51-0415Eఘడియ వచ్చియున్నది
ఫీనిక్స్, అరిజోన, అమెరికా
1. ఇటీవల ఆమె చేతి రుమాళ్లలో ఒక దానిని వంకర కాళ్ళ బిడ్డను కలిగియున్న తన సహోదరికి పంపియున్నది, ఎందుకనగా ఆమె యొక్క చిన్న బిడ్డకు వంకర కాళ్ళు ఉన్నవి. అయితే ఈ చేతి రుమాలు పంపించిన ఆ స్త్రీ తన సహోదరితో “ఈ యొక్క చేతి రుమాలును ఆ బిడ్డ కాళ్ళకు కట్టుము మరియు దేవుడు దానిని స్వస్థపరచబోవుచున్నాడు”అని అన్నది.
కనుక ఆమె ఆ చేతి రుమాలును ఆ బిడ్డ యొక్క పాదముల మీద రెండు వారముల పాటు ఉంచినది. మరియు ఆ గుడ్డ చాల మురికిగా అయిపోయినది. అయితే ఆ స్త్రీ, “దానిని ఉతికి ఆమె పాదములకు మరలా కట్టుము”అని చెప్పినది.
కనుక ఆమె ఆ విధంగా చేసినది, మరియు ఉండేకొలది ఆ యొక్క చేతి రుమాలు పాతదిగాను, చినిగిపోవటానికి దగ్గరగా ఉన్నది. అయితే ఆ స్త్రీ “సరే ఆ యొక్క బిడ్డ పాదములలో మార్పు ఏమి రాలేదు. నేను దానిని తీసివెయ్యాలని అనుకుంటున్నాను,”అన్నది.
అయితే చేతి రుమాలు పంపిన ఆ స్త్రీ, “ఓ, నీవు దానిని అలాగు చేయవద్దు. అది చినిగి ముక్కలైననూ, నీవు దానిని సన్నని పోగులతో అయినను కట్టి, ఆ పాదముల మీద ఉంచుము. ఎందుకనగా అది ఖచ్చితంగా బాగవ్వును అని నాకు తెలుసు,”అని అన్నది. ఆమె అనేక కూడికలలో అనేకమైన కార్యములు చూచియున్నది.
2. మరియు ఆ యొక్క స్త్రీ అలాగున చేసినది — ఆమె కొన్ని పోగులను జతపరచి ఆ యొక్క చేతి రుమాలును ఆ బిడ్డ పాదములకు కట్టినది. అయితే ఒక ఉదయాన తన బిడ్డను తీసుకోవడానికి వెళ్ళినది, మరియు ఆ రాత్రి దేవుడు అచ్చటనే వున్నాడు. మరియు ఆ యొక్క బిడ్డ కాళ్ళు సరిగ్గా వచ్చినవి.
మరియు ఆ స్త్రీ తన బిడ్డను చూపించుటకు కూడికకు తీసుకొని వచ్చినది. మరియు ఆ చేతి రుమాలు మీద ఉండినటువంటి పోగులను మరియు ఆ బిడ్డ యొక్క మొదటి స్థితి కలిగిన చిత్రపటమును చూపించుటకు తెచ్చినది. ఎలా ఆ బిడ్డ యొక్క పాదములు వంకరగా ఉన్నవి. ఆ బిడ్డ 8 లేక 10 నెలల ప్రాయము కలిగిన బిడ్డ. మరి ఇప్పుడు ఆ బిడ్డ యొక్క పాదములు సమముగా ఇతర బిడ్డలవలె బాగు అయినవి.
ఇప్పుడు, ఆమె కనుక ఆ చేతి రుమాలును కట్టకుండా విసిరి వేసినట్లయితే ఏమై ఉండేది. మంచిది, మరి అక్కడే మనము ఆశీర్వాదములను పోగొట్టుకొనుచున్నాము. మనము దేవుని మీద కొద్ది సమయము వేచియుండుటకు భయపడతాము. చూడండి, చూచారా? మీరు దానిని వినియున్నారు, “కేవలము వేచియుండండి. నేను మరలా ఆ గుసగుసలు వినియున్నాను. కేవలము వేచియుండండి. అది ఎక్కువ ఆలస్యం కాదు. ఇప్పటికి కూడా తండ్రి యొక్క హస్తము వేడుకుంటూనే వున్నది. త్వరలో మనమందరమూ యేసుతో కలసి విజయగీతము పాడబోవుచున్నాము. అది సరి. దేవుని మీద ఆధారపడియుండుడి. దానిని నమ్మండి, దానిని అంగీకరించండి, దానితోనే ఉండండి; దేవుడు దానిని మీ కొరకు చేయును.
3.నేను మీకు వ్రాయుటకు, మీకు ఏదైనా పంపించుటకు, నేను చేయగలిగినది చేయుటకు సంతోషిస్తూ ఉంటాను. మీకు ఎప్పుడైనా “వ్యక్తిగత ఉత్తరము”నాకు వ్రాయాలి అని అనిపించినచో, దాని మీద “వ్యక్తిగత ఉత్తరము”అని వ్రాయండి, మరియు దానిని నా సహాయకుడు కూడా విప్పడు. అతను నేను ఇంటికి వచ్చేంతవరకు వేచివుంటాడు, లేదా దానిని నేను ఉండు స్థలమునకు పంపిస్తాడు. నీ సహాయార్ధమై నేను దేనినైనా చేయగలిగినచో, నేను దానికి సంతోషిస్తాను.
ఇప్పుడది ఏదైనా మతపరమైనటువంటి ఆలోచన అయినచో దానిని నాతో కాకుండా మీ యొక్క సంఘ కాపరితో చర్చించండి, ఎందుకనగా దానిని చేయుటకు నాకు ఇష్టం లేదు (చూచారా?), ఎందుకనగా నేను రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు ఉన్నాను. మరియు మీరు దానిని మీ యొక్క స్థానిక కాపరి ద్వారా చర్చించండి. ఈ విషయములు కానిది ఏదైనా నేను చేయగలిగినచో నేను దానిని చేయుటకు సంతోషిస్తాను.
4. ఇప్పుడు, నేను నాకు జ్ఞాపకము ఉన్నంత వరకు అందరికి కృతజ్ఞతలు చెల్లించియున్నాను. నా సన్నిహిత ప్రజలైన మీకు మీరు చేసిన దానికి అంతటికి కృతజ్ఞత చెల్లించియున్నాను, మరి ఇప్పుడు దేవుడు మీతో ఉండును గాక.
మరియు ఇప్పుడు నేను కొంత లేఖన భాగమును చదవగోరుచున్నాను. అటు తరువాత ప్రార్ధనా వరుసను ప్రారంభించుదాము. మనమందరం కూడా మన పరలోకపు తండ్రి మనకున్న దానికంటే ఎక్కువగా చేయాలని ఆశిద్దాం. మనము అలాగున ఆశించుట లేదా? ఈ రాత్రి ఆయన గొప్ప కార్యములు మరియు అసాధ్యమైన కార్యములు చేయాలని మనము కోరుచున్నాము. ఇక్కడ ఉన్న రోగులందరూ స్వస్థత పడేటట్లు చేయాలని కోరుచున్నాము.
ఈ రోజు మీరు నా కోసము ఒకటి చేయాలని కోరుచున్నాను. ఇది ఒక శక్తివంతమైన సమయం, గొప్ప ఆకాంక్షలతో ఉన్న సమయము మరియు నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, నా పూర్ణహృదయములో నుండి నేను దీనిని చెబుతున్నాను. ఈ కూటములలో నేను రాత్రి వెంబడి రాత్రి ఈ యొక్క చక్రాల కుర్చీలను గమనిస్తూనే ఉన్నాను. కేవలము ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే స్వస్థపడియున్నారు. నేను దానిని వీక్షించాను.
సామాన్యముగా నేను జనుల యొక్క రోగముల గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు చక్రాల కుర్చీ మీద కుర్చున్నటువంటి వ్యక్తిని పిలువటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కారణం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఆ చక్రాల కుర్చీ మీద కుర్చునియున్న వ్యక్తి ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడో దానిని సులువుగా గుర్తించగలరు. అది మర్మము కాదు. కానీ ప్రతి సమయములో నేను కొద్దిసేపు ఒక వ్యక్తితో మాట్లాడి అతనిని గమనిస్తాను. నేను వారి యొక్క సమస్య ఏమిటో చూస్తాను, కాని వారు స్వస్థపరచబడ్డారు అని నేను చెప్పుట సరి కాదు. నేను సత్యము చెప్పనట్లయితే దేవుడు నన్ను గౌరవించడు. మీరు గమనించారా? మరియు వారు స్వస్థపడరు. కాని వారు స్వస్థపడుట నేను చూచినప్పుడు నేను దానిని చెబుతాను.
5. ఇక్కడ ఇబ్బంది పడుతున్న జనులందరూ ఒక దానిని చెయ్యాలని కోరుచున్నాను. ఇక్కడ జనులు మంచముల మీద, చెక్క బల్లల మీద పడుకొనియున్నారు. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు పూర్తిగా అపసవ్యముగా ఉన్నవారు మరి కొందరు కుర్చీల మీద కూర్చోని ఉన్నవారు, చేతి కర్రల మీద ఆధారపడియున్నవారు, అందరు కలగలిపి ఇక్కడ ఉన్నారు. అయితే ఈ రాత్రి మీరందరూ నా కొరకు ఒకటి చెయ్యాలని ఆశిస్తున్నాను: అది ఏమిటంటే నేను కొద్ది నిమిషములలో మాట్లాడబోవుతున్నటువంటి మాటల మీద మీ యొక్క ఖచ్చితమైన దృష్టిని సారించాలని కోరుచున్నాను, మరియు మీరు నా వాక్యమును అంగీకరించి మరియు నా యందు నమ్మిక ఉంచాలని ఆశిస్తున్నాను. మీరు దానిని చేస్తారా?
మీ యొక్క స్థితి కష్టతరమైనదని ఆలోచించకండి. మన దేవునికి కష్టతరమైనది ఎదైనా కలదా?
నేను ఇక్కడి నా యొక్క బైబిల్లో నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తుల గురించి సాక్ష్యము ఇవ్వగలను. వారు మరణించి నిత్యత్వములోనికి ప్రవేశించిరని వారిలో ఒకరైతే వైద్యుడి చేత మరణించారని నిర్ధారణ చేయబడ్డాడు. ఆ వ్యక్తి యొక్క శ్రేయోభిలాషులందరూ కూడిరి మరియు అతను ఈ రాత్రి బ్రతికే ఉన్నాడు. గమనించండి, అతడు బ్రతికి ఉన్నాడు.
మీ శరీరమంతా కోల్పోయిన తరువాత, అదంతా తినివేయబడిన తరువాత….. దానిని మీరు క్యాన్సర్ వ్యాదిగా తీసుకొనండి. మరియు అదంతా తినివేయబడుతుంది. మరియు అలాంటి వారు ఈ రాత్రి ఇచ్చట ఉన్నారు.
6.కొద్ది కాలము క్రితము నేను అది డల్లాస్ లో కూటములు కలిగి ఉన్నామని నేను నమ్ముచున్నాను. అక్కడకు అనగా ఆ కూటములకు ఒక స్త్రీ వచ్చినది. ఆమె యొక్క కుమారుడు టెక్సర్కానాలో కీటకములను చంపువాడుగా పనిచేస్తున్నాడు. ఆమె వరుసలో వచ్చి తన యొక్క చేతి రుమాలును పైకి ఈ విధముగా ఎత్తినది. మరియు ఆమె నా కోటును పట్టుకొనుటకు ప్రయత్నించుచున్నది. మేము తరుచుగా కలిగియుండులాగున, వేగవంతమైన ప్రార్ధనా వరుసను కలిగియున్నాము. ఆమె నా కోటును పట్టుకొని యున్నది.
ఆమె ఏడుస్తున్నది అని అనుకున్నాను. నేను ఆమె చేతిని తీసుకొని పట్టుకున్నాను. మరి అక్కడ ఒక పెద్ద క్యాన్సర్ ప్రారంభమైనది. దానిని నేను విన్నాను, అది ఒక హాస్యాస్పదమైనటువంటి టర్… టర్… అని శబ్దము చేస్తున్నది. మరి నేను ఆమె చేయి పట్టుకొని ఆమెతో, “సహోదరి నీకు తెలుసా, నీకు క్యాన్సర్ ఉన్నదని?”
అప్పుడు ఆమె తన చేతి రుమాలును క్రింద పడవేసినది, మరియు ఆమె ముక్కు తిని వేయబడినది. ఆమె నాతో, “అవునయ్యా, నేను చాల కాలము నుండి మెంఫిస్, టెన్నీసీలో చికిత్స పొందుతూ ఉన్నాను. నా యొక్క వైద్యులు చేతులెత్తేశారు,”అని అన్నది. బహుశ, ఆమె 38 లేక 40 సంవత్సరముల ప్రాయము కలిగిన యవ్వన స్త్రీ లేదా ఇంకొంచెం వయస్సు కలిగి ఉండవచ్చు.
మరియు ఆమెతో నేను, “మంచిది. నీవు నమ్ముచున్నావా?”
మరియు ఆమె, “రెవ. బ్రెన్హామ్“అన్నది. ఆమె ఒక సంఘకాపరి అయి ఉన్నది.”మరియు ఆమె “చాల కాలము నుండి నీ యొక్క కూటముల గురించి నేను వినియున్నాను.”మరియు ఆమె, “నేను స్వస్థపరచబడుటకు నీవు దేవున్ని అడుగమని మాత్రము నీ ఏకాగ్రతను నేను ఆకర్షించగలిగినట్లయితే, నేను స్వస్థత పొందుకుంటానని,”నేను ఎల్లప్పుడూ చెప్పుదును అని అన్నది.
మరి నేనన్నాను, “సహోదరి, దేవుడు నీ హృదయమును దీవించును గాక. దానిని బట్టి దేవుడు తప్పక నీకు బహుమానము కలుగచేస్తాడు.”
7. ఈ యొక్క సంఘటన జరిగిన రెండు లేదా మూడు నెలల తరువాత ఒక రాత్రి ఒక యవ్వనస్థుడు పరిగెత్తుకుంటూ భవనములోనికి వచ్చి “సహోదరుడా బ్రెన్హామ్….”నా ప్రక్కన ఉన్నటువంటి ఈ సహోదరి ఎవరో నీకు తెలుసా, అని అన్నాడు.
