49-1225 యేసుక్రీస్తు యొక్క దైవత్వము

49-1225 యేసుక్రీస్తు యొక్క దైవత్వము
జఫర్సన్ విల్, ఇండియానా రాష్ట్రం, అమెరికా

1. ధన్యవాదములు బ్రదర్ గౌహం. ప్రతి ఒక్కరికి ఉదయకాల శుభములు మరియు క్రిస్మస్ శు భాకాంక్షలు. ప్రియమైన చిన్న గుంపులో వుండుటకు తిరిగి ఈ ఉదయకాలం ఇక్కడ టబర్నికల్లో పుండుట చాలా సంతోషంగా వుంది.
2. ఒక విషయాన్ని నేను హంతో కలసి అక్కడ మాట్లాడుచుంటిని. అతడు అడిగాడు “బ్రదర్ బిల్, ఈ ఉదయవేళ నీ హృదయంలో ఏదైనా ప్రేరణను పొందియుంటివా?”
3. ‘కేవలం క్రీస్తే’ వుండెనని నేనన్నాను. ఆమెన్. అవును అంతే. మనమెల్లప్పుడు దానిని కలిగియుండెదము. సర్వసాధారణంగా మనందరిలో ఆయనను ఎల్లప్పుడు కలిగి యుందుము.
4. డల్లాస్ నుండి వచ్చేసరికి రాత్రి చాలా ప్రొద్దుపోయిది, అక్కడ మాకు మహిమకరంగా జరిగిన కూటాలలో అవి ఒకటి. దేని నిమిత్తం మేము చాలా కాలం నుండి ప్రార్థించుచుంటిమో అది ఇప్పుడు జరుగుతుంది. సరిగ్గా ఇప్పుడే, అది అనగా దేశవ్యాప్త ఉజ్జీవము కార్యరూపము దాల్చుచుచున్నది. నిన్న సేవకులందరు.. లేదా కొద్ది దినాలనుండి, అన్ని రకాల మరియు ప్రముఖ సేవకుడు లేదా కూటాలు, ఈ కూటముల నిమిత్తం మేము ఒకటిగా కూడితిమి. మరి అక్కడ పదిహేను, పద్దెనిమిది మంది సేవకులు కూడుకొనిరి. వారిలో కొందరు మూడు నుండి పదిహేను వేలమంది, బహుశా ఇరవై వేలమంది జనులు కలిగిన వారున్నారు. ఉదాహరణకు రేమెండ్ టి.రిచీ, బాస్వర్డ్ మరియు ఓరల్ రాబర్ట్స్ మరలాగే జాక్సన్ ఇంకొందరు పాల్గొనిరి.
5. బ్రదర్ జాక్సన్ జరిపిన ఒకరాత్రి కూటములో ఒకేసారి ఐదువందల మంది పరిశుద్దాత్మను పొందుకొన్నారు. అదెంతో అద్భుతం.
6. మరి నిన్న మేమంతా సంవత్సరానికి సరిపడే ఒప్పందములను గూర్చి మాట్లాడుకొనుటకు కూడుకొన్నాము, తద్వారా లోకము ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి ఒక కార్యమును, ఒక కదలికను జరిగించుటకు దేవుడిక్కడ వున్నాడని మేమంతా నమ్ముచుంటిమి. ఏదో ఒక అద్భుతమైన దానిలోనికి మనమిప్పుడే ప్రవేశించామని స్నేహితులారా నేను నమ్ముచున్నాను. మరీ ఈ సేవకులు, ప్రభువు అనుమతిస్తే రాబోయే ఈ వేసవి కాలమందు ప్రతిరాత్రి ఎక్కడో ఒకచోట కూటములను ఏర్పరచుదురు. బహుశావారు పదిహేను లేకపదహారు మంది కావచ్చును. వారు అమెరికా అంతటా ఒకేసారి ఎనిమిది లేక పదివేలమంది జనం పట్టే పెద్ద గుడారములను వేసి కూటాలు జరుపుదురు.
7. ఓ, మనం ఉజ్జీవమును పొందుకోవల్సి వుంది. అది ఇప్పటికి వచ్చియున్నది. వందలాది మంది జనులు పరిశుద్దాత్మను పొందుచూ, ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వచ్చి చేరుచున్నారు. అదేదో ముందు భవిష్యత్తులో జరుగనైయున్నదని చూడాల్సిన పన్లేదండీ, ఆదీ ఇది వరకే వచ్చియున్నది. దేవుడు ఇప్పుడే దానిని చేయుచున్నాడు.
8. (బ్రదర్ గౌహం స్నేల్లింగ్ మైక్రోఫోను గురించి బ్రదర్బైన్హామ్లో మాట్లాడుచున్నాడు -సంపా) అవునయ్యా.. అవును బ్రదర్ గౌహం. నేనెల్లప్పుడూ కోరుకొనే విషయం అదే.. మంచిది. సరీ బ్రదర్ గౌహం నేను కలిసి చాలా చక్కగా పని చేయుచున్నామని మీకు తెలుసా? అతడేమో పొడవరి నేనేమో పొట్టివాడిని. కనుక నేను… (“అతడు తక్కువ రకపు ఫలమును కోయుదును నేను ఎక్కువ రకపు ఫలమును కోయుదును”అని బ్రదర్ స్నెల్లింగ్ అనిన దానికి బ్రదర్బ్రెన్హామ్ మరియు సమాజము నవ్వుచున్నది- సంపా) కొన్నిసార్లు కొన్నింటిని క్రిందికి రాల్చుటకు అతడు నాకు అవసరమై యుండెను.(టేపు మీద ఖాళీ) బ్రదర్గెహం నీకు వందనాలు. ఆ అగ్నిని నేనింకా కనిపెట్టలేదు. అది బలిపీఠము మీద ఉండాలని మేము కోరుచున్నాము, మనం కోరట్లేదా? ఆమెన్, ఎందుకు నీవు…
9. ఒకరాత్రి మేమచ్చట వున్నాం, వేలాదిమంది వచ్చారు. వారంతా తమచేతులతో చప్పట్లు కొట్టుచూ దేవుని స్తుతించుచున్నారు. అక్కడ మేమొక అద్భుతమైన సమయాన్ని కలిగియున్నాం, సరిగ్గా అప్పుడే బలిపీఠము మీద అగ్నిని మేము కలిగియుంటిమి.
10. ఉజ్జీవం కొరకు రాబోయే ఈ వేసవికాలపు కార్యక్రమములను ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు నేను…
11. రాబోయే ఎనిమిది పది దినముల పాటు నేను ఇక్కడ సంఘములో, మీ అందరితో, బ్రదర్ గ్రహంతో కలిసి ఉందునని నాకు తెలిసినంత వరకు నేననుకొనుచున్నాను, శక్యమైతే ప్రతీ కూటములోను నేనుండ గోరుచున్నాను. పిమ్మట నేను…
12. అటు తర్వాత మేము టెక్సాస్ రాష్ట్రం హూస్టన్లో వున్న కొలీజియం వద్ద ఉండెదము. అక్కడ పదిహేడు వేలమంది జనులు కూర్చొనే సామర్థ్యం గల చక్కనిభవనం వున్నది, అక్కడొక గొప్ప సమయంను కలిగి ఉండుటకు మేము ఎదురుచూస్తున్నాం.
13. ప్రయత్నించాము… మేమంతా ఒక ప్రార్థనావరుసను కలిగియుండునట్లు ప్రయత్నించాము; ఒకసేవకుడు ఒకచోట, మరో సేవకుడు మరోచోట, మరొకరు ప్రార్థనావరుసలో వుండునట్లు చేసాము. కానీ అది అలా పనిచేయలేదు, బ్రదర్ జాగర్స్ ఆలా ముందుకు వెళ్ళవల్సింది.
14. మరియు చెప్పాలి, ఒక ప్రకటనను నేను చేయగోరుచున్నాను. కాల్దరిలో మేము చేసినట్లు బ్రదర్ జాగర్స్ నిలబడి అలాంటి బాధ్యతను తీసికొన్నాడు. అతడు… మీషనెరీ బాప్టిస్టు సంఘాలు మరియు ఫ్రీవిల్ బాప్టిస్టులు, మరియు అందరు (టెక్సాస్ నిండా బాప్టిస్టులేనని మీకు తెలుసా), వారు అతని కోసం నిలువబడిరి, అయితే సనాతన బాప్టిస్టులు మాత్రం కార్యక్రమానికి విరోధముగా లేచి నిలబడ్డారు. మరి, ఓ, వారు పేపర్లో అతడికి వ్యతిరేకంగా ఎలాబడితే అలా వ్రాయనుద్దేశించారు. ఇంకా ఏదేదో చేసారు. మంచిది. వారు కొన్ని బైబిల్ ప్రశ్నలను అతడికి పేపరు ద్వారా సంధించారు. వాటికి అతడు బదులిచ్చాడు… వారికి వారి సొంత బుజువు దొరికిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు నిల్చున్నారు, ఎందుకు, వాటిని పేపర్లో వేయనివ్వలేదు. కనుక బ్రదర్జాగర్స్తో కలిసి అక్కడొక కూటము జరిపించాము, ఆ సిటిలో డెబైదుశాతం మంది సేవకులు మాతో సహకరించుటకు ముందుకివచ్చారు. దాని యొక్క జిరాక్స్ ని మేము తీసికొని ఇలా అన్నాం “వాక్ స్వాతంత్ర్యమంటే ఇదేనా? పత్రికా స్వేచ్చ అంటే ఇదేనా?” ఆ విధంగా దానిని పంచాము. అప్పుడు ఆ పేపరు వాళ్ళు మరుసటి రోజుకల్లా పదివేల సభ్యత్వాలను కోల్పోయారు (పోగొట్టుకొన్నారు).
15. వారు వచ్చి ఏడ్చుకొంటూవచ్చి, తమ మోకాళ్ళ మీద పడి ఇలా ప్రాధేయపడ్డారు “ఉచితంగానే * మేము మీ ప్రకటనలను ప్రచురిస్తాం, మీరు ఒక్క పైసా కూడా కట్టనక్కర్లేదు”
16. ఓ, సహోదరుడా, సంఘమా వినండి, ఒకప్పుడు మేము రైలుట్రాక్ ప్రక్కన నివశించేవారము ఆ తరువాతనుండి అచ్చట లేము. ఇప్పుడు హల్లెలూయా అవెన్యూలో నివశిస్తున్నాము. అవునయ్యా. మేము లక్షలశ్రేణిలోకి వెళ్ళితిమి. అలా వుంటిమి, అయితే ఒకప్పుడు కేవలం వందలసంఖ్యలో వుంటిమి, ఇప్పుడైతే లక్షల లక్షల్లోకి వెళ్ళితిమీ. అందరిని కలిసితిమీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంఖ్యపరంగా చాలా బలమైన సంఘము మేమేనని, బహుశా విశ్వవ్యాప్తంగా కూడా ఆ విధంగా వుంటిమని నేను భావించుచున్నాను. గడిచిన సంవత్సరంలోనే మా ద్వారా పది హేను లక్షల మంది మార్చబడిరి. దానిగూర్చి ఆలోచించండి సంపూర్ణసువార్త జనులుగా పది హేనులక్షలమందిని సర్వసాధారణంగా గత సంవత్సరం పట్టుకొంటిమి. ఓ మేము ఇప్పుడు పైపైకి ఎగబాగుచుంటిమి.
17. మరియు ఈ చిన్న కాగితము మరియు జరిగిన కార్యములు. వారు క్యాథలిక్జనులను గూర్చి మాట్లాడుట లేదు, క్యాథలిక్కులంటే వారికి భయం, చూశారా, దానిని చేయుటకు వారు భయపడుదురు, కానీ మనం ఇప్పుడు దాని మీద లెక్కించుచున్నాం. మనము కొన్ని హక్కులను పొందుకొన్నాం. కావున దేవుని వలన మనకీయబడిన హక్కులను ప్రస్తావించెదం. అది నిజం, ఈ సంవత్సరం దేవుడే మన సహయంగాను, మన దుర్గముగాను వుండి ముందుకి సాగిపోదా.. ఒక ఉజ్జీవంను కలిగియుండుటకు శాయశక్తులా ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను….
18. (బ్రదర్ టైన్హామ్లో ఎవరో మాట్లాడుతున్నారు -సంపా) ఓ, ఇక్కడేనా? ఎప్పుడు ఆపాలో నీవు నాకు చెప్పవలెను, అక్కడా, సరిగ్గా అక్కడేనా. సరే, నేను ఇలా పైకి నడుస్తూ వెనక్కి చూచెదను.
19. మరి, చాలా బాగుంది. క్రిస్మస్ కొరకు ఎంతమంది సంతోషంగా వుందని భావించుచున్నారు? “ఆమేన్”చెప్పండి (సమాజము ఆమేన్ చెప్పుచున్నది -సంపా) ఓ మై మై చూడండి! ఇది ఆనందించే సమయం, మనమందరం కలిసివచ్చి క్రీస్తుని ఆరాధించే సమయమది.
20. మరి నా -నాయొద్ద లేదు, ఒక వర్తమానమును లేదా ఒక సంగతీలాంటి దానిని నేను నాయొద్ద కలిగిలేను. అక్కడ వుండి ఆయన మాట్లాడుయుండిన సంఘటనను నేను బైబిల్ తెరచినప్పుడు నాకు కనబడింది. నేను ఇక్కడికి తిరిగివచ్చి, అన్నాను “క్రీస్తు యొక్క పుట్టుక ఎక్కడ?” ఇంచు మించు ప్రతిఒక్కరు ఇప్పుడు దానినే మాట్లాడుచున్నారు, మరి నేను కొద్దిసేపు చదివి, కొంత కనుగొనాలి, ప్రభువుఆత్మ ఏదో తీసికొని నాకు చెప్పు వరకు నేనలా వేచి యుండెదను.
21. ఇప్పుడు, లూకా మొదటిఅధ్యాయంలో ఆరంభింతుము. అది క్రీస్తు పుట్టుకతో ఆరంభమగును. సాధ్యమైతే మనమిక్కడ కొంతపఠించి,వాక్యంమీద కొంత బోధించుకొందుము. మన కొరకు ప్రభువు ఏం చేస్తాడో మనమెరుగము, కానీ ఆయనమనకి గొప్పదీవెనఇచ్చునని మాత్రం నమ్ముచున్నాం.
22. మీ ప్రచారాలను నేను విన్నాను, అవి చాలా బాగున్నాయి. వాక్యాన్ని ప్రకటించడాన్ని అలా నీరంతరం కొనసాగించండి.
23. అక్కడున్నప్పుడు నేను బ్రదర్ గౌహంతో చెప్పుచుంటిని, “క్రైస్తవులు ఒకరికొకరు అవసరమయ్యే సమయం ఏదైనా వున్నదంటే అది ఖచ్చితంగా ఇదే అయున్నది, అది ఇప్పుడే” నీవు ఏది చేసినా, ప్రతి దానిని ప్రక్కన బెట్టుము, ఎందుకనగా దేవునికృపను బట్టి నేను నమ్మేది ఏమనగా…దానిగూర్చి కొద్దిసేపు నేను మాట్లాడుదును – ఏలాగు మనమిప్పుడు ఒకరికొకరం అవసరమై యున్నామో నేను చెప్పగోరుచున్నాను.
