నీవు దీనిని నమ్ముచున్నావా?
హూస్టన్, టెక్సాస్, యుఎస్ఏ
50-0115
1. బోస్వర్త్ సహోదరుడా దన్యవాదాలు. శ్రోతలారా శుభసాయంకాలము. ఇక్కడుంట మంచిదిగా ఉన్నది. మీరు కుర్చోవాలనుకుంటే కూర్చోనవచ్చును.
అందరూ బాగున్నారా? మీరు బాగానే ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయమున దేవాలయం నుండి కార్యక్రమమును వినుటకు నేను చాలా సంతోషముగా ఉన్నాను. మై, మరియు స్వస్థపరచబడినవారి సాక్ష్యములను వినుట. నిన్నటి సాయంత్రం, మనము కొద్ది విరామమును కలిగియున్నాము, మరియు దేవుని యొక్క ఆత్మ మనం ఊహించని రీతిగా గోప్ప క్రుమ్మరింపుగా మన మీదికి దిగివచ్చెను. అన్ని వేళలా అది గొప్పగా ఎదిగాలని మనము కోరుచున్నాము. అలా జరుగునని నేను నమ్ముచున్నాను, మీరూ నమ్ముచున్నారా?
మరియు నేను పొరబడనట్లయితే, ఇప్పుడు నా ముందు ఒక గొప్ప మనుష్యుడు కూర్చొని యున్నాడు — సేవకుని బ్యాడ్జి పెట్టుకొని యున్నాడు. నీవు గడచిన రాత్రి ఒక చక్రాల బండిలోనో లేక మరేదైనా అలాంటి దానిలో కూర్చున్నావు కదా? [ఆ వ్యక్తి అవును “నేను కూర్చున్నాను” అని చెప్పాడు.] కొంతకాలం క్రితం నేను ఒక ప్రకటన చేసాను. మరియు దానికి, దీనికి మద్యలో ఏమి జరిగిందో నాకు తెలియదు; కాని నీవైతే వికలాంగుల కుర్చిలో కాకుండా మాములుగానే కూర్చోనియున్నావు. కాని ఆ వ్యక్తి ఒక గొప్ప విశ్వాసమును కలిగియున్నాడు. మరియు అతనికి ఇంతకుమందే విశ్వాసము లేనియెడల, వారు అతన్ని విశ్వాసముతో ఉండులాగున సిధ్దపరచి మరియు అక్కడ ఉంచియుండవచ్చును, ఏదైన సరే. అతను ఈ కూటములో స్వస్తత పొందబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను. నిన్న రాత్రి (దేవుని ఆత్మను) లాగుచున్నవాడు ఇతడే అని నేను అనుకున్నాను. అది పాక్షికంగా. కేవలం నీ హృదయమంతటితో దానిని నమ్మి దైర్యముగా ఉండుము.
ఇప్పుడు, ఈ కార్యములను ఆపుటకు నాకు ఏ హక్కులేదు కేవలం నేను పాత్రను మాత్రమే. దేవుడే స్వస్థపరచును, మరియు నేను… ఆయన దేనినినైతే నాకు చేయమని చెప్పెనో, కేవలం దానిని పలుకుట మరియు చూపుట మాత్రమే నేను చేయగలను. కాని దేవుడే స్వస్థత కార్యము చేయవలసియున్నది. మనమందరమూ దానిని నమ్ముచున్నాము, మనము నమ్ముట లేదా?
2. ఇప్పుడు, ఈ మద్యహ్నం, నేను స్వస్థపరచు అభిషేకంతో మీ మద్యకి రాలేదు, అది… ఇది వాక్యమును పలుకుటకు, విశ్వామును ప్రోత్సహించుటకు, మరియు యేసును మీరు విశ్వసించేలా చేయుటకు వచ్చుటైయున్నది.
గడచిన వారమువలే ఈ వారము కూడా చాలా మధురమైనదిగా ఉన్నది, నా సేవా-జీవితమంతటిలో ఇంత చిన్న గుంపు ప్రజలను కూటములలో నేను ఎన్నడూ కలిగియుండలేదు. నమ్మండి ఇది చాలా కొద్దిమంది ప్రజలున్న కూటముగా ఉన్నది… బహుశా ఇది ఐదు లేక తరువాత రాత్రి కూటము ఆరవదనుకుంటా, నేనింతవరకు నా సేవ మొదలుపెట్టినప్పట నుండి ఇప్పటివరకు ఇలాగు జరుగుట ఇదే మొదటిసారి, కనీసం చిన్న చర్చీలలో, నేను సంఘశాఖలలో నుండి బయటకు రాకముందు కూడ ఇంతకంటే ఎక్కువ ప్రజలే ఉండేవారు.
కాని అక్కడ దీనిని గూర్చి ఒక ఐక్యత ఉన్నది. మరియు ఈ పట్టణము కాస్త ఎక్కువ నాగరికతో చాలా సేవలను కలిగియుందని నేను తెలుసుకొన్నాను. మరొక రోజు, వేరోక వ్యక్తికి చెందిన ఒక చెక్కును నేను దశమభాగములలో పొందాను. ఆ చెక్కును అతడు గత ఆగష్టు నెలలోనే పొందవలసియుండెను, కాని ఎవరో పట్టణం నుండి వచ్చిన ఒక వ్యక్తి దానిని మన దశమభాగములలో కలిసేలా చేసాడు.
3. సహోదరుడు రాబర్ట్స్ కొంతసేపు ఇక్కడే ఉండెను. మరియు ఇది చూడటానికి…. ప్రతీ ఒక్కరూ ప్రచారము నిమిత్తం చూట్టూ తిరుగుటవలె ఉన్నది. మరియు మనమందరం కూడ ఇబ్బందులలో ఉన్న మనుష్యులకు కొంత మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాము. ప్రతీ ఒక్కరి హృదయాలోచన కూడ సహాయము చేయుట లేదా సంఘము కొరకు ఏదో ఒకటి చేయుట అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
గడచిన సంవత్సరమంతా కూడ ఇక్కడ హౌస్టన్ నందు పెద్ద ప్రార్దనా కూటములు జరిగాయి. మరియు ఇదంతా కూడ ఒక దానినే సూచిస్తున్నది; అది సువార్తను ప్రకటించుట, మరియు రోగుల కొరకు ప్రార్ధించుట, మరియు ఆ విదంగా కొనసాగుటైయున్నది. మరియు ఏదేమైనప్పటికి, మనము దేవునికి ఆయన చేసిన దానిని బట్టి, మరియు ప్రతీ కూటములో వచ్చు ఫలితాలనుబట్టి (రక్షించబడువారికై) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము….
4. కాని ప్రజలు, కూటము తరువాత కూటము, కూటము తరువాత కూటము, కూటము తరువాత కూటము, వారు అలసిపోవుచున్నారు. ఆ విధంగా అలసిపోవుదురని నాకు తెలుసు; నేను రోగుల కొరకు నా యొక్క వ్యక్తిగతమైన ప్రార్ధనా వరుసను కలిగియుందును, మరియు చాలా రాత్రుల తరువాత కూటములలో ఉండవలసి యున్నది… వాస్తమనకు, గతరాత్రి చివరి కూటముగా ఉండవలెను, గమనించండీ. ఐదు రాత్రులే మనయొక్క పరిదిగా ఉండవలెను, మూడు నుండి ఐదు రాత్రులు, మరియు తరువాత మనము వేరోక చోటికి వెళ్లవలెను.
కొన్నిసార్లు వాక్యము ద్వారా స్వస్తతను బోధించు సేవకులకు, విశ్వాసముపై కట్టుటకు చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. అది…. వారికి ఆరు, ఎనిమిది, పది వారాలు లేక మూడు నెలలు కూడా పట్టవచ్చు, ఎందుకనగా అలా (విశ్వాసముపై కట్టుట) చేయుట వారికి అవసరమైయున్నది.
కాని సాధారణంగా ప్రజలు, ఆద్యాత్మిక మనస్సు కలిగివారైతే, దేవుడు ఏదైతే చేసాడో దానిని వివరించుటకు, మొదటి పదహేను లేక ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. వారు చెప్పిన వెంటనే గ్రహించగలరు తరువాత కార్యాలు జరుగుట ప్రారంభిస్తాయి. మరియు మనము సాదారణంగా ఐదు రోజులలోనే ఈ పట్టణము నుండి వేరోక ప్రదేశమునకు వెళ్తాము.
5. ఒక సువార్త సందేశాన్ని శ్రోతలతో మాట్లాడే సమయానికి అది సాధారణంగా నాకు చాలా సమయం పడుతుంది. ఆదివారం మధ్యహ్నం కూడా బోదించమని నన్ను అడిగారు — నేను బోధించగలిగినట్లైతే, లేక కనీసం ప్రయత్నించినా సరే. మరియు నేను బోదకుడను కాను.
ఇక్కడ కూర్చున్న సేవకులలో ఒకరైన, మీ సేవకుడైన సహోదరుడు రిచీ యొక్క ప్రసారాన్ని ఈ ఉదయకాలమందు నేను విన్నాను. “మై, అతను ఈ వేదికపైన గనుక ఈ మద్యహ్నం ఉన్నట్లైతే, ఆ విదంగా నేను అనుకోనుచున్నాను.” కాని నేను… కేవలం నేను చేయగలిగినది, నేను చేయగల ఉత్తమమైన దానిని దేవుని మహిమ కొరకు చేస్తాను. నేను చదువులేనివాడను, చాలా లోపాలు గలవాడను అదే నన్ను బోదకునికి దూరంగా ఉంచుతుంది. నేనొక బోదకుడను కాను.
నేను తరుచుగా నా ప్రతి వర్తమానముకు ముందుగా ఈ చిన్న వాక్యమును చెప్పుదును…. [టేపునందు ఖాలీ ఉన్నది.]
6. నేను చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక సమయంలో మా నాన్నగారు గుర్రపు స్వారీ చేసేవారు. ఆయన గుర్రపు స్వారీ చేస్తూ, వాటిని అదుపుచేస్తూ, ఆ విధముగా ఉండేవాడు.
నిష్కపటముగా, అది – ఆయన నా తల్లిని కలిసినప్పుడు అది ఒక గుర్రపు స్వారీ పందెమైయుండెను. మరియు ఆయన 19 సంవత్సరముల వయస్సు గలవాడు, 18 లేక 19 సంవత్సరాల వయస్సుండవచ్చు, మరియు ఆమెకు 14 సంవత్సరముల వయస్సు. వారు పెళ్ళి చేసుకొన్నారు. మరియు నా తల్లిగారికి కనీసం 16 సంవత్సరాల వయస్సు నిండకముందే నేను ఆమెకు పుట్టాను.
కాని నేను ఎప్పుడు కూడా నా తండ్రిలా ఉండుటకు ఇష్టపడేవాడిని, నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడు, నేను ఆలోచించిగా ఒకానోకరోజు, నేను పెరిగి పెద్దవాడినైనప్పుడు, ఒక నిజమైన కౌబాయ్ వలే అవ్వాలని అనుకొనేవాడిని. కాని ఈ టెక్సాస్ లో ఈ మాట చెప్పుట చాలా చిన్న విషయవేమీ కాదు, కదండీ? కానీ…. వారు అది కౌబాయ్స్ యొక్క నివాస గృహము అని చెప్పారు, కావున….
మీలాగే ఒక చిన్న వ్యక్తి, పాశ్చత్య దేశపు పత్రికలను చదువుతూ , అలా దానిలో ఉన్న చిత్రాలను చూపిస్తూ ఉన్నప్పుడు, నా ఆశయమంతా కూడా ఒక కౌబాయ్ అవ్వటమే కదా అనుకొన్నాను. కాని కొంతకాలం పాటు వాటిని నేను ధరించే వరకు ఎదురు చూడాలి, మరియు మీకు తెలుసా, ఆ బూట్లు, గొప్పదైన ఆ పెద్ద టోపీ, మరియు…. ఒహ్, నేను గొప్ప ఉత్సాహంతో ఉండేవాడిని.
7. కావున నేను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఎందుకు, నేను పశ్చిమాన ఉన్న ఆరిజోనాకు కౌబాయ్ అవ్వాని వెళ్ళాను. నేను ఇంటి నుండి పారిపోయాను.
మరియు నేను ఇంటి నుండి రాక ముందు నాకు కొంత స్వారి అనుభవం కలదు. నేను వ్యయసాయానికి ఉపయోగించే పాత గుర్రాన్ని తీసుకొని రోజంతా దానిపై నేర్చుకొనేవాడిని. మరి అది అలసిపోయి చాలా కష్టముగా నీరు త్రాగుటకు తొట్టి యొద్దకు వచ్చేది. మరియు నేను దానిపై వేసేటువంటి జీన్స్ ను తీసి, నా చేతి నిండా పల్లేరు కాయలువంటివి తీసుకొని ఆ జీన్స్ క్రింద వేసి, మరియు దాన్ని క్రిందకి లాగి, ఆ తరువాత ఏగిరి దానిపైకి ఎక్కేవాడను.
మరియు ఆ దీనమైన గుర్రం ముసలిది మరియు బిగుసుగా ఉంది, అది లేచే స్థితిలో లేదు, అలసిపోయినది, మీకు తెలుసా, అది అక్కడే గట్టిగా అరస్తూ క్రిందపడుతూ పైకి లేస్తూ ఉండింది. నేను పేపరుతో చేసిన ఒక పాత టోపిని తీసుకొని దాన్ని కొట్టి “మై, ఇప్పుడు గనుక నీవు కదలేదంటే, నేను కౌబాయ్ నే కాదు” అని చెప్పాను. [స్పష్టముగా లేని పదాలు.]
8. నా చిన్న సహోదరుడు మరియు అతని స్నేహితులు ఆ గోడ మీద కూర్చొని నా వైపు చూసి నవ్వేవారు, మీకు తెలుసా, నాకు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే నేను నిజమైన కౌబాయ్ నని, “నేను పశ్చిమదేశం (ఆరిజోనా) నుండి తిరిగి వచ్చేంత వరకు ఆగండి, మై, ఇండియానా నుండి వచ్చిన నిజమైన కౌబాయ్ అంటే ఎలా ఉంటాడో అప్పుడు చూపిస్తా” అనుకొన్నాను.
నేను పశ్చిమానికి వెళ్ళాను. నాకు సరిపడ డబ్బు ఉందని నాకు గుర్తుంది. నేను ఒక జత తోలుతో చేసిన బిర్రుగా ఉండే ప్యాంట్లను కొనడానికి వెళ్ళాను. నేను సరిపోయినన్ని డబ్బులున్నవి అనుకొని వెళ్ళాను. ఒక గొప్ప చక్కనైన ప్యాంట్ల జత ఆరిజోనాలో ఉన్నాయి. మరియు దానికి కొడెతలకి రెండు పెద్ద ఇత్తడి కళ్ళవలె ఉన్నది. మై, అవి చూడటాని చాలా బాగున్నాయి. వాటిని వేసుకొని నడవాలనుకున్నాను.