మరియు నేను, “లేదు, ఆమె నాకు తెలుసు అని అనుకోవడంలేదు,”అని అన్నాను.
ఆ స్త్రీ యవ్వనస్థుడికి పిన్ని అయి ఉన్నది. ఆమె స్వస్థపడటం మాత్రమే కాదు కాని, తను కోల్పోయిన ముక్కుని మరల పొందుకున్నది. మరియు ఆమె “ఈ మార్పు ఆ రాత్రి నాలో మొదలైనప్పుడు కొద్దిగా బాదించింది. మరియు ఆమె ఒక ఉదయాన లేచి అద్దంలో తనను తాను చూచుకొనియున్నది (ఆమె ముక్కుకు ఒక గుడ్డ చుట్టియున్నది). ఎందుకు, ఆమె యొక్క పిల్లలు మరియు అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. అక్కడ
మాంసము తిరిగి పెరుగుచున్నది. ఆమె స్వస్థపడిన ముక్కును మత్రమే కలిగి లేదు, కాని, ఎక్కడైతే ఆ క్యాన్సర్ తినివేసి ఉన్నదో, అదే స్థానములో ఒక క్రొత్త ముక్కు పెరిగియున్నది.
మరియు ఆమె జరిగిన దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు వైద్యుని దగ్గరకు వెళ్ళినది. ఇప్పుడు దీనిని వినండి. ఆమె సాక్ష్యమిచ్చుటకు వెళ్లి అతడితో “నీవు నన్ను గుర్తుపట్టలేదా?”అని అడిగినది
అందుకు అతడు, “అవును, కాని నీకు ఏమి జరిగినది?”
ఆమె అతనితో “నేను నా వైద్యులను మార్చాను”అన్నది.
అందుకా వైద్యుడు, “సరే, మంచిది. ఇప్పుడు నీవు ఎవరి దగ్గర వైద్యము పొందుచున్నావు?”
మరియు ఆమె అతనితో, “నేను నా యొక్క చికిత్సను వైద్యుడైన యేసు నొద్ద పొందుచున్నాను,”అని చెప్పినది.
ఇప్పుడు ఆ వైద్యుడు ఆమెను ఏమి అడిగాడో తెలుసా? దీనిగురించి ఆలోచించుడి. ఆతడు ఆమెతో, “అతడి గురించి నేను ఎప్పుడూ వినలేదు అని నేను అనుకొనుచున్నాను. ఆయన చికిత్స కేంద్రము ఎక్కడో చెబుతావా?”“ఆయన చికిత్సను ఎక్కడ చేయుచున్నాడు?”
అందుకు ఆమె, “మహిమలో,”అని చెప్పినది. అది సరి.
8.ఇప్పుడు, నా స్నేహితులారా, ఆ యొక్క కార్యములు సృష్టించినవి కావు. నేను ఆమె యొక్క పేరు మరియు చిరునామా ఇచ్చెదను. మరియు మీరు ఆమెకు ఉత్తరములు వ్రాయవచ్చును, లేదా నేరుగా మీరు ఆమెను చూడవచ్చును. ఓ, వేలకొలది కార్యములు.
ఇప్పుడు, కేవలము ఒక్క రోగము మాత్రమే ఖచ్చితమైనటువంటి స్వస్థతను కలిగివుంటే మరి ఆ కార్యము దేవుడు స్వస్థపరచువాడు అని నిర్ధారణ చేస్తుంది. అది సరి అయినదా? ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది దైవిక స్వస్థత ద్వారా స్వస్థత పొందియున్నారు. మీ యొక్క హస్తములను చూడనివ్వండి. ఒక గొప్ప సాక్షుల యొక్క సమూహముతో చుట్టబడి యుండుట చూస్తున్నాము. గమనించండి, అయితే ఇప్పుడు ఈ రాత్రి మన పూర్ణహృదయముతోటి మనము ఆయనను నమ్ముదాం.
మరియు ఈ రాత్రి నీవు చేయవలసినది ఏమనగా, నిన్ను స్వస్థపరచువానిగా ఆయనను అంగీకరించడమే. నీవు అంధుడవైనా, కుంటివాడవైనా, నీవు గుండెజబ్బు కలిగివున్ననూ సరే….
9. ఇప్పుడు, భయంకరమైనటువంటి కార్యము మరియు వేగవంతమైన కార్యము మరియు ప్రజలను ఎక్కువగా మరణానికి గురిచేసే కార్యము గుండెజబ్బు, రెండో స్థానములో క్యాన్సర్, మరియు మూడవ స్థానములో క్షయ. మరియు ఈ మూడు అమెరికా దేశములో ఉన్న మానవాళికి ముఖ్యమైన శత్రువులుగా వున్నాయి.
ఇప్పుడు, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ప్రజలను చూస్తున్నాను, వృద్ద తల్లులు వారి యొక్క చేతి కర్రల మీద ఆధారపడి వున్నారు. మరియు వారు చక్రాల కుర్చీల్లో కూర్చొనివుండుట చూస్తున్నాను. మరియు దయనీయమైన స్థితిలో వున్న చిన్నవారు, అంతయు లాగి వేయబడి ఇక్కడ వున్నారు, మరియు…. ఎందుకు, వారు లేచి నేను ఇప్పుడు ఇక్కడ బాగావ్వాలని కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ కీళ్ళ నొప్పులతో కృషించి బాధపడుతున్న వృద్ద తండ్రిని చూస్తున్నాను. మరియు ఇప్పుడు అతను ఏడుస్తూ వున్నాడు…. అతను నా వైపు చూస్తూ వున్నాడు. అతను బాగావ్వాలని కోరుకుంటున్నాడు.
కాని ఆ ప్రజలు వారి యొక్క సాధాణనమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క వైకల్యాలలో వుండి జీవిస్తారు. వారు ఎక్కువగా బాధపడతారు. ఈ యొక్క కీళ్ళ నొప్పులు ఒక ప్రత్యేకమైనటువంటి దశకు వచ్చేంతవరకు వారు ఎక్కువగా బాధపడతారు, అటు తరువాత అది బాధించదు. అన్ని ఎముకలు కలిసి నడుస్తాయి.
10. కాని, ఇప్పుడు, స్నేహితులారా, ఈ కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎక్కువ సంవత్సరములు జీవించవచ్చును. కాని గుండె జబ్బుతోనో లేక క్యాన్సర్ తో ఉన్నటువంటి మనిషికి ఇప్పుడే సహాయము అవసరమైయున్నది, లేదా ఇప్పుడే అతను మరణించబోతున్నాడు. చూచారా?
కాబట్టి ఇప్పుడు మీరు అనేక కార్యములు చూచియున్నారు గనుక ఈ రాత్రి ఈ బల్లలు మీద మరియు చక్రాల కుర్చీలలో మరియు చంక కర్రల మీద వున్నవారు మరియు ఇతరుల మీద ఆధారపడువారు మీ యొక్క పూర్ణహృదయముతో నమ్ముడి. మరి కొద్ది నిమిషాలలో దేవుడు మనకు ఒక ప్రార్ధనా వరుసను ఇవ్వాలని మరియు రోగుల కొరకు మరియు వైకల్యము కలిగిన వారికొరకు ప్రార్ధన చేయ్యబోవుచున్నాను. మీ ప్రార్ధనా కార్డుని పిలిచినప్పుడు, ఈ వేదిక మీదికి వచ్చినప్పుడు ఆమేన్, మరియు మీరు ఈ వేదిక మీదికి వచ్చినప్పుడు మీ యొక్క పూర్ణహృదయముతో నేను ఈ కుర్చిలో నుండి, లేక మంచము మీద నుండి, లేక బల్ల మీద నుండి, లేక దేనినుండైన లేచి, బాగుగా స్వస్థపడి ఈ యొక్క వేదికను దిగాలని నమ్ముడి.
ఇప్పుడు, నేను చెయ్యలేను.. నీవు దానిని చేయగలవో లేక చేయలేవో నేను చెప్పలేను, కాని ఆయన ఏదైతే చెప్పమని అనుమతించేనో దానిని మాత్రమే చెప్పగలను, మరియు ఆయన చెప్పినది నీవు చేసినట్లయితే అప్పుడు నీవు సరి అగుదువు. నేను నిన్ను పైకి లేవమని చెప్పినప్పుడు, నీవు లేచి నిలబడు. నీవు ఎంత తీవ్రస్థాయిలో నీ యొక్క వైకల్యము కలిగియున్నను, నీవు లేచి నిలబడు. నీ యొక్క ప్రయత్నము నీవు చేయిము. ఆగుము…. ప్రారంభించు మరియు ఏమి జరుగుతుందో గమనించండి, అది విఫలమైనట్టు నేను ఎన్నడునూ చూడలేదు మరియు ఆయన చెప్పేంతవరకు నేను ఏమి చెప్పను.
11. ఇప్పుడు, నేను ఇక్కడికి వచ్చిన మొదటిరాత్రి ఈ కూటములు జరుగుచుండగా, సంవత్సరములుగా మరిచిపోయి విడిచి పెట్టబడిన ప్రజల హృదయములలోని సంగతులు చెప్పబడటము, రోగములు చూపబడుట, అలాంటి సంగతులు, సూచక క్రియలు ఖచ్చితముగా, ప్రతిదీ ఖచ్చితముగా జరుగకున్నట్లయితే….. మీరు నన్ను అబద్ద ప్రవక్తని పిలవండి. కాని అది జరిగినట్లయితే, “దేవునికి మహిమ చెల్లించుడి”అని చెప్పాను. నేను చెప్పినది అదే కదా?
ఇప్పుడు, నేను మిమ్ములను అడుగుచున్నాను, అవి ఇక్కడ జరిగినవా? అవి జరిగినట్లయితే నిజాయితీగా మీ యొక్క చేతులను పైకి ఎత్తండి. మీరు అవి సంభవించుట చూచినట్లయితే మీ చేతులను పైకి ఎత్తుడి, ధన్యవాదములు.
ఎంతమంది మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చియున్నారు. మీ యొక్క హస్తములను నన్ను చూడనివ్వండి? మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలు? ఇక్కడికి మొట్టమొదటిసారిగా వచ్చిన వారివైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ గొప్ప కార్యములు జరిగినవని క్రొత్తగా వచ్చిన వారికి ఎంతమంది సాక్ష్యమిస్తారు. మీ యొక్క హస్తములు ఎత్తుటద్వారా దానిని చూపించండి- ఇప్పుడు కొత్తగా విచ్చేసిన జనులారా చూడండి, మీరు ఇక్కడి ఆత్మ వివేచన ప్రజలలోదాగి ఉన్నటువంటి లోపాన్ని వివేచించి వారికి చెప్పుట అనే కార్యాన్ని మీరు చూస్తారు, వారి జీవితము యొక్క కార్యములను చెప్పుట చూస్తారు.
12. ఇప్పుడు, కొన్ని సమయాలలో నేను వేగిరపడవలసియున్నది. ఊరికే అలా చేయటం ద్వారా 3 లేక 4 లేక 5 కార్యములు ఆ వ్యక్తి తిరిగి తెలుసుకుంటాడు. నీవు కనుక కూర్చోని మాట్లాడినట్లయితే నీవు మాట్లాడునంత సేపు ఆ యొక్క దర్శనము కదులుతూనే ఉంటుంది, మరియు నీవు అది ఆగిపొయినప్పుడు మరలా నీవు ప్రారంభించాలి అని అనుకుంటే నీవు మాట్లాడుతూనే ఉండు, అది కదులుతుంది. దాని మీద నాకు నియంత్రణ లేదు.
మరియు ఇప్పుడు నా గురించి నేను సాక్ష్యమిచ్చుకుంటున్నాను. నేను మీ అందరిలో అల్పుడను. మీరు ఈ మద్యాహ్నము నా జీవిత చరిత్రను విన్నారు. మరియు నేను దేని గుండా రావాలో మీకు తెలియును. మరియు నేను మీ అందరిలో తక్కువ వాడను, కాని నా యజమానున్ని తన పిల్లల యెదుట బయలు పరచే అవకాశము నేను కలిగి ఉన్నందుకు ఎంతో కృతజ్ఞుడనై యున్నాను. చూచారా? అది సరి. దేవుడు మిమ్ములను దీవించును గాక.
ఇప్పుడు నేను కొంత వాక్యభాగమును చదవాలని కోరుచున్నాను. మనము కొద్ది సేపట్లో కూటములోనికి వెళ్ళుదుము, మత్తయి సువార్త 4వ అధ్యాయము, 23వ వచనము నుండి ప్రారంభించాలని కోరుచున్నాను.
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా, ఆయన వారిని స్వస్థపరిచెను.
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశముల నుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజన సమూహములు ఆయను వెంబడించెను.
ఇప్పుడు, సంక్షిప్త చర్చ నిమిత్తం యోహాను సువార్త 17వ అధ్యాయము. మొదటి వచనము నుండి అంశాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను.
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కనులెత్తి యిట్లనెను – తండ్రీ, నా గడియ వచ్చియున్నది….
13.మనమందరము మన తలలు వంచుదాం. మా పరలోకపు తండ్రి, భక్తితో, మా యొక్క హృదయములను నీ ముందు వంచి ఈ యొక్క కూటము నిమిత్తము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము అంతమునకు సమీపముగా ఉన్నాము, మరియు దీనినే చివరిదిగా చేయమని మిమ్మల్ని అడుగుచున్నాము. ఒక గొప్ప చివరి దశ. చాలామంది….. చాలామంది మాత్రమే కాదు, ఎవరైతే ఇక్కడ కూర్చొని రోగగ్రస్తులై ఇక్కడ ఉన్నారో లేక చెడు ఆత్మల చేత ఆవహించబడి ఉన్నారో, వారందరూ ఈ రాత్రి విడుదల పొందుదురు గాక. మరియు నీవు మహిమ పొందుదువు గాక.