24. గొప్ప… మనం ఎదుర్కొనుచున్నామని నేను నమ్ముచున్నాను… నేను చెప్పే దానిని మీరు వినుచున్నారా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది -సంపా) మంచిది. మనము ఎదుర్కొను చున్నాము, ఇప్పుడు మానవ చరిత్రలో ఎన్నడూ జరుగని ఒక గొప్ప నాటకంవైపు ఇప్పుడు చూస్తున్నాం, అదిప్పుడు మన ముందు జరుగుచుండెను. లోకమనే గొప్ప పొలములో దేవుడు ఇప్పుడు నటించ బోవుచున్న నాటకం ఇది. అదొక ఉలిక్కిపాటు, లోకాన్ని చుట్టూ చూచుటకు మరియు సంగతి ఎలాగు కలిసి కదులుతున్నదో చూచుటకు ఓ, ఏదో జరుగుటకు నిర్ణయించబడింది. మనం మాట్లాడేది, చెప్పేది ఇప్పుడిక్కడ వున్నది. చూశారా? ఇది ఇదివరకే ఆరంభమైంది, దృష్యరూపం దాల్చింది.
25. ఈ ఉదయం నేను గొప్పచిత్రమును మీ ముందు ఉంచగోరుచున్నాను. పొలములో పుండి ఒక గొర్రెపిల్ల మేత మేయుచుండటను నేను చూస్తున్నాను. ఆ చిన్నపిల్ల ఎంతో భయకంపితురాలై.. అది తిరుగుచున్నది. దాని వెనుకనే రెల్లు(వెదురు)లో ఒక సింహం మెల్లగా దానివైపే వస్తుండటాన్ని నేను చూస్తున్నాను. చూశారా? అది తనతోకను నేలమీద కొట్టుకొనుచూ, కాళ్ళతో ఎగిరి దుముకుటకు సిద్దపడుచున్నది.
26. పొలములో వున్న గొర్రెపిల్లవలె సంఘము కూడా వున్నది. కమ్యూనిజం యొక్క చీకటి ఛాయలు లోకమంతా అలుముకొనుచూ, నీడవలే ముగింపునకు వచ్చుచున్నది.
27. ఇది వైపరీత్యపు నీయమం (చట్టం). ప్రొద్దుపొడవక ముందు తీసికొనుట, పగలు వచ్చుటకు ముందు ఎల్లప్పుడు చీకటివుండును. చీకటిని పగలు పారద్రోలుతుంది. అది ప్రకృతి నియమము, చూశారా, ప్రొద్దుపొడిచీ పగలు కాంతి వచ్చుటకు ముందు చీకటి వుండును.
28. సరిగ్గా మనం ఇప్పుడు అలాగే వున్నాం. ప్రొద్దుపొడుచుటకు ముందువున్న చీకటి వుంది. ఆ గొప్ప చీకటఛాయలు ఇప్పుడు పాపపురుషున్ని నెరవేర్చుటకు అలుముకొంటున్నవి. మీరు గమనించారా, సరిగ్గా ఈ క్రిస్మస్ కాలమందే, కమ్యునిష్టు దేశాలన్ని పశువుల తొట్టిలో వున్న క్రీస్తుని ప్రకటించటానికి బదులు, వారు స్టాలిన్ పుస్తకాలను, వాటిమీద స్టాలిన్ బొమ్మలను వేసి పంచుతున్నవి, దేవునికంటే తన్నుతాను హెచ్చించుకొన్న వ్యక్తి అతడు, లోకాన్ని తనవంతుగా గొప్ప ఉరిలోకి తీసికెళ్తున్న వ్యక్తి అతడు. మరియు మరో సంగతి ఏమనగా ఇవన్ని జరుగుచుండుటకు కారణం లేఖనముల నెరవేర్పుకోసమే.
29. అలాగే ఇంకోసంగతిని అనగా మరో నెరవేర్పును గమనించాలని కోరుచున్నాను. నామకార్థ క్రైస్తవ సంఘాలలో వున్న ఈ నామకార్థజనులు దేవుడు పంపిన కదలికకు విరోధముగా లేచుచున్నారు. బైబిల్ ఇలా సెలవిస్తుంది,” వారు పైకి భక్తికలిగియుండి, దాని శక్తిని ఆశ్రయించని వారివలే వుండెదరు, అలాంటి వారికి విముఖుడవై యుండుము” వారు తమ పాత్రను తాము నెరవేరుస్తున్నారు.
30. కమ్మునిజం తన పాత్రను అది నెరవేరుస్తుంది.
31. దేవునికే స్తోత్రం, పరిశుద్దాత్మ కూడా తనపాత్రను నెరవేరుస్తుండెను. అవును “శత్రువు వరద ప్రవాహాంవలె వచ్చినా, నేనొక దుర్గమును దానికి విరోధంగా నిలబెడతాను” అది నిజం. సంఘము, పరిశుద్దాత్మతో నిండిన సంఘము తన పాత్రను పోషిస్తున్నది.
32. స్నేహితులారా ఇప్పుడు నా కుతూహలమంతయు ఆదే, అందుకే నేనిక్కడ వుంటిని బయటకి వెళ్ళునప్పుడు రోగుల నిమిత్తం నేను ప్రార్థించెదను. అయితే ఇక్కడైతే ఏదో రకంగా నేనొకదానియందే ఆసక్తి కలిగియున్నాను, తిరిగిజన్మించిన సంఘమును గూర్చే నా ఆసక్తి. విధుల(నియమాలు)ను గూర్చిగానీ, మరి సంఘ పెద్దలను గూర్చిగానీ నాకు ఆసక్తి లేదు. నేడు మనం జీవిస్తున సంఘము మీదకి పరిశుద్దాత్మ బాప్తిస్మం వచ్చి నిలబడాలనే దాని మీదనే నేను ఆసక్తిని కలిగియున్నాను. అదే ప్రధానమైన భాగం. దానినే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసికొందాం.
33. పరలోకపు తండ్రీ, మా మధ్యలోకి ఈ ఉదయం దిగిరమ్ము, ప్రభువా, దానిని అనుగ్రహించుము, దేవునిఆత్మ కూటమును తన ఆధీనంలోకి తీసికొనును గాక. ప్రభువా, ఇక్కడ జరుగుచున్న పనిని దీవించుము. మా సహోదరుడు బ్రదర్ గౌహంను దీవించుము. దేవా, ఈ రాత్రి అతడికి జ్ఞానం గల మాటలను అందించుము, అతడు రేడియో ప్రసారాలు చేస్తుండగా, దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా అతడు జనులను కదిలించునట్లు అతడికి సామర్థ్యమును దయచేయుము. దానిని అనుగ్రహించండి ప్రభువా. పాపులు ఏడ్చుచూ, వారున్న గదిలోనే మోకరించుచూ తమ హృదయాలను క్రీస్తుకి సమర్పించుకొందురు గాక. ఈ ఉదయకాలం ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులు పున్నట్లైతే, లేదా క్రీస్తుని ఇంకా అంగీకరించని వారు వున్నట్లైతే, వారు కూడా వచ్చుదురు గాక.
34. ప్రభువా, ఈ ఉదయకాలం జనుల హృదయాలలో ఒక ఉజ్జీవాన్ని ఆరంభించుము, అది వారికొక నూతన పర్చబడే సమయముగా ఉండును గాక, ఆత్మ వారిని నూతనపరిచే సమయముగా ఉండును గాక. మరియు ఓ తండ్రి, ఈ విధంగా మేము ప్రార్థించుచుంటిమీ. నీవు వచ్చి మమ్మును చేజిక్కించుకొని, ఇక్కడున్న ఈ గీతలో మాతోకలసి నడువుము. ఇక్కడ క్రమంలో పెట్టబడిన ఈ గొప్పచిత్రమును మాకు చూపండి. ఈ ఉదయకాలం పరిశుద్దుల హృదయాలకి నీ మర్మములను బయలుపర్చండి, తద్వారా మా ముందు వున్నదేదో మేము ఇక్కడ చూచెదము. మరప్పుడు ప్రభువా, మేము సర్వాంగకవచములో నడచిపోవునప్పుడు ధీరత్వముగల సైనీకునీవలె శత్రువును ఎదుర్కొందుము గాక. వాడి కుయుక్తులనేవి తెలియకుండా మేమెలా వాడిని ఎదుర్కోగలము? మరి ఈ ఉదయకాలం అర్థం చేసికొనుటకు సహాయం చేయుము, మరలాగే మాకు కనపరుచుము… వాడిని కలుసుకొనే చోటును కనపర్చుము, అప్పుడు మేము వాడిని ఎక్కడ కలుసుకొనవలెనో తెలిసికొందుము. వీటన్నింటిని యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
35. రెండవ అధ్యాయమును మనం చదువుదాం. లూకా 2:1-7. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను; ఇది కురేనియ సీరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోన గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లహేమనబడిన దావీదు ఊరికివెళ్ళేను. వారక్కడ వున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, పత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెటెను.
36. ఇప్పుడు నేను దీని నేపద్యముగా…ఈ ఉదయకాలం నేను దానిని వాడుకొనునట్లు దానిలో ఒక భాగమును మనం పట్టుకొనే వరకు దాని నేపద్యమును చూద్దాం. మరియు మీ అందరు ప్రభువు ఆత్మకి మిమ్మును మీరు అప్పగించుకోండి.
37. నేడు లోకమంతటిలో మనం యేసుపుట్టుకను ఉత్సవంగా జరుపుకొనుచుంటిమి, అది ఒక ఆచారంగా మారిపోయింది. యేసు నిజానికి డిసెంబర్ 5నాడు లేదా అటువంటి ఒక తేదిన జన్మించలేదు. లేదా డిసెంబర్ 25న జన్మించలేదు. అది అసాధ్యమని మనకి తెలుసు. ఎందుకనగా ఆ కాలమందు (డిసెంబర్ నెలలో-అను) యూదయకొండల మొత్తం మంచులోకప్పబడి వుండును. కావున అదెలా సాధ్యం? జోతిష్యశాస్త్రం ప్రకారం లేక అటువంటి దాని ప్రకారం, సాధారణంగా యేసు ఏప్రిల్ మొదటివారంలో జన్మించి యుండెను. ఆది వసంతకాలం, సరే నేటి ఈ దినమనేది ఆరాధించుటకు ప్రత్యేకించబడుటకు సరేయే, ఈ లోకానికి ఆయన వచ్చిన దానిని పురస్కరించు కొని గుర్తుచేసికొనుటకు.
38. ఈ లోకానికి దేవుడెన్నడు ఇవ్వని అతి గొప్ప బహుమానం యేసుక్రీస్తు, అది మనకి తెలుసు. ఆయనెవరై యుండినో అనే ఆయనయొక్కదైవత్వమును గూర్చి నేను మాట్లాడాలనుకొంటున్నాను. చాలామంది ఆయనను ఇంకా పశువులతొట్టెలో పడుకొన్నవానిగానే చూస్తున్నారు. కానీ అది లేఖనాలలో ఒకభాగం మాత్రమేనండీ, నాటకంలో కేవలం అదొక భాగం మాత్రమేనండీ, నిజంగా ఆయన ఎవరు అనేది, ఆయన దైవత్వమనేది తెలుపుటలో ఆయనయొక్క పుట్టుక కేవలం నాటకంలో అదొక భాగమే సుమా.
39. తన రాకను గూర్చి ఆయన ముందుగానే లేఖనాలలో చెప్పియుండెను. యోహాను దినముల నుండే ఆయన చెప్పుకొంటు వచ్చెను. ఆదికాండము మొదలుకొనే చెప్పుకొంటు వచ్చాడు, అక్కడ ఇలా చెప్పబడింది, అదేదనగా “స్త్రీ సంతానము సర్పముయొక్క తలను చిదక తొక్కును” క్రీస్తుయేసు అను ఈబిడ్డను గూర్చి వాగ్దానము చేయబడెను. ప్రవక్తలందరు ఆయన గూర్చి చెప్పారు. బైబిల్ నందున్న ప్రతి ప్రవక్తయు ఈ లోకమునకు ఆయనయొక్క మొదటిరాకడను అలాగే రెండవరాకడను వస్తుందని చెప్పుకొంటూ వచ్చారు.
40. మూడుసార్లుగా యేసురాకడ పుండెను. తన సంఘమును విమోచించుటకై ఆయన మొదటి రాకడవుండెను. తన సంఘమును చేర్చుకొనుటకు ఆయన రెండవసారి వచ్చును, మూడవసారి ఆయన తన సంఘములో వచ్చును. బైబిల్లో వున్న ప్రతీది త్రిత్వమందు సాగుచుండెను. మూడులో సాగును, కానీ అంతయూ క్రీస్తులోనే సాగెను. గుర్తుంచుకోండి, మొదటిసారి తన సంఘమును విమోచించుటకు ఆయన వచ్చెను. రెండవసారి తన సంఘాన్ని చేర్చుకొనుటకు, మూడవసారి తన సంఘములో అనగా రాజురాణీ వలే వచ్చును.
41. ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే ఆయన యొక్క మొదటి రాకడను గూర్చి కొద్దిగా మాట్లాడుకొందాం ఆయన ఇక్కడ నూనవరూపము దాల్చిన సంగతిని, అటుతరువాత ఆయన రెండవరాకడను గూర్చి కొంత సేపు, అటు తరువాత ఆయనయొక్క మూడవసారి రాకడనుగూర్చి మాట్లాడుకొందాం.
42. మరి ఆ దినాలలో సంఘానికి వ్యతిరేకంగా గొప్ప హింస కలుగుచుండెను. కైసరు ఓ గొప్ప పన్నాగం పన్నెను, అదేదనగా సర్వలోక జనులు పన్ను చెల్లించాలనేది. కేవలం ఒకే ఒక ఉద్దేశ్యము కొరకు అది జరిగెను. అదేమనగా దేవుని యొక్క గొప్ప ప్రవచనం నెరవేరుటకే.
43. గూడార్థమైనది, లేక కొంచం మూడత్వం(అర్ధంకానిది)మైనది బైబిల్లో నీకు కనబడినప్పుడు నీవు చేయవల్సిందల్లా ఒక్కటే, అదేమనగా దానిని అయన నీకు చెప్పుటకు దేవునికి కొంతసమయాన్ని కేటాయించుము. దేవుడే మాత్రం తొందర పెట్టడు, కానీ మనమే బహుగా తొందరపడతాం. దేవునికి కొద్ది సమయము కేటాయించాము, అప్పుడు నీవు ఆ పాత ప్రవచనాత్మక చక్రాలుపట్ల మొదలగునవి చిత్రములో చక్కగా వెళ్ళుచున్నట్లు నీవు చూడగలవు. అది పూర్తి చిత్రమును గీసి నీకు చూపించును.
