50-0816 అదృశ్యమైన వాటి కొరకు చూచుట

అదృశ్యమైన వాటి కొరకు చూచుట
క్లీవ్-లాండ్, ఒహాయో, యుఎస్ఏ
50-0816
1. కూడి వచ్చినవారికి సాయంకాలపు శుభములు. ఈ రాత్రి ఇక్కడ వచ్చుటను బట్టియు మరియు ప్రభువైన యేసును గూర్చి మాట్లాడుటను బట్టియు నాకు ఎంతో సంతోషముగా ఉన్నది, ఆయన యొక్క కృప ఇక్కడ ఉన్న బలహీనులను స్వస్థపరచుటకు మరియు రక్షించుట కొరకైయున్నది. నేను, ఇంకేమియు మీకు చెప్పవలసిన అవసరములేదని ఖచ్చితముగా చెప్పగలను, ఎందుకనగా దేవుని యొక్క గొప్పతనము ఎప్పుడో చెప్పబడియున్నది.
సహోదరుడు బాక్సటర్ మాట్లాడుచున్న ఈ కొద్ది నిముషములను నేను ఆస్వాదించియున్నాను.
2. మొదటగా నేను వాక్యమును కొద్దిగా చదవాలని ఆశిస్తున్నాను, II రాజులు, 6వ అధ్యాయము 13వ వచనము… [టేపు పై ఖాలీ ఉన్నది.]… నేను 12వ వచనము నుండి ప్రారంభిస్తాను, దేవుని శక్తివంతమైన ఎలీషా అనే మనుష్యుని కాలములోని ఒక దినమున, ఇప్పుడు జాగ్రత్తగా వినుము.
వారి సేవకులలో ఒకడు ఇలాగు చెప్పెను… రాజువైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.
ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుచున్న మరొక రాజు తనయొక్క సంగతులు ఏలాగు ఇశ్రాయేలు రాజునకు తెలియుచున్నవని ఆశ్చర్యపోయెను. అప్పుడు ఆ రాజు యొక్క సేవకులలో ఒకడు అడుగు ముందుకు వేసి ఇలాగు చెప్పెను, “మంచిది, మన మధ్యలో ఎవరో ఒక వేగు ఉన్నాడు. ”
మరొక సేవకుడు, “లేదు, కాని దేవుని వలన ఎలీషాకు అంతఃపురమందు జరుగు సంగతులు తెలియును. అతడికి మాత్రమే ఈ సంగతులు తెలుసును మరియు ఇశ్రాయేలు రాజునకు మీ సంగతులు చెప్పుచున్నది అతడే.” ఈ దినము మనకు మరింతమంది ఎలీషాలు కావలసియున్నారు.
అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవియ్యగా, అతడు దాతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.
కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకోనగా.
దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. అంతట అతని పనివాడు, “అయ్యో, నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని” ఆ దైవజనునితో అనగా.
అతడు “భయపడవద్దు… (ఓహ్, నేను దానిని ప్రేమిస్తాను. అది ఎంత చీకటిగా కనిపించినను, కలత చెందవద్దు, భయపడవద్దు.)… మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులైయున్నారని చెప్పి.
యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్ధన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును, పర్వతము అగ్ని గుర్రములచేత, రథములచేతను నిండియుండుట చూచెను.
3. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఇప్పుడు, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గములను తన ప్రజలకు బయలుపరచుకొనిన ఆ గడిచిపోయిన ఒక దినమును గురించి మనము ఆలోచిస్తున్నాము.
ఆ సమయములో రెండు దేశముల మధ్యలో యుద్ధము జరుగుచున్నది. ఇశ్రాయేలు దేశము మీదకు యుద్ధమునకు సిద్ధపడుచున్న దేశపువారికి, వారి దాడియొక్క ప్రతి ప్రణాళికా ముందుగానే ఇశ్రాయేలు దేశమునకు ఏ విధముగా తెలియచేయబడుచున్నదో వారికి తెలియకున్నది. కాబట్టి తమ మధ్యలో ఎవరైనా వేగులు ఇశ్రాయేలీయులకు తమ సంగతులను తెలియచేన్నారేమో అని కనుగొనుటకు వారందరు ఒక చోటునకు సమకూర్చబడియున్నారు. వారిలో ఒకడు ఇలాగనెను, “మన మధ్యలో వేగులెవరును లేరు. ఇదంతయూ ఇశ్రాయేలీయులలో ఉన్న ఎలీషా చేయుచుండెను. అతడు తన పడక గదిలోనుండియే నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలను తెలుసుకొనగలడని మాకు తెలుసు. ఇశ్రాయేలు రాజునకు అతడే ఈ సంగతులను చెప్పుచున్నాడు.”
4. మీకు తెలుసు, దేవునికి భయపడి ప్రార్ధన చేయు ప్రజలే అమెరికాలో నేడున్న ఈ విపత్కర పరిస్థితులలో కావలిసినయున్న ఉత్తమమైన ఆయుధమైయున్నారు. అదియే ఉత్తమమైనది. మనము ఉత్పత్తి చేయుచున్న ఈ బాంబులు మరియు యుద్ధ ట్యాంకులకన్నా అది ఎంతో మేలైనది. దేవుడు ఎల్లప్పుడు తన ప్రజల కొరకు పోరాటం చేయును.
ఒకవేళ ఈ దేశమంతా దేవుని నిమిత్తమును తమను తాము మారుమనస్సు అనే గోనెపట్టా మరియు బూడిదలోకి పడవేసుకుని, మరియు తిరిగి మన పితరుల యొక్క ఆ పాత దారులలోకి వచ్చి నడిచినట్లయితే, అప్పుడు ఏ హానియు మన దగ్గరికి రాలేదు. మందుగుండును తయారీ చేయు స్థలములు మరియు అటువంటివి తయారు చేయు వాటికన్నా, మనము కలిగియున్న అన్ని బాంబులకన్నా (అది నిజము.) అది ఎంతో ఉత్తమమైనదని నేను నమ్ముచున్నాను. ప్రార్ధనకన్నా గొప్పది ఏదియూ లేదు. భవిష్యత్తునంతా దేవుడు తన చేతులతో పట్టుకొనియున్నాడు.
కొద్దికాలము క్రితం నన్ను ఎవరో ఇలాగు అడిగారు, “బ్రదర్ బ్రెన్హాం, భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏమిటి?”
నేను ఇలాగన్నాను, “భవిష్యత్తు దేనిని పట్టుకొన్నదో నాకు తెలియదు, కాని భవిష్యత్తును ఎవరు పట్టుకొనియున్నారో ఆయన నాకు తెలుసు.” కావున ఆయనతో నేను సహవాసమును కలిగియుంటే అదే చాలు.
5. ఎప్పుడైతే ఆ రాజు, ఈ ప్రవక్త ఇశ్రాయేలు దేశములోనే ఉన్నాడని కనుగొనెనో, అతడు ఇలాగనేను, “వెళ్ళి, అతడిని నా యొద్దకు తీసుకు రమ్ము.”
మరియు వారు దిగువునకు వెళ్ళిరి, వారితో ఒకరు, ఎలీషా దాతానులో ఉన్నాడని చెప్పెను. వారు దాతానుకు రాత్రివేళ వెళ్లి చీకటిలోనే చుట్టూ ముట్టడి వేశారు. శత్రువు ఎల్లప్పుడు తన పనిని చీకటిలోనే ఏలాగు చేయునో గమనించారా? ఎలీషాను పట్టుకొనుటకు వారు ఆ పట్టణము చుట్టూ ముట్టడి చేశారు. అప్పుడు యవ్వనస్తుడైన అతని యొక్క పనివాడు, పెందలకడనే లేచి
మరియు బయటకు వచ్చి… ఇంకొక విధముగా చెప్పవలెనన్న – ఆ పనివాడే ఎలీషాని లోపలకు మరియు బయటకు మరియు చుట్టూ తీసుకొని వెళ్ళువానిగా ఉండెను. అతడు బయటకు వచ్చి, చుట్టూ చూసి, తిరిగి లోపలకి వచ్చి ఇలాగనెను, “అయ్యో, నా ప్రభువా, పట్టణమంతా గుర్రములతోను మరియు రథములతోను శత్రువులు ముట్టడి వేశారు.”
ఎలీషా ఇలాగనెను, “ఎందుకు చింతిస్తున్నావు, వారితో ఉన్నవారికంటే మనతో వున్నవారు అధికముగా ఉన్నారు.”
మంచిది, ఎలీషా తప్ప దానిని చూడగలిగినవారు ఎవరును లేరు. ఎలీషా ఇలాగు ప్రార్ధన చేసేను, “ప్రభువా, దీనిని చూచునట్లుగా ఈ యవ్వనస్తుని కన్నులు తెరువుము.”
ఆ యవ్వనస్తుని యొక్క ముసుగును దేవుడు తొలగించివేసెను. అతడు చూడగా, పర్వతములన్నియు మరియు కొండలన్నియు అగ్ని రథములతో నిండి, ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ నిలబడియుండెను. మంచిది, అప్పుడతడు భయపడుట మానివేసెను.
6. ఓ, ఈ రాత్రి నేను ఏమి ఆలోచిస్తున్నానంటే, “ప్రభువా, మేము కాలములనే ఆ తెరను దాటి చూచునట్లుగా చేయుము, అక్కడున్న ఆ చిన్న కొనను చూసి, అది ఏమైయున్నదో మేము చూడగలుగునట్లు చేయుము.” ఇక్కడ చెడుకు వ్యతిరేకముగా మేలైనది చేయుచున్న ఆ గొప్ప యుద్దములో మేము ఈ రాత్రి పోరాడుచున్నాము. ఆధునికమైన థియాలజీకి వ్యతిరేకముగా దేవుని వాక్యమునకు జరుగుచున్న యుద్ధమైయున్నది, దేవుని వాక్యమును ప్రజల యొద్దకు తీసుకొని వచ్చుచుండగా, అదే సమయములో ప్రతి మార్గమును శత్రువు చుట్టుకొనియుండుటకు ప్రయత్నించుచున్నాడు. కాని దేవునిలో ఒక్కరు అత్యధికమైనవారు.
ఇప్పుడు, గమనించుము, నేను చెప్పదలచుకున్న ఆ సంగతి ఏమిటంటే, దేవుని యొక్క మనుష్యుడైన ఎలీషాను మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను, అతడిని “దేవుని యొక్క మనుష్యుడు,” అని పిలిచారు, అతడు సహజమైన సంగతుల కొరకు చూచియుండలేదు. సహజాతీతమైన సంగతుల కొరకు అతడు చూచెను. దృశ్యమైనవాటి కొరకు అతడు చూడలేదు, కాని అతడు అదృశ్యమైనవాటి కొరకు చూచెను.
ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, ఈ రాత్రి మనము కూడా అదృశ్యమైనవాటిని చూద్దాము. సహజాతీతమైన దానిని గురించి బ్రదర్ బాక్స్టర్ అద్భుతముగా భోదించుచున్నప్పుడు అది నా మనస్సులోకి వచ్చినది. సహజాతీతమైన దానిని మీరు చూడలేరు, కాని మీరు దానిని విశ్వసించి మరియు దాని వలె ప్రవర్తించినప్పుడు దానిని మీరు చూడగలరు. గమనించారా?
క్రైస్తవుల అమ్ముల పొదలో ఉన్న ప్రతి ఆయుధము సహజాతీతమైనదే. దృశ్యమైన దానిని మనము చూడము, అదృశ్యమైన దానిని మనము చూస్తాము. నీవు దానిని చూడకున్నట్లయితే నీవు, నీ స్వస్థతను పొందుకోలేవు.
7. ఒక స్త్రీ, కాన్సరు వ్యాధి నుండి తను స్వస్థతను పొందుకున్నట్లుగా ఈ దినము నాకు ఎవరో ఒక ఉత్తరమును వ్రాసియున్నారు, అందులో ఆమె ఇలాగు వ్రాసెను, “మొదటి రెండు లేక మూడు దినములు, నేను చాలా మహిమకరమైన, అద్భుతమైన అనుభూతిని చెందియున్నాను. ఆ తరువాత మూడవ దినము నుండి, భయంకరమైన బాధతో వున్నాను. నేను నా స్వస్థతను కోల్పోయున్నానా? అని అనిపించినది.”
ఇప్పుడు, ఇటువంటి సంగతుల గురించి ప్రతి రాత్రి వివరించుట జరుగుచున్నది. లేదు, అది నీ స్వస్థత యొక్క పరిపూర్ణమైన సూచనైయున్నది. పన్నెండు గంటల తరువాత ఆ కణితిలో క్షయత ప్రారంభమైనది. అది మరణించియున్నది. కొన్నిసార్లు దేవుడు అద్భుతములు చేయును, అప్పుడు అది ఎంత మాత్రము ఎదగలేదు.
