50-0715 ఆత్మ ద్వారా నడిపించబడుట

50-0715ఆత్మ ద్వారా నడిపించబడుట
మినియాపోలిస్, మినెసొట, అమెరికా

1.సహోదరుడా లిండ్సే, వందనాలు. శ్రోతలకు శుభ సాయంకాలము. కష్టముగా మాటలాడుటనుబట్టి నన్ను క్షమించండి. నేను మాటలాడుచున్న మాటలను మీరు వినగలుగుతున్నారా? సరే, మంచిది. మనకొరకు దేవుడు దీనిని జాగ్రత్తగా చూసుకుంటాడు. సరైనది చేయడానికి మేము ప్రయత్నిస్తాము. రేపు మధ్యాహ్నము 2గంటలకు ఆరాధనలో ఉండవలెనని సహోదరుడు లిండ్సే చెప్పారు. అది ఎవ్వరి సంఘము యొక్క ఆరాధనకు అంతరాయముగా ఉండదు. ప్రతి ఒక్కొక్కరు మీ సంఘము యొక్క ఆరాధనలో పాల్గొని…. వెలుపలికి వచ్చి మీరు ఒక ఆరాధనలో కలుసుకొనునట్లుగా యుండును. కాబట్టి దీనిని గుర్తుంచుకొనండి. మళ్ళీ రేపు రాత్రి ఎప్పటిలాగే ప్రసంగ కార్యక్రమము లేక స్వస్థత కార్యక్రమము వంటి ఏదో ఒక ఆరాధన యుండును. రేపు మధ్యాహ్నం ప్రసంగ కార్యక్రమముండును, కాబట్టి మీకు సాధ్యమైనయెడల, వచ్చుటకు ప్రయత్నించండి. మీరు వచ్చి కలుసుకొనుట నిశ్చయముగా మాకు ఎంతో సంతోషముగా యుండును.
2.ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మీ చేతులను చూడనివ్వండి. ఓ ఇది అద్భుతము కాదా, 99 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ కూడుకున్న సభికులలో చాలామంది ముందే రక్షింపబడి, వారు యేసును వారి హృదయములయందు ప్రియమైనవానిగా కలిగియున్నారని తెలిసికొనుట ద్వారా ఎంతో సంతోషించుచున్నాను.
3.ఇప్పుడు, కొంత వాక్యమును ముందుగా చదువాలని నేను అనుకుంటున్నాను. నా మాటలు తప్పి పోవును, కాని దేవుని మాటలు ఎప్పుడు తప్పిపోవు, మత్తయి సువార్తలోని 9వ అధ్యాయము 27వ వచనము నుండి మొదలు పెడదాము. మీరు దానిని గుర్తుచేసుకోవాలనుకొనువారు…. రేపు మధ్యాహ్నము ప్రభువు చిత్తమైనయెడల, నేను ఒక అంశము మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. దానిని గూర్చి అసలు నాకేమీ తెలియదు, కాని అది ఆయన చిత్తమైనయెడల, “రండి నాకు అన్ని విషయములు చెప్పిన ఒక మనుష్యుని చూడుడి,”అను అంశము మీద మాట్లాడుతాను. సరే, మంచిది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము నుండి మనము దానిని చదువుదాము.
“యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి – దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి.
ఆయన ఇంట ప్రవేవించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు – “నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?”అని వారినడుగగా, వారు “నమ్ముచున్నాము ప్రభువా,”అని ఆయనతో చెప్పిరి.
అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురము చేసిరి.
యేసును ఆయన శిష్యులును వెళ్ళుచుండగా కొందరు, దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకొనివచ్చిరి.
దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడుచుండగా (ఆ మూగ మనుష్యుని పట్టుకొనినది ఏమిటో మీరు గమనించారా? ఒక దయ్యము, కాని నవీన విజ్ఞానము దానిని అంగీకరించదని నేను ఖచ్చితముగా చెప్పగలను, కాని విశ్వాసులముగా బైబిలు ఏమి చెప్పునో దానిని మనము నమ్ముచున్నాము. ఇప్పుడు 33వ వచనము మళ్ళీ చదువుదాము;) దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహము ఆశ్చర్యపడి – ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడు కనబడలేదని చెప్పుకొనిరి.
అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచూ రాజ్యసువార్త ప్రకటించుచూ, ప్రతివిధమైన రోగమును స్వస్థపరుచుచు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచూ సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను.”
ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక చెప్పుచున్నది. ఆయన ఎన్నడూ మారడు; ఆయన దేవుడు.
4. అంతేకాకుండా ఇప్పుడు దేవుడు మరియు క్రైస్తవుల గూర్చి చాలా అద్భుతమైన విషయమేమనగా, దేవునికి క్రైస్తవులకు మధ్యగల సహవాసపు సంబంధమునుబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరైతే నడిపించబడుచున్నారో వారు దేవుని యొక్క కుమారులుగా పిలువబడుటయేయగును.
(వెనుక కూర్చున్నవారు నా స్వరము సరిగా వినగలుగుచున్నారా? అంతయూ సరిగానే ఉన్నదా? మీరు సరిగా వినగలిగితే, మీ చేతులు ఎత్తండి. అది మంచిది. ఈ మైకుకు ఎంత దగ్గరగా నిలబడాలో అంత దగ్గరగా నేను ప్రయత్నించుచున్నాను. అది ఒక పెద్ద శబ్దమును చేయ వచ్చును, నాకు తెలియదు.)
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకును మరియు దానిని మీ యొక్క మార్గదర్శిగా ఎన్నుకొని మిమ్మల్ని మీరు ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు సమర్పించుకొనుటయే ఒక క్రైస్తవుని జీవితములో మహాగొప్ప విషయమనేది నేను కనుగొంటిని. ఆయన మీలో జరిగించు క్రియ ఆశ్చర్యమైనది. ఇచ్చటయున్న వారిలో ఆత్మద్వారా ఎప్పుడైనా నడిపించబడితిరా, మీ చేతులను పైకి ఎత్తండి చూద్దాము. ఓ, మై, అది అద్భుతము. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుట….
బలిపీఠము యొద్దకు మిమ్మును నడిపించునది దేవుని ఆత్మయే తప్ప మరి ఏదియు నడిపించలేదు. అది నిజముగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు అయితేనే తప్ప మరి ఏ ఒక్కరు మిమ్మల్ని ఇక్కడకు ఈ రోజు నడిపించజాలరు. అది నిజమేనా? ఆయన తనయొక్క అద్భుతమైన కార్యములను జరిగించుటకు మర్మకరమైన రీతిలో కదులుతాడు.
5.చాలాసార్లు నడిపింపులో… [టేపుపై ఖాళీ స్థలము ఉన్నది.] నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి…
ఒక వారములోని ఆదివారము, మనము అంత సేపు ఆరాధనలో గడపగలిగినయెడల ఒక వారము ఆదివారము మధ్యాహ్న ఆరాధనలో నేను నా జీవిత కథను చెప్పుటకు ఇష్టపడుచున్నాను. నా జీవిత ప్రయాణములో మార్గమందు కన్నీళ్ళతో నిండియుండుటయు రక్తముతో తడిచియుండుటను మీరు ఎరుగగలరు. ఒకవేళ ఎవరైనా గాని నా జీవిత బాట రోజా పుష్పములతో నిండిన మెత్తని బాటని మీరు అనుకోవచ్చును, కాని స్నేహితుడా, అది ఆ విధముగా లేదు.
ఇప్పుడు, చాలాసార్లు, ఖచ్చితముగా నేను ఆత్మద్వారా నడిపించబడినప్పుడే నేను ఏదైనను, ఎప్పుడైనను ప్రజల యొక్క వ్యాధుల గూర్చి ఇంకా అలాంటి విషయాలు చెప్పగలుగుతాను. దానిని చేయుటకై నేను ఆయనకు మార్గాన్ని కల్పించాలి. ఒకవేళ నాయంతట నేను ఏదైనా స్వయముగా చెప్పినయెడల, అది ఖచ్చితముగా తప్పిదమగును. అనేక సమయముల యందు అచ్చట అనేకులు యున్నపుడు అది నన్ను కలవరపెట్టును. నేను చాలా ఓర్పుతో వుంటూ వారితో ఒక్కక్కరితో మాట్లాడుచు, వ్యక్తిగతంగా వారితో సంభాషించుటయే శ్రేష్ఠమైన మార్గముగా నా కనిపించును. కొన్నిసార్లు ఈ విధముగా ఒక మిశ్రమ జనులతో కూడిన కూటముగా అది వున్నప్పుడు, వారిలో ఉన్న బాధ ఏమిటన్నది తెలుసు కొనుటకును మరియు అసలు అది ఏమిటనేది గ్రహించుటకు కూడా చాలా కష్టముగా యుండును. కాని ఆత్మలపట్ల నీవు చాలా సున్నితముగా జాగ్రత్తను వహించవలసియున్నది.
6. ఇప్పుడు, మనము గుర్తించగలము, ఆత్మలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ ఆత్మలు ఉన్నట్లయితే వాటికి ఒక యజమానుడు ఉండవలెను, ఎందుకనగా అది పాపుల స్వభావము నుండి ఒక క్రైస్తవునిగా మార్చుచున్నది. కాబట్టి ఎక్కడో ఒకచోట యజమానుడు లేదా అధిపతి ఉండవలసియున్నది. ఆ యజమానుడు ఎవరో కాదు, ఆయనే దేవుడు. మరియు ఆయన తన కుమారుని పాపభరితమైన శరీర రూపములో భూమిపైకి పంపెను. మరియు మనము దేవుని కుమారులము, కుమార్తెలుగా ఉండి, ఆయనతో నడుచునట్లుగా ఆయన మరణించి, మనలను విమోచించి, మనలను తిరిగి దేవుని యొద్దకు తీసుకొని వచ్చెను. ఆదాము ఏదైతే ఆ ఏదేను వద్ద పోగొట్టుకున్నాడో, ఆ తప్పిపోయిన బంధమును క్రీస్తు తిరిగి యధా స్థానమునకు తీసుకొనివచ్చెను.
7.చాలాసార్లు… ఇంకా కొంచెం సేపు మాట్లాడుటకు సమయము ఉండియుంటే చాలా బాగుండును, అయితే కేవలము ఎనిమిది, లేక పది నిమిషములనే మనము కలిగియుంటున్నాము. నా హృదయము మీ కొరకై తెరచి నా జీవితములో నేను పొందుకొన్న కొన్ని అనుభవములను మీతో పంచుకోవాలని ఇష్టపడుచున్నాను. మీతో మాట్లాడుటకు, చాలాసార్లు, క్రైస్తవ సహోదరులు…
ఇంకా కొన్ని ఎక్కువ స్వస్థతో కూటములను మనము జరిపించుకోవాలన్నాగాని, కొంత కాలము గడచిన తరువాత అటువంటి కూటములు ఇక జరగటం కష్టము అని నేను ఊహించుచున్నాను. ఇటువంటి కూటములు ఇక జరుగకుండా అంతమైపోతాయని నేను భయపడుచున్నాను. మనకు రాబోవు కాలమందు అనేక సమస్యలు మనముందు యున్నవని మీరెరుగుదురు. కాబట్టి చేయగలిగినంత చేయుటకు మా సమస్తమును ఇందుకొరకు సమర్పణతో మేము చేయుచున్నాము.
మరియు ఇక్కడి నుండి మనము వెళ్ళిపోయాక, మీలో చాలామందిని నా జీవిత కాలములో మళ్ళీ చూడలేకపోవచ్చును. మనము మళ్ళీ కలువకపోవచ్చును. కావున మనము ఒకరితో ఒకరము యదార్థముగా ఉందాము. మరియు దేవునితో యధార్థముగా ఉందాము. మనము ఈ బంగారు అవకాశమును కలిగియుండగా, ఆయన మనతో సంధిస్తాడు.
నేను క్రింద కూర్చొని మీలో ప్రతి ఒక్కరితో ఒక రోజు మాట్లాడాలని ఇష్టపడుచున్నాను. కాని నేను అలాగు చేయలేను, ఆ విధముగా చేసినయెడల, ప్రార్ధన ద్వారా దేవునిని వెదుకుటకు నా సమయాన్ని గడపలేను, అయితే మనము నది దాటిన తరువాత మీతో కలిసి ఉండే సమయము కలిగియుంటాను. మీరు కోరినంత సమయము మీతో గడుపుతాను. మనము ఎల్లప్పుడు పచ్చగా ఉండే ఆ చెట్టు ప్రక్కన, ఆ జీవ సముద్రము ఒడ్డున ఆ విధముగా కూర్చొని ఒకరితో ఒకరము వెయ్యి సంవత్సరములు మాట్లాడుకుంటాము. అది అద్భుతముగా ఉండబోవుట లేదా? ఆ సమయమున, “మీతో కరచాలనము చేసి క్రింద మిన్నియపోలిస్ లో మనము కలిసి ఉండుటకు చేసిన ప్రయత్నము జ్ఞాపకముయున్నదా? అది ఇప్పుడు ఎలా ఉందో చూడండి,”అని మీతో అంటాను.
నేను ఆ ప్రవాహము దాటి, ఇంటికి చేరినపుడు, నేను ఆ “ఆశ్చర్యమైన కృప”అను పాటను పాడుటకు ఎందుకు ప్రయత్నము చేయుదునో మీరు తెలుసుకోవాలని నేను ఆశించుచున్నాను. నేను పాడలేను, కాని నేను ఆ పాటను ఎప్పుడూ పాడాలని ఆశపడతాను. నేను అక్కడకు చేరినపుడు దేవుడు దానిని చేయనిస్తాడని విశ్వసిస్తున్నాను. మీరు నాకంటే ముందుగా అక్కడ చేరినపుడు, ఒక ఉదయమున వసారాలో నుండి బయటికి వచ్చి ఎవరో “ఆశ్చర్యమైన కృప”అనే పాటను మీరు వినునపుడు, “మీరు సహోదరుడు బ్రెన్ హామ్ ఇంటికి చేరారు,”అని మీరు చెప్పుకొనేదరు. ఎందుకనగా ఆ పాటను పాడిన వ్యక్తిని నేనే. ఆ పాటను నేను ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆశ్చర్యమైన ఆ కృపయే నన్ను రక్షించినది. ఆ కృపయే నన్ను ఇంత దూరము తీసుకువచ్చినది.