44. మొన్న ఎవరో ఇలా అన్నట్టున్నారు “దేవుడు, ఆయన ఎలా వుంటాడు?” ఆయన ఇదివరకు పూర్వం, కోటానుకోట్ల సంవత్సరాలకు మునుపు, ఏమీలేనప్పుడు…ఈ శూన్యం (విశాలం) ఇక్కడు న్నట్టు ఆయన అప్పుడు లోగోస్(వాక్యము)లో తన్నుతాను సమకూర్చుకొనెను. అప్పుడు ఆయన అక్కడనుండి క్రీస్తులోనికి వచ్చెను. చూశారా, అది అలా దేవుడు ఈ భూమ్మీదికి వచ్చినట్టు వున్నది, అటు తిరిగి దేవునిలోనికి వెళ్ళినట్టుంది. నా బావాన్ని మీరు పట్టుకొన్నారా? అది అలా చుట్టు తిరుగుచున్నట్టు అన్నమాట. ఆకాశవిశాలములోనుండి, నిత్యత్వములోనుండి అలా దొర్లు కొంటూ లోగోస్(వాక్యము)లోకి వచ్చి, మరచ్చట నుండి ఒక మనిషిలోకి మరచ్చట నుండి తిరిగి దేవునీలోకి వెళ్ళుట. దీనంనతటికి గల ఏకైక కారణం పడిపోయిన మనిషిని తిరిగి విమోచించుటకే.
45. ఇప్పుడు ఒక విమోచకునిగా వుండుటకే ఆయన వచ్చెను. దేవుడు ఒక విమోచకునిగా రాక మునుపు చట్టప్రకారం ఆయనొక రక్తసంబంధియగు విమోచకునిగా ఉండి తీరవలెను. మనకి ఆయన బంధువునిగా ఉండవలెను.
46. ఆదియందు దేవుడు తనయొక్క మొదటి నరుని సృజించెను, అతడిని ఒక ఆత్మగా సృజించెను. ఆత్మ అనేది మనిషిలో అదృశ్యముగా వుండే ఒక బాగము. దానిని నీవు చూడలేవు. ఇప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నేను చెప్పేది వింటున్నారా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది-సంపా) మంచిది. దేవుడు తన సొంత స్వరూపమందు నరుని సృజించెను. “దేవుడు ఒక ఆత్మ” అని బైబిల్ చెప్పుచున్నది. నేడు సంఘము మీద పరిశుద్దాత్మ ఏలాగు పెత్తనం(ఏలుబడి) చేయుచుండెనో మరి ఆలాగే ఆనాడు నరుడు కూడ ఈ సృష్టి అంతటిమీద పెత్తనం(ఏలుబడి) చేయుచుండెను. సృష్టిని దేవుడు నడుపుచుండెను. జంతువులను అతడు నడిపించుచుండెను.
47. కానీ భూమిని సేద్యపర్చుటకు ఏ మనిషి అక్కడ లేకుండెను, గనుక నేలమట్టిలోనుండిదేవుడు మనిషిని నిర్మించెను. మరి ఆ మనిషి కోతికి వున్నట్టు చేతులను ఆయన అతడికి ఇచ్చి వుండొచ్చును. ఎలుగుబంటికి కాళ్ళు ఇచ్చినట్టు అతడికి ఆయన కాళ్ళు ఇచ్చివుండొచ్చును. ఆయనేమి చేసినా, కేవలం అన్ని కలిపి ఒక మనిషిని ఆయన చేసెను. అయితే ఈ మనిషిలో ఎన్నడూనశింపుకాని అమర్త్యమగుఆత్మను ఆయన ఉంచెను, ఈ మనిషిలో వుంచెను. మరియు ఈ మనిషి ఒక క్రూరజంతువు కంటే ఎక్కువే, అతడు ఒక మనిషయ్యెను.
48. అప్పుడు ఇక్కడ ఈ మనిషిని గూర్చి హేతువాదులు, వారిలో కొందరు చేరి వాదించుచున్నారని నేను అనుకొనుచున్నాను. దేవుడు తన వెలుగును పంపే ఒక గడియ వచ్చినది దేవుడు కార్యములను చేయు ఒక గడియ ఇక్కడున్నది. ఆది వాస్తవం. మరిప్పుడు వారిలా వాదించుచున్నారు, “మంచిది ఆ మనిషి పాదాలు ఎలుగుబంటి పాదాలవలే వున్నవి, అతడి చేతులు ఒక చింపాంజీవలే లేక ఒక కోతివలెవున్నవి, లేదాజ రకంగా వున్నవి” ఈ మనిషియొక్క ఆదిమస్థానం వాటిలోనుండి వచ్చినట్టుగా వారు చెప్పే ప్రయత్నించుచున్నారు. అయితే దానిలో ఏమాత్రం పసలేదండీ.
49. అతడు నివశించే ఈ దేహము గృహము లాంటిది, అది తిరిగి భూమికి మన్నుగా వెళ్తుంది. కానీ అందులో వున్న ఆత్మ అమర్థ్యమైనది. ఆ ఆత్మ దేవునియొద్దనుండి వచ్చినది. అది దేవుని స్వరూపమైయున్నది, ఎందుకంటే దేవుడు ఒక ఆత్మయై యున్నాడు.
50. అయితే ఆ ఆత్మ ఏదేనుతోటలో తన మూలాన్ని (ఆరంభస్థానాన్ని) పోగొట్టుకొనెను. పాపము, అవిశ్వాసము వలన అతడు దేవునితో తనకున్న బంధాన్ని అనుబంధాన్ని(సహవాసాన్ని) తెంచుకొనెను. దేనియందు అవిశ్వాసం? దేవుని వాక్య విషయమందు.. ఒకసారి ఒకచిత్రము అవ్వను గూర్చి వేయబడినది, దేవుని వాక్యమను కొద్దిగా – కేవలం కొద్దిగా విస్మరించమని, అప్పుడు అదెంతో తేజోమయంగా ఉండునని, ఆమెకి వుండునని చెప్పబడినది, “హేతువు వైపు చూడుము” అని చెప్పబడినది, కానీ అది నీవల్ల కాదు, దేవుడు…
51. దేవుని వాక్యమునకు హేతువు అనేదానికి వ్యత్యాసమున్నది. దేవుని వాక్యము సత్యము, హేతువు అనేది అసత్యము. దేని విషయమై నీవు హేతువు(కారణం) ఆడుగలేవు. అది వాస్తవం. దేవుని నిత్యజ్ఞానాన్ని ఎన్నడూ కలువలేనంత చిన్నది మనమనస్సు, చూశారా. మరి, అందుచేత నీవు దానిని కారణం అడుగజాలవు, దానిని కేవలం నీవు నమ్మాలి.
52. అదిగో ఆ వెనుక మన తల్లి మన తండ్రి పడిపోయారు అనే చిత్రము గీయబడింది, అందును బట్టి దేవునితో వారికున్న సహవాసం తెగిపోయి, వారు ఏదేను తోటలో నుండి బయటకు గెంటి వేయబడే పరిస్థితి ఏర్పడినది.ఇక అప్పటినుండి దేవుడు తోటలలో సైనాక్రిందా అరుచుటకు, తప్పి(నశించి)పోయిన తన బిడ్డ కొరకు వెదకుట(వేటాడు)కు మొదలు పెట్టెను.
53. మరటు పిదప అతడిని రక్షించుటకు దేవుడికున్న ఏకైక మార్గం, ఏర్పర్చుకున్న మార్గం… స్వయంగా ఆయనే అతడిని విమోచించుటకు తనంతట తానే క్రిందికి దిగివచ్చుట అయి వుండెను, మరొకరిని, వేరొకరిని పంపించుట కాదండీ. ఒక దూతను ఆయన పంపజాలడు, ఒకవేళ అలా చేస్తే అది సరైనది కానేరదు. మనిషిని రక్షించుటకు దేవునికున్న ఏకైక మార్గం ఏదనగా స్వయంగా ఆయనే దిగివచ్చి వానిని విమోచించుట.
54. ఇక్కడెవరైనా పాపము చేస్తే దానికి, ఈ గుంపు జనులకి నేను జడ్జిగా వున్నాను. మీమీద ఒక న్యాయస్థానంయొక్క అధికార పరిధిని నేను కలిగివుందును, నేనైతే… ఎవరైనా పాపం చేస్తే, “ఇప్పుడు, నేను… బ్రదర్ గౌహం, నీవు వెలను చెల్లించాలని నేను కోరుచున్నాను”అని అన్నట్లైతే అది సరిగా వుండదు, నా సొంత కుమారున్ని దానికి వెల చెల్లించమని నేను కోరినా అది కూడా సరిగా వుండ దండీ…? మరి సరిగా వుండే ఒకే ఒక విధానం ఏదనగా ఆ స్థానాన్ని నేను భర్తీచేయుటే (తీసికొనుటే). ఏమిటది? తీర్పు తీర్చేవాడిని నేనే గనుక ఆ శిక్షనుండి వాడిని విమోచించాలంటే ఆ స్థానాన్ని నాయంతట నేను తీసికోవల్సి వుండెను. నేను చెప్పే దానిని మీరింకా వినుచున్నారా? (సమాజము ఆమేన్ చెప్పుచున్నది -సంపా).
55. ఇప్పుడు, చూడండి. మీరొక దానిని గమనించాలని కోరుచున్నాను. దేవుడు నూనవున్నీ విమోచించగలిగిన ఏకైకమార్గం స్వయంగా ఆయనే దిగివచ్చి అతడి స్థానమును తీసికోవల్సి వుంది. మోషే ద్వారా ఇవ్వబడిన విమోచనను గూర్చిన నియమమది, ఒక రక్త సంబంధియైన విమోచకుని ద్వారానే విడుదలనొందవలయును. ఒక యోగ్యుడైనవ్యక్తి, వెల చెల్లించగల సమర్థుడైన వ్యక్తి, బహిరంగంగా తనసాక్ష్యమును చెప్పగల ఒకవ్యక్తి మాత్రమే పడిపోయిన (నశించిపోయిన స్థితిలో వున్నవాడిని విమోచించ వచ్చును. మరిప్పుడు, దేవుడే దానికి పూర్తిగా అరుడు. సుమారు పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆయన ఒక బాలునిగా పశువుల తొట్టిలో పుట్టెను. శరీరేచ్చల వలన కాక పరిశుద్దాత్మ కమ్ముకొనుట ద్వారా ఆయన జన్మించి యుండెను. ఆయన దేవుడై యుండెను. దేవునిరక్తం ఆయనలో వుండెను.
56. పుట్టినబిడ్డలో ప్రవహించే రక్తం ఎల్లప్పుడు తండ్రిదే గానీ తల్లిది మాత్రం కాదండీ. మనందరికి అది తెలుసును. అది లేకుండా… గతంలో నేను అనేకసార్లు దీనిని బోధించాను. అదేదనగా తల్లి యొక్క రక్తములో బిడ్డకి ఎటువంటి సంబంధముండదు (తల్లరక్తం బిడ్డలో మచ్చుకైనను కలువదు) అది మీకు తెలుసు.
57. అవునండీ. అది అలాగుండును. కేవలం పురుషుని రక్తమే ఎల్లప్పుడు వుండేది. ఒక కోడిపెట్ట గ్రుడ్డును మాత్రమే పెట్టగలదు. కానీ అది సంయోగం(Fertile)లో కలువకపోతే అదెన్నడు జీవాన్ని బయటకి తేలేదు లేదా పొదగలేదు. గ్రుడ్డు చూపునకు ఎంత చక్కగా కనబడినప్పటికి, దానిని అది ఎంత వేడిచేసినప్పటికి అదేప్పుడు అదలా నిష్ఫలంగా ఉండాల్సిందే, మగపక్షి ఆడపక్షిని కూడనంత కాలం (కలవనంత కాలం) ఆ గ్రుడ్డు అలా వుండి కుళ్ళిపోవటం తప్ప ఇంకేం వుండదు, జీవకణము మగదానిలో నుండి రావల్సి వున్నది.
58. కావున, మరియు పురుషుని ఎరుగదు, కానీ దేవుడు, గొప్ప సర్వశక్తిగల యెహోదా అనే పురుషునితో ఆమెవున్నది, ఆయన ఆమెను కమ్ముకొనెను. మరియ గర్భములో రక్తకణమును సృజించిన సృష్టికర్త దేవుడై యుండెను. “ఆమె ఏ మానవ పురుషున్ని అసలు ఎరుగదు”. ఆ సృజనాత్మకమగు దేవునిరక్తం వచ్చి శరీరేచ్చల వలన పుట్టిన మనల్ని విమోచించుచున్నది.
59. కల్వరి సిలువలో ఇమ్మానుయేలు రక్తనాళాలనుండి ఆ రక్తం కారుచున్నది. మరియు కల్వరీ యొద్ద సిద్దపర్చబడిన ఆ రక్తమార్పిడి నేడు కూడా అదే విమోచించుశక్తి, రక్షించుశక్తి, పరిశుద్ధశక్తిని కలిగియుండినది. దానిని మీరు నమ్ముచున్నారా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది -సంపా) ఆమెన్, ఇప్పుడు, అది సత్యం, దేవునిరక్తము వలన మనం విమోచించబడితిమి. “రక్తము చేత కొనబడితిమని, రక్తముచేత విమోచించబడితిమి, దేవుని స్వరక్తము చేత విమోచించబడితిమని” బైబిల్ చెప్పుచున్నది.
60. అది దేవుని రక్తమెలా అవుతుంది? దేవునికి రక్తం లేదు కదా. అదెలా సాధ్యం? మనల్ని విమోచించటానికి ఆయన సృజించుకొన్న ఆ శరీరములోనికి వచ్చి జీవించినదేవునియొక్క సృజనాత్మక రక్తమది. గనుక ఆయన చేయలేక.. శోధనను దేవుడు సహించవల్సి వచ్చెను. ఆయన శోధనను సహించలేకపోయెను. లైంగికపరమైన శోధనను ఆయన సహించవల్సి వచ్చెను. ఐశ్వర్యం, అధికారం పెత్తనం(ఏలుబడి) అనేవి అపవాది చేత, ఇలా అన్నిరకములగు శోధనలను అనుభవించవల్సి వచ్చెను. ఆయన వాటన్నిటిని ఎదుర్కొవల్చి వచ్చెను. ఇవన్ని అనుభవించాలంటే ఆత్మలో వున్న దేవునిగా అది కుదరదు, కనుకనే ఆయన శరీరములో వున్న దేవునిగా ఉండవల్సి వుండెను.
61. ఇప్పుడు ఈ ఉదయకాలం క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి నేను మాట్లాడగోరుచున్నాను, అందువలన నేడు మనం ఎవరిని ఆరాధిస్తున్నామోననే సంగతిని మీరు తెలిసికొందురు. పశు వుల తొట్టిలో పరుండిన చంటిబిడ్డను కాదు, శాంతాక్లాస్ ని కాదు గానీ తన కుమారునియొక్క దైవత్వములో వున్న సర్వశక్తి గల దేవునిని మనం ఆరాధించుచుంటిమి.