తండ్రి, ఇక్కడ ఈ రాత్రి, నాతో పాటు కూర్చోని, నేను రోగుల కొరకు ప్రార్ధించుచుండగా, స్వస్థతా వరుసలో వారి విశ్వాసమును పెట్టుట కొరకు ఈ రాత్రి నాతో కూర్చున్న నా సహోదరులు, సేవకుల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరియు మీ యొక్క ఆత్మ, దేవ దూత, నేను ఎవరి సేవకుడనై ఉన్నానో, ఆయన ఈ రాత్రి ఇక్కడకు వచ్చి ఆయన సన్నిధిని ఇక్కడ రుజువుపరచి దీనిని ఒక అద్భుత సమయముగా మార్చాలని ప్రార్ధిస్తున్నాను. ఇక ప్రజలు ఎప్పటికి భయము లేకుండా ఉందురు గాక. అతీతమైనటువంటి పరలోకపు దేవుడు ప్రజల మధ్యనే ఉన్నారని జనులు తెలుసుకొందురు గాక. ఇప్పుడు ఆయన తన పిల్లల మధ్యలో పనిచేయుచున్నారు. ఇప్పుడు వారు ఏదైనా తప్పు చేసినట్లయితే అన్నిటిని చూసే కన్ను వారిని చూస్తున్నదని వారు తెలుసుకుందురు గాక. మరియు వారు మంచి పని చేసినట్లయితే పరలోకపు తండ్రి వారిని చూచి వారికి ఒక బహుమానము ఇస్తాడని తెలుసుకుందురు గాక. మేము దేనినైతే విత్తుతామో దాని కోసెదము.
ఇప్పుడు, ప్రభువా, నా యొక్క పూర్ణహృదయముతో, ఆత్మతో మరియు మనస్సుతో నీవు ఈ యొక్క కూటమును ఒక గొప్ప ఆశీర్వాదముగా మార్చుదురు గాక మరియు ప్రజలందరూ ఈ యొక్క కొద్ది మాటలను అర్ధం చేసుకొందురు గాక, అని ప్రార్ధన చేయుచున్నాను. నీ సేవకుడైన నేను సరియైన దానిని పలుకులాగున, నా పెదవులను, నీ ప్రజలు విని దానిని విశ్వసించులాగున వారి హృదయములను సున్నతిపరుచమని ప్రార్ధించుచున్నాను. యేసు నామమున అడుగుతున్నాము ఆమేన్.
14.ఇప్పుడు, మనమందరము కూటము యొక్క తర్వాత భాగము కొరకు మరియు ప్రార్ధనా వరుస కొరకు ఒక స్థానములో స్థిరపడాలని బయట ఉన్న మనమందరము స్థిరపడుదాము, గుడారము యొద్ద మీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి యవ్వనస్థులకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.
మరియు ఇప్పుడు మీ తల్లులు, తండ్రులు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ వారు మీ వారు కానియెడల, వారు వేరేవారికి సంభందించిన వారు కావచ్చును. మీరు మా వారిని ప్రేమించినట్లే, వారిని కూడా ప్రేమించుడి. మరియు వారు బాగవ్వాలని ఆశిస్తున్నారు. వారు స్వస్థపడుటకు చేయగలిగిన సహాయమంతయూ చేయుటకు ప్రయత్నించుచున్నాను. మరియు నా యొక్క తల్లి రోగముతోనో లేక అవసరతతోనో ఉండినయెడల, మీరందరూ ఏదో ఒక దానిని చేయుదురు దానిని నేను అభినందిస్తాను. అదే విధముగా మీరు నా పట్ల అలాంటి భావననే కలిగి ఉంటారని నాకు తెలుసు.
15. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు వినగలిగినంత దగ్గరగా వినండి, మరియు దానిని మా హృదయపూర్వకముగా నమ్ముడి. ఇప్పుడు నేను ఒక ప్రసంగీకుడను కాను. ప్రసంగించేటువంటి గురిని నేను కలిగిలేను. అది సరి. నేను కొన్ని మాటలను మాట్లాడాలని ఆశిస్తున్నాను, తద్వారా మీ యొక్క విశ్వాసము మిమ్ములను విఫలము కానివ్వదు.
ఇప్పుడు, కొద్ది సమయము మనము వరములను గూర్చి చర్చించుదము, దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ భూమి మీదనే ఉన్నవి. చాలా సార్లు దేవుడు తన వరములు పెట్టుటకు ఎవ్వరిని కనుగొనలేకపోయెను.
కాని శ్రద్దగా వినుడి. దేవుడు తన ఆత్మను ఎప్పుడు కూడ భూమి మీద నుండి తీసివేయడు. దేవుడు తన మనిషిని భూమి నుండి తీసివేస్తాడు కాని తన ఆత్మను కాదు. మీకు తెలుసా? ఏలియా మిద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా మిదకి రెండంతలు వచ్చియున్నది. (అది నిజమేనా?) అదే ఆత్మ బాప్తిస్మమిచ్చు యోహాను మీదికి వచ్చియున్నది. అది నిజమేనా? కనుక దేవుడు తన ఆత్మను ఎన్నటికి తీసుకోనలేడు, కేవలము అతని యొక్క మనిషిని మాత్రమే తీసుకోనును.
దేవుడు తన కుమారుడిని పరలోకమునకు తీసుకొని తన ఆత్మను వెనుకకు పంపించెను. మరియు ఆయన మనలను ఆదరించుటకు, యుగ సమాప్తివరకు సదాకాలము మనతో ఉంటానని వాగ్దానము చేసాడు.
16. ఇప్పుడు, మీరు ఒకటి గ్రహించాలని ఆశపడుతున్నాను. అదేమనగా అపోస్తులుల దినములలో ఉన్నటువంటి అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు (వర్తమానకాలం) ఇక్కడ ఉన్నది. ఈ కూటములలో జనుల మధ్య అది పనిచేస్తున్నది. అది మీరు అర్ధము చేసుకోవటానికి దోహదపడుతుంది, ఇతడు, మీ సహోదరుడు కాదా, అది నేనే, ఇక్కడ ఉన్నది. మా ప్రభువైన యేసు. మరియు మనమందరము ఆయన ప్రతినిధులము. ఇప్పుడు అదే సత్యమని మనము ఎరుగుదము. అది సత్యమని నమ్ముతున్నారా? –
ఆయన ఏలాగున ఉండగోరెనో, అలాగున ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మరియు ఏ ప్రజలైతే ఆయనను పని చేయుటకు అనుమతిస్తారో వారిలో ఆయన పనిచేస్తారు…. మీరు దానిని నమ్ముతారా.
ఇప్పుడు, వారి అవిశ్వాసమును బట్టి యేసుక్రీస్తు తనకు తాను చాలా కార్యములు చేయలేకపోయెను. అది సరిగేనా? చాలా కార్యములు ఆయన చేయలేదు. దానిని గూర్చి ఆలోచించుటకు మనము అసహ్యిస్తాము, కాని ఆయన వారి యొక్క అవిశ్వాసమును బట్టి అనేక కార్యములు చేయలేకపోయెను.
17. ఇప్పుడు, సరైన మానసిక వైఖరిని.. ఇక్కడ అన్నింటి మిద కలిగి ఉండాలి, నేను ఏమి చెప్పితినో మీకు అర్థమైనది. “ఒక సరియైన మానసిక వైఖరి?”అని నేను చెప్పినప్పుడు, అది ఏమిటనగా దేవుని యొక్క దైవికమైన వాగ్దానము యందు మీరు సరియైన మానసిక వైఖరిని కలిగియున్న యెడల ఆ యొక్క వాగ్దానము నెరవేర్పులోనికి వస్తుంది.
ఇప్పుడు, మీరు ఒకవేళ దానిని నమ్మకపోవచ్చును. మరి మీరు “మంచిది, నా యొక్క విశ్వాసము బలహీనమైనది,”నేను దానిని ఒప్పుకోను అని చెప్పవచ్చు. గమనించండి, అది అపవాదికి తెలియనివ్వకండి. ప్రతీసారి “నేను నా పూర్ణహృదయముతో దేవునిని నమ్ముచున్నాను. నాకు మంచి విశ్వాసము ఉన్నది”అని చెప్పండి. అపవాది పట్టుకునే దేనికైనను సాక్ష్యమివ్వకుడి.
ఇప్పుడు, మీరు ఆయనను స్వస్థపరచువాడిగా అంగీకరించిన తరువాత ఇంక ఎప్పటికీ మీరు వ్యాధిగ్రస్తుడిగాను లేక కుంటివాడిగాను ప్రవర్తించకండి. మీరు స్వస్థపడ్డారని నమ్మండి. ఆయన వాక్యమును విశ్వసించి, అంగీకరించండి. ఆ వాక్యము ఏదైతే వాగ్దానము చేసియున్నదో దానిని ఉత్పత్తి చేస్తుంది. అది సరియేనా? ఇప్పుడు విశ్వాసమును కలిగియుండండి… మీ యొక్క పూర్ణహృదయముతో ఆయనను నమ్ముడి.
18. ఇప్పుడు, యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతను “తండ్రి నా గడియ వచ్చియున్నది”అని అన్నాడు. ఇప్పుడు ప్రతీదానికి ఒక కాలమున్నది. మీరు దానిని నమ్ముతారా? ఒక కాలములో మీరు విత్తనము నాటుదురు. మరి యొక కాలములో పంటను కోయుదురు. మరియు అచ్చట కాలములున్నవి సమయము సమిపించినప్పుడు మరి అది కార్యములు జరుగుటకు సరియైన సమయము. మీరు దానిని నమ్ముచున్నారా?
ఒకసారి దేవునికి ఈ యొక్క ప్రపంచాన్ని నీటిలో నాశనము చేయుటకు సమయము సమీపించినది. అప్పుడు దేవుడు నోవహు అనే పేరు గల వ్యక్తిని పంపెను. మరియు దేవుడు ప్రపంచమునకు తీర్పు తీర్చుటకు సిద్దముగా ఉండెను, మరియు ఆయన తీసుకొనెను….. ఓడలోనికి వెళ్ళుటకు నోవహుకు సమయము సమీపించెను.
చూడండి. దేవుడు వెళ్ళమని చెప్పేంత వరకు నోవహు ఓడలోనికి వెళ్ళకూడదు. కాని నోవహు ఓడలోనికి వెళ్ళుటకు ఒక కాలము వచ్చినప్పుడు దేవుడు నోవహు వెనుక తలుపు మూసివేసెను అది నిజమేనా? ప్రతి ఒక్కరికిలోనికి ప్రవేశించటానికి ఉన్నటువంటి అన్ని అవకాశములు పోయినవి, ఎందుకనగా దేవుడు ఆ ద్వారమును మూసివేసెను.
మరియు మీ అందరి నిమిత్తము దేవుడు ద్వారమును మూసివేసేటువంటి సమయము ఒకటి రానైయున్నది. మీరు దానిని నమ్ముచున్నారా? ఒక మనిషి యొక్క పాపము ఖచ్చితముగా తనను కృపాదినమునకు దూరముగా ఉంచగలదు. మీరు దానిని నమ్ముచున్నారా?
ఎవరో ఒకరు….. దానిని ఇక్కడే పట్టుకొని యుండుడి. కొంతమంది సేవకులు బయట అక్కడికి వెళ్లి మీరు చేయగలిగినచో వారితో పాటు ప్రార్ధించుడి. వారిని అక్కడి నుండి బయటకు తీసుకొని ఆ ప్రక్కకు తీసుకొనిరండి. ఎవరో ఒక వ్యక్తి మూర్చిల్లిరి. ఈ యొక్క భవనములో చాలా వేడిగా ఉన్నది. మరియు వారిని బయటకు తీసుకొని వెళ్ళండి. అప్పుడు వారితో కలిసి కొందరు సేవకులు ప్రార్ధన చేయవచ్చును.
19. ఇప్పుడు, ఇటు వైపు చూడండి, స్నేహితులారా. ఇది దేవుని యొక్క వాక్యమైయున్నది. మీరు స్వస్థత మీద ఆసక్తి చూపువారైతే నేను చెప్పిన దానిని వినుడి, గమనించండి, నేను చెప్పిన దానిని వినండి.
ఖచ్చితముగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదాని నుండి మీ యొక్క దృష్టిని దూరపరచుటకు సాతాను ఆ వ్యక్తిని బలహీనపరచాడు. అది వాడి పని అయి ఉన్నది. నేను దేవుని యొక్క కృప ద్వారా నిర్ణయించుకొని యున్నాను. అదేమనగా ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క గొప్ప హస్తము ఇక్కడ కదులుట నేను చూచుటకు నిర్ణయించుకొని యున్నాను. మరిప్పుడు నేను చెప్పు మాటలను మీరు వినాలని ఆశపడుచున్నాను. కాబట్టి ఇటు వైపు చూడండి. మీ యొక్క దృష్టి నా వైపు సారించండి.
మరియు ఇప్పుడు, మీరు కేవలము నమ్మగలిగినట్లయితే, దేవుడు చెప్పిన వాక్యము విని అంగీకరించండి.
20. ఇప్పుడు గమనించండి. నోవహు ఓడలోనికి వెళ్ళుటకు సమయము సమిపించినప్పుడు ద్వారము మూయబడినది. కాని ఆ ద్వారములు సమయము సమిపించేంతవరకు మూయబడలేదు. ఒక సారి ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు చెరలో నుండి విడిపించబడుటకు సమయము సమీపించినది మరియు వాగ్దానము యొక్క సమయము సమీపమునకు వచ్చినప్పుడు, యోసేపు గురించి తెలియని ఒక ఫరోను లేపాడు. ఎందుకు? ఆ కాలము ఉన్నప్పుడు. ఆ సమయము వరకు ఇశ్రాయేలును వారు గౌరవించిరి. కాని దేవుడు ప్రజల మీద తన తీర్పులను కురిపించినప్పుడు, గౌరవములకు స్థానము లేనటువంటి కాలము రాబోవుచున్నది. ఆ కాలము వచ్చియున్నది.
ఒక సారి, హెబ్రీ పిల్లలు, బబులోనులోనికి తీసుకు వెళ్ళబడినప్పుడు….. వినండి. సరియైన దాని పక్షమున నిలబడేటటువంటి సమయము వారికి వచ్చియున్నది. రాజు ఒక ప్రకటన చేయించి ఉంచాడు. అది ఏమిటంటే ఈ యొక్క విగ్రహమునకు ఎవరైతే తలలు వంచి నమస్కారము చేయరో అట్టివారిని మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయాలని చెప్పాడు.