8. అనేకసార్లు ఆత్మ నడిపింపు ద్వారా జరిగే కార్యములను గురించి నేను అసలు చెప్పను. వాటిగూర్చి అసలు ఏమీ నేను చెప్పను. దర్శనములు ఎప్పటిలాగానే ఎప్పుడూ కనబడుతూ వుంటాయి. అవి ఏ విధముగా జరుగుచున్నవో దానిని గూర్చి మీకు చెప్పుటకు నేను ప్రయత్నిస్తాను. ఆ కార్యము వ్యక్తిగతమైన వారికి చెందినది… అది వారి కదలికలనుబట్టి, వారి జీవిత కాలమందు వారు ఏమి చేస్తారన్న కార్యములపై ఆధారపడి యుండును.
ఇప్పుడు మిమ్మల్ని చూచుట ఎంత వాస్తవముగా యున్నదో, ఆ దర్శనము కూడా అంత వాస్తవముగా కనబడును. కూడికలో ఆ కార్యములను చూచిన తరువాత మీలో ఎవరైనా దానిని గూర్చి సందేహించెదరని నేను నమ్మడములేదు. అది ఇంకా దాని స్థానమునకు రాలేదు. కూటములలో ఇటువంటి ఒక డేరాలో నిలబడి మాట్లాడుటనుబట్టి అనేక ఇబ్బందులకు గురికావలసియుండును, ఎందుకనగా మనము ఒకరికొకరము పరిచయములేని క్రొత్తవారము. మరియు ఇచ్చట ఒకరికొకరు ఎరగని క్రొత్తవారుగా నిలబడియున్నాము.
కావున మీరు దానిని అద్భుతరీతిగా స్వీకరించుచున్నందుకు నేను కృతజ్ఞుడనైయున్నాను. అన్ని సమయములలో ఇక్కడ ఎక్కువగా విశ్వాస ఒరవడి లేచుచున్నదని ప్రతి రాత్రి అన్నివేళలా నేను భావన పొందుచున్నాను. ఈ కూడిక ముగియక ముందు, దేవుడు ఒకవేళ అనుకూలిస్తే మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేనటువంటి గొప్ప కదలిక ఇక్కడ ఉండబోతుందని నేను విశ్వసిస్తున్నాను. అది ఇక్కడ ఇప్పుడే ఉండుటకు ఎంత దగ్గరగా ఉందో చూడండి.
9.గమనించండి, కొన్నిసార్లు ఆయన నాకు కొన్ని కార్యములను చూపించును మరియు నేను వాటిని గూర్చి ఎప్పుడూ మాట్లాడను, ఇప్పుడే, సరిగ్గా ఈ సమయమందే, నేను ఇచ్చట నిలబడియున్నప్పటి నుండే, ఇచ్చట ఈ మైకు యొద్ద నిలబడి మాట్లాడుటకు ప్రారంభించినప్పటి నుండి దీనికి ముందే జరిగిపోయిన నాలుగు లేదా ఐదు కార్యములను నేను చూచితిని. కాని, ఏదైనా ఒకటి జరుగుటను నేను చూడనంతవరకు నేను దానిని గూర్చి మాట్లాడను.
నా కార్యనిర్వాహకుడు మరియు వారు చాలాసార్లు, ఇప్పుడు సేవకులు మరియు ఇంకా కొందరు, వారు ఎంతో ఆత్మీయ మనస్సుగలవారైతేనే తప్ప, సరిగ్గా దానిని అలాగే గ్రహించగలుగుటకు, కొంచెం వింతగాను, మరియు అది ఒకవేళ కష్టముగాను ఉండునని నేను ఎరుగుదును. కాని నాకు సాధ్యమైనంత వరకు నేను యధార్ధముగా ఉండుటయే….
10. ఇక్కడ కొద్ది కాలము క్రిందట, మేము ఇంగ్లాండులో కలిసికొన్నప్పుడు (కేవలము కొన్ని అనుభవలముకై), నేను నా గదిలో ఉంటిని మరియు నేను వెళ్ళి నా కార్య నిర్వాహకునితో చెప్పాను, నా గదిలో నేను కూర్చొని ఉండగా సాతాను మా వద్దకు వచ్చుచున్న దర్శనమును చూచానని చెప్పాను.. [టేపుపై ఖాళీ స్థలము ఉన్నది.]
అది జరుగుటకు ఎంతకాలము పడుతు౦ది అనియు, ఏదో ఒక చోట ఇంచుమించు ఇరువది-నాలుగు గంటలలో అది జరుగునని నేను వారియొద్ద చెప్పితిని, మరి అది అచ్చట జరిగినది.
11.ఒక ఉదయము లేచి అయిదు గంటలకు పట్టణములోనికి వెళ్ళటము నాకు జ్ఞాపకమున్నది. ఆయన నన్ను లేపాడు; “నీ వస్త్రములను ధరించుకో,”అని ఆయన అన్నాడు. నేను లేచి పట్టణములోనికి వెళ్ళి, మూడు మైళ్ల వరకు నడిచాను. అది ఓర్న్ కోల్డ్ స్విక్, ఓరిబ్రో లో, నార్వే లేక స్వీడెన్ లో అని నేను విశ్వసిస్తున్నాను.
మరియు నది ప్రక్కగా ఉన్న ఒక చెట్టు క్రింద నేను వెళ్ళి అయిదు గంటల నుండి 9 గంటల వరకు నేను ప్రార్థన చేసాను. అంతట ఆ 9 గంటల సమయంలో, ఆయన నన్ను వెళ్ళనివ్వలేదు. నేను నా గదిలో లేకపోవుట అక్కడికి వెళ్ళినవారు చూచినప్పుడు, వారు ఆశ్చర్యపడిరి. కావున, నేను ప్రార్థించుచుంటిని; “ఇప్పుడు నీవు లెమ్ము,”అని ఆయన చెప్పుట నేను విన్నాను. నేను లేచాను.
12. ఇప్పుడు, స్నేహితులారా ఇది కేవలము ఒక ఊహ కాదు. నా స్వరము మీకు వినబడుచున్నంత స్పష్టముగా, ఆయన స్వరమును నేను వినగులుగుతాను. ఆయన ఇక్కడ నిలబడినప్పుడు, అది మీ ఊహ కాదు, ఆయన నడుచుచున్నప్పుడు, నేను ఆయన యొక్క అడుగుల చప్పుడును నేను వినుచుందును, ఆయన వైపు చూచి, నేను మీతో మాటలాడినట్లు, మీరు నాతో మాటలాడినట్లుగా నేను ఆయనతో మాటలాడుదును. అది జీవించుచున్న ఒక జీవాకారము. అదేదో మీ యొక్క ఊహ కాదు. మరియు ఆయన తన పాదములు క్రింద మోపుచూ నడుచుచున్నపుడు, నేను ఆ పాదముల యొక్క శబ్దమును వినగలను. ఆయన మాటలాడునప్పుడు, నేను మాటలాడునట్లుగానే ఆయన మాటలాడును. ఓ, ఒక విధానమున దీనత్వమైన స్వరమును, మరియొక విధానమున కఠినమైన స్వరమును ఆయన కలిగియున్నాడు. ఆయన గుణములను ఏ మనుష్యుడు కూడా చిత్రీకరించలేడు. ఒకవేళ ఆయన మాటలాడితే, అది లోకమును తలక్రిందులుగా చేయును. అయినను నీవు ఆయనను చూచినప్పుడు, నీవు ఏడ్చునంతగా, ఆయన ఇంకా సాత్వికుడైయున్నాడు.
13.మరియు ఆయన అన్నాడు, “లెమ్ము.”
నేను లేచి నడుచుట ప్రారంభించాను, నేను ఒక మైలంత నడిచి, ఒక రోజు ముందు నేను దర్శనములో చూచిన దుకాణమువైపుగా వెళ్ళుచుంటిని. కేవలము నడవడము తప్ప ఏమి చేయవలయునో నాకు అర్థం కావటంలేదు. ఆయన “నడువుము”అని అన్నాడు. నేను ఆ మూలవరకు వెళ్ళెదను అని అనుకొన్నాను. నేను మూలవరకు వచ్చినపుడు; “నీ కుడి వైపునకు తిరుగుము,”అని ఆయన అన్నాడు. నేను రెండు గజములు కుడివైపునకు వెళ్ళితిని. అంతట ఆయన, “నీ ఎడమవైపునకు తిరుగుము,”అని అన్నాడు.
14. మరియు అర క్షణములో గతరాత్రి ఉన్నటువంటి నా తర్జుమాదారుని నేను చూచితిని. మరియు ఏదో జరుగబోవుచున్నదని నాకు తెలుసు, ఎందుకనగా అతడు నాకు దగ్గరగా వచ్చుచుండెను. ఏమి జరుగబోవుచున్నదో నాకు తెలుసు; అది సరియైన మార్గమున ఉండబోవుచున్నది. అతడు నా వద్దకు వచ్చి కరచాలనము చేసెను. “సహోదరుడా బ్రెన్ హామ్ ,ఇది ఏదో వింతగా ఉన్నది,”అని అతడు అన్నాడు.
“ఒక్క క్షణము,”అని నేను అన్నాను. నేను అతడితో చెప్పడము ప్రారంభించాను.
అతడు నావైపు చూచెను. అతడు ఆలాగు చూసినపుడు, గతరాత్రి అతడు తర్జుమా చేయుచుండగా నేను అక్కడ నిలబడియుండగా ఒక దర్శనము చూచాను. “నీవు ఇప్పుడే ఆసుపత్రి నుండి వచ్చితివి, అవును కదా? నీవు రాలేదా?”అని నేను అడిగితిని.
“అయ్యా, అవును”అని అతడన్నాడు.
నేను అన్నాను, “నీవు నీ మూత్ర పిండములలో ఒక దానిని తొలగించుకొంటివి.”
అతడు “అవును, అది నిజము,”అని అన్నాడు.
నేను కేవలము ఒక రోజు ముందు మాత్రమే అతడిని కలిసియుంటిని. ఆ రాత్రి ఈ వేదిక నుండి మాత్రమే చూచితిని. “మూడు లేక నాలుగు సంవత్సరముల క్రితం నీవు ఏదో ఒక విషయమును చేయ తలంచితివి, కాని నీవు దానిని చేయలేకపోతివి. అది నిజమే కదా?”అని నేను అన్నాను.
అతడు “అది నిజమే,”అని అన్నాడు.
“నీకు ఒక శస్త్ర చికిత్స జరిగినది. శస్త్ర చికిత్స తరువాత అది మరో మూత్రపిండములోనికి వెళ్ళినది. అది నిజమే కదా?”అని అన్నాడు.
అతడు “అవును,”అని అన్నాడు.
“గత రాత్రి నేను సమూహపు ప్రార్థన చేయుచున్నపుడు, నీవు నీ చేతిని చాచి నా కోటును ఆ విధముగా పట్టుకొని యుండలేదా, ఖచ్చితముగా?”అతడు ఏడ్చుట ప్రారంభించాడు. అతడు తన చేతులను పైకి ఎత్తి, “అది నిజమే,బ్రెన్ హామ్ సహోదరుడా. మరియు గతరాత్రి నేను దేవుణ్ణి అడిగాను, అది ఆలాగయితే ఆ విధముగా స్వస్థతను నేను పొందుకొనియున్నయెడల, ఆయన దానిని నిరూపించును. మరియు అరగంట క్రిందట నీవు లేచి ఆ వీధి గుండా వెళ్ళుము,”అని ఆయన నాతో చెప్పెను.
ఒకవేళ నేను ఒక్క క్షణమైన ఆలస్యం చేసిన నిన్ను చూడలేక పోయేవాడిని. అచ్చట అతడు ఏ విధముగా స్వస్థతను పొందుకొనెనో దానిని దేవుడు రుజువుపరచెను. దేవుడు ఏ విధముగా ఆశ్చర్యకరమైన రీతిలో క్రియలు చేయును.
15.నేను వెళ్ళి సహోదరుడు మూరను మరియు సహోదరుడు లిండ్సేను కలిసాను. మేము ఆ పట్టణములోని బజారుకి వెళ్ళితిమి. దేవుని యొక్క అభిషేకము ఇంకా నాపై వున్నది కాబట్టి ఇంకా కొద్ది దూరము ఆయన నన్ను నడిపించుకుంటూ వెళ్ళుచున్నాడు. నేను అనేకసార్లు ఆ విధముగా నడుచుకుంటూ వెళ్ళుచు వుండేవాడిని, ఎందుకనగా ఆ సమయమందు ఒక బొమ్మలాగా లేదా చలనము లేనివాడిగా అలాగే వుండలేను. ఆ పట్టణములో యున్న బజారులోకి మేము వెళ్ళితిమి. ఒక కిటికీవైపు చూస్తూ మేము నిలబడియున్నాము. ఆ కిటికీగుండా చూస్తూ, “సహోదరుడా మూర్”అని అన్నాను.
అతడు “ఏంటి”అని అన్నాడు.
“ఇప్పుడు, ఆ మార్గము వెనకాల, అక్కడ ఒక మనుష్యుడు ముదురు రంగు కోటును ధరించుకొని తేలికపాటి టోపీ పెట్టుకొని, ఆ భవనము నుండి బయటికి వచ్చి తన భార్య కొరకు ప్రార్థన చేయమని నన్ను అడుగును, కేవలము నేను దానిని చేయలేను,”అని అన్నాను.
అతడు “అది ఎప్పుడు జరుగును?”అని అన్నాడు.