62. గమనించండి. రక్తము దిగివచ్చి మరియు… అది క్రీస్తు యేసు. స్వయంగా దేవుడే ఆత్మలో నుండి వచ్చి క్రీస్తుయేసులోనికి వెళ్ళాను. మరి బైబిల్ సెలవిచ్చుచున్నది. ” దేవుడు క్రీస్తునందుండి లోకముతో సమాధానపర్చుకొనెను. అది నిజమేనా? (“అది నిజం” అని సమాజం పలుకుచున్నది -సంపా) స్వయంగా దేవుడే, యెహోదా క్రీస్తునందునివశించి మనకి రక్తసంబంధి ఆయెను, ఎందుకనగా ఆయన మనవలే మానవ శరీరములో జన్మించెను. అది నిజమేనా? (ఆమెన్) దేవుని ద్వారా రక్తకణాలు వృద్ధిచెందగా, మరియ గర్భములో మాంస కణాలు వృద్ధి చెందినవి. ఆ విధముగా బిడ్డ తీసికొని రాబడెను. దేవుడు దిగివచ్చి మాంస దేహమందు నివశించి, మనవలే అన్ని విధములుగా శోధించబడెను. దానిని మీరు నమ్ముదురా? (ఆమెన్) మంచిది.
63. ఇప్పుడు, అప్పుడు ఆయన దానిని చేసెను, ఆయన ఉచితముగా రక్తమును ఇచ్చెను. దానిని ఆయన చెయ్యవల్సిన పన్లేదు. అయినను ఆయన ఆ బలిని అర్పించెను. ఆయన అలానే మహిమ లోకి వెళ్చివుండొచ్చును. రూపాంతర కొండ మీద ఆయన ఎలాగైతే రూపాంతరం చెందినో (మారిన్) అదే రీతిన ఆయన ఎన్నడూ మనకోసం చనిపోకుండా పరలోకమునకు వెళ్ళివుండొచ్చును. అయితే మన కొరకు చనిపోవుటకు ఇష్టపడే కల్వరియొద్ద ఉచితంగా ఆయన తనరక్తమును ఇచ్చాను. అది నిజం. మరి ఆయన బయటకి తీసి… ఆయన దు:ఖాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు మరియు బహిరంగంగా ఆయన సాక్ష్యం ఇచ్చెను.
64. రూతు గ్రంథములో, చాలా చక్కని దృశ్యకావ్యమది, ఆ బోయజు క్రీస్తుకి మాదిరి, ఆ రూతు స్వదేశమును విడిచి, వెనుకకు జారిపోయినదై, తెలియని ఒక అన్యదేశమునకు వెళ్ళెను…నా భావం నయోమీ, ఆమె వెళ్ళి రూతును తీసికొనివచ్చెను. రూతు తిరిగి వచ్చినప్పుడు, ఆమె ఒక… ఆమె మోయాబు దేశస్థురాలు. ఆమె ఒక మోయాబీయురాలు, ఆమె అన్యవధువు సంఘమునకు ఖచ్చితంగా మాదిరి.
65. నయోమికి వీడ్కోలు పలుకుటకు ఆమె వెళ్ళినప్పుడు, నయోమి ఆమెతో చెప్పెను, ఆమెను ముద్దు పెట్టుకొని ఆమె స్వజనుల యొద్దకి తిరిగిపొమ్మని రూములో చెప్పెను. అందుకామె, “నీ ప్రజల యొదకి నీలోకూడ నేను వచ్చెదను, నీ జనులే నా జనులు, నీవు నివాసమున్న చోటే నేను నివాసముందును, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఎవరు ఏది విడదీయలేదు. నీవు మరణంచుచోటే నేను మరణించెదను, నీవు పాతిపెట్టబడే చోటునే నేనును పాతి పెట్టబడెదను”.
66. ఇప్పుడు, అన్య సంఘం క్రీస్తునొద్దకు వచ్చే ఒక చక్కని మాదిరి ఇక్కడ వున్నది. ఎందుకంటే ఒకప్పుడు మనం దేవునికి దూరస్థులం(పరజనులం), కేవలం యూదులు మాత్రమే రక్షణ నొందువారు. కానీ మనం క్రీస్తులో మృతిపొందుట ద్వారా అబ్రహాము సంతానమైతిమి, వాగ్దానమును బట్టి వారసులమైతిమి, క్రీస్తు ఒక అన్యవధువును పొందుకొనెను. అది ఖచ్చితంగా వాస్తవం.
67. ఇప్పుడు విమోచనము ప్రకారం, బోయజు వచ్చి నయోమి కోల్పోయిన ఆస్థి(భూమి)ని విమో చించవలెను, అది వెనక్కి జారిపోయిన ఇశ్రాయేలీయుల భూ భాగమందు వుండెను. అప్పుడు మోయాబు-మోయాబులో నుండి బయటికి రావల్సివుంది, దానిని అతడు చేసినప్పుడు… బోయాజు బయటికి వచ్చినప్పుడు, ఆస్థిని కోల్పోయిన ఆ స్త్రీయొక్క స్వాస్థ్యమును విమోచించుటకు అతడు గవిని వద్ద పెద్దలయెదుట బహిరంగ సాక్ష్యార్ధం తన చెప్పును తీసి ఆమెపై విసరవలెను, దానిని చేయుటద్వారా అతడు మరో కార్యమును కూడా పొందుకొంటాడు. అదేమనగా అక్కడ అతడు తనవధువును పొందుకొనెను, అతడు – అతడు ఎదురుచూస్తున్న ఆ స్త్రీ ఆమెయే. వధువును పొందేక్రమములో అతడు మొదటిగా ఆ స్త్రీని విమోచింపవలెను. దానిని మీరు చూడట్లేదా?
68. క్రీస్తు కూడా సరిగ్గా దానిని చేసాడు, ఆయన యెరూషలేము గవిని(ద్వారం)వద్ద బహిరంగ సాక్షార్ధం ఆయన కొట్టబడినప్పుడు, మొత్తబడినప్పుడు, బాధింపబడినప్పుడు మరియు కల్వరి వైపు నడిపించబడినప్పుడు అదే చేసెను. కల్వ… గొల్గొనకొండ ఆ కొండ ఆయనయొక్క స్వరక్తముచే తడపబడింది (స్నానమాడింది). మొదటి నుండి పడిపోయిన వారందరి విమోచన నిమితం అదొక బహిరంగసాక్ష్యంగా. అంతే కాదు నరకయాతనలనుండి, మరియు పాపముయొక్క శాపము నుండి ఆయన తన ప్రజలను విమోచించెను.
69. ఆమె ఇప్పుడు ఏదైతే పొందుకొన్నదో దానికంటే మరెక్కువగా ఆమెకి అవసరం లేదని ఆయనకి తెలుసును. అందుకే ఆయనిలా అన్నాడు “మిమ్ములను అనాధలుగా విడువను. పరిశు ద్దాత్మ అను మరొక ఆదరణకర్తను ఆయన మీ కొరకు పంపునట్లు నేను మీ కొరకు తండ్రిని వేడుకొందును. ఆయన మీలో ఎల్లప్పుడు వుండును. కొద్దికాలం లోకము నన్ను చూడదు, కానీ నేను పరలోకమునకు వెళ్ళుచుంటిని జరుగనట్లుచేయబడిన ఈ కార్యమును పొందుదును, మరియు యుగసమాప్తి వరకు మీతోను, మీలోను వుండుటకై నేను మరలా తిరిగి వత్తును” నేను దాని గురించే మాట్లాడుచున్నాను. మీరింకా వినుచున్నారా? అలాగైతే ఆమెన్ చెప్పండి. (సమాజము ఆమెన్ చెప్పుచున్నది -సంపా) మంచిది ఆయన మరలా తన బలప్రభావంతో తిరిగి వచ్చుచున్నాడనే సంగతిని నేను చెప్పుచున్నాను.
70. కాలాలు అలా దొర్లుతున్నవి, “ఓ ఆయన ఎవరు?” మై, ఈ ఉదయం, ఆరాధింపబడే ఏదో ఒక దానిని గూర్చి, అక్కడొక పశువుల తొట్టిని గురించి వారు తలంచుచున్నారు, లేదా కొంతా… అటువంటి దానిని నేను తలంచట్లేదు.
71. పరిశుద్దాత్మ ద్వారా మన హృదయములలో వున్న మహిమ నిరీక్షణయగు క్రీస్తును గూర్చి ఈ ఉదయకాలం నేను తలంచుచున్నాను. అది నిజం.
72. ఓ, లోకముచేత తృణీకరించబడెను. దేవుడెల్లప్పుడు లోకములోనికి వచ్చుచూనే వుండెను. ఆయనవచ్చినప్పుడు లోకం ఆయనను ద్వేషిస్తుంది. “నోవాహు దినములలో జరిగినట్టు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగుదినములలో జరుగును” మిత్రులారా, మనమిప్పుడు ఆ దినములో వున్నాం.
73. మరిప్పుడు గమనించండి, “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు ఉందును” అది నిజం ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. గతములో ఎలాగైతే ఆయన యొక్క గొప్ప చిత్రం త్రిప్పబడిందో (నిర్లక్ష్యానికి గురి అయినదో – అను) అదే మరి ఇప్పుడు కూడా జరగటంను మనం చూస్తున్నాము. గొప్ప నాటకము పెట్టబడింది. మరి గొప్పకార్యాలు జరుగటంను మనం చూచుటకు మనమిప్పుడు సిద్దంగా వున్నాం.
74. ఉయ్యాల్లో నుండి సంఘము తీసికొనబడింది. అది నిజం. దూరానా అక్కడ పెంతెకోస్తులు దానిని కుదిపివేసారు, కొద్ది సంవత్సరాల క్రితం, వెనుక అక్కడ జనులు రాళ్ళువేసి, హేళనచేసి గేలిగా నవ్వారు, కానీ ఇప్పుడు ఆమె పరిపక్వమునకు ఎదిగినది. ఆది నిశ్చయంగా వాస్తవం. గడియ ఇక్కడ ఇప్పుడున్నది. హల్లెలూయ. అది నిజం. నేను ఆసక్తి కలిగియున్నది దానియందే, దేవునీసంఘము ఒక్కటిగా కూడి రావాలని చూడగోరుచున్నాను. మనం ఇప్పటి వరకు ఇక్కడ అక్కడ కొట్టబడ్డాము. కానీ దేవుడు తన దుప్పటిని మన మీద వేసి, లోనికి మనల్ని చేర్చు గడియ వచ్చినది, ఎందుకంటే శత్రువు ద్వారము(గవిని) వద్ద ఉండెను. హల్లెలూయ, అవునయ్యా, ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయనప్రజలతో దానియేలు ఇలా చెప్పాడు “అంత్యదినములలోని గొప్ప కార్యాలు, ఇవి నెరవేరటం ఆరంభమైనప్పుడు, మై, ప్రజలు గొప్పవాటిని జరిగించును. ఆ దినమందు విశ్వాసవీరులు చేయుదురు”
75. గొప్పనాటకం, కడవరివర్షంను గూర్చి దేవుడిచ్చిన చిత్రం వచ్చేసింది. ఇప్పుడు. యోవేలు ఇలా అన్నాడు “అంత్యదినములయందు నా ఆత్మను సర్వశరీరుల మీద కుమ్మరించెదను, మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీదను, దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను. మరియు ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనబరిచెదను. యెహోవాయొక్క మహాదినము మరియు భయంకరమైన దినము రాక ముందు, యెహోవానామమును బట్టి ఆయనకి ప్రార్థన చేయువారందరు రక్షించబడుదురు.”
76. అక్కడ యేసు ఇలా చెప్పెను, “నేను చేయు కార్యములను మీరు కూడా చేయుదురు, వీటి కంటే మరీ గొప్పవి చేయుదురు, ఎందుకనగా నేను నా తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను” హల్లెలూయ, హల్లెలూయ, అక్కడ ఆయన ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ వున్నది. అక్కడ ఆయన చెప్పిన మాటయే ఇక్కడ వున్నది. “మీరు నాయందును నామాట మీయందు నిలిచియున్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును”
77. కొద్ది సంవత్సరాలక్రితం, ఈ చుట్టుప్రక్కల ప్రజులు ఇలా అన్నారు “ఆ టబర్నికల్లో వున్న జనులు పరిశుద్దగుండ్రాళ్ళు. మీరంతా అది, ఇది ఏదేదో అయి వున్నారు. మీరు పిచ్చోళ్ళు”
78. కానీ, ఓ, మై, పరిశుద్దాత్మ బాప్తీస్మం కొరకు ఆ బండపై నిలబడితిమి, అది నిజం, మరిప్పుడు సర్వశక్తి గల దేవునిశక్తి సంఘములో రూపించబడి, ముందుకి తీసికొని రాబడుతుంది. హల్లెలూయ, అంతటా, సమస్తాన్ని దేవుడు కదిలించే కార్యాన్ని నేను చూడగోరుచున్నాను. సహోదరుడా, అది ఇది వరకే క్రియారూపం దాల్చినది. అది జరుగుచున్నది. అది నిజం.
79. ఆయనను గూర్చిన దైవత్వం, ఆయన ఎవరు? అక్కడ కొందరు ఆయన్ని ఒక చంటిబాలుడిని చేసి చూపిస్తున్నారు. ఆదృశ్యముగా ఆయన వేదికమీద నిలిచి, ఓ, మై, తన చేతులను చాచి, ఇలా పలికి చెప్పెను “వెలుగు కలుగును గాక” వెంటనే వెలుగు కలిగెను. ఆది యేసుక్రీస్తుయే” ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన ద్వారా కలిగెను, కానీ లోకము ఆయనను ఎరుగకుండెను.” ఆయన.. ఆయనే దేవునియొక్కదైవత్వం. ఆ వెనుక(క్రీతంలో)ఆయనేమి చేసియుండెనో చూడుము. అక్కడ జరిగించిన అద్భుతాలను గూర్చి మాట్లాడుదుము, కేకలు గూర్చి నీవు మాట్లాడుచున్నావా? ఆయన ఆశ్చర్యకార్యములను జరిగించినప్పుడు, లేనివాటిని ఇప్పుడున్నట్టుగా వాటిని ఆయన చేసెను, ఆయన పలుకగా అవి అక్కడ కలిగెను.