8. నేను ఎవరి ముందైతే నిలబడియున్నానో, ఆ దేవుడే నాకు న్యాయనిర్ణేతైయుండెను. పత్రికలలోని మొదటి పేజీలో వచ్చిన వార్తల యొక్క భాగములను బట్టి దీనిని నేను చెప్పుచున్నాను. అది ఇక్కడనే బలిపీఠము మీదనే చూపించబడినది. బలపీఠము మీదకు వ్రేలాడుతున్న కాన్సరులతో (కణుతులతో), వారి శరీరముల మీద అవి వ్రేలాడుచుండగా, వారు పైకి వచ్చుటను నేను చూసియున్నాను, మరియు ప్రార్ధన చేయబడిన తరువాత వారి యొక్క కాన్సరు తెల్లనిదిగా మారి క్రిందపడేవి, నేను ప్రార్ధన చేయుచుండగా అవి నేలమీద దొర్లుకుంటూ వెళ్లేవి. అక్కడ ఒక విలేఖరి నిలబడి వాటిని ఫోటో తీసి, వాటిని దినపత్రికలోని మొదటి పేజిలో ముద్రించి ధృఢపరచెను. అది ఒక క్రైస్తవ దినపత్రిక, దానిలోని ఎడిటర్లు అందరు క్రైస్తవులే, ఎవరవై దేవునియందు నమ్మకము కలిగియున్నరో, వారు ఆ పత్రికలో పనిచేయుచున్నారు, నశించిపోయినవారి నిమిత్తము, రోగుల నిమిత్తము వారు భారమును కలిగియున్నారు.
ఈ విధమైన ఏ సంగతులు మనలను కదిలించలేవు. నా హోటలు గదిలో దేవుడు నాకేమి బయలుపరిచియుండెనో, అది మీకు ఎన్నడు తెలియదు. అయిననూ అవన్నియు నిజమే. వాటన్నింటిని అక్కడనే ఉంచుదాము, ఎల్లప్పుడు ప్రభువును తన మార్గములోనే వెళ్ళనీయుడి.
9. నాకు ఒక సంగతి గుర్తున్నది… ఎవరికైనా ఆ పేపరు యొక్క నకలు కావలసినట్లయితే, మీరు దానిని ఇప్పుడు కూడా “ఆర్క్ససాస్ గజిట్,” నుండి పొందవచ్చును, దానిని “సన్” అని కూడా పిలుస్తారు. అది ఒక అనుబంధ ముద్రణాలయము, అది వేలమంది వినియోగదారులను కలిగియున్న ఒక పెద్ద పత్రిక. వారు బలిపీఠముమీద ఆమె యొక్క ఫోటోతో నిలబడియున్నారు. మీరు ఆశించినట్లయితే, నకలు కొరకు ఆమెకు మీరే వ్రాసి, ఆమె నుండి దానిని పొందవచ్చును. బహుశా ఆ విలేఖరి కూడా ఇక్కడ నిలబడి ఉండవచ్చును (ఉన్నాడని నాకు తెలిసినది), కాబట్టి మీయంతట మీరే వ్రాసి తృప్తి పొందవచ్చును.
మంచిది. మీరందరు గమనించవచ్చు, మొదటి పేజీ మొత్తము ఆ యొక్క చిత్రమే ఉన్నది. ఆ చిత్రములో మరణించిన ఒక స్త్రీ వరుసలో పడుకోబెట్టబడి వున్నది, ఆమెకు గుండెలోను, కాలేయములోను మరియు పెద్ద ప్రేగులోను కాన్సరున్న కారణముచేత ఆమెను ఆసుపత్రి నుండి తీసుకొని వస్తున్నామని నర్సు మరియు ఆమె సంబంధీకులు చెప్పియున్నారు; ఆరిజోనాలోని, ఫీనిక్స్ వీధులలో ఆమెను నెట్టుకుంటూ తీసుకొనివచ్చారు, ఆమెను తీసుకొని వచ్చుచున్నామని ఆమె యొక్క భర్తకు ఆ వైద్యులు చెప్పియున్నారు… ఆమె పేరు శ్రీమతి. హాటి వాల్డ్రోఫ్, ఆరిజోనాలో, ఫీనిక్స్ వీధిలో ఆమె జీవిస్తున్నది. ఆమె యొక్క భర్త స్వంతముగా ఒక పెద్ద పైపుల కంపెనీని అక్కడనే కలిగియుండెను.
ఆ దినమునో లేక మరుసటి దినమునో డాక్టర్ బోస్వర్త్ కూడా ఆ కూడికలో ఉన్నారు… [టేపు పై ఖాలీ ఉన్నది] అప్పుడు రాత్రియగుచున్నది. కొద్దికాలము క్రితమే ఆమె గృహము వద్ద నేనును మరియు అతడును రాత్రి విందును కలిగియున్నాము.
10. ఆమెకు గుండెలోను, కాలేయములోను మరియు పెద్ద ప్రేగులోను కాన్సరున్నది. ఆమె కేవలం కొద్ది గంటలు మాత్రమే బ్రదుకుతుందని వైద్యులు చెప్పియున్నారు. ఆమె ప్రార్ధనా వరుసలోకి రావటానికి ముందే, ఆమె రెండు భవన సముదాయముల దూరములో యున్నప్పుడు, ఆమె యొక్క జీవము ఆమెను విడిచిపోబోవుచున్నది. అప్పుడు ఆమె ఇలాగన్నది, “నన్ను తీసుకొని వెళ్ళండి. నేను మరణించిననూ నన్ను ఆ సహోదరుని ముందుకు తీసుకొని వెళ్ళండి, ఇది నా విజ్ఞాపన.”
ఆమె ద్వారము వద్దకు వచ్చిన తరువాత వారు ఆ సంగతిని నాకు తెలియచేశారు; ఆమె యొక్క ముఖమును దేనితోనో కప్పియుంచారు, గదిలో శవము ఉన్నదని చెప్పెను.
మంచిది, ఆమె యొక్క భర్త ఏడ్చుచూ వచ్చెను. నేను ఆ స్త్రీని చూశాను, ఆమె చేతిని నేను కొద్దిసేపు పట్టుకున్నప్పుడు ఆమె చల్లబడియున్నదని నాకు తెలిసింది. కాని ఆమె ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియదు. ఆమె కోసం నేను ప్రార్థించుట ప్రారంభించాను, ఆమెకు జీవమును ఇవ్వమని దేవుని అడిగాను, ఎందుకనగా ఆమె యొక్క విశ్వాసము ఘనమైనది. కొద్దిసేపటి తరువాత ఆమె తన మంచము మీద నుండి లేచి తన ఇంటికి వెళ్లినది.
11. ఈ సంఘటన మూడు సంవత్సరముల క్రితము జరిగినది. ఆమె యొక్క వైద్యుడు, ఎక్స్-రే లను తీసుకొని ఆ కూడికకు వచ్చి ఇలాగనెను, “నేను చేయాలనుకున్న ఒకే ఒక్క పని ఏమిటంటే, బ్రదర్ బ్రెన్హాంని కలుసుకుని, కరచాలనము చేసి, ఈ మాట చెప్పాలని అనుకుంటున్నాను.” ఆమె గురించి ఎదురుచూస్తున్న ఆ క్రైస్తవుడు (అతడి సాక్ష్యమును ఇప్పుడు మీరు తీసుకొనవచ్చును.) ఇలాగనెను, “ఆమెలో కాన్సరుకు సంభందించినటువంటి ఒక్క చిన్న కణము కూడా ఇప్పుడు లేదు.” ఇదంతయు ఒక మూలన జరుగుచున్నది. కరచాలనము చేయుటకు ఆ స్త్రీయే ఆ కూడికలోనికి వచ్చియున్నది.
మరొక మూలన ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతడిని విమానములో తీసుకొని వచ్చేటప్పుడు అతడు ఎంతో చెడుదైన ఒక వాపును కలిగియున్నాడు, అతడి కాళ్ళు మరియు అతడి కాలి యొక్క మునివేళ్ళు కాన్సరుతో ఎంతో పెద్దవిగా వాచిపోయున్నాయి. అతడు తన ప్రార్ధన నిమిత్తము వేచియున్నాడని… ఆ పత్రికలో వ్రాసియున్నది. అతడి నిమిత్తము ప్రార్ధన చేయుచుండగా, ఆ విలేఖరి ఇలాగనెను, “ఆ వాపు క్రిందకు పడిపోవుటను, నేను నా కన్నులారా చూచాను.” అది ఆ విధముగా పెరిగిపోవుటచేత అతడు అనేక వారముల నుండి తినుటలేదు. ప్రార్ధన తరువాత అతడు కాల్చిన కోడి మాంసమును సగము మరియు ఒక ఐస్-క్రీమును కూడా తినెను. అతడు తిరిగి తన గృహమునకు వెళ్ళెను. అతడి పేరు ఎవరెట్ట్ సంప్టర్.
బ్రదర్ లిండ్సే, దానిని గురించిన ఒక నకలును కలిగియున్నాడు. అతడి దగ్గర అది ఉన్నది. ఇప్పుడు అతడు దానిని కలిగియున్నాడో లేదు నేను ఎరుగను.
12. మరొక మూలన, అక్కడ ఒక సేవకునికి కాన్సరు వ్యాధి అతని గొంతుయందు అది వ్రేలాడుచుండుట మీరు చూడవచ్చును (అది ఆ విలేఖరే తనంతట తానే చెప్పుచున్నాడు.) రెండు సంవత్సరముల క్రితము అతడు షేవింగ్ చేస్తున్నప్పుడు కలిగిన ఒక గాటు తరువాత అది కాన్సరుగా మారినది. అతడు ఇలాగనెను, “ఆ వ్యక్తి బలిపీఠం మీదకు వచ్చినప్పుడు, నేను ఆ కాన్సరును చూశాను. అది గట్టిగాను మరియు చాలా భయంకరముగాను ఉన్నది. ఆ వ్యక్తి నిమిత్తము రెవరెండ్ బ్రెన్హాం ప్రార్థించిన కొంతసేపటికి, ఆ కాన్సరు (కణితి) క్రిందకు జారి, ఆ వ్యక్తి కాలియొద్ద దొర్లి పడెను మరియు మేము దానిని పైకెత్తి పట్టుకొన్నాము. ఇదిగో అది ఇక్కడనే ఉన్నది. అది అతడి గొంతు నుండి రాలి క్రింద పడుటచేత, అతడి గొంతు దగ్గర – అది ఎక్కడైతే అంతకాలము వున్నదో, అక్కడ ఒక రంధ్రము ఏర్పడినది.” గొంతు దగ్గర ఎక్కడి నుండైతే ఆ కాన్సరు కణితి రాలిపడినదో, అక్కడ ఏర్పడిన రంధ్రమున్న ఫోటోను వారు అతికించియున్నారు. దానిని గురించిన వార్తను జోనెస్బోరో, ఆర్కాన్సాస్, “ఆర్కాన్సాస్ సన్” పత్రిక వ్రాసియున్నది. మీరు దానిని ఆశించినట్లయితే దానిని పొందవచ్చును.
13. అక్కడనే దిగువున, కెనడా నుండి మెక్సికో వరకు సుమారుగా ఇరవై-ఆరు వేలమంది కూడుకునియున్నారు. [టేపు పై ఖాలీ ఉన్నది] ఉరుములు మరియు వర్షము పడుచున్నది. ప్రజలు సామన్యతలో ఉండి దేవున్ని ప్రేమించుచున్నారు. గమనించారా? విశ్వాసము…
మనము అదృశ్యమైనవాటి కొరకు చూద్దాము మరియు అవి అదృశ్యమైన కార్యములని విశ్వసించుదాము, దేవుడు పలుకుట వలన అవి వాస్తవములోకి వచ్చెను. అదియే అసలైన సంగతి.
చాలాసార్లు అది పనిచేస్తుంది. గత సాయంత్రము అక్కడ స్వస్థతలో ఉనప్పుడు ఇక్కడ బలిపీఠము నుండి (నేను సృహను కోల్పోయే స్థితిలోకి వెళ్ళేంతవరకు) నేను ప్రజలతో ఒకరి తరువాత ఒకరితో మాట్లాడుచున్నాను.
14. ప్రార్ధనా కార్డుల నుండి దూరమయ్యే సమయము రావాలని నేను ఎల్లప్పుడు ఆశించాను, ప్రార్ధనా కార్డులు లేకుండా మరేదియు లేకుండా ప్రజలందరు ఏక మనస్సుతో దానిని విశ్వసించాలి. ఇలాగు చేయమని ఆయనే నాకు చెప్పెను. “ఈ సూచనలు కేవలం ప్రజలు విశ్వసించుటకు మాత్రమే.” ఆయన ఇలాగు చెప్పెను, “ఈ దైవిక స్వస్థత అనే వరమును ఈ లోకపు ప్రజల యొద్దకు మోసుకొనిపోవుటకే నీవు ఈ లోకములో జన్మించియున్నావు.” [టేపు పై ఖాలీ ఉన్నది] తరువాత ఆయన ఇలాగు చెప్పెను… [టేపు పై ఖాలీ ఉన్నది] “…ప్రజలు విశ్వసించుటకైయున్నది.” “నీవు ప్రార్ధించినప్పుడు మరియు నీవు భక్తిపూర్వకముగా ఉన్నట్లయితే, అప్పుడు ప్రజలు నిన్ను విశ్వసిస్తారు, ప్రార్ధన ముందు ఏదియు నిలువజాలదు, కాన్సరు వ్యాధి కూడా ప్రార్ధన ముందు నిలువలేదు.”
ఇప్పుడది సత్యమైయున్నది. ప్రార్ధనా కార్డుల ప్రదర్శనలేని ఒక స్థలము కావాలని నేను ఆశిస్తున్నాను, కాని అందరును ఒకే విశ్వాసమును కలిగి ఒకే అవసరతతో నమ్మి మరియు స్వస్థతను పొందుకొని నడుచుకొనుచు వెళ్లాలని నేను ఆశిస్తున్నాను. ఒక రోజు ఒక నగరములో, ఒక చోటికి వెళ్ళి, మరోక దినము మరొక నగరములో వేరొక చోటికి వెళ్ళి ప్రార్ధించుచుండగా; ప్రతిచోటా వేలమంది స్వస్థతను పొందుకుంటున్నారు, ప్రభువు యొక్క మహిమ ప్రతిచోటా కుమ్మరింపబడియున్నది, అదియే నేను ఆశించినది.