ఆ షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు వారి యొక్క రంగులను, దేవుని యందలి విశ్వాసమును బయట పెట్టేటటువంటి గడియ వచ్చియున్నది. కనుక వారు ఆ యొక్క ప్రతిమకు తమ వీపును చూపిరి. “మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మును విడిపించుటకు మా దేవుడు సమర్ధుడు, విడిపించక పోయిననూ వారి ప్రతిమలకు నమస్కారము చేయమని”చెప్పారు. ఆ సమయము, ఆ కాలము అక్కడ ఉన్నది. కాబట్టి అక్కడ సమయము వచ్చియున్నది, అదేమనగా అతడు వారిని ఆ అగ్నిగుండములో పడవేయబోతున్నాడు. ఆ విశ్వాసాన్ని వారిలో నుండి కాల్చి వేయబోతున్నాడు.
21.మరి అట్టిదానినే అపవాది ప్రతీసారి చేయగోరుచున్నాడు. ఒక దాని మీద వేసి మిమ్మల్ని కాల్చాలని అనుకుంటున్నాడు. దేనిని గూర్చియైన ప్రార్ధన చేస్తున్నప్పుడు మిమ్ములను బలహీన పరుస్తున్నాడు, దేవునితో మీ యొక్క అనుభవం మీరు కోల్పోయారని మిమ్ములను ఆలోచింపచేయుచున్నాడు. మీతో అబద్దము చెప్పుచున్నాడు.
దేవుని వాక్య పక్షమున మీరు నిలబడే సమయము సమీపించినప్పుడు ఒంటరిగా నిలబడుడి. కాని ఆ సమయము వచ్చినప్పుడు అక్కడే నిలబడుడి. నీ భావనలకు మరియు నీ విశ్వాసమునకు అది ఈ రాత్రే అయి ఉన్నది.
సమయము సమీపించియున్నది అదేమనగా ఆ హెబ్రీ పిల్లలు వారి యొక్క సాక్ష్యాన్ని ఒక అగ్నిగుండము ద్వారా ముద్రించవలసి ఉన్నారు. నేను ఆ ఉదయము వారిని చూడగలను. త్వరితముగా చూద్దాము. ఆ ఉదయము వారిని చూడగలుగుతున్నాను. బబులోనులో అది ఒక గొప్ప సమయముగా ఉండి యున్నది. ఆ రాజు, “ఇప్పుడు చూడుడి మనము ఇక్కడ కొంతమంది వెర్రి వాళ్ళను కలిగియున్నాము. వారు వారి యొక్క మతము ద్వారా మనకి ఒక చిన్న పాటి ఇబ్బందిని కలుగచేస్తున్నారు. కనుక మనము ఒక అగ్నిగుండాన్ని అక్కడ నిర్మించి మరియు దానిని ఇంతకు ముందుకంటే ఎడింతలు వేడిగా దానిని రాజబెట్టి, వారిలో ఉన్నటువంటి మతమును కాల్చివేయుదము”అని అన్నాడు.
22. ఒక మనిషిలో నుండి పరిశుద్దాత్మున్ని కాల్చివేయుట మీరు ఊహిస్తున్నారా? దానిని చేయలేరు. గమనించండి. ఆ రాజు ఒక సింహాసనము మీద ఆసీనుడై నుండుట నేను చూడగలుగుచున్నాను. అతను? గడియ – సమయము వచ్చియున్నది. వారు ఆ హెబ్రీ పిల్లలను కట్టివేసి వారిని ఒక బల్లెము యొక్క పదునైన కొనముందు ఉంచి వారు ఆ అగ్నిగుండములో పడునట్లు ఒక ప్రత్యేకమైన వేదిక మీద వారిని నడిపింపసాగిరి. షద్రకు, మేషాకుతో ఇట్లు అనుట నేను వింటున్నాను. అతడు “నీవు చేశావా. నీవు ఖచ్చితముగా ప్రార్ధన చేసితివా?”
కొన్నిసార్లు సాతాను మన మీద తీవ్రమైన ఒత్తిడిని తెచ్చినప్పుడు మనము ఆగి “ప్రభువా, నేను నిన్ను నిజంగా నమ్ముచున్ననా?”అని సరి చూసుకోవలసిన అవసరము ఉన్నది.
అతను, “అవును అదంతయు ప్రార్ధన చేయబడినది.”ఇప్పుడు షద్రకు చెప్పుట నేను వినగలుగుచున్నాను.
ఆ సైనికుడు వారితో, “పిల్లవాడా, నీవు వెనుదిరగాలని అనుకుంటున్నావా?”అని అన్నాడు.
అప్పుడు వారు, “లేదు, మా యొక్క స్వంత ప్రాణము ద్వారా మా యొక్క సాక్ష్యమును ముద్రించాలని అనుకుంటున్నాము. మేము ఇప్పుడు సిద్దముగా ఉన్నాము.”
రాజైన నెబుకద్నెజరు ఈ మాటలు చెప్పుట నేను వినుచున్నాను. “ఇప్పుడైనను మీరు ఈ ప్రతిమకు మొక్కినట్లయితే నేను దీనిని వెనుకకు తీసుకొనెదను,”అని అన్నాడు.
“లేదు. మేము మిరు తిరస్కరించిన దేవుని జనుల యొక్క మార్గమును తీసుకొని ఉన్నాము. నేను దానితో కూడా వెళుతున్నాను.”సమయము నిర్ణయముల కోసము ఉండియున్నది. కేవలము కొద్ది నిమిషములు మాత్రమే మిగిలియున్నది.
23. ఈ రాత్రి చాలా మంది అదే స్థితిలో ఇక్కడ కూర్చోనియున్నారు. గుండె జబ్బుతోను, కుర్చీలలో బందిలై యున్నవారు మరియు చంక కర్రల మీద ఉన్నవారు. మరియు ఇతరత్రా, కేవలము కొద్ది నిమిషములు మాత్రమే ఈ కూటములో కలిగియున్నాము. మీ యొక్క నిర్ణయములు తీసుకోనుడి. నిర్ణయము చేయుటకు మీకు సమయము వచ్చియున్నది. నీవు నేను చెప్పిన దానిని మరియు దేవుడు పరిశుద్ధ గ్రంధములో రాసినది సత్యమని నమ్మాలి, లేదా ఈ స్థితిలోనే తిరిగి వెళ్ళాలి. కాని సమయమైతే వచ్చియున్నది.
అతడు ఈ విధముగా చెప్పుట నేను వినియున్నాను, “సరే, ఆ బాలురను ముందుకు నడిపించండి,”అని అన్నాడు. ఆ వేడి కొద్దిగా తీవ్రస్థాయికి పెరుగుటకు ప్రారంభించింది.
చింతించవద్దు. ఆయనను ఈ రాత్రి స్వస్థపరుచువానిగా అంగీకరించినట్లయితే, సాతాను రేపు నీ మీద వేడిని పెట్టును. దాని గూర్చి నీవు బాధపడవద్దు. అవునయ్యా.
వారు కొద్దిగా ముందుకు నడవడం ప్రారంభించారు, మరియు అతడు ఆ విధముగా చెప్పుట నేను వింటున్నాను. “నీవు ఖచ్చితముగా ప్రార్ధన చేసియున్నావా?”
“అవును.”
“ఏం ఫర్వాలేదు.”
వారు ఒక్కొక్క మెట్టును దాటుకొని ఆఖరు మెట్టుమీదికి వచ్చారు. వారు లోపలికి వెళ్ళినట్లుగా సొమ్మసిల్లిన అనుభూతిని చెందుట ప్రారంభించారు. మరి కొద్ది నిమిషములలో ఆ సైనికులను నేను చూస్తున్నాను. వారు తమ యొక్క బల్లెములతో వారిని ఆ అగ్నిగుండములో నెట్టుటకు సిద్దముగా వున్నారు. అది మునుపు వేడి చేసిన దాని కన్నా ఏడంతలు రాజబెట్టిన అగ్నిగుండము.
24. గమనించండి. మనము ఒక భయంకరమైన గాడాంధకారపు చిత్రపటాన్ని ఈ క్రింద గీస్తున్నాము. ఇప్పుడు మనయొక్క కెమెరాలను ఒకసారి పైకి త్రిప్పి గమనించుదము.
ఓ, మై. ప్రతీసారి క్రింద ఏదైనా జరుగుచుండినప్పుడు మరి అలాగుననే పైన కూడా ఏదో ఒక కార్యము జరగవలసియున్నది. మీకు తెలుసా, ప్రతి కార్యమునకు రెండంచులు ఉండవలసి యున్నది. సాతాను పని మీద ఉన్నప్పుడు, యేసు కూడ పని మీదనే ఉండును. మీరు ఎప్పుడైనను మీ విశ్వాసము ఎవరికి చెల్లిస్తారో, అది ఆ మార్గము ద్వారానే వెళుతుంది. మీ యొక్క విశ్వామును క్రీస్తునకు ఇవ్వండి.
ఇప్పుడు ఇలాగున పైకి చూచుదము. మీకు తెలుసా ఆయన ఘనత వహించినటువంటి స్థానంలో పైన కూర్చోని ఉండుట నేను చూస్తున్నాను. ఆయన యాజక సంభందమైన వస్త్రములో చుట్టబడి, క్రిందికి చూస్తున్నాడు.
నేను ఆయన కుడి ప్రక్కన ఒక గొప్ప దూత వచ్చుట చూస్తున్నాను, అతని పేరు గబ్రియేలు, గొప్ప ప్రధానదూత. ఆ దూత పరుగెత్తుకుంటూ వచ్చి, అతని యొక్క ఖడ్గమును దూసి అతను అన్నాడు, “యజమానుడా, మీరు బబులోను లోనికి చూసి ఉన్నారా? నీ యొక్క ప్రజలు నీ పక్షమున నిలబడియున్నారు. వారు నిలబడేటువంటి గడియ వచ్చియున్నది. మరియు వారు నిలబడుతున్నారు. కాని ఆ గుంపుగా ఉన్నటువంటి జనములు వారిని ఆ అగ్నిగుండములోనికి నెట్టబోతున్నారు. మరియు నన్ను క్రిందికి వెళ్ళనివ్వండి, నేను దానిని తుడిచి పెట్టుదును.”
అతడు ఆ విధంగా చేసి ఉంటాడని నేను నమ్ముచున్నాను. అవునండీ. వారి నిమిత్తము తన దూతలకు ఆయన ఆజ్ఞాపించెదనని చెప్పియున్నాడు. మరియు దేవుని దూతలు ఆయనయెడల భయభక్తులు గలవారిచుట్టూ కావలి కాయుదురని నేను నమ్ముచున్నాను.
25.మరి గబ్రియేలు ఈ విధముగా చెప్పుట వింటిని, “నేను ఆ క్రిందికి వెళ్లి, ఒక్క వేటుతో చిత్రపటములో బబులోను లేకుండా చేసెదను. నీవు నన్ను క్రిందికి వెళ్ళుటకు అనుమతించినట్లయితే అలాగు చేసెదను. నీవు వారి యందు శ్రద్ధవహిస్తున్నావా?”అని అన్నాడు.
అయితే యజమానుడు ఈ విధంగా మాట్లాడుట నేను వింటున్నాను, “గబ్రియేలు, నీవు చాలా అద్భుతమైన దూతవు. నీవు నా యందు విధేయతగా ఉన్నావు, మరియు నేను నిన్ను సృష్టించిన నాటినుండి నీవు నా కుడిచేతి ప్రక్కన ఉన్నావు. కాని నేను నిన్ను పంపదలుచుటలేదు. నిన్ను పంపించలేను.”
అటు తరువాత ఈ మార్గము నుంచి వేరొక దూత వచ్చుట నేను చూస్తున్నాను. మీకు తెలుసా, ఆయన ఆజ్ఞ చొప్పున పరలోకములో దేవుడు దూతలను కలిగియుండెను. ఇంకొక దూత పైకి వచ్చుట నేను చూస్తున్నాను. అతని వైపు చూడండి. అతను దూసుకొని వచ్చుచున్నాడు, అతని పేరు మాచిపత్రి. అతను సాగిలపడ్డాడు. అతడు సమస్త జలముల మీద నియంత్రణ కలిగినవాడు.
అతను ఇలాగు చెప్పుట నేను వింటున్నాను, “ప్రభువా, బబులోనులో నీ పక్షమున నీ పిల్లలు నిలబడియున్నారు, మరియు ఆ జనులు ఆ పిల్లలను ఈ ఉదయము మండే అగ్నిగుండములో పడవేయబోతున్నారు. వారు చివరకు చేరుకొనియున్నారు, నీవు నన్ను సృష్టించిననాటి నుండి నీ పక్షమున ఉండినవాడను. నాకు జలములను నియంత్రణ చేసే శక్తి ఉన్నది. ప్రాచీనకాలములో జరిగిన విధ్వంసములో నేను మహాస ముద్రముల యొక్క ఊటను తెగ వేసి నేను ఈ భూమిని తుడిచి పెట్టి మరియు ఈ సమస్త ప్రపంచాన్ని నీటితో నాశనము చేసితిని. ఈ ఉదయము నన్ను క్రిందికి వెళ్ళనివ్వండి, నేను భూమిపై నుండి ఆ బబులోనును తుడిచిపెట్టుదును. అతను అది చేసి ఉండేవాడేమో అని నేను నమ్ముచున్నాను, మీరు నమ్ముటలేదా?
ప్రభువు ఈ విధంగా చెప్పుట నేను వింటున్నాను, “నేను నిన్ను పంపించలేను. నీవు ఇప్పటి వరకు ఒక మంచి దూతగా వున్నావు, కాని నేను నిన్ను పంపించలేను.”
26. “నీవు వారిని లక్ష్యపెట్టుచున్నావా?”
“అవును.”నేను వారిని రాత్రంతయూ గమనిస్తున్నాను. సహోదరుడా, ఆయన యొక్క కన్ను చిన్న పిచ్చుక మీద కూడా ఉన్నది. నాకు తెలుసు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు ఆయన నీకు ఎంత విశ్వాసమున్నదో చూస్తున్నాడు, నీకెంత ఉన్నదో చూస్తున్నాడు, నీకెంత విశ్వాసమున్నదో కూడా చూస్తున్నాడు. నీవు ఏ రకమైనటువంటి దానిని ఎన్నుకొని నీవు ఆయన పక్షముగా నిలబడతావో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఆ గడియ ఇప్పుడు వచ్చియున్నది. నీవు ఏమి చేయబోతున్నావు?