“ఈ ఉదయము ఏదో ఒక సమయమున, ఎందుకనగా దర్శనము వచ్చినది అదే ఉదయమున,”అని నేను అన్నాను.
మరియు దాని తరువాత మేము ముప్పది నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళితిమి, మేము ఒక మలుపు తిరిగితిమి, నల్ల కోటును ధరించుకొని యున్న ఒక వ్యక్తి బూడిదరంగు టోపీ పెట్టుకొని, ఒక దుకాణము నుండి బయటికి వచ్చెను. అతడు తన టోపీని తీసివేసి, “సహోదరుడా బ్రెన్ హామ్,మిమ్ములను కలసినందుకు చాలా సంతోషముగా ఉన్నది,”అని అన్నాడు. “ఇక్కడ పై అంతస్థులో నా భార్య ఉన్నది,”అని అన్నాడు.
జాక్…. “దాని గురించి ఏమిటి”అని సహోదరుడు మూర్ అన్నాడు.
మేము లోనికి వెళ్ళితిమి.
16.సహోదరుడా బాక్టర్, తరువాత కార్వనిర్వాహకుడు, ఆ మధ్యాహ్న కాలమున మేము నడుచుచూ ఆ పట్టణములో యున్న బజారులోకి వెళ్ళుచూ అక్కడున్న ఒక వీధిలో నిలబడియుంటిమి. “సహోదరుడా బాక్టర్, నల్లని దుస్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు ఆ దుకాణ ము నుండి బయటకు వచ్చుట నేను చూచుచున్నాను. వారు త్వరలోనే మనలను ఆపుదురు,”అని అన్నాను.
మేము రెండు గజములు నడిచి ఒక వ్యక్తి యొక్క దుకాణము వద్ద టైల వైపు చూచుచుంటిని. వెంటనే అదే దుకాణము నుండి నల్లని దుస్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు బయటికి వచ్చి, మా వద్దకు పరుగున వచ్చి, వారి చేతులు ముడుచుకొనుచుండిరి. వారు ఆంగ్లము మాట్లాడలేక పోవుచుండిరి, కాని వారి చేతులపై ఉన్న బాధ ఏమిటనే దానిని నాలో వున్న వివేచనా ఆత్మ ద్వారా వారు తెలుసుకొనగోరిరి.
సహోదరుడు బాక్టర్ అన్నాడు…
మంచిది ఇప్పుడు, ఆ విషయములు ఎప్పుడూ జరుగుచుండును. కాని ఏదైనా ఒక కార్యము ప్రయోజనమును లేక లాభమునైనను వారికి కలిగించునదైతేనే తప్ప, స్నేహితులారా, నేను దానిని వారికి ఎన్నటికీ బయలుపరచను.
17.అనేక సమయములలో క్రైస్తవులు ప్రార్ధించుచుండెదరు.. ఇక్కడ గత రాత్రి ఒక స్త్రీ కూర్చుని ఉండెను, ఇప్పుడు ఇచ్చటయున్న అనేకులు నిన్నటి రాత్రియందు కూడా వుండిరి. ఒక చిన్న బిడ్డతో యున్న ఒక స్త్రీని నిన్నటి రాత్రియందు నేను వెదికిన విషయము మీకు జ్ఞాపకమున్నదా? ఆమె ఒక చిన్న బిడ్డను కలిగియుండెను. ఆమె ఆ బిడ్డ స్వస్థత కొరకై ప్రార్థనలో ఉండెను. మరియు గదిలో నేను ఆమెను చూచితిని. ఆమె ఏ విధమైన వస్త్రము వేసుకొని ఉన్నదో నేను తెలుసుకొనలేకపోతిని, కాని ఆమె తల వెంట్రుకలు జడ అల్లుకొనియుండుట నేను చూచాను. మరియు బంగారు వంటి పసుపు రంగు గల తల వెంట్రుకలతో ఆమె ఒక బిడ్డను కలిగియుండెను. మరియు ఆ బిడ్డ స్వస్థత పొందుకొనుటను ప్రభువు నాకు చూపించెను. గత సాయంకాలము ఆమె భవనమును విడిచి వెళ్ళకముందే బిడ్డ స్వస్థత పొందెను. ఇప్పుడు, అది అద్భుతము.
18.ఇటీవల ఫోర్ట్-వేయిన్లో మేము ఒక కూడిక కలిగియుంటిమి. ఇక్కడ ఉండిన వారు ఎంతమంది ఫోర్ట్-వేయిన్ కూడికలో ఉండిరి? కొంతమంది ఉండియుండవచ్చు, అవును, ఇక్కడ రెండు లేక మూడు చేతులు ఉన్నట్లుగా పైకి ఎత్తి చూపుట కనబడుచున్నవి. ఫోర్ట్-వెయిన్ లో ఆ కూటమునందు ఆశ్చర్యపోవునంతగా జనము కూడియుండెను. బి.ఇ. రెడిగర్, కొన్ని సంవత్సరముల క్రితముయున్న బి.ఇ. రెడిగర్ గురించి ఎంతమంది వినియున్నారు. పాల్ రాడర్, “కేవలము నమ్మకము,” (Only Believe) అను పాటను ఆయన తనయొక్క కూడికలో దానిని వ్రాసెను. సరే, సహోదరుడు రెడిగర్కి కొంతమంది కుమార్తెలు ఉండిరి… కొంతకాలము క్రితము ఆయన మహిమలోనికి వెళ్ళెను. ఆ కాలమందు దేశములో గొప్ప స్వస్థతా కూటములు జరిపించిన శ్రేష్ఠమైన దైవజనులలో ఆయన కూడా ఒకరైయుండెను.
19.నేను ఇంతవరకు ఇవ్వని అతిపెద్ద బలిపీఠపు పిలుపు ఇచ్చిన ఫ్లోరిడాలోని పెన్నకోలా నుండి ఇప్పుడే తిరిగి వచ్చితిని. ఒకే ఒక్క బలిపీఠపు పిలుపు: రెండువేల మంది ఒకేసారి వారి హృదయములను క్రీస్తుకు సమర్పించిరి.
మరియు నేను అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి ఆ చిన్న ఆలయంలోనికి ఆ ఉదయమున వెళ్ళితిని. అక్కడ కొన్ని వందలమంది ఆలయము చుట్టూ నిండిపోయి ఉండిరి. నన్ను బయటికి తీసుకు వెళ్ళుటకు వారు ప్రయత్నము చేయుచుండిరి. మానసిక వ్యాధితో బాధపడుచున్న ఒక యవ్వన స్త్రీని సంఘము వెనుక భాగమునయున్న బొగ్గులతో నిండియున్న ఒక గదిలో వుంచారని ఎవరో నాతో చెప్పిరి…. ఆమె “రెడిగర్”అని చెప్పిరి.
“ఆమె, రెడిగారా?”బి.ఇ. రెడిగర్ గారికి ఆమె ఏమవుతుంది?”అని నేను అడిగాను.
“ఆమె ఆయన యొక్క కుమార్తె,”అని చెప్పిరి
20.బి.ఇ. రెడిగర్, దేవుని యొక్క ఒక యోధుడు, మహిమలో విశ్రాంతి నొందుచున్నాడు, ఆయన కుమార్తె ఒక మానసిక వ్యాధితో బాధపడుచున్నది, ఆయన యొక్క మరియొక కుమార్తె కూడా ఇదే రకమైన వ్యాధితో చనిపోయినది. మానసిక వ్యాధితో మానసిక రోగుల వైద్యశాలలో, ఇంచుమించు రెండు సంవత్సరములుగా యుండినది. ఆమె తల్లి ఆమెను పట్టుకొని ఉండుటకు ప్రయత్నించుచుండెను. ఒక అందమైన యవ్వన స్త్రీ, ఆమె తల వెంట్రుకలు కిందికి ఉన్నవి, అక్కడ వెనుక ఆమె తల్లి కూర్చోని, ఆమెను పట్టుకొని ఉండెను. ఆమే నివ్వెరపోయి చూచుచుండెను.
ఆమె ఎక్కడ ఉండెనో, నేను అక్కడ లోపలికి వెళ్ళితిని. ఆమె వెనుకకు అడుగులు వేసుకుంటూ జరుగటం ఆరంభించినది. ఆమె తన నోటిలోనే గొణుగుకుంటూ, “డబ్బులు”అంటూ ఇంకా ఏదేదో చెప్పుచున్నట్లుగా, ఆ విధముగా గొణుగుతూనే వెనక్కి వెనక్కి జరుగుచు వెళ్ళుచున్నది.
కావున, రెడిగార్ పైకి చూచెను. “ఓ, మై, ఈమె, సహోదరుడు రెడిగర్ యొక్క కుమార్తెనా,”అని నేను అడిగాను.
“అవును,”అని చెప్పెను.
“ప్రియమైన ప్రభువైన యేసు, ఈ బాలికపై కరుణ చూపుము,”అని చెప్పాను. ఆ శత్రువు యొక్క శక్తి ఆమెను విడిచి వెళ్ళునట్లుగా నేను ప్రభువును అడిగాను. అదే గడియలో ఆమె స్వస్థత పొందెను.
ఆమె ఈ ఆగస్టు నెలలో వివాహము చేసుకోబోతుందని నేను ఒక ఉత్తరము ద్వారా తెలుసుకొంటిని. మానసిక రోగులను వుంచు ఆ స్థలము నుండి బయటకు వచ్చిన ఆమెకు, అది ఎంత మహిమకరము, మరియు ఆయన యొక్క ఆత్మ నడిపింపును కనుగొనుట అది ఎంత మహిమకరము.
21.అక్కడ ఫోర్ట్-వెయిన్లో మేము ఏ హోటల్లో ఉంటున్నామో ఆ హోటల్ని వారు కనుగొనిరి. అది ఇండియానా హోటల్. ఆ హోటలు యొక్క నడవ నుండి మమ్మల్ని వెలుపలికి తీసుకొని వెళ్ళుటకై ఆ హోటలు యాజమాన్యం ఒక వ్యక్తికి కూలియిచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని వెళ్ళె౦తటి జనసమూహము అచ్చట కూడియుండిరి. ఇరుకు సందు మార్గము గుండా వెళ్ళుచుండగా, బూడిద కుప్పలపై తినడానికి ఏదైనా దొరుకుతుందాయని అనేకమంది జనులు దారిపొడవునా గుంపులుగా కూడియుండిరి.
అంతట వెంటనే ఒక రోజు మేము ఆ వీధి గుండా కిందికి వెళ్ళుచుంటిమి, నా భార్య నాతో ఉండెను, ఆమె బిడ్డను కలిగియుండెను. నా చొక్కాయి యొక్క కాలరు పైకి యుండినది. నా చిన్న బిడ్డను తీసుకొని వీధిగుండా క్రిందికి వెళ్లుచుంటిని. మేము టోడ్డల్ హైజ్, లేక హబ్బల్ హౌస్ అనే ప్రదేశమునకు వెళ్ళుచుంటిమి, మేము అక్కడ భోజనము చేసితిమి.
కెనడా నుండి వచ్చిన సహోదరుడు ఈటన్ అచ్చట వుండెను. అతడు ఆ ఉదయమున మా గది యొద్దకు వచ్చి మమ్మల్ని కలుసుకొనెను. అతడు కడుపునొప్పి నుండి స్వస్థత పొందుకొనుటకై కూడికలకు వచ్చియుండెను. కొన్ని రోజుల తరువాత ఆలయం యందు దేవుడు అతనిని స్వస్థపరచెను. మేము భోజనము చేయుచున్న ప్రదేశమునకు అతడు రాలేదు; కాని నా యొక్క అల్పాహారమునకై అతడు డబ్బులు చెల్లించెను.
22.ఆ తరువాత ఉదయమున వీధులలో నడిచి వెళ్ళుచుండగా, “నీ ఎడమవైపునకు తిరుగుము,”అని ఏదో చెప్పినది.
శ్రీమతి. మోర్గాన్, ఇరవై-ఒక్క సంవత్సరాల పట్టబధ్రురాలైన ఒక నర్సు. ఒక రోగిపై నా చేయిని పెట్టునపుడు, నా చేయి వణుకును. ఆ విధముగా నా చేయు వణుకుట ద్వారా ఆ ఎదుట వ్యక్తిలో వున్న వ్యాధిని నేను కనుగొనగలను. ఆ విధముగా నా చేయి వణుకుట ద్వారా మొట్టమొదటగా కేర్సరు వ్యాధిని కనుగొన్నది శ్రీమతి. మోర్గాన్ లోనే. ఆమె ఒక కేన్సరు వ్యాధిగ్రస్తురాలు. 37 పౌండ్ల బరువు కలిగి కేవలము చర్మముతో కప్పబడిన ఒక ఎముకల గూడుగా కూడికలలోనికి తీసుకురాబడినది. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆమె ఇప్పుడు 155 పౌండ్లు బరువు ఉన్నది. దేశములోకెల్ల అత్యుత్తమ వైద్యులు ఆమె ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతుంది అని చెప్పారు. అది ఆమె శరీరమంతా వ్యాపించింది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి కేన్సరును తొలగించాలని ఆమె శరీరమును కోసి చూచి ఏమి చేయలేని పరిస్థితినిబట్టి మళ్ళీ వాళ్ళు ఆ స్థలమును అట్లే కుట్లువేసి మూసివేసిరి. ఆమెలో కేన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయి, ప్రాణాపాయ స్థితిలో ఆమె శరీరమంతా ప్రాకిపోయినది, అందువలన వైద్యులు ఏమి చేయలేక పోయారు. ఏ వైద్యుడు శస్త్రచికిత్స చేయుటకై ఆమె శరీరమందు కత్తిని పెట్టుటకు అవకాశమే లేదు. ఇప్పుడు, ఆమె పరిపూర్ణమైన ఆరోగ్యంతో 157 పౌండ్లు బరువుగలదై సజీవముగా యున్నది.