15. మోషే వెళ్ళి ఇశ్రాయేలు దేశము ముందు తన సూచనలను ఒక్కసారి ప్రదర్శించగా, తరువాత వారు 40 సంవత్సరముల ప్రయాణములో అతడిని వెంబడించారు. అది సత్యమేనా? అవునయ్యా. ఒక్కసారే ప్రదర్శించబడెను… కుష్ఠము కలిగిన తన చెయ్యి స్వస్థపడెను, తను కలిగియున్న ఆ కర్ర, నడుచుటకు ఉపయోగించే ఆ కర్ర, సర్పముగా మారినది మరియు తిరిగి అది కర్రగా మారినది. వారు దానిని విశ్వసించారు. ఆ కాలములో గారడీ విద్య, అనుకరణ విద్య ఎంతో అధికముగా వున్నది… యన్నే మరియు యంబ్రెలు, మోషేకి వ్యతిరేకముగా నిలబడియున్నారు. కాని, దేవుని శక్తి ప్రబలమైనదిగా వెళ్ళి ప్రతీదానినీ దాటిపోవునట్లుగా అతడు చూసియుండెను. ఎల్లప్పుడు అలాగునే జరుగును. మీరు గమనించారా?
ఈ దినమున కూడా అనేకమైన అబద్దమైనవి మరియు నిజమైనవి మనము కలిగియున్నాము. అది సత్యమైయున్నది. కాని అబద్ధమైనవి ఎల్లప్పుడు తమవే సత్యమైనవి అని చెప్పుకుంటున్నాయి. కాని ఈ సూచనలను దేవుడే పలికియుండెను. మనము వేరెవ్వరి యొక్క వాక్యమును తీసుకొనవలసిన అవసరతలేదు కాని, దేవుని వాక్యమును మాత్రమే తీసుకొనవలసిన అవసరత ఉన్నది. ఆయన వాక్యము ఎన్నడు విఫలము చెందదు. ఆ దర్శనములు అద్భుతమైనవి. అదియే ప్రారంభమార్గమైయున్నది.
16. స్వస్థతకు సంబంధించిన ఒక చిన్న కథ నా మనస్సులోకి వచ్చినది. ఒక్క నిముషములోనే నేను ప్రార్ధనా వరుసను కలిగియుంటాను. ఆ రాత్రివేళ నేను, నా తల్లిగారింటికి వెళ్ళుచున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. అప్పుడు నేను ఒక దర్శనమువంటి దానిలోనికి వెళ్ళియున్నాను. ఏమి చూశానో దాన్నిబట్టి నేను ఆశ్చర్యపోయాను. నేనేమి చూశానంటే…
మేము ఎంతో పేదవారముగా పెరిగియున్నాము. మా అమ్మ, తన వస్త్రములు ఉతికిన తరువాత వాటిని కుర్చీ మీద ఆరవేసేది, వాటిని దూరముగా వుంచేంత స్థలము మాకు మా గదిలో లేదు, అందుకని ఆ వస్త్రములు కుర్చీమీదనే ఉండేవి.
నా గదిలో కుర్చీ నిండుగా ఆ వస్త్రాలు ఉండేవనుకుంటున్నాను, సుమారుగా ఒంటి గంటప్పుడు అనుకుంటాను. సహజముగా దర్శనములు ఒంటి గంట నుండి మూడు గంటల మధ్యలో వస్తుంటాయి. నేను దాని వైపు చూసి, అవి “మా అమ్మగారి యొక్క వస్త్రములు” అనుకున్నాను. “ఖచ్ఛితముగా ఎవరో ఏదో అవసరతలో ఉన్నారు, లేకపోయినట్లయితే నేను ఆ విధముగా అనుభూతిని చెందను.” నేను సరిగా నిద్రపోలేదు. ఇప్పుడు నేను చాలా అలసిపోయున్నాను మరియు నేను ఇక్కడ నిలబడుటకు కూడా నాకు చాలా కష్టముగా ఉన్నది. అది నిజము. రాత్రివేళ…
17. జ్ఞాపకమున్నదా, ప్రజలైయున్న మీరందరు ప్రార్ధించుచుండగా, అది నా మీద ప్రభావమును చూపించును. గమనించారా? ఆ కార్యముల గురించి మీరు ప్రార్ధించి, అడిగినప్పుడు, అవి తిరిగి నా యొద్దకు వస్తాయి, రాత్రివేళ అవి నన్ను అనేక గంటలపాటు మేలుకొనునట్లుగా చేస్తాయి. కాబట్టి నేను అటువంటిది ఏదో అనుకున్నాను.
నేను ఆశ్చర్యపోవుట ప్రారంభించాను. కొద్దిసేపటి తరువాత, అది నాకు అత్యంత సమీపముగా వచ్చుచున్నది. అది తెల్లని పిండిలాగా, ఒక మేఘమువలె ఉన్నది. నేను ఆ మేఘములోకి వెళ్ళియున్నాను. నేను లోపలికి వెళ్లినప్పుడు, అక్కడ నేను ఒక స్వరమును వినుచున్నాను, ఒక చిన్న గొర్రెపిల్ల “బా, బా” అని అరచుచున్నది. అప్పుడు నేను చీకటిలో ఉన్నాను. మరియు ఆ చీకటిలో నేను అటు, ఇటు తిరుగుచున్నాను. నేను ఇలా అనుకున్నాను, “కేవలం కొద్దిసేపు. ఇప్పుడు నన్ను చూడనిమ్ము. అది స్పష్టముగా కనిపించుచున్నది.” “ఇప్పుడు నేను కలగనుటలేదు. నేను మంచము మీద నుండి ప్రార్ధించుచున్నట్లుగా నాకు జ్ఞాపకమున్నది. అది ఒక దర్శనమైయున్నది.” నేను ఇలాగన్నాను, “ఓ, ప్రభువా, అది ఎక్కడున్నది?”
అది చీకటిలో ఉన్నది మరియు దానిని నేను పట్టుకొనుటకు ప్రయత్నము చేయుచున్నాను, ముళ్ళతీగలను మరియు మిగిలినవాటిని తీయుటకు ప్రయత్నమును చేయుచున్నాను. మరలా నేను దానిని విన్నాను. నేను, ఆ ముళ్ళతీగలను పట్టుకున్నప్పుడు అవి నా చేతికి గుచ్చుకున్నాయి. అది “బా” అని అరుచుచున్నది. నేను ఇలాగనుకున్నాను, “దీనమైన ఈ చిన్నది, ఈ చీకటిలో తప్పిపోయినట్లున్నది.” నేను ఈ విధముగా లాగుచున్నాను. నేను ఇలాగ అనుకున్నాను, “ప్రభువా, ఈ దర్శనభావమేమిటో నాకు తెలియదు, కాని నేను ఆ గొర్రెపిల్లను తీసుకొని వచ్చుటకు ప్రయత్నము చేస్తాను.”
నేను దానికి బాగా దగ్గరగా వెళ్ళినప్పుడు, అది ఒక మానవ స్వరముగా గుర్తించాను. అది మిల్-టౌన్, మిల్-టౌన్,“ అని చాలా బలహీనముగా అరుచుచున్నది. ”ఓ, ఎక్కడ? ఈ మిల్-టౌన్ ఎక్కడున్నది? ఎన్నడు నేను దాని గురించి వినియుండలేదు. మంచిది, నేను వెళ్ళుటకు ప్రయత్నించాలి,“ అని నేను అనుకున్నాను. నేను ఇంకనూ దానిని లాగుతూనే ఉన్నాను.
18. కొద్దిసేపటి తరువాత, ఎవరో పెద్దగా ఇలాగు అరుచుటను నేను విన్నాను, “బ్రదర్ బ్రెన్హాం? ఓ, బ్రదర్ బ్రెన్హాం.” అప్పుడు నేను దర్శనమునుండి లేచి, చుట్టూ చూసియున్నాను. “నేనెక్కడ ఉన్నాను?” అని నేను అనుకున్నాను. నా చేతులు పైకెత్తి నేను ఒక గదిలో నిలబడియున్నాను, ద్వారము వద్ద నుండి ఎవరో నన్ను పిలుచుటను నేను విన్నాను.
ఉదయము అయిన తరువాత, మరియు నేను ఆ సాయంకాలమున నా సంఘమునకు వెళ్ళి, ఇలాగ అన్నాను, “నేనొక దర్శనమును చూశాను, ఆ దర్శనములో మిల్-టౌన్’ అను పేరును నేను వినియున్నాను. అది ఎక్కడ ఉన్నదో మీలో ఎవరికైనా తెలుసా?” ఏ ఒక్కరికి తెలియదు. తరువాత ఆదివారమున నేను ఇలాగన్నాను, “మిల్-టౌన్ అని పిలవబడే ఒక చిన్న స్థలములో ఎవరో ఆపదలో చిక్కుకొనియున్నారు. బహుశా ఆ మిల్-టౌన్ పట్టణముకు పిలువబడుటకై నేను ఒక ఉత్తరమును పొందబోవుచున్నాను. అక్కడ ఎవరో ఆపదలో వున్నారు. అది ఏమైయున్నదో నేనెరుగను. నేను అక్కడకి వెళ్లవలసియున్నది. బహుశా అది మన దేశములోనే ఎక్కడో ఒకచోట ఉన్నది.”
నేను అలాగు మాట్లాడుచుండగా, అక్కడ కూర్చునియున్న ఒక వ్యక్తి ఇలాగనెను, “బ్రదర్ బ్రెన్హాం, మిల్-టౌన్ ఎక్కడ ఉన్నదో నాకు తెలుసు.” “అది ఇండియానా రాష్ట్రములోని దక్షిణము వైపున సుమారుగా 30 లేక 40 మైళ్ళ దూరములో జఫర్సన్ విల్ కు దిగువున లేక న్యూ-ఆల్బనీకి దిగువున ఉన్న ఒక చిన్న స్థలమైయున్నది. దానికి దగ్గరలోనే నేను నివసిస్తున్నాను.”
నేను, “దానిని ఎలాగు వ్రాస్తారు?” అని అడిగాను. అతడు ఇలాగు బదులిచ్చెను,
“మి-ల్-టౌ-న్, మిల్-టౌన్.”
నేను, “అంతేనా,” అన్నాను.
అతడు దానిని చెప్పినప్పుడు, అది ఆ స్థలమేనని ప్రభువు ఆత్మ యొక్క అనుభూతిని నేను పొందుకున్నాను. కావున నేను ఇలాగ అన్నాను, “నేను దానిని కనుగొంటాను. అక్కడకి ఎలాగ వెళ్లవలసియున్నాదో మీరు నాకు తెలియచేయండి.” అతడు నాకు రహదారులను తెలియచేసెను.
19. అతడు, నన్ను అనేక మైళ్లు తీసుకొని వెళ్లిన తరువాత ఒక చిన్న గ్రామమునకు తీసుకొనివచ్చెను. మేము మిల్-టౌన్ చేరుకున్నాము. అతడింటికి నేను వెళ్ళాను.
ఆ దినము శనివారము. పట్టణములో ఉన్న ప్రజలందరూ తిరుగుచు వారి యొక్క కొనుగోళ్లను చేయుచున్నారు, ఆ గ్రామము యొక్క జనాభా సుమారుగా వేయి మంది లేక అంతకన్నా కొంచెం తక్కువగా ఉండవచ్చును.
“మంచిది, నేను ఈ వీధి మూలన ఇక్కడే ప్రసంగించాలని బహుశా ప్రభువు ఆశిస్తున్నాడని అనుకుంటున్నాను,” అని నేను అన్నాను. నేను లోపలికి వెళ్లి, అక్కడ ఉన్న ఒక వ్యక్తికి నాణెము ఇచ్చి, నేను నిలబడుటకు ఒక పాత సబ్బుల పెట్టెను తీసుకున్నాను. నేను బయటకు వచ్చాను, ఏమి చేయాలో నాకు తెలియదు కాని,
మిల్-టౌన్ కు వెళ్ళాలి. అంతవరకు మాత్రమే నాకు తెలుసు. నేను ఇలాగన్నాను, “అక్కడ ఎవరో ఆపదలో చిక్కుకున్నారు. బహుశా ఎవరో త్రాగుబోతో లేక మరెవరో ఆపదలో వున్నారు.”
నేను ఆ సబ్బులపెట్టె మీదకు ఎక్కి, చూట్టూ చూచుటకు ప్రయత్నించబోవుచున్నాను. నేను దానిని చేయలేకపోయాను. ఏదో నాతో ఈలాగు చెప్పినది, “దానిని నీవు చేయవద్దు.”
మంచిది, నేను ఆ సబ్బులపెట్టెను పైకెత్తాను, కొద్దిమంది జనులు నన్ను ఇలాగు అడిగారు, “నీవు దానితో ఏమి చేయాలని ఆశిస్తున్నావు?”
నేను ఇలాగు బదులిచ్చాను, “నేను ఒక సేవకుడిని. కాని, ప్రభువు నన్నేదో చేయమని చెప్పుచున్నట్లుగా నేను అనుభూతిని చెందుచున్నాను.”
