపడెదను? మీరు గుర్తించండి. ఇంతమంది ప్రేక్షకులు ఉన్న ఇటువంటి దానిలో మూఢభక్తులు, విమర్శకులు మరియు అటువంటి వన్నీ ఇక్కడ కూర్చుండును అని మీరు గుర్తించారా? మరియు యేసుక్రీస్తును గూర్చి నేనొక ప్రకటన చేసియున్నాను.
మీరు చెప్పవచ్చును, “సహోదరుడా బ్రెన్ హామ్ , నీవు భయపడ్డావా?” లేదండీ! కొంచెము కూడా భయపడలేదు. ఇక్కడ ఎవరున్నారు అనేది నేను ఎరిగియున్నాను, మరియు నేను ఆయనను నమ్మియున్నాను. మరియు ఈ ఘడియలో నేను ఆయనకు సమర్పించిన దానిని ఆయన నిలబెట్టుకొనును అని నేను నేను ఒప్పింపబడియున్నాను.
మానవ సంబంధముగా మాట్లాడినట్లయిన, ఆ వ్యక్తి నాకు పరిచయం లేనివాడు, అతడిని నేను ఎరుగను.
మేము పరిచయం లేనివారము. అవును కదండీ? అవునండీ, మేము పరిచయము లేనివారము. అయ్యా, ఇప్పుడు, ఒక్క క్షణము నీతో మాట్లాడుట కొరకు నీ ఏకాగ్రతను నేను కోరుచున్నాను. ఇప్పుడు, మనము ఒకరికొకరము క్రొత్తవారమైన యెడల, నీ కొరకు నేను ఏమియూ ఎరుగను. అది ఒక ఆత్మీయమైన మూలము నుండి రావలసియున్నది, కాదా అయ్యా? అది ఒక ఆత్మీయమైన మూలము నుండి రావలసియున్నది. ఏదో జరుగుచున్నదని మీరు ఎరిగియున్నారు. కాని అది కేవలము ప్రభువు యొక్క దూత. మీరు ఒక విశ్వాసి? అవునండీ, నీవు… నీవు నమ్ముచున్నావని నేను నమ్ముచున్నాను. నీవు దానికన్నా ఎక్కవ. నీవు ఒక సేవకునివి కాదా? నీవు కొన్ని కూటములలో తీవ్రమైన (అగ్నిమయమైన) ప్రసంగములు ప్రసంగించావు. అది సత్యము కాదా? పరీక్ష కొరకు నీవు ఒక ఆసుపత్రి లేదా డాక్టరు యొక్క ఆఫీసులో లేదా అటువంటి దానిలో ఉన్నావు. అది సరియేనా? అది సరియేనా? అవునండీ, అతను నిన్ను పరీక్షించుట నేను చూచాను. అవును, నీ సమస్య నీ కాలేయముపై ఉన్నది, అది నీ పిత్తాశయముపై యున్నది, నేను నమ్ముచున్నాను. అది సరియేనా? నీకు ఒక కాన్సరు ఉన్నదని నేను నమ్ముచున్నాను. అదే అని నేను నమ్ముచున్నాను… నిన్ను బాగుచేయుట కొరకు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. దానిని నీవు నమ్ముచున్నావా? సరే. ఓ, అది అలా వ్రేలాడడం నేను చూస్తున్నాను. అది పిత్తాశయము, అవునా? ఒక పిత్తాశయము. ఒక్క క్షణము ఇక్కడకు రమ్ము.
53.మృతులలో నుండి యేసుక్రీస్తును ఎవరైతే తిరిగి లేపిరో, ఆ సర్వశక్తిగల దేవా, ఈ మనుష్యుడు ఒక అవిటివాడని అనుకొనుచూ, అక్కడ అతడు పైకి వెళ్ళడం చూస్తున్నాము. కాని అతడు నీ యొక్క సేవకుడు, మరియు నేను పట్టుకొనియున్న ఈ హస్తము చాలా సార్లు పాపుల కొరకు మహిమ వైపు ఊపడం జరిగియున్నది. నిత్యుడగు దేవా, కరుణించుము మరియు అతడు నీ యొక్క సన్నిధిలో వున్నప్పుడు, ఇక్కడ నిలబడి దీనిని గర్తించుచుండగా, అతని యొక్క జీవము పొందుకొనుటకు, అది చివరి అవకాశము. బహుశా, ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ సేవకునిపై వచ్చును మరియు నేను నా చేయి అతనిపై వేసినంతనే, యేసుక్రీస్తు నామములో ఆ కాన్సరు అతడిని వదిలి వెళ్ళమని నేను అడుగుచున్నాను. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక, ఆనందముతో వెళ్ళుము. ఇప్పుడే నడువుము.