23. కొన్నిసార్లు వ్యాధిగ్రస్తులకు సహాయము చేయు విధముగా ఆమె మాతో కూడా వచ్చుచుండెడిది, ఎందుకనగా ఆమె ఒక తెలివైన స్త్రీ. మరియు మేము కిందికి వెళ్ళుచుండగా, నాతో “నీ కుడివైపునకు తిరుగుము,”అని ఏదో చెప్పినది. మీరు నా మాటలను వినుచున్న రీతిగానే నేను ఆ స్వరము వింటిని. నేను కుడివైపునకు తిరిగితిని.
“ఏంటి విషయము,”అని మార్గి – నా భార్యతో అడిగినది.
“ఇప్పుడు, ఆయనను అలా వెళ్ళనిమ్ము,”అన్నది.
నేను వెళ్ళాను. మేము నడుచుచూ వెళ్ళితిమి. క్రింద ఎడమవైపున మిల్లర్స్ కెఫెటీరియా అను ప్రదేశము ముందు భాగములో నిలిచితిని. “అసలు నేనెందుకు ఇచ్చట నిలబడ్డాను,”అని నేను ఆశ్చర్యపడితిని.
ఏదో నాతో “లోనికి వెళ్ళుము,”అని చెప్పినది.
నేను ఆ కేఫెటేరియా లోనికి వెళ్ళితిని. కొద్దిగా అల్పాహారము మరియు ఎండు ద్రాక్షపళ్ళు కొన్ని తీసుకొని అక్కడ కూర్చున్నాను. “నీవు ఈలాంటి పెద్ద ప్రదేశములో ఖచ్చితముగా చిక్కుబడిపోతావు,”అని నా భార్య నాతో అన్నది. అక్కడ చాలా మంది జనులు కూడి ఉండిరి.
నేను తినడము ప్రారంభించాను. మరియు దేవుని యొక్క దీవెనలను నేను అడుగుచుండగా, “దేవునికి స్తోత్రము”అని ఎవరో చెప్పుట వింటిని.
నేను అక్కడ చూడగా, ఒక వృద్ధ పేద తల్లి కన్నీరు తుడుచుకుంటూ లేచుచుండెను.
“నీవు వెళ్ళిపోవుట మంచిది,”అని మార్గి చెప్పినది. “నీవు వెళ్ళకపోతే మొత్తం ప్రజలు…”
“ఒక్క నిమిషం, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు,”అని అన్నాను.
ఆమె అక్కడికి వచ్చి “సహోదరుడా బ్రెన్ హామ్,కూడిక తర్వాత ఇంకొక కూడికకు అలా ప్రతీ కూడికలలో నేను, నా సహోదరుడు కలుసుకుంటూ ప్రతీ కూడికలో జరుగు ప్రార్ధనా వరుసలో అతడిని నిలబెట్టాలని నేనెంతో ప్రయత్నించినా గాని, అది నా వలన సాధ్యమవ్వలేదు. అతడు గుండె జబ్బుతో చాలా అధ్వానంగా అతడి పరిస్థితి మారిపోయినది. ఇప్పుడు అది గుండెకు మరియు కడుపునకు మధ్య భాగములోనికి నెట్టబడినది. ఇచ్చటకు వచ్చుటకు కొన్ని రోజులు ముందు మేము అతడికి పరీక్ష చేయించాము. అతడు ఇంకా కొన్ని దినములు మాత్రమే ప్రాణముతో వుండునని వైద్యులు చెప్పిరి. టెక్సాస్ నుండి ఇక్కడికి వచ్చుటకు డబ్బుల కొరకై మేము మా ఆవును అమ్మి వేసితిమి. మేము కొన్ని కూడికలకు వచ్చియుంటిమి. మేము మాకు కలిగినదంతయూ అమ్మివేసితిమి. స్వస్థతను పొందుకోలేని స్థితిని మేము గమనించాము, ఎందుకనగా ఆ ప్రార్ధనా వరుసలో చాలా మంది వుంటున్నారు. కొన్నిసార్లు మేము ప్రార్థనా కార్డులను కలిగియున్నా కూడా మాకు ఇవ్వబడే ప్రార్థనా కార్డు యొక్క సంఖ్యను ఎన్నడూ పిలువబడలేదు. కాని నేను ఉపవాసము ఉండి, గత రాత్రంతయూ ప్రార్ధన చేసితిని. నేను తెల్లవారుచుండగా మేల్కొంటిని, నేను ఒక కలను చూచితిని. “నేను ఇక్కడకు వచ్చి ఈ కాఫీ అమ్ము స్థలములో తొమ్మిది గంటలకు వేచి ఉండవలెను,”అని నేను నా కలలో చూచితిని, అని అన్నది.
నేను గడియారమును చూచితిని, మరియు అది ఖచ్చితముగా తొమ్మిది అయినది. “అతనిని ఇచ్చటకు తీసుకు రండి,”అని చెప్పాను.
ఏమి జరిగినదో మీకు తెలుసా, తెలియదా? ప్రభువు అతనిని ఆశ్చర్యకరముగా స్వస్థపరచెను. ఇదియే ఆత్మద్వారా నడిపించుటయగును. ఆయన ఇరువైపులా క్రియ చేయును.
24.తరువాత తలుపు ద్వారా వెళ్ళుతూ, నేను వెళ్ళి పోవుచుంటిని. రెండు నిమిషముల తరువాత బయటికి వెళ్ళితిని. ఏమియూ తినలేదు. నల్లని దుస్తులు ధరించుకొన్న ఒక స్త్రీ నేను బయటికి వెళ్ళగానే, ఆమె వీధిలో పడి గట్టిగా అరవడము ప్రారంభించినది. ఆమె ఎత్తయిన చికాగో స్థలములో నివసించును. ఆమె కేన్సరు వ్యాధితో బాధపడుచున్నది. ఒళ్ళంతా ప్రాకిపోయే అపాయకరమైన స్థితి. ఆమె అన్నది, “సహోదరుడా బ్రెన్ హామ్,నేను ఇక్కడికి రావలెనని వారముల తరబడి ప్రార్థన చేయుచుంటిని. నాకు కొద్ది సమయము ముందు నా ప్రార్థనకు జావాబు వచ్చినది,”అని ఆమె అన్నది. ఆమె వారి ప్రాంతమందున్న శ్రేష్ఠమైన వైద్యులువుండే వైద్యశాలయందు వుంటూ వచ్చినది. అయినను అచ్చటయున్న వైద్యులు ఆమెకు ఏమియు చేయలేకపోయిరి. అసలు చేయుటకు కూడా ఏమియు లేదు. ఆమె యొక్క భర్త అచ్చటయున్న వ్యాపారస్తులలో అతడొక గొప్ప వ్యాపారవేత్త. “ఈ రోజు తెల్లవారు జామున ఏదో ఒకటి నా హృదయాంతరంగమునందు ఉదయము 9 గంటల 10 నిమిషములకు మిల్లర్స్ అనే అల్పాహార హోటలు దగ్గరకు వెళ్ళి, అచ్చట నిలబడియుండుము, అని నాతో చెప్పినది,”అని ఆమె చెప్పినది. అదియే దేవుని కార్యమైయున్నది.
కొన్ని వారముల ముందు నేను ఆమెను ఇక్కడి ఈ లిటిల్ రాక్ అనే స్థలమందు సంధించితిని, ఆమె సంపూర్ణమైన స్వస్థతతో ఆరోగ్యంగా వుంటూ, దేవునిని గొప్ప శబ్దముతో ఆయన చేసిన మేలును కొనియాడుతూ, స్తుతిస్తూ యుండినది.
25.నేను ఒక వీధి గుండా నడుచుకుంటూ వెళ్ళితిని. పరిశుద్ధాత్మ నాతో “ఇక్కడ ఆగుము,”అని చెప్పెను.
నేను నా భార్యతో అన్నాను, “మీరందరూ వెళ్ళండి, వారు మిమ్ములను హోటల్ కు తీసుకుని వెళ్ళెదరు.”
ఆమె చిన్న బిడ్డను ఎప్పుడూ ఆ గదిలోనే వుంచుట వలన, ఆమె “సరే, మంచిది, నేను మందుల దుకాణం దాటి అక్కడ కొన్ని రంగులు వేసే పుస్తకములు తీసుకుంటాను,”అని అన్నది.
నేను వెనుకకు వెళ్ళి, కొన్ని చేపలు పట్టు సాధనముల కొరకు చూచితిని. నేను కొంతసేపు ఆగి, “తండ్రీ, నేను ఏమి చేయవలెనని మీరు కోరుతున్నారు,”అని అన్నాను.
నేను కొన్ని నిమిషములు వేచియుంటిని. “క్రింద మలుపునకు వెళ్ళుము,”అని ఆ స్వరము చెప్పుట వింటిని.
నేను మలుపు వరకు వెళ్ళి, అక్కడ నిలుచుండగా, “వీధిని దాటుము,”అని చెప్పెను. నేను ఆ వీధి దాటి వెళ్ళి, అక్కడ నిలుచుంటిని.
ఫోర్ట్-వెయిన్ నుండి వచ్చిన జనులారా అక్కడ ట్రాఫిక్ ను ఎలా మళ్ళించుదురో మీకు తెలియును. అది ఒక శనివారపు ఉదయము. నేను అక్కడ కొద్దిసేపు నిలుచుంటిని.
కొద్ది సేపటి తరువాత ఒక స్త్రీ ఆ వీధి దాటుట నేను చూచితిని. చాలాసార్లు ఈల మ్రోగినది. ఒక స్త్రీ వీధి దాటుచూ, తన హస్తములో చిన్న పుస్తకము కలిగియున్నది. ఆమె గళ్ళు వేసిన సూటును మరియు గుండ్రముగా యున్న గీతలు వేసి టోపీని ధరించుకొని యున్నది. ఆమె అలా నడుచుకొని వెళ్ళుచున్నది.
“ఆమె దగ్గరికి వెళ్ళుము,”అని పరిశుద్ధాత్మ చెప్పెను.
నేను వెళ్ళి అక్కడ నిలుచుంటిని (నాకు తెలిసినంతవరకు ఆ స్త్రీ ఈ కూడికలో ఈ రాత్రి ఇక్కడ ఉండియుండవచ్చును.) నేను ఖచ్చితముగా ఆ యొక్క మలుపు వద్ద నిలుచుంటిని. ఆమె నా ముందు నుంచే వెళ్ళినది.
“ఇది వింతగా ఉన్నది; ఆయన నాతో ఎన్నడూ తప్పుగా చెప్పలేదు,”అని అనుకొన్నాను.
ఆమె ఒక స్థంభము అంత దూరము వెళ్ళి, అటు ఇటు ప్రక్కలకు చూచుచుండెను.
ఆమె వెనుకకు తిరిగి చుట్టూ చూస్తూ ఆమె, “ఓ, సహోదరుడా బ్రెన్దాం,”అని అన్నది. ఆమె వెనుకకు వచ్చి ఏడవడము మొదలు పెట్టెను. ఆమె, నేను నిన్ను కెనడా నుండే వెంబడించుచు వచ్చుచుంటిని,”అనెను. నేను ఇచ్చటకు వచ్చుటకు కొంచెము డబ్బును మాత్రమే ఇచ్చిరి. నేను నిన్నటి రాత్రియందు ఒక హోటలు వసారాయందు అలా కూర్చునే నిద్రపోతిని. అంతేగాకుండా ఈ రోజు ఉదయం ఒక కప్పు కాఫీని మాత్రమే త్రాగగల ఐదు సెంట్లు మాత్రమే నా దగ్గర డబ్బులు యున్నవి, ఇచ్చటయుండు ధర్మ సత్రాన్ని వెదుక్కుంటూ వెళ్ళుచుంటిని. నేను సరిగ్గా రెండు గజముల దూరమును దాటేలోపల పరిశుద్ధాత్మ నాతో, “నీ యొక్క కుడివైపునకు తిరుగుము,”అని చెప్పినది. సరే, మంచిదని నేను కుడివైపునకు తిరిగాను, “మళ్ళీ నీ ఎడమ వైపునకు తిరుగుము,”అని పరిశుద్ధాత్మ చెప్పినది. అలా నేను ఆయన యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నేను నడిపించుచుండగా, “వెనుకకు తిరిగి నీ చుట్టూ చూడుము”అని ఆయన నాతో చెప్పెను.”“ బ్రెన్ హామ్ సహోదరుడా, నా చేతులు అవిటి చేతులు”అని ఆమె నాతో చెప్పినది.
“ప్రభువైన యేసు నామములో, నీ చేతిని నాకు ఇవ్వుము,”అని చెప్పాను. ఆ అవిటి చేతులు చక్కని చేతులుగా మారిపోయాయి.
ఒక పెద్ద ఇరిష్ పోలీసు ఈల వేస్తూ, “మీరు ఎవరో నాకు తెలుసు, సహోదరుడా బ్రెన్ హామ్,”అని అన్నాడు.
ఓ, కొద్ది నిమిషములలోనే ఆ రోడ్డు మీదే నేను ఒక ప్రార్థనా వరుసతో అందరికి ప్రార్థనలు చేయవలసి వచ్చినది. అది కేవలము ప్రతిచోట అలాగే జరుగును. అది ఏమిటి? అది దేవుని ఆత్మ యొక్క నడిపించుట, స్నేహితుడా, అది అదే అయివున్నది.
26.ఈ మధ్యనే నేను డల్లాస్ వెళ్ళుచుండగా (నేను త్వరగా ముగించెదను). ఏదో అంతరాయం కలిగినందు వలన విమానం మధ్యలోనే ఆగిపోయినది. నేను రాత్రి అంతయూ ఆగి ఉంటిని. మరుసటి ఉదయమున నేను నా యొక్క ఉత్తరము, ఉత్తరముల డబ్బాలో వేయుటకు వెళ్ళుచుంటిని. వారు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళెదరని వారు చెప్పిరి.