ఆయన చెప్పాడు, “వారిని నేను రాత్రి అంతయూ గమనిస్తున్నాను. వారు చేసిన ప్రతి ప్రార్ధనను నేను ఆలకించియున్నాను. మీ దూతలందరూ చాలా మంచి దూతలుగా ఉన్నారు. కాని మీరు వెళ్ళుటకు నేను అనుమతించను, ఎందుకనగా నాకు నేనుగానే వెళ్ళబోవుచున్నాను.”ఆమేన్.
ఆయన తన సింహాసనము మీద నుండి లేచుట నేను చూస్తున్నాను. తన చుట్టూ చుట్టబడిన యాజకపరమైనటువంటి వస్త్రములు క్రింద వ్రేలాడుచున్నవి. మరి ఆయన ఈ విధముగా చెప్పుట నేను వింటున్నాను. తూర్పు వాయువూ రా…., పడమర వాయువూ రా…. ఉత్తరము, మరియు దక్షిణము వాయువులారా, రండి”అని చెప్పాడు. ప్రతీది ఆయనకు లోబడి వున్నాయి. ఆయన ఈ విధముగా చెప్పుట నేను వింటున్నాను. “ఇక్కడికి రండి”అని చెప్పాడు. ఆ పెద్ద తెల్లని ఉరుములతో కూడిన ఉద్రిక్తత బయటికి దూరంగా అది ఎక్కడ ఉన్నది. నేను అతని యొక్క సింహాసనాన్ని విడిచి పెట్టుట చూడగలుగుచున్నాను. అతను అక్కడికి అడుగువేయుట చూస్తున్నాను. ఓ, మై. పైకి చేరుకొని మరియు ఒక విధమైన వెలుతురుని కలిగి, జీవ వృక్షాన్ని దాటి మరియు ఒక ఈత మట్టను తీసికొని ఏమిటి విషయము అన్నాడు.
“నేను ఈ ఉదయం బబులోనుకు వెళుతున్నాను. నా పిల్లలు నా పక్షమున నిలుచున్నారు. మరి నేను కూడా వారి పక్షమున నిలబడబోవుచున్నాను.”
27. మై, మై. ఆ సమయములో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వారి యొక్క విశ్వాసమును కూడగట్టుకొని అగ్నిగుండములోనికి వెళ్ళిరి. దేవుని కొరకు అది అంతిమముగా నిలుచున్నటువంటి సమయం మరియు ఆ సమయంలో వారు అగ్నిలోనికి వెళ్ళిరి. మరి అక్కడ నాలుగవ వ్యక్తి దేవుని కుమారునిగా అక్కడ ఉండి, ఆ అగ్ని జ్వాలలను తోలివేస్తున్నాడు.
ఓ, మై. ఆయన యొక్క నేత్రము ఒక చిన్న పిచ్చుక మీద కూడా ఉండియున్నది. ఆయన తన మహిమలో నుండి బబులోనులో ఉన్న ఈ ముగ్గురు పిల్లల్ని కాపాడటానికి వచ్చినట్లయితే, మరి ఇక్కడ ఈ రాత్రి ఫీనిక్స్ లో బంధకములో ఉండి ఇక్కడ కూర్చున్న వారి కొరకు ఇంక ఎంత ఎక్కువగా వస్తాడు. గడియ వచ్చియున్నది. తండ్రి, గడియ వచ్చియున్నది.
గడియ నీ కొరకు వచ్చియున్నది. నీవు నీ యొక్క నిర్ణయమును తీసుకునేటువంటి గడియ వచ్చియున్నది.
28. ఒకనాడు కొంతమంది బాలురకు గడియ వచ్చినది, వారిలో నలుగురు ద్వారము దగ్గర కూర్చుండియున్నారు. ఆ సమయంలో సిరియన్లు యెరుషలేమును లేక సమరయ ప్రాంతమును చుట్టుముట్టిరి. మరియు వారికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. మరియు వారు కుష్టుతో నింపబడియున్నారు, వారు ఆ ద్వారములోనికి వెళ్ళలేరు. వారు ఆ ద్వారము వెలుపలనే ఉన్నారు. వారు అన్నారు, “మనము చచ్చేంతవరకు ఇక్కడనే ఎందుకు ఉండాలి.”ఆమేన్. “మనము చచ్చేంతవరకు ఇక్కడనే ఎందుకు ఉండాలి?”
ఈ నగరములో వారు ఒకరి పిల్లలను ఇంకొకరు ఉడకపెట్టుకొని తింటున్నారు. మీకు ఆ సన్నివేశము గుర్తున్నదా? ప్రజలు ఆకలితో చనిపోయేలాగున సిరియన్లు వారిని చుట్టుముట్టిరి. ఇక్కడ కేవలము రెండు మార్గములు మాత్రమే ఉన్నవి. “మనము కనుక నగరములోనికి వెళ్ళినట్లయితే, అక్కడ మనకు తినుటకు ఏమియు లభించవు. మరియు మనము ఇక్కడే ఉండి ఉన్నచో మనము ఖచ్చితముగా మరణించెదము,”అని వారన్నారు.
మీలో ఉన్నటువంటి అనేకులు ఈ రాత్రి అదే స్థానము కలిగి కూర్చొని ఉన్నారు. నీవు ఒక వైద్యుడి వద్దకు వెళ్ళి వుండవచ్చు. అతడు నీ పట్ల చేయగలిగిన వన్ని చేసి ఉండవచ్చు. నీవు తిరిగి వచ్చినచో అతను ఏమియు చేయలేకుండా వుండవచ్చు. నేను చేయగలిగినదంతా చేసియున్నాను, అని నీతో అనవచ్చును. అయితే నీవు మరణించే వరకు అక్కడే కూర్చొని ఎందుకు ఉండాలి?
వారు కేవలము ఒక్క అవకాశమే కలిగియున్నారు. వారు కనుక శత్రువుల యొక్క స్థానమునకు వెళితే శత్రువులు వారిని బ్రతుకనిచ్చినచో వారు బ్రతికెదరు. కాని వారు వారిని చంపితే వారు ఏ విధానంగానైనా చావ వలసిన వారైయున్నారు. వారు అక్కడే కూర్చొని చనిపోవటానికి యున్నారు. అయితే వారు ఒక అవకాశాన్ని తీసుకోవటానికి మనసు కలిగియున్నాను. మనము దానిని అప్పుడే నిర్మించబడినటువంటి “కరువుతో అలమటించువారి బృందము”అని దానిని పిలువ వచ్చును, వారు త్వరగా నిర్ణయము తీసుకొనుటకు వచ్చిరి.
29. నీవు కూడా ఈ రాత్రి దానినే చేయవలసి యున్నది. త్వరగా ఒక నిర్ణయమును తీసుకోవలసియున్నది. ఈ రోజు నీవు ఎవరిని సేవిస్తావో ఎంపిక చేసుకో. దేవుని యొక్క వాక్యమును మాత్రము విశ్వసించి, అంగీకరించుము. వాక్యము ప్రసంగించబడుతుంది; సూచనలు జరిగియున్నవి; పరిశుద్దాత్ముడు ఇక్కడ ఉండియున్నాడు; ప్రజలలో ఒక నిర్ణయం తీసుకోనే గడియ వచ్చియున్నది. ఇంక దీనికి మించి దేవుడు ఏమి చేయగలడు? ఆయన దానిని సూచనలతోను మరియు అద్భుతములతోను, వివేచనలతోను పంపించియున్నాడు, శాస్త్రీయంగా కూడా అది రుజువుచేయబడినది. దానిని ఒక చిత్రపటము మీద కూడా పెట్టబడియున్నది. అది ప్రపంచమంతట పంపించబడి యున్నది. లక్షలాది మంది సాక్ష్యమిచ్చుచున్నారు. ఇతరులు అయితే స్వస్థపడుచున్నారు. మరి నీ సంగతి ఏమిటి?
వారు అర్ధరాత్రి వేళ లేచి సిరియను సైన్యము ఉన్న చోటుకి విశ్వాసముతో నడువసాగిరి, మరియు దేవుడు వారి విశ్వాసమును ఘనపరచినాడు. మరియు ఆయన ఒక తుపానును ఆ ఎడారి మీద రానింపచేసెను, ఆ సిరియనులు పారిపోయేట్లు చేసాడు. వారు నేరుగా అక్కడికి వెళ్ళిరి మరి అప్పుడు వారు తినుటకు సమృద్ధిగా ఆహారము లభించినది, కొంత ద్రాక్షారసము లభించినది, వీటన్నిటితో పాటుగా సంతోషము కూడా లభించినది. వారు వారి యొక్క ప్రాణమును మాత్రమే రక్షించుకొనలేదు, కాని వారు నివసిస్తున్న నగరము మొత్తం కాపాడిరి.
ఇక్కడ చాలామంది వ్యాధిగ్రస్థులు గుండెజబ్బు కలిగియున్నారు, చాలా మంది క్షయను కలిగియున్నారు మరియు చాలామంది కుర్చీలలో బంధీలైయున్నారు. మరియు ఈ రాత్రి నీవు ఆ జనులవలె ఎందుకు చేయకూడదు. నీవు చచ్చేంత వరకు అక్కడే ఎందుకు కూర్చోవాలి? నీవు ఒక నిర్ణయము తీసుకునే ఘడియ ఇపుడు వచ్చియున్నది. ఇప్పుడు దేవుడు దానిని గురించి ఏమి చేయలేడు, అది నీ మీదే ఆధారపడియున్నది. నీవు ఖచ్చితముగా ఒక నిర్ణయము తీసుకొనవలసియున్నది. “మనము చచ్చేంతవరకు ఇక్కడే ఎందుకు వుండాలి”
30. చూడండి, నీవు క్రిందికి వెళ్ళుటకు పిలువబడలేదు. నీవు దిగువనున్న ఆ శత్రువుల యొక్క శిబిరాలకు వెళ్ళనవసరం లేదు. ఈ రాత్రి నీవు రావాలని ఆశించుచున్న నీ తండ్రి ఇంటియొద్దకు నీవు రావాలి. నీవు రావాలని ఆయన కోరుచున్నాడు. ఆయన తన కుమారుడిని పంపించి యున్నాడు; ఆయన మరణించాడు; ఆయన నీ స్వస్థత కొరకు అక్కడ దానిని జమ చేసియున్నాడు. మరియు నీవు ఒక నిర్ణయం తీసుకునే గడియ ఇప్పుడు వచ్చియున్నది. ఆమేన్. గడియ వచ్చియున్నది.
ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరముల నుండి రక్తస్రావము అనే వ్యాధితో భాదపడుతూ ఉన్న ఒక చిన్న స్త్రీ కూర్చోనియున్నది. రక్తము ఆమె నుండి పారుతుఉన్నది. మరియు దానిని ఆమె ఆపలేకుండా ఉన్నది. ఆమె తన జీవనమంతయూ వైద్యులకు ఖర్చు పెట్టియున్నది. వారు ఆమెకు ఏ మంచి చేయలేకపోయిరి, మరియు ఆమె, “నేను ఆ మనుష్యుడను చూచి మరియు ఆయన వస్త్రము యొక్క అంచును తాకిన చాలును నేను స్వస్థపడెదను,”అని ఆమె తన హృదయములో అనుకున్నది.
31.చివరకు ఆ గడియ వచ్చియున్నది. వారు అక్కడ ఒక పడవ నిలిచినదని శబ్దము వినిరి. మరి ఇప్పుడు ఆ చిన్న స్త్రీ, మై, ఆయన దగ్గరకు చేరటానికి ప్రయత్నిస్తున్నది! మరది ఏమిటీ? గడియ అక్కడ ఉన్నది. మరియు ఆమెకు అవకాశము అక్కడ వచ్చియున్నది, మరియు ఆమె జనుల గుంపులో నుండి త్రోసుకొని వచ్చుచున్నది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆమెతో “వెనక్కి వెళ్ళు, వారు నిన్ను మందిరము వెలుపల ఉంచుతారు,”అని చేపిరి. ఆమె త్రోసుకొని ముందుకు వచ్చుచున్నది. ఆమె వారిలో ఎవరి కొరకు ఆగలేదు.
వారిలో కొంతమంది ఆమెతో, “అద్భుతములు జరిగే రోజులు గడిచిపోయినవి,”అని చెప్పిరి. వారు ఆమెను ఆపలేకపోయిరి. ఆమె త్రోసుకొని ముందుకు వచ్చుచున్నది. ఆమె ఆయనను ముట్టుకునేటటువంటి గడియ వచ్చియున్నది. ఇంక అంతయు అదే. ఆమె వారి యొక్క కాళ్ళ మధ్యలో నుండి వెళ్ళవలసియున్నది. ఏది ఏమైనప్పటికీ ఆమె యొక్క హృదయములో దాగియున్నటువంటి వాంఛను తీర్చుకోవాలని అనుకున్నది. ఆమె ఆయన యొక్క వస్త్రపు అంచును తాకినది. మరియు వెంటనే (ఆమేన్.) ఆ రక్తపు సమస్య నిలిచిపోయినది. గడియ వచ్చియున్నది. ఆమేన్. గడియ వచ్చియున్నది.
మనము కొద్ది సమయము దాని గూర్చి కలిగియుండాలనుకున్నాను. కాని నేను ఇక్కడ దీనిని నిలిపివేయవలసియున్నది.
32.చూడండి, నీవు ఏ గడియలో అయితే నిర్ణయం తీసుకొనెదవో, ఆ గడియ సమిపించినది. నేను ఈ సవాలును ఎవరి ముందైననూ ఉంచెదను. అదేమనగా దేవుని వాక్యమును అంగీకరించు. నీలో ఏ సమస్య ఉన్ననూ సరే, నీవు కనుక దేవుని విషయములో హృదయము సరిగా యున్నయెడల, మరియు దేవునిని సేవిస్తాను అని ఆయనతో ప్రమాణము చేసినయెడల, మరియు ఆయన వాక్యమును విని దానిని స్వీకరించినయెడల, అటు తరువాత ఏమి జరిగినను నీవు లెక్క చేయవద్దు. కేవలము నమ్ము, దేవుడు దానిని ఉనికి లోనికి తీసుకువస్తాడు. “దేనిగూర్చి అయిననూ ఆశగలిగి ప్రార్ధించినపుడు, దానిని పొందుకున్నానని నమ్మినయెడల, దానిని పొందుకునెదవు.”నీవు వాటిని పొందుకున్నావు, అని నమ్మినట్లయితే నీవు వాటిని పొందెదవు. నేను ఏమి చెప్పితినో గమనించితిరా? గడియ వచ్చియున్నది.