80. మరి అదేశక్తి, అదే క్రీస్తు, హల్లెలూయ, మతవాదులు, దేవునిశక్తిని అంగీకరించనివారు తప్పు అని, లోకమును ఉనికిలోకి రమ్మని పలికి తెచ్చిన అదే శక్తి ఇప్పుడు పరిశుద్దాత్మనొందినవారిలో వున్నదని చెప్పాలి. అది నిజం. స్త్రీ పురుషులారా మనం ఎవరిమి అనే దానిని కనుగొనే సమయమిదే. దయ్యము నన్ను ఆ వెనుక దాచాలని, భయపెట్టాలని(మరుగుచేయాలని) ప్రయత్నించుచుండెను. కానీ నీవు ఒప్పుకోవద్దు, బెదిరిపోకు, మరుగునపడకు, మీరు దేవునికి కుమారులును కుమార్తెలునై యున్నారు. దైవత్వం పరలోకమందు లేదు, అది నీలో వున్నది. హల్లెలూయ. నేను పిచ్చోడిని అని నీవు అనుకోవచ్చు కానీ వీకో విషయం చెప్పనీవ్వు. సహోదరుడా. (బ్రదర్ టైన్ హామ్ ప్రసంగం పీఠమును మూడుసార్లు తట్టుచున్నాడు -సంపా) సర్వశక్తిగలదేవుడు, అమర్త్యజీవము నీలో నివశించు చున్నదనే విషయాన్ని నీవు గుర్తించుము.”నా జీవము (దేవుడు కలిగియున్న అదే “జో”జీవం) నీకిచ్చుచున్నాను.” దేవుని జీవం మానవునిలో వుండెను.
81. ఆయన ఆ వెనుక నిలబడియున్నాడు. సమస్తమునకు ఆయన సృష్టికర్త. ప్రాణులను ఆయన చేసెను, కప్పలు, ఓ, తేనెటీగలు, బాతులు, కోళ్ళు, జంతువులు, అన్నింటిని సృజించెను. “కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు.” ఎవరు ఆయన? క్రీస్తు దైవత్వము “ఐగుప్తుదినాలలో ఆయన తెగుళ్లను తీసికొని వచ్చాను” ఎవరు? క్రీస్తు ” సింహాళ్ళనోళ్ళను ఆయన మూసెను. అగ్ని బలమును ఆయన చల్లార్చిను. కత్తివాత నుండి వారు తప్పించుకొనిరి. సమాధిలో నుండి వేరు మతులను లేపిరి” ఎవరు? క్రీస్తు! ఓ, మై, ఏమై యుండెను ఆది? ఆయన ఎవరై యుండెను? క్రీస్తు, దైవత్వము.
82. సహోదరుడా, సహోదరీ ఆ దైవత్వము మీలో వున్నది. “కొంతకాలమైన తరువాత లోకము నన్ను ఎన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు. నేను యుగసమాప్తి వరకు మీలోను, మీతోను ఉందును.” క్రీస్తు పశువుల తొట్టిలో ఉన్నాడా? లేదు క్రీస్తు నీలో వున్నాడు. హల్లెలూయ పశువులతొట్టిలో వున్న క్రీస్తుని మనంఆరాదించట్లేదు, కానీ నీలో వున్న క్రీస్తుని, అనగా పరిశు ద్దాత్మను, నిరీక్షణజీవాన్ని, హల్లెలూయ, సృష్టికర్తను, స్వయంగా మానవునిలో నివశించే దేవున్ని మనమారాది స్తున్నాం. “మనమిక ఏమవుదుమో అదింకా ప్రత్యక్షపరచబడలేదు. గానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనున్నట్లుగానే ఆయనను చూతుము”మనం ఆయనను పోలివుంటాం, మనిషిలో దేవునిఆత్మ,
83. ఆయనకి చోటు లేదు. ఈ చుట్టున్న జనులు తాము క్రీస్తుకి చెందినవారమని, తమ సంఘము క్రీస్తుకి చెందినదని, తాము వెళ్ళుచున్నది.. అంటు అనుచున్నారు. గతరాత్రి ఏం జరిగింది? వారు తమ క్రిస్మస్ బహుమానముల పెట్టెలను విప్పి చూసారు. తండ్రిది చూద్దాం, ఏమున్నాయో అందులో అందులో… క్రిస్మస్చెట్టు క్రింద రాత్రి చాలామంది పురుషులుచేరి ఒక పెద్ద పెట్టి నిండా బీరు బాటిళ్ళు పెట్టిరి. యేసుకి చోటెక్కడిదండీ, చోటంతా బిర్లకే వుండేనాయే. సరే ఇప్పుడు అమ్మ పెట్టి విప్పి చూద్దాం. జూదపు(పేకాట) ముక్కలే అందులో వుండెను. క్రీస్తుకి చోటెక్కడిదండీ, కేవలం పేకాటముక్కలే. అదినిజం.చిన్నబిడ్డలకి ఒక చిన్నబైబిల్ ఇచ్చటకు బదులుగా, లోకసంబంధమైన పుస్తకాలు) చిన్న పుస్తకాలు అటువంటివి ఇచ్చుచుండిరి. యేసుకి చోటు లేదాయెను. సంఘమునకు వెళ్ళుటకు బదులు వారు వినోదపుటలకి, నాట్యాలకి, అంతటికి వెళ్ళుచు తమ్మును తాము క్రైస్తవులుగా పిలుచుకొనుచుండిరి.
84. బ్రదర్, దేవునియొక్క దైవత్వం. పరిశుద్దాత్మద్వారా మానవ హృదయాలలోనికి వచ్చినప్పుడు, అది సమస్తము (ప్రతిదానిలో)ను నీలో నుండి బయటకి పిలుస్తుంది. ఆది క్రీస్తు కలుగచేయని దానంతటిని బయటికి పంపివేయునని నీకు తెలుసా, అది నిజం.
85. మహిమ నిరీక్షణయగు క్రీస్తు, దేవుడు పశువులతొట్టిలో కాదండీ నీలో వున్నాడు. నీలో వున్నాడు. ఒకప్పుడు, ఆరంభములో దేవుడు, ఆయన మోషేలోకి వచ్చాను, ఇశ్రాయేలీయులలోకి వచ్చేను, పశువులతొట్టిలోనికి వచ్చాను.కానీ ఇప్పుడు వారు ఏదో పురాతన పద్దతిలోనే ఆయనను ఆరాధింతురు. ఆయన నీలోవుండెననే దానినే వారుమనస్కరించరు. ఇప్పుడు, ఈ రోజు ఆయన ఇక్కడ వుండెను, దేవునికుమారుడు కదులుచుండెను, ఆయన గొప్పసంఘం కదులుచుండెను(చలించుచుండెను).
86. నేడు సంఘము చారుతో కూడినవిందుభోజనాల(Soup suppers )ను, రకరకాల వంటలతో కూడినభోజనాల(Pie suppers)ను కలిగివుండెను, చూడండి, ఎవరుచక్కగా వస్త్రధారణ కలిగి యున్నారు, ఆడంభరంతో మందిరానికి వెళ్ళటం, గొప్పలకోసం వెళ్ళటం, ఎవరికి శ్రేష్టమైన చక్కని మందిరం, కూర్చోటానికి అతిశ్రేష్టమైన కుర్చీలు, ఎవరు చక్కని సంగీతం అందిస్తారు, అది ఇది చేస్తారు. ఎన్నెన్నోచేస్తారు కానీ అసలైన దానికి అనగా క్రీస్తుకి మాత్రం చోటనేది వుండదు. ప్రార్ధన తప్ప అన్నీ చేస్తారు. ప్రార్ధన చేయలేరు. చేయటానికి వారికి ఏవేవోవున్నాయి. ఇంకెంత మాత్రం వారు ప్రార్ధించలేరు. వారు ప్రేమించలేరు, ఒకప్పటివలె దేవున్ని సేవించలేరు. “వసతి గృహం (లాడ్జి)లో ఆయనకి చోటులేదు” స్నేహితుడా, ఇది అంత్య కాలము. వసతి గృహంలో ఆయనకి చోటులేదు. నిజానికి వసతి గృహం అనేదానికి అర్ధం ఏమిటో నాకు తెలియును, కానీ నేను దాన్ని అంత్య కాలానికి అన్వయిస్తున్నాను.
87. “ఆ దినమున బాదమువృక్షము పువ్వులు పూయును, మనిషి కోరిక విఫలమగును.(బుడ్డ బుడసరకాయ పగులును) ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు(గృహమునకు) పోవుచున్నాడు వాని నిమిత్తం ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారుగిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును”అని బైబిల్ సెలవిచుచున్నది. (ప్రసంగి 12:5.6 “అనువాదకుడు). ఓ, మై, నా మిత్రుడా.
88. కానీ ప్రవక్త ఇలా కూడా అనెను “సాయంకాలమందున వెలుగు కలుగును” అదీ నిజం. నిశ్చయముగా నీవు మహిమకు మార్గం కనుగొందువు, ఆది వాస్తవం. సాయంకాల సమయం వచ్చింది. ఇంతకాలం, ఒకప్పుడు పశువులతొట్టిన అందంగా అలంకరించుచువచ్చిన అనుభవాలలో నుండి ఇప్పుడు దైవత్వంను మరియు సర్వశక్తిగల దేవుని యొక్క బలప్రబావం మానవునిలో నివాసం చేయుచుండెననే చోటుకి అది వచ్చియున్నది.
89. ఓ, బ్రదర్, సిస్టర్, ఈఉదయకాలం యేసునామములో నేను నీతో మాట్లాడనిమ్ము. మీరింకావింటూనే వున్నారుగా? (సమాజం ఆమెన్ చెప్పుచున్నది-సంపా) ఓ, మై, ఇంకో సంగతి నన్ను చెప్పనివ్వండి.
90. స్త్రీ, పురుషులిద్దరు ఒకేలా వుండే సమయం వచ్చుచున్నది. వారు ఒకేలా వస్త్రధారణ చేస్తారు, ఎవరుమగ, ఎవరుండ అని నీవు చెప్పలేవు. అది వాస్తవం. అవన్ని జరుగుతాయని బైబిల్లో ముందే చెప్పబడింది. అది నిజం. ఆది సత్యమేనా? (సమాజం ఆమెన్ చెప్పుచున్నది-సంపా) అది సత్యమేనా? (ఆమెన్) అవును అది సత్యము. వారుఒకేలా జీవిస్తారు, ఒకేలా కనబడతారు, హావభావాలు ఒకేలా చూపుతారు. ఒకేలా మాట్లాడుతారు అలావుందురని బైబిల్ సెలవిచ్చినది. (బ్రదర్ బ్రెన్హమ్ ప్రసంగపీఠముమును మూడుసార్లు తట్టెను-సంపా). ఆయన ఇలా సెలవిచ్చెను “అంత్యదినములలో అపాయకరమైనకాలములు వచ్చును. మనుష్యులు దేవునికంటే సుఖా నుభవములనేక్కువుగా ప్రేమించే స్వార్ధప్రియులగుదురు, అతిద్వేషులు, అపవాదకులు(నిందలు మోపేవారు)” అదిక్కడ వుందా?(ఆమెన్) అది వాస్తవం.
91. ఓ, దేవునికే మహిమ! నా ఆత్మలో ఏదో దొర్లుచున్నట్టుగా నాకనిపిస్తుంది. మై, ఓ నేనిక్కడ బయట ప్రపంచాన్ని చూచిన్నప్పుడు, “నోవాహు దినములలో వున్నట్టే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినాలలో వుండుటను”చూస్తున్నాను. కొంతమంది నమ్మకస్తులను నోవాహు కలిగియుండెను. అలాగే నేడు కూడా దేవుడు కొంతమంది నమ్ముకస్తులను కలిగియున్నాడు. (మూడుసార్లు బ్రదర్ బ్రెన్ హమ్ ప్రసంగపీఠమును తట్టుచుండెను-సంపా) ఏర్పటుచేయబడిన ఈ గొప్పనాటకం ప్రదర్శింపబడే గడియ వచ్చియున్నది.
92. స్త్రీ, పురుషులారా, పరిశుద్దాత్మ మీలో నివాసమున్నట్లైతే, పందొమ్మిదివందల సంవత్సరాల క్రితం బాలునిగా పుట్టిన క్రీస్తు పశువులతొట్టిలో కాదండీ మీలోనే నివాసముంటున్నాడు.
93. మరి నేడు, ఆయన పుట్టినరోజు యొక్క స్మారకదినాన వారేం చేస్తున్నారు? వారు కొన్ని చెట్లు కొట్టకొచ్చి నరికి, పిల్లలకోసం క్రిస్మస్ చెట్టును తయారు చేస్తున్నారు? కానీ వారు అనుకొను…అది పర్వాలేదండీ, వాటికి విరోధంగా నేను చెప్పటం లేదండీ, అయితే అసలు సంగతేంటంటే, క్రీస్తు కంటే ఎక్కువగా వారు క్రిస్మస్ చెట్టుమీదనే శ్రద్ధ పెడుతున్నారు.
94. దేశమంతా క్రిస్ క్రింగిల్స్ అను వాడే దేశమంతా వినబడుతున్నాడు, ఎవడతడు? ఒక జర్మనీ వాడు, కొన్నేళ్ళక్రితం ఉండిన ఒక పరిశుద్దుడు, అందరికి మంచిచేసిన ఒక వృద్ధుడు, అయితే నేడు అది ఇంచుమించు ఒక ఆరాధనలా మారిపోయింది, అది నిజం. చిన్నపిల్లలకి అవి చెప్పటం వరకైతే సబబే, లేదా నీవేం చెయ్యాలనుకొంటున్నావో నాకు తెలిసినంతమట్టుకు అది సరేనని నాకనిపిస్తుంది. అయితే దానిలో నీవు ఒక విషయం గమనించాలి. అదేమంటే ఇలా చేస్తూ చేస్తూంటే రానురాను అదొక ఆచారముగా మారే ప్రమాదముంది. క్రీస్తుని, క్రీస్తుయొక్క ప్రాధమిక సంగతులను, క్రిస్మస్ యొక్క నిజమైన ప్రదేశ్యాన్ని ప్రక్కకు నెట్టే ప్రమాదముంది. నిజక్రిస్మస్ స్థానాన్ని క్రిస్క్రింగేల్స్ భర్తీ చేస్తాడు, అవును అది వాస్తవం “ఆ వసతి గృహంలో ఆయనకు చోటు లేకపోయెను.”
95. మనకి సమయున్నట్లైతే దానంతటిని చక్కగా చెప్పకోవచ్చును. ఇప్పటికే ఆలస్యమైందని నాకు తెలుసు. ఆలస్యమైపోతుంది.
96. కానీ మిత్రులారా చూడండి, గడియ వచ్చియున్నది. ఇప్పుడది ఇచ్చటే వున్నది. దేవుని యొక్క గొప్ప నాటకము మనగుండా ఇప్పుడు రంగం మీద కదలాడుచున్నది. పశువుల తొట్టిలో వున్న దేవునికుమారుడు ఇప్పడు హృదయంలో వున్నాడు. ఆయనే దేవునియొక్కదైవత్వం. ఆయనే దేవుడు, సృష్టికర్త ఆయనిలా అన్నాడు “సమస్తము… ఆయన లోకములో వుండెను, లోకము ఆయన ద్వారానే కలిగెను, అయితే ఆ లోకము ఆయనను ఎరుగకుండెను”.