నేను వీధి గుండా వెళ్ళుచూ, ఆ చిన్న పురాతన క్రైస్తవ పెంతెకోస్తు సాంప్రదాయ పాటను పాడుటకు ప్రయత్నించుచుంటిని. “నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు సంతోషము.”మీరు దానిని ఎప్పుడైనా విన్నారా? అది…
ప్రతి స్థలములో ఉన్న ప్రజలు హృదయములన్ని,
అగ్ని జ్వాలలతో మండుచున్నవి,
ఆ అగ్ని మీద పడుచుండగా…
పరిశుద్ధాత్మ,
అది మనము అందరమూ ఒకటే, (లేక అలాంటిది).
నేను ఆ పాటను పాడుటకు ప్రయత్నము చేయుచు, నా ఉత్తరములు నా చేతిలో ఉండెను, వీధి దాటుటకు మొదలు పెట్టినపుడు. “ఆగుము”నీవు సరిగ్గా ఒక బ్యాంకు ఎదురుగా ఉన్నావు,”అని పరిశుద్ధాత్మ చెప్పెను (మెంఫిస్, టెన్నిసి బ్యాంకు).
“ఓ, ఇది ఏమిటి?”అని అనుకున్నాను.
నేను మలుపు వరకు నడిచి వెళ్ళి, “తండ్రీ, నేను ఏమి చేయవలెనని కోరుచున్నావు?”అని అన్నాను.
నేను అలాగే కొన్ని నిమిషములు నిలుచుంటిని, ఎందుకనగా నేను దానిని గురించి ఆలోచన చేయుట లేదు. నా మీద ఏదో ఒక నిజమైన వి౦త భావన కదలడము నేను చూచాను, “వెనుకకు తిరిగి సరిగ్గా వెళ్ళుము”అని చెప్పెను.
నేను వెనుకకు వెళ్ళి, మళ్ళీ ఆ హోటలును దాటితిని, అదే విధముగా వీధి గుండా వెళ్ళుచుంటిని. నాకు నేను మెల్లిగా, “నేను వారిలో ఒకడును అని చెప్పగలుగుచున్నందుకు నాకు ఎంతో సంతోషము,”అని పాడుతూ వెళ్ళుచుంటిని.
నేను నడుచుకుంటూ మెంఫిన్ బ్యాంకుకు అవతలి ప్రక్కన వున్న నల్ల జాతీయులు వుండు ఆ జిల్లా ప్రాంతము వైపు వెళ్ళుచుంటిని. “ఇక్కడ నేను ఏమి చేయుచున్నాను,”అని అనుకున్నాను. కేవలము ఆత్మద్వారా నడిపించబడితిని.
మరియు నేను చూచితిని. “ఈ దారి దాటుము”అని చెప్పెను. నేను వీధి దాటి అవతలి ప్రక్కకు వెళ్ళితిని. నేను అక్కడకు వెళ్ళుచుంటిని. నా కుడి ప్రక్కకు తిరిగి కొద్దిగా ముందుకు వెళ్ళితిని. చిన్న తెల్ల సున్నము వేయబడిన ప్రదేశముగా అది యుండెను. నల్ల జాతీయులు నివసించుచున్న స్థలములలో కొంచెము రంగు వేయబడి యుండెను
27.నేను అలా నడుచుకుంటూ వెళ్ళుచుండగా, ఒక నల్లజాతీయురాలైన వృద్ధ స్త్రీని నేను చూచితిని. ఆమె పేరు జెమిమా అనే వృద్ద స్త్రీ. ఒక పురుషుని చొక్కాయిని ధరించుకొని, పురుషులు ధరించు చొక్కాయిని తలపాగాలాగా తలచుట్టూ చుట్టుకొని తన ఇంటి గేటు మీద ఆనుకొని వీధివైపు చూస్తూ యున్నట్లుగా ఆమెను నేను చూచితిని. సూర్యుడు ఉదయించుచుండెను. గేటు చుట్టూ గులాబి పూలు ఉండెను. సూర్యుడు ఆ గులాబి పువ్వుల సువాసనను ముద్దుపెట్టుకొని వెళ్ళుచుండెను. చాలా చక్కని చల్లని గాలి వీచుచుండెను. పక్షులు పాడుచుండెను. ఎంత మహిమకరము. అంతే కాకుండా దేవుని ఆత్మ నన్ను నడిపించుచుండగా నేను పాట పాడుకుంటూ నా చేతులను అలా ఊపుకుంటూ వెళ్ళుచుంటిని.
నేను అలా వెళ్ళుచుండగా, ఆమె వైపునకు చూచితిని. ఆమె గేటుపై ఆనుకొని ఉండెను, “శుభోదయము, పార్సన్ గారు,”అని ఆమె అన్నది. అక్కడ దక్షిణమున ఆ విధముగా పిలిచెదరు, (“పాష్టరు గారు”అని పిలువబడుటకు బదులుగా వారు “పార్సన్”అని పిలిచే అలవాటు.)
“శుభోదయము, అంటీ”అని నేను అన్నాను. ఆమె తన కళ్ళలో కన్నీరు తుడుచుకొని, నవ్వడము మొదలు పెట్టినది.
“నేను పాస్టరును అని మీకు ఎలా తెలియును? నేను మీకు తెలుసునా?”అని అన్నాను.
ఆమె “లేదు, అయ్యగారు”అని అన్నది.
“నేను పాస్టరును అని నీకు ఎలా తెలుయును?”అని నేను అన్నాను.
“పాస్టరు గారు, బైబిలులో ఉన్న ఆ స్త్రీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, షూనేమీయురాలైన స్త్రీ,”అని చెప్పినది.
నేను “అవును”అని అన్నాను.
“ప్రభువు ఆమెకు బిడ్డను ఇచ్చెనా?”అని చెప్పెను.
నేను “అవును”అన్నాను.
ఆమె “నేను కూడా గొడ్రాలైన స్త్రీగా ఉన్నపుడు, ప్రభువు నాకు ఒక కుమారుని ఇచ్చెను. అతనిని ప్రభువు కొరకు నేను వాడిని పెంచి పెద్దవాడిని చేస్తాను అని ప్రమాణము చేసాను. నేను చేయగలిగినంత శ్రేష్ఠమైన దానిని వానికొరకు చేసాను, కాని పాస్టరు గారు, అతను తప్పుడు మార్గమును ఎన్నుకొనెను. అతడు ఒక మంచి యవ్వన పురుషుడుగానే యుండెను, కాని వాడు దారి తప్పిపోయాడు. అతడు తప్పుడు వారితో వెళ్ళెను. అతడు ఇప్పుడు ఇక్కడ పడి ఉన్నాడు. డాక్టర్లు వారు చేయగలిగినంత అతని కొరకు చేసారు, అతడు ఇప్పుడు రెండు రోజులుగా మతిలేకుండా ఉన్నాడు, అతడు చనిపోబోతున్నాడు, అని డాక్టర్లు చెప్పిరి. అది ఒక లైంగిక సంబంధమైన వ్యాధి అయి వున్నది. అతనికి ఏమి ఇవ్వవలసి ఉండేనో అదంతయూ ఇచ్చిరి, కాని వారు చూచుటకు ఇది చాలా ఆలస్యమైనది. అతడు చనిపోబోతున్నాడు. పాస్టరు గారు, అతడు దారితప్పిన ఒక పాపిగా, చావుటకు సిద్దముగా ఉన్నాడని నాకు తెలుసు, నేను దానిని భరించలేకున్నాను, నేను ప్రార్థించి, ఇలా వానికొరకు ఎడతెగక ప్రార్థిస్తూ వుంటిని. “ప్రభువా, నీవు నాకు కుమారుణ్ణి ఇచ్చావు, కాని ఏలియా ఎక్కడ ఉన్నాడు,”అని ప్రభువును అడుగుచూ ప్రార్థించితిని. ఆ విధముగా అడుగుచూ ఎడతెగక ప్రార్ధిస్తూ, ప్రార్ధిస్తూ వుండగా, “ఈ ఉదయమున తెల్లవారుచుండగా, ఇక్కడ ఈ గేటు వద్దకు వచ్చి నిలువబడమని, ప్రభువు, నాతో చెప్పెను,”అని చెప్పెను. ఆమె వీపు భాగము మంచుతో తడిసి ఉండెను. “నేను కేవలము ఇక్కడ నిలబడితిని, ఎందుకనగా నేను ఆత్మయొక్క నడిపింపును నమ్ముచున్నాను,”అని ఆమె చెప్పినది.
28.ఓ, విశ్వాసమనే ఒకే స్థలమునందు, దేవుడు మరియు విశ్వాసి ఒకరినొకరు కలుసుకొనెదరు.
ఆమె “ఆయన నన్ను ఇక్కడ నిలువబడునని చెప్పెను, సూర్యుడు పైకి వచ్చెను. నేను అలాగే వేచి ఉంటిని, నీవు వీధి గుండా నడుచుకుంటూ వచ్చుచున్నపుడు, నీవొక పాస్టరుగారివని నేను తెలుసుకొన్నాను,”అని చెప్పెను.
“నా పేరు బ్రెన్హా౦,”అని చెప్పాను. ఆమె తన పేరును చెప్పినది.
“నీవు నా పరిచర్యల గురించి ఎప్పుడైనా విన్నావా,”అని అడిగాను.
“లేదండి, పాస్టర్ గారు,”వినలేదు.
వాటి గురించి చెప్పాను, మరియు ఆమె చెంపల మీదుగా కన్నీరు కారినది. “ప్రభువు నన్ను ఎన్నడు విడువడని నాకు తెలుసు,”అని ఆమె చెప్పెను.
29.మేము గదిలోనికి వెళ్ళితిమి. అక్కడ మంచి పెద్ద బాలుడు పరుండి ఉండెను. నూట-అరవై లేదా నూట-డెభై పౌండ్ ల బరువు కలిగి, “అమ్మా, అమ్మా,”అని మూలుగుచూ రగ్గులు అతడు చేతితో పట్టుకొని ఉండెను.
ఆమె నడిచి అతని చెంపలపై మెల్లిగా కొన్నిసార్లు తట్టినది. ఆమె బాబూ, నా బంగారమా. అని పిలిచెను. అతడికి చాలా వయస్సు కలిగియుండెను.
కాని మీకు తెలుసా, అక్కడ తల్లి ప్రేమ ఉన్నది. మీరు ఎల్లపుడూ తల్లి పిల్లలే. మీకు ఆ తల్లి ప్రేమ తెలుసా. మీరు ఏమి చేసినా గాని, ఆ తల్లి ప్రేమ అన్నది ఎప్పటికీ మరిచిపోలేనిది.
అయితే ఆమె అతని బుగ్గలపై మెల్లిగా తట్టేను, “బాబూ, నా బంగారమా,”అని పిలిచెను.
నేను అతని పాదములు పట్టుకొంటిని, అవి చల్లగా ఉండెను. “ఓ, అతడు చనిపోవుచుండెను,”అని అనుకున్నాను. “ఆంటీ, ఇతడు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు,”అన్నాను.
ఆమె అవును, “పాస్టరు గారు, ఇతడు ఎప్పటికీ సహజ స్థితికి రాలేడు, అని డాక్టర్లు చెప్పారు,”అని అన్నది.
నేను అతని కాళ్ళు పట్టుకొని, “మనము ప్రార్థన చేద్దామా,”అని అన్నాను. ఆమె “సరే, పాస్టరుగారు,”అని అన్నది.
ఆమె నేలపై మోకరించి ప్రార్ధించడము మొదలు పెట్టినది, మీకు తెలుసా, ఆ వృద్ధ పరిశుద్ధురాలు ఖచ్చితముగా దేవునితో మాట్లాడునట్లుగా ప్రార్ధన చేసెను. ఆమె ఎప్పుడైతే ప్రార్ధన చేస్తూ, ముగించుచుండగా, “ప్రియమైన ప్రభువా, మీకు కృతజ్ఞతలు,”అని అన్నది.
30.అతడు ఉన్నచోటికి నేను వెళ్ళాను. కొద్దిసేపు అతడివైపు చూసి నా చేతులు అతనిపై ఉంచాను. “ప్రియ ప్రభువా, ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు. నా విమానము పాడైపోయి పైనుండి క్రిందికి దింపివేసిన నా విమానము ఇప్పుడు సరిచేయబడి బయలుదేరుటకు సిద్దముగా వుంటుంది. కాని “ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు, కాని నేను కేవలము ఆత్మ నడిపింపునుబట్టి వచ్చాను. మరియు ఇప్పుడు, మీ కుమారుడైన యేసు నామమున ఈ చనిపోవుచున్న యవ్వనస్తుడి ప్రాణము కొరకు, అతని ఆత్మ రక్షణ కొరకు నా చేతులను ఇతనిపై పెట్టుచున్నాను,”అని ప్రార్ధన చేసాను.
“అమ్మా, ఓ అమ్మా”అని ఆ యవ్వనస్తుడు పిలిచాడు.
“పాస్టరు గారు, అతడు మాట్లాడుతున్నాడు,”అన్నది. అతడు రెండు రోజులుగా మాట్లాడలేదు.
“అమ్మా, ఇది వెలుగుతూ ఇంకా ప్రకాశమగుచున్నది. ఈ లోపలికి ఇక్కడకు ఆ వెలుగు వచ్చుచున్నది. అమ్మా, నా పడవ యొక్క ప్రయాణము ఎటు కొనసాగుతున్నదో నేను చూడగలుగుచున్నాను,”అని అన్నాడు. కొన్ని నిమిషములు అతడు నేలపై ఆనందించుచూ ఉండెను.
ఆ యవనస్తుడిలో అసలు ఆ వ్యాధి లక్షణాలు లేవు అని వైద్యులు చెప్పినట్లుగా, ఒక వారము తరువాత అతని వద్దనుండి ఒక ఉత్తరము వచ్చినది. అతడు ఈ రాత్రి మెంఫిస్, టెన్నిసి యందు ఆరోగ్యంగా, బలముగా నివసించుచున్నాడు, ఎందుకనగా అతని యొక్క ప్రియమైన వృద్ధ తల్లి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించినది. దేవుని కుమార్తెలు, కుమారులై ఉన్నవారు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడెదరు. అది సరియేనా?