20. అప్పుడు నాతో కూడా ఉన్న శ్రీ. రైట్ ఒక దుకాణములో నుండి బయటకు వచ్చి, ఇలాగనెను, “నేను, ఈ కొండపైన ఉన్న ఒక వ్యక్తి కొరకు కొన్ని కోడిగుడ్లు తీసుకొని వెళ్ళుచున్నాను, మీరును నాతో కూడా కొండపైకి వస్తారా.”
అందుకు నేను, “వస్తాను అయ్యా,” అన్నాను.
మేము ఆ కొండ చూట్టూ తిరిగి పైకి వచ్చియున్నాము. ఆ క్రమములో మేము ఒక పాతదైన ఒక తెల్లని పెద్ద చర్చి భవనమును దాటియున్నాము. అప్పుడు నేను ఇలాగన్నాను, “అది ఒక అందమైన పాత చర్చి, పట్టణమంతా అక్కడ నుండి కనిపిస్తుంది.”
అతడు, “బ్రదర్ బ్రెన్హాం, అది పురాతనమైన ఒక బాప్టిస్టు చర్చి,” అనెను.
నేను, “ఏ బాప్టిస్టు సంఘమది?” అని అడిగాను.
“మిషనరీ” అని అతడు చెప్పెను.
నేను, “ఓ, మంచిది, ఆ బాప్టిస్టు చర్చిలో ఏమి జరిగింది?” అన్నాను.
అందుకు, అతడు ఇలా బదులిచ్చెను, “మంచిది, కొన్ని సంవత్సరముల క్రితం ఏదో తప్పు జరిగినది. ఒక సేవకుడు ఏదో సమస్యలో పడియున్నాడు. అప్పుడు అక్కడ పెద్ద కాల్పులు సంభవించెను. అప్పుడు సంఘము జారిపోయినది, మరియు సంఘ ప్రజలు తిరిగి పట్టణములోకి వెళ్లిపోయారు. వారు కేవలం అంత్యక్రియలకు మాత్రమే ఇక్కడ వస్తారు.”
నేను ద్వారము దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు, అది చక్కగానే ఉన్నట్లుగా కనిపించినది. ఆ ద్వారమును తెరుచుటకు నేను ప్రయత్నించాను, కాని అది తెరుచుకోలేదు. నేను ఇలాగన్నాను, “నీవు వెళ్ళుము. నీవు తిరిగి వచ్చువరకు నేను ఈ మెట్ల మీదనే వేచియుంటాను.”
21. అతడు కొండపైకి వెళ్ళినప్పుడు నేను మోకరిల్లి ఇలాగన్నాను, “ప్రభువా, ఒకవేళ నేను రావాలని నీవు ఆశించియున్న స్థలము ఇదే అయితే, నేను ఇక్కడ కూడిక పెట్టాలని నీవు ఆశించినట్లయితే, నా కొరకు ఈ ద్వారమును తెరువుము. ద్వారము తెరువుము.” నేను ఇంకనూ ప్రార్ధనలో ఉండగానే, ఈ మార్గము గుండా కొండ మీదకు ఎవరో ఒక వ్యక్తి వచ్చుచున్న శబ్దమును నేను వినియున్నాను, ఆ వ్యక్తి ఈల వేసుకొంటూ వచ్చి, ఇలాగనెను, “హలో, ప్రసంగికుడా?”
నేను కూడా “హలో,” అన్నాను.
అతడు, “నీవు చర్చివైపు చూస్తున్నావా?” అని అడిగెను.
నేను, “అవునుగాని, నేను ఒక ప్రసంగికుడని నీకెలా తెలుసు?” అన్నాను.
అతడు, “మీరొక ప్రసంగికుడని శ్రీ. రైట్ చెప్పియున్నారు. మీరు దానిలోపల చూడాలని ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ద్వారము తెరుచుటకు నేను దాని తాళమును తీసుకొని వచ్చాను,” అనెను.
నేను, “మీకు కృతజ్ఞతలు” అన్నాను. నేను లోపలికి నడచి మరియు చుట్టూ చూసి, “పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతలు,” అన్నాను. చుట్టూ చూశాను అది ఒక మంచి చర్చి, దానిలోపల సుమారుగా 300 మంది ప్రజలు చక్కగా కూర్చునవచ్చును. “దీని స్వంతదారుడు ఎవరు?” అని నేను అడుగగా.
అతడు, “ఈ పట్టణమే,” అని బదులిచ్చెను.
వారిని చూచుటకై నేను దిగువకు వెళ్ళాను. వారు ప్రజలకు సేవలను అందించే ఒక కంపెని నుండి కరెంటును తీసుకున్నారు, తరువాత నేను ఆ కంపెనీలోనే ఉద్యోగము చేసియున్నాను.
అతడు ఇలాగనెను, “మీరు పైకి వెళ్ళి, ఒక కరెంటు మీటరును పెట్టుకొనుము. మీరు ఆశించినంత కాలము అది మీదే.”
“మీకు కృతజ్ఞతలు.” తరువాత మీటరును నేను లోపల పెట్టియున్నాను. రాబోవు ఆదివారమున ఒక ఉజ్జీవము కలదని నేను ప్రకటించియున్నాను.
22. ఆ దినము నేను బయటకు వెళ్ళి, కొండకు సమీపముగా ఉన్న ఒక వ్యక్తితో ఇలాగన్నాను, “అయ్యా, నా పేరు బ్రదర్ బ్రెన్హాం. ఈ కొండపైన నేను కూడికను కలిగియున్నాను. మీరును పైకి రాగలరా?”
అప్పుడతడు ఇలాగన్నాడు, “చూడు ప్రసంగికుడా, మేము కోళ్ళను పెంచుతాము. మాకు సమయముండదు. క్రింద జరుగుచున్న ఈ మతపరమైన సంగతులకే మాకు సమయములేదు.”
అప్పుడు నేను ఇలాగన్నాను, “మంచిది, సోదరుడా, కాని ఈ దినములలో ఏదో ఒక దినమున నీవు మరణించే సమయమును కనుగొంటావు.” అప్పటి నుండి మూడు నెలల తరువాత, వారు అతడిని పూడ్చిపెట్టియున్నారు.
నేను ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాను. చాలా వ్యత్యాసముగా ఉన్న అనేక మందిని నేను కలుసుకున్నాను. నేను కూడికను ప్రారంభించియున్నాను, మొదటి రాత్రి కూడికకు శ్రీ. రైట్ మరియు అతడి ఇద్దరు కుమార్తెలు మరియు అతడి కుమారుడు, అతడి భార్య, మొత్తము ఐదుగురిని మాత్రమే నేను కలిగియున్నాను. నేను ప్రసంగించగలిగినంతగా ప్రసగించియున్నాను.
ఆ విధముగా మేము ముందుకు వెళ్ళాము. మరుసటి రాత్రి నేను వేదిక మీద నిలబడి లేఖనములను చదువు సమయమునకు కూడా అదే గుంపును కలిగియున్నాను… మేము చాలా దూరము ప్రయాణము చేసి వెళ్ళియున్నాము.
23. ఒక గృహము ప్రక్కన దేనినో కొట్టుచున్న చప్పుడును వినియున్నాను. అక్కడ ఒక వ్యక్తి మొక్క జొన్న పొత్తులతో ఇంటిని కొట్టుచున్నాడు. లోపలికి రా, ఓ, చూచుటకు ఆ వ్యక్తి ఎంతో భయంకరముగా ఉన్నాడు, అతని జుత్తు అతడి ముఖము మీదకు వ్రేలాడుచున్నది. అతడి ముందు పళ్ళలో ఒకటి ఊడిపోయినది, చూట్టూ ఆ విధముగా చూస్తున్నాడు. ఆ భవనమునంతా చూస్తూ
ఇలాగనెను, “మీరు చెప్పిన ఆ చిన్న బిల్లీ సన్డే ఎక్కడ ఉన్నాడు?” శ్రీ. రైట్ నాకు ఇలాగు చెప్పెను, “అతడొక సమస్యాత్మకమైన వ్యక్తి. గతములో అతడు నజరేతు సంఘములో ఉండేవాడు, కాని అతడు వెనుకకు జారిపోయిన తరువాత నుండి ఆ గ్రామములోకి వచ్చే ప్రతి ప్రసంగికుడిని అతడు శపించుచున్నాడు.”
నేను వెనుకకు వెళ్ళి ఇలగన్నాను, “శ్రీ. హాల్ గారు, నేను శ్రీ. బ్రెన్హంను.”
మరియు “మిమ్ములను కలుసుకొనుట నాకు సంతోషముగా ఉన్నది,” అని అన్నాను.
అతడు, “ఆ ప్రసంగికుడవు నీవేనా?” అనెను. “నీవు అలా కనబడుట లేదు,” అని అన్నాడు. ఒక విధముగా తూలుచు ఉన్నాడు.
నేను, “నీవు కూర్చుంటావా?” అని అడిగాను.
అతడు, “మంచిది, నేను కొద్దిసేపే కూర్చుంటాను. నాకు పాటలు పాడుట అంటే ఇష్టము.”
నేను, “మంచిది, నీవు కూర్చున్నట్లయితే, మాకు ఉన్న ఉత్తమమైన మార్గమును నిన్ను అలరించుటకు ప్రయత్నిస్తాము. నీవు ముందుకు రాగలవా?” అన్నాను.
అతడు, “లేదు, ఇక్కడ నుండి లేవటానికి నేను ఇష్టపడను, నేను ఇక్కడే కూర్చుంటాను,” అనెను.
నేను, “మంచిది. అయ్యా, నీకు నీవు సౌకర్యవంతముగా ఉండుము.” తిరిగి వెనక్కి నడిచాము.
24. శ్రీ. రైట్ వేదిక మీదకు వచ్చెను. అతడు పాట పాడబోవుటకు ముందుగా ఇలాగు చెప్పెను, “ఈ గ్రామము మొత్తములోనే అత్యంత వ్యర్ధమైన వ్యక్తి ఇక్కడ వున్నాడు.”
అటు తరువాత నేను నా అంశముగా, “ధనవంతుడు తన కనులను పాతాళాములో తెరిచెను…” తీసుకున్నాను. [టేపు పై ఖాలీ ఉన్నది] …?… వేదిక మీద ఉండెను. ఆ దిగువన ఉన్న మిల్-టౌన్ బాప్టిస్టు సంఘమునకు అతడు కాపరిగా ఉండెను, ఎంతో ప్రియమైన వ్యక్తిగా అతడున్నాడు. [టేపు పై ఖాలీ ఉన్నది].
ఇప్పుడు, ఈ పేరును మీరు తీసుకొని, మీరు నేరుగానే ఆమెకు ఉత్తరము వ్రాయవచ్చును. నేను, ఆమె యొక్క పేరు మరియు చిరునామా మీకు చెప్పుటకై ఒక్క నిముషము ఆగండి, మీ యొక్క పెన్సిలు మరియు పేపరు తీసుకొనుము. కొండకు దిగువన ఆమె జీవించేది. ఆమె యొక్క ప్రజలు ఒక నిర్దిష్టమైన సంఘమునకు సంబంధించినవారు, వారు ఆత్మలో నమ్మకమును ఉంచరు లేక… [టేపు పై ఖాలీ ఉన్నది].
వాక్యమును ఆత్మ కదిలించునంత వరకు ఆ వాక్యము మరణించిన దానితో సమానము. అయితే దానియందు వారు విశ్వాసముంచరు. ఆ సంఘము వారు ఇక్కడ దిగువన వున్నారో లేక పైన ఉన్నారో నాకు తెలియదు. కాని వారు ఈ విధముగా ప్రకటించియున్నారు, నా యొక్క సంఘమునకు వారిలో ఎవరైనా హాజరైనచో…?… వారు వెనుకకు తిరిగి వచ్చినప్పుడు, వారికి ఉత్తరము ఇవ్వుము.
కావున నేను ఇలాగు అన్నాను, “మంచిది. ఎవరో ఒకరు వస్తారు.” కావున ఆ శీతాకాలములో ఆ సంఘమంతా నిండినది.
25. కాబట్టి శ్రీ. హాల్, నా యొద్దకు వచ్చి, మరియు అతడు ఇలాగనెను, “బ్రదర్ బ్రెన్హాం, ఆ కొండ దగ్గర ఒక చిన్న బాలిక మంచము మీద వున్నది, ఆమెకు సుమారుగా ఇరవై సంవత్సరములుండవచ్చును. ఆమె తొమ్మిది-సంవత్సరముల-ఎనిమిది నెలలుగా మంచము మీద నుండి ఎటూ కదలక అలాగునే ఉంటున్నది. ఆమెకు ఒక పెద్ద కణితి కలదు. కనీసము గత మూడు లేక నాలుగు సంవత్సరములుగా వైద్యులు ఆమెను చూడటానికి రాలేదు. గత సంవత్సరము నుండి వారు ఆమె కొరకు ఏమి చెయ్యలేదు. ఆమె గొంతులో ఒక కణితిని, ఊపిరితిత్తులలో ఒక కణితిని, ప్రేగులలో ఒక కణితిని, స్త్రీ అవయవములలో ఒక కణితిని కలిగియున్నది.” “నీ యొక్క చిన్న పుస్తకమును కొద్ది నెలల క్రితము ఆమె పొందుకున్నది. అప్పటి నుండి నీవు రావాలని ఆశిస్తూ, ఆమె ఏడ్చుచూ ప్రార్ధించుచున్నది. కాని ఆమె యొక్క తండ్రి ఈ సంఘములో డీకన్ గా ఉండెను, ఆమె యొక్క తల్లి ఇదే సంఘములో పియానో వాయించేది. కావున నీవు వచ్చుటకు వారు అనుమతిని ఇవ్వరు.”