“తండ్రీ,”గడియ వచ్చియున్నది.. లేక, సమయము వచ్చియున్నది,”అని యేసు పలికాడు. ప్రపంచం మొత్తము ఎగతాళి చేయువారితో నిలబడియుండినప్పుడు. బైబిల్ చెప్పినట్టుగా, ఆ దినాలలో ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు అనురాగ రహితులు, సహనము లేనివారు, తీవ్రమైనవారు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులుతో ప్రపంచము నిండినప్పుడు, “గడియ వచ్చియున్నది.”గడియ వచ్చియున్నది. విశ్వాసులను సూచనలు వెంబడించినప్పుడు, గడియ వచ్చియున్నది. సంఘము ముందుకు కొనసాగుటకు లేక వెనుదిరుగుటకు గడియ వచ్చియున్నది. నీవు ఒక నిర్ణయము చేయవలసియున్నది. అది సరియేనా? గడియ వచ్చియున్నది.
33. ఈ యొక్క ఉజ్జీవము ముగింపును సమీపించుట కొరకు గడియ వచ్చియున్నది. మరియు ప్రియ క్రైస్తవ సహోదరి, సహోదరుడా, మీ కొరకు నా యొక్క హృదయపూర్వక ప్రేమతో, నీవు స్వస్థపడుట కొరకు మా యొక్క విశ్వాసమును పైకి లేవనెత్తుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమి చేస్తాడో నాకు తెలియదు. అది సరియేనా?
గుర్తుంచుకొనండి. ఆయన యొక్క పరిచర్య దినాలలో కొన్ని వందల, వందల జనుల మధ్యలో నుండి వంకర కాళ్ళు చేతులు గలవారి నుండి, అంధుల నుండి, మరియు అనేక వ్యాధి గ్రస్తులను ఆయన దాటి వెళ్ళాడు, ఎందుకనగా వారు స్వస్థపడుటకు విశ్వాసము కలిగిలేరు. ఆయన చెప్పెను… బేతస్థ అనబడిన యొక కోనేరు దగ్గర ఉన్నటువంటి గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు, చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఆయన వారిని దాటి మరియు అక్కడ ముప్పది-యెనిమిది యేండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుని స్వస్థపరచి, ఆ గుంపులను దాటి వెళ్ళెను. అది నిజమేనా? యోహాను సువార్త 5.
మరియు వారు ఆయనను ప్రశ్నించిరి. ఆయన వారితో, “ఎందుకు, తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడికి చూపించును. తండ్రి మునుపు ఏ కార్యములైతే చేసెనో, వాటినే కుమారుడును అలాగే చేయును.”
ఇప్పుడు, ఏమి జరిగినది? ఆ వ్యక్తి, వారు విశ్వసించినారు. వారు దానిని అంగీకరించినారు. అప్పుడు దేవుడు తన కుమారునికి ఆ దర్శనమును చూపించగా, కుమారుడు దానిని బయలుపరచెను. మరియు ఆయన “నేను చేయు కార్యములు మీరును చేయుదురు, మరియు వాటికంటే గొప్పవియు చేయుదురు. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను,”అని అన్నాడు. అది సరియేనా? ఇప్పుడు అవే సూచనలు, అవే అద్భుతములు ఇక్కడ ఉన్నవి. ఆలస్యం అగుచున్నది గనుక మనము ముగింపునకు రావలసియున్నాము. ఇంత సమయము నేను తీసుకున్నందుకు క్షమించండి.
34.ఇప్పుడు చూడండి, నా ప్రియ స్నేహితులారా, మరలా ఈ రాత్రి ఇప్పుడు గడియ వచ్చియున్నది, నిర్ణయము తీసుకోనుటకు సమయము వచ్చియున్నది. అనేక మంది జనులను నేను పిలిచే సమయము వచ్చియున్నది.
నా చిన్న కుమారుడు, “డాడి నా రెండు జేబులనిండుగా ప్రార్ధన కార్డులతో నింపుకొని యున్నాను. మరియు బయట ఉన్నటువంటి జనులకు పంచిపెడితిని,”అని అన్నాడు.
అయితే సరే. ఇప్పుడు మీరందరూ స్వస్థపడుటకు సిద్దముగా వుండాలని కోరుతున్నాను. దేవుడు మీ అందరికి సహాయము చేయబోతున్నాడని నా పూర్ణహృదయముతో నేను నమ్ముచున్నాను.
ఆ బిడ్డ కోసం నీవు ఏమనుకుంటున్నావు. యువతి, నీవు దానిని నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? చిన్న బాలుడా నీవు నమ్ముచున్నావా? ఇక్కడ ఉన్న నీవు నమ్ముచున్నావా? నీవు ఏమనుకుంటున్నావు యువతీ. నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? అక్కడ ఉన్న నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావు. నీవు నమ్ముచున్నావని నాకు తెలుసు. నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఈ క్రింద నుండిన మీరందరూ మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా?
35.ఇప్పుడు, చూడుడి. మీరు దీనిని చేయుడి. ఈ సమయంలో మీరు దీనిని చేయుడి. పౌలు అన్నాడు, “నేను క్రీస్తును పోలి నడుచులాగున మీరు నన్ను పోలి నడుచుకొనుడి.”
దేవుని యొక్క దూత ఆ రాత్రి నా దగ్గరకు వచ్చి మరియు నీవు ఈ లోకములో జన్మించినది రోగుల కొరకు ప్రార్ధన చేయుట కోసమే అని అన్నట్లు అయితే (గమనించండి?) మరి నేను ప్రపంచములో వున్న రోగుల కొరకు ప్రార్థన చేయుట కొరకేయుంటిని (నేను ప్రపంచమును చుట్టుటకు ఆచరణాత్మకమైన యాత్రను చేస్తున్నాను.) ఆయన చెప్పాడు, నేను రోగుల కొరకు ప్రార్ధన చేస్తానని చెప్పాడు. ఇక నాకు ఏమియు దానిని గురించి చెప్పలేదు.
“వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థపడెదరని,”పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. యేసు ఆయన వాక్యమును పంపెను మరియు ఆయన రోగులను ఎన్నో విధాలుగా స్వస్థపరచెను.
వారు నన్ను నమ్మరని ఆయనతో చెప్పి ఆయనను ప్రశ్నించితిని, అప్పుడు ఆయన నాతో, “మోషేకు రెండు సూచనలు ఇచ్చిన విధముగా నీకును రెండు సూచనలు ఇచ్చెదను.”
ఇప్పుడు, దానిని చెప్పుటకు అది నాకు సులువైన విషయము కాదు, ఎందుకనగా అది….. నేను ఆయన వాక్యమును అంగీకరించి ఆయన దూతను స్వీకరించాలి. మరియు ఆయన దానినే నిర్ధారించుచున్నాడు.
36. మరియు ఇక్కడ ఉన్నటువంటి జనులైన మిమ్మును ఏ విధముగా ప్రేమిస్తానో మరియు అదే విధముగా మీరు మాకు దగ్గరగా వున్నారని చూచి తెలుసుకొన గోరుచున్నాను, మరియు రోగులుగా ఇక్కడకు వచ్చి సన్నీస్లోవ్స్ అనే ప్రాంతములో కూర్చొని యున్నారు. మరియు ఇంకా క్షయ మరియు రోగముల బారి నుండి దూరముగా వెళ్ళుటకు ప్రయత్నించుచున్నారు. ఎంతగా నా యొక్క హృదయము మీ కొరకు పరితపిస్తున్నది, ఎంతగా మీరు స్వస్థపడియుండుట నేను చూడగోరుచున్నాను.
ఇప్పుడు, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ఈ రాత్రి మీరు నమ్మండి, ఆయన ఇక్కడ నిలువబడి మరియు ఇక్కడ ఉన్నటువంటి జనులందరి నిమిత్తము ఆయన తన యొక్క ప్రార్ధనలను సమర్పిస్తుండగా మరియు మీరందరు ఒకటిగా సమ్మతించి నమ్ముడి. దేవుడు ఈ భవనములో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలడు. ఆయన దానిని చేస్తాడు.
37. ఇప్పుడు, నేను ప్రార్ధనా వరుసను కలిగి యుండబోతున్నాను. కొంత మంది జనులను పిలిచి, వారికొరకు ప్రార్ధన చేయబోతున్నాను. నాకు తెలియదు, నేను కేవలము ప్రభువు నాకు ఈ రాత్రి దేనిని చెయ్యమని చెబుతాడో, దానినే చేయబోవుచున్నాను. దానిని ఏ విధముగా చేయబోవుచున్నానో నాకు తెలియదు?
ఎంత మంది తమ నిమిత్తము ప్రార్ధన చేయాలని కోరుకుంటున్నారు. మీ యొక్క చేతులను చూడనివ్వండి? మై, మై. చాలామంది వున్నారు, వందల కొలది ఉన్నారు.
ఇప్పుడు, చూడండి, నా ప్రియ స్నేహితులారా, నేను….. క్రిందికి వచ్చి మరియు ఒక్కోకరిని ఈ వేదిక పైకి తీసుకుని వచ్చి మిమ్ములను నిలువబెట్టాలని ఆశిస్తున్నాను. అది మిలో విశ్వాసమును తీసుకువస్తుందని నేను గ్రహిస్తున్నాను. ఖచ్చితంగా అది మిలో విశ్వాసమును తీసుకువస్తుంది. అది విశ్వాసమును తీసుకువస్తుంది. మీరు మీ యొక్క కష్టాలను గూర్చి మరి అలాంటి వాటిని గూర్చి చెప్పినప్పుడు, మీ జీవితంలో జరిగిన కొన్ని సంగతులు చెప్పినప్పుడు, మీరు చేసిన వాటిని గూర్చి చెప్పినప్పుడు, అది విశ్వాసమును తెస్తుంది. కాని దేవుడు ఇక్కడ దేనినైతే కలిగియున్నాడో మరి అదే ఈ వేదిక మిద వుండబోతున్నది ఆయన అదే వైఖరిని మా ఎదుట కలిగియున్నాడు. మీరు దానిని విశ్వసించుట లేదా?
ఇప్పుడు, ప్రతి ఒక్కరు దైవభక్తిని కలిగియుండుడి. ఎంత మంది మీ పూర్ణహృదయముతో దానిని విశ్వసించబోవుచున్నారు, మరియు ఎంత మంది దేవుడు మిమ్మును స్వస్థపరుస్తాడని అక్కడ ప్రార్ధన చేయుచున్నారు? మంచిది. ఆయన ఇప్పుడు చేయునని నేను విశ్వసించుచున్నాను.
38.మన మందరము మన తలలు వంచుదాం. ఎవరైతే అక్కడ వాయిద్యాన్ని వాయిస్తున్నారో, “నాతో బద్దుడవై యుండుము”అనే దానిని వాయించాలని కోరుతున్నాను. మీరు ఇప్పుడే దానిని చేసినట్లయితే ప్రభువు యొక్క దూత ఇప్పుడు దగ్గరకు సమిపించెనని అనుభూతి చెందుచున్నాను.
మా పరలోకపు తండ్రి, మా ప్రియ యేసు, ఈ రాత్రి మిమ్మును ప్రేమిస్తున్నాము. మిమ్ములను ఎంతగానో ప్రేమిస్తున్నాము. నీవు మొదటిగా మమ్ములను ప్రేమించి మరియు నిన్ను మా కొరకు సమర్పించుకున్నావు. మరియు ఇప్పుడు ఈ రాత్రి నీవు నీ రక్తముతో వెల పెట్టి కొన్నటువంటి వారు ఇక్కడ నా ముందు ఉండియున్నారు. వారిలో చాల మంది పేదవారు, రోగులు, కుంటివారు వున్నారు. మరియు నాకు తెలుసు ప్రభువా, నీవు కనుక వారికి సహాయం చేయకపోతే మరి కొన్ని రోజులలో ఎవరు ఇక్కడ మిగలరు. వారు తెర ఆవలకు దాటవలసివున్నది. వారిని కాపాడుము తండ్రి. నేను ప్రార్ధించుచున్నాను. వారు క్రైస్తవులు కాకపోతే నీ మహిమా గృహమునకు వారిని తీసుకెళ్ళులాగున వారిని రక్షించండి.
మరియు తండ్రి, నేను ప్రార్ధించునది ఏమనగా, ఏది ఏమైనప్పటికి ఈ రాత్రి మి యొక్క ప్రజలకు, మీ యొక్క ఆత్మ ద్వారా బోధిస్తూవుండగా వారు చూచి మరియు వారి యొక్క పూర్ణహృదయముతో వారు నమ్ముదురు గాక., మరియు ఇది ఒక గొప్ప రాత్రిగా ఉండును గాక. తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనగా ఈ కుర్చీలలో, చంక కర్రలతో, బల్లల మీద, మంచాల మీద బంధీలై ఉన్నవారికోసం ప్రార్ధన చేస్తున్నాను. మరియు ప్రభువా ప్రజలు నిజముగా వ్యాధిగ్రస్తులై ఉన్నవారిలో ప్రతి ఒక్కరిని నీవు ఎరిగివున్నావు. వారి ఎదుట నాకు సహాయము అనుగ్రహించండి, మీరు దానిని చేస్తారు కదా ప్రభువా? మరియు “దానికోసం ఆయన వాక్యమును స్వీకరించుదుము గాక,”అని ప్రజలు చెప్పుదురు గాక. ప్రభువా, ఈ వాక్యము నాది కాదు, అది మీదని వారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అనుగ్రహించండి తండ్రి, ఈ రాత్రి మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మహిమ నిమిత్తం ఈ గొప్ప కార్యములు పూర్తి చేయుదురు గాక. ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్.
39. అయితే సరే. బిల్లి పాల్ వచ్చావా? ఏంటి? ఎంత మందికి నీవు ప్రార్ధన కార్డులు ఇచ్చితివి? వందా? ఆ అక్షరము ఏంటి. అయితే సరే, నేను ఏమి చేయాలో నీకు చెబుతాను, ఆలాగు చేద్దాం. “జడ్”అనే అక్షరంతో ప్రారంభించెదము.