31.మన తలలు వంచుదము. పరలోక మందున్న మా తండ్రీ, ఓ, మీరు మాకు ఎంతో మంచి వారుగా ఉంటిరి. మేము యేసుని గురించి, ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి మాటలాడుచుండగా సమయము అలా గడిచి పోవుచున్నది. ఈ రోజు, ఆయన అన్నాడు, “ఇంకా కొంతకాలము, లోకము ఇక నన్ను మళ్ళీ చూడదు.”ఆ మాటలను లోకము అర్థము చేసుకోలేదు; ఈ భూలోకపు దేవుడి ద్వారా వారు గ్రుడ్డివారిగా చేయబడిరి. వారి స్వంత మార్గములో, వారి స్వంత పాపపు యిచ్ఛలయందు వారు చీకటిలో నడుచుచున్నారు. కాని, “నేను మీతోను, మీలోను యుగ సమాప్తి వరకు ఉంటానని మీరు చెప్పిన దానినిబట్టి మీకు వందనాలు.”ఈ రాత్రి ఎక్కడైనా యదార్థ హృదయము కనిపించినట్లయిన, మీరు వారిని మీ ఆత్మ ద్వారా నడిపించుదురు గాక. మమ్ములను అందరిని ఒకే దగ్గరికి చేర్చుము తండ్రి.
ఓ, దేవా, ఈ శనివారపు రాత్రీయందు అనేక జనులు దుకాణములకు వెళ్ళి వాళ్ళకు అవసరమైన వాటిని కొనుక్కుంటూ వుందురు, అనేకులు బయట షికార్లు తిరుగుతూ వుందురు, మార్గము ప్రక్కన వీదులలో గడుపుదురు, అసభ్యకరమైన, అభ్యంతరకరమైన స్థలములలో గడుపుచుందురు. మధ్యపాన శాలలయందు యవ్వనస్తులు నేలపై పడి పొర్లుచుందురు, యవ్వన స్త్రీలు మార్గము ప్రక్కన నిలబడుచూ నీచ కార్యములలో పాల్గొనుచూ, క్రీస్తులేని పాతాళమువైపుగా వారు ఆటపాటలతో నాట్యమాడుచు ఎంతోమంది ఉండెదరు. వారియొక్క వృద్ధ తల్లులు వారి కోసము చేయు ప్రార్థనలు వారి తలలపై నుండి పోవుచుండగా… ఓ, యజమానుడా, వారిని మీవైపుకు తిప్పుకొని మీ మార్గముల గుండా నడిపించుము. ఈ రోజు రాత్రి వారితో మాట్లాడుము. రేపు అనే ఒక దినమున ఒకవేళ వారు ఒక మంచి పురాతన క్రైస్తవ మార్గమునకు మాదిరిగా యుండు ఒక బలిపీఠపు స్థలమును వారు కనుగొందురేమో, అట్లు కొనుగొనిన తరువాత వారు నీకు పరిచర్య చేసే ఒక సేవకులుగా మారవచ్చును. ప్రభువా, యేసుక్రీస్తును త్వరగా పంపించెదవని మేము నమ్ముచున్నందువలన, ఈ జరిగిన కూటమునకు మంచి ప్రతిఫలముగా, ఒక పురాతన క్రైస్తవ ఉజ్జీవపు కూటమునకు మాదిరిగా యుండు ఒక ఉజ్జీవము బ్రద్దలై ఇచ్చట నుండి వేగముగా దూసుకొని పట్టణములగుండా, దేశములగుండా దూసుకుని వెళ్ళుచూ సమస్తమును తుడిచి వేయును గాక! తండ్రి మమ్మల్నందరినీ ఒకే దగ్గరకు చేర్చుము.
మరియు రోగములో ఉన్నవారు, అవసరములో ఉన్నవారు, మీ ఆత్మను ఇక్కడ ఈ రాత్రి చాలా మంది ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారని మాకు అందరికి తెలియును. “ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామమున కూడియుందురో, అక్కడ నేను ఉంటానని,”మీరు చెప్పారు. ఆత్మీయ సంబంధమైన అనుభూతితో స్పష్టముగా మేము మిమ్మల్ని అనుభూతి చెందుచున్నాము. మీరు ఇచ్చట ఉన్నారని మేము ఎరుదుము.
మరియు ఇప్పుడు, తండ్రీ, దైవికమైన వరమును గూర్చి ఇచ్చట కూడియున్న వారికీ నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రభువా! మీరు నా ద్వారా మాట్లాడకపోయినయెడల, అవి నా మాటలై వారు నా మాటలను మాత్రమే వినెదరు. కాని నీవు నా ద్వారా మాట్లాడతావనియు, దానిని నిరూపించెదవనియు, వాటిని గూర్చి నీవు సాక్ష్యమిచ్చెదవనియు నేను ఎరుగుదును. అద్భుతమైన దేవుని కుమారుడా! మీకే సమస్త స్తుతులు మరియు మహిమ. మరణమునకును, వేరుపాటునకును మరియు పాతాళమునకును పాత్రులమై సమస్తమును కోల్పోయిన దీన పాపులమైన మమ్మల్ని విమోచించుటయందు మీరు ఎంతో అద్భుతమైన ప్రభువుగా యున్నావు. నీవు మమ్మల్ని విమోచించితివి. ఓ, నేను విమోచించబడ్డాను అనే దానిని గూర్చి నేను ఆలోచించినపుడు, నా హృదయము ఎంతగానో ఉప్పొంగుచున్నది. అంతేకాకుండా నీవు సమాధి నుండి పునరుత్థానుడవైనది ఎంత వాస్తవమో – అంత వాస్తవముగానే ఏదో ఒక దినమున ఇక ఎన్నటికిని వ్యాధులు లేని, లేదా బాధలు లేని ఒక నూతన శరీరముతో మేము నీ యొద్దకు వచ్చెదము.
ఇప్పుడు, ప్రియదేవా, ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారిని మీరు దీవించండి. ఇప్పుడే ఇక్కడ కూడియున్న వారి మీద సంచరించును గాక. వారిలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుము, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను,”అని వారితో చెప్పండి. దేవుని కుమారుడు, నజరేయుడైన యేసు, ఈ రాత్రి ఆయన ఆత్మ మాతో సంచరించుచున్నది. వారు దానిని పరిశుద్ధాత్మ రూపములో మాధుర్యముగా అంగీకరించుదురు గాక. మరియు రక్షింపబడి, స్వస్థత పొందుదురు గాక, ఎందుకనగా దీనిని మేము మీ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
32.అవును, నేను మరీ భావోద్వేగమైన వ్యక్తిని కాదు, కాని ఏదో కారణముచేత ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా హృదయము బలమైన ఉత్సాహము పొందినది. ఎందుకో నాకు తెలియదు. సర్వ సభికుల మీద ఈ రాత్రి ప్రభువు తన ఆత్మను కుమ్మరిస్తాడని నేను నమ్ముచున్నాను. మరియు రేపు, ఇక్కడ ఈ చిన్న స్థలమందు దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు దీనిచుట్టూ ప్రకాశిస్తూ ఉండవలయునని నేను ప్రార్థన చేయుచున్నాను.
ఓ, ప్రజలారా, ఉపవాసముండి ప్రార్ధన చేయండి, సిద్ధపడండి, యేసు. త్వరగా వచ్చుచున్నాడు. నేను దీనిని నమ్ముచున్నాను. సిద్ధముగా ఉండండి. మనము లోకమునంతయూ సంపాదించుకొని మన ప్రాణములను పోగొట్టుకుంటే మనకు ఏమి లాభము. అది మనకు ఏమి మంచి చేస్తుంది? అది దేనికీ మంచిది కాదు. మనము మన హృదయమంతటితో ఆయనను సేవిద్దాము.
33.వారు సభికులను వరుసలో సిద్దపరుచుచుండగా, మనము ఒక్క నిమిషము ప్రార్థన చేయుదుము. తండ్రి, ఇప్పుడు దగ్గరగా రండి. యేసూ, మాతో ఉండండి. ఈ రాత్రి మమ్ములను దీవించండి. ఆతురతతో ఎదురుచూచువారు ఇక్కడ ఉన్నారు. ఏదో విధంగా ఇక్కడ మా చుట్టూ మాపైన ఇంకా కొద్దిగా ఎక్కువ ఆశీర్వాదము ఉన్నట్టుగా అనుభూతి చెందుచున్నాము. మీరు మీ ఆత్మను మా మీద కుమ్మరించడానికి సిద్ధపడుచున్నారేమో. తండ్రి, అది అలాగు ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాము.
ఇప్పుడు, అందరినీ స్వస్థపరచండి. నేను జన్మించినపుడు నీవు నా యొద్దకు పంపిన దేవదూత, నీ హస్తము ద్వారా నా జీవిత కాలమంతా నన్ను నడిపించిన దూతయు, నన్ను సంధించుచూ మరియు నాతో మాట్లాడుచూ మరియు నేను చెప్పుచున్న దర్శనములను నాకు చూపించుచున్నవాడగు ఆ దూతను. ఓ యేసూ, హృదయములను గురించి తెలుసుకొనుచూ, హృదయ రహస్యములను వివేచించు వరముచేత ఆయన మాత్రమే హృదయములను వివేచించగలడు, నీ నామమున ఇప్పుడు ఆయనను పంపించుము.
“నేను చేయు కార్యములు మీరు కూడా చేస్తారు. వీటికంటే గొప్పవైనవి చేస్తారు,”అని చెప్పారు. ప్రజల అందరి హృదయము మీరు ఎరిగియున్నారు. మీరు ప్రతి వ్యాధిని ఎరిగియున్నారు. ప్రార్థనా వరుసలోనికి రాకముందు ఫిలిప్పు ఎక్కడ ఉన్నాడో, మీరు అతనితో చెప్పారు. కట్టబడిన గుర్రములు ఎక్కడ వెదకాలో మీరు వారికి చెప్పారు. చివరి రాత్రి భోజనము ఎక్కడ సిద్దపరచవలెనో, ఆ ఖాళీ గదిని గురించి మీరు వారితో చెప్పారు. ఓ, ఒక స్త్రీతో ఆమె పాపముల గురించి చెప్పారు.
అంతట ఒక రోజు వారు మీ కళ్ళకు చింపిరి గుడ్డలు కట్టి, మీ ముఖము నుండి మీ గడ్డమును లాగి, మరియు మీపైన ఉమ్మివేసిరి. “ఇప్పుడు, నిన్ను గుద్దినది ఎవరో ప్రవచింపుము,”అని చెప్పిరి. అయినను ప్రభువా, మీరు మీ నోటిని ఎప్పుడూ తెరువలేదు.
మీ అద్భుతమైన జీవితము కొరకు, మేము జీవించడానికి మీరు ఇచ్చిన ఆత్మనుబట్టి మీకు కృతజ్ఞులమైయున్నాము. ఇప్పుడు మాకు సహాయము చేయండి.
మరియు ప్రతి వ్యాధి ఈ మార్గమున వెళ్ళిపోవును గాక. గొప్ప దర్శనములు, అద్భుతములు ఈ రాత్రి జరుగును గాక. ప్రభువా, దీనిని దయచేయండి. ప్రజలు ఈ కార్యములు జరుగుట చూచుచుండగా, వారు మీ కుమారుడైన యేసు నామములో మిమ్ములను అంగీకరించుదురు గాక. ఆమేన్.
34.ఏదో ఒక విధంగా ఇక్కడ గొప్ప విషయములు జరుగబోవుచున్నాయని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మడము లేదా? చూడండి, ఇశ్రాయేలు పిల్లల ముందు మోషే తన సూచనలను ఒకసారి జరిగించగా, వాటిని చూచిన వారందరూ మోషేను నమ్మిరి. అది నిజమేనా? అతడు సూచనను చేయుటకు తన హస్తమును రెండవసారి పెట్టుట అవసరము లేకుండెను. అతని కర్రను సర్పముగా మార్చే అవసరము లేకుండేను…? ఎందుకనగా వారు నమ్మిరి.
కాబట్టి ఆయన ఇచ్చిన ఆ ఒక్క సూచన, ఆ ఒక్క సూచనను గురించి నేను మాట్లాడగా, ఆ ఒక్క సూచన నిరూపించబడినది, కాబట్టి మీరు దానిని అంగీకరించవలసినవారై ఉన్నారు. మరియు జ్ఞాపకముంచుకొనండి, ఆయన ఇచ్చట ఈ వేదికపై స్వస్థపరచు రీతిగానే, అచ్చట మీరెచ్చట యున్నను అదే సమయమున మీరు వున్న స్థలమందే అక్కడ కూడా ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలడు. అయ్యా, ఆ వేదికపైకి వెళ్ళుటకు నాకు అవకాశము లేదే అని మీరు బాధపడనవసరము లేదు. మీరు ఆయనను నమ్మండి. కేవలము మీరున్న చోటనే ఆయనను అంగీకరించండి, దేవుడు మీరు కూర్చున్నచోటనే మిమ్ములను స్వస్థపరుచును. మీరు దానిని నమ్ముదురా? సరే, మంచిది.
ఇప్పుడు, ప్రతి ఒక్కరూ నిజమైన భయభక్తితో ఉండండి. మరియు ప్రార్థించండి. ఓ, నేను అనుభూతి చెందుతున్న రీతిగా మీరందరూ కూడా అదే విధమైన ఆ అనుభూతిని అనుభవించాలని నేను ఆశించుచున్నాను. అది ఒక మధురమైన అనుభూతి, సమాధానముతో నిండిన అనుభూతితో ఎంతో తేలికగా అయిపోయిన నిర్మలమైన అనుభూతిని మీరు అనుభవించగలరు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మరియు సహాయము చేయుటకు ఆ ఆత్మ ఈ భవనములో సంచరించుచుండగా… [టేపుపై ఖాళీ స్థలమున్నది.]