97. మరినేడు సంఘంలో వుండిన సంగతంలో అదేనండీ, మహిమనిరీక్షణ, పరిశుద్దాత్మ బాప్తీస్మం ప్రజల హృదయాలలోనికి వచ్చియున్నది, కానీ అవేమిటో జనులు గుర్తించలేకున్నారు. అది సంఘంలో కలవటం లాంటిదని, మరలాంటి వాటివని వారనుకొనుచున్నారు.
98. కానీ అది దేవుడే, సృష్టికర్త నీలో నివశించుచూ, నీకు సమస్త అధికారం(శక్తినిచ్చుచున్నాడు. ఆయన కలిగియున్న దానంతటిలో నీవొక స్థానమందు వుంటివి, చెడు నుండి దూరమునకు, మంచిచేయుటకు, దుష్టత్వమును అసహ్యించుకొనుటకు(త్యజించుటకు), నీతియొద్దకు పరుగె త్రుటకు, శోధననుండి మళ్ళుటకు అది నీలో వుంది. సమస్త పగ(దుర్భిద్ది), ద్వేషభావం, కలహం (గొడవ), కడుపుమంట(అసూయి) అనేవి దానినుండి నిన్ను తప్పివేస్తాయి. అవన్నీ నీనుండి ఆయనను తీసివేయును. నీవాయనను స్వీకరిస్తే(చేర్చుకొంటే) ఆయన్ని హత్తుకో, ఆయన్ని ప్రేమించు, నీహృదయంలో ఆయన్ని గట్టిగా పట్టుకో, ఆయన్ని ప్రేమించు. అలాంటి ప్రేమలో సంఘమంతా కలిసివస్తే, ఆకాశములను మూయవచ్చు. రోగులను స్వస్థపర్చవచ్చు, గ్రుడ్డివారి కళ్ళ తెరువవచ్చు, హల్లెలూయ, చెవిటివారు మాట్లాడగలరు.మూగవారు మాట్లాడుదురు, చెవిటివారు విందురు, కుంటివారు నడుతురు, గ్రుడ్డివారు చూతురు. తప్పకుండా అవి జరుగగలవనీ నేను చెప్పగలను. చూశారా, ఎందుకని? నీ హృదయంలో వున్న సర్వశక్తి గల దేవుని బలప్రబావమేనని నీవు గుర్తించగలవు, ఆయన అక్కడ వున్నాడు, దైవత్వం.
99. మీరాయనను ప్రేమించుచున్నరా? (సమాజం ఆమెన్ అనుచున్నదీ-సంపా) ఆ కవి దానిని చెప్పుటలో ఆశ్చర్యమే లేదు, అద్భుతమైన కృప, మధురమైన స్వరం నా వంటి పాపిని రక్షించెను, ఒకప్పుడు నేను నశించితిని, కానిప్పుడు కనుగొనబడితిని ఒకప్పుడు గ్రుడ్డివాడిని కానిప్పుడు చూచుచున్నాను.
100. ప్రియసహోదరుడా, సహోదరీ, ఈ ఉదయకాలం మీరు పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందనటైతే, మీకు వీలైనంత త్వరగా దేవునిరాజ్యములోనికి పరుగిడి రండి. ముద్రించేసమయం అందుబాటు లోవుంది. శత్రువు వరద వలే పోటెత్తి వచ్చినా, ఆయన మనకోసం దానికి విరోధంగా ఒక ద్వజమును ఎత్తును, నాటకం పెట్టబడింది. నిశ్చయంగా సంఘము గృహమునకు వెళ్ళుచున్నదీ, మిత్రుడా వేచి వుండటమనేది ఏ మాత్రం మంచిది కాదు, ఇప్పటి వరకు వేచి చూస్తునే కాలం గడుపు కొంటూ వచ్చాను, అయితే ఇప్పుడైనా నీవు రావటం మంచిది, నేడే దానిని చేయటం మంచిది, అది వాస్తవం “నేడు అనేది నీకు అందుబాటులో వున్నప్పుడే రమ్ము” ఇప్పుడే త్వరపడుము.
101. గుర్తుంచుకోండి మిత్రులారా అది వింతగా అనించవచ్చును. లోకముఎన్నడు… క్రీస్తు యొక్కమతము(విశ్వాసం)ఎన్నడు ప్రసిద్ధి గాంచదు. అదెల్లప్పుడు మరుగున పడివుండును (ద్వేషింపబడును, అసహ్యించుకోబడును), దేవుని మార్గములు కొరగానివిగా జనులకి అగపడును ఎందుకంటే ఈ లోకాధిపతి, ఆకాశమండలపు ఆదిపతి అపవాది కనుక. సమస్త ప్రభుత్వాలు వాడి వశంలో వున్నవి. బైబిల్ చెప్పినదాని ప్రకారం ప్రతీ ప్రభుత్వం అపవాది స్వాదీనంలో వుండి నడిపించబడుచుండెను. అది నిజం. అతడే అన్ని ప్రభుత్వాలను తన వశంలో వుంచుకొనెను.
102. అంతట బైబిల్ ఇలా చెప్పినది. “పరిశుద్ధ దూతలారా, భూమ్మీదున్న పరిశుద్ధులారా, మీరందరు ఆనందించుడి, ఎందుకంటే ఈ లోకరాజ్యములన్ని మన దేవునిరాజ్యమాయెను ఆయన క్రీస్తు రాజ్యమాయెను. మరియు వారు… ఆయన ఏలుబడి చేయును.”(బ్రదర్ టైన్ హమ్ మూడుసార్లు బలిపీఠమును తట్టుచున్నాడు-సంపా)
103. అపవాది ఎత్తైన పర్వతశిఖరము మీదికి యేసుని తీసికొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని ఆయనకి చూపించి, “ఇవన్నీ నావశములో వున్నవి. వీటిని నీకిచ్చెదను” అనెను.
104. అందుకు యేసు “సాతానా నా వెనక్కి పొమ్ము” అని గద్దించెను. అది వాస్తవం. ఆయన దేనిని పట్టించుకోలేదు.
105. “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను నా సేవకులను(దూతల సైన్యం- అను) పిలుచుదును వారువచ్చి పోరాడుదురు, నా రాజ్యము పరసంబంధమైనది” అని ఆయన పలికెను.
106. మరియు ఆయన అన్నాడు “దేవుని రాజ్యము మిమధ్య(మీలో)నే” వున్నది. కావున సైన్యము (దండు) మరియు శక్తులు, పరిశుద్దదూతల ప్రోత్సాహాం (హల్లెలూయా) నీలో వున్నది, అంతయు ఆ ఉదయకాలం క్రీస్తుదైవత్వమును బట్టి, పరిశుద్దాత్మ బాప్తీస్మంను బట్టి నీలో వుండెను. ఆవునయ్యా.
107. ఈ ఉదయమును నీవు ఎవరిని? (రెండుసార్లు బ్రదర్ టైన్ హామ్ కరములు తట్టెను-సంపా) క్రీస్తు యేసు ఎవరు? నీవు ఆయనను అనుమతించేకొలదిగా ఆయన నీలో వుండును. ఆయన నీలోకి ఏదో రకంగా వచ్చి, నిన్ను నీటిలోకి తెచ్చి నిన్ను కదిలించాలని తెగప్రయత్నించేయుచున్నాడు. అయితే నీవువున్న చోట నిలబడి, ఆశ్చర్యపడుచు, చుస్తూ తదేకంగా చుస్తూ, కొద్దిగా వెనక్కి జరుగుచున్నావు. దానిని నీవు చేయవద్దు. దేవుని రొమ్ములోనికి తిన్నగా కదిలిపొమ్ము. ఇదే ఆ సమయం. హల్లెలూయ.
108. ఓ, నేనెలా ఆయన్ని ప్రేమించుదును! ఈ దినాలలో ఒక దినాన ఆయన రానైయున్నాడు నేనాయనను చూడగోరుచునాయు. మీకు లేదా ఆశ? (సమాజం ఆమెన్ అనుచున్నది -సంపా). నేనాయనను చూడగోరుచున్నాను. మనమాయనను చూస్తామని నేను నమ్ముచున్నాను. మీరు. నమ్ముదురా? (ఆమెన్) ఇప్పుడు ఆయన ఇక్కడ వున్నాడు. ఆయన శక్తి కదులుచున్నది.
109. ప్రజలు ఏడ్చునట్లు, కేకలువేయునట్లు, అలా చేయునట్లు ఏం చేస్తుంది? సంగతేంటి? పరిశుద్ధాత్మ వారిలో వుండి కదులుచుండెను? వారు దానిని గుర్తిస్తే, ఆయనను హత్తుకోనిమ్ము, పరిశుద్దాత్మను ఆయనను నమ్మము, కౌగిటిలోకి ఆయనను చేర్చుకొనుము. సత్యముగా బ్రతుకుము. ఆయనను ఆటంకపర్చే దేనిని చేయకుము. “ఓ ప్రభువైన యేసు నీవు నాకు కావాలి. నీవు నా ప్రక్కన నిలబడాలని నేను కోరుచున్నాను, తండ్రీ, నీ పక్షాన నేను నిలబడగోరుచున్నాను” అని చెప్పుము. నీవు దానిని చేస్తున్నట్లైతే, ఆయన శరీరంలోకి వచ్చుటకు బలవంతం చేస్తున్నాడు. ఆయన నీలో వుండగోరుచున్నాడు. అన్ని వేళలయందు, ఆయన నిన్ను తనలోకి లాగుకొనుచున్నాడు.
110. ఇప్పుడు, మిత్రులారా, అది సత్యముగా ఉండెనని నేనెరుగుదును. నీవెవరో అనే సంగతిని జనులు గుర్తించలేదని నేనెరుగుదును. ఇక్కడున్న ప్రతివ్యక్తి పాపమునకు పైగా జీవించగలడు. పాపము లేకుండా జీవించగలడు, దేవునిలో జీవించగలడు. నీవు పొరపాట్లు (తప్పిదములు)చేస్తావు కానీ క్రీస్తు రక్తము నిన్ను క్షమించును. “తండ్రీ, వారిని క్షమించుము, వారేమి చేస్తున్నారో వారెరుగరు”. అది నిజమేనా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది-సంపా) కల్వరి సిలువలో వ్రేలాడిన క్రీస్తు యొక్క శక్తి పునరుత్థాన దినమందు లేపిన అదే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన నీలో వున్నాడు, (మూడుసార్లు బ్రదర్బ్రెన్ హామ్ ప్రసంగపీఠం తట్టెను-సంపా) ఓ. మీరాయినను ప్రేమించరా? ఓ, మై, నేడు ఆయన పిలిచే స్వరాన్ని వినుము.
111. ఆయన్నినీగుండెలో హత్తుకొనుము, నీ రొమ్మునకు అతిసమీపముగా ఆయనను తీసికొనుము ఇలా చెప్పును, “ఇప్పుడు, ప్రభవైన యేసు, ఈ క్రిస్మస్ నాడు నీవెవరివో అనే దానిని గుర్తించితిని కావున నిన్ను గూర్చిన ఆలోచనధోరణిలో నాకు కొంతమార్పు కలిగినది. ఒకప్పుడు నిన్ను ఒక పశువులతొట్టిలో పరుండిన చంటిబాలునిగా ఆరాధించితిని. పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిన్నొక చంటిబాలునిగా నేను చూచి ఇలా అనుకొన్నాను,”ఓ నేను యెరూషలేము వెళ్ళ గల్గినటైతే బాగుండును.”
112. నేడు, వారు వెళ్ళుచున్నారు, ప్రతిఒక్కటి ఆ పువులతొట్టియొద్దకు వెళ్ళుచుండెను, ఆయన జన్మించిన చోటుకి అనగా ఆ పశువులతోటి యొద్దకి వెళుచుండిరి. కానీ మిత్రులారా, అక్కడ ఆయన జన్మించిన చోటు దగ్గర ఏమిలేదు, ఇదిగో ఇక్కడే ఆయన పుట్టిన ఇక్కడే అంతా వుంది. మనలో ప్రతిఒక్కరి దగ్గరకి దేవుడు ఆయనను తీసికొని వచ్చాను, ఆయన సజీవునిగా మనలో ప్రతిఒక్కరిలో జీవించుచుండెను. ఓ, సృష్టికర్త, లోకంలో వున్నదంతటిని సృజించినవాడు, ఆకాశములను సృజించినవాడు, భూమిని కలుగజేసినవాడు, నరుని కలుగజేసినవాడు, నేడు పరిశుద్దాత్మ బాప్తిస్మము నొందిన ప్రతిఒక్కరిలో ఇప్పుడు వున్నాడు. (మూడుసార్లు బ్రదర్ బ్రౌన్ హామ్ ప్రసంగపీఠమును తట్టుచున్నాడు -సంపా) అదీ సంగతీ, అది రహస్యం, పరిశుద్దాత్మను పొందుడి. ఆయన నీలోవున్నాడు, ఆయనే మహిమనిరీక్షిణ.
113. మరి ఇక్కడ చూడండీ, పాతనిబంధనలో ఒప్పందం అనేదానిని చూడండి, చాలాసార్లు నేను దీని గూర్చి చెప్పాను. ఒక ఒప్పందం(ఒడంబడిక) చేయబడినప్పుడు ఆది రెండు ముక్కలుగా ఆ మృతకళేబరము(జంతుదేహం)ను రెండుభాగాలుగా విడగొట్టబడును. ఆ రెండుఒప్పందాలు ఒక దగ్గరికి రావాలి, ఆ ఒడంబడిక కపోతబంధముగా ఒకదానికొకటి అవ్వాలి.
114. మరి నేడు, దేవుడొక ఒడింబడికను చేసియున్నాడు. నీవు మంచోడివని కాదండీ, సంఘములో నీవు చేరినందున కాదండీ, సమాజంలో ఒక మంచిహోదా వున్నందున కాదండీ, నీవొక శుద్ధ జీవితం జీవించినందున, నీవెంతోమంచోడివై వుండొచ్చును, అనుదినము నీవు చర్చీకి వెళ్ళవచ్చును, అనుదినం నీవు అర్పణలు అర్పించవచ్చును, నీకున్న ధనంలో కొంతభాగం ఇవ్వవచ్చును. లోకపాపములన్ని నీవు త్యజించవచ్చును, అన్నీ చేయవచ్చును, నీవు వుండగల్గినంత నమ్మకంగా, యదార్థంగాను నీవు వుండొచ్చును. అయినప్పటికి తూర్పుకి పడమర వున్నంత దూరాన నీవు పరలోకాన్ని చేరుటను తప్పిపోవచ్చును, అది నిజం. మంచితనమును బట్టి మనం రక్షించబడలేదు,
కానీ దేవుడు తనకి కుమారులుగా కుమార్తెలుగా చేయుటకే ఆయన తన కృపాకనికరమును బట్టి మనల్ని కొనెను. దేవునిఆత్మయే వారిని ఆలా చేయును. ఒకవేళ దేవుడు అలా కాకపోతే, ఆయన పరిశుద్దాత్మను కూడా పంపి యుండేవాడు కాడు సుమా.