ఈ రోజు “జడ్”అనే అక్షరం కలిగిన కార్డులను వారు పంచి పెట్టిరి. ప్రతిరోజూ మేము చాల కార్డులు ఇస్తాము. అప్పుడు అందరిని నేను తీసుకోలేను. సహోదరుడు హాల్ మరియు వారు మరుసటి రోజున వారిని తీసుకుని వచ్చి, వారికొరకు ప్రార్ధన చేస్తారు. మరియు ప్రతి రాత్రి కొన్ని కొత్త కార్డులు మేము బయటికి పంచుతాము.
సహోదరి, నీవు మరలా ఆ యొక్క గీతాన్ని వాయించగలిగితే నేను రోగుల కొరకు ప్రార్ధించునప్పుడు, దానిని వాయించు, నేను దానిని ఎంతో ప్రేమిస్తాను. మీరు ప్రేమించుట లేదా? “నాతో కట్టుబడుట,”ప్రభువా, ఆయన మాతో కట్టుబడునట్లు మాకు అనుగ్రహించుము.
40. ఇప్పుడు, ఇక్కడ మరియు బయట ఉన్నటువంటి వారు, నీవు ఎక్కడ ఉన్ననూ సరే, నీ యొక్క ప్రార్ధనా కార్డుని పిలిచిన యెడల, మీరు వరుసలో ఉండాలని మా అందరినీ కోరుచున్నాను. మీ యొక్క ప్రార్ధన కార్డు రానియెడల మీరు మీ యొక్క స్థానములోనే భక్తిగా ఉండుడి, మరియు ప్రార్ధన చేస్తూ ఉండుడి. కేవలము ప్రార్ధనలో ఉండండి, మరియు “ప్రభువా, ఏదైతే ఇప్పుడు ఇక్కడ చెప్పబడియున్నదో దానిని అంతటిని నేను నమ్ముచున్నాను”అని చెప్పుడి. నీ యొక్క వాక్యమును నమ్ముచున్నానని చెప్పుడి. నా యొక్క హృదయపూర్వకముగా నేను దానిని నమ్ముచున్నానని చెప్పు. మరియు సహోదరుడు బ్రెన్హామ్నాకు సత్యమును చెప్పాడు, దానిని నేను నమ్ముచున్నాను అని చెప్పు. మరి నేను స్వస్థపడబోతున్నాను దానిని నేను నమ్ముచున్నాను, అని చెప్పుడి.
మరియు ఇప్పుడు ఇక్కడి చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనములకు బయట ఉన్నటువంటి వారు మీరు గుర్తుంచుకొనండి. నన్ను దీనిని చెయ్యనివ్వండి, ఎందుకనగా నేను చేస్తున్నది నిజముగా చట్టపరమైనది. విమర్శలకు నేను బాధ్యుడను కాను, ఎందుకనగా ఈ వ్యాధులు ఒకరి నుండి ఇంకొకరికి వెళ్ళవచ్చును. మీకు తెలియును….
మీలో ఎంతమందికి అది నిజమని తెలుసు? ఇతర కూడికలకు వచ్చి చూసినవారికి ఎంతమందికి తెలుసు. అవి ఒకరిలో నుండి మరొకరి లోనికి వెళతాయి. అయితే ఇప్పుడు క్యాన్సర్ కావచ్చును, లేదా ఏదైనా ఉండవచ్చును, లేదా మూర్చవ్యాధి అయ్యి ఉండవచ్చును, వరుసలోనికి వచ్చినప్పుడు మా వైఖరి భక్తిగా లేనిచో నేను దానికి బాధ్యుడను కాను. మరియు బహుశ నీవు ఒక రోగిని వేదిక దగ్గరకు తీసుకొని రావొచ్చును. కాని అది ఒక భక్తి లేని ఆత్మ అయినట్లయితే అది ఖచ్చితముగా బయటికి రాదు. అది సరి. ఎందుచేత అనగా ఆ దూత నాతో “ప్రజలను నీ పట్ల నమ్మకము కలిగించినట్లయితే”అప్పుడు నా పరలోకపు తండ్రిని అడుగుటకు అధికారము పొందుకుంటాను. మరియు ఆయన చేస్తాడని నమ్ముతాను. కాని ఆ వ్యక్తి భక్తిగా లేనట్లయితే నాకు అధికారము లేదు. మరియు దాని గూర్చి ఎటువంటి విశ్వాసము ఉండదు. గమనించారా? మరి అది కేవలము భక్తిగా వున్న వారి కోసమే కనుక ఇప్పుడు…..
అది ఏమిటి? మీరు దాని నిమిత్తం ప్రార్ధన చేస్తారా. ఇప్పుడు…..
41. ప్రతిఒక్కరు ఇప్పుడు ప్రార్ధనలో ఉంటారా, మరిప్పుడు ప్రారంభిద్దాం. ఒకటవ సంఖ్య నుండి ప్రారంభించుకుందాం. మరియు ఒకటవ సంఖ్య నుండి ప్రారంభించండి. మరియు ఇచ్చట నుండి ఒక వరుసగా ఉండండి. మొదటి సంఖ్య ప్రార్ధన కార్డు మంచిది అటు తరువాత “జడ్”అక్షరము సంఖ్య -2, సంఖ్య -3, సంఖ్య-4, సంఖ్య -5, సంఖ్య – 6, సంఖ్య -7, సంఖ్య -8. సహోదరుడు షరిట్ ఎన్ని ప్రార్ధనా కార్డులను నీవు ఇక్కడ ఉంచగలవు? పది? లేక పదిహేనా, అక్కడెక్కడో ఒక వరుసగా ఉండుడి.
మంచిది, ప్రతిఒక్కరు మర్యాదపూర్వకముగా ఉండండి. మొదటిగా పది, కావున నీవు అన్నియు పొందుకోలేవు… అందరు ఎక్కువసేపు నిలబడవలసియుండును, ఎందుకనగా అరుదుగా మనము దాని మించి పోవుదుము. అవును. అవునండి. సహోదరుడా, ధన్యవాదములు. మంచిది, [స్పష్టతలేని మాటలు] బిల్లీ, ఇక్కడ ఉన్న వారందరినీ పరిశీలించుము. వారిలో కొందరు వినలేని వారు ఉందురు. ఇక్కడ వైపు చూడుము, ఎవరైనా కుంటివారుగా ఉన్నావారిని చూడుము. ఒకవేళ వారు కలిగియుంటే, వారు ఎక్కడ ఉన్నను, వారిని నీవు తీసుకోని రావచ్చును. జెడ్ – 1 నుండి 10 లేదా 15, ఆ వరుసలో. అందరిని పరిశీలించుము.
42. నేను ఇక్కడ రెండు లేదా మూడు రాత్రులుగా పిలుచుచున్నాను. మరియు ఇక్కడ ఎవరైనా లేచినట్లయితే దానిని చూడాలని కోరుచున్నాను. మరియు అది స్వార్ధమైయుండవచ్చును. అది ఇప్పుడు నేను దానిని చేసియుండకూడదు. దేవుడు మన్నించును గాక….. [టేపునందు ఖాళీ యున్నది.]
అందరూ నిజమైన భక్తితో ఉండుడి, మరియు నీ పూర్ణహృదయముతో ఇప్పుడు మర్యాద పూర్వకముగా ఉండుడి. అది అంతా సరి.
ఇప్పుడు కొంతమంది….. వారు కలిగియున్నచో…. నేను ఎక్కువ మందిని కలిగియున్నానా? సరే, మనం కొన్నిసార్లు అలాగు కలిగి ఉంటాము. అది నిదానముగా ఉన్నది. మరియు కొద్దిగా వేచి ఉండవలసియున్నది.
మరియు ఈ రాత్రి సహజంగా అదియే కొద్దిగా వింతగా ఉండబోతుంది. మా సేవక సహోదరులు ఈ వేదిక మీద కూర్చొనియున్నారు, మరియు దానిని నేను యెరిగియున్నాను. వారు దేవుని యొక్క ప్రజలు.
43. కాని నీవు గ్రహించావా….. ఇక్కడ చూడండి, స్నేహితులారా, ఇటువైపు నుండి వస్తున్న ఆత్మలు, ఇటు వైపు నుండి వస్తున్న ఆత్మలు, ఇక్కడ నుండి వస్తున్న ఆత్మలు, ఇక్కడ నుండి వస్తున్న ఆత్మలు, అందరూ కలవడానికి సులువుగా ఉంటుంది. నీవు అలాగున అనుకోవడం లేదా? అది అలాగు ఉంటుంది. మనము కలిగి యున్నాము కూడా…
రాత్రి సమయములో మీరు దానిని గమనించారా, నేను వారితో మాట్లాడుటకు సహజముగా రోగులను ఇలాగున త్రిప్పుతాను. అదేమిటో మీకు తెలుసా? మా అందరికీ నా వెన్నును చూపుట. చూశారా? అది నిజము.
మరియు మీరు ప్రార్ధన చేస్తూ ఈ రాత్రి ఇక్కడ నిలబడియుండగా, మీరు ఇది చేయాలని నేను కోరుచున్నాను. ఆ ప్రార్ధనా వరుసలో దేవుడు మిమ్ములను బాగుచేస్తాడని మీ పూర్ణహృదయముతో ప్రతిఒక్కరు నమ్ముచున్నారా?, అని అడగాలని ఆశపడుతున్నాను. మీరు దానిని నమ్ముచున్నారా? పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? అయితే సరి.
44.ముందుకు రండి, సహోదరుడా. ఇక్కడికి రండయ్యా, నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణుడుగా చేయు నిమిత్తము ఆయన మరణించాడని నమ్ముచున్నావా? నేను ఆయన సేవకుడని నీవు నమ్ముచున్నావా?
మంచిది. [స్పష్టతలేని మాటలు] నీవు అనేక సమస్యలు నీలో కలిగియున్నావు. మొదటిది నీ నేత్రములు చెడిపోవుచున్నవి [స్పష్టతలేని మాటలు] అది ఏమిటి, అవి గట్టి పరచబడుతున్నవి. నీ కను గుడ్లు గట్టిగా అవుచున్నవి. నీ నేత్రములో ఉన్నటువంటి నరము కఠినముగా మారుతున్నవి. మరి అదే ఇప్పుడు జరుగుచున్నది. [స్పష్టతలేని మాటలు].
ఇప్పుడు, నా సహోదరుడా, నేను ఆయనను అడిగినయెడల, ఆయన అంగీకరించి నీ విన్నపమును అనుగ్రహిస్తాడని నీవు నమ్ముచున్నావా? మంచిది, నీవు దానిని నమ్ముచున్నావా?
మంచిది, ప్రతిచోట ఉన్నటువంటి అందరూ మనము తలలు వంచుదాం. మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, ప్రతి మంచి ఈవులను ఇచ్చువాడా, నీ యొక్క ఆశీర్వాదములు ఈ మనిష్యుని మీదకు పంపించి అతనిని స్వస్థపరచండి. ఇప్పుడే ఆ వ్యక్తి తన యొక్క ఆశీర్వాదములు పొందుకుని, ఈ వేదిక మీద నుండి స్వస్థపడి వెళ్ళును గాక, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
మంచిది సహోదరుడా, ఇంటికి వెళ్ళు [స్పష్టతలేని మాటలు].
మనమందరము, “దేవునికి స్తుతి కలుగు గాక,”అని చెప్పుదము. ఇప్పుడు, ప్రతి ఒక్కరు భక్తిపూర్వకముగా ఉండండి.
45. సహోదరులారా మీరు ఉండదలచినచో, ప్రార్ధనలో వుండండి. అది దానిని భయంకరంగా కష్టతరం చేస్తుంది. నేను ప్రయత్నించుట లేదు… కానీ నేను ఖచ్చితత్వమును కలిగియున్నాను. సహోదరులైన మీరు నమ్ముచుండగా, దేవునికి తెలుసు మీరు దానిని నమ్ముచున్నారని, కాని చూడండి, మీరు మానవులు. మీరు అత్మను కలిగి వున్నారు. మరియు ఆత్మ ప్రతిచోట అలాగున తిరుగుతూ ఉంటుంది. అది ఆ విధముగా. [స్పష్టతలేని మాటలు].
సరే, అమ్మా. ఇప్పుడు నీవు రమ్ము. సహోదరీ, నీవు ఇటువైపుకు చూడాలని నేను అశపడుచున్నాను. నీ పూర్ణహృదయముతో నీవు నన్ను నమ్మాలని ఆశపడుతున్నాను. అది కొంచెము కష్టమే. అది పొందవలసిన మార్గములో లేనియెడల నేను అభిషేకము పొందుకోలేను. మీరు గమనించారా? నీవు నన్ను నమ్మాలని కోరుచున్నాను.
మీకు తెలుసా, చాల సార్లు మన యజమానుడు….. కొన్ని సార్లు ఒక వ్యక్తిని తన చేతితో పట్టుకుని ఆ జనుల గుంపులో నుండి ఊరు బయటకు తీసుకుని పోయి అక్కడ నిలబడి అతనితో మాట్లాడాడు. మీకు గుర్తుందా? చూచారా?
ఒకసారి జనులు పెద్ద గుంపుగా చేరి, ఏడుస్తూ ఉన్నారు. వారందరి హృదయాలు చీల్చబడగా, గందరగోళ పడియున్నారు. ఒక చిన్న బాలిక చనిపోయి వున్నది. మరి జనులు అందరు దాన్ని గూర్చి గందరగోళములో వున్నారు. యేసు ఆ జనులందరిని ఇంటి బయటకు పంపివేసి, ఆ బాలిక యొక్క తల్లిని మరియు తండ్రిని మరియు తనతో సేవచేసే పేతురు, యాకోబు, యోహాను అను వారితో గదిలోనికి వెళ్లి, ఆ చిన్నదాని చెయ్యిపట్టుకుని ఆమె యొక్క జీవాన్ని వెనుకకు పిలిచాడు, మాకు అది గుర్తున్నదా?
46. మంచిది, మరి అదే కార్యమును దొర్కా చనిపోయినప్పుడు పరిశుద్దుడై నటువంటి పేతురు చేసెను. మీకు అది గుర్తున్నదా? అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రందరూ రోదిస్తున్నారు, ఎందుకనగా ఆమె వారిపట్ల ఎంతో దయకలిగి ఉన్నది. మరియు పేతురు లోనికి వచ్చి వారి హృదయాలు చెదిరి ఉండుట గమనించి, వారిని ఇంటి బయటికి పంపివేసాడు, అప్పుడు దేవుడు ఏమి చేయదలచుచున్నాడో కనుగొనగలడు. చూసారా?