ఇప్పుడు, మీలో నేను ఎవ్వరిని ఎరుగను, నాకు తెలిసినంత మట్టుకు మీలో ఒక్క వ్యక్తిని కూడా ఎరుగను. మరియు మీలో ఏ వ్యాధి, బాధలు ఉన్నవో వాటిని గురించి నాకు తెలియదు, కాని దేవుడు వాటిని గురించి ఎరిగియున్నాడు. మీలో అసలు ఏ బాధ ఉన్నదనే దానిని గూర్చి ఒక్కటి కూడా నాకు తెలియదు. కాని నేను ఆయన మీద ఆధారపడవలెను, కాబట్టి క్రైస్తవుడా నాతో ప్రార్థన చేయుము.
35. శుభ సాయంకాలము, ఒక్క నిమిషము కావచ్చును, మీతో మాట్లాడుటకు నేను కొద్దిసేపు నేను కుదుటపడవలయును. మీరు నాకు కొత్త, నేను మీకు కొత్తవాడిని, నా జీవితములో ఎన్నడూ నిన్ను చూడలేదు. మీరు నన్ను ఎప్పుడూ చూడలేదని, నేను ఊహించుచున్నాను. మీరు ఆరోగ్యముగా, బలముగా కనపడుచున్ననూ నీలో ఏదో ఒక బాధ ఉన్నది, లేకపోతే మీరు ఇక్కడ ఉండియుండరు. ఒక్క నిమిషము నీ చేతిని చూడనిమ్ము, అయ్యా, దానిని నేను కనుగొనలేకపోతున్నాను. కావున ఒక్క నిమిషము మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీవు దేవుని నమ్ముదువా? అవును, నీవు దేవుని నమ్ముదువు, లోకమును తనలో సమాధానపరచుకొంటూ క్రీస్తులో దేవుడు ఉన్నాడని నీవు నమ్ముదువా? మరియు క్రీస్తులో ఉన్న ఆ ఆత్మ తిరిగి భూమి మీదకు వచ్చి పరిశుద్ధాత్మ రూపములో సంఘములో నివసించుచున్నదని నీవు నమ్ముదువా? తొమ్మిది ఆత్మ వరములు సంఘమునకు ఇచ్చెనని నీవు నమ్ముదువా? నీవు నాకు ఒక తెలియని వ్యక్తిగా ఇప్పుడు వున్నావు. నిన్ను గురించి నాకు ఏమి తెలియక, అసలు నీలో వున్న బాధ ఏమిటన్నదనే దానిని గూర్చి నేనెప్పటికీ ఎరుగలేనపుడు, ఆ సమయమందు దానిని ఒక ఆత్మీయ సంబంధమగు ఆయన ద్వారానే అది నాకు బయలుపరచబడవలసి వున్నది.
మీరు చింత కలిగియున్నారు, అవును కదా? సహోదరీ, నీవు ఎక్కువగా మూర్చపోయెదవు. నేను నీ యొక్క మనస్సును చదువుటలేదు. నీపై ఏదో ఒక విధమగు… ఏదో ఒక వింతైన నిజమైన అనుభూతిని నీపైకి ఇప్పుడే వచ్చుట ఆరంభించినది. అది నిజమైనయెడల నీ చేతిని పైకి ఎత్తి సభికులకు చూపించుము. గమనించు. ఎప్పుడైతే నీ ఆత్మ దానితో సంబంధము కలిగి మరియు దానిని పొందగలుగుతాదో… ప్రభావము నా నుండి బయలు వెళ్ళి, నేను బలహీనమగుచున్నట్లుగా ఇప్పుడు నేను దానిని అనుభూతిని చె౦దుచున్నాను. మీరు గమనించండి. ఒక దర్శనము నాకు కలుగుటకు ముందు, దానిని చూచునపుడు అలా జరుగవచ్చును. దానిని గురించి నాకు తెలియదు. అవును, నీవు బాధపడుచున్నావు. నీవు క్యాన్సరు కలిగియున్నావని నీకు చెప్పబడినది. అది నిజమేనా? కేవలము భయభక్తి కలిగియుండండి. సహోదరీ భయపడవద్దు. నమ్మకముంచుము. ఇప్పుడు అదేమిటో చూడనిమ్ము, ఇప్పుడు భయభక్తులు కలిగియుండుము. నీవు తిమ్మిరిగా ఉన్న భావము కలిగియుండవచ్చును. అది ఒకరకమైన …?.. అది విరుగగొట్టబడినది అని నా భావము. నీవు నావైపే చూస్తూ ఉండుము. చూడు, అంతా సరియే, నీవు క్యాన్సరుతో ఉన్నావని వైద్యుడు నీతో చెప్పలేదు, కాని ఒక మనుష్యుడు చెప్పాడు. నీవు ప్రార్థనా వరుసలో ఉంటివి. ఆ తరువాత నీవు ఒక వైద్యుని కలిసావు. మరియు అతడు నీకు క్యాన్సరు లేదు అని చెప్పాడు. అతడు నీతో చెప్పాడు… అతడు ఏదో చెప్పడము నేను చూచుచున్నాను, ఒక మామూలు దుస్తులు ధరించిన వ్యక్తి, ఒక నల్లటి కోటు ధరించిన వ్యక్తి. ఇప్పుడు, అసలు నీ బాధ నీ గొంతులో యున్నది. అది నిజమేనా? అవును, అది నిజము. అది నీ గొంతులో యున్న బాధ. సహోదరీ, అది నరముల బలహీనత. అది నిన్ను బాధించుచున్నది. నీ గొంతులోయున్న నరములు వలననే నీవు బాధతో ఇబ్బంది పడుచున్నాము. దానినుండి పూర్తిగా విడుదలనొంది బాగవుదువు. యేసుక్రీస్తు…? నీవు ఇప్పుడు విశ్వాసము కలిగి వున్నావు, కలిగి లేవా?
తండ్రీ, చింతతోను, శ్రమచేత నీ కుమార్తె ఇక్కడ నిలబడి యున్నది. ఆమె ఏదో తప్పు చేసినదని భావించుచున్నది, కాని ఏమిటి…?.. ఇప్పుడే, దేవా, నీ బిడ్డను ఓదార్చుము. ఈ బలహీనత కొరకు అడుగుచూ, ఆమె గొంతులోని ఆ వేదన ఆమెను విడిచి వెళ్ళునట్లుగా నేను నా హస్తములను ఆమెపై మీ కుమారుడైన యేసు నామమున ఉంచుచున్నాను. ఇప్పుడే. ఆమె యొక్క ప్రియమైన వారి యొద్దకు ఆరోగ్యముగా, మంచిగా ఆమె వెళ్ళును. సాతానా, యేసుక్రీస్తు నామమున ఈ అమ్మాయిని విడిచి వెళ్ళుము. ఇప్పుడు సహోదరీ చూడుము, సరే నీతలను పైకెత్తుము. సహోదరీ, అది నిజమేనా? ప్రతీమాట… [ఆ సహోదరి, సహోదరుడు బ్రెన్ హామ్ గారితో మాట్లాడుచున్నది.] నీవు దానిని కలిగి లేవా? నీవు ఇంటికి వెళ్ళుము. నమ్మకముంచుము. నేను నీకు చెప్పినట్టుగా చేయుము. దానినంతయూ మరిచిపొమ్ము. ఇంటికి వెళ్ళుము, తినుము, త్రాగుము, సంతోషించుము, మరియు దేవుణ్ణి స్తుతించుము. నీ స్వస్థత గురించి ప్రతి ఒక్కరితో చెప్పుము, మరియు దేవుని మహిమపరుచుము. దేవుడు నిన్ను దీవించును గాక…?.. [ఆ సహోదరి సాక్ష్యమిచ్చుచున్నది.] ఆమేన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
అంతా సరియే, ఇలా చెప్పెదము, “దేవునికి స్తోత్రము,”ప్రతి ఒక్కరూ కేవలము నిజమైన భయభక్తిని కలిగియుండండి. సరే, మంచిది. మీ తరువాత రోగిని తీసుకు రండి. ప్రతి ఒక్కరూ భయభక్తిని కలిగి ఉండండి. సహోదరుడా, కృతజ్ఞతలు.
36.సహోదరీ, దేవుడు మిమ్మును దీవించును. అమ్మా, ఏడ్వడము ఆపండి, అమ్మా ఇటువైపు చూడండి. నీలో నీవు ఏదో బాధను కలిగియున్నావు అవునా? ఒక్క నిమిషము లేచి నిలబడండి. ఆమె లేచి నిలబడుచున్న సమయమందు నల్లని వస్త్రములను ధరించిన ఒక స్త్రీ నావైపే చూచుచున్నది. ఇంకను ముందు ఏదో జరుగడము నేను చూచాను. నీవు కూడా ఏదో ఒక బాధను కలిగియున్నావు కదా! అదేమిటో కాదు, అది స్త్రీలకు వచ్చే ఒక వ్యాధియైయున్నది. అది అవునా? కాదా? ఆహారమును భుజించలేక నీవు ఆహారమును వద్దనటము నేను చూచుచున్నాను. ఇప్పుడు నీవు కడుపులో కూడా ఇబ్బందిని కలిగియున్నావు. వుంది కదా? సరే, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచి యున్నాడు. నీవు ఇంటికి వెళ్లి, నీకు తినాలనిపించినది తినుము. ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇచ్చియున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను దీవించు గాక! ఇప్పుడే దానిని పట్టుకొనెను.
మంచి ధైర్యము కలిగియుండుము. నీవు ఒక సేవకుడివి కాదా? నీవు గౌరవనీయుడవు? నీవు కాదా? నీవు బలిపీఠమునకు దగ్గరగా నిలిచియుండటమును నేను చూచాననుకొంటున్నాను. అది నీ భార్య, అవునా? నరాల బలహీనతలో ఉన్నది. అది సరియేనా ? ధైర్యము కలిగియుండుము. కేవలము ప్రార్థిస్తూ ఉండుము. దానియొక్క భాగము, బయటకు వెళ్ళుటను నేను చూసాను, కాని ఏమి జరిగినదో నాకు తెలియదు. గౌరవముగా, ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండుము. మంచి ధైర్యము గలిగి ఉండుము.
మీరు ఎలా ఉన్నారు? రోగి మీరేనా [టేపు పై ఖాళీ స్థలమున్నది.] “దేవునికి స్తోత్రము.”అది ఒక…. ఉద్రేకము, మీరు ఎందుకు ఉద్రేకములో ఉన్నారని నీవు ఆలోచించుచున్నావు. ఇప్పుడు, ఆ స్త్రీ యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరచినది. ఆమె యొక్క విశ్వాసమే దానిని క్రియ జరిగించునట్లుగా చూసీనది. నీవు కేవలము నమ్మడానికి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, నీవు దేనినుండైనా స్వస్థత పొందగలవు. ఆమేన్.
37. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక, నీ కష్టమును చూచుచున్నాను. కాని నేనేమి చేయలేను…?.. నీవు పొందుకోవాలని ప్రయత్నిస్తున్నావు. దానిని ఎలాగు సాధించెదవు సహోదరి. ఒక్క నిమిషము మీ చేతిని చూడనివ్వండి, సహోదరి ఇటు చూడండి. నీలో ఉండే అనేక విషయాలు సరికావని నేననుకుంటున్నాను, కాని వీటన్నింటికీ ముఖ్యమైన కారణము ఒక్కటి వున్నది, అదేమనగా నీలో ఉండు నరాల బలహీనతే. నీలో ఆ నరాల బలహీనతే చాలా తీవ్రముగా యున్నది. అవును కదా? మీరు ఆ విధముగా చాలా కాలముగా ఉన్నారు. మీ కళ్ళలో ఒక విధమైన దృష్టి లోపము ఉన్నది. ఆ కళ్ళలో నుండి కన్నీళ్ళు కారవు. ఆ కళ్ళలో నీళ్ళు ఇంకిపోయినవి. అది నిజమే కదా! నీ చిన్ననాటి కాలము నుండియే నీ కళ్ళు ఆ విధముగా ఉన్నవు, అవును, నీ పాఠశాలలో ఒక చిన్న బాలికగా చదువుతున్నప్పటి నుండియే ఆ కళ్ళల్లో అసలు నీళ్ళు లేకుండా, కన్నీళ్ళు కారని కళ్ళను నీవు కలిగియున్నావు. దానిని నేను చూచుచున్నాను. ఇప్పుడు నీవు నమ్ముము. నీలోని ఆ గ్రంధులే…?.. నీ నరముల బలహీనతకు కారణముగా యున్నది. [సహోదరుడు బ్రెన్ హామ్,ఆ సహోదరితో మెల్లిగా మాట్లాడుచున్నారు.] నీ పూర్ణ హృదయముతో ఇప్పుడు నీవు నమ్మకముంచుము. మీ చేతిని చూడనివ్వండి. ఇప్పుడు, ఓ స్త్రీ చూడుము, నీ నరాల బలహీనత నుండి విడుదల పొందుకొన్నావని మరియు నమ్ముటకు నీవు ప్రయత్నించుచున్నావని నేను గ్రహించుచున్నాను. నీవు అలాగే ఇప్పుడు నమ్ముచూ ముందుకు కొనసాగిపోవాలని నేను ఆశించుచున్నాను. ఆ నమ్మకము నుండి నీవు వెనుకకు తిరిగి చూడవద్దు, గమనించుము, ఆ నమ్మకమువైపే చూస్తూ ముందుకు కొనసాగిపొమ్ము. ఆ దర్శనము నా నుండి ఇప్పుడు తొలగిపోవుచున్నది. నీవు నమ్ముచున్నావా? ఆ నరాల బలహీనత నీ నుండి తొలిగిపోవాలని నేను ఆయనను అడుగబోవుచుండగా, దానిని నీవు నమ్మెదవా? అది నిజము, విశ్వాసముతో వుంటూ ప్రార్థించుటకు నీ తలవంచుము.