మనందరము “దేవునికి స్తోత్రము” చెప్పెదము. మంచిది. ప్రతీ ఒక్కరూ మీరుండగలిగినంత గౌరవముగా ఉండండి. ఆమేన్. ఆయనతో ప్రభువునకు స్తోత్రము చెప్పగోరుచున్నారో వారు? అతడు స్వస్థపరచబడెను, అతడు ఇప్పుడే పొందుకొన్నాడని గ్రహించెను… అవునండీ. అతడు స్వస్థపరచబడియున్నాడు. కాబట్టి అతడు ఆ మెట్లపై నుండి దేవునికి స్తోత్రము చెప్పగోరుచున్నాడు.
ప్రభువైన యేసు నామమునకు స్తోత్రము కలుగును గాక. నిన్ను ప్రేమించుచున్న నీ సేవకుల కొరకు, మరియు నీ శక్తి కొరకు, ప్రభువా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు ఇది కృపగా నుండును గాక. మా యొక్క సహోదరుడు ఇంకనూ చాలా శక్తిగల వర్తమానములు ప్రసంగించును గాక. మరియు క్రీస్తు యొక్క సిలువనొద్దకు చాలా మంది పాపులను మార్పు నొందించును గాక. నీ కుమారుడైన యేసు నామములో నీకు స్తోత్రము చెల్లించుచుండగా, ప్రభువా, దీనిని మాకు అనుగ్రహించండి. మా హృదయముల యొక్క ఆరాధనను మీకిచ్చుచున్నాము. ఆమేన్.
ఓ, ఎంత అద్భుతము, నా కొరకై ఆశ్చర్యకరుడైన యేసు.
ఆలోచనకర్త, సమాధానాధిపతి,
బలవంతుడగు దేవుడు ఆయనే;
ప్రతీ పాపము నుండి మరియు అవమానము నుండి
నన్ను కాపాడుచున్నాడు,
నన్ను కనిపెట్టుచున్నాడు.
నా విమోచకుడు ఆశ్చర్యకరుడు,
ఆయన నామమునకు స్తోత్రము!
నీవు ఆయనను ప్రేమించుచున్నావా? ఆయన యొక్క సమాధానము నీపై ఉండును గాక, నీపై కృప చూపును గాక.
54. సరే, స్త్రీ, లేదా నేను నా యొక్క సహోదరి అని చెప్పవలెను. నీవు ఒక క్రైస్తవురాలవు. పరిశుద్ధాత్మను పొందుకోవాలని నీ హృదయములో నీవు కలిగివున్న ఆ కోరిక, నీవు దానిని పొందగోరుచున్నావు, కాదా? అది నీకు కలుగజేసిన ఆ ఇబ్బందులు… నీవు నరాల బలహీనతతో చాలా కాలము నుండి ఉన్నావు. అవునా? నీవు నమ్మకమైనదానవు. అవును, నీకు ఒక గుండె జబ్బు కూడా ఉన్నది. ఇప్పటికి నీవు నరాల బలహీనత కలిగియున్నావు. దానిని కలుగజేసినది. అదే, ఊపిరి తిప్పకుండా చేయటం, క్రింద పడటం అనేది ఎప్పటికంటే దారుణమైన విషయము. అది సరియేనా!ఈ విధముగా నీకు నీవుగా పడక దగ్గర నిగ్రహించుకోవడం నేను చూచాను… నన్ను నేను తాకినప్పుడు, ఓ, ప్రియ సహోదరీ, నీవు దానికన్నా ఎక్కువ కలిగియున్నావు, రొమ్ము మీద కాన్సరును కూడా నీవు కలిగియున్నావు, అవును కదా!ఉహ్. ఇక్కడికి రమ్ము, సహోదరీ. యేసు నిన్ను పందొమ్మిది వందల సంవత్సరముల క్రితమే స్వస్థపరచినాడని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని ఇప్పుడు అంగీకరించుచున్నావా?
కరుణగల దేవా, ఈ స్త్రీని దీవించుము. ఆమె పరిశుద్ధాత్మను పొందుకొని మరియు యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడును గాక. ఆమేన్. సహోదరీ, వెళ్ళి, మరియు బాగవుము. మనందరము “ప్రభువునకు స్తోతము” చెప్పెదము. ఎంత అద్భుతము. ఆమేన్.