మీరు చూశారా, ఒక చిన్న కోడిపిల్లకి గని కాళ్ళు కనపడకుండా రెక్కలుంటే ఏలా ఉంటుందో అ విధంగానే నేను కూడా కనబడేవాడిని. మూడు అడుగులవరకు తోలు క్రింద ఈడ్చుకొని వస్తుంది. అక్కడున్న ఆరిజోనా పిల్లలు పొడవాటి కాళ్ళు కలిగినవారు, కాని అవి (మాకు) ఇండియానా వారికి చాలా పొడవుగా ఉంటాయి.
అదంతా నేను చూసి, “మై, ఈ వీధిగుండా ఈ యొక్క తోలు వస్త్రాలను చూచుట మంచిది. మరియు ఏమీ ఆ.. ఉమ్.. అని అనుకొన్నాను.” కాబట్టి నేను మంచిదనుకొన్నాను.
9. అక్కడ రోడియో (కౌబాయ్స్ తమ యొక్క నైపుణ్యతను చూపించే ప్రదర్శన) జరగబోవుచున్నదని ఒక అతను చెప్పాడు. ఎంతౌవుతుందని నేను అడిగాను, అప్పుడతను 25 నుండి 30 డాలర్ల వరకు ఉండవచ్చునని చెప్పాడు. ఓహ్ మై, నా దగ్గర 3 లేక 4 డాలర్లు మాత్రమే ఉన్నాయి.
నీవు ఒక జత (తోలుతో చేసిన వస్త్రాలను) వొదులకోవడం మంచిదని అతను చెప్పాడు.
కావున నేను అతను చెప్పినట్టు చేసి ఆ ప్రదర్శనకు వెళ్ళాను. ఆ రోడియో చూడటం అదే నాకు మొదటిసారి ఇంతకు ముందు ఎప్పుడూ నేను దానిని చూడలేదు. మరియు నేను అక్కడ కౌబాయ్స్ అందరు ఆవరణము దగ్గర నిలిచి ఉండుట చూసి, “నేను కూడ వారి మధ్యకు వెళ్ళి కూర్చొని చూస్తే బాగుంటుంది,” అని అనుకొన్నాను.
మరియు మీకు తెలుసా, చూచుటకు నిజంగా పశ్చిమ దేశానికి చెందినదానివలె ఉండే పేపరుతో చేసిన ఒక పెద్ద టోపిని నేను తీసుకొన్నాను. నేను కూడ పైకెక్కి పెద్దగా ఉన్న వారితో కలిసి చూట్టూ చూస్తు, మీకు తెలుసా నేను కూడ వారివలె చేసేవాడిని.
అక్కడికి ఒక వ్యక్తిని, ఒక గుర్రముతో పోటి పడుటకు (లొంగదీసుకొనుటకు) వారు క్రిందికి తీసుకువచ్చారు. అతను ఆ వరుసలలో నుండి బయటికి వచ్చినప్పుడు, ఎందుకో అతను గుర్రపు జీన్స్ మీదకు దూకాడు మరియు ఆ గుర్రం రెండు దూకులు దూకింది. నాకు అప్పుడే తెలిసింది ఆ గుర్రం నా ఇంటి దగ్గర ఉన్నటువంటి ముసలి గుర్రం, దాని వలే లేదని. చూడటానికి మీరు నాలుగు కాళ్ళను ఒక శుబ్రపరచే పాత్రలో ఉంచి మరియు దానిలో నుండి విసిరితే ఎలా ఉంటుందో ఆ విదముగా. అది రెండు సార్లు దూకింది ఆ వ్యక్తి రోడ్డు మద్యలో పడిపోయాడు, అక్కడి పరిచారకులు వచ్చి అతని తీసుకొని వెళ్ళారు. అతని ముక్కు నుండి మరియు చెవి నుండి రక్తము కారుతూ, తీవ్రమైన గాయలతో ఉన్నాడు. మరియు అతడిని అత్యవసర వాహనము అతడిని తీసుకు వెళ్ళవలసియుండెను.
10. అక్కడ పందెమును నడిపే అతను వచ్చి, ఎవరైన సరే ఈ గుర్రముపై ఒక నిమిషము పాటు నిలిస్తే ఆ వ్యక్తికి 50 డాలర్లు ఇస్తానంటూ చుట్టూ చూస్తున్నాడు. కాని ఏ వ్యక్తి కూడ అతను చెప్పినదానికి సరే అని చెప్పలేదు. మరియు అతను నా వైపు చూచి “నీవూ ఒక స్వారి చేయువాడవా?” అని అడిగెను.
నేను “లేదండీ” అని చెప్పాను. వెంటనే నా ఆలోచన మార్చుకున్నాను, నేను ఎప్పుడైతే ఈ గుర్రం నేను మా ఇంటి వద్ద నేర్చుకున్న గుర్రములాగా లేదని తెలుసుకొన్నానో అప్పుడే.
కావున నేను మొదటిగా బాప్టిస్టు సంఘమునందు నియమించబడినప్పుడు మీరెన్నడూ చూడనటువంటి సంతోషకరమైన (ఎటువంటి ఇబ్బందులు లేని) బోదకుడివలే ఉండేవాడను. ఏవరో ఒకరు “నీవు బోదకుడివా?” అని అడిగినప్పుడు.
అప్పుడు నేను “అవునండీ” అని చెప్పేవాడను.
11. నేను సెయింట్ లూయిస్ లో ఉన్నపుడు ఒక రోజు నేను రెవ. రాబర్ట్ డాగట్రిని కలిసాను. అప్పుడు నేను హోలినెస్ గుంపుతో నా మెదటి కూటమును కలిగియున్నాను. మరియు రెవ. రాబర్ట్ డాగట్రి గుడారములో జరుగుచున్న కూటములో ఉండెను. మరియు ఆ రాత్రి అక్కడికి నేను వెళ్ళాను. మరియు అతని చిన్న కూతురు అప్పుడే స్వస్తత పొందుకున్నది. ఆమె సాక్ష్యము అక్కడ చెప్పబడెను.
మరియు అతను నాతో మాట్లాడుచు, ఆ కూటము జరిగే వద్దకు తీసుకు వెళ్ళాడు. మరియు అతను ఆ వేదిక పైకి వెళ్ళి బోదించుట ప్రారంబించాడు. ఒక పెంతెకోస్తు బోదకుడి బోద వినట ఆదే నాకు మొదటిసారి, ఇంతకుముందెన్నడూ నేను వినలేదు. మరియు అతను తన రెండు కాళ్ళు కట్టిపడేసినంతగా బోదించాడు. మరియు అతను కొద్దిగా విశ్రాంతిని తీసుకొనుటకు మేడపైకి వెళ్ళాడు. మరియు అతని గొంతును (స్వరమును) మీరు రెండు గదులదూరం వరకు కూడ వినవచ్చును.
ఏవరో ఒకరు “నీవు బోదకుడివా?” అని అడిగారు.
అప్పుడు నేను “కాదండి.” కాదు, (నేను బోదకుడను) కాదు అని చెప్పాను. నా పాత కాలపు బాప్టిష్టు బోదలు ఇంత వేగంగా ఉండవు. అదంతే, నేను ఆ బోధ విన్న తరువాత, నేను అసలు బోదకుడనే కాదు అనిపించినది. మరియు అప్పటి నుండి బోదకుడిగా ఉండుటకు మరియు సువార్తికులకు దూరంగా ఉంటాను. “నేను రోగుల కొరకు ప్రార్దన మాత్రమే చేస్తానండీ,” అలా కానియ్యుడి అని చెప్పాను.
12. కాని ఈ రోజు మీ ముందుకు వచ్చి, కొంత వాక్యమును చదువుటకు ప్రయత్నించుదును మరియు ఆ వాక్యమును నాకు తెలిసినంతమట్టుకు వివరించుటయందు నేను ఆనందించుచున్నాను; ఎందుకంటే అదంతా కూడ నేను నిజమని నమ్ముతాను కాబట్టి. దేవుని యొక్క ప్రతీ మాట నిజమైయున్నది. కాబట్టి మీరు ఇలాంటి ఆరాధనలకు స్వస్ధతా అభిషేకముతో రావలసిన పనిలేదు. మరి మీరు ప్రార్ధన లేక ఉపవాసము చేసి రావలసిన పనిలేదు. నేను సమయానికి వచ్చి వాక్యమును చదువుటకు మరియు ఆ విదముగా కొనసాగుట అయియున్నది. మీరు చూశారా? దేవుని దూతకు నీవు నియమించబడిన దానికంటే కూడ, సువార్త ప్రకటంచుట అనేది ఒక వ్యత్యాసమైన అనుభూతియై యున్నది. ఎందుకనగా మీరు ప్రతి ఆత్మకు చాలా చలించగలరు. అది ఎలా ఉంటుందనగా ఒక గోడలో అక్కడ మరియు ఇక్కడ తడిసినట్లుగా ఉంటుంది.
13. మరియు నేను ఈ మధ్యహ్నకాలమున, కొంత వాక్యమును గూర్చి మాట్లాడాలనే వచ్చాను. మరియు ఇప్పుడే నేను నిర్ణయించుకొనుటకు ప్రయత్నించుచున్నప్పుడు… యోహాను సువార్త 14వ అద్యాయము నుండి “తండ్రిని చూపుము మాకది చాలు” అనే అంశముపై మాట్లాదామని ఆలోచించాను. “మీరు కొద్ది సమయం పాటు వేచియుండి, తరువాత మీరు (బోదించుటకు) రండి – అప్పుడు మీ ప్రసంగం రికార్డ్ (టేపులలో బద్రము) చేయబడుతుంది” అని సహోదరుడు లిండ్సే చెప్పాడు.
కాబట్టి నేను లాజరు ఏ విధముగా పుణరుధ్ధానుడైనాడో మరియు ఏలాగున చనిపోయి తిరిగి లేపబడ్డాడో, దానిని గూర్చి మాట్లాడాలనుకొన్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఈ అంశమును గూర్చి బోధించానో లేదో నాకైతే తెలియదు. నేను బోధించానా? మంచిది.
మీరు నాతో కూడ కొద్ది సమయం చదవాలనుకున్నట్లైతే, పరిశుద్ద యోహాను 11వ అధ్యాయము నుండి చదవవచ్చును… నేను కేవలం వాక్యమును ప్రేమిస్తాను, మీరు ప్రేమించరా? మై, దేవుని వాక్యము నిజమైయున్నది. మరియు పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయము 20వ వచనము నుండి మొదలుపెడదాము. మరియు జాగ్రత్తగా వినుడి, మీరు ఏటూ చూడకుండా చెదరని మీ మనస్సును కొద్ది నిమిషాలు నా వైపు ఉంచండి.
14. మరియు నేను త్వరగా మిమ్ములను విడిచి పెట్టుటకు నా చేతి గడియారము తీసి ఇక్కడ ఉంచుతున్నాను. అప్పుడు మీరు త్వరగా మీ ఇల్లకు వెళ్ళి రాత్రి భోజనం చేయుటకు వీలుపడుతుంది. ఇండియానాలో కూడా ఇది రాత్రిభజనం. కాని నాకు ఇక్కడ ఏలా పిలుస్తారో నాకు తెలియదు. కాని నేను ఒక పాతకాలపు సస్సాప్రాస్ బాలుడను ఇప్పటికి నేను ఉదయకాలపు ఆహారమును, మధ్యహ్నకాలపు ఆహారమును మరియు రాత్రి చేయు ఆహారమును నమ్ముచున్నవాడను. ఏది ఏమైన గాని సప్పర్ లేదా డిన్నర్ రెండూ కూడా ఒకటే మరియు నేను సప్పర్ అని భుజించినా లేక మీరు డిన్నర్ అని భుజించినా రెండూ కూడా ఒకటే. అది నిజము. మనము 11వ అధ్యాయము 20వ వచనము చదువుదాము:
అప్పుడు మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.
యేసు- నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా (నేను దానిని ఇష్టపడుచున్నాను, మీరు ఇష్టపడుటలేదా?)
మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. (చూశారా, వారు సాదారణమైన పునరుత్థానమును గూర్చి నమ్ముచున్నారు.)
అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెనునడిగెను.
ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
15. కొద్దిసేపు మనము ప్రార్ధన కొరకు తలలు వంచుదాం.
మా పరలోకపు తండ్రీ, ఈ మధ్యాహ్నకాలము ఈ ఆడిటోరియమునందు ఒకే కారణము చేత అది మీ కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకు మేము ఇక్కడకు వచ్చియున్నాము. మరియు నేను నీకు ప్రార్ధిస్తున్నాను తండ్రీ, మీరేమైయున్నారో ఆ విదముగానే మాకు బయలుపరచుకొనుము. వాక్యము కాని దానికి మీరు అడ్డు తెర వేయుము, ఈ మధ్యాహ్నకాలము ఆత్మశక్తితో దేవుని వాక్యమును బయలుపరచుము, అలాగుననే ప్రతిఒక్కరి హృదయాలను సరాళము చేయును. మరి ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి ఆశీర్వదింపబడును గాక. మరి మా మధ్యలోనున్న రోగులందరూ స్వస్ధత పొందుదురు గాక, పాపులందరూ క్రీస్తునొద్దకు వచ్చుదురు గాక మరియు దేవుడు మహిమపరచబడును గాక. నీ యొక్క వినయపూర్వకమైన సేవకుని ప్రార్ధన వినుము ప్రభువా, మరియు ఇప్పుడు ఈ సేవాపరిచర్యను దీవించుము. వినుటకు ప్రజల చెవులను మరియు మాట్లాడుటకు నీ సేవకుడి పెదవులను అభిషేకించుము. దీనిని మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
16. మన రక్షకుని సేవా పరిచర్య ఈ సమయంలో, ఆయన బాగ ప్రసిద్ది చెందెను. అక్క – చెల్లలు మరియు అక్క – తమ్ములైన మార్త, మరియ మరియు లాజరులతో ఆయన నివసించియుండెను. (నా మాటలు మీకు వినపడుచున్నాయా? మంచిది.)
మరియు వారు సహోదర సహోదరిలైయున్నారు. మరియు లాజరు ఒక దస్తావేజులు రాసేవాడని, మరియా – మార్త దేవాలయపు తెరలను కుట్టుచుండేవారని మన పూర్వికుల చేత బోధింపబడినవారమై ఉన్నాము. ఆ విధముగా వారు ఏదైతే చెప్పారో అది రుజువు చేయబడలేదని లేదా వారు చెప్పినది ఏ మాత్రము ఎక్కువ వ్యత్యాసము చూపలేదని నేను అనుకొనుచున్నాను.
కాని ముఖ్య విషయము ఏమిటంటే, వారు యేసునకు స్నేహితులు. మరియు ఈ సమయములో ఆయన దేశము నుండి బయటకు పిలువబడి చుట్టు ప్రక్కల సువార్తను ప్రకటించుటకు, రోగులను స్వస్తత పరచుటకు మరియు ఆయన తన తండ్రి చేత అభిషేకింపబడ్డ భూసంభందమైన కార్యము చేయుటకు ముందుగా యేసుక్రీస్తు యొక్క పరిచర్య చాలా గొప్పగా ఎదిగెను (ఆ ప్రాంతములో వ్యాపించెను).
17. యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు. ఆయన పుట్టుకతోనే ఒక నిందను మోస్తూ ఆయన జీవితాన్ని ప్రారంభించెను. మరియు ఆయన ఎప్పుడూ కూడ సామాన్యమైన ప్రజల చేత అంగీకరించబడ్డాడు మరియు ఆ రోజులలో ఉన్న మత నాయకుల చేత, అధిక ధనికుల చేత మరియు అధిక జ్ఞానుల చేత తిరస్కరింపబడ్డాడు. మరియు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆ విధముగానే యున్నది. అది అలాగుననే యున్నది.
నేను ఆ ధనవంతులు లేక ధనికులు రక్షింపబడరని చెప్పటకు ప్రయత్నించుటలేదు. వారు కూడ తమనుతాము తగ్గించుకొని మనందరిలాగ వచ్చినప్పుడు, వారును రక్షింపబడుదురు. కాని మనమందరమూ కూడ ఓకే మార్గములో రావలిసియున్నది. అదేమనగా, మనము ఎందుకూ పనికిరానివారమని మరియు దేవుడే అంతయూ అని తెలిసికొని వచ్చుటైయున్నది. మరియు ఆయన నుండి ప్రయోజనాలు పొందుకొనుటకు, మనకుమనమే ఆయనకు సమర్పించుకొనవలసి యున్నది.
నీవు గనుక ఎన్నడునూ ఆయన నుండి ఏదీ పొందకయున్నట్లైతే, నిన్ను నీవు తగ్గించుకొని పూర్తిగా ఏమీలేనివాడవై ఆయన ముందుకు రావలెను. మరియు నీవు ఏమీ తెలియనివాడిగా, కేవలం యేసును కనుగొనుటకు, ఆ ఒక్క ఉద్దేశ్యము కొరకే నీవుండవలసియున్నది. నీవు ఎప్పడైతే తగ్గించుకుంటావో, అప్పుడు దేవుడు హెచ్చింపబడతాడు. కాని నిన్నునీవు హెచ్చించుకొనినా దేవుడు నిన్ను అణచి వేయును. అది నిజము ఆయన ఆ విధముగానే లేఖనములందు చెప్పెను.
18. ఇప్పుడు, యేసు జన్మించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు, ఆయన… ఆన్నీ వరములు ముందుగానే దేవుని యొక్క జగత్తు పునాధి వేయబడక మునుపే ఆలోచనా జ్ఞానములో దివ్యదృష్టిలో అభిషేకింపబడినవని నేను నమ్ముచున్నాను. మీరునూ నమ్ముచున్నారా? నేను నమ్ముచున్నాను. మరి మీకు మీరుగా పనిచేసిన లేదా ఎదైనా ఒక వ్యక్తి ఇంకోక వ్యక్తికి ఇవ్వటమనేది ఏమీ లేదు. నేను దానిని నమ్మను. ఆ విధముగా ఉండదని నేను చెప్పటలేదు. నా నమ్మకం దేవుని యొక్క క్రమాన్ని మార్చదు. కాని దానిని నేను లేఖనాలలో చూడలేదు.
నేను బోధించినవాటికి ఆదారమగుటకు మరియు నమ్మకము కలుగుటకు, ఏదో ఒకటి, ఖచ్చితముగా ఒక దానిని… నేను ఖచ్చితముగా ఒకటి కలిగియుండవలసి యున్నది, ఇంకోలా చెప్పాలంటే, దానిలో నుండి నమ్మకమును తీసుకురావలెను. మరియు అది దేవుని వాక్యము నుండి రావలసి యున్నది, అదియే అన్నీ విశ్వాసములకు మూలమైయున్నది. వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగును, కాబట్టి దేవుని యొక్క అన్నీ వరములు ఈ ప్రపంచములోనికి రాకమునుపే నియమించబడి ఉంటాయని నేను నమ్ముచున్నాను.
19. ఉదాహరణకు, యేసుక్రీస్తు తనకుతానుగా ముందుగానే దేవునిచేత భూమి మీదకు వచ్చుటకు నియమించబడెను. మీరు దానిని నమ్ముచున్నారా? సర్పము యొక్క తలను చితకగొట్టే స్త్రీ సంతానము ఆయనే. మరియు దాని తల నీ మడిమె మీద కొట్టును.
మోషే ముందుగానే దేవుని చేత నియమించబడినవాడని నేను నమ్ముచున్నాను. మీరు దానిని నమ్ముచున్నారా? మరియు ఆయన జన్మించినప్పుడు, ఆయన ఒక సాధరణ బాలుడు. మరియు ఆయన ఫరోయొద్దకు రాజుగా నియమించబడుటకు తేబడెను, ఫరో యొక్క కుమారుడు కూడ, రాజుగా నియమించబడుటకు సరిపోకపోయేను. కాని ఆయన దేవుని చేత నియమించబడెను. ఆయన ఒక మాములు మనిషిగా జన్మించియుంటే, ఖచ్చితముగా ఆ సింహాసనమును అధిష్టించి ఆ గొప్ప ఘనతలను పొందుకొనియుండేవాడు. కాని ఆయన వేరోక పనికొరకు నియమించబడెను.
నేను నమ్ముచున్నాను బాప్తిస్మమిచ్చు యోహాను….. ఆయన జన్మించక మునుపే 712 సంవత్సరముల క్రితమే ఆయన్ని యెషయా ప్రవక్త చూచెనని నేను నమ్ముచున్నాను. మరియు యెషయా యోహాను గూర్చి అడవిలో కేక వేయు ఒకని శభ్దము అని చెప్పెను. బాప్తిస్మమిచ్చు యోహాను దేవునిచే ఎన్నిక చేయబడిన వ్యక్తి.
20. యిర్మియా, ఆయన తన గర్బము నుండి రాకముందే, నేను యిర్మియాని యెరుగుదును, మరియు అతనిని జనములపై ఒక ప్రవక్తగా ఎన్నుకొంటిని, ఇంకనూ తన గర్బము నుండి రాకముందే, అని దేవుడు చెప్పెను. అది సరియేనా?
21. ఆ కార్యములన్నీయూ ముందు నిర్ణయించబడియున్నవని నేను నమ్ముచున్నాను. ఈ రోజులలో ఆ కార్యములేవని నేను ఆలోచిస్తున్నాను. మనలో కొద్దిమంది లేక ఎక్కువ మంది కొద్దిపాటి ఉద్రేకముతో లేక కొద్దిపాటి అత్యుత్సాహముతో పనిచేయుట మొదలు పెడతాము. మరియు అది కొన్నిసార్లు మంచి జరుగట కంటే కూడ చెడు జరుగవచ్చు. మీరు ఆవిధముగా ఆలోచించుటలేదా? ఏమి ఆలోచించుటలేదని ఎప్పుడు చెప్పవద్దు.
“ఓహ్, గత రాత్రి నేను మారినప్పుడు దేవుడు నన్ను బోధించుటకు పిలిచాడు” అని ఒక యవ్వనస్తుడు వచ్చి చెప్పుట నేను చూచిన విధముగా. దేవుడు నన్ను బోధించుటకు పిలిచాడు. నీవు కొద్దిగా ఆగుట మంచిదీ ఓ యవ్వనస్తుడా. మరియు నిజముగా దేవుడు నిన్ను పిలిచాడా లేదా అన్నది ముందునువ్వు తెలుసుకోవాలి. మీకు తెలుసా, ఒకానొక సమయంలో ఒక మొక్క నాటబడియున్నది. మరియు సూర్యుని వేడి తగిలినప్పుడు అది వాడిపోవును. మరియు మీరు ఇల్లు నిర్మించవలెనన్న ముందుగా డబ్బులు ఖర్చు అవసరమౌతాయో లెక్క వేసుకొని, మీకు స్తోమత ఉంటేనే మీరు దానిని నిర్మించుకొంటారు. ఆ విధముగా…
కాని కొన్నిసార్లు ఉద్రేకులమౌతాము. మరియు నేను ఎప్పూడునూ, ఇతరులను ఉత్తేజపరుచటకు కొద్దిపాటి ఉత్తేజమును కలిగియుంటాను.
22. కాని యేసు, పుట్టుకతోనే, యోసేపు ఆయన యొక్క తండ్రి అని మరియు అక్రమసంతానం అనే ముద్రతో పుట్టాడు. మరియు ఇంకోక మాటలో చెప్పాలంటే ఆయన పెళ్ళి కాకముందుగానే ఒక తండ్రికి మరియు ఒక తల్లికి జారత్వం వల్ల జన్మించాడు అనే నిందను కలిగియున్నాడు. మరియు నేను అది తప్పు అని చెప్పగలను, ఎందుకంటే దేవుడే ఆయన తండ్రి. మరియు ఆయన కన్యక ద్వారా జన్మించాడు.
మరి భూమి మీదకు ఆయన రాకడను గూర్చి కనుగొందాము, ఆయన భూమి మీదకు రాకమునుపే ఆయన ఇక్కడ ఉంటాడని ప్రవచింపబడ్డాడు. మరియు ఎప్పుడును దేవుడు ఆ విధముగానే చేయును.
ఇప్పుడు దీనికి నేను ఒక సిద్దాంతమును తెచ్చినచో మీరు దానిని నమ్మరు, అది మంచిది. దీనిని విషమై మనము పడిపోకూడదు. కాని, మీ గృహమునందు ఒక చెర్రి పండును తినము అని ఆ విదంగా నన్ను అడిగినచో, మరియు నేను దానిని ఇష్టపడతాను. మరి నేను దానిని తినుచున్నట్లైతే, నేను దానిని విత్తనం నోటికి తగిలేంతవరకు దానిని తింటాను. నేను పండును పారవేయను, పండు మొత్తాన్ని తిన్న తరువాతనే విత్తనాన్ని పారవేస్తాను.
కావున మీరు కూడ ఆ విదముగా ఈ విషయములో చేయవలసియున్నది. మీరు దేనిని నమ్ముతారో దానినే గ్రహించుము. మీరు దేనిని నమ్ముటలేదో దానిని ప్రక్కన ఉంచుట మంచిది.
23. మరియు దేవుడు భూమి మీదకు ఏదైనా గొప్ప దానిని పంపబోయే ముందుగా ఆయన తన దూతల ద్వారా దానిని తెలియజేస్తాడు. మనకు అ విషము తెలియును. యేసు పుట్టుకను గూర్చి దూతలందరి ద్వారా ముందుగానే చెప్పబడినది. ఇప్పుడు చిన్న దూతలు కూడ వస్తారు, ఉదాహరణకు ఒక దూత నన్ను దర్శించుటకు వచ్చునది ఒక చిన్న దూత.
మరియు మీరు గాని గాభ్రియేలు దూత వచ్చుట చూచినట్లైతే ఏదో ఒక పెద్ద కార్యము అక్కడ జరుగబోవుచున్నది. గాబ్రియేలు యేసు యొక్క మొదటి రాకడను గూర్చి ప్రకటించాడు, మరియు రెండవ రాకడను గూర్చియు ఆయనే ప్రకటింపవలెను. మరియు ఆయన బూరను ఊదినప్పుడు యేసు నందు మృతి పొందిన లేపబడుదురు. గాబ్రియేలు దేవుని దూతలలో గొప్పవాడు.
24. మరియు ఇప్పుడు, యేసు జన్మించక మునుపు, తల్లయైన చిన్న కన్యక మరియ నజరేతులో జీవించుటకు ఎందుకు పిలువబడెను.
మరియు ఇదంతయూ జరుగకముందు, యోహాను ముందుగా మార్గము సిద్దపరచుటకు రావలసియుండెను. మరియు మనము బాప్తస్మమిచ్చు యోహానును చూచినట్లైతే, ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. యేసు, మనయొక్క పరిచర్య సమయములో, ఆయన కొరకు యేసే స్వయంగా ఆయనను చూచుటకు వెళ్ళెను. యూదయ మరియు యోర్ధాను నదీతీరము వారందరినీ, ఆయన చెప్పునది వినుటకు యోర్ధానునకు నడిపించెను. ఆయన ఎంత గొప్ప వ్యక్తండీ. ఆయన కూడ ముందుగా నియమింపబడెను.
మరియు ఆయన జన్మించినప్పుడు, జకర్య…. ఆయన పుట్టకమునుపు జకర్య అతని తండ్రి దేవాలయమందు ఉండెను. జనలందరూ ప్రార్ధించుచుండగా మరియు దూపార్తులు వేయుచుండగా, ఆలయంలో దూపం వేయుటకు తన వంతు వచ్చెను. గమనించండీ, అతను దేవుని ఆరాధించేటువంటి ఒక భక్తిపరుడు (నేను ఆయన భక్తిని ఇష్టపడుచున్నాను, మీకును ఇష్టము లేదా?)
మరియు ఆయన గృహమునందు ఒక నింద ఉన్నది. ఆయన భార్య వృద్దురాలు. మరియు ఆమె యూదయా స్త్రీలందరి వలె పిల్లలు కనాలనే ఆశను కలిగి ఉండేది, కాని… అది వారికి గొప్ప కార్యమైయున్నది భావించారు, మరియు గొడ్రావలే నిందను కలిగియుండెను. దావీదు మొదటి భార్యవలె, ఆయన మందసము ముందు నాట్యమాడుచుండగా ఆయనను చూచి నవ్వట వలన దేవుడు ఆమెను పిల్లలు కనకుండా శపించెను.
25. మరియు ఇప్పుడు, జకర్యా, ఒక నీతిపరుడు, పరిశుధ్దత కలిగిన వ్యక్తి, ఒక భక్తి పరుడు, మరియు అతను అతని భార్య ఇద్దరూ కూడ ప్రార్ధనా పరులు మరియు ఏదో ఒక సమయాన దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చునని నమ్మెను; దేవుని మీద ఆదారపడెను. మరియు ఇలాంటి ఖచ్చితమైన సమయంలో ఆయన తనవంతు దేవునికి దూపమేయుచుండగా, దూతయైన గాబ్రియేలు ప్రత్యక్షమై, దేవాలయమందు ఆయన వంతు పూర్తైనప్పుడు తన ఇంటికి వెళ్లి తన భార్యతో ఉన్నప్పుడు ఆమె గర్భవతియై ఒక కూమారుని కనును, ఆయనకు వారు యోహాను అని పేరు పెట్టెదరు అని చెప్పెను.
జకర్యా, ఒక మంచి మనిషి, పరిశుధ్దత కలిగిన వ్యక్తి, ఒక నీతిపరుడు, మరియు పిల్లలు కొరకు ప్రార్ధన చేసినటువంటి వ్యక్తి. మరి దేనికొరకైతే ప్రార్ధించాడో దానికి జవాబు వచ్చినప్పుడు అతను నమ్మలేకపోయాడు. ఈ రోజులలో మనలో చాలామంది చేసే కార్యమువలే లేదు? ప్రార్ధించినప్పుడు, దేవుడు మీకు జవాబు ఇచ్చినప్పుడు భయపడి మరణము తెచ్చుకొనెదరు.