115. ఏ విధముగా పరిశుద్దాత్మ సంపూర్ణముగా., లేదా ఒడంబడిక అనేది ఏ విధంగా సంపూర్ణమవ గలదు? యేసు అన్నాడు “నేను వెళ్ళుచున్నాను, అయినను తిరిగివత్తును, మీతోను మీలోను వుండును. పరిశుద్దాత్మను మీకివ్వమని తండ్రిని వేడుకొందును. ఆయన మీకు ఇచ్చును, ఆయన వచ్చి మీతో సదాకాలం వుండును”
116. సంఘపుస్తకాలలో తమ పేర్లును ప్రజలు నమోదు చేసికొంటున్నారు. క్రిస్మస్ పండుగ రోజున క్రొత్తపేజీ తిప్పుటకు ప్రయత్నించెదరు, సంఘములోకి నడిచివచ్చి, అక్కడున్న పశువుల తొట్టికి (కప్పము) చెల్లించప్రయత్నిస్తున్నారు. పరిశుద్ధాత్మ అంతటా సంచరిస్తూ, కనుగొనుటకు ప్రయత్ని స్తున్నప్పుడు…లోకములో కొందరిని గ్రుడ్డివారిగా చేయగా వారు అక్కడికి నడిచి వచ్చి “మంచిది, వారొక పరిశుద్ద గుండ్రాళ్ళు”అందురు. సరిగ్గా నోవాకు దినములలో వున్నట్టే ఇప్పుడును వుండెను.
117. దేవునికుమారుని ఆగమనం చాలా సమీపంగా వచ్చుచున్నది. అది నిజం. పరిశుద్దాత్మ ద్వారా ఎవరైతే ఆవేశభరితులగుదురో (శక్తిని నింపుకొందురో, ఎవరైతే తనలో అక్షయజీవాన్ని, పరిశుద్దాత్మను తమలో కలిగి జీవించుచుందురో, అట్టివారే ఎంతో నిశ్చయంగా ఇక్కడి నుండి తీసికొని పోబడుదురు (లాగబడుదురు, ఆకర్షించబడుదురు).
118. నోవాహుదీనాలలో నీటిపై తేలాడిన ఆ చిన్న పురాతన ఓడను గూర్చి మరో సంగతి వున్నది, పై నుండి వచ్చిన ఆకర్షించు (లా) శక్తిని అది కలిగి వున్నది. దాని అసలు పైభాగాన(శిఖరము)న ఒక దీపం(కాంతి,వెలుగు) వుండెను. ఆది పరలోకము నుండి దిగివచ్చి ఆ పైగదిమీద నిలిచిన దేవుని మహిమై యుండెను.
119. మరి మిత్రులారా, నేడు నేను చెప్పే మాటను వినుడి. అదేమనగా ఆకర్షించే ఒక శక్తి వున్నది. అది సంఘంలో నుండి వచ్చేది కాదండీ, పాస్టర్ నుండి వచ్చేది కాదండీ, కానీ అది మహిమలోనుండి, సరైన విధానములో దిగివచ్చుచున్న పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మంనుండి వచ్చి సంఘాన్ని ఆకర్షిస్తుంది ఏమిటది? అది దేవుని శక్తి, ఆయన కలిగియున్న అదే జీవాన్ని(జోలైఫ్)పొందే ఏకైక ప్రవేశమది.
120. “నేను చేయు ఈ క్రియలను మీరు కూడా చేసెదరు. అంతేకాదు వీటికంటే ఎక్కువైనవే చేయుదురు.” ఆయన శ్రమ(హింస)పడి, నవ్వులపాలై, హేళనలు పొంది, చనిపోయి, సమాది చేయ బడెను. కానీ ఆయన సత్యమై యున్నాడు, ఆయన తన యందు దేవునిఆత్మను కలిగి యున్నాడు, దేవుడాయనను మరణములో నుండి లేపి యున్నాడు. మనము అదే త్రోవలో వెళ్లే సరిగ్గా అదేరీతిన బయటకి వస్తాము. ఓ హల్లెలూయ, నేనాయనను ప్రేమించుచున్నాను.
121. మీరింకా నా మాటలువింటున్నారా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది -సంపా) మీరాయనను ప్రేమించుచున్నారా? (ఆమెన్) మీ పూర్ణహృదయముతో ఆయనను మీరు ప్రేమించుచున్నారా? ఆమెన్, ఆయన అద్భుతమైనవాడు కాదంటారా? (ఆమెన్) ఓ, మై! కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, దేవుని వాక్యములో నమోదు చేయబడిన కార్యాలు ఆయన అద్భుత కరుడు, అద్భుత కరుడు కాదంటారా! మన శిరములు వంచుదాము.
122. పరలోకపు తండ్రీ, ఓ యేసూ, గొప్ప గడియ కొరకు నేను ఎదురుచూస్తున్నాను, అదీ వచ్చుటను నేను చూస్తున్నాను. ఇంకెక్కడ ఏ రకమైన నీరీక్షణలుండుటను నేను చూచుటలేదు.కాలము అయిపోవు చుండుటను నేను చూస్తున్నాను. కమ్యునిజం అనే ఆ గొప్ప ఎర్రని దీపకాంతులు ప్రపంచమంతా అలుముకొనుటను నేను చూస్తున్నాను. మీ యొక్క సంఘమునకు వ్యతిరేకంగా నామకార్థ సంఘాలు నిలబడుటను నేను చూస్తున్నాను, వారు నీవారిని ఖండించుచూ ఇలా అను చున్నారు “దైవీక స్వస్థత తప్పు, అదంతా పెద్ద మూఢత్వం(మూడ భక్తి)” దీనంతటిని ఆపివేయుటకు వైట్హౌజ్లో ఒక బిల్లును కూడా ప్రవేశ పెట్టజూస్తున్నాయి.
123. ఓ, కానీ, దేవా, ఒకనాడు అక్కడ వుండి ఆ పరిశుద్దప్రజలను చూస్తు వారంతా దేవుని శక్తి ద్వారా ప్రకాశిస్తూ, వారి ముఖలమీదున్న దానిని చూస్తూ దేవునిమహిమను చూస్తువుందును మండుచున్న అగ్నిగుండంములోనికిపోయిన హెబ్రీ పిల్లవలె వారుండిరి (అనేకసార్లు బ్రదర్ టైన్హామ్ ప్రసంగపీఠమును తట్టుచుండెను సంపా) “మేమెన్నడు తలవంచము. లేదు. మమ్మును విడిపించు టకు మాదేవుడు సమర్థుడు ప్రభువైన యేసు నీవు త్వరగా వచ్చెదవు”.
124. “జనులు పైకి భక్తిగల వారివలే కనబడుదురు కానీ దాని దేవుని శక్తిని ఆశ్రయించకుండా వుందురు. దానిని తృణీరించెదరు), ఇట్టి వారికి విముఖుడవై(వారినుండి తొలగిపోయి)యుండు ము”అనే ఒక గడియవచ్చుటను నేను చూస్తున్నాను. చివరిదినాలలో ఆత్మ మాట్లాడుచుండునని నీవు చెప్పితివి. సరిగ్గా మేమిప్పుడు ఆ దినమందేయుండి యుంటిమి.
125. నిన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్న, నా చిన్నిసంఘము, స్త్రీపురుషులు ఇప్పుడు ఇ క్కడ కూర్చొని యున్నారు. ఎన్నో దినాలక్రితమే తమ హృదయాలలో పరిశుద్దాత్మను పొందుకొనిన వారు ఇంకా లోతులోనికి వెళ్ళునట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. వారు ప్రతివిధమగు పగ(అసూయ)ను, ప్రతి విధమగు ఘర్షణ(కలహము)లను, నీకిష్టంలేని ప్రతిదానిని నేడు విడిచి వాటిలోనుండి బయటకి కదిలిపోవుదురు గాక. పశులతొట్టి యొద్దకు కాక కల్వరితట్టుకి వారు కదులుదురు గాక. పూర్తిగా కల్వరిలను చోటు వైపుకి కాక అక్కడున్న క్రీస్తుకి అనగా మహిమ నిరీక్షణయగు దేవుని దైవత్వమగు, దేవునియొక్క శోభయగు, మన హృదయాలలో ఇప్పుడున్న దేవునిశక్తియగు, లోక సంబంధమగు విషయాలలో నుండి మనల్ని బయటకిలాగుచూ ఒక దినాన మనల్ని ఈ భూమిమీద నుండి బయటకి తీసి ఒకే శ్రేష్టమగు దేశానికి మనల్ని తీసికెళ్ళివాడగు క్రీస్తు వైపుకి మమ్మును కదిలించుము. దేవా దానిని నేడు అనుగ్రహించుము. నీ సేవకుని ప్రార్థనాలకింపుము. నీ ప్రజలతో మాట్లాడుము.
126. ఇక్కడ ఎవరైనా నశించినవారు ఉన్నట్లైతే ఎవరైనా పరిశుద్దాత్మ లేకున్నట్లైతే, అట్టివారు ఈ ఉదయకాలం నిన్ను స్వీకరించుదురు గాక. ప్రియదేవా దానిని అనుగ్రహించండి, ఎందుకంటే దానంతటిని మేము నీ ప్రియకుమారుడగు యేసు నామమున అడుగుచున్నాము, పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆయన ఒక పశువులతొట్టిలో జన్మించియుండెను, మా పాపముల కొరకు ముప్పైమూడు సంవత్సరముల తర్వాత కల్వరియొద్ద ఆయన చనిపోయెను. కొన్ని దీనాల తర్వాత, నలబైదినాల తర్వాత ఆయన ఆరోహణమయ్యెను. ఆయన పరమునకు చేరెను, అటు తర్వాత పది దీనములకి పరిశుద్దాత్మ శక్తిలో దిగి వచ్చెను. ఇప్పుడు సంఘములో జీవించుచుండెను. ఆయనను మృతులలో నుండి లేపిన అదే పరిశుద్దాత్మశక్తిలో సంఘమునకు బయటకి ఈ భూమిమీద నుండి అతిశీఘ్రముగా తీసికొనబోవుచున్నాడాయన. ఓ దేవా నీవు వచ్చి సంఘమును రక్షింపుము, ఎందుకంటే ఆయన నామములో మేము ప్రార్థించుచున్నాము.
127. మనమావీధముగానే శిరములు వంచి యుండగా “నేడే పిలుచుచున్నాడు” అను పాటను పాడుదాం. ఇక్కడ ఎవరైనీ క్రీస్తులేకుండా, దేవుడులేకుండా, నిరీక్షిణలేకుండా వున్నారా? అట్టివారు దయచేసి ముందుకి రాగలరా?
నేడే పిలుచుచున్నాడు నేడే పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు వాంఛ(మృదుపు)తో నేడు ఆయన పిలుచుచున్నాడు నేడే పిలుచుచున్నాడు.
128. నీవు దేవుడులేకుండా, నిరీక్షణలేకుండా, క్రీస్తు లేకుండా వున్నావా? పూర్తి దేవునివాక్యాను సారమగు జీవితాన్ని మీరింకా పొందుకోలేదని క్రైస్తవులారా మీరు గుర్తించారా? మీరు ముందుకు రాలేరా?
…దూరంగా అవతలికి పిలుచుచున్నాడు, నేడే ఆయన పిలుచుచున్నాడు నేడే పిలుచుచున్నాడు యేసు నేడే పిలుచుచున్నాడు వాంఛ(మృదువుగా)తో నేడు ఆయన పిలుచుచున్నాడు.
129. వినండి, తండ్రి ఇక్కడ వున్నాడు మరియు ఆయన- ఆయన నిన్ను రక్షింపగోరుచున్నాడు. నీవు ఒకవేళ ఇంకా రక్షింపబడకపోతే, మీరు రక్షింపబడలేదని నాకు తెలుసు. కానీ మిత్రులారా వినండి, మీరు ఇంకా ఆ విధంగా నిలబడి యుండగానే నేనొక దానిని మీ కొరకు చేయగోరుచున్నాను మీరంతా అలానే కండ్లు మూసుకోవాలని నేను కోరుచున్నాను. ఇక్కడ నేను. తెరదించగోరుచున్నాను తద్వారా మిమ్మును మరోదానిని చూచునట్లు చేయగోరుదును. ఆమె ఆ పాటకి సంగీతం అందించు చుండగా ఈ ఉదయం మనం ఒక చిన్నయాగ్రా దర్శనం చేయబోవుచున్నాము. ఈ టబర్నికల్లో కూర్చొనియున్న యవ్వనులకోసం. వృద్ధులకోసం మరియు అందరికోసం నేను తెరను దించ బోవుచున్నాను.
130. ఈ ఉదయకాలాన కొద్దిసేపు పాతాళపు ద్వారములలోకి నేను చూడబోవుచున్నాను. రాబోవు చున్నది క్రిస్మస్ కాలమన దిగువున వున్నవారికి తెలుసు. క్రిస్మస్ కాలమందు వారేమి చేసారో వారెరు. గుదురు. వారిలో కొందరు మద్యంతో మత్తులైరి, కొందరు కలియతిరిగారు, కొందరు చర్చీలో వుండి, కొందరు హేళనచేసిరి. కొందరు హస్యంచేసిరి. ఈ ఉదయకాలం వీరంతా అస్థిపంజర రూపమున ప్రాకుకొంటూ ఈ మందర తలుపు దగ్గరకి వచ్చారనుకోండి, ఏం ఆగును? మరుసటి క్రిస్మస్ కి బహుశ మీరందురేమో మీకు తెలుసా? కానీ గుర్తుంచుకోండి, నీవు మానవజత్మలతో వ్యవహరించుచున్నావు, ఆత్మీయ సంగతులతో నీవు వ్యవహరించుచున్నాను. మీలో ప్రతీఒక్కరు తీర్పు దినాన లెక్క అప్పగించవల్సి వుంది (జవాబుదారులై యుందురు). నేను కేవలం యదార్థముగా ఉండగోరుచున్నాను. ఈ ఉదయమున నీవు ఇంకా క్రీస్తును చేర్చుకోకపోతే, ఆయన నీకోసం తెరువబడిన ద్వారము యొద్ద నిలబడి యున్నాడని మాత్రమే నేను చెప్పగలను…? ఆయనతో సరైన రీతిలో వ్యవహరించుము (ప్రవర్తించుము).
131. పరిశుద్దాత్మను పొందిన మీరు, మీరు జరిగించిన కార్యముల నిమిత్తం మీరు తీర్పుతీర్చబడ బోవుదురని గుర్తుంచుకోండి, పరిశుద్దాత్మ ద్వారా నీవు క్రీస్తుని చేర్చుకొని యుండొచ్చును, అయినను నీవు ఖండించబడుదువు. తన దేహమందు జరిగించిన ప్రతిదాని కోసం ప్రతీమనిషి తీర్పు తీర్చబడును. పరిశుద్దాత్మను పొందిన తర్వాత దానితో నీవు ఏం చేసావు? నీవు నీ పొరుగు వారితో మాట్లాడితివా? నీవు తప్పులను జరిగించితివా? నీకు గుర్తుంటే, నేనిప్పుడే జీవితాన్ని క్రొత్తగా ఆరంభింతును, ఇలా చెప్తాను “ప్రభువైన యేసూ, నేటి నుండి నీవు నన్ను ఎలా వుండమంటే నేను అలా ఉండెదను. నా దేహమందు దేవుని యొక్క అక్షయభాగం, దేవునిఆత్మ నివశించు చుండెనని నేను గుర్తించాను. మరి నేనింత వరకు తప్పులో వున్నట్లేతే నన్ను ఇప్పుడే క్షమించుము. నేను నేను ఇంటికి రాగోరుచున్నాను. నేను – నేను ఇంకా మెరుగవ్వ కోరుచున్నాను.