మా పరలోకపు తండ్రీ, మా సహోదరిని సరిగా చేయుటకు మీ కనికరము చూపుమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఆమె యొక్క నరాల బలహీనతతో బాధపడుచు, కృశించిపోవుచూ మరియు ఇంకా ఆమె జీవితములో ఎన్నెన్నో బాధలతో నిండియున్నది. ప్రియమైన దేవా, ఈమెను మీ నామమున నేను దీవించుచుండగా, నేటి రాత్రియందు ఈమెను మీరు స్వస్థపరుస్తారని నేను ప్రార్ధించుచున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విశ్వసించుచుండగా, మీరు ఈ సహోదరిని సంపూర్ణముగా స్వస్థపరచుము. ఆమేన్, సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఆయనను ఏ మాత్రము సందేహింపకుము. పూర్ణహృదయముతో విశ్వసింపుము…?… సరే, మంచిది, మీ యొక్క తరువాత రోగిని చూద్దాము.
38. అయ్యా, ఎలాగున్నారు? ఇక్కడ మన సహోదరుడు, ఆ మనుష్యుడు ఇప్పుడే స్వస్థత పొందాడు. కొద్దిసేపు ముందే… మీరండీ.
నేను నీ కొరకు ప్రార్థన చేయుచున్నపుడు, చల్లని ప్రశాంతమైన ఒక అనుభూతి నీలోనికి వెళ్ళుచున్నట్లుగా నీకు అనిపించినది కదా! అది సరికాదా? మీరు చేయుచున్నవన్నింటినీ మరియు చేసిన కార్యములను గూర్చి ఇచ్చటే ఇప్పుడు పరిశుద్ధాత్మ బయలుపరచుతాడు. అది సరి అయితే, మీరు మీ చేతిని ఎత్తండి, సభికులందరూ తెలుసుకొంటారు. నీవు నాకు అసలు పరిచయములేని వ్యక్తివి. అవునా? ఇప్పుడు, పరలోకము నుండి దేవుని యొక్క వరము మన మధ్యకు దిగి వచ్చినదని ఎంతమంది నమ్ముచున్నారు? అది సరియే. అది అమోఘము. ఇప్పుడు, మీ విశ్వాసమే మీ స్వస్థత, కాని దేవుని వరము పరిపూర్ణమైనది, పరిపూర్ణమైనది, ఎప్పటికీ తప్పిపోనిది, తప్పిపోలేనిది, ఎందుకనగా అది దేవుడు. మరి నీకు ఆయన చాలా దగ్గరగా ఉండి మరియు నిన్ను గూర్చిన సంగతులు తెలుసుకొని ఆయన వాగ్దానము చేసిన రీతిగా వాటిని నీకు బయలుపరుచును. “నేను చేయు కార్యములు, వాటికన్న గొప్ప కార్యములు మీరు చేసెదరు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను,”అని ఆయన చెప్పెను. అది సరియేనా?
ఇప్పుడు, ఎవరో ఒకరు ఈ విధముగా ఆలోచించి. ఇది ఒక మానసిక శాస్త్రము వలె కనిపించుచున్నదని అనవచ్చును. మరియు ఏ విధముగా ఆ దయ్యము కోపపడగలదో మీకు తెలుసు. వారు యేసును, ఆయన బయల్జెబూబు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు. అది మీకు తెలుసా? అది సరియేనా? దయ్యములకు అధిపతి, వారు ఇంకా ఏదో వెతకవలెను. మరియు ప్రజల వైపు చూస్తూ, వారి కళ్ళలోకి చూస్తూ, వారి మనసులను చూచి చదువుట, స్నేహితుడా, ఇది అది కాదు. ఇది ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను ఆకర్షించుట. చూడండి, వారు మానవులు మరియు వారు దీనిని నమ్ముటకు వారి విశ్వాసము ఈ స్థాయికి ఎదిగేంత వరకు కట్టబడవలసియున్నది. లేకపోతే అతడు విడుదల పొందడు. గమనించండి…
39.దీని యొక్క క్రమమును వినండి; ప్రత్యేకముగా సేవకులు దీనిని వినవలయును. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది, జాగ్రత్తగా వినండి. ప్రజలు నిన్ను నమ్మేటట్లు నీవు చేయగలిగితే, “ప్రార్థన చేయునప్పుడు యదార్థముగా ఉండుము. నీ యొక్క ప్రార్ధనముందు ఏదియూ నిలువ జాలదు,”అని ఆయన చెప్పెను.
“వారు నన్ను నమ్మరు. నేను చదువులేనివాడిని, నేను సరిగా మాట్లాడలేను, మరియు నేను బీద కుటుంబములో జన్మించాను. ఇంకా అనేకములు అలాంటివి నాయందుగలవు,”అని ఆయనతో నేను అన్నాను.
ఆయన అన్నాడు, “నేను నీతో ఉంటాను, మరియు ప్రజలు నిన్ను నమ్మునట్లు నీకు రెండు సూచనలు ఇవ్వబడును.”
ఇప్పుడు, ఆ సూచనలు ఊరకనే ప్రజలు నమ్మునట్లు చేయుచున్నాయి. ఇది వారిని స్వస్థపరచదు. వారి విశ్వాసమే వారిని స్వస్థపరచును. ఎంతమంది దీనిని అర్థము చేసుకొనియున్నారు. మీ చేతులను ఎత్తండి. ఓ, అది అద్భుతము.
ఇప్పుడు, ఆ వ్యక్తులు…?.. ఇక్కడ ఒక మనుష్యుడు నిలువబడి యున్నాడు. నేను అతనివైపు చూడలేదు. అతడు నాకు తెలియదు, కాని నేను వెనుకకు తిరిగి నా వీపును అతనివైపు తిప్పి అతడితో నేను ఇలా చెప్పాను, నేను దేనిని గురించి చెప్పుచున్నానో దానిని నీవు నమ్మి మరియు అది సత్యమని, నీవు నీ పూర్ణహృదయముతో నమ్మినట్లైతే, నీలోయున్న బాధ ఏమిటనే దానిని ఆయన నీకు తెలుపును. నీవు దీనిని నమ్ముదువా? నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నానని చెప్పుము. అక్కడ నిలబడిన వ్యాధిగ్రస్తుడవు నీవా? నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముదువా? సరే, మంచిది. నిన్ను నేను అసలు తాకనే తాకలేదు. నీలోనున్న బాధ ఏమిటనే దానిని నేను చెప్పగలిగితే… నేను చెప్పినది తప్పా లేక సరియా అనే దానిని నీవెరుగుదువు, అవును కదా? అది సరియే? ఇది దేవుని యొద్ద నుండి వచ్చుచున్నదని నీవు అంగీకరించుము. సరే, నేను నీతో చెప్పునది నీవు చేసెదవా? సరే, నీవు ఇంటికి వెళ్ళవచ్చును, నీవు కలిగియున్న ఆ గుండె నొప్పిని, దానిపై నీవు జయమును పొందుకొని బాగవుదవు. ఎందుకనగా ప్రభువు నిన్ను స్వస్తపరచియున్నాడు? దేవుడు దీవించును. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా స్వస్థపరుచును.
40.మనము మన తలలు వంచి ప్రార్థన చేసెదము. పరలోకమందున్న మా తండ్రీ, మా స్నేహితుడైన యేసుక్రీస్తు ఆత్మ కొరకు మా హృదయాంతరంగములో నుండి నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఆయన రక్షించువాడు, స్వస్థపరచువాడు, కార్యములన్నింటిని చక్కదిద్దువాడై యున్నాడు. ఈ రాత్రి అక్కడ ఉన్న ప్రతివారిని, దేవా, దీవించుము. ప్రభువా, ఇప్పుడే ఇక్కడ ఉన్న సభికులు, ప్రతిచోట ఉన్నవారు నిన్ను నమ్ముదురు గాక. ప్రతి ఒక్కరు స్వస్థత నొందుదురు గాక! ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ఇప్పుడే దిగివచ్చి, మా మధ్య కదలాడుచుండగా; బాధలలో ఉన్న వారిని, మరియు వ్యాధి గ్రస్తులందరిని స్వస్థపరచును గాక! రక్షింపబడని వారిని రక్షించండి, వారిని మీ యొక్క జ్ఞానమునకు తీసుకు రండి, మరియు మీరు త్వరగా వచ్చుచున్నారని, ప్రియ యేసు, ఆత్మలో నిండిన వారిని తీసుకు వెళ్ళుతారని, రక్తములో కడుగబడిన వారిని, మిమ్ములను కలువడానికి సిద్ధముగా ఉన్నారని వారికి తెలియపరుచుము. మీ యొక్క దీన సేవకుని కేకను వినుమని యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్.
సరే మంచిది, ప్రతి ఒక్కరు భయభక్తితో ఇక్కడే ఎవరో ఒకరు ప్రార్థన చేయుచున్నారు. సరే మంచిది, భక్తితో ఉండండి. ప్రతి ఒక్కరూ…?.. స్నేహితుడా. ఇక్కడ వరుసలో నిలువబడిన ఒకరు, గతరాత్రి ప్రార్థన చేయబడలేదు, ఎవరో ఒకరు మరియు నేను వారితో ఆత్మ సంబంధము కలిగియున్నాను.
సహోదరీ, శుభ సాయంకాలము, నీవు నీ పూర్ణహృదయముతో ఆయనను ప్రేమించుచున్నావా? నీవు నీ పూర్ణహృదయముతో ఆయనను నమ్మగలవా? దేనినైతే నీవు అనుభూతి చెందుచున్నావో అది అయనే. దానిని నీవు నమ్ముచున్నావా? అది నిజమని ఎరుగుదువా? నీలోయున్న స్త్రీలకు సంబంధించిన ఆ వ్యాధి ఇప్పుడు నీ నుండి వదిలి వెళ్ళిపోయినది. నీవు, నీ ఇంటికి వెళ్ళి చక్కగా వుండుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేసియున్నాడు. “దేవునికి స్తోత్రము,”అని చెప్పుదము. ఆ విధముగా నీవు నమ్మవలసి యున్నది. ఆమేన్.
41.సహోదరీ, నీవు భయంకరమైన కష్టముగా ప్రయత్నించుచుంటివి, అవునా? మంచిది, ఇక్కడ చూడుము. నీవు ఇటువైపు చూడవలెనని కోరుచున్నాను. నీవు మంచముపై పరుండి రెండుసార్లు కదలటము నేను చూసాను. నేను నిన్ను ఒకటి అడుగాలని అనుకుంటున్నాను. నీవు నాకు క్రొత్త, నీవు ప్రార్థనా కార్డు పొందలేనందువల్ల నీవు కృంగి ఉంటివి. అది సరియేనా? నీవు ఒక కార్డును ఖచ్చితముగా కావలెనని కోరితివి. సహోదరి, నీవు నాకు తెలియదు, కాని ఇప్పుడు నీలోవున్న బాధ ఏమిటన్నది అనే దానిని నేను ఎరుగగలను. కాని నీ కొరకు ఏదో ఒకటి చేయబడని యెడల నీవు ఇంకా కొద్ది రోజులే జీవించుదువు అని నాకు తెలుసు, ఎందుకనగా నీవు క్యాన్సరుతో బాధపడుచున్నావు. అది సరియేనా? అది సరియే. ఏదో ఒకటి చేయబడితే తప్ప నీవు జీవించలేవు. నీ సహోదరుడు చేసినట్టుగా నీవును చేయవలెనని నేను కోరుచున్నాను. నీవు చనిపోవువరకు అక్కడే ఎందుకు పడుకొని యుందువు? వైద్యము ద్వారా నీవు పొందుకోగలిగే ప్రయోజనము ఏమియు లేదు. కేవలము విశ్వసించుము. కేవలము, అది మాత్రమే ఈ రాత్రి నీకు సహాయము చేయగలదు, అది సరియేనా? మరి దేవుని వాక్యము ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మవు? ఇచ్చట కదులుతున్న వివేచించు దేవుని ఆత్మను నీవు నమ్ముచున్నావా? అదేదో కాదు. అది దేవుని చేత సృజించబడినదైయున్నది. దానిని నీవు నమ్మగలవా? నేను ఆయన యొక్క సేవకునిగా నన్ను అంగీకరించుదువా? నేను ఆయన యొక్క ప్రవక్తనని నీవు నమ్ముదువా? నీవు నమ్ముదువా? అదే విధముగా నీవు నా మాటలకు లోబడేదవా? అట్లైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున అక్కడ నుండి లేచి, ఇంటికి వెళ్ళి మంచిగా ఉండుము. అది అంతే, కేవలము లేచి నిలువుము.
స్త్రీ, ఎర్రని కోటు వేసుకున్న నీవు, అక్కడ కూర్చున్నావు, నీవు క్యాన్సరుతో బాధపడుచున్నావు. అవునా? సరే, మంచిది. నీ చేతులను పైకి ఎత్తుము. అక్కడ వారి పాదములపై ఇద్దరు లేచి నిలువబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా స్వస్థపరిచియున్నాడు. “దేవునికి స్తోత్రము,”అని చెప్పుదాము. ఆయన ఇక్కడ ఉన్నాడని నీవు నమ్ముదువా? నీతో ఉన్నాడని నమ్ముదువా? మనము నిలువబడి ఆయనకు స్తుతులు చెల్లించెదము. ప్రతి ఒక్కరూ, ఇప్పుడే, కేవలము ఆయనను స్తుతించెదము. నీవు ఆయనను నమ్ముదువా? నీవు ఆయనను అంగీకరించుదువా? ఆయనను ఇప్పుడే అంగీకరించుము. సహోదరీ నీవు, ఆయనను నీ హృదయముతో నమ్ముదువా? ఇప్పుడే ఆయనను అంగీకరించుము. మనము మన చేతులను ప్రభువైన యేసు తట్టు ఎత్తెదము.
తండ్రీ, ఇప్పుడే, ఈ ప్రజల హృదయములోనికి రమ్ము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యమును సూచనలతో అద్భుతములతో నిరూపించును గాక, దేవుని కుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము.
జనులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గమనించండి….

1,628 total views, 2 views today