గమనించడీ. అతని ఆ కాలమంతయు కూడా ప్రార్ధన చేసిన వ్యక్తి మరియు అతను జవాబును పొందుకున్నప్పుడు. మరియు నేను ఇక్కడ దీనిని ఇలాగు చెప్పగలను. దేవుడు నమ్మకంగా చేయు ప్రతీ ప్రార్ధనకు, ఆయన యొక్క సొంత మార్గములో జవాబు దయచేయును (నేను దానిని నమ్మెదను.)
26. అప్పుడు ఆమెకు సంతానం కలిగే వయస్సు దాటినది. “ఓ, ఇది జరుగదు, మై, మై. ఆమె వృద్దురాలు, మరియు నేను కూడ వృద్దుడనే. మరియు అది ఎలా జరుగును?” అని జకర్యా చెప్పెను.
అతడు ఆ దూతను నమ్మనందున, “ఆ శిశువు జన్మించు వరకు నీవు మూగవాడిగా ఉండెదవు” అని ఆ దూత అతనితో చెప్పగా, అతడు మూగవాడాయెను. మరియు మీకు తెలియునా, ప్రజలు అతని కొరకు ఎంతగా ఎదురుచూస్తున్నారో. ఆయన వెలుపలికి వచ్చినప్పుడు, అతడు వారితో సైగలు చేసెను. వారు అతను ఒక దూతను దర్శించాడని అనుకొనిరి.
మరియు అతను వెళ్ళగా, అతని భార్య గర్భవతి ఆయెను, మరియు ఈ చిన్న యోహను జన్మించుటకూ తన మార్గములో యుండెను.
27. ఆరు నెలలు తరువాత, అల్పమైన, టెక్సాస్ లో గల హౌస్టన్ కంటే కూడ చెడ్డదైన, నజరేతు అను పట్టణములో గల చిన్న కన్యకయైన మరియ యొద్దకు మరలా ఆ దూత వచ్చి, మరియు….
మరియు ప్రజలు ఏమనుకొనుచున్నారనేది సమస్య కాదు, దేవుడు…. ఈ యొక్క హౌస్టన్, టెక్సాస్ మంచి పట్టణమైయున్నది, మరియు నేను ఇంతవరకు నివసించనటువంటి మంచి పట్టణాలలో ఒకటైయున్నది. మరియు మీకు ఇక్కడ కూడ మిగతా పట్టణముల మాదిరిగానే మంచి – చెడులనేవి ఎక్కడైనా ఉంటాయి. అది నిజము. మంచి చెడులను ఎదేను తోటలో వారి మందు ఉంచబడెను. మరియు ఇప్పటికిని మంచి – చెడులనేవి ఉన్నావి.
మీరు గనుక ఒక చెడ్డ పట్టణములో నుండి ఏదో ఒక దానిని చూడగోరినయెడల. ఒక చిన్న పాడైన పట్టము, మీరు నాతో పాటు మా చిన్న గ్రామమునకు వచ్చి చూడవచ్చు. మంచిది. ఇది “చిన్న చికాగో” అని పిలువబడుచున్నది. కాబట్టి మీరు నేను హౌస్టన్, టెక్సాస్ లను గురించి చెప్పినప్పు, మీరు బాధపడవద్దు.
ఎందుకనగా దేవునికి ప్రతిచోట బిడ్డలున్నారు. అది నిజము. ఎత్తబాటు వచ్చినప్పుడు అన్నీచోట్ల నుండి ప్రజలు ఎత్తబాటులోనికి వస్తారు అని నేను నమ్ముచున్నాను.
28. మరియు ఈ యొక్క దూత నజరేతునకు వచ్చినప్పుడు…. దీనిని ఒక నాటకీయంగా మనము కొద్దిగ చూద్దాం, అది ఒక “అమావాస్య సోమవారము,” బహుశా శుబ్రపరచు దినము, మరియ క్రిందకు వెళ్ళి నీళ్ళు తీసుకొని రావలసియుండెను, సాదారణముగా అందరూ తెచ్చులాగున నెత్తి మీద బిందెను పెట్టుకొని, ఆ బిందెతో నీళ్ళు తెస్తుండగా… మరియు హఠాత్తుగా, ఒక పెద్దని వెలుగు ఆమె చూట్టూ కమ్మెను. మరియు ఆ వెలుగులో ప్రధాన-దూతయైన గాబ్రియేలు ఆమె ముందు ప్రత్యక్షమై “మరియా, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినదానవు” అని చెప్పెను.
ఆ చిన్న కన్యకను దూత దిగివచ్చునది బయానికి గురి చేసినది, ఎందుకు? ఆ విదముగా దేవదూత నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను కూడా అలాంటి సందర్బము బయపెట్టును. నన్ను కూడ బయపెట్టును. మరియు “స్త్రీలలో ఆశీర్వదింపబడినదానవు” అని చెప్పెను. మరియు నీవు పురుషుని ఎరుగకుండా ఒక కుమారుని కనెదవు, అతనికి యేసు అని పేరు పిలువబడును అని చెప్పుట ప్రారంభించెను.
29. ఇప్పుడు, నేను జకర్యకు మరియు మరియకు మద్య వ్యత్యాసమును చూడగోరుచున్నాను. జకర్య, యాజకుడు, సువార్త సేవకుడు, లేక ఒక బోదకుడు ఆ రోజులలో మరి ఏ విదముగా వారు కలిగి యుంటారో ఆ విధముగానే. ఆలయ బోదకుడు, ఇంతకు ముందు జరిగినటువంటి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తికరమైన కార్యములను ఎరిగినవాడు, కాని ఆయన విషయంలో దూతను నమ్మలేదు. మరియయైతే “దూతతో దేవుని చిత్తము జరుగును గాక” అనెను. ఆమె అదేమిటి లేక ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నింపలేదు.
మరియు చూడుడి అతను నమ్ముదాని కంటే కూడ, ఈమె ఎంతగా నమ్మవలసి యుండెను. హన్న తన వయస్సు ఉడికిన తరువాత ఒక కూమారుని కనెను, మరియు శారా కూడ తన వయస్సు ఉడికిన తరువాత ఒక కూమారుని కనెను. మరియు ఆ కార్యము చాలా సార్లు జరిగినది. కాని మరియ ఇంతకు ముందెన్నడూ జరుగనటువంటి కార్యమును గూర్చి నమ్మవలసి యున్నది. ఇంతకు ముందెన్నడూ ఏ స్త్రీ కూడ ఒక పురుషుని ఎరుగకుండా ఒక కుమారుని భూమి మీదకు తీసుకురాలేదు.
అయితే జకర్యా నమ్మవలసి దానికంటే కూడ మరియ ఎక్కువగా నమ్మవలసియున్నది. కాబట్టి ఆమె దేవుని ప్రశ్నంచలేదు; అమె కేవలం దేవుని నోటనుండి వచ్చిన వాక్యమును తీసుకొన్నది. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను. దేవుని వాక్యమును బట్టి ఆయనను స్వీకరించుడి. ఏమైనప్పటికిని దానిని నమ్ముము. అది ఎంత అసాద్యమైనదిగా కనిపించినా, దేవుని నమ్ముము, మరియు ఆయనే దానిని నేరవేర్చును.
30. మరియు గమనించండి. వెంటనే…. మరియు తన గర్బమందు శిశువును కనే సూచనలు వచ్చేంతవరకు ఆమె ఎదురుచూడలేదు. ఆమె దాని గురించి ఏమీ చెప్పకముందే, ఆమె జీవితాన్ని అనుభవించే వరకు ఆమె వేచి ఉండలేదు. ఆమె వెంటనే సాక్ష్యమిచ్చుట ప్రారంభించించెను, ఇంకా ఎటువంటి సంకేతాలు లేనప్పుడు, ఆమె ఈ శిశువును ప్రసవింపబోవుచున్నాను అని ప్రజలకు చెప్పింది. మరికొందరి మరియలను దేవుడు మనకు ఇచ్చును గాక. అది సరియే.
సూచనలు మరియు అద్భుతకార్యముల కొరకు వేచియు౦డకుడి. దేవుని వాక్యమును బట్టి ఆయనను స్వీకరించుడి, మరియు అది జరుగబోవునని సంతోషించుట ప్రారంభించుడి. దేవుడు ఆలాగు సెలవిచ్చెను.
నేను ఈ భవనంలో ప్రతి రోగి ఈ క్షణమే దేవుని వాక్యము ఆధారముగా అంగీకరించి, ఇప్పుడే, మరియు దానిని నమ్మి, మరియు సాక్ష్యమిచ్చిట ప్రారంభి౦చుడి, మరియు మీ యొక్క స్వస్టతను బట్టి ఆయనను స్తుతి౦చుడి; నేను నమ్ముదును, ఈ కూడిక ముగించబడువరకు ఏ ఒక్కరు అంగవైకల్యముతో ఉండరు. అది సరియే. దేవుడు తన వాక్యముకు జవాబిచ్చేందుకు బాధ్యత వహిస్తాడు.
మీరు సరిగా వినగలుగుచున్నారా? నా మాటలు గట్టిగా వినబడుచున్నవా? మంచిది. నాతో కలసి ప్రార్దించుడి.
31. గమనించండీ. అప్పుడు ఆమె యూదయ కొండ దేశాలలోనికి బయలుదేరిను, ఎందుకనగా ఎలిజిబెత్ గూర్చి దూత ఆమెకు చెప్పను… ఎలిసబెతు మరియు మరియ మొదటిగా బంధువులు. మరియు రెండవదిగా యేసు మరియు యోహాను బంధువులు. మరియు ఆమె తనవలె తల్లి కాబోవుచున్న తన సహోదరిని కలుసుకొనుటకు కొండ ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు. ఆమె మరియను కలుసుకొనినప్పుడు – లేదా ఎలిజబెత్ మరియ వచ్చుట చూసినప్పుడు, సందేహము లేదు వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరినొకరు హత్తుకుని, ఎలాగంటే ఇప్పుడు స్త్రీలు చేయునట్టుగా ఒకరినొకరు కలుసుకొని, నవ్వుకుంటూ మరియు స్నేహితుల్లా అభినందించుకొని ఉంటారు.
నేడు చాలామంది ప్రజల విషయం అదే అయి ఉన్నదని నేను మీకు చెబుతున్నాను. వారు ముందున్న విధముగా స్నేహంగా లేరు. ప్రజలు చాలా స్వార్థపూరితంగా ఉన్నారు, వారియొక్క స్వల్ప ప్రపంచమని తాము భావిస్తున్న స్థలంలోకి వారు నివసించుటకు వచ్చారు. అదే నిజమని మీకు తెలుసా.
ఎందుకు మనము పొలం వెళ్లినప్పుడు, మీకు తెలుసా, ఎప్పుడైన ఇరుగుపొరుగు వారు జబ్బున పడినప్పుడు, మనము అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి వారి పనులకు సహాయం చేస్తాము. మరి ఇప్పుడు మీ ఇరుగు – పొరుగు వారి చనిపోయిన సంగతి కూడ వార్తా పత్రికలో చదివేంతవరకు కూడ మీకు తెలియదు. అది సరి. స్వార్ద౦….
32. మరియు ప్రజలు వీధి గుండా వెళ్లినప్పుడు, మనము ఒకరి చేతులను ఒకరము గట్టిగా పట్టుకుని వారిచేతులను ఊపి ఇలా అంటాము, “ఎలా ఉన్నావు సహోదరుడా?” మనము అలా చేస్తాము. మరి ఈ రోజుల్లో వారు ఆ వీధిగుండా వెళ్తున్నప్పుడు, వారొక వెర్రి నవ్వు నవ్వి, గాలిలో తలాడించుదురు. ఓ, మై. ఆశ్చర్యము లేదు, ప్రేమ అనేది లేదు.
ఎవరైనా వేరొకరి కంటే పెద్దవారని భావి౦చినట్లయితే, నేను దానిని ద్వేషిస్తున్నాను. మెట్టుకు, మీరు కేవలం భూమి యొక్క ఆరు అడుగులు. మీరంతా అదే. ప్రతి ఒక్కరు, అది సరి.
33. ఈ మధ్యనే, నేను ఒక మ్యూజియం ఎదుట నిలబడ్డాను. అక్కడ 150 పౌండ్స్ బరువు గల ఒక మనుష్యుని చిత్రం ఉన్నది. మరియు అతని శరీరమునకు సంబందించిన రసాయన మూలకాల గురించిన వివరణ ఆ చిత్రపటం కలిగియున్నది. అతని యొక్క విలువ ఎనభై-నాలుగు సెంట్లు. అంతా కూడ 150 పౌండ్స్ బరువు గల మనిషి యొక్క విలువ ఎనభై-నాలుగు సెంట్లు. కానీ అతను ఖచ్చితంగా ఎనభై-నాలుగు సెంట్లపై, పది డాలర్ల టోపీని పెట్టి, అతడు ఎదో గొప్ప అని అనుకోనును. అది సరియే. ఒక స్త్రీ ఎనభై-నాలుగు సెంట్లను ఒక వంద డాలర్ల విలువున్న బొచ్చు కోటులో మూటగట్టి మరియు ఆమెకు తెలిసిన చాలమందితో మాట్లాడదు.
ఏంటి విషయం? దేవుని ప్రేమ మిమ్ములను ఎక్కడకో తీసుకు వెళ్తుంది. అది సరియే. ఇది ఏమిటి? ఇది ఇప్పటికీ ఎనభై-నాలుగు సెంట్లు. మీరు దానిని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఆ ఆత్మ యొక్క విలువ పదివేల ప్రపంచాలు, మీరు దానిని ఏదైనా తాకునట్లు అనుమతించెదరు. అది మంచిది. అదియే సత్యమైయున్నది.
34. ఈ మధ్యనే, నేనొక పెద్ద కూటములో ఉన్నప్పుడు. మరియు అక్కడ ఈ కొంతమంది యువరాణులలో ఒకరు అక్కడ ఉన్నారు. ఆమె కూటములో వెనుకకు వెళ్లి కూర్చున్నది. ఆ స్త్రీగా పూర్తిగా దాదాపుగా చాలా నగ్నంగా ఉంది. నేను సువార్తను భోధించుచుండగా, నేను చూసిన వెంటనే వెళ్ళి, నా కోటును తీసి, దానిని ఆమె చుట్టూ కప్పి, ఆమెకు దానిని ధరించమని చెప్పాను.
ఆలాగే ఒకసారి ఒక స్త్రీకి ఆ విధముగా చేసాను. ఆమె కోపగించుకొని, లేచి ఆ స్తలము నుండి వెళ్ళిపోయినది. కానీ ఏమైనప్పటికి ఆమెకు చెప్పే భాగ్యము నాకు లభించింది. అది మంచిది. అది సరియే.
35. ఆ విధముగానే క్రైస్తవ స్త్రీలు పొట్టి వస్త్రాలను ధరించుచూ వారి యవ్వన బాలికలు కూడ ధరించుకుని వీధులలో తిరుగుటకు అనుమతించుట అవమానకరముగా ఉన్నది. నేను మీకు చెబుతున్నాను. ఆదాము మరియు హవ్వలు యాపిల్ పండు తిన్నందువలన వారు నగ్నంగా ఉన్నట్లు గ్రహించారని నాకు చెప్తారు. నిజంగా యాపిల్ పండ్లు తినడం వలన స్త్రీలు నగ్నంగా ఉన్నట్లు తెలుసుకొన్నట్లైతే, మరల ఆ యాపిల్ పండ్లను తినిపించాల్సిన సమయం వచ్చింది. అది సరైనదే. అదే ఖచ్చితముగా నిజమైయున్నది.