అతడు నాతో ఈ విధముగా చెప్పగానే, నాతో ఎదో ఇలాగు చెప్పెను, “అదియే ఆ అడవిలో చిక్కుకున్న ఆ గొర్రెపిల్ల.”
నేను ఇలాగు అనుకున్నాను, “ఓ, మంచిది, ప్రభువా, మీరే మార్గమును ఏర్పచాలి. మీ కొరకు నేను కనిపెట్టుకునియుంటాను.” కాని అది ఆత్మ యొక్క సాక్ష్యమని నాకు తెలుసు. నేను నిరీక్షించాను.
26. ఎనిమిది రోజుల తరువాత ఆ యొక్క కూడికలు ముగించి నేను గృహమునకు వెళ్ళబోవుచున్నాను. ఆ దినమున… మేము వచ్చుటకు ఆమె యొక్క తల్లి మాకు అనుమతిని ఇచ్చి, ఇలాగు అన్నది, “కేవలం ఆమెను సంతోషపరచే నిమిత్తమై అతడు వచ్చుచున్నట్లయితే, మేమందరము ఆ యొక్క గృహమును విడిచి వెళతాము. కావున మేమందరము ఆ గృహమును విడిచి వెళ్తాము. అతడు అక్కడున్నంత వరకు మేము అటువైపుకు కూడా రాము.” వేషదారులు.
అప్పుడు నేను ఇలాగు అన్నాను, “మంచిది, ఏలాగైనా నేను వెళ్తాను.”
కొండ నుండి నేను క్రిందకు దిగి ఆమె యొక్క గదిలోకి వెళ్లియున్నాను. నేను ఆ గదిలోకి ప్రవేశించగానే, ఆమెయే నేను అనుకున్న స్త్రీ. ఆమె వైపు నేను చూశాను. ఆమె సుమారుగా 37 పౌండ్ల (16.8 కిలోల) బరువున్నది. ఆమెలో ఎముకలు తప్ప మరేదిలేదు. ఆమె తన చేతని కూడా పైకెత్తలేకపోచున్నది. తన వద్దనున్న కఫమును ఉమ్ము కప్పును కూడా పైకెత్తలేని స్థితిలో ఆమె యున్నది. ఆమెకు పక్షవాతము వచ్చినది, అందమైన ఆ యవ్వనస్తురాలు, తెల్లని జుత్తు కలిగి అక్కడ ఉన్నది. సుమారుగా ఎనిమిది సంవత్సరముల నుండి ఆమే కనీసము కిటికీలో నుండి కూడా బయటకు చూడలేదు. తొమ్మిది-సంవత్సరముల-ఎనిమిది-నెలలు ఆమె మంచములో పడుకునే ఉన్నది. వారు కనీసము ఆమె యొద్ద మలమూత్రముల పాత్ర కూడా పెట్టియుండలేదు. ఆమె క్రింద రబ్బరు దుప్పటిని వుంచారు, కేవలం ఆ దుప్పటిని మాత్రమే వారు మార్చుచున్నారు. ఆ కణితులు ఇదిగో ఇంత పెద్దవిగా ఇలాగున్నాయి.
27. ఇప్పుడు మీరు ఆమెకు ఉత్తరమును వ్రాయవచ్చును. ఆమె యొక్క పేరును నేను చెప్పబోవుచున్నాను. కుమారి జార్జీ కార్టర్, కా-ర్ట-ర్, జా-ర్జీ, కుమారి జార్జీ కార్టర్, మిల్-టౌన్, ఇండియానా. ఆమెకు ఉత్తరము అందినట్లయితే ఆమె మీకు తన సాక్ష్యమును వ్రాసి పంపుతుంది. ఒకవేళ ఆమె కూడా అదే సంగతిని చెప్పినట్లయితే వినండి. ఆమె యొక్క వైద్యులు ఇచ్చిన ధృవపత్రములను మరియు మొదలైనవాటిని తీసుకొని రమ్మని ఆమెను మీరు అడగవచ్చును.
కొండ దిగువకు వచ్చినప్పుడు, అక్కడ ఉన్న ఆ క్రైస్తవులందరు ఇలాగన్నారు, “ఒకవేళ ఆ బాలిక స్వస్థపడినట్లయితే, అది జరిగినట్లయితే అప్పుడు ఈ గ్రామమంతా కన్నీరు కారుస్తుంది.”
కాని ఇది మీరు గమనించవలసిన సమయమైయున్నది. దేవుడు స్వస్థపరచేది తనను అగుపరచుకోటానికి కాదు. గమనించారా? వారు ఆ విధముగా చేయరు. సాధారణముగా, ప్రపంచములో స్వస్థత పొందవలసిన అత్యంత కఠినమైన వ్యక్తి ఆమెయే. ప్రతియొక్కరు చూచుచుండగా, అప్పుడు అన్ని దయ్యములు వాటియొక్క శక్తులను వారియొక్క అవిశ్వాసము మీద కేంద్రీకృతం చేస్తాయి. అవిశ్వాసమే దయ్యపు శక్తియైయున్నది. విశ్వసించనివాడు అప్పటికే శిక్షావిధి పొందియున్నాడు.
28. ఆ బాలిక యొద్దకు వెళ్ళి నేను ప్రార్ధించియున్నాను. దినపత్రికలో వచ్చిన ఒక వార్తలో ఒక బాలిక ఏ విధముగా స్వస్థత పొందుకొనియున్నదో ఆమె నాకు చెప్పుచున్నది, ఒక దర్శనములో (ఆ బాలిక జీవితమంతా కర్రలతోనే నడిచినది, ఆ విధముగానే పెరిగినది, ఇండియానాలోని షాలేములోని మెథడిస్టు సంఘమునకు చెందియున్న ఆ బాలిక పేరు నేయిల్.), మరియు ఇప్పుడు కూడా ప్రభువు దర్శనము ద్వారా కదలియుండెను, నన్ను అడవిలోనికి పంపియుండెను, కొండల చుట్టూ వెతికి ఆమెను కనుగొనియున్నాను. పత్రికలు ఆ సంగతిని వ్రాసియున్నాయి. ఆమె ఏ విధముగా స్వస్థత పొందుకొనియున్నదో, ఆ పత్రికలు వ్రాసియున్నాయి. ఆమె యొక్క కాళ్ళు ఏ విధముగా నిటారుగా అయ్యాయో వ్రాసినవి, ఆ సంఘటన ద్వారా ఆ గ్రామము రేపబడినది. ఆ తరువాత ఆమె స్కూలుకు వెళ్లినది. ఆ స్తీ ఇప్పుడు వివాహము కూడా చేసుకునియున్నది. ఆమెకు ఇప్పుడు సుమారుగా 16 లేక 20 సంవత్సరములు లేక 18 ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆమె ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది. ఆమె దానిని గురించి నాకు చెప్పుచున్నది. మంచిది.
మంచిది, ఆమె యొక్క ముఖమును నేను దర్శనములో చూచియున్నాను. ఆమె కొరకు నేను ప్రార్ధించిన తరువాత బయటకు వచ్చియున్నాను. అంతా మంచిది. కొద్ది వారములు గడిచిన తరవాత నేను ఆమెతో ఈ విధముగా చెప్పియున్నాను… అతడు ఇలాగనెను, “బ్రదర్ బ్రెన్హాం, ప్రభువు నీతో మాట్లాడినట్లయితేనే నీవు రమ్ము.”
నేను, “నేను వస్తాను,” అన్నాను.
నేను వంగియున్నాను. ఆమె దగ్గుచున్నది, ఆ కఫము కప్పును పైకెత్తలేక పోవుచున్నది… [బ్రదర్ బ్రెన్హాం దానిని వివరించుచున్నారు] ఆమె యొక్క తల్లి ఆ కప్పును ఈ విధముగా పైకెత్తును. ఆమె తన యొక్క చేతులను కూడా పైకెత్తలేకపోతున్నది. ఆమె ముఖములో ఎంతమాత్రము మాంసము లేదు, కేవలము ఎముకలు కలిగిన ఒక పుర్రె మాదిరిగా అది కనిపించుచున్నది, ఆమె కన్నుల యొద్ద గుంటలు పడియున్నాయి. ఓ, అది ఎంతో భయంకరముగా ఉన్నది… ఆమె తన చిన్న తలను కూడా త్రిప్పలేకపోతున్నది.
29. నేను వెనుకకు తిరిగి చూసి ఇలాగన్నాను… కొద్ది రోజుల క్రితం ఇక్కడ నేను దిగువున ఉన్నాను, అప్పుడు ఆమె యొక్క ఆ చిన్న పాత మంచమును నేను చూసియున్నాను. దానిని చూపుటకై నన్ను ఆమె తీసుకొని వెళ్లినది. అక్కడ గోడకు ఉన్న రంగును గుండ్రముగా గీకినట్లుగా ఉన్నది, అక్కడనే ఆమే సంవత్సరముల తరబడి మంచములో ఉండి అరుచుచూ, యాచిస్తూ మరియు ఏడ్చుచు, ఆ విధముగా దానిని చేసినది, తన మంచము యొక్క కోడు దగ్గర ఉన్న రంగును గీకివేసినది. ఆమె ఏది చేసిననూ అది ముఖ్యము కాదు గాని, దేవుడు ఆమె యొక్క మొరను వినియున్నాడు, అదే ముఖ్యమైన సంగతి.
తరువాత నేను బయటకు వచ్చాక అక్కడ నేను ఒక కూడికను కలిగియున్నాను. కొద్దిరోజుల తరువాత నేను, శ్రీ. రైట్ గృహము యొద్దకు రాత్రి విందుకై వెళ్ళియున్నాను. ఆ నది ఒడ్డును మేము బాప్తీస్మములు ఇచ్చుచున్నప్పుడు, ఆ దిగువున ఉన్న ప్రజలు నాతో ఇలాగు చెప్పెను… అక్కడ అదే సంఘము యొక్క విశ్వాసులు అనేకమంది నిలబడియున్నారు. నదిలోకి నేను నడిచి వెళ్ళాను. నేను ఇలాగన్నాను, “దేవుని యొక్క దూతలు ఇక్కడ నిలబడినట్లుగా కనిపించుచున్నది.” నేను బాప్తిస్మములు ఇచ్చుట ప్రారంభించాను. అక్కడ ఆ సంఘములో ఉన్న గొప్ప వ్యక్తులలోని వారు ఒకరి తరువాత ఒకరుగా వారు కలిగియున్న మంచి వస్త్రములతోనే నీటిలోకి వచ్చి బాప్తిస్మములు పొందియున్నారు.
అక్కడ దేవుని యొక్క కదలిక ఉన్నది. నీవు ఊరకనే ఉండుము మరియు దేవుని కార్యము చేయనిమ్ము. గమనించారా? అది నిజము. ఆయనయందు విశ్వాసముంచుము; సమస్త కార్యమంతటిని ఆయనే ముగించును.
30. ఆ రాత్రియందే నేను ఎగువకు వెళ్ళియున్నాను. ఆ రాత్రి మేము మా చివరి ఆరాధనను అక్కడ కలిగియున్నాము, శ్రీ. రైట్ తో రాత్రి విందుకై నేను బయలుదేరియున్నాను. మేము ఎగువ ప్రాంతములో ఉన్నప్పుడు నేను ఇలాగన్నాను, “బ్రదర్ రైట్, ప్రార్ధన కొరకు నేను అడవులలోకి వెళ్ళవలసియున్నట్లుగా నాకు అనిపిస్తున్నది. పరిశుద్ధాత్ముడు నన్ను తినవద్దు, ప్రార్ధన చేయమని ప్రేరేపించుచున్నాడు.”
అప్పుడు నేను లేచి, చెట్లలోకి వెళ్ళి మోకరిల్లాను. అప్పుడు మధ్యాహ్నకాలము ముగియవచ్చినది. నేను ప్రార్ధించాను. నేను, నా చేతులను పైకెత్తిన ప్రతిసారి, ముళ్లకంపను తాకుచున్నాను, ఆ ముళ్లకంప యొక్క ముళ్ళు నా చేతులకు గీసుకుంటున్నాయి. నేను మోకరిల్లి ఉండలేనేమో అనే విధముగా నాకనిపించినది… అవి నా మోకాళ్ళను కూడా బాధిస్తున్నాయి; అది ఎలాగున్నదో మీకు తెలుసు. అయిననూ నేను ప్రార్ధిస్తూనే ఉన్నాను. నేను అక్కడే పడిపోయాను.
నేను వెళ్ళుటకు ముందు అతడు ఈ విధముగా నాతో చెప్పెను, “తల్లిగారు ఆ గంటను మ్రోగించినప్పుడు నీవు వెంటనే రాత్రి భోజనమునకు రావలసియున్నది.”
కావున నేను ఆ గంట శబ్దమును విన్నాను, కాని నేను ఆత్మలో ఉన్నాను, ప్రార్ధించుచు నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇంకనూ ఇలాగు ప్రార్ధించుచున్నాను, “ఓ, దేవా, నా హృదయములో ఏదో భారమున్నది? నేను ఏదైనా చేసియున్నానా, లేక ఏదైనా చేయవలెనని నీవు ఆశించుచున్నావా.” దేవుని యొక్క దూత నాకు సమీపముగా ఉండుటను నేను అనుభూతిని చెందిన తరువాత నేను పైకి లేచాను.