132. ఈ ఉదయకాలం ఆ విధంగానే అక్కడ ఆయన్ని బుజువుపర్చుము. వెనుకవున్న నీవు అలానే నీ చేయి పైకెత్తి, ఇలా చెప్పుము ” నేటి నుండి నూతనంగా నేను ఆరంభించగోరుచున్నాను బ్రదర్బ్రెన్హామ్” నేను కూడా నా చేతిని పైకెత్తుచున్నాను. నేను క్రొత్తగా ఆరంభింతును. ఇది వరకు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నేనాయన కొరకు చేయగోరుచున్నాను. నీవు కూడా…?
133. ఒకసారి నేను ఎన్నడు విననంత విచారకరమగు సంఘటనను వింటిని. ఒక యవ్వనస్త్రీ వుండెను. ఆమె నేటి తరపు స్త్రీ. ఆమె ఒక చక్కనిగృహములో వుంది. క్రీస్తుని గూర్చి ఆమెతో నేను మాట్లాడాను. ఆమె తండ్రి ఇలా చెప్పాడు “రెవరెండ్! ఆమె విషయమై నేను సిగ్గుపడుచున్నాను”. సభ్యసమాజము “ముర్ఖత్వం(పిచ్చి)” అనే దానికి మిమ్మును మీరు అంటించుకొనుచున్నారు. ఆమె శ్రేష్టమైన చదువరి, సమాజంతో వెళ్ళుటకు ఆమె ఒక మార్పు(కదలిక) కోసం సిద్దపడి యుండగా, మనుష్యలలో వున్న వివిధ రకాల తరగతి ప్రజలతో మమేకమై పోవుచుండగా, ఏదోరూపేనా మరణం ఆమెను కబళించెను, ఆమెకి గుండెపోటు వచ్చినది. తాను నేర్చుకొన్న తర్పీదంతా తనకి ఏ మంచి చేయలేకపోయెను, మరి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయినది.
134. ఏ దారిలో నీవు ఈ ఉదయం వెళ్ళుచున్నావు? దేనికోసం నీవు కలలుగనుచున్నావు? మీలో ప్రతి ఒక్కరు ఏ గుంపునకు చెందినవారో నాకవసం లేదు,ఈ దినాలలో నీవు ఒక దినాన నిత్యత్వము అనే దానికి వెళ్ళబోవుచున్నావు. క్రీస్తులేకుండా, పరిశుద్దాత్మలేకుండా నీలత్మ నశించిపోవును గుర్తు పెట్టుకో దానిని.
135. పరిశుద్దాత్మ ద్వారా క్రీస్తుని ఒప్పుకోకుండా నీవు దానిని కలుసుకోలేవు.ఆయన నీలో వుంటే, ఆయన నీకు దేవునిశక్తి. దానిని బట్టి నీవు జీవించుము. నీలో వున్న ఆయన నీకు దేవుడు. “మీరు దైవములని” బైబిల్ చెప్పుచున్నది. అదినిజం.వారంతా దైవములు కారా?” మరి యేసు చెప్పెను…
“నిన్ను నీవు దేవునిగా చేసికొనుచున్నావని” పరిసయ్యులు అక్కడ అన్నారు. “మీరు దైవములని మీ ధర్మశాస్త్రమందు వ్రాయబడెన”ని ఆయన చెప్పెను,
మోషేని పరోకి ఆయన దేవునిగా చేసెను.
136. జనులకు ఆయన నిన్ను దైవముగా చేసాడు. అది నిజం. ఈ ఉదయకాలం నీవు వ్రాయబడిన దేవుని పత్రికవి. మీ – మీ జీవితములు దేవునివి, పరిశుద్దాత్మను మోసికొనిపోయేవి.
137. మిత్రులారా, ఇక్కడ చూడండి, దీనిని నీ నుండి దాటిపోనీయకు.అదొక కల్పనగాధ అన్నట్టు దీనినిచేజారనీయకు.
138. తండ్రి, తగ్గింపుగలిగిన నీ పిల్లలుగా ఈ ఉదయకాలం మీ యొద్దకి వచ్చుచున్నాము. మేము ఆఖరిగడియలో బ్రతుకుచున్నామని, కాలముయొక్క ముగింపులో వున్నామని, ఏ క్షణానైన ఏదో ఒకకార్యం జరుగునని నేను గుర్తించాను. స్త్రీ, పురుషులు, బాలబాలికలు ఇక్కడ దేవుడు లేకుండా వున్నారు. తండ్రి వారి మీద దయచూపమని నేను ప్రార్థించుచున్నాను. ఎవరైతే నిన్ను చేర్చుకొన్నారో వారి హృదయాలకి నీవు సమీపముగానే వున్నావని గుర్తించునట్లు వారి మీద నీదయ చూపమని ప్రార్థించుచున్నాను. ఈ లోక సంబంధమైన క్షణభంగిరవిషయాలు, చింతలు మొదలగునవి వారు గుర్తుంచునట్లు చేయుము. ఈ ఉదయకాలం ఇక్కడున్న ప్రతిఒక్కరు, రాబోయే దీనాల కొరకు నీకు నిజంగా సమర్పించుకోవాలని, నీ రాకడ కొరకు ఎంత కాలమైన సరే మేము ఎదురుచూచునట్లు చేయమని దేవా నేను ప్రార్థించుచున్నాను. అది ఇప్పుడు ఇచ్చటే వున్నదని మేము నమ్ముచున్నాము.
139. జునులు ఇటువంటి సువర్లవకాశాన్ని చేజార్చుకొని తర్వాత రక్షించబడదాములే అని ప్రయత్ని స్తున్నారు, కానీ అది వారివల్ల కాదు, ఒకరాత్రి బలిపీఠం యొద్ద ఆ యవ్వనస్థులు రక్షించబడాలని ప్రయత్నించారు. కానీ గీత దాటి వెళ్ళిపోయారు. వారికి ఏ విమోచన లేకుండెను, వారు వెళ్ళిపోయారు. రక్షించబడలేకపోయెను.
140. తండ్రీ, ఇంకా సమయముండగానే వారు నిన్ను నేడు చేర్చుకొనునట్లు చేయమని, వారిలో ప్రతిఒక్కరిని నీవు దీవించమని తండ్రి నేను-నేను ప్రార్థించుచున్నాను. ఎందుకనగా వీటిని యేసునామమున అడుగుచున్నాము ఆమెన్.
141. లేచి నిలబడదాం. మీ పూర్ణహృదయంలో మీలో ఎందరు ఆయనను ప్రేమించుచున్నారు? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది -సంపా) ఇంకొంచం దగ్గరగా ఆయన చెంతకు చేరవా, ఇంకొంచెం ఎక్కువగా ఆయనను ప్రేమించవా? ఈ ఉదయవేళ మనం ఆయన తట్టు చేతులెత్తి “నా- నా సమస్తము” (యేసు సామీ నీకు నేను అనుపాట) పాటపాడుదాము. దానిని మీరు చేయగలరా? సిస్టర్, ఆ పాటకి అవసరమైన సంగీతమివ్వగలరా మీకై,
నా సమస్తము, నా సమస్తము (నీ అలవాట్లన్ని, నీ మార్గములన్ని)
నా సమస్తము, నా సమస్తము నా సురక్షకా నీకిత్తున్
నా సమస్తము ఇది నిజంగా అర్థవంతంగా చెబుతున్నారా?
నా సురక్షకా నీకిత్తున్ నా సమస్తము.
142. ఓ తండ్రి, దయచూపండి. ప్రభువా నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాము. ఈ దినాలలో ఒకదినాన బూర మోగబోవుచున్నది. పొలములో నేను ఎక్కడో బయట ఉండొచ్చునేమో ప్రభువా, సంఘమును గూర్చి నేను అప్పుడు ఆలోచిస్తు వుండొచ్చును. గాలులు శబ్దం(కూతలు) ఆరంభమైన ప్పుడు, లోకము అల్లకల్లోలం (కుదుపులు)అయినప్పుడు, కొందరు “సంగతి ఏమిటి”ని అందురు. ఆకాశము ఎట్టుగా మారుచుండును, తీర్పుగడియ సమీపముగా వుండెను ” ఓ బ్రదర్ గౌహం ఎక్కడ? ఎక్కడున్నాడు… ఓ వారు ఇంటికెళ్ళారు”అని నేనను కొనుచున్నాను. తండ్రి, కొద్ది సేపటి తర్వాత ఇది వరకు ఎన్నడూ వినని ఒక శబ్దంను అనగా బూర ద్వనిని మేము విందుము, దూత బూర ద్వని చేయును. ఓ దేవా, ఎవరైతే మరణపడక(గది)లో వుండిరో వారు లేచెదరు, “లోకానికి ఏమైనది? మనం మౌనంగా ఉండలేము, ఆమె కుదుపులు పాలైనది”అంటు కేకలేయు దురు. మరియు అప్పుడు మనమంతా ఏకముగా కూడా ఆకాశమండు ఆయనను ఎదుర్కొనుటకు కలిసికొనుటకు తీసికొనిపోబడుదుము(కొనిపోబడుదుము లేక ఎత్తబడెదము).
143. ఓ తండ్రి. ఆ సమయమునకు ముందే మరణము మాయొద్దకి వచ్చిన యెడల, అనగా భౌతికమరణం ఈ భూమి మీదనుండి వేరుచేసిన యెడల ధీరత్వముగల విశ్వాస వీరులై, క్రీస్తుయొక్క వాస్తవముతో అనగా పరిశుద్ధాత్మతో చుట్టబడిన వారమై ఆ మరణగదిలోకి మేము ప్రవేశించెదము గాక. ఒక దినాన మేము అక్కడికి చేరవల్సి వుంది తండ్రి. ఆ వరుస(నీతి)లోనికి నేను కూడా నడువవల్సి వుందని నేను తెలిసికొన్నాను(అవగాహనకి వచ్చాను). ఆ మరణగదిలోనికి ప్రవేశించు గడియ అదెక్కడో నా యెదుటనే వుండెను. నా పేరు పిలువబడినప్పుడు, నేను భయంచేత వంగిపోవటం నాకిష్టం లేదు. ప్రభువా నీవు వెళ్ళినట్లే నేను కూడా అక్కడికి (మరణగదిలోకి వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను. నా సొంత వస్త్రము చేత కప్పబడి వెళ్ళునట్టుగా కాక పరిశుద్దాత్మ అను క్రీస్తు వస్త్రముతో చుట్టబడి వెళ్ళునట్లు కోరుచున్నాను, పౌలు ఆ విధంగా వెళ్ళాడు. అతడు ఇలా అన్నాడు “మరణమా నీ ముళ్ళెక్కడ? పాతాళమా(సమాది-అను)నీ విజయమెక్కడ?” ఇలా అనుచూ ఇదివరకే మృతులైన వారి మద్యకి ఆ చీకటి గదిలోనికి నేను వెళ్ళగోరుదును, అటు పిదప ఆయన స్వరమువినుచూ, ప్రధానదూతశబ్దం వినుచూ, మేము మాప్రియులైన వారందరినీ తిరగి కలుసు కొనుటకు మృతులలో నుండి బయటకి పిలువబడెదము.
144. ఓ ప్రభువా, జీవితంలో మేము దానిని పోగొట్టుకొంటే, జీవితానికి అర్థమే వుండదు, మేము ఓడిపోయినట్లే, కానీ మా హృదయములు ప్రశస్థమగు దానిని మేము కనుగొన్నట్లైతే, అప్పుడు దేవుని ఉద్దేశ్యమును మేము కనుగొనట్లే.
145. ఓ, ఈ ఉదయకాలం మేమెలా ఆయనను ప్రేమింతుము. ప్రభువా ఈ ఉదయం ప్రతి క్రైస్తవుడు దర్శనమును త్వరగా చూచునట్లు చేయుము. ఇప్పటికే సమయం ఆలస్యమైపోయింది, వారు దర్శనం చూచునట్లు, నేడు జీవాన్ని పట్టుకొనునట్లు, నిరంతరం జీవించునట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. యేసునామమున దీనిని అడుగుచున్నాను ఆమెన్.
146. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారా? (సమాజము ఆమెన్ అనుచున్నది- సంపా) ప్రక్కకు తిరిగి, ఒకరితోనొకరు కరచాలనం చేస్తూ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుటకు బదులు “గాడ్ బ్లెస్ యూ, క్రీస్తు నీకు తోడుండును గాక” అని చెప్పండి. మీరు ప్రక్కకు తిరిగి క్రీస్తు నీకు తోడుండును గాక అని చెప్పండి. (బ్రదర్ బ్రెన్హామ్ ప్రక్కకు తిరిగి “క్రీస్తు నీకు తోడుండును గాక” అని ఒకరిలో చెప్పుచుండెను.}”అందరు..” ఒక్క నిముషం. నా సురక్షకా నీకిత్తును, నా సమస్తము.
147. ఇప్పుడు పండ్రెండు దాటిందని నేను అనుకొన్నాను. కాని ఇప్పుడు పదకొండు దాటింది. పండ్రెండు గంటల ఇరవై నిముషాలు అయ్యిందని నేను అనుకొన్నాను. కేవలం… (మరోగంట కూడ ఉందామని ఒక సిస్టర్ అనుచున్నది-సంపా) ఏం చెప్పుదుము? ఆమెన్.
148. ప్రతిఒక్కరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? “ప్రెయిజ్ ద లార్డ్” చెప్పండి. (సమాజము “ఆమెన్, ప్రెయిజ్ దలార్డ్” చెప్పుచున్నది-సంపా). సరే ఇప్పుడు కొద్దిగ, కేవలం కొద్దిగ, “నేను యేసుని ప్రేమిస్తున్నాను”అనేటవంటి మూడు నాలు మాటలు సాక్ష్యంకలిగివుందాం. కేవలం చెప్పండి…అంతకు మించి వద్దు. (“నేను యేసుని ప్రేమిస్తున్నాన’ని ఎవరో అనుచున్నారు.) అది నిజం. ఇంకా ఎవరైన చెప్పండి (నేను యేసుని ప్రేమిస్తున్నాన’ని అనేకులు అనుచున్నారు) నేనాయనను ప్రేమిస్తున్నాను, నేనాయనను ప్రేమిస్తున్నాను ఓ యేసు!

674 total views, 2 views today