ఓ, ఇది అవమానకరము. ఒక సన్-టాన్ (ఎండ వేడికి శరీరముపై వచ్చే రంగు) పొందుటకు ఎక్కడో ఈ సముద్రపు వడ్డున తమనుతాము పొట్టి వస్త్రాలచే ధరింపజేసుకొనుట, కొద్దమంది చిన్న పిల్లలు ఉన్న పెళ్ళైన స్త్రీలు, లేదా అలాంటిదే ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ యవ్వన స్త్రీలు, వారికి వారే పరిశుద్దాత్మతో నింపబడ్డాము అని చెప్పుకొనే వీరు? మీరు ఆ విధముగానే అయినట్లైతే… దానియొక్క ఫలములను బట్టి ఆ చెట్టును గుర్తించబడును. అది సరియే.
36. నేను ఇక్కడ ఒక చిన్న బాలికను కలిగియున్నాను. ఆమె ఎలా ఉండబోవుచున్నదో నాకు తెలియదు. కాని నేను మీకు చెప్పుచున్నాను, నేను గనుక ఆమెను ఎప్పుడూ కూడా ఆ సముద్రపు తీరముల వెంబడి చూచినట్లయితే, ఆమె తప్పకుండా సరిద్దబడును, అయితే మిస్టర్ చార్లీ బ్రెన్హాం కొడుకు ఆమెను ఒక బెత్తముతో శుద్దపరచును. అది ఒక ఖచ్చితమైన విషమే. అది ఒక మంచి పని. అవునండీ, అది పాత-కాలపు బోధన కావచ్చు, కానీ అది నిన్ను కాపాడుతుంది. అది ఒక ఖచ్చితమైన విషమే. నిన్ను అది సరిచేయును. ఇది తీయ్యని ముచ్చట్లతో చెప్పే సంగతి కాదు, కాని నీవు దానిని విందువు; అది నీకు మంచిచేయును. ఆ ఒక్క విషయము ఖచ్చితము. అవునండీ. ప్రజలు ఇలా ఉండుటనేది అవమానకరము…
ఈ స్త్రీ కావలనుకొంటే… కూటము ముగించబడిన తరువాత కలవవచ్చును. ఆమె నిర్వాహకులలో ఒకరిని కలిసి, “నేను డాక్టర్ బ్రెన్హాంను కలవాలి” అని చెప్పింది. డాక్టర్ బ్రెన్హాం. నేను మీ యొక్క సహోదరుడను. ఆమేన్. మరి ఆమె అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి, ఒక కళ్ళ జోడును ధరించుకొని, ఒక కర్రతో ఈ విధముగా పట్టుకొని, అమె తలను పైకెత్తి, ఆమె చేతిని విసురుతూ, “డాక్టర్ బ్రెన్హాం, నేను ఆశ్చర్యపోయాను,” అని ఆమె చెప్పింది.
“మంచిది, మీరు ఇక్కడికి వచ్చినట్లైతే నేను మిమ్ములను చూస్తాను, లేదా మిమ్ములను చూచినప్పుడు మీరెవరో నేను తెలుసుకొంటాను” అని నేను చెప్పాను. అది సరియేనా.
ఆ విధముగా చేయుట, నేను పాత పద్దతులనే ఇష్టపడతాను, ఒక కరచాలనము, ఆ విధముగా చేయటమనేది ఒక మంచి అనుభూతినిస్తుంది [స్పష్టత లేని మాటలు]; ప్రజలు నిజంగా కరచాలనము చేసుకొని ఆ అనుభూతిని పొందటము అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది. ఒక మంచి పాత వెచ్చని కరచాలనము. దేవుడు మీ హృదయాలను దీవించును గాక. కొన్ని సార్లు మంచి హృదయాలు అలాంటి ఒక పాత నీలంరంగు చొక్కాల వెనుక ఉంటాయి. అది సరియే. నిజంగా.
37. ఇప్పుడు, మరియ కూడ ఆ విధముగానే. మరియు ఆమె ఎలిసబెత్ ను చూచినప్పుడు, మరియు వారు… మేరి, నా ఉద్దేశం ఏమిటంటే, మరయు ఎలిజబెత్. మరియు ఒకరికొకరు పరుగెత్తి, వారి చేతులతో ఒకరినొకరు చుట్టకుని, మరియు ఒకరినొకరు హత్తుకొనుట మొదలుపెట్టెను. మరియ నేను, మరియ చెప్పేది వినగలుగుచున్నాను, “ఓ, నేను విన్నాను నీవు తల్లివి కాబోవుచున్నావు.”
“అవును, కాని నాకు కేవలము…” మనం ఒక క్షణం నాటకీయంగా చూద్దాం, అప్పుడు మీకు పూర్తిగా అర్దమౌతుంది. “నేను తల్లి కాబోవుచున్నాను, కాని నాకు కొద్దిగా భయమేస్తుంది.” చూడండీ, యోహాను యేసు కంటే ఆరు నెలలు పెద్దవాడు, ఆరు నెలలు తరువాత దూతయైన గాబ్రీయేలు కనిపించగా. మరియు అతడు చెప్పెను, “నేను కొంచెం బయపడ్డాను, ఎందుకనగా నేను గర్భవతినై ఆరు నెలలు, కాని బాలుడు జీవములేకుండా ఉండెను. ఆ బాలుడు ఎప్పుడూ కదలేదు.” చూచారా?
38. మరియు అదంతా కూడ అసాధారణ స్థితి, ఎందుకంటే రెండు నెలలకే జీవమొస్తుంది, ఆ విదంగానే. కాని ఇక్కడ ఆరు నెలలు గడచాయి, కాని ఇంకనూ జీవము లేదు. “నేను శిశువును గూర్చి బాధపడుచున్నాను” అని ఆమె చెప్పెను. ఇంకో విదముగా చెప్పాలంటే, మనము కేవలం ఈ భాగమును నాటకీయంగా చేస్తున్నాము. చూడండీ? “మరియు నేను దీనిని గూర్చి కొంచెం భాదపడుచున్నాను.”
మరియు ఎలిజబెత్…అప్పుడు మరియ చెప్పుట చూసాను, “ఎందుకు, గాబ్రీయేలు దూత నావద్దకు వచ్చి, నేను ఏ మనుష్యుని ఎరుగక, ఒక కూమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టెదవు,” అని ఆ దూత నాతో చెప్పెను.
ఆమె “యేసు” అను పేరు చెప్పిన వెంటనే, పరిశుద్దాత్మ యొక్క శక్తి ఆ తల్లి గర్భములో చనిపోయిన శిశువుపై పడగా అతను ఆనందంముతో గంతులు వేయుట ప్రారంభించెను. యేసు పేరును మొదట ఒక మానవ పెదవులచే పలికినప్పుడు, చనిపోయిన శిశువుకు జీవితాన్ని తెచ్చినట్లైతే, తిరిగి జన్మించిన క్రైస్తవులకు ఏమి చేయాలి? అది యేసుక్రీస్తులో జీవించి ఉండాల్సి యుంటుంది. అది సరియే.
39. “నా ప్రభువు యొక్క తల్లి వచ్చినప్పుడు? ఆ యొక్క శుభవచనము నా చెవులకు తగిలిన వెంటనే నా శిశువు నా గర్భమందు ఆనందముతో గంతులు వేసెను.” తన తల్లి గర్భంలో అతను జన్మించక ముందుగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు…. హల్లెలూయా.
ఖచ్చితముగా, నేను క్రీస్తు యొక్క సువార్త శక్తిలో అద్భుత కార్యములను మరియు సూచనలను నమ్ముతాను. అవును, ఆయనను నేను నా హృదమంతటితో నమ్ముతాను. మరియు ఆయన నిజమైనవాడని నేను నమ్ముతాను. ప్రపంచమంతా కూడా ఆయనను గూర్చి పుకారులు పుట్టించినా నా మనస్సులో ఏ మాత్రము కూడ సందేహాన్ని కలిగించవు. ఆయనను నేను నా హృదమంతటితో నమ్ముతాను. అవును.
ఆయన పేరు ఉచ్చరింపబడగానే, మరియు ఆ చిన్న బాలుడు గంతులు వేయుట ప్రారంభించెను. అతని తల్లి గర్భములో చనిపోయెను, యేసు యొక్క పేరు మొదటిగా మర్త్యమైన తన తల్లి పెదలగుండా ఉచ్చరింపబడినప్పుడు, ఆ బాలుడు జీవము పొందుకొనెను… “నా ప్రభువు యొక్క తల్లి వచ్చినప్పుడు. నీ మాటలు నా చెవులకు తగిలిన వెంటనే నా శిశువు గర్భమందు ఆనందముతో గంతులు వేసెను.”
40. ఈ విదముగా ఏ శిశువు కూడ తన తల్లి గర్భము నుండి పుట్టులేదు, బైబిల్ చెబుతుంది, పరిశుధ్ధాత్మతో నింపబడెను? ఆయన పరిశుధ్ధత్మా బోధకుడు. అది సరియే.
మరియు అతను బయటకు వచ్చినప్పుడు…. అతను తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతను అరణ్యంలోకి వెళ్ళెనని బోధిచబడితిమి. ఆయన ఏలియా ఆత్మతో అభిషేకించబడెను, అతని వలె నటించెను, అతని వలె కనిపించెను, చిన్న బలహీనమైన ముసలి వాని వలె కనబడెను, బట్టతలతో, అతని చుట్టూ ఈ విధంగా చిన్న గుడ్డ పీలికలు ధరించుకొని, మరియు శరీరం చుట్టుతా ఒంటె చర్మం ధరించుకొని, మరియు అతని నడుముకి ఒక తోలు దట్టి కట్టుకొని ఉండెను. కానీ అతను యూదయ అరణ్యములో నుండి వచ్చినప్పుడు, అతను అన్ని ప్రాంతాలను కదిలించే ఒక సందేశాన్ని బోధించాడు. దేవుడు మరి కొద్దిమంది బాప్తిష్మమిచ్చు యోహానులను ఇచ్చును గాక. ఆమేన్. ఆవునండీ. వెంట్రుకల చర్మము దరిచుకొని వచ్చెను. మెడచూట్టూ మంచి కాలరుతో మరియు రోజుకు రెండు సార్లు వేయించిన చికెన్ ముక్కలు తింటూ, అతను బోధించటకు ఒక వారమునకు ముందే 100 డాలర్లు జీతం తీసుకొని కాదండీ. ఆయన పరిశుధ్ధాత్మ అభిషేకముతో వచ్చాడు. హల్లలూయా.
41. ఆయన ఏ మాటను కూడ విసరలేదు. హేరోదు రాజు తన తమ్ముడైన పిలిప్పు భార్యతో వచ్చినప్పుడు, “వివాహము మరియు పరిత్యాగమును గూర్చి నువ్వు బోది౦చవా,” అని ఎవరో అనెను. అతడు నేరుగా వెళ్లి, అతని ముఖము మీదే “నీవు ఆమెను ఉంచుకొనుట న్యాయము కాదు.” ముందున్నది ఎవరైన సరే న్యాయము కొరకు నిలబడు వ్యక్తులను దేవుడు మనకు ఇచ్చును గాక (ఆమేన్.) చెక్క ముక్కలు ఎక్కడ పడాలనుకుంటున్నాయో అక్కడే పడనిమ్ము, మరియు సువార్త ఎంతవరకు నరక్కుంటూ పోతుందో అంతవరకు నరకనిమ్ము. అది సరియే. నల్లని దాన్ని, నల్లదని చెప్పుము; మరియు తెల్లని దాన్ని, తెల్లదని చెప్పుము. మంచి వాటిని, మంచి అని చెప్పుము; మరియు చెడ్డవాటిని చెడు, అని చెప్పుము. ఒకవేళ నీవు సరిగా లేనట్లయితే, సరిచేయబడుము. అది నిన్ను సవరించును, నిన్ను ప్రత్యేకముగా కనిపించేలా చేస్తుంది, ప్రత్యేకముగా నటించేలా మరియు ప్రత్యేకముగా జీవించేలా చేస్తుంది, ప్రత్యేకముగా ఉండేలా. పరిశుధ్ధాత్మ మీకు మంచిదైయున్నది. అదే మిమ్ములను సరిచేయును.
42. మరి అదే కార్యము ఇప్పుడు ఈ దేశాలలో కూడ ఉంది, మరియు ప్రపంచమంతటనూ కూడ అలాగే ఉంది. పైకి బక్తిగల వారివలె ఉండియు, దేవుని శక్తిని ఆశ్రయించక యున్న నామకార్దమైన చల్లని పాత సంఘములు మనకు చాలా ఉన్నాయి. మనకు ఈ రోజు ఏది అవసరమైయున్నదనగా, సంఘము నుండి కొంత తొక్కను తొలగించవలసియున్నది. అది పెంతెకోస్తుకు కూడా వర్తించును. ఆమెన్. మీకు తెలుసు అది అలా ఉందని.
ఎందుకనగా మీరు బయపడ్డారు. ఒకరు ఇక్కడ కూర్చొని ఉండగా, మరియు దేవుని యొక్క సంఘము ఇక్కడ, మరియు సంఘ సమాక్యలు కూడ ఇక్కడ ఉన్నారు, మరియు ఇది ఇక్కడ మరియు అదెక్కడ ఉన్నదని దానిని గూర్చి బయపడవద్దు. మరియు నీవు దానిని మరచిపోయి క్రీస్తులోనికి రండి (హల్లెలూయ.), మరియు పరిశుద్దాత్ముడే సరియైన మార్గము కలిగియున్నాడు. ఆమేన్.
ఎదీ ఏమైనా మీరు నన్ను పరిశుద్ద బండరాయిగా పిలిచినా సరే, కావున నేను దానిని ఆ విదంగానే ఉండదలచుకున్నా. అదే సరియైనది. అదే నిజమైనది. దేవుని ఆత్మ దానిని చేయును. నేను పరిశుద్ద బండరాయని కావచ్చు. నేను అలా అయినట్లైతే, మీరెప్పుడు చూడని పరిశుద్ద బండరాయిని నేను. ఇది ఒక పరిశుద్ద బండరాయిగా ఉండుటకు గుర్తించబడినట్లైతే, మరియు దేవుని వాక్యమును నమ్ముము, ఆ విషయానికి నన్ను రాయబారిగా ఉంచును. అది సరైనదే. అది సరైనదే. అదే నిజమని నేను నమ్మెదను. మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు; ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెలమీదను నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పిన దినములు ఇవే అని ఇప్పుడు నేను నమ్ముచున్నాను. అది సరియే.