55.ఇప్పుడు, నేను ఒక ఉద్రేకపడు వ్యక్తిని కాను. అయితే “ఆమేన్” అనగా, “అలాగు జరుగును గాక,” అని బైబిల్ చెప్పుచున్నది. సంఘము “ఆమేన్” అని చెప్పెను. అలాగు జరుగును గాక, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసము కలిగియుండుము; సందేహపడవద్దు, నమ్ముము. నమ్మువారికి సమస్తమునూ సాధ్యమే. ఆమేన్.
ఎంతమంది ప్రార్థనా కార్డులు కలిగిలేరు? చుట్టూ, మీ చేతులను చూడనివ్వండి. ఓ, గొప్ప సమూహమైన మీరు. సరే, మీరు నమ్ముచున్నారా?.
సరే, సహోదరీ. నీవు అక్కడ కూర్చొనియుండగా నీ యొక్క గొప్ప విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. వేదికను విడిచి వెళ్ళి మరియు బాగవుము.
మనందరము “దేవునికి స్తోతము” చెప్పెదము. మనము దానిని పొందుకొను మార్గము ఇదే. నరాల బలహీనత, మానసికమైన బలహీనత… ఎంత ఆశ్చర్యము. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీవు దానిని నమ్ముదువా? ఆమేన్.
సహోదరీ, నీవు ఏమి ఆలోచిస్తున్నావు? అద్భుతము, అవునా? నీవు అక్కడనున్న అటువంటి బిడ్డ కొరకు కూడా ఇష్టపడుచున్నావు, అవునా. హో? నీకు అటువంటివారు ఇద్దరు లేరా? అది సరియేనా? అక్కడ ఇద్దరు లేరా? సరే. సరే. నీవు నమ్ముము? సరే. దేవుడు నిన్ను దీవించును గాక. నీ స్వస్థతను స్వీకరించుము. ఆమేన్.
56.తండ్రి, దానిని గురించి నీవు ఏమి ఆలోచించుచున్నావు? అయన ఆశ్చర్యకరుడు కాదా? నీవు ఇప్పుడు బాగుపడిన అనుభూతిని పొందుచున్నావు, కాదా? అక్కడనున్న నీ స్నేహితుడు కూడా స్వస్థపడగోరుచున్నాడు, అవునా? నీ ప్రక్కనే కూర్చొని ఉన్నాడు.
ఈ ప్రక్కగా చూచుచున్నాడు. అయ్యా, కేవలము ఒక్క క్షణము. నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీ నాసికారంధ్రములో ఉన్న ఆ యొక్క ఎదుగుదల పోవుటను నీవు కోరుచున్నావు. అవునా? ఆమేన్. నిలబడి మరియు ప్రభువైన యేసు నామములో నీ యొక్క స్వస్థతను స్వీకరించుము. ఆమేన్.
ఇటువైపు నీ ప్రక్కన కూర్చొని ఉన్న ఓ స్త్రీ, దానిగూర్చి నీవు ఏమనుకొనుచున్నావు? నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? సరే. నీకు గొంతు సమస్య ఉన్నది. అవునా? అయితే నిలబడి, ప్రభువైన యేసు నామములో నీ స్వస్థతను స్వీకరించుము. ఆమేన్.
అది ఒక సమూహముగా ఉన్న వారిని స్వస్థపరచినట్లుగా చేసినది. “దేవునికి స్తోతము,” చెప్పెదము. ప్రతీ ఒక్కరూ నమ్మండి. దేవునిలో విశ్వాసము కలిగియుండుము.
సహోదరీ, రమ్ము. మై, రక్తహీనత, మధుమేహం, గుండెజబ్బు. సహోదరీ, ప్రభువైన యేసు నామములో వెళ్ళుము మరియు బాగవుము.
“దేవునికి స్తోత్రము” చెప్పెదము. అది సరే, దేవునిలో విశ్వాసము కలిగియుండుము.
57.అయ్యా, అక్కడ కూర్చొని ఉండగా, నీ యొక్క గుండె సమస్య ఇప్పుడే స్వస్థపరచబడినది. అది సరియే, అక్కడ కూర్చొని ఉన్న మూడవ వ్యక్తి. నిలబడుము. నీకు గుండె సమస్య ఉన్నది, అవునా? అయ్యా, అది ఇప్పుడే నిన్ను వదిలినది. ప్రభువైన యేసు నామములో నీవు ఇప్పుడే బాగుపడి నీ గృహమునకు వెళ్ళుము. ఆమేన్. సందేహపడవద్దు, విశ్వాసము కలిగియుండుము.