మంచిది, ఇప్పుడు, అది ఇక్కడనే ఉన్నది. అక్కడ కూర్చున్నటువంటి వందలమంది ప్రార్ధనా వరుసలోనికి రావాలని ఆశపడుచున్నారు. చూశారా? ఆయన వారిని కలిగియున్నాడు [స్పష్టతలేని మాటలు]. చూచారా? అది దానిని కష్టతరముగా చేయుచున్నది.
మరియు నేను మన యజమానుడు ఆ బావి దగ్గర ఆ స్త్రీతో ఏ విధంగా మాట్లాడియున్నాడో, అదే విధముగా నేను మీతో మాట్లాడుచున్నాను. ఇప్పుడు, మనము ఇద్దరమూ అపరిచితులము, అవును కదా సహోదరి. మనము ఒకరికొకరము తెలియనివారము. మన ఇరువురి జీవితములో మనము అపరిచితులుగా ఉన్నాము. నీ జీవితం గురించి ఏదైనా తెలియపరచబడినట్లయితే, అది ఒక అతీతమైన శక్తి నుండే రావాలి. అది సరియేనా?
47. నీవు ఒక క్రైస్తవరాలివని నేను నమ్ముచున్నాను. నీవు ఒక క్రైస్తవ స్త్రీవని నేను నమ్ముచున్నాను. నీవు కొంత సమయము ఇక్కడ ఉండియున్నావు. నీవు భయంకరమైనటువంటి ఆందోళనను ఒక దాని నిమిత్తము కలిగియున్నావు. నీవు కలిగియున్నటువంటి ఆందోళన, అది ఒక ఆతురతకు సంభందించిన ఆందోళన. అది సరియేనా? నీవు ఇతరుల సమస్యలను కూడా స్వీకరించే భయాందోళన కలిగిన వ్యక్తిగా యున్నావు, అవును కదా? నీవు కొన్ని సమస్యలు రాక ముందే అవి వచ్చాయని అనుకుంటావు మరియు పిలిచెదవు. అది సరియేనా? ఇపుడు చూడు, ఏదోకటి నిన్ను అలా అడ్డగించినప్పుడు….. అది ప్రతీ సారి దానికంటే ముందుగానే జరుగుచున్నది, ఎందుకనగా నీవు ప్రణాళికలు వేసుకుంటావు, కానీ అది ఎప్పుడు ఆ ప్రణాళికకు తగ్గట్టుగా రాలేదు. నీవు ప్రతిసారి ఏదోఒకటి జరగబోతున్నది అని నీ మనసులో కలిగి ఉంటావు. మరియు అది జరగదు, ఆ విధముగా ఉంటుంది. అది సరియేనా?
ఇప్పుడు, అది ఒక క్షణము నా మిద నిలిచియున్నది. అది కఠినముగానే ఉన్నది. ఇప్పుడు, దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్ధనలో ఉండండి.
ఇప్పుడు, సహోదరి ఈ వైపుగా చూడండి. నేను నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. (చూడండి?), అది కేవలము నీ యొక్క ఆత్మతో సంభాషించుట కోసము. నేను ఒక దర్శనము వచ్చుట చూస్తున్నాను, అది ఒక చిన్న బిడ్డ నుండి, ఒక చిన్న బాలిక నుండి రావడాన్ని చూస్తున్నాను. మరియు అది ఏ విధంగా అయితే వచ్చి యున్నదో, ఆ విధముగానే మాట్లాడవలసిన వాడనైయున్నాను. (మీరు చూడండి?), లేదా అది రాదు. ఇప్పుడు కేవలము ప్రార్థిస్తూ ఉండండి.
48.నీవు ఇక్కడ ఎదో ఉన్నదని ఒక గ్రహింపు కలిగియున్నావు. అది నిజమేనా? నీవు ఆ విధమైనటువంటి స్పహ కలిగియున్నావు. అది ప్రభువు యొక్క ఆత్మ అయి ఉన్నది. నీవు దానిని నమ్ముచున్నావా? అవునమ్మా. అది మరల తిరిగి వచ్చుట నేను చూస్తున్నాను. ఓ, అవును నీవు ఒక దానిని కలిగియున్నావు….. అది నీ ఉదరములో ఉన్నది….. అది నిజమేనా అమ్మా?…. నీవు ఒక ఉదరపు సమస్యను కలిగియున్నావు, అది నిజమేనా? అవునమ్మా, నీవు తీసుకున్నటువంటి ఆహార పదార్ధములు మరియు తిను బండరాలు నీకు జీర్ణము అవ్వదు. అది సరియేనా? ఆ విధమైనటువంటి సమస్య [స్పష్టతలేని మాటలు] అది నీ కడుపులో కండరాలు సంకోచించడం అనే దానిని కలిగించినది, కడుపులో పులుపుతనం మరియు నీ యొక్క పళ్ళు మృదుత్వముగా మారిపోవుట, ఈ రకమైనటువంటి చర్యలు నీకు నిరంతరం తలనొప్పి తెప్పించేటటువంటిగా ఉంటాయి. అది నిజమేనా? అవును, అది నిజము. అది సత్యమేనా సహోదరి? ఇప్పుడు మాట్లడుచున్నది నేను కాదు. నీతో ఇంకెవరో మాట్లడుచున్నారు. అది ప్రభువు యొక్క దూత.
నీవు నన్ను ఆయన యొక్క ప్రవక్తగా విశ్వసించుచున్నావా? నేను ఆయన ప్రవక్తనని నీవు అందుకు విధేయత చూపుచున్నావా? నీవు వెళ్లి, నీకు ఇష్టం వచ్చిన దానిని తినవచ్చును. నీ ఉదర సమస్య నయం కాబోతున్నది. సహోదరి, నీవు ఇప్పుడు స్వస్థపడ్డావు. దేవుడు నిన్ను దీవించును సహోదరి, మరియు దేవుడు నిన్ను దీవించును.
49. నేను ఇక్కడే ఇంకొక ఉదర సమస్యను అనుభూతి చెందుతున్నాను. ఇక్కడే ఎక్కడో అది కదలాడుచున్నది. ఆమె స్వస్థపడిన అదే సమయంలో నేను అనుభూతి చెందియున్నాను. ఇప్పుడు ఒక్క క్షణము. ఆ ఆత్మలు ఒక దానితో ఒకటి సానుభూతి చూపించుకుంటాయి. ఈ పద్దతిలో అది సరియే. నేను దానిని చెప్పగలను, ఆ రెండు పైకి వెళ్ళుట చూస్తున్నాను. పైకి దాటుకోనుట చూస్తున్నాను. ఎక్కడో అక్కడ. ఇప్పుడు, ప్రతీ ఒక్కరూ నిజమైన భక్తితో ఉండుడి. నేను మరలా దానిని చూసేంతవరకు కేవలము భక్తిని కలిగి ఉండుడి.
అది అదేనా, సహోదరి? దేవుడు నిన్ను దీవించును, నా సహోదరి [స్పష్టతలేని మాటలు]. నీవు ఇక్కడ ఉన్నటువంటి సేవకులలో ఒకరి భార్యవు, కదా? మరి యొక దినమున కలిసియున్నాను కదా? అది సరి. అయితే నీవు ఆమె కొరకు నమ్ముచున్నావు. మరి అది నీ విశ్వాసం, సహోదరి అది కుమ్మరించబడుతున్నది. అది మంచిది. అది మంచిది.
50.మంచిది, సహోదరి, నీవు ఇక్కడికి ముందుకు వచ్చియున్నావు. ఇప్పుడు ఒక సేవకుడి భార్య ఇక్కడ కూర్చొని వుండివున్నది, గమనించండి, అది ఆమె యొక్క విశ్వాసం. సహోదరి మరియు సహోదరులారా, మీకు అర్థమైనదా? అది నీ యొక్క విశ్వాసం. నీవు నన్ను నమ్ముచున్నావా, కేవలం ఒక్కసారి నమ్ముము.
చూడండి. ఒక సేవకుడు మరి యొక దినమున ఈ సభలో ఒక సాక్ష్యమును ఇచ్చియున్నాడు. అది ఏమిటనగా, “నేను ఒక కార్యమును చేస్తాను, అది ఒక వ్యక్తి ద్వారా జరిగించబడినప్పటికినీ మీరు దానిని నమ్మరు,”అని దేవుడు చెప్పాడు.
గమనించండి, అది నేను కాను, అని చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. దానిని నడిపించేది నీ విశ్వాసమే. విశ్వాసము లేకుండా ఏమియు లేదు. నీవు ఏమియు పొందుకోనలేవు. ఎవరైతే ఆయనను ఒక కర్రతో తలమీద కొట్టి, “ప్రవచించు”అని చెప్పిరో, వారిలో ఏ విధమైన నీతి లేదు. చూచారా? ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దానిని పొందుకుంటారు.
51. ఇప్పుడు, నీవొక రోగివి. ఇప్పుడు, నీవు ఈ మార్గములో కొద్దిగా ముందుకు రావాలని నేను కోరుతున్నాను. నీవు ఆలాగు చేయదలచిన, నీవు అక్కడ నిలబడవలెనని కోరుచున్నాను. మరియు నీవు స్వస్థత కలిగివుండాలని కోరుచున్నాను, నీవు కేవలం నిశ్శబ్దముగా వుండుము, నేను నీ యొక్క ఆత్మతో సంభాషించాలని అనుకుంటున్నాను. అది కొద్దిగా కష్టతరము. చూచారా? నేను ఏ అర్ధముతో చెప్పితినో నీవు గ్రహించలేవు. ఇప్పుడు నీవు… మనము అపరిచితులము. అవును కదా? నేను తెలిసేటట్టు మిమ్ములను ఎప్పుడు చూడలేదు. నాకు నిన్ను గూర్చి ఏమియు తెలియదు. మరియు కేవలము ఈ సమయములో మాత్రమే కలిసాము.
ఇప్పుడు, పరిశుద్ధాత్ముడు చాల సున్నితమైనవాడు, మీకు తెలుసా, చాల సున్నితమైనవాడు, నేను ఆయనతో మొదటిగా అనుకూలతను కనుగొనాలి.
ఇప్పుడు, సహోదరులారా, మీరు నా కుడివైపున కూర్చుని వున్నారు, నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో మీరు….. దానిని గ్రహించుచున్నారా….. దానిని మీరు అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఆ ప్రభువు యొక్కదూత నా యొద్దకు వచ్చుచున్నాడు.
52. అవును, చాలాకాలం నుండి నీ యొక్క ఆరోగ్యం సరిగా లేదు. అవునా, సహోదరి? అవును ఇంతకు ముందు ఆ స్త్రీ వచ్చినట్టుగా నీవు ఆందోళన కలిగియున్నావు, అధికమైనటువంటి ఆందోళన, నీ దృష్టి కూడా సరిగా లేదు. నీవు దగ్గర-దృష్టి లోపాన్ని కలిగియున్నావు, అవును కదా, సహోదరి? నీ దృష్టి, నీవు చాలా చక్కగా చూడలేవు. నీవు కొంతకాలము నుండి దానిని కలిగియున్నావు. అవును కదా? మరియు ఇటువైపుగా చూడుము.
మన ప్రభువు ఎవరితోనైనా మాట్లాడుట నీవు గుర్తించావా? ఆయనే ఒక వ్యక్తిగత సంభాషణను కలిగివుంటాడు. ఆయన తన శిష్యులందరిని పంపివేసినాడు. మరియు ఒక స్త్రీ, ఆ బావి యొద్దకు వచ్చినది. అది నిజమేనా? నీకు అది గుర్తున్నదా? అవును, ఆయన ఆమెతో ఒక మాట చెప్పాడు, అది ఏమనగా “వెళ్లి, నీ భర్తను తీసుకొని రా”అని అన్నాడు.
అప్పుడు ఆమె, “నాకు భర్త లేడు”అని అన్నది. ఆయన ఆమెతో నీవు కలిగి లేవు, అని అన్నాడు. అది నిజమేనా?
నీవు ఒక క్రైస్తవ విశ్వాసివి. నీవు దేవుడిని వెదకుచున్నావు మరియు ఆయనతో లోతైన సంబంధము కలిగి ఆయనతో నడుచుటకు వెదకుచున్నావు కూడా, మరియు నీవు ప్రార్థన చేయుట నేను చూచియున్నాను. అవును, అది అక్కడే నీవు కూడా ఉదర సమస్యను కలిగియున్నావు. నీవు కలిగియున్నావు కదా? అది నిజము. ఇంటికి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించాడు, మరియు నీవు స్వస్థపడ్డావు, నా ప్రియ సోదరి. దేవుడు నిన్ను దీవించును గాక.
మనమందరము, “ప్రభువుకు స్తోత్రం”చెబుదాం. ప్రతి ఒక్కరు, నిజమైన భక్తిని కలిగివుండుడి, నా స్నేహితులారా, నేను మానవ జీవితము నుండి తీసుకొనునది మాకు తెలియును.
53. అయితే సరే, ముందుకు రండి, సహోదరి. ఎలా వున్నారు సహోదరి, నీవు కళ్ళజోడును ధరించియున్నావు. సందేహమే లేదు, నీవు నేత్రముల సమస్యను కలిగియున్నావు. నేను నీతో కొద్దిగా మాట్లాడదలచుకున్నాను [స్పష్టతలేని మాటలు]. నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? అవును, నేను దానిని నమ్ముచున్నాను, సహోదరి. అవునయ్యా, నీవు ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి. నేను దానిని నమ్ముచున్నాను. నీవు ఈ సమయములో పొందుకున్న అనుభూతిని గూర్చి ఏమని అనుకుంటున్నావు? నీవు దానిని దేవుని యొక్క ఆత్మ అని నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? అది ఒక భక్తిగా వున్నది….. అవును కదా, సహోదరి?
నీలో చాలా సమస్యలు కలిగియున్నావు, నీలో చాలా ఒడిదుడుకులు కలిగియున్నావు. నీ యొక్క వయస్సు ఇది….. నీవు ఒక పాత సమస్యను కలిగివున్నావు. అది చాలా కాలము నుండి నిన్ను కలవరపరచినది, నీవు ఒక ఉదర సమస్యను కూడా కలిగియున్నావు.
1,552 total views, 1 views today