43. అప్పుడు వారు అక్కడ నిలబడి యుండుట చూచినప్పుడు… ఓ, మై, ఆ చిన్న శిశువు తన తల్లి గర్బములో ఆనందముతో గంతులు వేసెను. ఆయన జన్మించిన తరువాత, ఆయన బోదించెను. చుట్టూ ప్రాంతాల జనులు ఆయన మాటలు వినుటకు వచ్చెను. ఆయన ఎటువంటి వర్తమానము భోదించాడోనని మనము ఆశ్చర్యపడవచ్చు. ఆయన క్రీస్తును గూర్చి బోదించాడు.
సంఘములు వేదాంత శాస్త్రము మరియు అలాంటి అంశాలపై బోధనను, ఒక రకమైన మానవ వేదాంత శాస్త్రము మరియు కొంత తత్వశాస్త్రము, లేక అలాంటిది ఏదైనా, లేక ఎవరు తరువాత మేయరు కాబోవునది, ఎదైన రోజా పూలను గూర్చి లేక వైరోక పూలను గురించి బోధీ౦చుట వదిలిపెట్టినట్లయితే; మరియు క్రీస్తుని బోదించి, దేవుని కుమారుడైన క్రీస్తును గురించి బోదించుట, (హల్లెలూయ.), ఇది మనుష్యలను ఆకర్షించును. హల్లెలూయ. “నేను పైకెత్తబడినయెడల, అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.” అది సత్యమైయున్నది. ఇదే నిజము.
44. ఓ, మై. పాత కాలపు పరిశుద్దాత్ముడు, ఇప్పుడు, ప్రతి ఒక్కరికి ఉచితముగా అందుబాటులో యున్నాడు…. బైబిల్ గ్రంధమంతటి గుండా పరిశుద్ధాత్మ ఈ రోజున నడిపించ వచ్చును. ఇశ్రాయేలు, అరణ్యములో నుండి బయటకు పిలవబడినప్పుడు, అది ఒక సంఘముగా యున్నది; వారు దేవుని ప్రజలైయున్నారు.
నేను కొన్ని రోజుల క్రితం ఒక వీధిలో “పెంతెకొస్తుల సువార్తకు” సంపాదకుడైన సహో. ప్రోడ్-షామ్ గారితో మాట్లాడుచుండగా.
ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, వారు దేవుని ప్రజలు. వారు బయటకు పిలబడినప్పుడు, వారు దేవుని సంఘమైయున్నారు. సంఘమనగా అర్ధమేమిటంటే, “బయటకు పిలువబడినవారు.” మరియు ఇప్పుడు, దేవుడు ప్రజలను బయటకు పిలుస్తున్నాడు, బబులోనులో నుండి, గందరగోళంలో నుండి బయటకు రమ్మని పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్.
మీరు చెప్పవచ్చును, “దేనికి నీకు – నీవే ఆమేన్ చెప్పుకోనుచున్నావు?” మంచిది, నేను చేయుట లేదు… నీవు కనుక చెప్పనట్లైతే, నేను చెప్పెదను. నేను దానిని నమ్ముచున్మాను. ఆమేన్. అది సరి. “ఆమేన్” అను పదమునకు అర్ధమేమనగా “అలా జరుగును గాక!” మరియు అది సత్యము అని నేను ఎరుగుదును. అవును.
45. మరియు అక్కడ, ఇశ్రాయేలు బయటకు పిలువబడినప్పుడు, ఒక సంఘమునకు మాదిరిగా యున్నది… ఇశ్రాయేలు ఎప్పుడు కూడ ఒక సంఘమునకు మాదిరిగానే యున్నది. అది ప్రకృతి సంబంధమైన సంఘము, ఇది ఆత్మీయమైన సంఘము. వారు బయటకు పిలువబడ్డారు. వారు బయటకు పిలువబడిన వెంటనే, వారు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించిరి, మోషే ద్వార బాప్తష్మము పొందిరి. మరియు వారు ఆవలి వైపునకు వచ్చిన వెంటనే, వారు ఆత్మ చేత బాప్తిష్మము పొందిరి.
మిర్యాము తంబురను చేతపట్టకుని వీధి గుండా వెళ్ళుచు నాట్యమాడుచుండెను. హల్లెలూయ. అవునండీ. ఆమె విజయమును కలిగియున్నది. మీరు ఎప్పుడైన ఆ విధముగా పొందియున్నారా? మంచిది. ఆమె ఆత్మ పరవశమున నాట్యమాడెను, మరియు ఇశ్రాయేలు కుమార్తెలందరూ ఆమెను వెంబడించి, నాట్యమాడెను. మోషే తన చేతులు పైకెత్తి, ఆత్మవశుడై, పాట పాడెను.
ఎందుకు? అక్కడ వెట్టి పనులు చేయి౦చు అధికారులందరూ, వారి వెనుక పడియున్నారు. వారు చేసిన ఆ పాత కార్యములన్నియు, నీచమైనవి…. క్రీస్తు యొక్క ఎర్రని రక్తము, మీరు చేసిన కార్యములన్ని౦టిని మరియు నీ ప్రతి పాపమును కడిగెనని నీవు గ్రహించినప్పుడు, నీవు కూడ విజయెత్సవ గీతముతో పాడెదవు. హల్లెలూయ.
ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం,
నా వంటి పాపిని ప్రేమించెను,
ఒకసారి దారి తప్పిపోతిని, కాని ఇప్పుడు నేను సరియైన మార్గములో ఉంటిని,
గ్రుడ్డి వాడనైతిని, కాని ఇప్పుడు చూచుచున్నాను. (అది సరియే.)
46. నేను వారివైపు చూచినప్పుడు. మరియు నేను చూచిన వెంటనే, జీవించుటకు వారికి ఆహారము అవసరమైయున్నది. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించెను, పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నది. ప్రతి రోజు ఉదయం వారు బయటకు వెళ్ళి దానిని కూర్చుకొనెను. అది మంచిదిగా ఉండెను. వారు దానిని భుజించిరి. అది తినుటకు తెనెవలె యుండెను. వారు తమ పెదవులను చప్పరించుచూ తినేవారు.
నేను మీకు చెప్పుచున్నాను, ఇప్పుడు వర్షించు ఈ పరిశుద్ధాత్మ, ఒక మాదిరిగా యున్నది, మరియు ఇది ఒక గుర్తు, ఇది రుచికి తేనెవలె యుండును. అది సరియే. దేవుని పరిశుద్ధులు వారి పెదవులను నలిపివేసేంతవరకు త్రాగి, వారు “ఉమ్, ఉమ్, చాలా బాగుంది” అని చెప్పుట నేను చూశాను. అక్కడ తెనె గురించి ఎదో ఒకటున్నది. అది నిజమే.
47. దావీదు, బైబిల్ గ్రంధంములోని పాత కీర్తనా కారుడు. ఆయన తెనె గురించి మాట్లడెను. మరియు ఆయన గొర్రెల కాపరి. మరియు గొర్రెల కాపరులు ఒక చిన్న సంచిలో తెనెను తీసుకెల్తూ ఉంటారు. మరియు వారి గొర్రె జబ్బు పడినప్పుడు, వారు ఆ తేనెనంతటిని ఒక సున్నపు రాతిపైన పూస్తారు. మరియు ఆ జబ్బున పడిన గొర్రె ఆ రాతి దగ్గరకు వెళ్ళి దానిని నాకుతూ ఉంటుంది. తెనెను నాకిన తరువాత.. [టేపు మీద ఖాళీ ఉన్నది.] [స్పష్టత లేని మాటలు.] అక్కడ అది ఉంటుంది, హల్లెలూయ. దానిని కేవలం నాకుతూ ఉంటుంది. అది సరి.
సహోదరుడా వినుము, నేను మీకు చెప్పనీయ్యండి. నేను దీనిని క్రీస్తుకు పోల్చనీయ్యండీ, ఎదో ఒక సంఘమునకు కాదు. అది క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటుంది. ఆయనను తినుము. హల్లెలూయ. వారికి స్వస్ధత అవసరమైయున్నది, ఎదైన అర్హత ఉన్నత్లయితే, ఎదైనా శక్తి ఉన్నత్లయితే, ఎదైనా స్తుతి ఉన్నత్లయితే, అవి ఆయనకే చెందును. ఆమేన్. అది సరియే. స్థిరమైన క్రీస్తు అను బండ పైన. బండ, బండ కూడా దీనిలో ఒక పెద్ద పాత్ర పోషించినది.
48. చాలా కాలం క్రితం వారు బండను కలిగియు౦డిన్నప్పుడు. పిచ్చి కుక్క మనుష్యులను కరిచినప్పుడు, వారిని తీసుకెళ్ళి ఆ బండకు తగిలిస్తారు. వారు తగిలించబడినప్పుడు వారికి నయమౌతుంది. వారికి ఆ బండ తగలనట్లైతే వారు చనిపోవుదురు. నాకు తెలిసిన అతి బయంకరమైన పిచ్చి కుక్క దెయ్యమే. అది సరియే. మరియు నాకు తెలిసి నయమగు ఒకే ఒక్కటి కాలముల యొక్క బండ. దానికి అతుకబడుడి, దానిమీదే ఆనుకొనుడి, దేవుడే దానిని గూర్చి జాగ్రత్త వహించును.
ఇక్కడ కుర్చిలో కూర్చున్నటువంటి చిన్న బాలుడు, నువ్వు గ్రుడ్డి వాడవయ్యా, నువ్వు మంచ మీద పడుకొనియున్నావు, మారని దేవుని హస్తమును పట్టుకొని యుండుము. దెయ్యం నిన్ను కొట్టవచ్చును, కాని చాలినంత ఆకర్షించు శక్తి యుగముల యొక్క బండ యొద్ద యున్నది, నా కొరకు కొంత చీల్చబడియున్నది, దానిలో నన్ను దాగుకొననిమ్ము. హల్లెలూయ. నీవు అక్కడ దాగుకొనిన యెడల సాతానుడు నిన్ను ఏ మాత్రము తాకలేడు.
దానితో అతుకబడి యుండుము. దానిని పట్టుకొని యుండుము. ఆ బండను నీ యొద్ద నుండి వెళ్లిపోనీయకుము. ఎటువంటి లక్షణాలు కనపడినా సరే, ఎటువంటి స్తితిలోనైనా, అది, లేక మరొకటి, మీరు ఆ బండను హత్తుకొనుము. స్వస్తతపరచు శక్తి నీలోయున్న రోగమంతటి తీసివేయు వరకు ఆ బండతోనే నిలిచి యుండుము. అది సరియే. ఆయన దానిని చేయును.
49. మరి ఈ మన్నాను గురించి మరలా గమనించండి, మనము వెళ్లిపోక ముందే, ఖచ్చితమైన మాదిరిగా యుండుటకు, ఒక ఖచ్చితమైన పరిశుద్దాత్మకు మాదిరిగా యుండుటకు. ఆ యొక్క మన్నా ప్రతి రాత్రి, ప్రతి రాత్రి కురుయును. మరియు వారు ప్రతిరోజూ క్రొత్తదానిని సమకూర్చొనవలెను. అది నిజమే కదండీ? అది అలాగే అయినట్లైతే “ఆమేన్” అని చెప్పండి. మంచిది. వారు క్రొద్దిగా దాచుకొనిన యెడల దానిపై పురుగులు పట్టును.
ఈ రోజున చాలా మంది పెంతెకోస్తు వారి యొక్క అనుభవాలు కూడ ఆ విదముగానే యున్నవి. వారు రెండు లేక మూడు సంవత్సరముల క్రితం జరిగిన వాటియందు సాక్ష్యమిచ్చుటపై ఆధార పడియున్నారు. వారియొక్క అనుభవాలు పురుగులు పట్టిన వాటివలె అయిపోయినవి. ఇప్పుడెందుకు కాదు? హల్లెలూయ. క్రొత్తదానిని పొందుకొనండి. అది సరి. ప్రతి రోజూ…. యేసుతో ప్రతి రోజూ నిన్నటి దినము కంటే మధురముగా ఉండును. వారక్కడ ప్రతి రాత్రి మన్నాను తినుచుండిరి.
50. ఇప్పుడు, గమనించండి. ఒక పరిశుద్దత్మాకు మాదిరి. అది ఎన్నడు రాలేదు; ఒక యాజకుడు వచ్చి, వారికి ఇవ్వలేదు; ఎదో ఒక బోధకుడు వారికి దానిలో బాప్తిస్మము ఇవ్వలేదు; అయితే అది పైనుండి వచ్చియున్నది, దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది.
మరియు గమనించుడి. మోషే అహరోనుకు చెప్పెను, అప్పుడు వారు బయటికి వెళ్ళి, పెద్ద ఓమెరులను నింపెను, అది అతిపరిశుద్ద స్తలములో ఉంచుబడుటకును, రాబోవు ప్రతి యాజకుడు ఈ విషయాలను గురించి అడిగినప్పుడు చూచనట్లుగా ఉంచుటకును. వారికి అప్పుడు నిజమైన మన్నాను తినుటకు అవకాశము కలదు. మరి అక్కడ అది ఎప్పుడును కూడ పాతది అవదు. ఇది ఎల్లప్పుడూ అతిపరిశుద్ద స్తలములో తాజాగా ఉండును. అది నిజమేనా? పురుగులు దానిని పట్టలేవు. కాని అది దాచిపెట్టబడుతుంది. యాజక దర్మం చేయు ప్రతి వాడు ఆ నిజమైన మన్నాను కొద్దిగా రుచి చూచుటకు అర్హత కలిగి యుండును.
51. ఇది ఎంత సుందరముగా ఉన్నది. పెంతెకోస్తు దినమున, పరిశుద్దాత్మ పరలోకము నుండి క్రిందికి వచ్చినట్లుగా, మన మన్నా, మనము రక్తము ద్వారా వచ్చినప్పుడు, రక్షింపబడినప్పుడు, మన పాపముల నుండి కడుగబడినప్పుడు, మరియు పరిశుద్దాత్మ దిగి వచ్చెను. సహోదరుడా…
పేతురు చెప్పెను, పెంతెకోస్తు దినమున, “ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా, ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని,” వారితో చెప్పెను. మరియు ఆత్మ యొక్క బాప్తిస్మము ద్వారా వచ్చినవారు ఎవరైన సరే, వారికి కూడ పెంతెకోస్తు దినమున పొందుకున్న అదే పరిశుద్దాత్మ పొందుకోనవచ్చును. హల్లెలూయ [స్పష్టతలేని మాటలు] దానిని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క సత్యము.
అలాగునే ఉండే వేరే పరిశుద్దాత్మ కాదు, నిజమైన పరిశుద్దాత్మ. ఆ పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన పరిశుద్దాత్మే ఇప్పుడు కూడ వచ్చును, అదే పరిశుద్దాత్మ. నిజమైన పరిశుద్దాత్మ, ఆ రోజున వారు పొందుకున్న అదే రుజువును మరియు సాక్ష్యమును, పరిశుద్దాత్మను తీసుకొని వచ్చును. హల్లెలూయ. ఆమేన్. ఓ, ఎంత బాగున్నది. మీరు చెప్పవచ్చు, నాకిది ఇష్టమైనదని… “ఓ, నేను దానిని ఇప్పుడే అనుభూతి చెందుచున్నాను.” అది నిజమే. ఇది నిజమైయున్నది. నాకు ఎప్పుడూ కలిగే అనుభూతి వలె, నిజముగా యున్నది. అది నిజము. పెంతెకోస్తు దినమున క్రుమ్మరింపబడిన అదే పరిశుద్దాత్మవలె యున్నది.