అది సరే. అయ్యా, రండి. ఆ ఉబ్బసమును నీవు జయించుటకు ఇష్టపడుచున్నావా? దానిని జయించుటకు ఇష్టపడుచున్నావా? వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకముంచుము మరియు దానిని స్వీకరించుము. మనమందరము “దేవునికి స్తోత్రము” చెప్పెదము. విశ్వాసము కలిగియుండుము.
స్త్రీ, రమ్ము. నీవు నమ్ముచున్నావా? నిన్ను స్వస్థపరచుటకు దేవుడు తన యొక్క వరమును పంపించియున్నాడనీ నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? సరే. నీకు కల్వరి నుండి రక్తమార్పిడి అవసరమై యున్నది. నీకు రక్తహీనత ఉన్నది. ముందుకు వెళ్ళి మరియు యేసుక్రీస్తు నామములో స్వస్థపడుము. ఇక్కడే యున్నది. విశ్వాసము కలిగియుండుము.
స్త్రీ, రమ్ము. ఇటువైపు చూడుము. నీవు, నేను దేవుని ప్రవక్తనని నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? అయితే, నీ గుండె సమస్య నిన్ను విడిచినది. అయితే గృహమునకు వెళ్ళి మరియు యేసు నామములో బాగుపడుము. దేవునికే స్తోత్రము.
అక్కడ వెనకనున్న యవ్వనస్తుడా, ఆ క్షయవ్యాధి నుండి నీవు స్వస్థపరచబడగోరుచున్నావా? స్వస్థపరచబడగోరుచున్నావా? నీ కాళ్ల మీద నిలబడి మరియు ప్రభువైన యేసు నామములో నీ స్వస్థతను అంగీకరించుము. ఆమేన్. ఆమేన్.
“దేవునికి స్తోత్రము” చెల్లించెదము. అది సరే.
58. ఆ సహోదరి చెవిటిది. మీ తలలు వంచుము. సర్వశక్తిగల దేవా, జీవమునకు కర్తా, ప్రతీ మంచి వరమును ఇచ్చువాడా, ఆ స్త్రీ పైన నీ దీవెనలు కుమ్మరించుము. మమ్మును విమోచించుటకై మరణించినవాడా, మా అతిక్రమముల నిమిత్తము గాయపర్చబడినవాడా, మా అపరాదముల నిమిత్తము చీదుకట్టబడినవాడా, మీ సమాధానార్థమైన శిక్ష – మా సమాధానము నీ మీద ఉన్నది, మరియు నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినది. ఆ చెవిటి ఆత్మను, నీవు పిలిచినప్పుడు, అది నీకు లోబడును. ఓ నిత్యుడగు దేవా, నీ సేవకుని యొక్క ప్రార్థనను వినుము, మరియు దైవిక స్వస్థత యొక్క శక్తిలో ఈ రాత్రి ఇక్కడ నేను నీకై ప్రాతినిధ్యము వహిస్తున్నాను. నీ సేవకుని యొక్క ప్రార్థనను వినుము, మరియు ఈ స్త్రీని పట్టుకొనియున్న ఈ దెయ్యము, ఆమెను కుదిపి, ఆమె నుండి బయటకు వచ్చును గాక.
దెయ్యమా, ఆ స్త్రీని విడువుము. యేసుక్రీస్తు నామములో, ఆమె నుండి బయటకు రమ్ము.
నా మాట వినుము? సరే. నీవు అనేకమైన ఇబ్బందులు కలిగి మరియు నీ యెడల అనేకమైన తప్పిదములు కలిగి ఉన్నావు. నీవు నన్ను ఇప్పటికే వినియున్నావు? నీవు నన్ను వినుచున్నావా? నీవు నన్ను వినుచున్నావా? నీవు స్వస్థపరచబడ్డావు. వేదిక యొద్ద నుండి వెళ్ళి మరియు బాగవుము. నీవు స్వస్థపరచబడ్డావు.
మనమందరము “దేవునికి స్తోత్రము” చెల్లించెదము.