అక్కడ ఉన్న ఒక చిన్న దట్టపు పొదలో ఆకుపచ్చని మరియు పసుపు రంగులు మిళితమైయున్న ఒక వెలుగు ఉన్నది. ఒక స్వరము నాతో ఇలాగు చెప్పుట నేను వినియున్నాను, “కార్టర్ యొక్క మార్గములోనికి వెళ్ళుము.”
31. అక్కడ నుండి నేను పైకి లేచి నా గొంతు అంతటితో బిగ్గరగా అరచాను. పొలముల గుండా నేను వెళ్ళియున్నాను. వారు నా కొరకు గుంపులు గుంపులుగా వెదుకుచున్నారు. నేను దాదాపుగా శ్రీ. రైట్ చేతులలోకి దూకియున్నాను. అతడు ఇలాగనెను, “బ్రదర్ బ్రెన్హాం, నీ యొక్క భోజనమును గూర్చి మా తల్లిగారు గంటల తరబడిగా ఎదురుచూస్తున్నారు. మన ముగింపు ఆరాధనకు ఆలస్యముగా వెళ్ళవలసి వస్తుంది.”
నేను ఇలా అన్నాను, “మనము భోజనమునకు వెళ్ళటలేదు. కాని ఈ రాత్రి, ”యెహోవా ఈలాగు సెలవిచ్చెను,“ జార్జీ కార్టర్ లోని ప్రతి అణువు కొద్దిసేపటిలో స్వస్థపడుతుంది.”
అతడు, “బ్రదర్ బ్రెన్హాం, దాని యొక్క అర్ధము అదియేనా? అది దేవుని వద్దనుండి వచ్చినట్లయితే, అప్పుడు ఈ గ్రామమంతా దేవుని వైపు తిరుబోతున్నదా?” అనెను.
నేను, “యెహోవా యొక్క దూత ఇలాగు సెలెవిచ్చెను,” ఈ భూమి మీద నేను జన్మించినది మొదలుకొని ఇప్పటి వరకు నాకు పోషకునిగా ఎవరున్నారో, ఆయన నాతో ఎన్నడు నాతో అబద్దమాడలేదు, మరుసటి ఘడియలో జార్జీ కార్టర్ అనే స్త్రీ స్వస్థత పొందబోతున్నది.“
అప్పుడు ఆ కొండ మీద ప్రజలు గుమికూడుట ప్రారంభించగా, అందులో ఇద్దరు వ్యక్తులు ఇలాగనుచున్నారు, “పదండి చూద్దాం.”
32. అదే సమయములో, ఆమె యొక్క సమస్యాత్మకమైన తల్లిగారు… ఎందుకనగా ఆమె యొక్క తల్లి , నా యెడల ఏ విధముగా ప్రవర్తించియున్నదో దానిని బట్టి జార్జీ ఏడ్చుచున్నది మరియు ప్రార్ధించుచున్నది. ఆమె యొక్క తల్లి వంట గదిలోకి వెళ్ళి మోకరిల్లి ప్రార్ధిస్తున్నది. ఆమె ఇలాగనుచున్నది, “ఓ, దేవా, బ్రెన్హాం అనే భ్రష్టుడు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చియున్నాడు, అతడు మా కుమార్తె హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, ఈ దినమున ఇక్కడ పడుకొని ఉన్న దీనురాలైన నా కుమార్తె మరణించబోచున్నది. ఆమె ఇప్పుడే ఏడ్చుట వలన ఆమె కన్నులు ఎర్రనివిగా మారినవి. అతడు ఏదో మనస్తత్వ శాస్త్రము చేత ఆమెను రేపియున్నాడు. ఓ దేవా, ఆ వ్యక్తిని శపించుము, లేదా అతడిని ఏదైనా చేయుము.” ఆ విధముగా ఏదో అనుచూ, “ఓ…” అని ప్రార్ధించుచున్నది.
మరియు ఆమె ప్రార్ధించుట ప్రారంభించగానే, అవతల ద్వారము వద్ద ఉన్న తన కుమార్తె మరణిస్తుందని ఆమె తలంచియున్నది. ఆ ఛాయను ఆమె గోడ మీద చూసియున్నది. ఆమె దానికి అనుమతిని… (ఆమెకు మీరు వ్రాసినప్పుడు ఆమె యొక్క సాక్ష్యమును గమనించుము…) ఆ గోడ మీద నుండీ యేసు నడచి వచ్చుటను ఆమె తన జీవితంలో అత్యంత స్పష్టముగా చూశానని చెప్పినది. దానిలో నుండి ఆయన వచ్చియుండెను. “నేను అభిషేకించినవారిని ముట్టవద్దు.”
ఆమె “వచ్చుచున్నది ఎవరు?” అని చూసినప్పుడు, నేను వస్తున్నాని ఆమె చెప్పినది. ఇదే పరిశుద్ధ గ్రంథమును నేను ఈ విధముగా నా హృదయము మీద ఇలాగు పట్టుకొని వస్తున్నాను. నా నుదుటి మీద నేను పలుచని వెంట్రుకలు కలిగియుండుటను కూడా ఆమె చూచినది. ఆమె ఇలాగన్నది, “బహుశా, అతడే ప్రసంగికుడు.” ఆమె దిగ్గున లేచి ఇలాగన్నది, “ఓ దేవా, దయచూపుము. నేను ఏదైనా పరవశతలో ఉన్నానా, లేక ఏమి జరుగుచున్నది? నేను నా మనస్సు నియంత్రణ కోల్పోవుచున్నాను.”
ఆ గదిలోకి ఆమే పరుగెత్తుకుంటూ వచ్చి, “జార్జీ, ఏమిటో నీకు తెలుసా?” అని అన్నది.
33. ఆ సమయములోనే ద్వారము మూసుకున్నది. ఆమె చూసిన దర్శన విధానములోనే నేను వచ్చియున్నాను. ఇద్దరు వ్యక్తులు నన్ను వెంబడించుచుండగా, నేను ఈ విధముగా హృదయము మీద పరిశుద్ధ గ్రంథమును ఉంచుకొని వచ్చాను. ఓ, మై.
అప్పుడు పాతాళములో ఉన్న ఏ ఒక్క దెయ్యము కూడా దానిని ఆపలేదు. దేవుడే దానిని పలికెను; ప్రార్ధనకు సమాధానము ఇవ్వబడినది. ఇది నిజము. అక్కడ ఏదో జరుగనైయున్నది.
నేను ఎగువకు నడుచుట ప్రారంభించియున్నాను, బ్రదర్ హాల్ నాతో ఈ విధముగా చెప్పుచున్నాడు, “బ్రదర్ బ్రెన్హాం, నేను మొదటగా వెళ్ళాలని మీరు భావించుచున్నారా?”
నేను ఏమియూ చెప్పలేదు. స్నేహితులారా, ఈ రాత్రి మీ సోదరుడు ఇక్కడ ఉన్నట్లుగా, నన్ను ఏదో విడిచిపెట్టి వెళ్ళుటను అనుభూతిని చెందాను, అప్పుడు నేను ఆ మెట్లను ఎక్కుచున్నట్లుగా నాకు అనిపించినది.
34. నేను ఆ ద్వారము దగ్గరకు వెళ్ళి, ఆ ద్వారమును తెరిచాను. అక్కడ దీనురాలైన ఆ చిన్నది పడుకొనియున్నది. ఆమె యొక్క పెదవులు వణుకుతున్నాయి. ఆమె యొక్క తల్లి జరిగినది, చెప్పుట ముగించే లోపునే నేను లోపలికి వెళ్ళుటచేత ఆమె ఉలిక్కిపడినది. నేను నేరుగా ఆమె యొక్క మంచము వద్దకు వెళ్లి, నా చేతులను ఆమె మీద ఉంచి, ఇలాగన్నాను, “జార్జీ, ఒక దర్శనములో అడవిలో చిక్కుకున్న ఒక గొర్రెపిల్లను నాకు ఇక్కడే ఈ దిగువున యేసుక్రీస్తే చూపించెను, తిరిగి అది నాకు ఈ దినమున చెట్లలో మరలా కనిపించినది. నన్ను నీ యొద్దకు ఆయనే పంపి, నా చేతులను నీ మీద ఉంచుట ద్వారా నీవు స్వస్థతను పొందుకుంటావని చూపించెను.”
నా చేతులలోకి ఆమె తీసుకొని ఇలాగన్నాను, “ప్రభువైన దేవుడే నాతో చెప్పిన విధముగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో పూర్తిగా స్వస్థపడి పైకి లెమ్ము.”
ఏ విధముగా ఆమె పైకి లేస్తుంది, ఆ అవయవాలు ఇంత పెద్దవిగా ఉన్నాయి, తొమ్మిది సంవత్సరముల ఎనిమిది నెలల నుండి కదలక మంచములో పడియున్నది. ఏలాగు పైకి లేస్తుంది? కాని దేవుడు పలికినప్పుడు ఆయనే శక్తిని ఇచ్చును. అది నిజము.
నా చేతులతో ఆమెను పట్టుకున్నాను… ఆమె, నన్ను ఈ విధముగా చూసినది, ఆమె కనులు ఆ విధముగా నిలిచినవి. ఆమె చేతిని పట్టుకొని నేను ఆమెను మంచము మీద నుండి పైకి లేపాను. కొద్దిసేపటిలోనే ఆమె ఆ గదియంతా నడుస్తున్నది. ఆమె అరుస్తున్నది. ఆమె యొక్క తల్లి క్రిందపడి, చల్లగా గడ్డకట్టిన మాదిరిగా మూర్ఛిల్లినది.
ఆ బాలిక ద్వారమును తెరిచి బయటకు నడిచి, గడ్డిలో కూర్చుని ఆ గడ్డిని మరియు ఆకులను దీవించుట ప్రారంభించినది. ఆమె యొక్క చిన్న హృదయము దీవింపబడును గాక. తొమ్మిది సంవత్సరముల తరువాత ఆమె మొదటిసారిగా, ఆ గడ్డిని మరియు ఆకులను చూస్తున్నది. ఆమె మంచము మీద ఉన్నప్పుడు ఇరుగు-పొరుగు వారు అక్కడ నుండి దూరముగా వెళ్ళిపోవుట ప్రారంభించియున్నారు.
35. నేను బయటకు వచ్చి కొండపైకి ఎక్కుతూ చర్చివైపు నడుస్తున్నాను. అభిషేకము నన్ను అక్కడ నిలబడనీయుటలేదు ఆ పరిసర ప్రాంతమంతా దీవించబడినది. కొండ పైకి ఎక్కుట ప్రారంభించాను…
ఆమె పరుగెత్తుకుంటూ తిరిగి గృహములోకి వెళ్లి పియానో వద్ద కూర్చున్నది. కొద్దిసేపటి తరువాత ఆమె యొక్క తండ్రి తన చేతిలో ఒక బకెట్ నిండుగా పాలను తీసుకొని కొండ అవతలవున్న వారియొక్క పాడియొద్ద నుండి వచ్చెను. వచ్చుచుండగా, అతడు ఆ సమూహమును చూచెను. ఆ యొక్క సంగీతమును వినుట అతడు ప్రారంభించెను. అతడు ఇలాగనెను, “ఎమిటిది? ఎవరో వచ్చినట్లున్నారు? అక్కడ ఉన్న ప్రజలయొద్దకు వెళ్ళి వింటాను.” ద్వారము యొద్దకు అతడు నడచి వచ్చినప్పుడు, అక్కడ తన ఏకైక కుమార్తె కూర్చుని పియానోని వాయించుచున్నది,
సిలువకు సమీపముగా యేసు నన్ను నడిపించెను,
ఒక ప్రశస్తమైన ఊట అచ్చట ఉన్నది,
ఆ స్వస్థతా ప్రవాహము అందరికి ఉచితమే,
ఆ ఊట కల్వరియొద్ద నుండి పారుచున్నది.
అతడు అక్కడ కూర్చుని తన బకెటిని క్రిందకు జారవిడచి, తన కుమార్తె చుట్టూ చేతులు వేసి ఇలాగనెను, “హనీ, ఏమిటది?”
ఆమె ఇలాగన్నది, “నీవు ఎవరినైతే భ్రష్టుడు అని అన్నావో, ప్రభువైన యేసే అతడిని పంపించియుండెను. అతడు తన చేతులను నా మీద ఉంచెను మరియు ఆ తరువాత నేను స్వస్థత పొందుకున్నాను.”
మిల్-టౌన్ లోని బాప్టిస్టు సంఘములో ఈ దినమున ఆమెయే నా పియానో వాయిద్యకారిణి. ఈ రాత్రి ఈ భవనములో కూర్చునియున్నవారి మాదిరిగానే, ఆమె కూడా పరిపూర్ణమైన మంచి ఆరోగ్యముతో ఉన్నది. ఆమెకు వ్రాసి మీరు కనుగొనవచ్చును.
36. ఆమె కొరకు ఎదురుచూస్తున్న వైద్యుడు ఇక్కడకు పైకి వచ్చెను… [టేపు పై ఖాలీ ఉన్నది.]… యేసుక్రీస్తు. ఆమేన్. [టేపు పై ఖాలీ ఉన్నది.]