52. ఈ రోజు సంగతి ఎమిటి, మన సంఘములు దాని నుండి దూరంగా వెల్లుచున్నవి. ఇది ఖచ్చితంగా నిజము. మనము ఒక పెద్ద మంచి సంఘమును నిర్మించుటకు ప్రయత్నించుట నాకు గుర్తొకొస్తున్నది. పెద్ద పొడవాటి బెంచీలను పెట్టుట, వీటిలో చాలా శ్రేష్టమైన దానిని తీసుకు వచ్చుట. మరియు కొంతమందిని గాన దూతల వలె పాడుటకు. ఆ వేదిక పై నిలుచుని యున్న వారిని చూడండీ, రంగులు పులుముకొని ఆ విదముగా యున్న వారిని చూడండీ, మరియు చేతులు లేని జాకెట్ల, మరియు వారు మోకాళ్ళ వరకు దాదాపుగా దిగంబరత్వము కనుపడులాగున; వీదుల గుండా వెళ్ళుచు సిగరెట్లు వెలిగించుచు. మరియు గాన దూతల సమూహము అని పిలవబడుచూ? స్రీ మరియు పురుషులారా, ఏమి సంగతి? నీకునీవె క్రైస్తవుడవని పిలుచుకొనినయెడల, ఆ విదముగా ప్రవర్తించుము. వారి ఫలములను బట్టి మీరు వారిని ఎరుగుదురు. అయితే మనము సరిపెట్టు కొనుచున్నాము.
గుర్తుంచుకొనుడి, కంటికి కన్పించే సౌందర్యమంతా కూడ సాతాను నుండి వచ్చినదే. ఆదియందు, వాడు….. ఆదియందు సాతానుడు ఆ విదముగానే యుండెను, మిఖాయేలు కలిగియున్న దానికంటే మెరుగైన దానిని వాడు చేయుటకు ప్రయత్నించెను. క్రిందికి పడద్రోయబడినప్పుడు, కయ్యూనులో దూరి, హెబేలు చేసిన విదముగానే బలి అర్పించుటకు ఆ విదముగా చేయుటకు ప్రయత్నించెను, కాని రక్తము లేకుండా అర్పించెను. నిజము.
53. ఒకానొక రోజు నాకు జ్ఞాపకము ఉన్నది, నేను నా సహోదరుడు నడుచుకుంటూ వెళ్ళుచుండగా, మరియు మేము ఒక పాత తాబేలును చూసాము. నేను ఎప్పుడూ చూడనటువంటి ఒక నవ్వకోదగిన కార్యము, పాత తాబేలు. మరి ఇప్పుడు మీరు అవి ఇక్కడ కలిగియున్నారో లేదో నాకు తెలియదు. అది తన కాళ్ళను ఈ విధంగా నెట్టును, మీకు తెలుసా, అవి నడుచున్నప్పుడు. నేను నా సహోదరుడితో చెప్పాను, “అది చూచుటకు ఒక హస్యమైనదిగా లేదా?” అని నేను అడిగాను.
“అవును అది అలానే ఉంది,” అని అతను చెప్పాడు.
మరియు మేము దాని దగ్గరకు వెళ్ళాము. అది తన కాళ్ళను ముడుచుకుంటుంది [సహోదరుడు బ్రెన్హాం వివరిస్తున్నాడు.] వీరిలో కొందరి గూర్చి నా మనసులలో వచ్చుచున్నాది, మీరు నిజంగా సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు, వారు “నేను బాప్టిస్టువాడను, నేను మెథొడిస్టువాడను” అని గుల్ల లోనికి వెళ్ళిపోతారు.
అలాగే వెళ్ళండి, మీ పేరు గనుక పరలోకములో లేనట్లైతే, మీరు నరకానికి వెళ్తారు. అది సత్యము. కేవలం గొర్రెపిల్ల జీవగ్రంధంములో వ్రాయబడిన వారు మాత్రమే, విమోచించుట ద్వారా, తిరిగి జన్మించుట ద్వారా… “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవును రాజ్యమును చూడలేడు” అని యేసు చెప్పెను. నిజంగా. నీవు తిరిగి జన్మించినట్లైతే, నీవు నూతన సృష్టివి అవుతావు, క్రీస్తులో ఒక నూతన సృష్టి. ఓ, హల్లెలూయ. ఇంకో మాటలో చెప్పాలంటే…. దీనిని గూర్చి ఉద్రేకపడకండి. హల్లెలూయ అనగా, “మన దేవునికి స్తోత్రము.” మరియు నేను ఆయనను స్తుతిస్తున్నాను. ఆమేన్.
54. అప్పుడు ఆ పాత తాబేలు, నేను దానివైపు చూచినప్పుడు, అది చూచుటకు ఎంతో హస్యముగా ఉన్నది. ఆ తాబేలు అప్పుడే తన కాళ్ళను లోనికి ముడుచుకున్నది. “మంచిది, నేను ఏమి చేస్తానో నీకు చెప్తాను” అని నేను అన్నాను. “నేను ఆ తాబేలును నడుచేట్లు చేస్తానని” నేను చెప్పాను. నేను నాతో పొడవాటి నీటి దగ్గరనే పెరిగే ఒక చెట్టును తీసుకున్నాను, మరియు నేను ఈ చెట్టును దానిపై వేయుట ప్రారంభించాను. అది అక్కడే నిలిచి యుంది. మరియు అది లోనికి వెళ్ళుటకు మీరు దానిని కొట్టలేరు. అంతే, దానిని కదిలించకుండా ఉండటమే మీరు చేయవలసినది. లేదు, అది లోపలే ముడుచుకొని బయటకు రాకుండా ఉంటుంది.
మరియు నేను దాని నీటి యొద్దకు తీసుకు వెళ్ళాను. “నేను ఇప్పుడు దీనిని సరిచేస్తాను” అని చెప్పాను. అప్పుడు నేను దానిని నీటిలో వదిలాను, మరియు అప్పుడు కొన్ని నీటి బుడగలు పైకి వచ్చాయి. మీరు వారిని ఈ విదంగా బాప్తిస్మం ఇవ్వాలి, ఆ విదముగానే, ఏ విదముగానైన నీవు తల మునుగులాగున చేయవచ్చు. మరియు అతను పొడి పాపిగా మునిగి, తిరిగి తడి పాపిగా బయటికి వస్తాడు. అతను ఇప్పటికి పాపియే. మీరు నీటి మూలముగా రక్షింపబడరు. అది సత్యము.
“మరియు నేను అనుకొన్నాను, ”ఆ పాత తాబేలును ఎలా నడిచేట్లు చేయాలి“ అని నేను ఆలోచించాను. మీరు బాప్తిస్మము గూర్చి వాదించి మరియు సంఘము ముందుకు సాగునట్లు చేయలేరు. నీవు దాని గురించి ఆలోచించుట లేదా. నీవు దానిని చేయలేవు.
55. మరియు నేను క్రిందికి వెళ్ళి ఒక పేపరు ముక్క తెచ్చుకున్నాను, మరియు కొద్దిగా మంటను చేసాను, మరియు ఆ వృద్ద తాబేలును దానిపై కూర్చోబెట్టాను. నేను మీకు చెబుతున్నా; మరియు అప్పుడు ఆ తాబేలు కదులుట ప్రారంబించెను. అది నిజము. మనకు ఈ రోజు అవసరమైనది ఏమిటంటే పాత కాలపు పరిశుద్దాత్మ, దేవుడు మండుచున్న ఉజ్జీవమును పంపెను. ఆమేన్. అది నిజము. అదియే వారిని నడిపించును. అది సరియే. వారు నిలకడగా కూర్చోలేనంతగా అగ్నిని బోదించండి. నిజము.
కొద్ది సేపటి తరువాత, క్రిందన్న ఆ పాత తాబేలును ఎవరో ఒకరు దానిని పట్టుకొని వచ్చి మరియు దాని తలను కత్తిరించి వేసెను. అక్కడ పడవేసెను, మరియు నా సహోదరు అటు నుండి వచ్చాడు, నీవ్వు తాబేలును తెచ్చావా?“ అని అడిగాడు.
“అవును.”
అక్కడ క్రింద చూచి, దానిని తీసుకొనుటకు ప్రారంబించెను. మరియు ఆ పాత తాబేలు యొక్క నోరు పడిఉండెను, ఒక్కసారిగా అతడిని పట్టుకొనెను. ఒక గంట నుండి అక్కడ పడి యుండెను. “నీవు దానిని చంపితివి అని నేను అనుకున్నాను,” అని అనెను.
“నేను దాని తలను మొండెము నుండి వేరు చేసాను” అని నేను చెప్పాను. “మరియు అది చనిపోయి ఉన్నాది మరియు దానికి అది తెలియదు.”
మరి ఈ రోజున చాలా మంది ప్రజలతో ఉన్న విషయమే అది. చచ్చి యుండియు, మరియు దానిని ఎరుగరు. అది సరియే. వారి చుట్టూ ఉన్న సంఘములు మరియు మొదలగునవి ఆ విదముగా. పరిశుద్దాత్మ యొక్క శక్తి అంటే ఎంటో వారికి తెలియదు. విజ్ఞాము చెప్పుదానిపై, మరియు ఇంకోకటి ఇలా చెబుతుందీ, మరియు ఇదీ ఇలా చెబుతుంది, అని వాటిపై శ్రద్దవహించక, క్రీస్తుని నమ్ముము. ఆమేన్, ఓ, మై. నేను మంచి అనుబూతిని పొందుచున్నాను. ఆమెన్. అవును, నేను మంచి అనుభూతి చెందుచున్నాను. దేవునికి కృతజ్ఞతలు.
56. స్నేహితులారా ఇప్పుడు మీకొక విషయాన్ని చెప్పనివ్వండి. యేసు యోహానుచే బాప్తిస్మము పొందుటకు యోర్దానుకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ పావురము వలే దిగి ఆయన మీదికి వచ్చుట యోహాను చూసెను. మరియు ఆయన దేవుని ఆత్మచేత నింపబడి నలబై రోజులు శోధింపబడుటకు యూదయ అరణ్యములోనికి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత అధ్బుతాలు మరియు సూచక క్రియలు ఆయనను వెంబడించుట ప్రారంభించెను. “నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు వెంబండించునని” పరిశుద్ద గ్రంధము చెప్పుచున్నది.
సూచక క్రియలు మరియు అద్భుతాలు ఎల్లప్పుడు దేవుని యొక్క సంఘమును వెంబడించును. ఎక్కడైనా సరే మరియు ఎల్లప్పుడు ఆ విధముగానే జరుగును. మీరెప్పటికి… మీరు ఎక్కడైనా మీకు నచ్చిన చోట చరిత్రను తీసుకొనండి. దేవుడు ఉజ్జీవములను మరియు ఉజ్జీవములను పంపెను; మరియు అవి పంపబడిన తరువాత వారు వాటిగుండా వారు ఒక సంస్థను ఎర్పాటు చేయుదురు, మరియు అవి అక్కడ నిలబడజాలవు, సందేహము లేదు. మొదటి సంగతి మీకు తెలుసా… పడిపోయిన తరువాత తిరిగి లేచిన సంఘము లేనే లేదు. దేవుడు, ఆయన ప్రజలను దానికి దూరంగా ఉంచును. అది సరియే. అది సత్యము.
ఈ రోజు దేవుడు ప్రజలను ఒక్కటిగా పిలుచుచున్నాడు. నేను దానిని నా హృదయమంతటితో నమ్మచున్నాను, మీ సంఘము నుండి కాదు, కాని హృదయమందు ఒక్కటిగా. సంఘములను ఒంటిరిగా వదిలివేయండి. అవి బాగానే ఉంటాయి, వారిలో ప్రతి ఒక్కటి. కాని మనకు ఆ పాత-కాలపు పరిశుద్ద పౌలు యొక్క ఉజ్జీవము అవసరమైయున్నది, మరియు సంఘములలో శక్తితో, బైబిల్ లోని పరిశుద్దాత్మ వారికి బోదించెను; మరలా వారిని సరి చేనెను. ఆమేన్.
57. ఇప్పుడు, అప్పుడు వచ్చినట్లు ఆయనను నేను చూచుచున్నాను. ఆయన దూరంగా పిలవబడేంతవరకు ఆయన యొక్క పరిచర్య చాలా గొప్పగా వ్యాప్తి చెందెను. ఆయన బయటకు వెళ్ళినప్పుడు లాజరు జబ్బున పడెను.
జాగ్రత్తగా వినండి. యేసు మీ కుటుంబమును విడచినప్పుడు, అస్వస్ధత వచ్చుటకు, ఇబ్బందులు కలుగుటకు, గుండెనొప్పులు మరియు నిరాశలు వచ్చుట గమనించండి.
మీరు దానిని నమ్ముట లేదా? మరియు యేసు ఎప్పుడైతే నీ గృహమును విడచి పెట్టునో, వెను వెంటనే ఇబ్బందులు వస్తాయి.
కాని లాజరు విషయంలో ఆయన విడిచి వెళ్ళలేదు. ఆయన దూరంగా వెళ్ళాడు, ఎందుకనగా ఆయన తండ్రి యొక్క పని ఆయనను బయటకు పిలిచినది. ఆయన ఎక్కడో ఓ చోట బోదించుటకు వెళ్ళెను.
లాజరును యేసు దర్శన మందు చూశాడని నేను నమ్ముచున్నాను. వారు ఆయన కోసం కబరు పంపిరి. కాని అయన రాలేదు. వారు ఆయన కోసం మళ్ళీ కబరు పంపించారు; ఆయన రాలేదు.
అది ఎలా ఉన్నదంటే, మీ సేవకుని కొరకు మీరు కబరు పంపినత్లయితే, మరియు ఆయన రానట్లుగా ఉన్నది. “ఎందుకు, పాతకాలపు వేషధారి. నేను వెళ్లి మరియు వేరోక సంఘములో చేరుతాను,” అని చెప్పెదవు. ఆ కారణము బట్టియే నీ సంఘకాపరిని నీ కొరకు ఏమీ చేయలేడు. నీవు నీ సంఘకాపరిని దేవుని యొక్క మనిషిగా విశ్వసించాలి. నీవు దానిని నమ్ముచున్నావా? నీవు ఆయనయందు విశ్వాసముంచవలెను. నీవు గనుక ఆ విదముగా చేయనట్లైతే, నీ కొరకు ఆయన ఎన్నటికి మంచి చేయలేడు. నీవు జబ్బున
పడినట్లయితే, ఆయన కొరకు కబురు పంపండి. మరి ఆయనను వచ్చి నూనెతో నిన్ను అభిషేకించనీయండి, మరియు మీ కొరకు ప్రార్ధన చేయనీయండి. విశ్వాసముతో కూడిన ప్రార్ధన రోగిని రక్షిస్తుందని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు. అది సత్యము. ఆయన దేవుని యొక్క మనిషైయున్నాడు, దేవుడు ఆయనను ఘనపరచును. అది నిజమైయున్నది.