సరే. స్త్రీ, రమ్ము, నీవు నన్ను దేవుని యొక్క ప్రవక్తనని నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? చాలా కాలము నుండి నీవు కిడ్నీ సంబంధమైన వ్యాధి కలిగి ఉన్నావు, అవునా? వేదిక యొద్ద నుండి వెళ్లి మరియు బాగవుము. యేసు క్రీస్తు నిన్ను బాగు చేసెను.
మనందరము “దేవునికి స్తోత్రము” చెప్పెదము. ఆయన స్వస్థపరచుటకు ఇక్కడ ఉన్నాడు. దానిని నీవు నమ్ముచున్నావా? విశ్వాసము కలిగియుండుము.
59.నీ హృదయమంతటితో నీవు ఆయనను నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే, నీవు గృహమునకు వెళ్ళవచ్చును. నీ పరుపు మరియు నులక మంచముతో ఇకపై నీవు పిచ్చివాడివి కానవసరము లేదు. ఆ మార్గము నుండి ఆ పరుపును ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసివేయండి. ఆమె అక్కడ యున్నది. ఆమేన్. అది సరే. నీవు యేసుక్రీస్తును నమ్ముచున్నావా? ఆమె యొద్ద నుండి ఆ మంచమును తీసివేయుము, ఎందుకనగా అక్కడ కుర్చోనియున్న ఒకరు స్వస్థతనొందుట కొరకు సిద్దపడుచున్నారు.
మర్యాదగా నుండుము. ఇటు వైపు చూడుము. నీ హృదయమంతటితో నమ్ముము.
ఆది సరేనయ్యా. నీవు నమ్ముచున్నావా? నీ గుండె సమస్య నిన్ను విడిచి వెళ్ళినది. నీవు వేదిక యొద్ద నుండి వెళ్ళవచ్చును. (మన యొక్క చివరి వ్యక్తి మరియు ఇంకా). వేదిక యొద్ద నుండి బాగుపడి వెళ్ళవచ్చును.
నీ హృదయమంతటితో నమ్ముము. నీ కొరకు అక్కడ చూడుము… ఇటువైపు చూడుము.
నీ సంగతేమిటి, అయ్యా, ఉదర సంబంధమైన సమస్యతో అక్కడ కూర్చొని ఉన్నావు. నిలబడి మరియు యేసు నామములో స్వస్థత పొందుకొనుము.
నీ తరువాత ఉన్న వ్యక్తికి మూలవ్యాధి ఉన్నది. నీవు అది కలిగి లేవా? నిలబడి మరియు యేసు నామములో స్వస్థత పొందుకొనుము.
మరియు కీళ్ళ వ్యాధి ఉన్న నీవు, ప్రభువును నమ్ముటకు కోరినయెడల, నిలబడి మరియు యేసు నామములో స్వస్థత పొందుకొనుము.
మిగిలిన వారందరూ, మీరు ఆయనను నమ్ముచున్నారా? దాని గురించి ఏమిటి? ఆయన ఇక్కడ ఉన్నాడు. మీ కాళ్ళ మీద నిలబడుము. మీ చేతులను ఎత్తుము. మీ స్వస్థతను అంగీకరించుము.
సాతానా, యేసుక్రీస్తు నామములో, ఈ జనులను విడువుము. 1951, జూలై 19వ తేదీన, అమెరికా దేశములో ఓహియో రాష్ట్రము, టొలిడో పట్టణంలో గల సివిక్ ఆడిటోరియం నందు సహోదరుడు విలియం మారియన్ బ్రం గారు ఆంగ్లంలో ప్రసంగించిన గంట పద్దెనిమిది నిమిషములు నిడివి గల “మేము తెలియజేసిన సమచారము ఎవడు నమ్మెను?” అను ఈ వర్తమానము విశ్వాసుల స్వేచ్చారణల సహాయముతో చెన్నైలోని “విలియం ఐనాం సువార్త సమాజం’ ద్వారా ముద్రించబడి, ఉచితంగా పంచిపెట్టబడుచున్నది.
మిగిలిన వారందరూ, మీరు ఆయనను నమ్ముచున్నారా? దాని గురించి ఏమిటి? ఆయన ఇక్కడ ఉన్నాడు. నీ కాళ్ళ మీద నిలబడుము, మీ చేతులను ఎత్తుము, మీ స్వస్థతను అంగీకరించుము.
సాతానా, యేసుక్రీస్తు నామములో, ఈ జనులను విడువుము. హల్లెలూయా. ఆమేన్.

1,085 total views, 5 views today