అప్పుడు ఏ విధమైన ఘనతను ఆయన కలిగియుండెనో, ఈ రాత్రి కూడా దానినే ఆయన కలిగియుండెను. చూడండి, ఇక్కడున్న ప్రజలకు ఇది వింతైన కార్యముగా అనిపించవచ్చును. బహుశా మీకు అలాగ అనిపించకపోవచ్చును… [టేపు పై ఖాలీ ఉన్నది.] …?… వాయుమండలము యొక్క అధిపతి. సాతాను ఎల్లప్పుడు నీ మనస్సులో దేని గురించో తడబాటును తీసుకొనివచ్చును. కాని ఈ రాత్రీ, నీ యొక్క ఆసక్తిని పైన ఉన్నవాటి మీద ఉంచుము, దేవుని కుడి ప్రక్కన ఎక్కడైతే క్రీస్తు ఉండెనో, అక్కడే నీ యొక్క ఆసక్తిని ఉంచుము. మరియు పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నదని జ్ఞాపకముంచుకో, “ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.” ఒకవేళ ఆయన యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నట్లయితే, గతించిపోయిన దినములలో ఆయన ఏ విధముగా కార్యములని బయలుపరచియుండెనో, అదేవిధముగా ఇప్పుడును బయలుపరచును. భూమి మరియు ఆకాశములు గతించినా, కాని ఆయన మాటలు గతింపవు. సందేహించక, దేవునియందు విశ్వాసముంచుము.
37. జార్జీకు వ్రాయండి. దాని కొరకు ఆమెను అడగండి. ఆమె గురించే మాత్రమే కాదు, నేను ఇక్కడ నిలబడి గత నాలుగు సంవత్సరములలో జరిగిన ఇటువంటి అనేకమైన కార్యములను గూర్చి తెల్లవారే వరకు మీతో మాట్లాడగలను. ప్రతి దినము అవి ఎలాంటి విఫలమును చెందకుండా జరుగుతున్నాయి.
ఇప్పుడు దేవుడు ఇక్కడే వున్నాడు. నీ యొక్క ప్రవర్తన… వారి హృదయమంతటితో ప్రభువుని విశ్వసించమని వారితో చెప్పుము. దేవుడిని పొందుకొనుము. అంతా మంచిది. ప్రార్ధన చేద్దాం.
ఓ తండ్రీ, ఓ, నా పెదవులు కేవలం మాటలను మాత్రమే పలుకును, నా నాలుక నీకై ఘనమైన స్తుతులను చెల్లించును. ప్రభువా, జార్జీ గురించి నీకు తెలుసు. ఆ సంగతి అంతటి గురించి నీకు తెలుసు. ప్రభువా, నీ సేవకుడు చెప్పేది నిజమని నీకు తెలుసు. ఒకవేళ నేను ఆబద్దమాడినట్లయితే, ఆ గొప్ప తీర్పు దినమున ఈ ప్రజలముందు నేను నిలబడి, నీ యొద్ద నేను లెక్క అప్పచెప్పవలసియున్నది. అప్పుడు నేను విసరివేయబడతాను, ప్రియమైనవారి నుండి నేను దూరమైపోతాను, యేసు నుండి నేను దూరమౌతాను, ఏ ఆశా ఉండదు, అన్నియు ఖండించబడతాయి. ఓ దేవా, నేను ఆ విధముగా చేయాలని అనుకోవటంలేదు. నేను నిజాయితీగాను మరియు నమ్మకముగాను ఉండాలని ఆశపడుచున్నాను.
ఈ లోకములో అవిశ్వాసమున్నదని నాకు తెలుసు. ఈ చివరి దినములలో ద్రోహులు, మూర్ఖులు, గార్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు పైకి లేస్తారని నీవు ముందుగానే తెలియచేశావు. వారు ఒక మతపరమైన గుంపుగా ఉందురు, పైకి భక్తిగలవారై ఉంటారు, కాని దేవుని యొక్క శక్తిని నిరాకరిస్తారు. దాని నుండి తిరుగుము. ఈ చివరి దినములలో ఈ విధమైన సూచనలు కనిపించునని ఆత్మ దానిని గురించి బయలుపరచెను.
38. తండ్రి, మేము ఇక్కడ సంతోషముగా ఉన్నాము, నీ శిష్యులు నీ నామ నిమిత్తమైన నిందను మోసియున్న విధముగా మేమును చేయుచున్నాము. ఈ రాత్రి ఆ వృద్ద పౌలు ఈ విధముగా సాక్ష్యమిచ్చుచున్నట్లుగా, “వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి యెదుట ఒప్పుకొనుచున్నాను.” మేమును ఒప్పుకొనుచున్నాము. దయ్యము దీనిని మతభేదమని, పిచ్చితనమని, వెర్రితనమని నరాల బలహీనతని చెప్పుచున్నది, దేవుని యొక్క ఆ నిజమైన… ఈలాగు చెప్పు నిమిత్తనము తన పనివారిని సాతాను ఏర్పరుచుకున్నాడు, కాని నీవును, నీ పనివారిని కలిగియున్న కారణముచేత మేము మీకు వందనస్తులమైయున్నాము. నీవైపున వుండి నీ కార్యములన్నింటిని విశ్వసించుటచేత ఈ రాత్రి మేము సంతోషిస్తున్నాము. మీరు మాతో ఉండి, సూచనల ద్వారా మరియు అద్భుత కార్యముల ద్వారా వాక్యమును రుజువు పరుస్తున్న విధానమును బట్టి మేము సంతోషిస్తున్నాము. ప్రభువా, ఈ ప్రజలను చూడనిమ్ము, తమ యొక్క దుర్మార్గత నుండి నిత్యమైన ఆలస్యము రాకమునుపే వారు ఈ రాత్రే కీస్తు వైపుకు త్రిప్పబడదురు గాక. వారు ఈ భూమి మీదనుండి కొట్టబడి దెయ్యము యొక్క పాతాళములోకి వెళ్ళకముందే త్రిప్పబడుదురు గాక. క్రీస్తులేని సమాధులలో వారు దేవుడు లేకుండా అంతములేని నిత్యత్వమును గడుపుటకు ముందుగానే త్రిప్పబడదురు గాక. ఆశ అనేదే లేకుండా, కరుణ అనేదే లేకుండా గడుపుటకు ముందుగానే వారు త్రిప్పబడదురు గాక. మారుమనస్సును పొందు దినము ఈ దినమే అయ్యున్నది. ఇది మనష్యుని యొక్క దినమైయున్నది. ప్రభువు యొక్క దినము రాబోవుచున్నది.
దేవా, ఇప్పుడు మాకు సహాయము చేయుము. ఈ రాత్రి నీ సంతానములో అనేకమైన బలహీనులు ఇక్కడ కూడియున్నారు. ఆ సీమోను కాలములో నీవు ఏ విధముగా వారి మధ్యన కదలియున్నావో, ఒక ఉద్దేశ్యము నిమిత్తము వారిని స్వస్థపరచియున్నావో, ఆ విధముగా మా మధ్యన కదలాడుము. తండ్రి, వారు విశ్వాసమును కలిగియుండుటకు సహాయము చేయుము. వారియొక్క విశ్వాసము మరియు మా అందరి యొక్క విశ్వాసము కలసి ఒక్కటే విశ్వాసముగా మారి, ఒక్కటగునట్లుగా సహాయము చేయుము. ఆగిపోకుండా మా ప్రార్ధనలు నిరంతరము జరుగునట్లుగా సహాయము చేయండి… జాన్ మార్కు యొక్క గృహములో ఆగిపోకుండా ప్రార్ధించిన విధముగా, మీ యొక్క దూతను మీరు క్రిందకు పంపించి, చెరసాల ద్వారమును తెరిచి ఆ అపోస్తలుడిని బయటకు తోడ్కొనివచ్చారు.
నీ పిల్లలలో అనేకమంది బాధలు, బలహీనతలు మరియు వ్యాధులు అనే చెరసాలలో బంధీలుగా ఉన్నారు. నీ యొక్క సేవకుని మీదకు దేవుని యొక్క దూత దిగివచ్చి ప్రతి యొక్క సంకెళ్లను ఛేధించును గాక. ప్రభువా, దానిని మాకు దయచేయుము. మేము కూడా సంతోషముతో, ఆనందముతో, ఆయన యొక్క మంచితనము నిమిత్తము దేవుని స్తుతించుచూ, ఈ పట్టణపు గుమ్మములు దాటుదుము గాక. ఆయన కుమారుడును పవిత్రుడునైన యేసు నామములో ఈ ఆశ్వీరాదమును అడుగుచున్నాము. ఆమేన్.
39. సందేహించక విశ్వాసమును కలిగియుండుము. నేను చాలా ఎక్కువ సమయమును తీసుకొనియున్నాను. నన్ను క్షమించండి. ఇక్కడ నేను నిలబడియుండగా, నాకు తెలిసినది ఏమిటంటే మీలో అనేకమంది వరుసలో నిలబడలేదని… వారికి అక్కరలేదు అని అనుకున్నప్పుడు, ఎందుకు? మీకు దేవుని యొక్క వాక్యము మీద విశ్వాసమున్నప్పుడు, మీరు ఎక్కడ ఉన్నను స్వస్థతను పొందుకుంటారు.
ఓ స్త్రీ, నీవు దానిని నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? చిన్న బిడ్డతో ఉన్న ఆ స్త్రీ, నీవు సమస్యలో ఉన్నావు, సహోదరి నీవు అలాగులేవా? నీ హృదయమును దేవుడు దీవించును గాక. కలత చెందిన ఆత్మను నీవు కలిగియుండుట నేను చూస్తున్నాను. అది సత్యము కాదా? ఇటువైపు చూడుము సోదరి. నీ నిమిత్తమై నేను చింతిస్తున్నాను. అవును, నీవు నీ నిమిత్తము కాదు, నీ బిడ్డ నిమిత్తము చింతిస్తున్నావు. అది సత్యము కాదా? కొద్దిసేపటి క్రితం నీవు ప్రార్ధించటమే లేక మరేదో చేస్తున్నావు, అది నీ కొరకు కాదు? నీ బిడ్డ నిమిత్తము నేను నీతో మాట్లాడాలని నీవు దేవున్ని అడుగుచున్నావు. అది సత్యము కాదా? నేను నీ మనస్సుని చదువుటలేదు, కొద్దిసేపటి క్రితం నేను అటువంటి అనుభూతిని చెందియున్నాను… ఆ మూలన ఉన్న ఆ గుంపు అంతా ప్రార్ధిస్తున్నది. నీ బిడ్డకున్న సమస్య ఏమిటి? కల్వరిలో యేసు మరణించినప్పుడే నీ బిడ్డను ఆయన స్వస్థపరచెనని నీవు గుర్తెరిగియున్నావా? ఆ యొక్క వెలను ఆయన చెల్లించెను.
ఇప్పుడు, నీ బిడ్డకు ఉన్న సమస్య ఏమైయున్నది… నీ బిడ్డకు సుమారుగా ఎనిమిది సంవత్సరముల వయస్సు ఉన్నదని నేను అనుకుంటున్నాను. అది సత్యము కాదా? మరియు అది ఎదుగుట మానివేసినది, దాని వలన ఎటువంటి ఉపయోగము లేదు. అది సత్యము కాదా? నీవు నన్ను నమ్ముచున్నావా? అదంతా సరియే. నీవు నమ్మినట్లయితే, ఇప్పుడే దాని యొక్క స్వస్థతను పొందుకొనుము.
ఆ బిడ్డను ఇప్పుడు ఏదియు పట్టుకొనిలేదు. కేవలం ఆ బిడ్డను ఇప్పుడు తల్లి మాత్రమే తన చేతులతో పట్టుకొనియున్నది. అది ఆమె నుండి తన చేతులను తీసివేసినది. మనమందరము “ప్రభువుకు స్తోత్రములు,” అని చెబుదాం. ఆ బిడ్డ ఇప్పుడు తిరిగి మామూలుగా అయినది. ప్రతియొక్కరు భక్తిపూర్వకముగా ఉందాము.
40. నీ ప్రక్కన ఉన్న ప్రియమైన ఆ చిన్న బాలికా, బ్రదర్ బ్రెన్హాం నీతో నిజమే చెప్పుచున్నాడని నీవు విశ్వసిస్తున్నావా, అదిగో అక్కడ నీ కళ్లలో సమస్యను కలిగియున్న చిన్న బాలికా – నీవు విశ్వసిస్తున్నావా? యేసు నిన్ను స్వస్థపరుచబోవుచున్నాడని, నీవు విశ్వసిస్తున్నావా? నీవు అది చేయగలవా? మంచిది. నీ చిన్న చేతిని నీ కనుల మీద ఈ విధముగా ఉంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇలాగనుము, “ప్రియమైన యేసు, నన్ను స్వస్థపరచుము.” హనీ, దేవుడు నిన్ను దీవించును గాక; నీవు నీ కంటి చూపుని పొందుకొందువు.
ఆమె ప్రక్కనే చేతిరుమాలు పట్టుకొని కూర్చున్న స్త్రీ నీవు దేనిని గురించో చింతించుచున్నావు? మంచిది. సోదరి, ఈ వైపుకు చూడుము. నీలో ఏదో సమస్య ఉన్నది. అవును, నీకు కూడా కళ్ళలో సమస్య వుంది, నీవు బలహీనతలో ఉన్నావు. నీకు అలాగునలేదా? ఒక నిజమైన… దయ్యపు ఒత్తిడిలో ఉన్నావు? అది సత్యము కాదా? ప్రతి సమయములోను నీవు అణచివేతకు గురియగుచున్నావనే బలహీనతలో ఉన్నావు. అది సత్యము కాదా? దేవుడు నిన్ను దీవించును గాక. నీవు స్వస్థతను పొందుకున్నావని నేను చెప్పినట్లయితే, నీవు నన్ను విశ్వసిస్తావా? మంచిది. నీవు స్వస్థత పొందుకొనియున్నావు, గృహమునకు వెళ్ళుము. దేవుడు నిన్ను దీవించును గాక.