కొన్నిసార్లు మీరు సంప్రదించిన వెంటనే ఆయన రాలేక పోవచ్చు. కాని గుర్తుంచుకొనుడి, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకొరకే జరుగును.
58. ఇప్పుడు. కొన్ని రోజుల తరువాత, లాజరు ఇంకా అస్వస్ధతకు గురౌతూనే ఉన్నాడు. అతను రక్తస్రావముతో మరణించాడని, కొందరు చరిత్రకారులు చెప్పుదురు. నాకు తెలియదు. కాని ఏదేమైన, అతడు జబ్బున పడి చనిపోయెను. మరియు వారు అతనిని తీసుకువెళ్ళి పూడ్చి పెట్టారు. ఒక రోజు గడచింది. ఎంత చీకటి ఘడియ. మై, మై, ఓ, కుటుంభ పోషకుడు చనిపోయాడు; ఇంకా ఇద్దురు యవ్వన స్త్రీలు మిగిలియున్నారు.
రెండవ రోజు గడచిపోయింది. ఓ, ఎంత చీకటి. వారు ఎంతగానే ఆశపెట్టుకొని యున్న మనిషి, అతను… వారియొక్క ప్రియమైనవాడు మరియు ఆయన కొరకు వారి యొక్క సంఘమును మరియు సమస్తమును విడచిపెట్టారు — ఆయన వారిని నిరాశపరిచాడు. మరియు వారి యొక్క సహోదరుడు చనిపోయాడు. ఈ కార్యములు చూచుటకు అంధకారముగా లేవా?
మీరు ప్రార్ధన చేయబడవచ్చును, ఇక్కడకు వచ్చి దేవుని యొక్క శక్తి మరియు అద్భుతాలను చూడవచ్చును, మరియు వెనకకు వెళ్లి, మొదటి విషయము మీకు తెలుసా, మంచిది అప్పుడు, తరువాత రోజు బాగాలేనట్టుగా అనిపించవచ్చు. తరువాత రోజు జబ్బు పడవచ్చు. తరువాత రోజు ఎదో ఒక విషయం జరుగవచ్చును.
మంచిది, మీకు తెలియదా, యేసు ఒక మూర్ఛరోగియైన బాలుని కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన యొద్దకు అతడు వచ్చినప్పుడు, అతను ఇంతకు ముందెన్నెడూ లేని కష్టతరముగా ఉండెను? నీ విశ్వాసమనేది లక్షణాలలో ఉండదు; అది దేవునిలో ఉంటుంది, దేవుని నమ్ముట. నా భావము ఏమిటో గమనించారా?
59. మీ సంఘకాపరి నీ కొరకు ప్రార్ధించినప్పుడు, “మంచిది, అతడు దేవుని మనిషి అయి యుండకపోవచ్చు, లేదా దేవుడు అతని ప్రార్ధనలను వినకపోవచ్చును.” నీ విశ్వాసము సంగతేమిటి? నీ విశ్వాసమే దేవుని తాకును, పూర్తిగా తన ప్రార్ధన వలన కాదు. నీవు దేవుని వాక్యమునుకు విధేయతను చూపుచున్నావు. మరియు నీవు దేవుని వాక్యమునకు విధేయతను చూపినట్లయితే. నీవు ఆయన యందు విశ్వాసి౦చినట్లయితే, దేవుడే నీకు సమాధానమిచ్చుటకు బద్దుడైయున్నాడు. అది మీపైనే యుంటుంది. వేరోక మనిషిని మీరు నిందించకండి. మంచిది. దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రతిదానిని చూపును, కాని ప్రజలు వాటిని చూచి అవి ఏమిటని గ్రహించలేరు.
60. ఈ మధ్యనే, ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, “సహోదరుడా బ్రెన్హాం, నేను ఫ్రీమాన్ దగ్గరకు వెళ్ళాను, రాబర్ట్స్ దగ్గరకు వెళ్ళాను, ఓగిల్వియె దగ్గరకు వెళ్ళాను, నేను అందరి దగ్గరకు వెళ్ళాను. వారు నాకు ఏ మంచి చేయలేకపోయారు. నేను నీ దగ్గరికి వచ్చాను” అని చెప్పాడు.
“నీవు ఎప్పుడును ఉన్న విధముగానే ఇప్పుడునూ చెడ్డ స్తితిలో ఉన్నావు. నీవు తప్పుడు వ్యక్తి యొద్దకు వెళ్లావు. క్రీస్తు యొద్దకు వెళ్ళుము,” అని నేను చెప్పాను. ఆమెన్.
మనుష్యుల చుట్టూ తిరుగుట దేనికి? మనుష్యుడు నీ కొరకు ఏమీ చేయలేడు. అతడు వాక్యమును బోధించగలడు; దేవుడు తనకిచ్చిన సూచక క్రియలను అతడు చూపును. కాని అతడు నిన్ను స్వస్ధపరచలేడు; దేవుడు నిన్ను స్వస్థపరచవలసియున్నది. అది సరియే. అదే నిజమని నీవు నమ్ముచున్నావా? స్నేహితులారా, ఇది సత్యము. అది సరియే.
మంచిది, మీ సంఘకాపరి అదే చేయగలడు, లేక సంఘ పెద్ద, లేక ఎవరైనా అదే చేయును. అది సరియే. అందరు చేయునట్లుగానే అతను కూడ చేయుటకు హక్కును కలిగియున్నాడు. నీవు కలిగియుండవలసినది కేవలము ఒక్కటే, అది దేవుని యందు విశ్వాసము౦చుట. అక్కడే నీవు యున్నావు.
61. ఇప్పుడు, త్వరగా గమనించండి. అప్పుడు నాలుగవ రోజు అయినది. మెదటిగా యేసు చెప్పెను, “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు.”
“అతడు నిద్రించినయెడల బాగుపడునని” వారు చెప్పిరి.
“నేను వెళ్ళి అతన్ని మేలు కొలుపుతాను.”
“అతడు నిద్రించినయెడల బాగుపడునని,” ఆయన చెప్పెను.
“అతడు చనిపోయెను, కాని నేను వెళ్ళి అతన్ని లేపెదనని” యేసు చెప్పెను. మంచిది. వారు ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు వారు పట్టణమునకు వచ్చుచుండగా. కొద్ది నిమిషాలలో నేను ముగిస్తాను. నా సమయం అయిపోవుచున్నది. నేను…. ఓ, మై, ఈ మధ్యహ్నం నేను మంచి అనుభూతి చెందుచున్నాను, స్పందించు విశ్వాసపు అనుభూతి చెందుచున్నాను. మీ యొక్క విశ్వాసము కదలుచుండగా, అక్కడే, అది నన్ను నింపుచున్నది,
62. నేను ఇప్పుడు చూచుచున్నాను, నిన్ను స్వస్ధత పరచుటకు దేవుని యొక్క వైఖరిని మీకు నేను చూపించగలిగినట్లైతే… నీవు గనుక దైవిక స్వస్థతను గురించి బోదింపబడినట్లైతే మరియు పరిశుద్ద సువార్తను పొందినప్పటి నుండి నువ్వు దైవిక స్వస్ధత జరిగించుచున్నట్లైతే, అప్పుడు సహోదరుడా మరియు సహోదరి, మరి అదే ఫలితము ఇప్పుడు కూడ ఈ మధ్యహ్నమందు స్వస్ధత ద్వారా వచ్చును, ఏందుకనగా ఇది పరిశుద్దాత్మ వలన జరిగినది. నీవు దీనిని నమ్ముచున్నావా? ఖచ్చితంగా. అయితే నేను పరిశుద్దాత్మ శక్తిని గుర్చి బోదించుటకు మొదలుపెట్టినప్పుడు, మరియు ఆయన దేవుని యొక్క వాక్యమును తీసుకొనుట ప్రారంభించి మరియు అక్కడ జనులలో పెట్టును, పరిశుద్దాత్మతో నింపబడిన ప్రతియొక్క బిడ్డ సమీపించి దానిని వెంటనే పట్టుకొందురు. మై, ఇప్పుడే వారు దానిని పట్టుకొందురు. వారు దానికై ఆకలిగోనియున్నారు, వారు దానిని విడువలేరు.
సహోదరుడా, నీ అతిక్రమములు కొరకు ఆయన గాయపడ్డాడని నీవు గ్రహించి ఆయన వైపు తిరిగినట్లైతే, మరియు ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్ధత పొందితివి, నీవు కూర్చున్న స్ధలమందే దేవుని యొక్క శక్తిని నీవు పొందుకొనగలవు. ఆమేన్. అది నిజము.
63. ఇక్కడ ఆయన పట్టణమునకు వచ్చెను. నాలుగు రోజులు…. అక్కడ మార్త మరియు మరియ కూర్చోనియున్నారు. చీకటి, మై, నిరీక్షణ అంతయు పొయినది. లాజరు సమాధిలో కుళ్ళిపోయెను. నీవు అనుకునే మటలు మాత్రమే అవి — మీరు అర్ధం చేసుకోనగలిగినది అంతా అదే. కేవలం అక్కడ పడియుండి, మరియు మీరు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, “కుళ్ళిపోవుచున్నది,” అయితే అతడు కుళ్ళిపోయెను. అది….
ఒక రాత్రి, నాకు ఎంతగానో జబ్బు చేసినది, నేను కక్కితిని. మరియు అందరు నవ్వుట ప్రారంభించారు. “మీకు వాంతులనైప్పుడు ఎలా ఉంటుందో నాకు కూడ అలాగే బాగలేనప్పుడు కక్కితిని, కాబట్టి ఎంటి తేడా,” అని నేను చెప్పాను. “ఇది అలాంటిదే” అని నేను చెప్పాను.
మీరు మీలాగే ఉండండి, లేని వాటినినన్ని౦టిని చేర్చకండి. ఈ రోజు ప్రజలతో వచ్చిన సమస్య కూడ అదే. వారు ఎక్కువగా బిగుతుగా ఉండుటకు ప్రయత్ని౦చుచున్నారు. అది సత్యము. ఆమేన్. అది నా భావము, మీరు అనుకోవడం లేదా? ఆమేన్. అది సత్యము అని నేను నమ్ముచున్నాను.
64. ప్రజలు చాలా విషయాలను గురించి…. సువార్త అనేది పూర్తిగా శిక్షణ పూర్వకముగా తయారైంది. వారు వారిని సభలలో, లేదా సమాధులలో, లేదా అది ఏదైనప్పుటికి…(అదంతా కూడ ఒక్కటే, రెండూ మృతమైన స్ధలాలు.)
మరియు అది నన్ను…. ఒక సభల బోధకుడు నాకు పెట్టెలో పొదిగిన కోడిని గురించి గుర్తుచేసినట్లుగా అనిపిస్తుంది. పెట్టలో పొదగబడిన ఒక చిన్న కోడిపిల్ల అప్పుడే నవ్వతూ, మరియు చిన్నగా అరుస్తూ, మరియు చిన్నగా అరుస్తుంది, మరియు అవి తల్లి లేకుండా పుడతాయి. మరియు ఆయన యాంత్రికంగా చేయుట ద్వారా దానికి తల్లి లేదు. అది యాంత్రికంగా తయారు చేయబడుతుంది. ఒక పొదగబడిన బోదకునివలె. అది సత్యము. మీరు అలాగే యుండుడి. నేను పాత-కాలపు, దేవునిచే రక్షించబడిన పరిశుద్దాత్మ ప్రజలను మరియు పరిశుద్దాత్మ కార్యములను నేను ప్రేమిస్తాను. సత్యము. ఇది స్పందిస్తుంది. అది నిజము.
65. త్వరగా గమనించండి, ఇప్పుడు ఆయన రాకను ఈ పట్టణములో మనము చూచినట్లైతే, మార్త అక్కడ కూర్చోనియుంది. ఆమె ఆ దినమందు చాలా నెమ్మదిగా ఉన్నట్లు ఉన్నది. అయితే ఇప్పుడు, ఒక్కసారిగా విశ్వాసం ఆమెను పట్టుకుంది. ఎవరో వచ్చి చెప్పెను, “బోధకుడు నగరంలోకి వస్తున్నాడు.”
ఓ, మై, నేను త్వరగా ఆమెను చూడగలను. ఆమె ఎప్పుడు చూడని చీకటి ఘడియ, ఆ చిన్న గృహము ఎన్నడూ చూడనటువంటి ఆ యొక్క విషాదమైన చీకటి గడియ అది. ఓ, వారి ప్రియమైనవాడు చనిపోయెను. నాలుగు దినములు గడిచిపోయాయి. వారు అతనిని సంఘములో నుండి బయటకు తీసుకొని వచ్చి ఆయనను వెంబడించునట్లుగా చేసినప్పుటి నుండి, బోధకుడిపైన వారి యొక్క విశ్వాసముంచారు.
66. యేసును వెంబడించినవారందరూ తిరిగి సంఘములో చేరుటకు వారు పిలువబడ్డారు. మీకు తెలుసా, అది నిజము. ఆయనను ఒక మూఢభక్తి గల వానిగా వారు ఎంచెను. చెప్పవలెననగా వారు ఒక మూఢభక్తి గల వానిగా ఎంచిరి. మరియు ఆయనను వెంబడించినవారిని కూడా సంఘములో నుండి బయటకు పంపబడిరి.
ఆయనను వెంబడించుటకు వారు సంఘమును మరియు సమస్తమును విడచిరి. మరియు ఇప్పుడు, వారియొక్క సహోదరుడు చనిపోయినప్పుడు ఆయన వారిని విడచి వెళ్ళిపోయెను.
వారిలో కొందరు చెప్పుట నేను వినగలుగుచున్నాను, “ఇప్పుడు, అతడిపై ఏమైనా ఉంటె, ఆయన స్నేహితుడిని ఎందుకు స్వస్థపరచలేదు.”
“ఆ, అక్కడే మీరున్నారు. చూచారా, అతడు దానిలో నుండి తప్పించుకొనుటకు వెళ్ళిపోయెను,” అని వారిలో కొందరు చెప్పుట వినగలుగుచున్నాను. గమనించారా?
67. మరియు అది, వారు ఎన్నడూ చూడని చీకటి ఘడియయై యున్నది. మరియు అప్పుడు యేసు వచ్చెను. ఓ, మై. చీకటి గడియలో, యేసు వచ్చెను. ఆయన ఎప్పుడును చీకటి ఘడియలోనే వచ్చును. అది నిజము.
ఓ, నాకు ఇంకా సమయం ఉన్నట్లైతే; నాలో ఏదో మండుచున్నట్లుగా అనుభూతిని చెందుచున్నాను. నాలో ఉన్నదానిని బయటకు చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. కాని నేను దానిని (సమయము) కలిగిలేను. నేను మరోక సమయంలో దానిని మాట్లాడెదను. చీకటి గడియ….
నేను గుర్తుంచుకోగలను నేను ఆలోచించినప్పుడు… [టేపు మీద ఖాళీ ఉన్నది.]…
1,606 total views, 1 views today