41. సోదరి, నీవేమి ఆలోచిస్తున్నావు? నీవు ఆలోచిస్తున్నావు? నీకు సమస్యలు కూడా ఉండుటను నేను చూస్తున్నాను, నీకు సమస్యలు లేవా? ఇప్పుడు ప్రతియొక్కరు భక్తిపూర్వకముగా ఉందాము. ఇవి కదులుతున్న ఆత్మలు, అక్కడ కూర్చొనియున్న ఆ చిన్న బాలుడు నన్ను బయటకు లాగుచున్నాడు. ప్రతియొక్కరు ఇప్పుడు మీరు ఉండగలినంత భక్తిపూర్వకముగా ఉండమని నేను కోరుచున్నాను.
సోదరి, ఇక్కడ చూడుము. నీవు దేనిని గురించో కలత చెందుచున్నావు, అది ఏదో చెడ్డదైయున్నది, ఎందుకనగా నీ చుట్టు దట్టమైన చీకటి కమ్మియున్నది. నీవు ఈ మధ్యనే వైద్యురాలవైయున్నావు, నీవు వైద్యురాలివి కావా? ఈ మధ్యనే నీవు పరీక్షలు వ్రాసియున్నావు. ఇప్పుడు మనము చూద్దాం. విశ్వాసము కలిగియుండుము. నీ హృదయమంతటితో నీవు నన్ను నమ్ముము. అవును. నీకు స్త్రీల సంబంధిత సమస్యయున్నది. అతడికి పూర్తిగా దానిని గురించి తెలియదు, అతడు నిజమే చెప్పెను. అతడు అది… కాన్సరుయై ఉండవచ్చని చెప్పెను. అది నిజమేనా? మంచిది. అవును, లేక అదేమైయున్నది. ఇప్పుడు నీవు స్వస్థతను పొందుకొనియున్నావు. ఇప్పుడు ఈ వైపున చూడుము. నీవు దానిని నమ్ముచున్నావా?
దయచేసి ప్రతియొక్కరు భక్తిపూర్వకముగా ఉండండి. దయచేసి ఎవరు భక్తి లేకుండా వుండవద్దు.
త్వరగా, అక్కడేదో… అక్కడ ఏదో సంబంధమున్నది… అయ్యా, మీరే, మీ చేతిలో “స్వస్థపరచు స్వరము” అను దానిని కలిగియుండి మొదటి వరసలో కూర్చునియున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్త్రీకి మరియు మీకు ఏదో సంబంధమున్నది. ఆమె అలాగున్నప్పుడు మీరు ఎంతో సంతోషముగా ఉన్నారు… బహశా ఆమె మీకు… సోదరిగాని లేక భార్యగాని అయ్యుండవచ్చును. ఆమె, నీ యొక్క భార్యయేనా? అది నిజము. నీవు కూడా చింతను కలిగియున్నావు. ఒకప్పుడు కలిగియున్నావు. నీవు మరియు నీ యొక్క భార్య మీ గృహమునకు వెళ్ళి సంతోషముగా ఉండండి, నీవు స్వస్థపడియున్నావు.
42. సోదరీ, అక్కడ కూర్చుని విలపిస్తున్న నీ సంగతి ఏమిటి? నీకు నరముల బలహీనత ఉన్నది. అది సత్యము కాదా? మంచిది. నిన్ను కూడా దేవుడు స్వస్థపరిచెను.
ఆ చిన్న బాలిక వెనుక ఉన్న హనీ, నీవు దేనికొరకు నీ తలను వంచియున్నావు. నీవు కూడా అనేకమైన సమస్యలలో ఉన్నావు, లేవా? హు? గొంతుకు సంబంధించిన సమస్యయేనా, కాదా? ఆపరేషన్ చేయించుకొనుటకై నిర్ణయించుకున్నావు, అది నిజమేనా? నీవు ఆపరేషన్ కొరకు సిద్దపడియున్నావు. వారు నీ యొక్క గొంతునకు ఆపరేషన్ చేయబోచున్నారు. అది సత్యము కాదా? మంచిది. ప్రభువు నిన్ను ఇప్పుడే స్వస్థపరచారని నమ్ముము. నీవు దానిని చేయగలవా?
దేవునియందు విశ్వాసము కలిగియుండుము. ఆయన స్వస్థపరచుటకే ఇక్కడకు వచ్చెను.
ఇప్పుడు, ఒక్క నిముషము. ఇక్కడ ఎవరో ఎంతో భయంకరముగా బాధపడుచున్నారు. కేవలం ఒక్క నిముషము మాత్రమే. ఇక్కడ చాలామంది యున్నారు, నేను చెప్పలేను. అది ఏమైయున్నప్పటికి. కొన్ని క్షణములు.
అవును, పువ్వులు కలిగియున్న నల్లరంగు దుస్తులు వేసుకొని కూర్చునియున్న ఆ స్త్రీ, ఇదిగో ఇక్కడ వున్నది. సోదరీ, నీవు సమస్యలతో బాధించబడుతూ లేవా? అది సత్యము కాదా? అది సత్యమేనా? మంచిది. ఈ వైపు చూడుము. అవును సోదరి. నీకు ఏదో జరిగియున్నది… కణుతులు నీవు పూర్తిగా కలిగియున్నావు (అది నిజము కాదా?) కణుతులు లేక అటువంటిది ఏదో నీవు కలగియుండలేదా? నిలబడుము. అది నిజము కాదా? సోదరి, ఆ కణితి నిన్ను వదిలి వెళ్ళిపోయినదని దేవునియందు విశ్వాసము కలిగియుండుము. నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముచున్నావా? గమనించుము…?… సోదరి, ఇప్పుడు నీకు మంచిగా అనిపించుటలేదా, ఇక్కడనే కుర్చి ప్రక్కనే ఉన్న నీకు అలాగు అనిపించుటలేదా? అవును అమ్మగారు, ఇక అది ముగిసిపోయినది. నీవు స్వస్థపడబోచున్నావు.
43. ఓ స్త్రీ, నీ యొక్క స్నేహితురాలు అక్కడ కూర్చుని నీతో మాట్లాడుచున్నది. నేను ఎందుకని నిన్ను పిలువలేదా అని నీవు ఆశ్చర్యపడుచున్నావు, అలాగు లేదా? అది ఆ విధముగానే ఉన్నది. నీవు ఆశ్చర్యపోచున్నావు. నీ మనస్సును నేను చదువుటలేదు, కాని నేను నిన్ను ఎందుకని పిలువలేదా అని నీవు ఆశ్చర్యపోచున్నావు. సోదరి, ఇంకనూ నీ లోపల ఏ సమస్య ఉన్నదో నేను చెప్పలేను. నీ కాళ్ల మీద నీవు లేచి నిలబడగలవా? నీ హృదయమంతటీతో నీవు దానిని నమ్ముము. గమనించుము, నీకు పైగా ఎక్కడ నుండో వేగముగా వచ్చుచున్న ఆ తరంగములను నేను పట్టుకొనలేకపోతున్నాను… కొద్దిసేపు ఆగుము. నీ చేతిని ఇలాగు పట్టుకొనుము. దానిని గురించి నేను పూర్తిగా ఎరుగను. నీ రెండు గుప్పిళ్ళను ఈ విధముగా నీ వెనుకకు పెట్టుము… ఇదిగో ఈ విధముగా నేను చేసినట్లుగా ఇలాగు చేయుము. తరువాత నీవు వాటిని తాకుము, ఇది నీ యొక్క కాలేయమైయున్నది. అది నిజము, కాదా? అది నిజము. అది మీ యొక్క మూత్రపిండాలో లేక కాలేయమో నాకు తెలియదు. మంచిది. సోదరీ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను. వెళ్ళి ధైర్యముగా ఉండుము…?… దేవుని కొరకై…?… “
44. దేవునియందు విశ్వాసము కలిగియుండుము. ఆ భవనములో ఇంకనూ ఎన్ని ప్రార్ధనా కార్డులు కలిగియున్నారు?
అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. అది నీకు జరుగును గాక… మంచిది. నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముచున్నావా?
ఎంతమంది దానిని నమ్ముచున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? మనము ఇప్పుడు, ఉత్తేజితులు కావద్దు, భక్తిపూర్వకముగా ఉందాము. మనము దానిని కలిగియుందాము… ప్రభువు యొక్క ఆత్మ కదలిక మూలముగా నేను ఏ నిర్ణయమును తీసుకొనలేకపోతున్నాను. చాలామంది ప్రార్ధనా వరుసను కలిగియుండాలని ఆశిస్తున్నారు, మరియు అనేకమంది ఇప్పుడే ప్రార్ధన కావాలని ఆశిస్తున్నారు. అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. మంచిది. కొద్దిసేపు భక్తిపూర్వకముగా ఉందాము.
ప్రభువు యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నది. మీ హృదయమంతటితో దానిని విశ్వసిస్తున్నారా? ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. మీయంతట మీరు దేవునికి సమర్పించుకోవాలని అనుకుంటున్నారా, మధురముగా అయనకు మిమ్ములను మీరు సమర్పించుకొనుము, మిమ్ములను ఆయన నడిపించాలని…?…
45. ప్రార్ధన చేద్దాం. పరలోకపు తండ్రి, మీకు సమస్తము తెలుసు, ఏది సరియైనదో మరియు ఏది కాదో మీకు తెలుసు, మీరు ఏమైయున్నారో మీకు తెలుసు. దేవా, ఇక్కడున్న ప్రజలకు ఇప్పుడే దీవెనలను దయచేయుము. ఇక్కడున్న ప్రజల మీద మీ ఆత్మ కుమ్మరింపబడును గాక. తండ్రి, ఇప్పుడే మీరు దీనిని చేయుము. ప్రియమైన దేవా, మేము ప్రార్ధనా వరుసను కలిగియున్నప్పుడు ఎవరైనా వేదిక మీదకు వచ్చుచునప్పుడు దానిని దయచేయమని మా హృదయమంతటితో మేము అడుగుచున్నాము. ప్రభువా, కేవలం మీరు ఇక్కడున్నారని మేము నమ్మవలసియున్నది. నీ యొక్క అభిషేకము నీ సేవకుడి మీద అలలవలె వచ్చి, పక్షవాతము వచ్చి క్రిందపడుచున్నవానిగా చేయుచున్నది. ఓ యేసు, ఇక్కడున్న ఈ ప్రజలను అది తాకినప్పుడు వారు స్వస్థతను పొందుదురు గాక. ప్రభువా దానిని మాకు యేసుక్రీస్తు ద్వారా దయచేయము.
ఓ, మీరందరు… దయచేయము, నా ప్రియమైన సాహోదరీ మరియు సూదరుడా, నేను ఒక సేవకుడినని నమ్ముము. ఈ భవనములో స్వస్థత పొందనిది ఏదీ ఉండదు. దానిని నీవు నమ్ముచున్నావా…
46. ఇక్కడున్న వారిలో ఇప్పుడు ఎంతమంది మీ స్వస్థతను అంగీకరిస్తున్నారు. ఇలాగనుము, “ఇప్పటి నుండి, దేవుని యొక్క కృప చేత, నేను స్వస్థతను పొందుకున్నాను.” గృహమునకు వెళ్ళి ఇలాగనుము, “క్రీస్తు వలన నేను బాగుపడియున్నాను.” మీ స్వస్థతను అంగీకరించినవారు, ఇప్పుడే, మీ పాదముల మీద లేచి నిలబడుము. అది నిజము. ఆమేన్. అది ఆ విధముగా చేయవలసియున్నది. హల్లెలూయా.
ఓ దేవా, మీ యొక్క కరుణకు నేను ఏ విధముగా కృతజ్ఞతలు తెలియచేయగలను, ప్రభువా, అది నాకు తెలియదు…?… ఎంతోకాలము లేదు. వారి స్వస్థతను అంగీకరించు ఆ ఘడియ ఇదియే.
ఓ దెయ్యములారా, మీ యొక్క శక్తిని మీరు కోల్పోయారు. మీ యొక్క నియంత్రణను మీరు కోల్పోయారు. ఇప్పుడు మీరు బయట ఉన్న చీకటిలోకి విసరివేయబడ్డారు, ఈ పట్టణమంతా మరియు ఈ దేశమంతా దేవుని యొక్క మహిమతో నిండియున్నదని మీరు తెలుసుకొనెదరు, ప్రభువైన యేసే ఈ ప్రజలను స్వస్థపరిచెనని తెలుసుకొనెదరు.
తండ్రి, మీకు కృతజ్ఞతలు. ప్రభువా, మీకు కృతజ్ఞతలు.
మీ స్వస్థతను అంగీకరించినవారందరూ మీ చేతులను పైకెత్తి ఇలాగు చెప్పుము, “యేసు, నన్ను స్వస్థపరచిన దానిని బట్టి మీకు కృతజ్ఞతలు. నన్ను స్వస్థపరచిన దానినిబట్టి యేసు మీకు కృతజ్ఞతలు.” ఆయనను మహిమ పరుచుము.

1,124 total views, 6 views today